Wednesday, August 26, 2020

*యమునికీ ఓగుడి ఉంది. వివరాలను తెలుసుకుందాం కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*యమునికీ ఓగుడి ఉంది. వివరాలను తెలుసుకుందాం*
☘☘☘☘☘☘☘☘


*మన ప్రాణాలను హరిస్తాడు అని నమ్మే  యమధర్మరాజుకి కూడా ఎంతో భక్తితో పూజలు చేసే గుడి  ఉంది అంటే నమ్మగలరా ?  అది కూడా  మన తెలుగు రాష్ట్రంలో ఉంది. అక్కడ ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు యముడు. అంటే ఆశ్చర్యం గా అనిపించినా ...ఆ ఆలయం విశేషాలు మాత్రం ఆసక్తి కరంగా వుంటాయి.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
 *కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి.  తమ జాతకాలు బాలేవని,  ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని, మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు  ఈ ఆలయం లోని యముని దర్శిస్తే   ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*అలాగే శని గ్రహ దోషాలు, జాతక దోషాలు వున్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆ భాధలు నుంచి ఉపశమనం లభిస్తుందిట. ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని  తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం.*
 🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ప్రతి  నెల భరణి  నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ . అంతేకాదు దీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే 'యమ ద్వితీయ' రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి,తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి కదా ! ఆ  రోజున ఇక్కడ  యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు . యముని  దర్శించే వారు ముందుగా  గోదావరీ  నదిలో స్నానం చేసి, యమునికి పూజలు నిర్వహిస్తారు. ఇలా పేరు తలచుకోవటానికే భయపడే యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించటం విశేషం గా చెప్పుకోవచ్చు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తికంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.* *మార్కండేయుడికి,మహా పతివ్రత  సావిత్రికే  కాదు మనకీ వరాలు ఇవ్వటానికి కొలువుతీరి ఉన్నాడు ధర్మపురిలో ఉన్న  యముడు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS