Tuesday, May 23, 2023

పూజ గదిలో వుండవలసిన విగ్రహాలు- ఉండకూడని విగ్రహాలు

 పూజ గదిలో వుండవలసిన విగ్రహాలు- ఉండకూడని విగ్రహాలు




పూజ గదిలో చాలామంది దేవతామూర్తుల విగ్రహాలు అమర్చుతూ ఉంటారు.వీటిలో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం పూజగది ప్రత్యేకంగా ఉన్నవారు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.నరసింహ స్వామి ఫోటో ఏర్పాటు చేయాలనుకుంటే లక్ష్మీనరసింహస్వామి, యోగ నరసింహస్వామి,ప్రహ్లాదుడిని కరుణిస్తున్న నరసింహస్వామి ఫోటో లనుమాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. 

స్తంభం చీల్చుకుని వస్తున్న ఉగ్రనరసింహస్వామి ఫొటోలను ఇళ్ళలో ఉంచరాదు.కేవలం ఫ్లూటు ఊదుతున్న కృష్ణుడు ఫోటో ఇంట్లో ఉంచరాదు. ఫ్లూటు తోపాటు వెనుక గోవుతో కూడియున్న వేణుగోపాలస్వామి ఫోటో ఉంచుకోవచ్చును.కాళికామాత ప్రత్యంగిరాదేవి ఫోటోలను ఇంట్లో ఉంచరాదు.ఇటువంటి ఫోటోలు తంత్ర ఉపాసన చేసే వారుమాత్రమే పెట్టుకోవాలి.గృహ నిర్మాణం జరుగుతున్న సమయంలో దిష్టి కోసం రాక్షసుడు బొమ్మ పెట్టవచ్చు గృహప్రవేశానికి ముందు రాక్షసుడు బొమ్మ తీసివేయాలి.ఆ స్థానం లో కాళికాదేవి పాదం ఫోటో పెట్టవచ్చును.అంగుళం సైజు ఉన్న విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం మంచిది అంతకుమించి పొడవు విగ్రహాలు ఉంటే ప్రతి రోజు మహా నివేదన చేయవలసి ఉంటుంది.నటరాజస్వామి బొమ్మలను గృహంలో ఉంచరాదు ఇది నాట్యశాలలో ఉంచాలి ప్రతిరోజూ దానికి నాట్య నివేదన చేస్తారు.అభిషేకానికి ఎల్లప్పుడూ పచ్చిపాలను ఉపయోగించాలి నైవేద్యానికి కాచి చల్లార్చిన పాలు మాత్రమే వినియోగించాలి.వినాయకుడి విగ్రహం ఎల్లప్పుడూ ఎడమవైపుకు తొండం ఉండే విగ్రహాన్ని గృహంలో ఉపయోగించాలి కుడివైపు తొండం ఉండే విగ్రహాలను పాఠశాలలో ఉంచాలి.కూర్చొని ఉన్న వినాయకుడి విగ్రహాలను గృహంలో ఉపయోగించాలి. నిలబడి ఉన్న వినాయకుడి విగ్రహాలు వ్యాపార  స్థలాలలో ఉంచాలి.బహుమతులుగా వచ్చిన దేవుడి విగ్రహాలను ఫొటోలను పూజా మందిరంలో వుంచి పూజచేయరాదు.మీరు డబ్బు చెల్లించి కొన్ని విగ్రహాలు మాత్రమే పూజగదిలో ఉంచాలి.ఫొటోలు గదిలో ఎక్కువగా అయిపోయినా లేదా పాతబడినా చిరిగిపోయినా అటువంటి వాటిని తీసివేసి ఏదేనా దేవాలయంలో ఉంచాలి లేదా ప్రవహించే నీటిలో కలపాలి.ఈ విధమైన విధివిధానాలు పాటించిన యెడల పూజ గది నుండి సానుకూల ఫలితాలు వస్తాయి.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS