Wednesday, August 26, 2020

దశమహావిద్యలు

దశమహ విద్యాలు
దశమహావిద్యలు

దశమహా విద్యలలో  ఒక్కో దేవత యొక్క మంత్రం, గాయత్రి, ఆ దేవత యొక్క బైరావ నామం , మంత్రం,ఒక్కొ రాసి వ్వారి కి వారి ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆ గ్రహం వారు ఏ దేవతను ఏ మంత్రాన్ని జపించాలి ఇందులో వివారంగా ఉంది గమనించండి.

🙏దశ మహా దేవతల్లో🙏
కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి

🌷1.కాళీ 🌷

🙏శ్రీ కాళీ మంత్రం:

"ఓం క్రీం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం దక్షిణకాళికే క్రీం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం స్వాహా" 

🙏కాళీ  గాయత్రి :
               
ఓం కాళికాయైన విద్మహే, 
శ్మశాన వాసిన్యై చ ధీమహి,
తన్నో అఘోర ప్రచోదయాత్ ||  

🌿శ్రీ కాళీ మాత క్షేత్రపాలకుడు: కాలభైరవుడు 

"ఓం క్రీం క్రీం కాళబైరవాయ ఫట్ స్వాహా"
           or 
"ఓం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్"

🎋గ్రహము: శని 

"ఓం హ్రీ0 శ్రీ0 శనేశ్చరాయ గ్రహచక్రవర్తిన్యై క్లీం ఐం సః స్వాహా "

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

🌷2 .తారా 🌷

🙏శ్రీ తారా మంత్రం:

"ఓం హ్రీ0 త్రీ0 స్త్రీ0 హుం ఫట్ స్వాహా"  
           or 
"ఐం ఓం హ్రీ0 క్లీ0 హుం  ఫట్ ఐం" 
                                              
🙏శ్రీ తారా గాయత్రి :
    
"ఓం ఏక జటాయై చ విద్మహే,
నీల సరస్వత్యై చ ధీమహి,
తన్నో తారా ప్రచోదయాత్ ||" 

🌿శ్రీ తారా మాత క్షేత్రపాలకుఁడు : అక్షోభ్య బైరవుడు 

"ఐం ఓం హ్రీ0 క్లీం అక్షోభ్య భైరవాయ హుం ఫట్ ఐం స్వాహా" 
                  or 
"మహా ఘోర విష హరయా లోకతారినే అక్షోభ్య భైరవాయ స్వాహా"

🎋గ్రహము: గురుడు

"ఓం ఐం క్లీం బ్రు0 బృహస్పతయే నమః స్వాహా"
                or 
"ఓం హ్రీ0 శ్రీ0 బ్లీ0 ఐం గ్లౌ0 గ్రహాధిపతయే బృహస్పతయే వీం ఠ: శ్రీ0 ఠ: ఐం ఠ: స్వాహా" 

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల.. శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

🌷3 .షోడశి( త్రిపురసుందరి ) 🌷

🙏శ్రీ షోడశీ మంత్రం :
               
" హాది,కాది "విద్య ఇందులో పంచదసి రాయకూడదు

🙏శ్రీ షోడశీ గాయత్రి :
                
ఓం త్రిపురాయై చ విద్మహే ,
క్లీ0 కామేశ్వర్యై చ ధీమహి ,
తన్నో సౌస్తన్న : ప్రచోదయాత్ ||

🌿క్షేత్రపాలకుడు: పంచవక్త్ర భైరవుడు 

"ఓం హ్రీ0 హ్రీ0 సకలహ్రీ0 పంచవక్త్ర భైరవాయ నమః"
                or 
"ఓం పంచవక్త్రాయ పంచభూత సృష్టికర్తవే మహా భైరవాయ స్వాహా"

🎋గ్రహం: శుక్రుడు 

" ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః స్వాహా"
                 or 
" ఓం శా0 శ్రీ0 శూ0 దైత్యగురో సర్వాన్ కామన్ పూరయ పూరయ స్వాహా" 

 అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

🌷4.భువనేశ్వరీ గాయిత్రి🌷

🙏శ్రీ భువనేశ్వరీ మంత్రం  :
                               
"  హ్రీ0 "

🙏శ్రీ భువనేశ్వరీ గాయత్రి :
                             
 ఓం నారాయణ్ణ్యే చ విద్మహే ,
 భువనేశ్వర్యై  చ ధీమహి ,
 తన్నో  దేవీ ప్రచోదయాత్ || 

🌿క్షేత్ర పాలకుడు :  త్ర్యంబక భైరవుడు 

" ఓం హ్రీ0 త్ర్యంబకాయ హ్రీ0 స్వాహా "
                      or 
" ఓం త్ర్యంబకాయ భువనపాలకాయ మహా భైరవాయ స్వాహా "

🎋గ్రహము: చంద్రుడు 

" ఓం శ్రీ0 క్లీం హం రం చం చంద్రాయ నమః స్వాహా "

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

🌷5. చిన్నమస్త దేవి🌷
 
🙏మంత్రం :
" శ్రీ0 హ్రీ0 క్లీ0 ఐ0 వజ్రవైరోచనియై  హూ0 హూ0 ఫట్ స్వాహ "

🙏శ్రీ ఛిన్నమస్తా మాతా గాయత్రి :

వైరోచనియై  చ విద్మహే,
ఛిన్నమస్తాయై చ ధీమహి ,
తన్నో దేవీ ప్రచోదయాత్  || 

🌿శ్రీ ఛిన్నమస్తా క్షేత్రపాలకుడు: కబంధ  భైరవుడు 

"ఓం శ్రీ0 హ్రఔ0 క్లీం ఐం కబంధ భైరవాయ హుం ఫట్ స్వాహా"
                      or 
"కర్షణ బంధాయ ఛిన్నమస్తాయ వజ్రప్రధాతాయా కబంధ భైరవాయ స్వాహా"

🎋గ్రహము: రాహు 

" ఓం క్రీ0 క్రీ0 హుం హుం టం టం కధారిణే రాహవే రం హ్రీ0 శ్రీ0 భై0 స్వాహా "

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేలసూర్యుల కాంతితో ప్రకాశించే  ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది. 

🌷6. త్రిపుర భైరవి🌷

🙏శ్రీ త్రిపుర భైరవీ మంత్రం :

" హసై  హసకరి  హసై "

🙏శ్రీ త్రిపుర భైరవీ గాయత్రి :
                               
 త్రిపురాయై చ విద్మహే ,
 భైరవియై చ ధీమహి,
 తన్నో దేవీ ప్రచోదయాత్ || 

🌿శ్రీ త్రిపుర భైరవీ క్షేత్ర పాలకుడు :  కాళభైరవుడు 

" ఓం క్రీ0 క్రీం  కాలభైరవాయ ఫట్ స్వాహా "
                                 or 
" ఓం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్ స్వాహా "

🎋గ్రహము: బుధుడు 

" ఓం హ్రా0 క్రో0 గం గ్రహనాదాయ బుధాయ స్వాహా "

దశ మహావిద్యలలో 6వ మహావిద్య  భైరవి ఈ దేవిని ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది దశ మహావిద్యలు -

 🌷7. ధూమవతీ గాయిత్రి 🌷

🙏శ్రీ ధూమావతి మంత్రం :
                                
" ధూం  ధూం ధూమావతి ఠ: ఠ: "

🙏శ్రీ ధూమావతి గాయత్రి : 

 ఓం ధూమావత్యై చ విద్మహే,                   
 సంహారిన్యై  చ ధీమహి,
 తన్నో ధూమా ప్రచోదయాత్ || 

🌿శ్రీ ధూమావతి క్షేతపాలకుడు : కాలభైరవుడు 

" ఓం క్రీ0 క్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్ స్వాహా "
or 
"ఓ ఓం క్రీ0 క్రీ0 హ్రీ0 హ్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్ స్వాహా "

🎋గ్రహము : కేతువు 

" ఓం హ్రీ0 కౄ0 కౄరరూపిణే కేతవే ఐం సౌ: స్వాహా "

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది. 

🌷8.భగళాముఖి గాయిత్రి 🌷

🙏శ్రీ  బగళా ముఖీ మాత మంత్రం :

"  ఓం హ్ల్రీం  బగళా ముఖీ సర్వ దుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వా0  కీలయ బుద్ధి0 వినాశయ హ్ల్రీం ఓం స్వాహా || " 

🙏 శ్రీ బగళా ముఖీ గాయత్రి :

  బగళాయై చ విద్మహే,
  స్తంభిన్యై చ ధీమహి,
  తన్నో పీతాంబరీ ప్రచోదయాత్ || 

🌿శ్రీ బగళా క్షేత్రపాలకుడు :  ఏకవక్త్ర భైరవుడు 

" ఓం  హ్ల్రీం ఏకవక్త్ర భైరవాయ హ్ల్రీం ఓం స్వాహా "
or 
" అనేక వక్త్రాయ విచింత్యాయ సర్వ స్వరూపిణే మహా భైరవాయ స్వాహా "

🎋గ్రహము: కుజుడు 

"ఓం ఐం హ్మౌ0 శ్రీ0 ద్రాం కం గ్రహాధిపతయే భౌమాయ స్వాహా "

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

🌷9 .మాతంగీ గాయిత్రి🌷

🙏శ్రీ మాతంగీ మంత్రం:

" ఓం హ్రీ0 క్లీం హుం మాతంగ్యై ఫట్ స్వాహా "

🙏శ్రీ మాతంగీ గాయత్రి :

ఓం మాతంగ్యై చ విద్మహే, 
ఉచ్చిష్ట చాండాలిన్యై చ ధీమహి,
తన్నో దేవి ప్రచోదయాత్  || 

🌿శ్రీ మతంగీ క్షేత్రపాలకుడు: మతంగ భైరవుడు 

" ఓం హ్రీ0 క్లీం హుం మతంగ భైరవాయ సం నమః స్వాహా "
or 
" ఓం హృదయ విష్టవే మతంగ భైరవాయ వామ తంత్రేషు ఉచ్చిష్ట మహాత్మనే నమః "

🎋గ్రహము : రవి 

"ఓం హ్మౌ0 శ్రీ0 ఆ0 గ్రహాధిరాజాయ ఘృణి సూర్య ఆదిత్యాయ ఓం స్వాహా "

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

🌷10. కమలాత్మిక గాయత్రి🌷

🙏శ్రీ కమలాత్మికా మంత్రం :
                               
ఓం ఐం హ్రీ0 శ్రీ0 క్లీం జగత్ ప్రసూత్యై నమః ||
                              OR             
ఓం శ్రీ0 హ్రీ0 శ్రీ0 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ0 హ్రీ0 శ్రీ0 మహాలక్ష్మి యై నమః  || 
                                                                 
🙏శ్రీ కమలాత్మికా గాయత్రి :
                         
   ఓం కమలాయై చ విద్మహే,
   జగత్ ప్రసూత్యై చ ధీమహి,
   తన్నో దేవీ ప్రచోదయాత్  || 

🌿శ్రీ కమలాత్మికా క్షేత్రపాలకుడు : సదాశివ భైరవుడు 

" ఓం ఐం శ్రీ0 సదాశివ భైరవాయ సం నమః స్వాహా "
or 
" శం కరోతి సదాశివాయ మహా భైరవాయ స్వాహా "

🎋గ్రహము :శుక్రుడు 

" ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః "

( మూలమంత్రం: ఓం క్లీం శ్రీం లక్ష్మీదేవ్యై నమః ) పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తి పొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్య తిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. శ్రీ లలితాంబికాయై నమః..

🌷శ్రీ మాత్రే నమః.🌷

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS