Wednesday, August 26, 2020

శ్రీ రమ్యoబుగ శ్రీ గిరి యాత్రకు | కురిమి సతితో కూడి నడచితిని

శ్రీ రమ్యoబుగ శ్రీ గిరి యాత్రకు | కురిమి సతితో కూడి నడచితిని

పల్లెలు పురములు పట్టణంబులు | పేటలు దాటీతి అడవులు కొండలు అన్నీ దాటిది

కంటిని శ్రీగిరి కన్నులనిండా | వింటిని మహిమలు వీనుల నిండా

ఆ మహిమలు నేనెమని చెప్పదు | ఈ మహిలోపల ఎన్నడు చూడము

దారుణి లోపల అధౌతాచల మది | మెరునికంటెను మిక్కుటమైనది

బ్రహ్మనిర్మల బహి శృoగoబులు | నిర్మలమగు మాణిక్య కూటములు

కోటలు కొమ్ములు గోపురoబులు | తెరపిలేని బాహుదేవాలయములు

పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు | వాటమైన పూదోటలు మిక్కిలి

మాటలు నేర్చిన మంచి మృగంబులు | కామదేనువులు కల్పవృక్షములు

క్షేమ కరoబగు చింతామణులు | అమృత గుండంబులు

కడు నైష్ఠికమునుకలిగిన విప్రులు | విడువక శంబుని  వేడెడి రాజులు

సంతత లింగార్చన గల శైవులు | శాంతులైన వేదాoతులు సిద్ధులు

ఘన ఘన  మ్రోగెటి ఘoటనాధములు | విజయ ఘోషయగు శంఖనాధములు 

వీర శైవులు వీరాంగoబులు | సాధు బృందములు కామిత భక్తులు అగరు  ధూపములు

జపములు చేసెటి జంగమోత్తములు  |తపములు చేసెటి తాపసోత్తములు

ప్రమధులు   భక్తులు శైవ గణంబులు | గట్టిగా ఇదీ భూకైలాసమని 

తప్పిపోక పాతాళ గంగలో | తెప్పున తెలుచు తీర్ధంబాడుచూ

చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి | అనువుగా నుదుట విభూతి దరిస్తిని  

పొదుపుగా మెడ రుద్రాక్షలు దాల్చితి

గురు కటాక్షమును గోప్యము చేసితి | గురు మంత్రoబును జపమును చేసితి

ఆకలంకుడనై ఆశ జయస్తిని

శివ పంచాక్షరీ మనసున నిలిపితి | శివ తత్వము పరిశీలన చేసితి

పంచేంద్రియంబులు పదిలము చేసితి | పంచముద్రలబ్యాసము చేసితి

అంతర్ముఖుడనైతిని | నాద బ్రహ్మనాదము వింటిని |
లోపల తుమ్మెద నాధము వింటిని

వెలుగులకెల్లా వెలుగై వెలెగెడు | ఆ లోపల దీపము కంటిని

ఇవాళ చంద్రుoడావల సూర్యుడు | కలిగిన స్థావరమైన నిదానము కంటిని

కంటికి ఇంపగు పండు వెన్నెల | విరిసిన షట్కా మలంబులు షష్ఠలంబులు

పిండాoడములో  బ్రాహ్మoడము కంటిని

అంతట అక్కడ చెoగల్వ కొలనులో | అడుచున్న రాచంసను పట్టితి

చాల వెయి స్తంబాల మేడలో  | బాలిక కూడుకు కేళి
సలిపితిని

మల్లిఖార్జునిని మదిలో దలచితి | ముందర బృంగికి
మ్రొక్కి వేడితిని

నం దికేశ్వరుని నమ్మిభజింతిని | చండీశ్వరునకు దండo పెట్టితి

మళ్ళీ మళ్ళీ మహిమను పొగడుచు | పెళ్లారయ్యకు ప్రియముగ మ్రొక్కితి

ధ్వార పాలకుల దర్శన మాయను | ద్వార మందు రతనాల గద్దెపై

చూచితి నెవ్వరు చూడని లింగం | చూచితి కేవల సుందర లింగం

నిరుపద్రవమగు నిశ్చల లింగం | ఆది తేజమగు ఐక్య లింగం

రాజితమైన విరాజిత లింగం | పూజనీయమగు పురాణలింగం

లింగము గనుకొని లింగ దేహినై  | లింగాoగులతో లింగ
నిర్గుణ సంగతి కంటిని

లింగ మందు మదిలీనము చేసితి | జీవన్ముక్తుడనైతిని

అంక మందు భ్రమరాంబిక ఉండగ | మల్లిఖార్జునిని కోరి పూజింతిని

దీపము పెట్టితి దివ్యదేహునకు  | ధూపము వేసితి ధూర్జటి కప్పుడు

తుమ్మిపూలతో పూజిస్థిని | కమ్మని నైవేద్యము పెట్టితి

సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు | జయ జయ జయ జయ  జంగా మారాయి

అధి దేవుడవు ఆత్మ శరణ్య | దయ తప్పక  ధవళ శరీర | భయము బాపు మీభక్త నిదాన

ఎన్ని జన్మములు ఎత్తిన వాడను | నిన్ను తలంపక నిచుడనైతిని

ఎన్నడూ ఏ విధమేరగని వాడను | దుష్ట మానసుడ గౌరి రమణ

తామస గుణములు తగులాటంబులు | నియమము తప్పిన నీచవర్తనుడు  | నిత్య దరిద్రుడు

అత్యాశయణుడు అజ్ఞాన  పశువును | చేయురాని ధూస్చేష్ఠలు చేసితి | బాయరాని  మీ భక్తుల బాసితి

సంసారంబను సంకెళ్లలో  హింస పెట్టమిక ఎలుము తండ్రి 

ముల్లోకంబులు ముంచెడి గంగను | సలలితముగ జడ దరియిస్తివి 

గొప్పచేసి నిను కొలిచిన భoటును | తప్పక చంద్రుని తల  
 దరియిస్తివి

విన్నుని చేతను కన్ను పూజగోని | సన్నుతి కెక్కిన చక్ర మిచ్చితివి 

ఆనక శైల కుమారిక కోరిన | సగము శరీరము యిస్తివి

ముడులోకముల ముఖ్యము నీవే  | మూడు మూర్తులకు ములము నీవే

దాతువు నీవే | బ్రాతావు నీవే | తల్లి నీవే | తండ్రి వి నీవే | బ్రహ్మము నీవే | సర్వము నీవే 

పాల ముంచుమిక నీట ముంచుమి | పాల బడితినో ఫాలలోచన

అనుచు ప్రణతుల నిడుచు ఇది చదివిన వారికీ || 


ఫలశ్రుతి ; 

కాలువలు త్రవ్వించి గన్నేర్లు వేసి | పూలు కోసి శివునకు  
పూజించిన ఫలము 

గంగి గోవులు తేచ్చి ప్రేమతో సాకి | పాలు తీసి అభిషేకము చేసిన ఫలము

ఆకలితో నున్న అన్నార్తులకును | కమ్మని భోజనo బిచ్చిన ఫలము

బితితో నున్నట్టి కడు దీనులకును  | శరణిచ్ఛి  రక్షించు  విశేష ఫలము

అంతకన్నా ఫలము అధిక మయ్యిండు


                చెప్పవయ్యా విశ్వేశ్వరా ? 
                                చెప్పవయ్యా పరమేశ్వరా ?🙏,,,,,
సేవే శ్రీగిరి మల్లిఖార్జున మహాలింగం 
           శివాలింగితమ్🙏

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS