ముఖ్యముగా ... #ఉపనయన సంస్కారము వొడుగు (జంధ్యం/గాయత్రి ధారణ ) కానిదే గాయత్రిమంత్రము పఠించుటకు ఎవరైననూ #అనర్హుడని శ్రుతివాక్యము!
ఏ మంత్రాన్నైనా ఎవరైనా చదవవచ్చు..కానీ ఉపాసించాలంటే "గురూపదేశం ,నియమాలు" తప్పనిసరి!... అనీ.. మంత్ర ద్రష్ట #విశ్వామిత్రుడి సూచన ..
ఓం భూర్భువస్సువః (ఓం తత్సవితుర్వరేణ్యం!
భర్గోదేవస్య ధీమహి, ధియోయోనః ప్రచోదయాత్||
గాయత్రీ పఠనం బ్రహ్మోపదేశం తీసుకుని #యజ్ఞోపవీతం ఉన్నవారు మాత్రమే చేయాలనీ నియమాలు వున్నాయి.అవి ఉపదేశం ఇచ్చే గురువులు చెప్తారు.
సాధారణంగా తండ్రి కుమారునికి ఉపనయనం సమయంలో మంత్రోపదేశం చెవిలో చేస్తాడు,లేదా బ్రాహ్మణులు ఉపదేశమిస్తారు ,ఉపదేశం తీసుకున్నవారు ప్రతి ఒక్కరూ నిత్యం సంధ్యావందనంలో గాయత్రిమంత్రం జపం ఖచ్చితంగా చెయ్యవలసిందే అది కూడా మంత్రాన్ని నోటితో #ఉచ్ఛరించొద్దు, కేవలం మనసులోలోపల మాత్రమే ధ్యానం/మననం చేయాలని గురువుల సూచన !
కాలమాన పరిస్థుతులలో యుగమార్పు ననుసరించి ... గాయత్రి మంత్రం. ప్రతి ఒక్కరు పఠించిదగిన విశేషమంత్రం.
గాయత్రీ బీజమంత్రం. శబ్దపరంగానూ, మంత్రోచ్చారణ చేసినవారిలో గుప్త స్పందన కలిగి వివిధ శక్తి కేంద్రాలు #చైతన్యవంతమవుతాయి అని చెప్పబడుచున్నది .
గాయత్రి మంత్రం పురుషులే పఠించదగినదని కాని, కొన్ని వర్గాలవారికే పరిమితమైనదని కాని శాస్త్రాలలో ఎక్కడా లేదు. ధ్వని ప్రధానమైనది కాబట్టి స్వచ్ఛత,స్పష్టత,పఠనాశక్తి ,ఏకాగ్రతా ఉండి తీరాలి. అందుకు మినహాయింపు లేదు.
అందువలన ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించిన వారు గాయత్రీమాత కరుణా, కటాక్షాలను పొందగలరు.
గాయత్రీదేవి -
ఆమె వేదమాత , సర్వ ధర్మ సారము , శైవ , వైష్ణవ , సనాతన , ఆర్య సమాజాది భేదములు లేకుండా అందరికీ ఆరాధ్య దేవత ..మాత .
తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది.
దసరా నాలుగవ రోజైన ఆశ్వయుజ శుద్ధచవితి నాడు, అమ్మవారిని శ్రీగాయత్రీదేవిగా అలంకరిస్తారు.
సకల మంత్రాలకూ మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి, ముక్తావిద్రుమహేమ నీలధవళ కాంతులతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠానదేవత. గాయత్రీదేవి మంత్రప్రభావం ఎంతో గొప్పది.
గాయత్రీమంత్రం రెండు విధాలు. ఒకటి లఘు గాయత్రీమంత్రం, రెండవది బృహద్గాయత్రీ మంత్రం. ప్రతి రోజూ త్రికాలసంధ్యావందనం చేసి, ఆ గాయత్రీదేవి మంత్రాన్ని వేయి సార్లు ధ్యానిస్తే, ఆ తల్లి అనుగ్రహంతో పాటు, వాక్శుద్ధి కలగతుంది. అంతటి మహత్తరశక్తి కలిగిన గాయత్రీదేవి శరన్నవరాత్రులలో ఐదు ముఖాలతో, వరదాభయ హస్తాలతో, కమలాసనగా దర్శమిస్తుంది.
శక్తి స్వరూపిణి... త్రైలోక్య సంచారిణి... వేదమాత... అమ్మలగన్నయమ్మ... ముగ్గురమ్మల మూలపుటమ్మ... అఖిలాండకోటి బ్రహ్మాండనాయకైన శ్రీ జగదాంబ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తన ఆధీనం చేసుకుంటూ షోడశాదశ మంత్రానికి అధిష్టాన దేవతగా, శ్రీ చక్ర నీరాజనాలందుకునే ఏకాదశ శక్తుల సంగ్రహంగా, అపరాజితగా కొలువులందుకునే తల్లి, పరాశక్తి, మంత్రశక్తి, ప్రాణశక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాగె్వైభవశక్తి, సంహారశక్తి, ఆదిపరాశక్తి, ధార్మిక శక్తి, విజయశక్తులు దేవిలో నిండి నిబిడీకృతమై ఉండే దేవతే గాయత్రీమాత .
గాయత్రీ మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరమని #మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.
ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
భువః = చిత్ స్వరూపుడు(జ్ఞాన రూపుడు).
స్వః = ఆనంద స్వరూపుడు(దుఃఖరహితుడు).
తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేస్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
యః = ఆ పరమేశ్వరుడు.
నః ద్యః = మా బుద్ధులను.
ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక!.
న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్
అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా #ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా #ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా #రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. #వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించినారు.
అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం. అనన్యం,సర్వసిద్ధిప్రదం.
ఇందులో ఇరవైనాలుగు శక్తిధారలు ఉన్నాయి గాయత్రిమంత్ర జపం వల్ల వందశాతము రోగనిరోధక శక్తి లభిస్తుంది
తేజస్సు,యశస్సు,పరిసరాలు వృధ్ధి చేందుతాయి కనుకనే #విశ్వామిత్రుడు లోకాకళ్యాణ కోసం సాధించాడంటారు ,
1. త - అజ్ఞానాన్ని పోగొట్టునది
2. త్స - ఉపపాతకములను నివారించునది
3. వి - మహాపాతములను నివారించునది
4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.
5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది
6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది
7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.
8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది
9. భ - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.
10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.
11. దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది
12. వ - గురు హత్యాపాపాన్ని నివారించును.
13,. స్య - మానసిక దోషాలను నివారించును
14. ధీ - మాతృ, పితృ వధా పాతకాన్ని పరిహరించును.
15. మ - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును
16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును
17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును
18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.
19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును
20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును
21. ప్ర - విష్ణులోక ప్రాప్తి
22. చో - రుద్రలోక ప్రాప్తి
23. ద - బ్రహ్మలోక ప్రాప్తి
24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.
గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.
గాయత్రి - తూర్పు దిక్కును
సావిత్రి - దక్షిణ దిక్కును
సంధ్యాదేవి - పడమర దిక్కును
సరస్వతి - ఉత్తర దిక్కును
పార్వతి - ఆగ్నేయాన్ని
జలశాయని - నైరుతిని
పవమాన విలాసిని - వాయువ్య దిక్కును
రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక
తుత్ - పాదాలను
సవితుః - జంఘలను
వరేణ్యం - కటిని
భర్గః - నాభిని
దేవస్య - హృదయాన్ని
ధీమహి - చెక్కిళ్ళను
ధియః - నేత్రాలను
యః - లలాటంను
నః - శిరస్సును
ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.
ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగమ్ శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.
తత్ - శిరస్సు
సకారం - ఫాలం
వి - నేత్రాలు
తు - కపోలాలు
వ - నాసాపుటాలు
రే - ముఖం
ణి - పైపెదవి
యం - కింది పెదవి
భ - మద్య భాగం
ర్గో - చుబుకం
దే - కంఠం
వ - భుజాలు
స్య - కుడి చేయి
ధీ - ఎడమ చేయి
మ - హృదయం
హి - ఉదరం
ధి - నాభి
యో - కటి
యో - మర్మప్రదేశం
నః - తొడలు
ప్ర - జానువులు
చో - జంఘం
ద - గుల్ఫం
యా - పాదాలు
త్ - సర్వ అంగాలు
ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.
🕉🕉🙏🙏🙏
No comments:
Post a Comment