Thursday, August 27, 2020

గురువులు ఎన్ని రకాలు ఉంటారు ? గురువుల వలన నీకు ఏమిటి ఉపయోగం ? ఏ గురువుని మనం ఆశ్రయించాలి?

గురువులు  ఎన్ని రకాలు ఉంటారు ? గురువుల వలన నీకు ఏమిటి ఉపయోగం ? ఏ గురువుని మనం ఆశ్రయించాలి? 

*************************
1)సూచక గురువు : బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ  నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు 
బ్రతుకు తెరువు కోసం  భోదన చేసే గురువులు ఎందరో. నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు . వీరిని సూచక గురువు అంటారు. వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు .
2 )వాచక గురువు : ధర్మా ధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రామాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు ( భ్రహ్మ చర్యము , గృహస్త్దము , వానప్రస్దానం , సన్యాసం ). వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో వసిస్తావు .
3 )బోధక గురువు : మహా మంత్రాలను ఉపదేశిస్తారు. లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని , అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని బోధిస్తారు. వీరిని బోధక గురువు అంటారు. లౌకికం నుండి అలౌకికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు .
4 ) నిషిద్ద గురువులు : మారణ ప్రయోగాలు , వశికరణాలు , వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది . చిత్తాన్ని శుద్ధి చేయరు. విత్తాన్ని హరిస్తారు. ప్రతిఫలం ఆశిస్తారు. సన్మార్గం నుండి దుర్మార్గం వైపు మళ్ళిస్తారు. (పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి )
5 ) విహిత గురువు : మన హితము గోరి సూచనలు సలహాలు ఇస్తారు , నశించి పోయే విషయ భోగాలు         
 పై ఆసక్తి తగ్గించి , సత్యమైన శాశ్వతమైన విషయాల పై అంతర్ముఖం చేస్తాడు. ( ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణ తో జీవిస్తావు )
6) కారణ గురువు : ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు .ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి, ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎఱుకలో ఉంచుతూ ఉంటారు.(నిత్య ఎఱుకతో కర్మ యోగిలా కదిలిపోతూ ఉంటావు )
7) పరమ గురువు: ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు .శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ ఈ చరా చర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’ అహం బ్రహ్మస్మి అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు ఆవాహన చేసి నీవు అనుభూతి చెందగలిగే స్దితికి తీసుకు వెళ్ళే వారు ఈ పరమ గురువులు. వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు . నీ నిజ జీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. (నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీ విడుదల కు మార్గం చూపేవారు  పరమ గురువు )

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS