Monday, May 22, 2023

శ్రీశ్రీ శ్రీ శంకరాచార్య మహా స్వామి వారి జయంతి

 శ్రీశ్రీ శ్రీ శంకరాచార్య మహా స్వామి వారి జయంతి




సదాశివ సమారంభాం

శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం

వందే గురు పరంపరాం


హిందూ / భారతీయ ధర్మం మీద దాడి జరిగిన ప్రతిసారీ, ధర్మం తన వైభవాన్ని మర్చిపోయిన ప్రతిసారీ పరమాత్ముడు అనేకమంది మహాపురుషులను ప్రేరేపణ చేసి, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే అవతరించి, ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు.


సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి సరిగ్గా 2524 సంవత్సరాల క్రితం, 509 BCE లో వైశాఖ శుద్ధ పంచమి రోజున దక్షిణ భారతదేశంలోని నేటి కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామములో కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబుతిరి అనే బ్రాహ్మణ వంశంలోని ఆర్యాంబ, శివగురువు అనే పుణ్య దంపతులకు బిడ్డగా, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి, ధర్మ పునః ప్రతిష్ట చేయడానికి పరమశివుడి అంశతో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యలు అవతరించారు.


శంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే సన్యాసం స్వీకరించి "చతుర్వేదాలను, పన్నెండు సంవత్సరాల వయస్సులో ప్రస్థానత్రయాది భాష్యాలను రచించారు. వేదవేదాంతలను, తత్వశాస్త్రాన్ని (Philosophy) , Metaphysics, Theology మొదలైన ఇతర శాస్త్రాలనుకంఠస్థం చేసారు. ఆ సమయంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాలు, నాస్తిక వాదం విపరీతంగా ప్రబలాయి. ప్రజలంతా హిందూ ధర్మాన్ని వదిలి, నాస్తికం, చార్వాక మతాల వైపు నడవడం ప్రారంభించారు. దాదాపు 90% ప్రజలు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసారు. అలాంటి సమయంలో శంకరాచార్యుల వారు జనులందరికీ సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని, స్వధర్నాచరణను ప్రబోధిస్తూ అవైదిక మతాలను ఖండిస్తూ

వారిని ఓడించి, వైదిక ధర్మంలోకి వారిని తీసుకువచ్చారు. ఆ చర్చల సమయంలో వచ్చిందే అద్వైత సిద్ధాంతం. యావత్ భారతదేశం పాదచారిగా పర్యటించి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు. ధర్మ సంస్థాపన చేశారు.


శంకరాచార్యులు కనుక అవతరించి ఉండకపోతే హిందు అనేవాడు గాని, హిందూ ధర్మం కానీ మిగిలి ఉండేవికావు. ఇదంతా ఏ ఒక్క మానవ మాత్రునికీ సాధ్యం కాని పని.


ఈయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి 477 BCE లో మహనిర్యాణం చెందారు. తన 32 ఏళ్ళ జీవితకాలంలో అనేక రచనలు చేశారు. జీవుడు, దేవుడు, ఇద్దరూ ఒక్కటే, ఇద్దరికి బేధంలేదు అంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ప్రస్థాన త్రయంగా చెప్పబడే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, కర్మసిద్ధాంతాలకు బాష్యం రాశారు. అనేక స్తోత్రాలు అందించారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య మొదలైన 6 మతాలను స్థాపించారు. కలియుగంలో ప్రజల్లో శౌచం తగ్గిపోయిందని, దేవాలయాల్లో ఉన్న దేవాత విగ్రహాల శక్తిని ఇటువంటి మానవసమూహం తట్టుకోలేదని, దేవాతశక్తిని శ్రీ చక్రయంత్రాల్లోకి ప్రవేశపెట్టారు.


ఆత్మతత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, నేను జడత్వాన్ని కాను, చైతన్యాన్ని అని నిశ్చితమైన జ్ఞానం కలవాడు, అతడు చండాలుడైనా, బ్రాహ్మణుడైనా, అతనే నాకు గురువు. ఇది తధ్యము అంటూ శంకరాచార్యుల వారు ఎలుగెత్తిచాటారు. అలా వచ్చిందే మనీషా పంచకం. జ్ఞాన్మ మార్గాన్ని పునరుద్ధరించిన శంకరులు, కేవలం జ్ఞానభోధకే పరిమితం కాక, అనేకస్తోత్రాలు అందించారు.


వైదిక ధర్మాన్ని ఎప్పటికి ప్రచారం చేసేవిధంగా భారతదేశం నాలుగు దిక్కుల నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు మఠాలను


1. దక్షిణ భారతదేశం శృంగేరీలో శారదపీఠం,


2. ఉత్తరమున ఉత్తరాఖండ్‌లో జ్యోతిర్‌మఠం,


3. తూర్పున పురీలో గోవర్ధన పీఠం,


4. పశ్చిమాన ద్వారకలో ద్వారకాపీఠం స్థాపించారు.


ఎప్పుడొ 2492 సంవత్సరాల క్రితం ఈయన ఏర్పాటు చేసిన పరంపర ఈనాటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అదేకాకుండా సన్యాస ఆశ్రమాన్ని సంస్కరించి పది సంప్రదాయాలను ఏర్పరిచారు.


భారతదేశంలో అందరిని తన వాదన పటిమతో అందరిని ఓడించిం కాశ్మీర్‌లో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. వారి తర్వాత అంతటి మేధావి, సూక్ష్మదర్శి ఇంకొకరు రాలేదు, అందువల్ల సర్వజ్ఞపీఠాన్ని శంకరాచార్యుల తర్వాత ఈ 2000 సంవత్సరాలలో ఎవరు అధిరోహించలేదు. కానీ ఇప్పుడా సర్వజ్ఞపీఠం, కశ్మీర్ సరస్వతీ దేవాలాయం ముష్కరులు, దేశద్రోహుల దాడిలో శిధిలమైపోయింది. ఇక్కడొక విషయాన్ని గమనించాలి. శంకరులు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహిస్తారనగా, వారితో వాదించడానికి ఒక 8 ఏళ్ళ పిల్లవాడు వచ్చాడు. ఉద్దండులనే ఓడించాను, నీతో వాదించేదేంటీ అని శంకరాచార్యులు అనలేదు. ఆ పసిపిల్లవాడితో కూడా అమోఘమైన శాస్త్రచర్చ జరిపారు. ఇది శంకరుల యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. అంత గొప్పవారైనా, కాస్తంత అహాకారం కూడా శంకరాచార్యులవారికి లేదు. అటువంటి శంకరాచార్యులవారికి హిందువులంతా సదా ఋణపడి ఉంటారు.


ॐ శ్రీ శంకర భగవత్పాద జయన్తీ శుభాకాంక్షలు 卐

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS