Wednesday, August 26, 2020

బిక్కవోలు శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నిజ రూప దర్శనం...

బిక్కవోలు శ్రీ లక్ష్మీగణపతి స్వామి వారి నిజ రూప  దర్శనం... 


బిక్కవోలు గణపయ్యకు ఒక్కసారి చెప్తే చాలు.ఇక్కడి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి అగ్రజుడుగా అగ్ర పూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాదిస్తారంటే ఆయన ఎంతటి శక్తి వంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది. అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లో ఉంది. ఇక్కడ వెలసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు. క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాటినట్టుగా ప్రచారంలో ఒక కధ వినిపిస్తుంది. అప్పుడా భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పిఅ ఆలయాన్ని తవ్వించాడట. ఆ తరువాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదనీ చెబుతున్నారు. భూమిలో నుండి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెద్దదయిందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం లోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. వీరభద్రుడు, సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రమణ్యేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. పూజలు, పారాయణాలు,దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువగా తిలకించవచ్చు. ఇక్కడ గణపతి హోమమ చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు.
శుభం

No comments:

Post a Comment

RECENT POST

మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.

చాలా బాగుంది - పూర్తిగా చదవండి మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.  ఆమె తన ఐహికమైన బరువుబా...

POPULAR POSTS