Wednesday, August 26, 2020

రాధాష్టమి

రాధాష్టమి



శ్రీ కృష్ణాష్టమి తర్వాత 15 రోజులకు వచ్చే భాద్రపద శుక్ల అష్టమి () రాధాష్టమి పర్వదినం. ఆమె ఆరాధనకు ఇదొక అపురూప సమయం. లోకంలో పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపాలుగా మొట్టమొదట రాధాకృష్ణులనే పేర్కొంటాం. రాధ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపమే. పరమాత్మ అనేకానేక శక్తులలో రాధాదేవి ఒకరు. చాలామందికి తెలియని విషయమేమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షాన్ని పొందడానికి అత్యంత దగ్గరి దారి ఆయన హృదయాంశ అయిన రాధమ్మ అనుగ్రహం పొందడమే. హరేకృష్ణ మంత్రంలోని హరే అన్న పదం కూడా ఆమెను సూచించేదే. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా రాధాకృష్ణులను ఇద్దరినీ కలిపి ఆరాధిస్తున్నట్టే.

ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.

శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదినం సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.

🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏
bhaktipustakslu

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS