Tuesday, May 23, 2023

శ్రీ భావనారాయణస్వామి ఆలయం కృష్ణా జిల్లా : " భావదేవరపల్లె "

  


 శ్రీ భావనారాయణస్వామి ఆలయం కృష్ణా జిల్లా :  " భావదేవరపల్లె "




💠 పంచారామాలు అనే ఐదు శైవక్షేత్రములు ఉన్నట్లే, శ్రీ మహావిష్ణువుకు అయిదు చోట్ల శ్రీ భావన్నారాయణ స్వామి వారి క్షేత్రాలు ఉన్నాయి. 

ఆ ఐదు క్షేత్రాలలో ఇది ఒక ఆలయంగా చెబుతారు. 

మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? 

ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు , విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


💠 ఈ గ్రామం అత్యంత పురాతన కాలానికి చెందిన గ్రామం. 

చాళుక్య రాజుల కాలం నుంచి ఈ గ్రామం చరిత్రలో ఉంది. 

భావనారాయణ స్వామి స్వయంభువై వెలసినందువలన ఈ గ్రామానికి భావదేవరపల్లి అనే పేరు స్థిరపడింది.



💠 కృష్ణా జిల్లా, నాగయలంక కు 9 కీ.మీ దూరంలో భావదేవరపల్లె అను గ్రామం కలదు.  ఇచ్చట శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ భావనారాయణ స్వామి ఆలయం కలదు. 


💠 ఇది పంచ భావనారాయణ క్షేత్రాలలో ఒకటి.  

 అయితే మిగతా నాలుగు...

 కాకినాడ నగరంలోనే ఒక భాగంగా ఉన్న సర్పవరంలో ఒకటి, 

గుంటూరు జిల్లాలోని పొన్నూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలోని పెదగంజాంలో ఒకటి, పశ్చిమగోదావరి జిల్లా పట్టిసంలో ఒకటి. 

ఇలా మొత్తం ఐదు క్షేత్రాలు ఉన్నాయి.


💠 ఇక ఈ ఆలయంలోని స్వామివారు స్వయంభువు. 

మూడు అడుగుల ఎత్తులో ఉన్న స్వామివారి అలంకరణ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్వామివారికి పెద్ద పెద్ద మీసములు వెండితో చేసినవి ఉండటం ఒక ప్రత్యేకత. 


💠 స్వామివారి మూర్తికి రెండువైపులా శ్రీదేవి, భీదేవిలా విగ్రహమూర్తులు ఉన్నాయి.

 ఈ ఆలయ మొదట చోళరాజులలో ఒకరు నిర్మించారని ఈ ఆలయంలో లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తుంది.

          

💠 ఈ ఆలయంలో విశేషం ఏంటంటే సంవత్సరంలో అన్ని రోజులు వెలుగుతూ ఉండే అఖండ దీపారాధన సేవ ఒక ప్రత్యేకత. చాలామంది భక్తులు ప్రత్యేకించి ఈ అఖండ దీపారాధన కోసం ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. 


💠 ఈ స్వామివారిని నిత్యం 6 గంటల నుండి 11 గంటలవరకు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు దర్శించవచ్చును. 

ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయంలో వైశాఖమాసంలో 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.


💠 ఈ ఆలయంలో ముఖ మండపం నందు శ్రీ రాజ్యలక్ష్మీ, ఆంజనేయస్వామి సన్నిధి ఉన్నాయి.  

ఆలయం నకు దక్షిణ వైపున కోనేరు, ఈశాన్యం వైపుగా కళ్యాణ మండపం ఉంటాయి.  

స్వామికి నిత్య అర్చనలు తో పాటు వైశాఖ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి.  ధనుర్మాసం నందు ప్రత్యేక పూజలు ఉంటాయి


💠 ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి జరిగే కళ్యాణోత్సవం ఒక ప్రత్యేకత.

 ధనుర్మాసంలో జరిగే వ్రతము, ముక్కోటి, కనుములకు స్వామివారి ఊరేగింపు, దేవీ నవరాత్రులు, వార్షిక పండుగలు పంతొమ్మిది ఎంతో వైభవంగా జరుగుతాయి.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS