శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు🙏🌼🌿
🌿🌼🙏శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి,
విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు.
వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే🙏🌼🌿
🌿🌼🙏ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు🙏🌼🌿
🌿🌼🙏గురవే సర్వలోకానాం
భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం
శ్రీ దక్షిణామూర్తయేనమ:🙏🌼🌿
🌿🌼🌼అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం🙏🌼🌿
🌿🌼🙏శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం🙏🌼🌿
🌿🌼🙏దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం🙏🌼🌿
🌿🌼🙏ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి🙏🌼🌿
🌿🌼🙏మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి🙏🌼🌿
🌿🌼🙏 ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి🙏🌼🌿
🌿🌼🙏దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది🙏🌼🌿
🌿🌼🙏అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు🙏🌼🌿
🌿🌼🙏మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది🙏🌼🌿
ఆ రూపాలు వరుసగా….
శుద్ధ దక్షిణామూర్తి,
మేధా దక్షిణామూర్తి,
విద్యా దక్షిణామూర్తి,
లక్ష్మీ దక్షిణామూర్తి,
వాగీశ్వర దక్షిణామూర్తి,
వటమూల నివాస దక్షిణామూర్తి,
సాంబ దక్షిణామూర్తి¸
హంస దక్షిణామూర్తి,
లకుట దక్షిణామూర్తి,
చిదంబర దక్షిణామూర్తి,
వీర దక్షిణామూర్తి,
వీరభద్ర దక్షిణామూర్తి¸
కీర్తి దక్షిణామూర్తి,
బ్రహ్మ దక్షిణామూర్తి¸
శక్తి దక్షిణామూర్తి,
సిద్ధ దక్షిణామూర్తి.
🌿🌼🙏దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు🙏🌼🌿
🌿🌼🙏సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవాలు మేధా దక్షిణామూర్తి స్వామివారు మరియూ శ్రీ హాయగ్రీవ స్వామివారు🙏🌼🌿
🌿🌼🙏మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.
No comments:
Post a Comment