Tuesday, May 23, 2023

శ్రీ గోష్పాద క్షేత్రం ప.గో.. జిల్లా : కొవ్వూరు

  ప.గో.. జిల్లా :    కొవ్వూరు


⚜ శ్రీ గోష్పాద క్షేత్రం




💠 చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రవరం గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. 

గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.


💠 గౌతమమహర్షికి పరమశివుడు గోవుపాదం రూపంలో దర్శనమిచ్చిన క్షేత్రం గనుక గోష్పాద క్షేత్రమని, ఆ మహర్షి దీనిని స్తుతించాడు. అందుకే ఈ క్షేత్రం “గోవూరు”గా పిలవబడుతూ, నేటికి కొవ్వురుగా స్థిరపడింది. 


💠 లక్ష గోవులు ఏక కాలంలో సంచరించిన అత్యంత పవిత్ర ప్రదేశం ఈ గోష్పాద క్షేత్రం. ఇక్కడ స్పటిక లింగేశ్వరాలయము మరో ప్రత్యేకత



⚜ స్థలపురాణం ⚜


💠 పూర్వం, గౌతమమహర్షి తన భార్య అహల్యతో కలిసి పరమేశ్వరుని ఆరాధించి, ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని సంపాదించాడు. ఆ విధంగా గౌతమమహర్షి నిత్యం వేదోక్త కర్మాచరణ కావిస్తూ ధర్మప్రచారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 


💠 ఒకసారి పదిహేను సంవత్సరాలు వర్షాభావంతో కరువు సంభవించింది. చాలామంది ప్రజలకు, మునులకు ఒక్క గౌతమ మహర్షి ఆశ్రమం మాత్రమే సుభిక్షంగా ఉందని తెలిసింది. గౌతమ మహర్షి గాయత్రీ దేవిని ప్రార్థించగా ఆమె కృపతో ఒక రోజులో ఎంతమందిని అయినా పోషించగల బంగారు పాత్ర పొందగలిగాడు. తన తపో శక్తితో, గాయత్రీ మాత అనుగ్రహంతో ఉదయం పొలంలో విత్తనాలు చల్లితే సంధ్యా సమయానికి పంట వచ్చేది. 


💠 కానీ గౌతమమునికి పరీక్షాకాలం ఆసన్నమైంది. వెంటనే పరమేశ్వరుడు గోరూపాన్ని ధరించి,తన పుత్రుడైన గణపతిని దూడగా చేసి గౌతముడు పండిచే పొలములో ప్రవేశించారు.

మహర్షి ఆ సమయంలో ధ్యానంలో ఉన్నాడు. అలికిడికి కళ్ళు తెరిచి చూడగా గోవు పంట తినుచున్నదని గ్రహించి దర్భతో అదిలించాడు. మాయాగోవు కావున అది కొంచెం దూరం పారిపోయి వేదన అనుభవించి మృతి చెందింది. గోహత్యాపాతకం పోవాలంటే పవిత్ర గంగానదిని ప్రవహింపచేయాలని అందరు నిశ్చయించారు. 


💠 గౌతమ మహర్షి తపస్సు చేసి మహా శివుని అనుమతితో గంగను తీసుకొని వచ్చాడు. గంగను విడుచునప్పుడు మహా శివుని షరతు ఏమనగా గౌతముడు వెనుతిరిగి చూడరాదు. అఖండ గోదావరి నాశిక్, త్రయంబకేశ్వరం నుంచి బాసర, ధర్మపురి, భద్రాచలం మీదుగా గోవూరులో ప్రవేశించింది. గౌతముడు నీటి శబ్దం వినిపించుటలేదు అని వెనుతిరిగి చూడగా ఆ ప్రదేశంలో అఖండ గోదావరి పాయలుగా విడిపోయింది.


💠 ఆ హిమగంగ పారిన ప్రదేశమే గోష్పాద క్షేత్రంగా, ఆ గంగే గౌతమి (గోదావరి) గా ప్రసిద్ధి చెందాయి. మరణించిన గోవును గోదావరి నదీ ప్రవాహంతో పునరుజ్జీవితుల్ని చేశారు.


💠  గోహత్యా పాపపరిహారార్ధం, ఏదైనా చేయాలనీ ఆలోచిస్తుండగా, రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ గోపాలస్వామి దర్శనమిచ్చి, ఆ మహర్షిని ఓదార్చాడు. 

ఆ విధంగా అతని పాపహరిహరార్ధం తానే విగ్రహరూపంలో భువిలో వెలసెదనన్నాడు. అందుకు మహర్షి చాలా సంతోషించాడు. పశ్చిమ గోదావరీ తీరానా మరునాడే, గౌతముడు సూర్యునికి ఆర్ఘ్యప్రధానం చేసి వస్తుండగా గోపాలస్వామివారి విగ్రహం దర్శనమిచ్చింది. 

ఆనందంతో గౌతముడు అహల్యతో కలిసి ఆ గోపాల స్వామివారిని ప్రతిష్ట చేసారు.


💠 మరణించిదనుకొన్న గోవు లేచింది. చెంతనే ఉన్న దూడ కూడా లేచి గంతులు వేసింది. గౌతముడు సంతోషంతో వారికి నమస్కరించాడు. శివగణపతులు దర్శనమిచ్చి అతడిని దీవించారు. ఇలా పరమశివుడే గోరూపాన్ని ధరించి, పాదం మోపిన పుణ్యస్థలం కాబట్టి ఇది గోవూరుగా కీర్తి పొందింది. 

స్వామిలీల వలననే అచట రుక్మిణీ సత్యభామలతో శ్రీ వరద గోపాలుడుగా వెలిశాడు. 


💠 ఆలయ ప్రాకారంలో గల గరుడాలయం, ధ్వజ స్తంభం కుడివైపున ఆoజనేయస్వామి, దక్షిణాన కల్యాణమంటపం ఉన్నాయి.


💠 శివకేశవులిద్దరూ పాదాలుమోపి, ముక్తినోసంగు దివ్యక్షేత్రం ఈ గోష్పాదక్షేత్రం.

ఈ స్వామివారిని వరదగోపాలుడుగా వైశాఖ శుద్ధ ఏకాదశినాడు కల్యాణం జరుపుదురు. ఇచ్చట మాఘశుద్ధ ఏకాదశికి, ముక్కోటి ఏకాదశి ఎంతో గొప్పగా ఉత్సవాలు నిర్వహిస్తారు. 


💠 ఈ క్షేత్రంలో పాదంమోపిన భక్తుని జన్మ చరితార్ధమే! ఈ కొవ్వూరు నందు మరికొన్ని ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నవి. 

వాటిలో శ్రీ గౌతమేశ్వరస్వామి ఆలయం,

శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, 

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం,

శ్రీ బాలా త్రిపుర సమేత సుందరేశ్వరస్వామి ఆలయం ,

గ్రామదేవత శ్రీ కొవ్వురమ్మ  ఆలయాలు ముఖ్యమైనవి.


💠 రాజమండ్రి నుండి కేవలం 10కి.మీ. దూరం

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS