Tuesday, August 25, 2020

దశమహావిద్యాస్తోత్రము

#దశమహావిద్యాస్తోత్రము..!!

మహా గౌరి మహాకాళ ప్రియ సఖీ గౌరీ 
కౌశికీ నామ విఖ్యాతే మహాకాళీ  నమోస్తుతే ||

ముండమాలా విభూషితే నీలరూపిణీ ఏకజటా  నీలసరస్వతీ నామ విఖ్యాతే తారాదేవీ నమోస్తుతే ||

రుథిరా పానప్రియే ఖండిత శిరో రూపిణీ
రక్తకేశి చిన్నబాలా నామ విఖ్యాతే చిన్నమస్తా నమోస్తుతే ||

షోడశ కళాప్రపూర్ణే ఆద్యశక్తి రూపిణీ శ్రీవిద్యా పంచవక్త్రా నామ విఖ్యాతే షోడశీ నమోస్తుతే ||

పాశాంకుశధరీ దుర్గమాసుర సం హారిణీ 
శతాక్షరీ శాకంభరీనామ విఖ్యాతే భువనేశ్వరీ నమోస్తుతే ||

అరుణాంబరధారిణి ప్రణవరూపిణీ యోగీశ్వరీ ఉమానామ విఖ్యాతే త్రిపురభైరవీ నమోస్తుతే ||

దుష్టాభి చారధ్వంసినీ కాకధ్వజ రథారూఢే 
సుతరతామసీ నామవిఖ్యాతే ధూమావతీ నమోస్తుతే ||

పీతాంబరధారీ శత్రు భయ నివారిణీ 
జ్వాలాముఖీ వైష్ణవీ నామ విఖ్యాతే బగళాముఖీ నమోస్తుతే ||

అర్థచంద్ర ధారీ కదంబ వన వాసినీ వాగ్దేవీ సరస్వతీ నామవిఖ్యాతే  మాతంగీ నమోస్తుతే ||

సువర్ణకాంతి సమన్వితే మహావిష్ణుసహచారిణి 
భార్గవీ మహాలక్ష్మీనామ విఖ్యాతే కమలా నమోస్తుతే ||

ఫలశృతి :-
దశమహావిద్యా స్తోత్రం 
సర్వ శత్రు,రోగ నివారణం!
సర్వ సంపత్కరం పుణ్యం 
పుత్రపౌత్రాభివర్ధనం ||

అత్యంత శక్తివంతమైన అత్యంత పవిత్రమైన 
ఈ దశమహావిద్య స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం పఠిస్తారో వారికి సర్వ శత్రు వినాశనం జరుగుతుంది. సకల రోగాలు నివారణం అవుతాయి. సర్వ సమృద్ధి, సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సకల శుభాలతో పుత్రపౌత్రభివృద్ధి కలిగి వారి వంశం వర్ధిల్లుతుంది అని ఫలశృతి..!!

#అమ్మ_మనకు_అండగా_ఉంటే_అన్నీ_మనవెంటే.!

// ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః//

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS