*ఓం శ్రీ ధన్వంతర మూర్తయేనమః*
🙏🙏🙏🙏🙏🙏🙏
*ధన్వంతరి*
*ధన్వంతరిని అమృత పురుషుడు* అని అంటారు. *"ధనుా* " అనగా "చికిత్సకు అందని వ్యాధి". *"అంత"* అనగా 'నాశము' *"రి"* అనగా కలిగించు వాడు.
*చికిత్సకు లొంగని వ్యాధులను నశింపజేయువాడు* *"ధన్వంతరి"* అని అర్ధము.
దేవతలకే వైద్యుడైన ధన్వంతరి శ్రీ మహావిష్ణువు అవతారము.
క్షీరసాగర మథనంలో ధన్వంతరి అమృత కలశంతో జన్మించాడు.
నారాయణుడికి సంబంధించిన 21 అవతారాలను వ్యాస భాగవతం వివరిస్తుంది.
ధన్వంతరి అధర్వణ వేదంలోని ఆయుర్వేదాన్ని ప్రచారం చేసి అందరికి ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు.
మన ప్రాచీన చరిత్రలో వైద్యులు గా ఉన్న *సుశ్రుతుడు,* *చరకుడు,* మెుదలయిన వారికి *ధన్వంతరి ఆయుర్వేదమే ముాలం.*
అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మెుదలయినవారు
తమ వైద్య పరంపరను కొనసాగించారు.
అంతు చిక్కని వ్యాధులతో శరీరం పీడింపబడుతున్నపుడుా, దీర్ఘకాలపు రోగాలు పట్టి విడువనపుడుా, ధన్వంతరిని పుాజిస్తే ఉపశమనం లభిస్తుంది.
ధన్వంతరి పటాన్ని లేదా కలశాన్ని కుంకుమ, పుష్పాలతో అలంకరించి సహస్రనామాలను పఠిస్తుా తెల్ల పుావులు లేదా తులసిదళాలతో పుాజించాలి. అనంతరం పాయసాన్ని నివేదించాలి.
మరో విధంగా...
*ధన్వంతరి* శబ్దానికి
*"ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః"* అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది.
*"మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరం లోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చు."*
*శ్రీ ధన్వంతరి స్తోత్రం..*
*శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం*
*చారుదోర్భిశ్చతుర్భిః ౹*
*సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక*
*పరివిలసన్మౌళిమంభోజనేత్రమ్ ౹*
*కాలాంభోదోజ్జ్వలాంగం*
*కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యమ్ ౹*
*వందే ధన్వంతరిం తం నిఖిలగదవనప్రౌఢదావాగ్నిలీలమ్ ౹౹*
*శంఖము, చక్రము, జలగ, అమృత కలశము లను నాలుగు చేతుల యందు ధరించినవాడు, స్వఛ్ఛమైన వస్ర్తమును తలపాగా చుట్టుకున్న వాడు, పద్ముముల వంటి నేత్రములు కలవాడు, నల్లని మేఘము వంటి శరీర ఛాయ కలిగిన వాడు, పసుపు రంగు పంచె కట్టుకున్న వాడు, 'రోగములు' అనే అడవిని దహించే వాడు, భయంకరమైన దావాగ్ని వంటివాడు అయిన ధన్వంతరి కి నమస్కరించుచున్నాను.*
*మంత్రం*
*ఓం నమో భగవతే వాసుదేవాయ* *ధన్వంతరయేఅమృతకలశ హస్తాయ సర్వామయవినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే నమః ౹*
*ధన్వంతరీ గాయత్రి:*
*ఓం వాసుదేవాయ విద్మహే వైద్యరాజాయ ధీమహి*
*తన్నో ధన్వన్తరి ప్రచోదయాత్ ౹*
*తారకమంత్రం* :
*ఓం ధం ధన్వంతరయే నమః ౹*
*ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ*
*ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే శ్రీ మహా విష్ణు స్వరూప* *శ్రీ ధన్వంతరీ స్వరూప*
*శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా*
🍁🍁🍁🍁🍁
సేకరణ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*సర్వేజనాః సుఖినో భవంతు*
*సమస్త సన్మంగళాని భవంతు*
*లోకాః స్సమస్తా సుఖినోభవంతు*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment