ఆంజనేయుడు అంటే చాలు అందరికీ ఇష్టమైన దేవుడు. సకల భయనివారకుడు, సకలకార్యజయకారకుడు. అయన అనేక రూపాలు ధరించాడు. వాటిలో ప్రముఖమైన వాటిలో పంచముఖ హనుమాన్ ఒకటి. అయితే పంచముఖాలలో ఐదు తలలు, పదిచేతులతో కనిపిస్తాడు.
🚩ఆంజనేయుని పంచముఖాలలో #మధ్య_ముఖం నిజ ముఖం. దీన్ని పూర్వ ముఖం అని కూడా అంటారు. బలాన్ని, ధైర్యాన్ని పొందేందుకు ఈ రూపాన్ని పూజిస్తారు.
🚩ఇక ఆంజనేయుని #దక్షిణ_ముఖం నారసింహం. కీర్తిని ఐశ్వర్యాన్ని పొందేందుకు ఈ స్వరూపాన్ని ఆరాధిస్తారు.
🚩ఆంజనేయ #పశ్చిమ_ముఖం గారుత్మంతం. ఈ ముఖాన్ని కార్యసాధనకు ఈ రూపాన్ని ఆర్చిస్తారు.
🚩నాల్గోవ ముఖమైన వారాహం ఆంజనేయుని #ఉత్తర_ముఖమని చెప్తారు. భూత, ప్రేత, పిశాచాల నుంచి రక్షణ కోసం ఆరోగ్యం కోసం ఈ రూపాన్ని పూజిస్తారు.
🚩చివరదైన ఆంజనేయుని #ఊర్థ_ముఖం హయగ్రీవ ముఖం. ఈ ముఖాన్ని అర్చించడం వల్ల అజ్ఞానం తొలిగి జ్ఞానం లభించడమే కాకుండా శుత్రవులపై విజయం కూడా లభిస్తుంది.
ఇక ఆలస్యమెందుకు అన్ని రకాల కోరికలను తీర్చే శ్రీఘ దేవతా రూపం ఆంజనేయుడుని ఆరాధించండి. సకల జయాలను పొందండి.
No comments:
Post a Comment