Wednesday, August 26, 2020

ఆరోగ్యం కోసం సూర్యని మంత్రం


ఆరోగ్యం కోసం సూర్యని మంత్రం

*సూర్యమంత్రం*

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!

అర్థం
ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా  నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు.  శాంతిని వొసంగువాడవు.
మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము. 

సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం ,అలా నమస్కారం చేస్తూ 12 సూర్య నామాలు చదివే సమయం లేదా ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకమ్ కనీసం 12 సార్లు అయిన జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు.. అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేఖీ అధికంగా ఉంటుంది.. ఈ రెండు వాక్యల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది.. పిల్లలు తల్లితండ్రుల మాట వింటారు..

సూర్య ద్వాదశ నామాలు

1.ఓం మిత్రాయనమః
2.ఓం రవయేనమః
3.ఓం సూర్యాయనమః
4.ఓం భానువేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూష్ణేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8.ఓం మరీచయేనమః
9.ఓం ఆదిత్యా యనమః
10.ఓం సవిత్రేనమః
11. ఓం అర్కాయనమః
12. ఓం భాస్కరాయనమః

ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది.

 *నమో సర్వం సూర్య నారాయనమః*

No comments:

Post a Comment

RECENT POST

మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.

చాలా బాగుంది - పూర్తిగా చదవండి మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు.  ఆమె తన ఐహికమైన బరువుబా...

POPULAR POSTS