*ఉగాది:-* కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
*శ్రీరామ నవమి:-* భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
*అక్షయ తృతీయ:-* విలువైన వాటిని కూడబెట్టుకోమని.
*వ్యాస (గురు) పౌర్ణమి :-* జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
*నాగుల చవితి;-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
*వరలక్ష్మి వ్రతం :-* నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
*రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
*వినాయక చవితి ( నవరాత్రులు ) :-* ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
*పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
*దసరా ( ఆయుధ పూజ) :-* ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
*దీపావళి :-* పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
*కార్తీక పౌర్ణమి :-* చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
*సంక్రాంతి :-* మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
*మహాశివరాత్రి :-* కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
*హోలీ :-* వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.
ఇవే కాక, ప్రతీ నెల వచ్ఛే
*👉రెండు ఏకాదశిలు*,
*👉సంకష్ట హర చతుర్థి*,
*👉మాస శివరాత్రి,*
*👉ప్రాదోశ వ్రతం,*
ఇలా చిన్న పెద్ద అన్ని పండుగలు, వ్రతాలు, మొదలగునవి.....
*👉ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమైనా, తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.*
*ఇదే నా ధర్మం గొప్పతనం*
No comments:
Post a Comment