Wednesday, April 2, 2025

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు – 


భూమండలంపై గ్రహాల ప్రభావం:
జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అనేది పాపగ్రహంగా ప్రసిద్ధి పొందింది. ఏలినాటి శని అనేది ఒక రాశిలో శని 7 ½ సంవత్సరాలు సంచరించే కాలాన్ని సూచిస్తుంది. ఇది మూడు దశలుగా ఉంటుంది: ముందువైపు (2 ½ సంవత్సరాలు), మధ్య భాగం (2 ½ సంవత్సరాలు), మరియు చివరి భాగం (2 ½ సంవత్సరాలు). ఈ కాలంలో వ్యక్తికి శని ప్రభావం అనుభవమవుతుంది. అయితే, కొన్ని రాశులు, లగ్నాలపై శని అనుకూల ఫలితాలను ఇస్తుంది లేదా వ్యతిరేక ప్రభావం చూపించదు.

ఏలినాటి శని బాధపడని రాశులు:

1. మిథున రాశి (Gemini):

శని మిథున రాశిలో శత్రువుగా ఉండకపోవడం వల్ల, ఈ రాశి వారికి ఏలినాటి శని బాధ తక్కువగా ఉంటుంది.

శని బుధుని మిత్రుడుగా ఉండడం వల్ల అనుకూల ఫలితాలు పొందే అవకాశముంటుంది.

2. కన్య రాశి (Virgo):

శని, బుధుని మిత్రుడే కావడంతో కన్యరాశి వారికి ఏలినాటి శని పెద్దగా దుష్ప్రభావం చూపదు.

ఈ రాశి వారు శని ప్రభావం కింద ఉన్నప్పటికీ స్థిరమైన విజయాలు సాధిస్తారు.

3. ధనుస్సు రాశి (Sagittarius):

శని ధనుస్సు రాశిలో సంచరించినప్పుడు గురుని మిత్రుడుగా ఉండడం వల్ల తీవ్ర దుష్ఫలితాలు ఉండవు.

ఆధ్యాత్మిక ప్రగతి, గురు అనుగ్రహం కలుగుతుంది.

4. మీనం రాశి (Pisces):

శని మీనం రాశిలో సంచరించినప్పుడు తీవ్ర దోషం ఉండదు.

గురు అనుకూలత వల్ల శని ప్రభావం మృదువుగా ఉంటుంది.

ఏలినాటి శని ప్రభావం లేని లగ్నాలు:

1. మిథున లగ్నం:

శని మిత్ర గ్రహంగా ఉండడం వల్ల దోషప్రభావం తగ్గుతుంది.

2. కర్కాటక లగ్నం:

శని 7వ, 8వ స్థానాధిపతిగా మంచి ఫలితాలు ఇస్తుంది.

3. ధనుస్సు లగ్నం:

శని 2వ, 3వ స్థానాధిపతిగా అనుకూల ఫలితాలు ఇస్తుంది.

4. మీనం లగ్నం:
. మకర లగ్నం (Capricorn Ascendant):

లగ్నాధిపతి శని: మకర లగ్నంలో శని స్వరాశిలో ఉంటుందనేది అత్యంత అనుకూలమైన అంశం.

శని స్వగ్రహంలో ఉండడం వల్ల శని దశలు అనుకూలంగా ఉంటాయి.

ఏలినాటి శని సమయంలో వ్యక్తికి కొంత శ్రమపడినా, దీర్ఘకాలికంగా సత్ఫలితాలు కలుగుతాయి.

శని అధిక బాధ కలిగించకపోయినా, ఓర్పు పరీక్షించవచ్చు.

ఈ లగ్నంలో ఏలినాటి శని కార్యసిద్ధిని దారితీస్తుంది.

 లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలంలో విజయాలు, స్థిరమైన ఆర్థిక ప్రగతి.

కుంభ లగ్నం (Aquarius Ascendant):

లగ్నాధిపతి శని: ఇది శని స్వరాశి కావడం వల్ల, ఈ లగ్నంలో శని బలంగా ఉంటుంది.

ఏలినాటి శని సమయంలో శ్రమ ఎక్కువగా అనిపించినా, దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలు కలుగుతాయి.

కుంభ లగ్నంలో శని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

వ్యక్తి కార్యదీక్ష, ధైర్యసాహసాలతో ముందుకు సాగతాడు.

సానుకూలమైనదే. క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే విజయవంతం అవుతారు.

వృషభ లగ్నం (Taurus Ascendant):

శని యోగకారక గ్రహం: వృషభ లగ్నంలో శని 9వ, 10వ స్థానాధిపతిగా ఉండి యోగకారకుడు అవుతుంది.

ఏలినాటి శని సమయంలో శ్రమ, సవాళ్లు ఎదురైనా, శని మంచి ఫలితాలు ఇస్తుంది.

ఈ కాలంలో వ్యక్తి కృషితో మానసిక స్థైర్యం పెంపొందించుకుంటాడు.

దీర్ఘకాలిక ప్రాజెక్టుల్లో, ఆర్థిక వ్యవహారాల్లో విజయవంతం అవుతారు.

ప్రభావం: శ్రమ ఎక్కువైనా శని అనుకూలంగా మారి కీర్తి, ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది.

మకర, కుంభ లగ్నాల్లో శని స్వరాశిలో ఉండడం వల్ల శని ప్రభావం శుభదాయకంగా ఉంటుంది.

వృషభ లగ్నంలో శని యోగకారకుడిగా ఉండి కల్యాణకారక ఫలితాలు ఇస్తుంది
శని 11వ, 12వ స్థానాధిపతిగా ఉండి అధికంగా కష్టాలు కలిగించదు.

ముగింపు:
జ్యోతిషశాస్త్ర ప్రకారం, శని ప్రభావం ప్రతి రాశికి వేరుగా ఉంటుంది. అయితే, కొన్ని రాశులు, లగ్నాలు శని ప్రభావాన్ని తక్కువగా అనుభవిస్తాయి. శని దశల్లో దైవభక్తి, ధర్మాచరణ, శనిగ్రహ ఉపాసన ద్వారా శని అనుగ్రహాన్ని పొందవచ్చు

Tuesday, April 1, 2025

తెలుగు సంవత్సరాల పేర్లు-వాటి అర్థాలు!!!*

తెలుగు సంవత్సరాల పేర్లు-వాటి అర్థాలు!!!*


1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.
2. విభవ - వైభవంగా ఉండేది.
3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.
4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.
7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.
10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
11. ఈశ్వర... పరమేశ్వరుడు.
12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.
13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.
14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.
15. వృష ... చర్మం.
16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.
17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.
19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.
21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.
22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.
23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.
24. వికృతి... వికృతమైనటువంటిది.
25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.
26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.
27. విజయ... విశేషమైన జయం కలిగినది.
28. జయ.... జయాన్ని కలిగించేది. 
29. మన్మథ... మనస్సును మధించేది.
30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.
31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.
32. విలంబి... సాగదీయడం.
33. వికారి.... వికారం కలిగినది.
34. శార్వరి... రాత్రి.
35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.
36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.
37. శోభకృత్... శోభను కలిగించేది.
38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.
39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.
40. పరాభవ ... అవమానం.
41. ప్లవంగ... కోతి, కప్ప.
42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.
43. సౌమ్య... మృదుత్వం.
44. సాధారణ... సామాన్యం.
45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.
46. పరీధావి... భయకారకం.
47. ప్రమాదీచ... ప్రమాద కారకం.
48. ఆనంద... ఆనందమయం.
49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.
50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.
51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.
53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.
54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.
55. దుర్మతి... దుష్ట బుద్ధి.
56. దుందుభి ... వరుణుడు.
57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.
58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.
59. క్రోదన... కోప స్వభావం కలది.
60. అక్షయ... నశించనిది

                 స్వస్తి🙏🌹

Sunday, March 30, 2025

కాలభైరవాష్టకం

కాలభైరవాష్టకం

1.దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్
నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧||

ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు. పామును యజ్ఞోపవీతంగా ధరించే వాడు. తల మీద చంద్ర వంక కలవాడు. అత్యంత కరుణ గల వాడు. నారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించ బడే వాడు. దిగంబరుడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

2. భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨||

అనేక సూర్యుల తేజస్సు కలవాడు. జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు. నల్లని కంఠము కలవాడు. కోరిన కోరికలు తీర్చేవాడు. మూడు కన్నులు కలవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

3. శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩||

త్రీశూలాన్ని ఖట్వాయుద్ధాన్ని వరుణ పాషాన్ని దండాన్ని ధరించిన వాడు. ఆది దేవుడు. నల్లని శరీరం కలవాడు. నాశనము లేనివాడు. ఎన్నటికీ తరగని వాడు. భయంకరమైన పరాక్రమం కలవాడు. వింత తాండవం చేసేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

4. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ |
వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪||

ఇహలోక సౌఖ్యలను మోక్షాన్ని ఇచ్చేవాడు. గొప్ప అందమైన ఆకారం కలవాడు. భక్తులను బిడ్డలుగా చూసుకునే వాడు. స్థిరంగా నిలిచిన వాడు. లోకాలన్నిటిని నియంత్రించేవాడు. ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డాణమును ధరించిన వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

5. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫||

ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ పరులను నాశనం చేసేవాడు. కర్మ బంధాలను నశింపజేస్తూ మంచి శుభాలను అందించేవాడు. బంగారు రంగు శరీరము పై పాములనే తాళ్లుగా ధరించిన వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

6. రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ |
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬||

రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు. నిత్యుడు, అద్వితీయుడు, అందరికీ ఇష్ట దేవుడు గా ఉండే వాడు. మచ్చలేనివాడు. మృత్యు దేవత గర్వాన్ని నశింపజేసే వాడు. ఆ దేవత భయంకరమైన కోరల నుండి, విడిపించేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

7. అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭||

బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పేల్చి వేసే ప్రళయకారకుడు. తన కనుచూపు మాత్రం చేత పాపాలను నశింప చేసేవాడు. కఠినంగా క్రమ శిక్షణ చేసేవాడు. అణిమ, మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను అందించే వాడు. పుర్రెల దండ ధరించే వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

8. భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮||

భూతాల సైన్యానికి నాయకుడైన వాడు. లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించే వాడు. కాశీలో స్థిరపడే లోకుల పాప పుణ్యాలను శోధిస్తూ వాళ్ళకు తగిన పుణ్య ఫలాన్ని అందించే వాడు. నీతి మార్గమును ఎరిగిన పండితుడు అత్యంత ప్రాచీనుడు లోకాలన్నిటికి అధిపతి అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

ఫల శ్రుతి.....

కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯||

ఎవరైతే అందమైన, జ్ఞానాన్ని, మోక్షాన్ని అందించే, కొంగ్రొత్త పుణ్యాన్ని పెంచే, దుఃఖాన్ని వ్యామోహాన్ని దీనత్వాన్ని లోభి గుణాన్ని కోప స్వభావాన్ని కష్టాన్ని నాశనం చేసే ఈ కాలభైరవ అష్టకాన్ని ప్రతి దినము చదువుతారో వాళ్ళు తప్పక కాలభైరవుడి పాద సన్నిధికి చేరుకుంటారు. ఇది తథ్యం.

Friday, March 28, 2025

కామాక్షి అమ్మవారి ఆలయంలో కామాక్షి అమ్మవారు 5 రూపాలలో ఉంటారు..

కామాక్షి అమ్మవారి ఆలయంలో కామాక్షి అమ్మవారు 5 రూపాలలో ఉంటారు..

1. మూల విరాట్టు అయిన కామాక్షి 
2. ⁠అటు పక్కనే ఉన్న తపో కామాక్షి
3. ⁠ప్రధానాలయం వెనక వైపున ఉన్న విమాన కామాక్షి
4. ⁠లక్ష్మి దేవి, సరస్వతి దేవీలను కుడి వైపు, ఎడమ వైపు పెట్టుకొని మధ్యలో ఉంటారు ఉత్సవ కామాక్షి..
5. ⁠స్వర్ణ కామాక్షి..
#ప్రస్తుతం ఈ స్వర్ణ కామాక్షి తంజావూరు లో ఉన్నారు... ఎందుకు అక్కడికి వెళ్లారో ఇప్పుడు తెలుసుకుందాము....
ఒకప్పుడు శత్రువులు దండయాత్ర భారీ నుండి కాపాడడానికి... ఈ ఆలయంలో ఉన్న అర్చకులు ఆ స్వర్ణ మయంతో చేసిన కామాక్షి విగ్రహాన్ని కాంచీపురం నుండి తంజావూరు తీసుకెళ్లి దాచారు... కొంత కాలం తర్వాత అమ్మవారు అక్కడే ఉండడానికి కొన్ని సంకేతాలు ఇచ్చారు.. అలా స్వర్ణ కామాక్షి తంజావూరులో కొలువయ్యారు..
#అయితే కాంచీపురంలో స్వర్ణ కామాక్షి ఉన్న స్థలం ఖాళీగా ఉంచకూడదు అన్న భావన చేసి.. అక్కడ అమ్మవారీ యొక్క స్వర్ణ పాదుకలు పెట్టారు... 
#మనం కేవలం తంజావూరులో మాత్రం స్వర్ణ కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము...
#తంజావూరులో కొలువైన బృహదీశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నాక.. ఈ స్వర్ణ కామాక్షి ఆలయానికి వెళ్తారు...
#సాధారణంగా కామాక్షి అమ్మవారు కూర్చున్న భంగిమలో ఉంటారు.. ఇక్కడ తంజావూరులో నిల్చొని ఉన్న భంగిమలో దర్శనం ఇస్తారు స్వర్ణ కామాక్షి అమ్మవారు...
#శుభ శుక్రవారం 
సేకరణ:-

భైరవ_దిగ్బంధననం ప్రక్రియా గురించి....

భైరవ_దిగ్బంధననం ప్రక్రియా గురించి....
🔥🙏🔥


#సాధకుడు "తీవ్ర సాధన" చేస్తున్నప్పుడు బయట నుంచి ఎటువంటి ఆటంకం ఇబ్బంది కలగకుండా "Protection Shield" లా పనిచేస్తుంది ఈ దిగ్బంధనం..... తీవ్రసాధన చేస్తున్నప్పుడు సాధకుడు తప్పకుండా చేయవలసిన, ఆచరించవలసిన ప్రక్రియ..... ఈ దిగ్బంధనం మంత్రం కేవలం భైరవ సాధకులకే కాక మిగతా దేవతలకు కూడా చేసుకోవచ్చు..... లేదా మీకు తెలిసిన ఇతరత్రా దిగ్బంధన మంత్రం అయినా పరవాలేదు.......

(పూజలో, పారాయణంలో, జపవేళ సంకల్పం చెప్పుకొని - ఈ దిగ్బంధనం చేసి సాధన చేయవచ్చును..)

1. 🔥 #తూర్పు_దిక్కు:
ప్రాచ్యాం దిశి అసితాంగ భైరవో దేవతా హంసవాహనః
కృష్ణ వర్ణః కమండల హస్తః అసితాంగ భైరవో బధ్నాతు భైరవ మండలం.

#అసితాంగ_భైరవ! చతుర్లక్షకోటి యోగినీసహిత అసితాంగ-భైరవ మండలం ప్రత్యక్షం 
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

2. 🔥 #ఆగ్నేయం_దిక్కు:
ఆగ్నేయ్యాం దిశి రురు భైరవో దేవతా వృషభవాహనః
శుద్ధ స్పటిక వర్ణః, టంకహస్తః రురు భైరవో బధ్నాతు భైరవ మండలం.

#రురు_భైరవ! సప్తలక్షకోటి యోగినీ సహిత రురు-భైరవ మండలం ప్రత్యక్షం
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

3. 🔥 #దక్షిణం_దిక్కు:
యామ్యాం దిశి చండ భైరవో దేవతా, శిఖివాహనః
కృష్ణ వర్ణః ధనుర్బాణ ధరః చండభైరవో బధ్నాతు భైరవ మండలం.

#చండ_భైరవ! నవలక్షకోటి యోగినీ సహిత చండ-భైరవ మండలం ప్రత్యక్షం
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

4. 🔥 #నైఋతి_దిక్కు:
నైరృత్యాం దిశి క్రోధ భైరవో దేవతా, గరుడవాహనః
కృష్ణ వర్ణః శంఖ చక్రగదాహస్తః క్రోధభైరవో బధ్నాతు భైరవ మండలం.

#క్రోధ_భైరవ! ద్వాదశ లక్షకోటి యోగినీ సహిత క్రోధ-భైరవ మండలం ప్రత్యక్షం
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

5. 🔥 #పడమర_దిక్కు:
ప్రతీచ్యాం దిశి ఉన్నత్త భైరవో దేవతా | అశ్వవాహనః
హేమ వర్ణః ఖడ్గ ఖేటకహస్తః ఉన్మత్త భైరవో బధ్నాతు భైరవ మండలం.

#ఉన్మత్త_భైరవ! షోడశలక్షకోటి యోగినీ సహిత ఉన్మత్త-భైరవ మండలం ప్రత్యక్షం
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

6. 🔥 #వాయువ్యం_దిక్కు:
వాయవ్యాం దిశి కపాల భైరవో దేవతా గజవాహనః
పద్మ వర్ణః వజ్రహస్తః కపాలభైరవో బధ్నాతు భైరవ మండలం.

#కపాల_భైరవ! వింశతి లక్షకోటి యోగినీ సహిత కపాల-భైరవ మండలం ప్రత్యక్షం 
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

7. 🔥 #ఉత్తర_దిక్కు:
ఉదీచ్యాం దిశి భీషణ భైరవో దేవతా హరివాహనః
రక్త వర్ణః కపాలశూలహస్తః, భీషణభైరవో బధ్నాతు భైరవ మండలం.

#భీషణ_భైరవ! చతుర్వింశతి లక్షకోటి యోగినీ సహిత భీషణ-భైరవ మండలం ప్రత్యక్షం
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

8. 🔥 #ఈశాన్యం_దిక్కు:
ఐశాన్యాం దిశి సంహార భైరవో దేవతా సారమేయవాహనః
హరిత వర్ణః, త్రిశూల హస్తః సంహార భైరవో బధ్నాతు భైరవ మండలం.

#సంహార_భైరవ! శతలక్షకోటి యోగినీ సహిత సంహార-భైరవ మండలం ప్రత్యక్షం
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

9. 🔥 #ఊర్ధ్వ_దిక్కు:
ఊర్ధ్వయం దిశి సమ్మోహన భైరవో దేవతా ! సారమేయవాహనః,
శ్వేత వర్ణః, త్రిశూలహస్తః, సమ్మోహన భైరవో బధ్నాతు భైరవ మండలం.

#సమ్మోహన_భైరవ! త్రింశల్లక్షకోటి యోగినీ సహిత సమ్మోహన-భైరవ మండలం ప్రత్యక్షం
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

10. 🔥 #అధో_దిక్కు:
అధరాయాం దిశి తాండవ భైరవో దేవతా సారమేయ వాహనః
నీల వర్ణః, త్రిశూలహస్తః, తాండవభైరవో బధ్నాతు భైరవ మండలం.

#తాండవ_భైరవ! చతుష్షష్టి లక్షకోటి యోగినీ సహిత తాండవ-భైరవ మండలం ప్రత్యక్షం
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

11. 🔥 #సమస్త_దిక్కులకు:
అవాంతరాయాం దిశి కాల భైరవో దేవతా సారమేయ వాహనః
ధూమ్ర వర్ణః త్రిశూల హస్తః కాలభైరవో బధ్నాతు భైరవ మండలం.

#కాల_భైరవ! అనంత లక్షకోటి యోగినీ సహిత కాల-భైరవ మండలం ప్రత్యక్షం
బంధ - బంధ, సపరివారకం సర్వతో మాం రక్ష - రక్ష, అచలంచల మాక్రమ్యా క్రమ్య, మహా వజ్ర కవచాస్త్రైః రాజ - చోర - సర్ప - సింహ - వ్యాఘ్రాగ్న్యాది సర్వోపద్రవాన్నాశయ - నాశయ, ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ఫ్రోం ఆం హ్రీం క్రోం శ్రీం హుం ఫట్ స్వాహా ॥

శ్రీ గురుభ్యోనమః....

#Note: పూజకు ముందు "ఎర్రటి-అక్షతలు" గానీ నీళ్ళు గానీ ఆ దిక్కుల వైపు వేస్తూ దిగ్బంధనం మంత్రం చదువుతూ చేయాలి... పూజ అనంతరం మళ్ళీ 'దిగ్విమోచనం' అంటూ ప్రత్యేకంగా చేయనవసరం లేదు...

---> (భైరవ సాధన గ్రంధంలో నుంచి..)
🌹🙏🌹

http://www.siddheswaripeetham.org/
_

నవగ్రహ దోషములు..పరిహారాలు

నవగ్రహ దోషములు..పరిహారాలు...................!!
నవగ్రహ మంత్రములు........

మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. 
జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబంధిత గ్రహానికి పూజించి 
ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విముక్తి పొందుతుంటారు. 
జ్యోతిష్య జ్ఞానం లేనివారు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు.

సూర్యుడు:
ఎవరి జాతకంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్యము, 
అధికారుల నుండి వేధింపులు, 
తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, 
నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, 
తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, 
ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, 
ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు 
తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట, 
ఆదిత్య హృదయం పారాయణం, 
గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారపదార్థ ములు దానం చేయుట. 
తండ్రి గారిని లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.

చంద్రుడు:
చంద్రుడు జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లేపోవుట, భయం, అనుమానం, విద్యలో అభి వృద్ధి లేకపోవుట, 
తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవుట, 
స్ర్తీలతో విరోధము, 
మానసిక వ్యాధులు, 
రాత్రులు సరిగా నిద్రపట్టకపోవుట, 
అధికమైన కోరికలు, 
శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, 
బరువు తక్కువగా ఉండుట, 
స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుగుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి, 
చంద్ర గ్రహ అను గ్రహం కొరకు మాతృ సమానమైన స్ర్తీలను గౌరవించుట, 
బియ్యం దానం చేయుట, 
పాలు, మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం, 
శివునికి ఆవుపాలతో అభిషే కం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుట 
మొదలగు వాటి ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహానికి పాత్రులు అయి అభివృద్ధి చెందుతారు.

కుజుడు:
జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉండడం వల్ల ధైర్యం లేక పోవుట, 
అన్నదమ్ము లతో సఖ్యత నశించుట, 
భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, 
కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, 
పోలీసుల వల్ల వేధింపులు అప్పులు తీరకపోవుట, ఋణదాతల నుండి ఒత్తిడి, 
రక్త సంబంధించిన వ్యాధులు, 
శృంగారంనందు ఆసక్తి లేకపోవడం, 
కండరాల బలహీనత, 
రక్తహీనత సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలుగుచున్నప్పుడు కుజ గ్రహ దోషముగా గుర్తించి కుజ గ్రహాను గ్రహం కొరకు సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. 
అలాగే హనుమాన్‌ చాలీసా పారాయణం, 
కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం, 
అన్న దమ్ములకు సహాయం చేయడం, 
వారి మాట లకు విలువ ఇవ్వడం, 
స్ర్తీలు ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి.

బుధుడు:
జాతక చక్రంలో బుధుడు బలహీనంగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞా పకశక్తి లేకపోవటం, 
చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, 
తెలివితేటలు లేకపోవడం, 
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, 
అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి 
జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించి.. 
బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంక టేశ్వరస్వామి వారిని, విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట, 
వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట, 
ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట, పెసలు దానం చేయుట, 
విద్యార్థు లకు పుస్తకాలను దానం చేయట వలన 
బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.

గురువు:.
జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట,
 దైవం పై నమ్మకం లేకపోవుట, 
పెద్దల యందు గౌరవం లేకపోవుట, 
ఆచారములు పాటించకుండుట, 
ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, 
ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి 
గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పారాయణ చేయడం, గురువుల ను గౌరవించుట, 
దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

శుక్రుడు:
జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగు ట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. 
వ్యసనము ల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, 
మత్తుపానీయాలు సేవించుట, 
కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, 
లక్ష్మీ స్తోత్రము పారాయణం చేయుట,
బొబ్బర్లు దానం చేయుట, వివాహం కాని స్ర్తీలకు వారి వివాహం కొరకు సహకరించుట, 
స్ర్తీలను గౌరవించుట. వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రాక్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును.

శని:
ఆయుష్షు కారకులు అయిన శని జాతక చక్రము నందు బలహీనముగా ఉన్నచో బద్ధ కము, అతినిద్ర 
దీర్థకాలిక వ్యాధులు, సరయిన ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, 
తల్లిదండ్రులలో విరోధములు, 
ఇతరుల ఆధీనములో పని చేయుట, 
సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట, 
గౌరవం లేకపోవుట, 
పాడుపడిన గృహముల యందు జీవించుట, 
ఇతరుల ఇంట్లో జీవన ము సాగించుట, 
భార్య పిల్లలు అవమానించుట, 
కుటుంబమును విడిచి అజ్ఞాతముగా జీవించుట, సరయిన భోజనం కూడా లేకపో వుట 
మొదల గు కష్టములు కలుగును. 
శని గ్రహ అనుగ్ర హమునకు శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయుట.

శనివారము నియమముగా ఉండుట, 
ఆంజనేయ స్వామి వారిని ఆరాధించుట, 
హనుమాన్‌ చాలిసా పారాయణం చేయుట, 
హనుమాన్ కు తమలపాకు పూజ చేపిస్తే మంచిది.
స్వామి అయ్యప్ప మాల ధారణ చేయుట,
శని గ్రహానికి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయుట. నల్ల నువ్వులు దానము చేయుట, 
దుప్పటి..వస్తువులు దానం చేయుట, 
నీలము ఉంగరం గాని నాలుగు ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది.

రాహువు:
రాహువు జాతక చక్రంలో బలహీనముగా ఉన్నప్పుడు 
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయుట, 
నీచ స్ర్తీలతో సహవాసము, కుష్టులాంటి వ్యాధులు, 
జైలు శిక్షలు అనుభవించుట, 
విద్యార్థులు విద్య మధ్యలో మానివేయుట, 
పాడుపడిన గృహములలో నివసించుట, 
ఇంట్లో బొద్దింకలు, పందికొక్కులు, పాములు వంటివి సంచరించుట, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట, 
గృహంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడగుట, 
విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవుట, మొదలగున వి సంభ వించు చున్నప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి దోష నివారణకు కనక దుర్గ అమ్మవారిని పూజించుట, 
దేవి భాగవతం పారాయణం చేయుట, 
గోమేధికం గాని  ఎనిమిది  ముఖములు గల రుద్రాక్ష ను గాని ధరించ వలెను. 
భవాని మాల ధరిం చుట, స్ర్తీలను గౌరవించుట వలన రాహు గ్రహ అనుగ్రహం కలుగును.
దుర్గా సప్తశ్లోకి పఠించటం మంచిది.

కేతువు:
కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, 
ఏకాంతంగా ఉండాలనే కోరిక, 
లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, 
తన లో తానే ఊహించుకొనుట, 
తనని తాను దేవుడు గానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, 
ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి వేసి దేశ సంచారం చేయుట. పిచ్చి వాని వలె ప్రవర్తించుట, 
విచిత్ర వేషధార ణ, సంతానం కలుగకపోవుట, 
గర్భం వచ్చి పోవుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచిత్ర వ్యాధులకు కేతువు కారణం అగుచున్నాడు. 
కేతు గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయు ట. 
దేవాలయములు కట్టుటకు విరాళములు ఇచ్చుట.
పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సేవ చేయుట.
అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిగించుట. 
వైఢూర్య ము గాని తొమ్మిది ముఖములు గల రుద్రాక్ష ధరించుట వలన కేతు గ్రహ అనుగ్రహం పొందుతారు. 

ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఇష్టమైన దేవాలయమును సందర్శించినచో ఎటువంటి గ్రహ దోషములు ఉన్నను పరిహారం జరుగును.

"ఆకృష్ణేన'' అను మంత్రముతో సూర్యుని, 
"ఇమం దేవా' అను మంత్రముతో చంద్రుని, 
""అగ్నిర్మూర్ధా'' అను మంత్రముతో కుజుని, 
""ఉద్బుధ్యస్వ'' అను మంత్రముచే బుధుని, 
""యదర్య'' అను మంత్రముచే గురువును, ""అన్నాత్పరిస్రుతః'' అను మంత్రముచే శుక్రుని, 
""శం నో దేవీ'' అను మంత్రముచే శనిని, 
""కాండాత్‌'' అను మంత్రముచే రాహువును, 
""కేతుం కృణ్వన్న కేతవ'' అను మంత్రముచే కేతువును. ధ్యానించవలయును.

జల్లేడు. మోదుగు, జువ్వి ఉత్తరేణి, రాగి, మేడి, జమ్మి, గరక, దర్భలు, సమిధలు యథాక్రమముగా ఒక్కొక్క గ్రహమునకు 108, కాని 28 సార్తు కాని హోమమును చేయవలయును. 
అట్లే తేనెతో, నేయితో, పెరుగుతో, పాలతో కాని హోమము చేయవలయును.

ఋగ్వేద యజుర్వేదముల  యందలి  నవగ్రహ  మంత్రములు:

1. సూర్య మంత్రము:
ఓం ఆ కృష్ణేన  రజసా  వర్తమానో  నివేశ  యన్న మృతం  మర్త్యంచ l
హిరణ్యేన  సవితా  రథేనాఽఽ దేవోయాతి  భువనాని  పశ్యన్ ll
(ఋగ్వేదము 1-35..2 యజుర్వేదము 33-43 )
ఓం భూర్భువః  స్వః  సూర్య  ఇహాగచ్ఛ  ఇహ సః  సూర్యాయ నమః
బీజ మంత్రము :-ఓం  హ్రాం  హ్రీం  హ్రౌం  సః  సూర్యాయ నమః
జపకాలము: ఉదయము

2. చంద్ర మంత్రము:
ఓం  హందేవా  అసపత్నం  సువధ్వం మహతే   క్షత్రాయ మహతే  జ్యేష్టాయ మహతే జ్ఞాన రాజ్యాయేంద్ర  స్యేంద్రియాయ l  ఇమమముశ్య పుత్రమముష్యే పుత్ర మస్యై విశాఽ ఎషవోఽ మీరాజా సోమోఽ స్మాకం  బ్రాహ్మణానాం రాజా ll 
( యజుర్వేదము 9-40 )
ఓం భూర్భువః  స్వః  చంద్ర ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ  సోమాయ నమః ll
బీజ మంత్రము :-ఓం  శ్రాం  శ్రీం  శ్రౌం  సః  చంద్రాయ నమః
జకాలము: సంధ్యా కాలము

3. మంగళ మంత్రము:
ఓం అగ్ని ర్మూర్దా  దివః  కకుత్పతి: పృథివ్యా  అయం l
అపాంరే తాంసి జిన్వతి ll
( యజుర్వేదము 8-44-16; యజుర్వేదము 13-14)
ఓం భూర్భువః  స్వః  భౌమా ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  భౌమాయ నమః
బీజ మంత్రము :-ఓం  క్రాం  క్రీం  క్రౌం  సః  భౌమాయ నమః
జపకాలము: రెండు గంటల సమయము

4. బుధ మంత్రము:
ఓం ఉద్బుద్య స్వాగ్నే ప్రతిజాగృ హిత్వమిష్టా  పూర్తేం
సంసృజేదామయంచ  అస్మిస్సదస్థే అధ్యుత్తరస్మిన్
విశ్వేదేవా  యజమానశ్చ సీదత ll
 ( యజుర్వేదము 15-54 )
ఓం భూర్భువః  స్వః  బుధ ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  బుధాయ నమః
బీజ మంత్రము :-ఓం బ్రాం బ్రీం భ్రౌంసః  బుధాయ నమః
జపకాలము: ఐదు గంటల సమయము.

5. గురు మంత్రము:
ఓం బృహస్పతే  అతియదయోం ఘ్రుమద్ విభాతి క్రతుమజ్జనేషు l
యద్దీదయచ్చ వనఋతుప్రజాత  తదస్మాసు ద్రవిణం దేహిచిత్రం ll
( ఋగ్వేదము 2-23-25 ; యజుర్వేదము 26-3 )
ఓం భూర్భువఃస్వః   బృహస్పతే ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  బృహస్పతయే నమః
బీజ మంత్రము :-ఓం  గ్రా౦  గ్రీం  గ్రౌం సః  గురవే నమః
జపకాలము:  సంధ్యా కాలము

6. శుక్ర మంత్రం :
ఓం అన్నాత్పరిశృతోరసం బ్రహ్మణాన్యపిబత్ క్షం పయః సోమం ప్రజాపతిః l 
ఋతేన సత్య మింద్రియం విపానాం శుక్ర మందస ఇంద్ర స్యేంద్రియ మిదం పయో మృతం మధు l l
(యజుర్వేదం 19-65)
బీజమంత్రం: ఓం ద్రాం ద్రీం ద్రౌంసః శుక్రాయనమః 
కాలము : సూర్యోదయ సమయం 

7.  శని మంత్రము :
ఓం శంనో  దేవీరభిష్టయ ఆపోవబంతు పీతయే l
శంయోరభిస్ర  వంతునః ll
( ఋగ్వేదము 10-9-4 ; యజుర్వేదము 36-12 )
ఓం భూర్భువఃస్వః   శనై  శ్చరః  ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  శనైశ్చరాయ నమః
బీజ మంత్రము :-ఓం ప్రాం  ప్రీం  ప్రౌంసః  శనైశ్చరాయ నమః
జపకాలము:  సంధ్యా కాలము

8. రాహు మంత్రం :
ఓం కయానాశ్చిత్ర ఆభువధూతీ  సదావృధాఃసఖా l కాయాశాశ్చిష్ఠయావృతా l l
(ఋగ్వేదం 4-31-1, యజుర్వేదం 26-39) 
ఓం భూర్భువః స్వః రాహో ఇహాగచ్ఛ ఇహతిష్ఠ l రాహవేనమః 
బీజమంత్రం:- ఓం భ్రాం భ్రీం బ్రౌంసః రాహవేనమః 
జపకాలం :- రాత్రి సమయం 

9. కేతు మంత్రం:
ఓం కేతుం కృణ్వన్న కేతవేపేశే మర్యా అపేశసే l సముపద్భి రాజాయధాః l l
(ఋగ్వేదము 1-6-3; యజుర్వేదము 29-37) 
బీజమంత్రం :- ఓం స్త్రాం స్త్రీం సౌం సః l కేతవేనమః 
జపకాలం :- రాత్రి సమయం.

Thursday, March 27, 2025

రాశులు ఆకార స్వరూపాలు

రాశులు ఆకార స్వరూపాలు


రాశి స్వరూప లక్షణాల ద్వారా జాతకుని లగ్నం గాని, రాశి గాని ఉన్నప్పుడు ఆయా లక్షణాలు కలిగి ఉంటారు. జాతక చక్ర విశ్లేషణలో జాతకుని యొక్క స్వభావ లక్షణాలు తెలుసుకోవచ్చును.

మేషరాశి:- మేషమంటే గొర్రె. గొర్రెకు ఉండే తీవ్రత, కలహాశక్తి, ధైర్యం, బలం, వెనుక ముందు ఆలోచింపక ముందుకు అడుగు వేయటం, దూకుడుతనం, న్యాయకత్వ లక్షణాలు, కొండను కూడా డీకొట్టగలననే నమ్మకం. ఆశ, సాహసం కలిగి ఉందురు. మోసాలకు లోనగుదురు. మానవులకు సహాయపడుదురు.

వృషభ రాశి:- వృషభరాశి అంటే ఎద్దు. స్ధిరత్వం కలిగి ఉంటుంది. పోషించే స్వభావం, ఎత్తైన భుజాలు,పెరిగిన కండలు, కాంతి కల కన్నులు, విశాలమైన ముఖం, గొడ్డు చాకిరీ చేయుదురు. ఓర్పు అధికం, ఇతరుల ఆదీనంలో ఉందురు. ఇతరులకు బాగా సహాయపడతారు.

మిధున రాశి:- పురుషుడు ఒక చేత్తో గధ, స్త్రీ ఒక చేత్తో వీణ దరించిన స్వరూపం. బార్యా భర్తలు ఇద్దరు యుక్తా యుక్త జ్నానాన్ని కలిగి ఉందురు. కుటుంబమును పోషించెదరు. మానవతా దృక్పదం కలిగి ఉంటారు. ఒకరి కోసం ఒకరు అనే భావన, వైవిధ్యం, కొంతకాలం ఆర్ధిక ప్రతికూలత, కొంతకాలం ఆర్ధిక అనుకూలత, రెండు వృత్తుల ద్వారా ఆదాయం కలిగి ఉంటారు.

కర్కాటక రాశి:- ఎండ్రకాయ(పిత) పీతబుఱ్ఱ (అధిక ఆలోచన) కలిగి ఉంటారు. పురుగు స్వభావం, పట్టుదల, తప్పించుకొనే తెలివి తేటలు, స్వతంత్రత, అపకారం చేయుటకు వెనకాడక పోవటం, జల భూచరమైన ఆటుపోటులు, వృద్ధి క్ష్యయాలు, మొదలైన లక్షణ ద్వయం కలిగి ఉంటారు.

సింహారాశి:- సింహం. మృగ స్వభావం, బిగ్గరగా అరుచుట, గాండ్రించుట, భయం కలిగించుట, స్వేచ్ఛగా సంచరించుట, జంకు బొంకు లేకపోవుట, అందరిని మించిపోవాలనే స్వభావం, న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉందురు.

కన్యారాశి:- సముద్రంలో తెప్పపై ఒక చేత్తో దీపం, ఒక చేత్తో సస్యమును దరించిన స్త్రీ. కన్య పుష్పవతి కాని స్త్రీ. విశేషమైన ఊహాలు, సిగ్గు, లజ్జ, బిడియం, దగ్గరకు వచ్చి మాట్లాడుటకు భయం, సభలో మాట్లాడుటకు భయం, పెద్దల అండ లేనిదే ఏ పని చేయలేరు. స్త్రీకి ఉండే వాత్సల్యం, అభిమానం, బందు ప్రేమ. తన భాధను, శ్రమను ఇతరులు గుర్తించాలనే భావం కలిగి ఉంటారు.

తులారాశి:- త్రాసు ధరించిన పురుషుడు. సమాజంలో వర్తకుడు త్రాసు ధరిస్తాడు. స్ధిర చిత్తమును కలిగి ఉంటారు. ధర్మా దర్మముల విచక్షణ, సమయోచితంగా ప్రవర్తించుట, ఇతరులకు సహాయ పడుట, అవకాశాలు, ధనం, కాలం, సాధనాలు సరిగా వినియోగించుట, చిన్న వస్తువులను, సంఘటనలను సరిగా గుర్తుంచుకోవటం.

వృశ్చికరాశి:- తేలు. తేలు కనపడితే జనం చంపుతారు. కనుక ఇతరుల నుండి తనను కాపాడుకోవటం కోసం రహస్య ప్రవర్తనం కలిగి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి రహస్య ప్రవర్తన ఉండే సూచనలు. తనకు ఈ మాత్రం హాని కలగకుండా చూసుకొనుచు, ఇతరులకు హాని కలిగించు మాటలు, పనులు చేయుదురు. వృశ్చిక రాశి వారికి పగ కలిగి ఉంటారు.

ధనస్సు రాశి:- నడుము కింది భాగం అశ్వ రూపం కలిగి వీళ్ళు ధరించిన మానవ రూపం. ధనుర్ధారుడికి ఉండే ఏకాగ్రత, కార్యదీక్ష, పట్టుదల కలిగి ఉంటారు. కదలిక లేని స్వభావం, ఇతరుల ఆదేశానుసారం నడుచుకుందురు.

మకరరాశి:- లేడి ముఖం కలిగి మొసలి రూపం కలిగి ఉన్న రూపం. లేడికి ఉండే సుకుమారం, లావణ్యత, నాజూకుతనం కలిగి ఉందురు. మొసలికి ఉండే పట్టుదల, పొంచి ఉండి అవకాశం రాగానే కబళించే స్వభావం, ఏమి ఎరుగని మనస్తత్వం, సమయం చూసి పట్టు పడతారు. పట్టిన పట్టు వదలరు.

కుంభరాశి:- నీటి కుండను(ఖాళీ కుండ) ధరించిన మానవ రూపం. కొత్త నీరు, నవ జీవనం, బద్ధకస్తులు, చలనం లేక మొండిగా ఉండుట, ఏ విషయంలో అయిన త్వరగా బయట పడుదురు. సమర్ధులు, భద్ర పరుచుకుందురు.

మీనరాశి:- రెండుచేపలు ఒకదాని తోక వైపు మరొక చేప తల ఉన్నట్లుండే రూపం. ఒకరిని చూసి మరొకరు సర్ధుకుపోవటం, నీటి ప్రవాహంలో ప్రయాణం. సమయమును బట్టి వృద్ధి చెందగలరు. ఎరవేస్తే వలలో పడుతారు. ఆశ చూపిస్తే లొంగిపోతారు.

Sunday, March 23, 2025

కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు

1) కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు . తల్లి సంకల్పమే ప్రధానం . ( ఇది గొప్ప విశేషం )

  2)  సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం . ( మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది . (అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది  )
  3)  ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు . (ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. )
 4) ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ "ఢంకా వినాయకుడు" దర్శనమిస్తాడు.
  ( ఏకాంబరేశ్వర,సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు )
  5)  కామాక్షి తల్లి ఆలయంలో "అరూప లక్ష్మి" దేవి దర్శనమిస్తుంది . కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మితల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే , భర్తను నిందించిన దోషం
పొతుంది . మరియు స్త్రీపురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది .
  6)  కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం .
తపస్సులో భాగంగా ,శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో(కౌగిలితో) కాపాడుకుంటుంది . అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై అగుపిస్తాయి .
  7)  కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు , శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు .( తనను నమ్మినవారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి )
    అమ్మధ్యానంలో , "శోకాపహంత్రీ  సతాం" అనే దివ్య వాక్కు గురించి వర్ణణ ఉంది .
ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది . తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది . భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది ...🙏
 ( సేకరణ )
     కావున భక్తులెల్లరు కామాక్షితల్లిని దర్శించి పునీతులు కాగలరని మనవి...🙏🙏🙏

Thursday, March 20, 2025

మౌనం అంటే ఏమిటి

*మౌనం అంటే ఏమిటి...*


 మౌనం ఒక మానసిక నిశ్శబ్దం 
మాట ఓ భౌతిక శబ్దం
 మౌనం ఓ సమస్యకు పరిష్కారం 
మాట ఒక సమస్యకు కారణం 
 మాట హద్దులు దాటితే యుద్ధం
 మౌనం హద్దులు దాటితే ఆత్మ జ్ఞానం 
 కొన్నిటికి సమాధానం మౌనం
 కొన్నిటికి సమాధానం మాట
 మాట మౌనం రెండు అవసరం 
వాటిని వాడే విధానం తెలుసుకోవాలి 
 అది తెలిసిన వారు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు.

సనాతన భాషా స్రవంతి.మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు.నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు. విజ్రుంభణను ఆపడం.

మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం.ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.

మౌనమంటే -నిరంతర భాషణ.చింత, చింతన లేని తపస్సు.అఖండ ఆనందపు ఆత్మస్థితి.విషయ శూన్యావస్థ.

యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు.

మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం.అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి.అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు.

ఈ మౌనం మూడు రకాలు.

1. వాజ్మౌనం :-🙏

వాక్కుని నిరోదించడం.ఈ రకమైన మౌనం వలన కఠువుగా మాట్లాడుట, అసత్యమాడుట,పరనింద చేయుట,చాడీలు చెప్పుట,అసందర్భ వ్యర్ధ ప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.

2. అక్షమౌనం :-🙏

కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట.ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడుతాయి.

3. కాష్ఠ మౌనం :-🙏

దీనిని మానసిక మౌనమంటారు.మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠ మౌనమంటారు.ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.

 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది.మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.

మౌనం ...

దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.

గురువు మౌనం జ్ఞానానుగ్రహం.

జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.

భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.

ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. 
ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది.

మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది,అంతర్యామిని దర్శింపజేస్తుంది,మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష.అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు.

మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి.

మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు.

'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది.

 భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. 
దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. 

మౌనం మాత్రమే శబ్ధ ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. 

మౌనమే సత్యం, శివం, సుందరం. 
ఇదే అఖండానందం, ఎన్నో సమస్యలకు పరిష్కారం
ఇదే ఆత్మసాక్షాత్కారం,ఇదే మోక్షం.
🙏🏻🙏🏻🙏

Tuesday, March 18, 2025

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు మీకు తెలుసా ???

స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు, జడకి మూడు
పాయలే ఎందుకు అల్లుతారు మీకు తెలుసా ???


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుట్టుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.

🌸రెండు జడలు వేసుకోవడం 
(రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్లికాలేదని అర్ధం. అంటే ఆ అమ్మాయిలో  జీవ + ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్ధము)

🌿ఒక జడ వేసుకోవడం (పెళ్లి అయ్యిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడినిచేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం)

🌸ముడి పెట్టుకోవడం (జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానంకూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం)

🌿అయితే  ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా  జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణీసంగమంలాగ కలుపుతూ అల్లీవారు. 

🌹ఈ మూడు పాయలకు అర్ధాలు ఏందమ్మ అంటే....!!🌹

🌸1. తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం.

🌿2. సత్వ, రజ, తమో గుణాలు,

🌸3. జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అని అర్ధములు.

🌿అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది.

🌸 ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి 

🌿జుట్టు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం..పలికినట్టే.....🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

Saturday, March 15, 2025

ఆంధ్ర *అరుణాచలం- త్రిపురాంతకం

 ఆంధ్ర *అరుణాచలం- త్రిపురాంతకం****


**త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భ విం చిన ఈ దివ్య ప్రదేశమే కుమార గిరి. ఆదిశైలం ,అరుణాచలం , కుమారాచలం లేబ్రాయపు కొండ అని పేర్లున్నాయి**
త్రిపురాంతకం క్షేత్రచరిత్ర/స్థలపురాణ
శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ, శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైంది. పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్ర పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం. ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. త్రయంబకాయ- త్రిపురాంతకాయ.... త్రికాగ్నికాలాయ-కాలాగ్నిరుద్రాయ అంటూ నిత్యం రుద్రం వల్లె వేస్తుంటారు. ప్రపంచంలో ఏ శివాలయానికి వెల్లి పూజ చేయించుకున్నా త్రిపురాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. మహిమాన్వితుడు-త్రిపురాంతకేశ్వరుడు త్రిపురాంతకం గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిశాడు. ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు, ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళతారు. ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం(నైరుతి ప్రవేశం) నుంచి ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది. శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. వైష్ణవ, శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైంది. స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భద్రుడు, వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు. స్వామికి ఉత్తర వైపుగా సిద్ధేశ్వరి తల్లి ఢమరుకం చేత పూని భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు బిల మార్గం ఉంది. పూర్వం మునులు ఈ దారినే వినియోగించినట్లు వేదాల్లో పేర్కొన్నారు. ఎటు చూసినా శిల్ప సంపదే ఏడో శతాబ్ధంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రం. ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఆలయానికి వేసిన రంగులను ఇటీవల తొలగిస్తుండటంతో సహజత్వం కలిగిన శిల్ప సంపదతో పాటు గోడలపై శాసనాలు కనిపిస్తున్నాయి. పాపనాశనం, అంగారేశ్వర, మూల స్థానేశ్వర, సోమేశ్వర, ఖడ్గేశ్వర, కన్యసిద్ధేశ్వర, కేదారేశ్వర, మల్లిఖార్జున, కపిలేశ్వర, గౌరేశ్వర, ఉత్తరేశ్వర, ఏకాదశ రుద్ర స్థానాల మధ్య త్రిపురాంతకేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయానికి నాలుగు వైపుల ఉన్న సోపానాలు నేడు కనుమరుగయ్యాయి.

