Thursday, August 27, 2020

ప్రపత్తి అంటే ఏమిటి?

ప్రపత్తి అంటే ఏమిటి?
ప్రపత్తి అంటే ఏమిటి ?





🌟మనం వేంకటేశ్వరస్వామి సుప్రభాతంలో తరచూ వింటూ ఉండేదే. మరి ప్రపత్తి అంటే ఏంటి? జన్మలలో శ్రేష్టమైనది మానవజన్మ. అటువంటి మానవువునికి జీవిత లక్ష్యం ఆ శ్రీమన్నారాయణుని పాదముల శరణు పొందుటయే. దీనినే ప్రపత్తి అంటారు. ఎవరిని శరణు పొందాలి. మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి శరణం కానేకాదు. సమస్త లోకములను నియంత్రించువాడు సర్వలోకములను పోషించువాడు అయిన ఆ భగవంతుని శరణు పొందవలెను. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో.

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః!!

‍🌟అనగా అన్ని ధర్మములను త్యజించి నన్నే శరణు పొందు. నీ పాపములన్నింటి నుండి మోక్షంను ఇచ్చెదను. సాక్షాత్తుగా ఆ శ్రీకృష్ణుడే మనకి భరోసా ఇస్తున్నప్పుడు ఇక ఆచరించకపోవడానికి ఏమిటి ఇబ్బంది. ఇబ్బంది ఎందుకొస్తుందంటే మనకి నమ్మకం లేదు. నమ్మకం ఎందుకు లేదు? ఆ భగవంతుని పై ప్రేమ లేదు. ప్రేమ ఉంటే నమ్మకం తప్పక కలుగుతుంది. ప్రేమ కలగాలంటే ఏమి చెయ్యాలి. ఇందులో అనుభవం లేని వారెవ్వరైనా ఉన్నారా ? తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాం. వారి మీద మనకు నమ్మకం ఉండబట్టేకదా. మరి ఈసమస్త సృష్టికి తండ్రి అయిన ఆ భగవంతుని ఎందుకు శరణు పొందకూడదు. సరే భగవంతుని శరణు పొందుట ఎట్లు? భగవంతుని శరణు పొందుటకు సులభమైన ఉపాయము శ్రీమద్ భాగవతము లో బాలుడైన ప్రహ్లాదుడు ఇట్లు చెప్పెను.

శరవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం

‍🌟నారాయణుని గురించి శ్రవణం చెయ్యాలి. కీర్తించాలి, స్మరించాలి. స్వామి పాదములను సేవించాలి. అర్చనము చెయ్యాలి. నమస్కరించాలి. స్వామికి దాసుడవ్వాలి. స్నేహం చెయ్యాలి, తనను తాను సమర్పించుకోవాలి.

‍🌟ఇవన్నీ చేయాలంటే స్వామి మనకు కనిపించాలి కదా. అవును. ఆ స్వామిని చూచుటకు మనకున్న ఈనేత్రములు చాలవు. అందుకే స్వామి మనమీద దయతో అర్చారూపంలో మన ముందుకు వచ్చాడు. మనసా వాచా కర్మణా ఆస్వామిని మనము సేవించవలెను. సద్గురువును ఆశ్రయించి సమస్త దుఃఖములను దూరం చేసుకొను మార్గం తెలుసుకొని శాశ్వత ఆనందాన్ని పొందుటకు ప్రయత్నం చేయవలెను.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS