💐💐💐అసాధ్యములను సాధింపగలిగే హనుమత్ బడబానల స్తోత్రం..విభీషణకృతం...!!💐💐💐💐
అపరిమితమైన శక్తిని పొందవచ్చు. ఈ మంత్రం వల్ల తక్షణ ఫలితాన్ని పొందడమే కాకుండా, అనూహ్యమైన శక్తి సొంతమవుతుంది
హనుమత్ బడబానల స్తోత్రం ఈ స్తోత్రము నిత్యమూ పఠించదగినది.
దీనివలన శత్రువులపై సులభముగా జయింప బడుదురు. సకల విధములైన జ్వరములు భూతప్రేతాదికములు, శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును. అసాధ్యములను సాధింపగలదీ స్తోత్రము.
41 రోజులు రోజుకి 9 సార్లు చెప్పున్న నిష్ఠగా చేయండి
రావణాసురిడి సోదరుడు విభీషణుడు రచించినది ఈ హనుమత్ బడబానల స్తోత్రం.
హనుమంతుని శక్తి స్తుతిస్తూ మొదలయ్యి,
అన్ని రుగ్మతల నుండి,
అనారోగ్యాల నుండి
శత్రువుల నుండి కాపాడమని వేడుకుంటూ..
భయాల నుండి ఇబ్బందుల నుండి,
సర్వారిష్టాల నుండి విముక్తి చేయమని కోరుతూ
చివరగా స్వామి వారి ఆశీస్సులు,
ఆరోగ్యం అన్నిట సఫలీక్రుతులం అయ్యేటట్టు దీవించమని సాగుతుంది.
ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము.....
భక్తీ శ్రద్దలతో పారాయణం చేస్తే అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యపరమైన వాటినుండి తప్పక ఉపసమనం లభిస్తుందని పెద్దల ఉవాచ.
హనుమంతుడు చిరంజీవి... సాక్షాతుడు మహా శివుడే ఆంజనేయుడిగా అవతరించాడని హిందూ పురణాలు పేర్కొంటున్నాయి. శివుడి అంశంతో జన్మించిన హనుమంతుడు నేటికీ హిమాయలయాల్లో సజీవంగా ఉన్నాడని భావిస్తారు. త్రేతా యుగంలో రాముడికి నమ్మిన బంటు, సీతాన్వేషణకు బయలుదేరిన హనుమ లంకలో ప్రవేశించి భీభత్సం సృష్టించాడు. తనకు నిప్పు పెట్టాలని రాక్షస మూకలు ప్రయత్నిస్తే దానితోనే లంకను దహనం చేశాడు. అంజనీ సుతుని ఆరాధిస్తే దుష్ట శక్తులు, పిశాచాలు దరిచేరవని బలంగా నమ్ముతారు. అయితే హనుమాన్ మంత్రాన్ని రోజు ఉచ్చరించడం వల్ల శక్తి, ధైర్యంతోపాటు శారీరక సామర్థ్యం కూడా పొందుతారు
💐హనుమత్ బడబానల స్తోత్రం.💐
ఓం అస్య శ్రీహనుమద్బడబానల స్తోత్ర మహామంత్రస్య భగవాన్ శ్రీరామచంద్రః ఋషి: శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్రం జపం కరిష్యే ||
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహా హనుమతే ప్రశస్త పరాక్రమ సకల దిజ్ఞ్మండల యశోవితాన ధవళీకృత జగత్త్రతయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన సీతాశ్వాసన వాయుపుత్ర శ్రీరామామల మంత్రో పానకా ఉదధిబంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీరామలక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సహాయకర పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారీ గంభీరనాద సర్వ పాపగ్రహ నాశక సర్వజ్వరోచ్చాటన ఢాకినీ విధ్వంసన ||
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరా వరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల సర్వ భూతమండల సర్వ పిశాచమండ లోచ్చాటన భూతజ్వర, ఐకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థిక జ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ ఛింది ఛింది యక్ష బ్రహ్మరాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ ||
ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీమహాహనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఐం సౌం ఏహి ఓం హాం ఓం హ్రీం ఓం హ్రుం ఓం హైం ఓం హ్రౌం ఓం హ్రః ఓం నమో భగవతే శ్రీమహాహ నుమతే శ్రవణ చక్షు ర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హర హర. ఆకాశభవనం భేదయ ఖేదయ ఖేదయ మారాయ మారాయ మారాయ. వశ మాన్య ఆనయ ఆనయ శోషయ శోషయ శోషయ. మోహయ మోహయ మోహయ. జ్వాలయ జ్వాలయ జ్వాలయ ప్రహారాయ ప్రహారాయ ప్రహారాయ. సకల మాయం ఖేదయ ఖేదయ ఖేదయ ||
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహా హనుమతే సర్వగ్ర హోచ్చాటన పరబలం క్షోభయ ఖోభాయ సకల బంధ మోక్షం కురు కురు శిరః శూల గుల్మ శూల సర్వ శూలాన్ నిర్మూలయ నిర్మూలయ, నాగపాశా అనంత వాసుకి తక్షక కర్కోటక కాళియానాం యక్షకుల కులగత క్షితిగత రాత్రించరాదీనాం విషారిష్టాన్ నిర్విషం కురు కురు స్వాహా. రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరవిద్యా పర ప్రయోగాదీన్ ఛేదయ ఛేదయ. స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాన్ ప్రకటయ ప్రకటయ. సర్వారిష్టాన్ నాశయ నాశయ సర్వ శత్రూన్ నాశయ నాశయ అ సాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహ ||
– ఇతి విభీషణకృత హనుమత్ బడబానల స్తోత్రం
ఫలస్తుతి:
శత్రువులు సులభముగా జయింపడుదురు, సర్వ రోగ నివారణార్దం, అసాద్య సాదక స్తోత్రం.
జై శ్రీరామ్..నమో ఆంజనేయ..!!
శ్రీ రామరామ రామేతీ రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే.
No comments:
Post a Comment