సాధకుడు ఏఏ చక్రాల్లో ఉన్నాడో... ఆయా చక్రాలు కొన్ని సూచనలు ఇస్తాయి. తద్వారా ఆ చక్రాలు జాగృతి అయినట్లు భావించుకోవాలి.
*మూలం :- కపాల మోక్షము అనే మోక్ష సాధనా గ్రంథం*
1. మూలాధార చక్రము - మన దగ్గర లేని పదార్థాల వాసనలు రావడం, రతిక్రీడ దృశ్యాలు.
2.స్వాధిష్ఠాన చక్రము – ఇష్టపదార్ధాల రుచులు గుర్తుకి రావడం, గుప్తనిధుల దృశ్యాలు.
3.మణిపూరక చక్రము - అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం.
4.అనాహత చక్రం - ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తరచుగా కనిపించడం.
5.విశుద్ధి చక్రము - వివిధ రకాల శబ్దాలు వినబడటం.
6.ఆజ్ఞా చక్రము - ఓంకార నాదం వినబడటం.
7. గుణ చక్రం - త్రిగుణాలు హెచ్చుతగ్గులు రావడం.
8. కర్మచక్రం - వివిధ రకాల ఆయుధాలు కనబడటం త్రిశూలం, ఖడ్గం ,రామ బాణం, చక్రం ,బ్రహ్మదండం సందర్శనం.
9.కాలచక్రం- ప్రేత ఆత్మ దర్శనాలు, త్రికాల జ్ఞానం.
10. బ్రహ్మ చక్రం-దశ మహా విద్య దేవతల దర్శనం.
11.సహస్రార చక్రం - కర్పూరం సుగంధ పరిమళాలు వాసనలు రావటం.
12.హృదయ చక్రం- హనుమాన్/అనంత పద్మనాభుని దర్శనాలు
ఇష్టలింగం రావటం.
13.బ్రహ్మరంధ్రము - కపాలం దర్శనాలు
త్రి గ్రంధులు -త్రిమూర్తులు దర్శనాలు.
అలాగే మనము ఏఏ చక్రాల శుద్ధిలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన అనుభవాలు కలుగుతాయి.
1. మూలాధార చక్రము - మనకు సంబంధం లేకుండా కామ విషయాలలో ఇరుక్కోవటం, శరీరం తేలికగా గాలిలో ఎగరడం.
2.స్వాధిష్ఠాన చక్రము -వాంతులవడం, ధన సంబంధ విషయాల్లో ఇరుక్కోవటం, నీళ్ల విరోచనాలు అవ్వడం.
3.మణిపూరక చక్రము - విపరీతమైన వేడి బొడ్డు ప్రాంతంలో నొప్పి, అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం.
4.అనాహత చక్రం - విపరీతమైన ధ్యానం చేయడం, జపాలు పూజలు చేయాలని అనిపించటం.
5.విశుద్ధి చక్రము - చెవిలో సముద్ర హోరు,గాలి హోరు, నీటి సవ్వడి, నీటి అలల శబ్దాలు వినిపించడం, ఏదో చేయాలని తీవ్రమైన జ్ఞాన సంబంధ వాంఛలు కలగడం.
6.ఆజ్ఞా చక్రము - కనుబొమ్మల మధ్య కోడిగుడ్డు ఆకారంలో శ్వేత జ్యోతి దర్శనం.
7. గుణ చక్రం - పరోపకారార్ధం ఇదంశరీరం - ఇతరుల కోసం దీనుల కోసం ఏదైనా చేయాలని బలంగా అనిపించడం.
8. కర్మచక్రం - ధర్మం పాటించాలి అని అనిపించటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం.
9.కాలచక్రం- చావు మరణ, మృత్యు భయాలు భయపడటం, ప్రేతఆత్మ దర్శనాలు పొందుట.
10. బ్రహ్మ చక్రం- వివిధ రకాల తత్వం, ఆత్మ, బ్రహ్మ జ్ఞానం కోసం పరితపించడం భూమండలం వివిధ లోకాల దర్శనం.
11.సహస్రార చక్రం - మలము నుండి కర్పూర వాసన, శరీరం నుండి సుగంధ పరిమళం వాసన.
12.హృదయ చక్రం- ఏకైక ఇష్ట కోరిక ఏమిటో తెలియటం, ఏకైక కోరిక జిజ్ఞాస.
13.బ్రహ్మరంధ్రము - మహా మృత్యు దర్శన జిజ్ఞాసలు కలగడం
త్రి గ్రంధులు - ఆయా లోకాలు దర్శనం అనగా శివ విష్ణు బ్రహ్మ లోకాల దర్శనం....
🕉️🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment