శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం - కోరుకొండ, తూర్పుగోదావరి జిల్లా
#రాజమండ్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో 615 మెట్లు ఉన్నటువంటి కొండపై స్వయంభూ స్వామి వారు వెలసిన దివ్యక్షేత్రం #కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొండ పై ఉన్న దేవాలయాన్ని చేరుకోవడానికి సుమారు 615 మెట్లు ఎక్కాలి ప్రతి మెట్టు లంబకోణ ఆకృతిలో ఉండటం వల్ల, కొండ వాలు తక్కువగా ఉండటం వల్ల పైకి ఎక్కడం కొంచం కష్టతరమే ... ఈ ఆలయం ద్వాపర యుగం నాటిదని చరిత్ర మనకి చెబుతోంది. ప్రస్తుతం ఆలయ పాలన వ్యవహారాలను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పర్యవేక్షిస్తుంది. ఈ కొండకు వేదాద్రి, పారిజాతగిరి, కోనగిరి అనే పేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రం క్రీ.శ 1303 నాటిదని అప్పటి శాసనాలలో స్పష్టంగా ఉంది. ధాన్యపు రాసి వలె ఉండటం వలన ఈ కొండకు కోరుకొండ అనే పేరు వచ్చిందని చెబుతారు. పరాశర మహర్షి తపస్సు వలన ఈ శిఖరానికి పరాశరశైలం అని పరాశరగిరి అని పేర్లు కూడా ఉన్నాయి. పరాశరమహర్షి తపస్సు కు మెచ్చి ఆయన కోరిక మేరకు స్వామి లక్ష్మీదేవి సమేతంగ శ్రీ లక్ష్మీ నరసింహునిగా ఇక్కడ వెలిసారు. కొండపైన స్వామి స్వయంభూ కాగా కొండ దిగువన స్వామి వారిని పరాశర మహర్షి ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు స్వామి వారి కల్యాణ మహోత్సవములు నిర్వహిస్తారు.
కొండపైనుండి చూస్తే కోరుకొండ గ్రామం అత్యంత అందంగా ఉంటుంది. వీలైనప్పుడు మీరు కూడా ఒకసారి దర్శించండి 😊👍
No comments:
Post a Comment