Wednesday, August 26, 2020

శనిగ్రహ సంచారము - ఫలితాలు , పరిహారాలు .

శనిగ్రహ సంచారము - ఫలితాలు , పరిహారాలు .


శని గ్రహము గోచారంలో రెండున్నర సంవత్సరాలు ఒక్కొరాశిలో ఉంటూ మొత్తం 12 రాశులని చుట్టేస్తాడు. చాలా ఎక్కువ కాలం ఉంటాడు ఒక్కొరాశిలో. ఐతే శని మన జన్మ రాశి నుండి 4 లో ఉంటే అర్ధాష్టమ శని అని, జన్మ రాశి నుండి 8 లో ఉంటే అష్టమ శని అంటారు. ఇవి కేవలం రెండున్నర వత్సరాలు మాత్రమే ఉంటాయి. అయితే, ఏలినాటి శని మాత్రం జన్మ రాశికి వెనక రాశి, జన్మరాశి, జన్మ రాశికి ద్వితీయంలో ఉంటే అది ఏలినాటి శని అవుతుంది. మొత్తం ఏడున్నర సంవత్సరములు. 

శని ఈతి బాధల్ని కలిగిస్తాడు. ఆ సమయంలో కాస్త కష్టపడటం తప్పదు. శని భగవానుడు చేసిన తప్పులకి ఆయన దశలో, అలాగే గోచారంలో అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని దశలలో కొంత మనకి ఇబ్బంది కలిగిస్తాడు. అంటే, మనం తెలిసో తెలియకో చేసిన తప్పులకి దండన విధిస్తాడు అన్నమాట.

శని భగవానుని ప్రవేశం ధనస్సు నుండీ మకరంలోకి జరిగింది. ఇక రెండున్నర వత్సరాలు ఆ మకర రాశిలోనే ఉంటాడు. ఇక రెండున్నర ఏళ్ళు వృశ్చిక, సింహ, మీన రాశుల వారికి శని బలం కలదు. వీళ్ళకి సువర్ణ/రజిత మూర్తిగా యోగిస్తాడు శని.

శని కాళ్ళు, పళ్ళు, ఉదరం, ఎముకలు, కండరాలు, చర్మం, జుట్టు, విసర్జక క్రియ ఇవన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. అలాగే కష్టాలు, ఆయుః విషయాలలో ఇబ్బందులు , పితృ కార్యాలు చేసే అవసరం రావడం, ఏదీ కలసి రాకపోవడం, ప్రతి పనిలో జాప్యం,పనులు సజావుగా జరగక పోవడం ఇవన్నీ ఈ శని ద్వారా కలిగే ఇబ్బందులు.

ఇక ద్వాదశ రాశులలో శని సంచారం ఫలితాలు గురించి ముందు చర్చిదాం. 

మేష రాశి వారికి: జన్మరాశి నుండి 10 లో ఉన్న శని వలన కొంత ఉద్యోగంలో ఒత్తిడి ఉన్ననూ పదోన్నతులు లాభం , కొంత కార్యములలో అపజయాలు, పాపకార్యాసక్తి ఉంటుంది. చెడు స్నేహాలవలన నష్టం ఉంటుంది.

వృషభ రాశి వారికి: శత్రువుల వలన బాధ, పితృ కార్య నిర్వహణ, పితృ బాధ, అధికారుల వలన ఒత్తిడి, వ్యాధి ములక బాధ వ్యయం, అనవసర తగాదాలు. నష్టం.

మిధున రాశి వారికి: అష్టమ శని వలన అనారోగ్యం, కుటుంబానికి ఇబ్బంది, కష్టాలు, చిక్కులు, ఈతి బాధలు, మలబద్దకం, మూలవ్యాధి వంటివి, దంత సమస్యలు ఉంటాయి. 

కర్కాటక రాశి వారికి: అనవసర ప్రయాణాలు, ఇబ్బందులు, అలసట, త్రిప్పట, కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలు, కండరాలు ఎముకల బలహీనత, వ్యాపార నష్టం, వైవాహిక అశాంతి.

సింహ రాశి వారికి: శత్రు క్షయం, చక్కని ఆఫీగ్యం, ఆస్తులు పెరుగుట, కార్య విజయం, భూ, ధన, రాజకీయ లాభం. అన్నింటా అభివృద్ధి, కోర్టు కేసుల్లో విజయం. 

కన్య రాశి వారికి: సంతానం వల్ల బాధ, సంతాన నష్టం, మానసిక సంఘర్షణ, మానసిక అశాంతి, వృధా ప్రయాస, కుంటుంబానిక్ దూరమగుట, ఆకర్షణకు లోనగుట వలన అవమానం.

తుల రాశి వారికి: మిత్రుల వలన నష్టం, వృధా ఖర్చులు, కుటుంబానికి తల్లికి జన్మ స్థానానికి దూరమగుట, ఆస్తుల విషయాలలో జాప్యం. అర్ధాష్టమ శని ఏలినాటి శనితో సమానం.విపరీత అనారోగ్యం మరియు దురదృష్టములు ఎక్కువ కలుగును.

వృశ్చిక రాశి వారికి: శని వృశ్చికరాశి వారికి తృతీయంలో ఉన్నాడు. సువర్ణ మూర్తిగా తృతీయంలో ఉండుతావలన అన్నింటా లాభం, సౌఖ్యం, సోదరవృద్ధి. కార్య జయం. వస్తు సేకరణ వంటివి యోగిస్తాయి. 

ధనస్సు రాశి వారికి: ధన నష్టం, ఆర్ధిక ఇబ్బంది, అనారోగ్యం, మూల వ్యాధులు, మాల బద్దకం, కుటుంబ కలహాలు, అలసట, మానసిక అశాంతి వాక్కుని అదుపులో ఉంచుకోవాలి లేదా గొడవలు. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు.

మకర రాశి వారికి: అనారోగ్యం, పాపా కార్య ఆసక్తి, జాడ్యం, పనుల్లో జాప్యము, బద్దకం, శుభ్రత లోపం, కండరాల నొప్పులు, వాదన, పనుల్లో ఆటంకం, బంధువులతో వైరం, శారీరక శ్రమ మరియు ఇబ్బంది. ధనవ్యయం.

కుంభ రాశి వారికి: అనారోగ్యము వలన వ్యయం, అపరేషన్లు యోగించక పోవచ్చు. ఆస్తి నష్టం. పాపా కార్యాలకి ధన వ్యయం. బలహీన దేహం. మొండితనం. ప్రతిఫలం లేని ఖర్చు కార్యక్రమాలు. మనో వ్యాకులత.

మీన రాశి వారికి: అన్నింటా లాభం. గౌరవం. శుభకార్యాల నిర్వహణ. కుటుంబంలో సంతోషం మరియు సౌఖ్యం. ధన లాభం. 

ఇది ద్వాదశ రాశుల వారికి రెండున్నర సంవత్సరముల పాటు కలిగే ఫలితాలు.

శనికి పరిహారం కోసం 
శని గ్రహ జపం 19000
అధిదేవత జపం 1900
ప్రత్యది దేవత జపం 1900
తర్పణం 1900
హోమం 190 ఆహుతులు జమ్మి సమిధలు తో చేయించాలి. ఇంద్రనీల దానం. నువ్వులు దానం. నువ్వుల నూనె దానం మంచిది. 

మన్యు పారాయణ(ఉపదేశం ఉంటేనే),
దక్షిణ కాళీ ఆరాధన (ఉపదేశం ఉంటేనే),
హనుమ ఆరాధన,
ఈశ్వర ఆరాధన వంటివి మంచిది.

ఏలినాటి శనిలో ఉన్న ధనస్సు, మకర, కుంభ రాశులవారు మరియు అర్ధాష్టమ శనితో ఉన్న తుల, అష్టమ శనిలో ఉన్న మిధున రాశుల వారందరు పై పరిహారాలు పాటిస్తూ వుండండి.

మేష, వృషభ, కర్కాటక, కన్య వారు శని త్రయోదశికి ఆరాధన చేస్తూ నువ్వులనూనెతో స్వామిని అభిషేకిస్తూ ఉండండి. ప్రతి శనివారం శని భగవానుని ఆరాధన చేయండి. 

పుష్యని, అనురాధ, ఉత్తరాభాద్ర వారు కూడా శని ఆరాధన చేయండి. వీరు శని నక్షత్రం వారు. 

చివరగా అందరూ చదవగలిగిన స్త్రోత్రం అందిస్తున్నాం శని దోష నివరణకై చదవండి. అలాగే హనుమాన్ చాలీసా, లేదా సుందరకాండ పారాయణ వంటివి చేయండి. స్వామి అనుగ్రహం పొందండి.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS