*సోమవారం...!*
*సోమ అంటే........,*
*స+ఉమ*
*ఉమ తో కూడినవాడు అనే అర్థం .......! శివుడు👍 శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు....!*
*పార్వతీ దేవి సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ, వుంటుంది.......!*
*అందువలన "సోమవారం" రోజున పార్వతీ "పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో, ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి......!*
*ఈ రోజున అంతా ఆ స్వామికి, "పూజాభిషేకాలు" జరుపుతుంటారు......!*
*ఇక కొంతమంది ఇంట్లో చిన్న పరిమాణంలో, గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని, పూజామందిరంలోనే స్వామికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు....!*
*ఇక ఎవరిలోనైనా ఆ సదాశివుడికి కావలసినది అంకితభావమే.....!*
*చిత్తశుద్ధితో పూజించాలేగాని, ఆయన అనుగ్రహించనిది లేదు......!!*
*ఇలా ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగించడం వలన, ఆ ఇంట ఎప్పటికీ లేమి అనే మాట వినిపించదని చెప్పబడుతోంది.....! అంటే ఆ స్వామి అనుగ్రహం వలన దారిద్ర్యం అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి, రాదు.....! ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని* *కీర్తించారు......! సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన సమస్త పాపాలు పటాపంచలై పోవడమే కాకుండా, సంపదలు ......సౌఖ్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది......!*
*శివపూజలో ప్రధానమైన అంశం, అభిషేకం, శివుడు అభిషేక ప్రియుడు, హాలాహలాన్ని కంఠమందు ధరించాడు...! ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు.....! నిరంతరం *అభిషేక జలం తో నేత్రాగ్ని చల్లబడుతుంది......!*
*అందుచేతనే గంగను, చంద్రవంక ను తలపై ధరించాడు శివుడు.......!!*
No comments:
Post a Comment