1. దేవతా కార్యసిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం|
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ
ముక్తయే||
భావము: దేవతలను అనుగ్రహించి రాక్షస సంహారం చేయడం కోసం స్తంభం నుండి అవతరించిన నృసింహ స్వామికి నమస్సులు.
2. లక్ష్మ్యాలింగితవామాంగం భక్తానాం వరదాయకం |
శ్రీ నృసింహంమహావీరం నమామి ఋణ ముక్తయే||
భావము: వామభాగాన లక్ష్మీదేవిచే ఆలింగనం చేయబడి, భక్తులు కోరిన నరాలు ప్రసాదించే కల్పతరువైన ఆ లక్ష్మీనరసింహునికి నమస్సులు.
3. ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం|
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||
భావము:శత్రువైన హిరణ్య కశిపుడి సంహారానంతరం అతని పేగులనే మాలగా ధరించి, శంఖం, చక్రం మొదలగు వివిధ ఆయుధాలను ధరించిన నృసింహస్వామి, నన్ను ఈ అప్పుల నుండి కాపాడ ప్రార్థన.
4. స్మరణాత్సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం|
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే||
భావము: కేవలం తన నామ స్మరణతోనేఅన్ని పాపాలను తరిమికొట్టే నృసింహస్వామికి నమస్సులు.
5. సింహనాదేనమహతా దిగ్ధంతి భయనాశనమ్|
శ్రీ నృసింహంమహావీరం నమామి ఋణ ముక్తయే ||
భావము: శత్రు సంహారానంతరం నరసింహస్వామి వారు చేసిన వీర గర్జన భక్తులలో, అన్ని దిక్కులలో ఉన్న భయాలను తొలగించే టట్టుగా ఉన్నది. అట్టి స్వామికి నమస్సులు.
6. ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వరవిదారిణం|
శ్రీ నృసింహంమహావీరం నమామి ఋణ ముక్తయే ||
భావము:ప్రహ్లాదునిపై కరుణావర్షం కురిపించి, హిరణ్యకశిపుని సంహరించిన ఆ లక్ష్మీ వల్లభునికి ప్రణామములు.
7. క్రూరగ్రహైః పీడితానాం, భక్తానా మభయప్రదం|
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే||
భావము:దుష్టగ్రహ బాధలనుండి తక్షణ విముక్తి ప్రసాదించి, భక్తులకు అభయాన్ని ప్రసాదించే స్వామికి వందనములు.
8. వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితం|
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే||
భావము:వేదాలకు సారమైన స్వామి, అన్ని యజ్ఞ యాగాదులకు ఈశ్వరుడై యుండి బ్రహ్మరుద్రాదులచే సదా కీర్తించబడుతున్న నృసింహస్వామి, ఆర్ధిక ఇబ్బందులనుండి మమ్ములను ముక్తులుగా చేయ ప్రార్ధన.
9. య ఇదం పఠతే నిత్యం ఋణ మోచన సంజ్ఞతం|
అనృణీ జాయతే సత్యోధనం శీఘ్రమవాప్నుయాత్||
భావము: ఈ శ్లోకాన్ని ప్రతిరోజు స్మరించే వారికి అన్ని ఋణ బాధల నుండి విముక్తి లభించడమే కాక తమకు న్యాయంగా రావలసిన డబ్బు కూడా త్వరగా తిరిగి లభిస్తుంది. ఇది సత్యం!!
ఈ స్తోత్రాన్ని అన్ని అరిష్టాలు, దోషాలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు సాయం సమయంలో ఒకసారి స్మరిస్తే చక్కని ఫలితం లభిస్తుంది.
No comments:
Post a Comment