సదాశివ బహ్రేంద్ర ఒక యోగి, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, అద్వైత తత్వవేత్త. 18 శతాబ్దంలో తమిళనాడులోని కుంభకోణం వద్ద జీవించారు. ప్రధానంగా సంస్కృతంలో అతను రచనలు ఉన్నాయి. ఈ స్వరసృష్టిలోని ఇప్పటికి కొన్ని మాత్రమే మిగిలి ఉన్నా, వాటిని కర్ణాటక సంగీతంలో అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు
మోక్ష సోమసుందర అవధాని, పార్వతి అనే తెలుగు దంపతులకు సదాశివ జన్మించారు. అతను తొలి పేరు శివరామకృష్ణ. 17 ఏటనే వివాహమైంది. 17 - 18 శతాబ్దాల మధ్య తమిళనాడులోని కుంభకోణంలో జీవించారు. మరో ఇద్దరు ప్రముఖ హిందు ఆధ్యాత్మిక వేత్తలు శ్రీధర వేంకటేశ అయ్యాళ్, శ్రీ బోధేంద్ర సరస్వతి వేదపాఠశాలలో సదాశివకు సహచరులు.
సత్యాన్వేషణకై ఇంటిని వదిలి వేశారు. సన్యాసం స్వీకరించిన తరువాత దిగంబరంగా, అర్ధనగ్నంగా పరధ్యాన స్థితిలో తిరిగేవాడు. విపరీత వైరాగ్యంతో సమాధి స్థితిలో ఉండేవాడు.
పరమహంస యోగనంద "ఒక యోగి ఆత్మకథ"లో అతను జీవ సమాధి ఉదంతాన్ని సంగ్రహంగా ప్రస్తావించడం జరిగింది. అతను ఆత్మ విద్యా విలాసం వేరిట ఒక అద్వైత గ్రంథాన్ని కూడా రచించారు.అతను జీవించి ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలను చేసాడని ప్రతీతి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని మాత్రమే ఈ కింద ఉదహరించడం జరింగింది.
ఒకసారి కావేరి నది ఒడ్డున ఉన్న మహాధనపురంలో కొంత మంది పిల్లలు అక్కడికి వంద మైళ్ల దూరంలో ఉన్న మదురైలో జరిగే ఉత్సవానికి తీసుకుని వెళ్లాని కోరారు. అతను వారిని కళ్లు మూసుకోవాలని చెప్పాడు. కొన్ని క్షణాల తరువాత వారు తెరిచేసరికి మదురైలో ఉన్నారు.
ఈ కథకు కాస్త పొడిగింపు కూడా ఉంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఒక యువకుడు నమ్మకం కలగక తనను కూడా ఉత్సవానికి తీసుకుని పోవాలని కోరాడు. మరుక్షణమే అతని కోరిక తీరింది. కానీ వచ్చేప్పుడు సదాశివను కనుగొనలేక కాలినడకన రావాల్సి వచ్చింది.
మరోసారి ఒక ధాన్యపు కుప్పల వద్ద ధ్యానం చేసుకుంటున్నాడు. అతనును దొంగగా భావించి ఒక రైతు కొట్టేందుకు కర్రను ఎత్తగా శిలలా నిల్చిపోయాడు. మర్నాటి ఉదయం తన ధ్యానం ముగిశాక సదాశివ రైతును చూసి చిరునవ్వు నవ్వగా మళ్లీ మామూలు మనిషి అయ్యి క్షమాపణ కోరాడు.
మరోసారి, కావేరి నది ఒడ్డున ధ్యానంలో మునిగి ఉండగా అకస్మాత్తుగా వరదలు వచ్చి కొట్టుకుని పోయారు. కొన్ని వారాల తర్వాత కొంత మంది మట్టిని తవ్వుతుండగా సదాశివ దేహం తగిలింది. బయటకు తీయగా అతను లేచి నడచి వెళ్లి పోయారు.
ఇవి జరిగిన చాలాకాలం తర్వాత అతనును ప్రజలు మరిచిపోయే దశలో అతను మళ్లీ కనిపించారు. బ్రహ్మము తప్ప మరేమీ పట్టని పరధ్యాన స్థితిలో దిగంబంరంగా శరీరస్పృహలేకుండా తనకు ఎవరు ఎదురు వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియకుండా ఒక నవాబు గారి అంతఃపురంలో అటుఇటూ తిరుగుతుండగా అంతఃపుర వాసులు గమనించి నవాబుకు తెలిపారు. అతనును పట్టుకోమని నవాబు పురమాయించగా సైనికులు అతను రెండు చేతులను నరికి వేశారు. చేతులు రాలాయి. సదాశివలో మార్పు లేదు. అలా పరధ్యానంగా నడుస్తూనే ఉన్నారు. ఇది నవాబుకు తెలిపారు. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపచిత్తుడై నవాబు రెండు చేతులను తీసుకుని సదాశివకు ఎదురు వెళ్ళి ఆ చేతులను అర్పించారు. అంతే రెండు చేతులూ తిరిగి అతుక్కున్నాయి. సదాశివ నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
పుదుకొట్టాయ్ రాజు తొండైమన్ ను కలిసి అతనుకు దక్షిణామూర్తి మంత్రం ఉపదేశించారని కథనం. సదాశివ ఇసుకలో దక్షిణామూర్తి మంత్రాన్ని రచించగా ఆ ఇసుకను రాజు తీసుకున్నాడు. ఇప్పటి వరకు పుదుకొట్టాయ్ రాజభవనంలోని దక్షిణామూర్తి ఆలయం ఆ రాజుల అధీనంలోనే ఉంది.
