*************************
భారతీయ కుటుంబ వ్యవస్థలో, కులదైవం ఆరాధన ఎంతో విశిష్టమైనది. ఈ రోజు చాలా భారతీయ కుటుంబాలు, కులదైవాన్ని మరచి పోతున్నాయి. తదనుగుణ నష్టాలు చవి చూస్తున్నాయి. భార్యా-భర్తల మధ్య సంతానం లేకపోవడం , వారిద్దరి మధ్య మనస్పర్దలు రావడం, తద్వారా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్దలు రావడం, కుటుంబ ఆర్దిక పరిస్థితులు తలక్రిందులు కావడం....
ఇలాంటి వన్నీ కుల దేవతారాధన నిర్లక్ష్యం వలనే వస్తాయి.
కులం అనేది ఒక సామాజిక వ్యవస్థ లో ఒక భాగం.కాబట్టి కుల దేవతా ఆరాధనలు మరల మనం ప్రోత్సహించాలి. ఆయా కులాల్లో ఎప్పటి నుండి ఉందో..... అప్పటి నుండి కులదేవతలు ఉన్నారు.
ఒక కులం ఒకే రకమైన ఆచార వ్యవహారాలు పాటిస్తే, వారంతాఒక దేవతను పూజిస్తే ఆ దేవతను ‘కులదైవం’ అంటారు. ఉదా॥ విశ్వబ్రాహ్మణులు ‘విశ్వకర్మ’ను కులదేవతగా పూజిస్తారు. అలాగే చాలా కులాలకు కులదేవతలు ఉన్నారు.
అదే విధంగా ఎవరి ఇంటిని ఈ దేవుడు కాపాడుతున్నాడో వారిని ఇంటిదేవతగా భావిస్తారు. ఈ ఇంటి దేవతల సంప్రదాయం త్రేతాయుగం లేదా అంతకు మించిన కాలాల నుండి కన్పిస్తుంది.
ఈ ఇంటిదేవతలను గృహంలో చిన్న అరలో ప్రతిష్టించుకొని, గృహాల్లో ఆయా సమయాల్లో పూజించి తిరిగి పైనున్న గూడు(అర)లో పెట్టడం పూర్వ సంప్రదాయం. అందుకే ‘ఉద్వాసన’ (దేవుని పూజ తర్వాత చెప్పడం) అనే మాట వచ్చింది. ఉత్ అంటే పైన, వాసం పెట్టడం అని అర్థం. పూజాది ఉత్సవాల అనంతరం ఈ ఇంటిదేవతను ఉద్వాసంతో అటకపైకి ఎక్కిస్తారన్నమాట. మొదటి యుగాల్లో చాలామందికి గ్రామదేవతల్లాంటి దేవతలే ఇలవేల్పులుగా ఉండేవారు. అయితే చాలా మందికి పురాణదేవతలు కూడా ఇంటి దేవతలుగా ఉంటుంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు ఇంటిదేవుళ్లు ఉంటే, మరికొందరికి నరసింహస్వామి, వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు, శ్రీరంగడు ఇంటిదేవుళ్లుగా ఉన్నారు. ఈ ఇంటి దేవతలు గల గృహస్థులు తమ గృహాల్లో జరుపుకొనే ఏ కార్యక్రమంలోనైనా వీరికి ప్రాధాన్యతనిచ్చి, మొదట పూజించి ఇతర కార్యక్రమం పూర్తి చేస్తుంటారు.సీతారాములు తమ పట్టాభిషేకానికి ముందు నారాయణోపాసన చేసినట్లు శ్రీమద్రాయణం తెలియచేస్తుంది.
అలాగే శ్రీకృష్ణుడి ఆగడాలను యశోద ఫిర్యాదు చేసే సమయంలో తమ గోడలపై ఉన్న దేవతలను బాలకృష్ణుడు ఎంగిలి చేశాడని భాగవతం కూడా తెలియచేస్తుంది. కాబట్టి ఇంటి దేవతల సంప్రదాయం యుగాల నుండి ఉన్న ఉన్నది తెలుస్తుంది.తమ కోర్కెలు సిద్ధింపచేసే దేవతల్ని ఇష్టదైవం అంటారు. అందులో పౌరాణిక దేవతలు, గ్రామ దేవతలు ఎవరైనా ఉండవచ్చు. ఇష్టదైవానికి నమస్కరించి యోగం చేయాలని యాజ్ఞవల్క్యమహర్షి కూడా చెప్పడం జరిగింది. అలాగే పరబ్రహ్మ సాధకమైన యోగమార్గానికి ఆటంకం కలిగించకుండా ఇష్టదేవతలను, ఇంటిదేవతలను ప్రార్థించాలని యోగశాస్త్రాలు తెలియచేస్తున్నాయి.
*కుల దేవతారాధన వలన ప్రయోజనములు :*
గృహకలహాలు ఉండవు,ఆర్దిక సమస్యలు ఉండవు, చుట్టు ప్రక్కల ఉన్న ఉన్న సమాజంతో సమస్యలుండవు, సంతాన సమస్యలుండవు,పిల్లలు చెప్పిన మాట వినక పోవడం లాంటి సమస్యలుండవు. భార్యా భర్తల మధ్య వైమనస్యాలు ఉండవు.
మీ🙏శ్రేయోభిలాషి
No comments:
Post a Comment