Wednesday, August 26, 2020

ద్విపుష్కరయోగం ,త్రిపుష్కర యోగం

 ద్విపుష్కరయోగం ,త్రిపుష్కర యోగం



ద్విపుష్కర , త్రిపుష్కర యోగాలు   ధర్మం విధి నిషేధాత్మకం , కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయరాదు. కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉదాహరణకు త్రిపుష్కర , ద్విపుష్కర యోగాల్లో వస్తు లాభాలు, నష్టాలు , డబ్బు ఇవ్వడం , అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతం అవుతూ ఉంటాయి. మన చేతిలో లేని నష్టాలు మొదలగువాని విషయం ఎలా ఉన్నా మనం చేసే పనుల్తో డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతమైతే మరల మరల చేయాల్సి వస్తే కష్టం కదా !  అందుకని ఆయా సమయాల్లో ఇవ్వవలసినవి గాని ఇష్టపూర్వకంగా ఇచ్చేవి ఇవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. 

*ద్విపుష్కర యోగం:* ఆది , మంగళ , శనివారాలు. విదియ , సప్తమి , ద్వాదశి తిథులు. ధనిష్ట , చిత్త , మృగశిర నక్షత్రాలు కలిసినపుడు ద్విపుష్కర యోగం. ఈ రోజుల్లో వస్తువు పోయినా , లాభించినా ఆ క్రియలు మరల జరుగుతాయి. 

*త్రిపుష్కర యోగం:* ఆది , మంగళ , శనివారాలు , విదియ, సప్తమి , ద్వాదశి తిథులు. విశాఖ , ఉత్తర , పూర్వాభాద్ర , పునర్వసు , కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు కలిస్తే త్రిపుష్కరయోగం. ఈ రోజుల్లో మృతి , వస్తులాభాలు , నష్టాలు, డబ్బు ఇవ్వడం మొదలైనవి మూడుసార్లు పునరావృతమవుతాయి. కాబట్టి ఆ రోజుల్లో మరల మరల జరగరాదనుకునే పనులు చేయకుండా జాగ్రత్త పడాలి.   ఈ యోగాలలో దానధర్మాలు చేయవచ్చు గానీ , లౌకిక కార్యాలలో డబ్బు ఇవ్వకపోవడం మంచిది. ఈ రోజులలో అప్పిస్తే తిరిగిరాదు సరికదా ! మనమే మరల మరల ఇస్తుండాల్సి వస్తుంది. అత్యవసరం కానపుడు మందులు వాడకండి. వాడితే మళ్ళీ మళ్ళీ వాడాల్సి వస్తుంది. అదే విధంగా ఈ రోజుల్లో ఆపరేషన్లు చేయించకుండా ఉంటే మంచిది. మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఇబ్బంది. మళ్ళీ మళ్ళీ చేయవచ్చు అనే పనులు చేయాలి. మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం వలన ఇబ్బంది కలిగే పనులు చేయకండి. ఇలాగే అప్పు చేయడానికి సోమవారం మంచిది. త్రిపుష్కర , ద్విపుష్కర యోగాలు లేని మంగళవారం అప్పు తీర్చడానికి మంచిది. మంగళవారం అప్పు కొంతైనా తీరుస్తే అప్పుగా త్వరగా తీరుతుంది. బుధవారం అప్పు ఇవ్వడానికి గాని , తీసుకోవడం గాని లేదా దేనికైనా డబ్బు ఇవ్వడంగాని మంచిది కాదు.   

అప్పు ఇస్తే తిరిగి వసూలు కావడానికి ఇబ్బంది కలిగే నక్షత్రాలు ఉత్తర , ఉత్తరాభాద్ర , ఉత్తరాషాఢ , పుబ్బ , పూర్వాషాఢ , పూర్వాభాద్ర , విశాఖ , రోహిణి , కృత్తిక , మఖ , ఆర్ద్ర , భరణి , ఆశ్లేష , మూల , జ్యేష్ఠ , స్వాతి.

No comments:

Post a Comment

RECENT POST

మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.

చాలా బాగుంది - పూర్తిగా చదవండి మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.  ఆమె తన ఐహికమైన బరువుబా...

POPULAR POSTS