తంజావూరు సమీపంలోని పున్నైనల్లూర్ మరియమ్మన్ దేవతను ఇతనుే ప్రతిష్ఠించారు. కామాక్షి దేవాలయంలోని దేవదనపట్టి విగ్రహ స్థాపనకు మార్గనిర్దేశనం చేశారు.
తంజావూరులోని నాలుకాల్ మంటపం వద్ద ఉన్న ప్రసన్న వెంకటేశ్వరం ఆలయంలో ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
కుంభకోణం వద్ద తిరునాగేశ్వరం రాహుస్థలంలో గణపతి విగ్రహాన్ని, శక్తిమంతమైన గణపతి యంత్రాన్ని స్థాపించారు. ఈ విషయం ఆలయశాసనంలో లిఖితమై ఉంది.
అతనుు మూడు సమాధులు ఉన్నాయి:
నెరూర్
మధురైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనమధురై (సోమనాథ ఆలయం వద్ధ ఉన్నదీన్ని కంచి పరమాచార్య గుర్తించారు)
ప్రస్తుత పాకిస్థాన్ లోని కరాచి
ప్రతి ఏటా నెరూర్, మనమధురైలలో అతను పేరిట సంగీత ఉత్సవాలు జరుగుతాయి.
శృంగేరీ శారద పీఠం ఆచార్య శ్రీ సచ్చిదానంద శైవాభినవ నృసింహ భారతి నెరూర్ ను సందర్శించి సదాశివ బ్రహ్మేంద్రను స్తుతిస్తూ సదాశివేంద్రస్తవం, సదాశివేంద్ర పంచరత్న అనే రెండు శ్లోకాలను రచించారు.
గ్రంథాలు:-
సంస్కృతంలో అనేక గ్రంథాలకు అతను రచయిత. ప్రచురితమైన అతను రచనలు :
బ్రహ్మసూత్రవృత్తి లేదా బ్రహ్మతత్వప్రకాశిక
యోగసుధాకర - పతంజలి యోగ సూత్రలమీద వ్యాఖ్యానం
సిద్ధాంత కల్పవల్లి
అద్వైతరసమంజరి
ఆత్మానుసంధానం
ఆత్మవిద్యావిలాసం
శివమానసపూజ
దక్షిణామూర్తి ధ్యానం
స్వప్నోదితం
నవమణిమాల
నవవర్ణరత్నమాల
స్వప్నానుభూతిప్రకాశిక
మనోనియమం
పరమహంసాచార్య
శివయోగ దీపిక
ఈ కింది గ్రంథాలు అతను రచనలుగా పేర్కొనబడుతూ ఉన్నా ప్రచురితమైనవి కావు .
ఉపనిషద్వాఖ్యానం
కేసరవల్లి
సూత సంహిత
భాగవతసార
సపర్యాపర్యాయస్తవం
ఆత్మానాత్మావివేక ప్రకాశిక
కీర్తనలు:-
సదాశివబ్రహ్మేంద్ర కర్ణాటక సంగీతంలో పలు కీర్తనలను సృజించి అద్వైతతత్వాన్ని వ్యాప్తి చేశారు. బహుళ ప్రజాదరణ పొందిన అతను కీర్తనలు కర్ణాటక సంగీత సభల్లో తరుచూ వినబడుతూ ఉంటాయి. కొన్ని:
ఆనందపూర్ణ బోథోహం సచ్చిదానంద - శంకరాభరణ రాగం
ఆనందపూర్ణ బోధోహం సతతం - మధ్యమావతి రాగం
భజరేగోపాలం - హిందోళ రాగం
భజరే రఘువీరం - కళ్యాణి రాగం
భజరే యదునాథం - పీలు
బ్రహ్మైవహం - నాథనామక్రియ
బ్రూహి ముకుందేతి - గౌళ, నవరోజు, కురింజి, సెంచురిత్తి
చేత శ్రీరామం - ద్విజయంతి, సూరతి
చింత నాస్తి కిల - నవరోజు
గాయతి వనమాలి - గావతి, యమున కళ్యాణి
ఖేలతి బ్రహ్మాండే - సిందుభైరవి
ఖేలతి మమ హృదయే - ఆతన
క్రీడతి వనమాలి - సింధుభైరవి
కృష్ణాపాహి - మధ్యమావతి
మానస సంచరరే - సామ
నహిరే నహిరే - గావతి
పివరే రామ రసం - ఆహిర్ భైరవ్
పూర్ణబోధోహం - కళ్యాణి
ప్రతివరం నరం - హనుమతోడి
సర్వం బ్రహ్మ మయం - మిశ్ర శివరంజని
స్మరవరం - జోగ్
స్థిరత నహి నహీరే - అమృతవర్షిణి
తత్వత్ జీవితం - కీరవాణి
తుంగ తరంగే గంగే - హంసధ్వని
🕉🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment