హనుమంతుని ఎన్నో రూపాలను చూస్తుంటాం,
పంచముఖ హనుమంతుడనీ, సప్త ముఖ హనుమంతుడనీ, బాల హనుమంతుడనీ, ధ్యానాంజనేయుడనీ ఇలా ఎన్నో రకాల రూపాలతో ఆంజనేయుని ఆలయాలు నిత్యం దర్శిస్తాం.
కానీ హనుమంతుడు తనకు తానుగా ఒక యంత్రానికి బద్ధుడై, యంత్ర స్వరూపంగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం యంత్రోద్ధారక హనుమంతుని గుడి.
యాంత్రోద్ధారక హనుమంతుని ప్రతిష్టించిన గాథ:
మధ్వసాంప్రదాయానికి కర్ణాటక ప్రాంతం పుట్టినిల్లు. 15వ శతాబ్దం లో సాళ్వనరసింహరాయల పరిపాలనాకాలం లో వ్యాసరాయరు అనే ఒక గొప్ప తాత్వికుడు, మధ్వాచార్యుడు, హనుమద్భక్తుడు ఉండేవాడు.
అతను భారతదేశమంతటా సంచరించి 732 హనుమంతుని ఆలయాలను ప్రతిష్టించాడు. వాటిలో మొదటిది తుంగభద్రాతీరాన హంపి దగ్గర గల చక్రతీర్థం లోని ఈ యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం.
🚩 యంత్రోద్ధారక హనుమంతుడు ఎలా వెలిశాడు ?
వ్యాసరాయరు గొప్ప హనుమద్భక్తుడు. అతను హనుమంతుని బొమ్మను ఒక బొగ్గుముక్కతో గీసి ఆ రూపాన్ని పూజించేవాడు.
ఒకనాడు హంపీ క్షేత్రం లో తుంగభద్రా నదీ తీరాన చక్రతీర్థం లో ఒకబండరాయిపైన ఆంజనేయుని బొమ్మను యథావిధిగా బొగ్గుతో గీశాడు. పూజ చేస్తుండగా ఉన్నట్టుండి ఆ బొమ్మ నిజమైన కోతిలా మారి బండరాయినుండీ బైటికి దూకి వెళ్లిపోయింది. ఇలా పన్నెండు రోజులు జరిగింది. ఇక వ్యాసరాయరు అలసిపోయి ఈ పరీక్షనుండి కాపాడమని ఆంజనేయునే ప్రార్థించాడు.
రాయరు ప్రార్థనకు కరిగిన ఆంజనేయుడు తనంతట తానుగా ధ్యానం లో రాయరుకి ఆంజనేయ యంత్రాన్ని తెలిపి యంత్రానికిబద్ధుడై అందులో కూర్చున్నాడు.,
అంతకుముందు బండ రాయి నుండీ తప్పించుకున్న పన్నెండు కోతులనూ యంత్రానికి చుట్టూతా ఉంచాడు.
ఈవిధంగా యంత్రోద్ధారక హనుమంతునిగా ఆంజనేయ శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంది.
🙏శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం🙏
దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని వ్యాసరాయలు చెప్పినది. మీరు పఠించండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి
విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలోని యంత్రోద్ధారక హనుమాన్ ఆలయ మిది. అక్కడి విరుపాక్ష ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంది. రామాయణ కాలంలో శ్రీ రాముడు, హనుమంతుడు తొలిసారి కలిసిన ప్రదేశం.
#యంత్రోద్దారక #హనుమత్_స్తోత్రం :
నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ ।
పీనవృత్తమహాబాహుం సర్వశత్రునిబర్హణమ్ ॥ ౧॥
నానారత్నసమాయుక్తకుణ్డలాదివిభూషితమ్ ।
సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమాహవే ॥ ౨॥
వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా ।
తుఙ్గామ్భోధితరఙ్గస్య వాతేన పరిశోభితే ॥ ౩॥
నానాదేశాగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః ।
ధూపదీపాదినైవేద్యైః పఞ్చఖాద్యైశ్చ శక్తితః ॥ ౪॥
భజామి శ్రీహనూమన్తం హేమకాన్తిసమప్రభమ్ ।
వ్యాసతీర్థయతీన్ద్రేణ పూజితం ప్రణిధానతః ॥ ౫॥
త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః ।
వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యన్తరే ఖలు ॥ ౬॥
పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః ।
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ॥ ౭॥
సర్వథా మాస్తు సన్దేహో హరిః సాక్షీ జగత్పతిః ।
యః కరోత్యత్ర సన్దేహం స యాతి నరకం ధ్రువమ్ ॥ ౮॥
ఇతి శ్రీవ్యాసతీర్థవిరచితమ్ యంత్రోద్దారక
హనుమత్స్తోత్రం సమ్పూర్ణమ్ ।
🚩 ఈ ఆలయం ఒక చిన్న కొండమీద నిర్మింపబడి ఉంది. అక్కడ మహాపురుషుడైన వ్యాసరాయని ఆధ్యాత్మిక శక్తి ఇప్పటికీ తిరుగాడుతున్న అలౌకిక అనుభూతి భక్తులకు కలుగుతుంది
కర్ణాటక రాష్ట్రంలో ,బళ్ళారి లోని హోస్పేట లో గల చక్రతీర్థం లో యంత్రోద్ధరక హనుమంతుని ఆలయం ఉంది.
హంపినుంచీ ఇది పన్నెండు కిలోమీటర్ల దూరం లో ఉంటుంది
🌿🌼అందరం భక్తితో " జై శ్రీరామ్ జై హనుమాన్ " అని వ్రాసి స్వామివార్ల అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు శ్రీ రామచంద్రుడు, ఆంజనేయ స్వామి వారు
జై శ్రీరామ్
No comments:
Post a Comment