పాహిమాం.. బాలా త్రిపురసుందరీదేవి  త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి కిలో మీటరు దూరంలో చిదగ్నిగుండంలో బాలా త్రిపురసుందరీదేవి వెలిసింది. లలితా సహస్త్ర నామంలో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు. సమస్త శక్తి దేవతలకు బాలా త్రిపురసుందరీదేవి

ప్రథమ మూలం. నిర్గుణాకారంలో అమ్మవారు వెనక్కు తిరిగి ఉంటుంది. దీంతో భక్తుల దర్శనార్థం అమ్మవారికి ముందు మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు. చెరువు కట్ట వెంట ఉన్న కదంబ చెట్లు కాశీలో మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

త్రిపురాంతకం మరి కొన్ని విశేషాలు

ప్రాచీన మంత్రం ,చైతన్య విద్యలకు ప్రతీక,ఓషధీ మూలికల స్తావరం , భ్రమరాంబా మల్లికార్జుల నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది. శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాదాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణం లో శ్రీశైలఖండం లో ‘’త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం ‘’ అని చెప్ప బడిన అతి ప్రాచీన క్షేత్రం. మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరం లో ,గుంటూరు –కర్నూలు మార్గం లో రహదారికి రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్నది. త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు ,సిద్ధులు తాన్త్రికులకు ఆవాస భూమి .అనేక దివ్యమైన ఔషధాలు నిలయం. రస రత్నాకర ,నాగార్జున సిద్ధ తంత్రం మొదలైన గ్రంధాలు దీని ప్రాభవాన్ని తెలియ జేశాయి. స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయి. ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం. త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయం గా ఆ పరమ శివుడే చెప్పాడు .త్రిపురాంతక లింగాన్ని ‘’తత్పురుష లింగం ‘’అంటారు.

స్థల పురాణం –త్రిపురాసుర సంహారం తారాకాసురుడు పూర్వం దేవ, ఋషులను బాధిస్తుంటే శివ కుమారుడైన కుమారస్వామి తారాసురుని మెడలోని ప్రాణ లింగాన్ని చేదించి వాడిని సంహరించాడు. ఈ యుద్ధం లో అలసిన శరవణ భవుడు ‘’ఆదిశైలం’’ అనే పేరున్న ఈ పర్వతం పై విహరించటం వలన’’ కుమార గిరి ‘’ అనే పేరొచ్చింది .తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు ,విద్యున్మాలి ,కమలాక్షుడు. వీరినే త్రిపురాసురులు అంటారు .తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్న తోబ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షం కాలేదు. పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ ప్రత్యశమై వరం కోరుకోమన్నాదు .ఎవరి చేతిలోనూ చావు కలాగ కూడదని వరం కోరుకొన్నారు. పుట్టిన వాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకోన్నారో చెప్పండి అని అడిగాడు. తాము ఆకాశం లోమూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు

పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణం తో ఆ త్రిపురాలను చేదించిన వాని చేతిలో నే తమకు మృత్యువు రావాలనికోరుకొన్నాడు. సరే నన్నాడు బ్రహ్మ. తారాక్షుడు బంగారం ,విద్యున్మాలి వెండితో ,కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు. వారు పరమేశ్వరుని ప్రార్ధించారు .అప్పుడాయన త్రిపురాసురలను చంపాలంటే అపూర్వమైన రధం ,అపూర్వ బాణాలు అవసరమనీ చెప్పాడు. వీరు శ్రీహరిని ప్రార్ధిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింప జేశాడు. విశ్వకర్మ జగత్తు తత్త్వం తో రధాన్ని ,వేదం తత్త్వం తో గుర్రాలను ,నాగ తత్త్వం తో పగ్గాలను ,మేరు శఖర తత్త్వం తోధనుస్సును ,వాసుకి తత్త్వం తో వింటి నారిని ,సోమ ,విష్ణు ,వాయు తత్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మ రధ సారధి అయ్యాడు. అ దివ్య రధాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయల్దేరాడు.

త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం ఇంత చేసినా త్రిపురాసురుల తపో బలం వలన ,మయుడి నిశ్చల తత్త్వం వలన ఆ దివ్య రధం భూమి లోకి కుంగి పోయింది .గుర్రాలు నిలవ లేకపోయాయి ధనుస్సు పని చేయలేదు .రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్ధమైన రధం నిర్మించ లేక పోయి నందుకు కోప పడ్డాడు. ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు .పర దేవతను ఆత్మలో ధ్యానించాడు. లీలా వినోదిని బాలా త్రిపురాసుందరి గా ఆమె ఆవిర్భవించింది. శివుని ధనుసులో ప్రవేశించింది .దీనికి ఋగ్వేదం లో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది. ‘’అహం రుద్రాయ ధనురా తనోమి బ్రహ్మ ద్విషే శరవే హంత వా ఉ –అహం జనాయ సమదం క్రుణోమ్య హం ద్యావా ప్రుధివీ ఆవివేశ ‘’.అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం యెక్కు పెట్టాడు .దేవతలు అప్పుడు ‘’నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః ‘’అని స్తుతించారు. త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్ర బాణం తో అవి ఒకే సారి ద్వంసమైనాయి ..దేవమునులు సంతసిం చారు. బాలా త్రిపుర సుందరి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది. శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు. ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటె తానూ ఆక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది. రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు. ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది . పెద్ద గుట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన ‘’వైడూర్య లింగం ‘’గా ఆవిర్భవించాడు. దీనికి సాక్ష్యం గా వేదమంత్రం ఉంది –‘’స్తుతి శ్రుతం గర్త సదం యువానం –మృగన్నభీమ ముప హత్తు ముగ్రం –మ్రుడా జరిత్రే రుద్రస్తవానో –అన్యంతో అస్మిన్ని వపంతు సేనా’’. వైడూర్య లింగానికి పై భాగాన బ్రహ్మ దివ్య జల లింగాన్ని ప్రతిస్టించాడు. ఇక్కడ జలలిన్గానికి చేసిన అభిషేక ద్రవ్యం లోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగం లోనే లయమై లోపల ఉన్న త్రిపురాన్తకేశ్వరుని చేరుతుంది .

త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భ విం చిన ఈ దివ్య ప్రదేశమే కుమార గిరి. ఆదిశైలం ,అరుణాచలం ,కుమారాచలం లేబ్రాయపు కొండ అని పేర్లున్నాయి. తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశం లో తపస్సు చేస్తున్నాడు. ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ దేవి ,ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కు మారుడైన కుమారస్వామిని చూసి పోతూఉంటారని శివ పురాణం లోని శ్లోకం తెలియ జేస్తోంది –‘’ అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తరహ –పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం ‘’

పిలిస్తే పలికే దైవం పూర్వం త్రిపురాన్తకేశ్వరుడు పిలిస్తే పలికే వాడట. పాల్కురికి సోమ నాధుడు బసవ పురాణం లో చెప్పిన కిన్నెర బ్రహ్మయ కద తార్కాణం. ఈ ఆలయానికి నలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి. ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరచిఉన్ది. దక్షిణ సోపాన మార్గానికి దగ్గర మూల స్థానేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈయన మహా మహిమ కల దైవం. అనేకమంది రాజులు ఈయనకు భూరి దానాలు సమర్పించారు. దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీ చెన్న కేశవా లయం ఉన్నది. పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు. మూల స్తానేశ్వరునికి ఆగ్నేయం గా పంచ బ్రాహ్మల చే ప్రతిస్టింప బడిన ‘’పంచ లింగ దేవాలయం ‘’ఉన్నది. ఈశాన్యం లో ఆవు పొదుగు ఆకారం తో లింగాలు దర్శన మిస్తాయి. పూజిస్తే ఆయురారోగ్యాలనిస్తాయి. దక్షిణ సోపానాల దగ్గర వీర భద్రాలయం ఉంది. ఇంకొంచెం పైకి ఎక్కితే ఇస్టకామేశ్వారీ దేవాలయం ఉన్నది. దీనికి దక్షిణం గా అద్భుత మహిమలున్న ‘’అగస్త్య లింగం ‘’ఉన్నది దీనినే ‘’ విన్ధ్యేశ్వర లింగం అనీ అంటారు. ముఖ్యదేవాలయం దగ్గరే ‘’అపరాజితెశ్వరుడు ‘’ఉన్నాడు మన్యు సూక్తం తో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది. ఆగ్నేయం లో సూక్ష్మ తేజోమయ ‘’యజ్ఞేశ్వర లింగం ‘’వాయవ్యం లో హనుమంతుడు నెలకొల్పిన ‘’మారుతి లింగం ‘’, ఉన్నాయి వీటిని పూజిస్తే ఆయుస్సు బలం యశస్సులు కలుగుతాయి. వీటి ప్రక్కనే మార్కండేయ ప్రతిష్టిత దివ్య లింగం ఉంది. ఉత్తరం లో చండీశ్వరుడు ,పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిస్తితమైన ‘’ఉగ్రేశ లింగం ‘’ఉన్నాయి .ఉత్తరాన ‘’భేక సోమేశ్వరుడు’’దర్శన మిస్తాడు ఈయన ఆరాధనను చాలా జాగ్రత్తగాచేయాలి. ఆలయం లోని బలిహణలను భక్షిస్తాడు ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకలాశోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేది. ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియం లో ఉంది. గర్భాలయానికి నైరుతి దిశలో ‘’చీకటి మిద్దె ‘’అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడి నుంచి కాశీ ,శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉంది. వృశ్చిక మల్లెశ్వరాలయానికి దగ్గర ‘’లో మఠం ‘’ఉంది. శ్రీ బాలా త్రిపుర సుందరిని అర్చిన్చాటానికి సిద్ధ సాధ్యులు ఈ మార్గం ద్వారా వస్తారని చెబుతారు. ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింత చెట్టు ఉండేది. దాని మూలం లో భైరవుడు ఉంటాడు. దాని ముందు మనిషి లోతు త్రవ్వితే ఒక గుండం కనబడుతుంది. అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ గుండం లో వేస్తె రాళ్ళు చేపలుగా మారుతాయట. ఆ చేపలను వండి తలను తోకను తీసేసి తింటే మూర్చ వచ్చి కొంత సేపటికి లేస్తాడు. ఆ మనిషి వేల సంవత్సరాలు జీవిస్తాడని ‘’నిత్య నాద సిద్ధుడు ‘’అనే యోగి

‘’రస రత్నారం ‘’అనే గ్రంధం లో రాశాడు. చీకటి మిద్దె ప్రకనే ‘’మహా గణపతి మండపం ‘’ఉంది. విగ్రహం శిదిలమైతే ప్రక్కన కింద పెట్టారు. ప్రధానాలయం శ్రీ చక్రాకారం లో నిర్మించ బడింది. శివాలయం ఈ ఆకారం లో నిర్మించటం చాలా అరుదు. అలాటి అరుడైన దేవాలయం ఇది. ’’శ్రీ చక్రం శివ యొర్వపుః’’అంటే శివ పార్వతుల శరీరమే శ్రీ చక్రం.స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడి పోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు .పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయం గా ఉంటాడు. జల లింగాన్ని దుండగులు పీకేస్తే కొండడ కిందఉన్న శ్రీరామ ప్రతిష్టిత లింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు .పునః ప్రతిస్టలో మూల విరాట్ ను కదిలించకుండా మూల విరాట్ కు కింద మరొక నర్మదా బాణ లింగాన్ని ప్రతిష్టించారు. త్రిపురాన్తకేశ్వరునికి ఉత్తరాన పార్వతీ దేవి అంటే స్కంద మాత ఆలయమున్నది. పై రెండు చేత్రులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం ,డమరుం కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది. అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది . స్వామి అభిషేకాలకు భక్తజనం త్రాగటానికి గంధవతి తీర్ధం ఉంది. ఇందులో స్నానిస్తే పుణ్యం మోక్షం .త్రిపుర సుందరి ఆలయం వెనక పుష్పవతీ తీర్ధం ఉండేది. చెరువులో కలిసిపోయింది. మహా నందిలో లాగానే ఇక్కడ కూడా స్వచ్చమైన జలం తో ఉండే కోనేరుండేది. దీనికి ‘’పాప నాశనం ‘’అనిపేరు. నాలుగు కొండల మధ్య ఉన్న సోమ తీర్ధం పాప నాశిని. కుమార గిరికి పడమర దూర్వా నది లేక దువ్వలేరు ఉన్నది. ఇక్కడ దూర్వాసుడు తపస్సుచేశాడు. దీనికి దక్షిణం లో ‘’ముక్త గుండం ‘లో స్నానం చేస్తే మోక్షమే.

తీర్దాలు-మిగిలిన గుడులు త్రిపురాంతకం అష్ట భైరవ పరి వేష్టితం. కుమార గిరికి దక్షణాన భైరవ గిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం. పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది. తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు. పడమరలో శ్రీ రామ నాదేశ్వరుడు మిక్కిలి పూజ నీయుడు. ఉత్తరాన ఉన్న కొండడను పూల కొండ అంటారు. ఇక్కడే తారకాసురుడు పూజించిన శివ లింగం ఉంది. ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట. దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది. దీనికి దిగువన ఓషధీ సమన్విత సోమ తీర్ధం ఉంది. ఇది సర్వ రోగ నివారిణి. తూర్పున పంచ బ్రాహ్మలు ప్రతిష్టించిన పంచ లింగాలున్నాయి. వాయవ్యం లో లింగాల కొండ ఉంది. ఇక్కడ వెయ్యి నూట ఒక్క లింగాలు ఉన్నాయట. ఇక్కడ అజ్ఞాతం గా మునులు తపస్సు చేస్తూ ఉంటారట. ఇకడే దివ్యౌ షది’’సంజీవిని ‘’ఉన్నాడని జ్ఞానులు చెబుతారు.

శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చిదగ్ని కుండ సంభూత కుమార గిరికి దగ్గరలోఒకప్పటి చెరువు లో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం లో ప్రతిదీ విశేషమైనదే. ఆలయ గోపుర గర్భ గుడిపై నిర్మాణ శైలి వైవిధ్యం తో ఉంటుంది. గర్భ గుడిమీద రాజ గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత. ’’త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ’’ అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే. అమ్మవారు నిర్గుణ శిలా కారం గా ఆవిర్భవించింది. ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసున్దరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం. దీన్ని స్థానికులు ‘’నడబావి ‘’అంటారు. అమ్మవారు ఉత్తరాభి ముఖం గా దర్శన మిస్తుంది. చిదగ్నిగుండం లోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ. అదే నవావరణం లో బాలాత్రిపురసుందరి ఉంటుందన్న మాట. ఈ మెట్లకు అధిదేవతా ప్రత్యది దేవతలుంటారు. తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండం లో నిర్గుణ శిలకార రూపం లో అమ్మవారు కనిపిస్తుంది. దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలా వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది. సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహానికి వెనక ఉన్న శిలమధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్టితమై ఉంది. విగ్రహానికి వేనక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు. అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవ శాస్త్రి గారు – ‘’నూటోక్క శక్తు లెప్పుడు –నాటక మటు లాడు చుండ,నాయక మణియై కూటంబు నేర్పు త్రిపురక –వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’అని పద్యం చెప్పారు.

సిద్ధి మండపాలు చిదగ్ని కుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి. వాటినే ‘’సిద్ధి మండపాలు ‘’అంటారు. ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు. శ్రీ వావిలాల మహాదేవయ్య గారు ,శ్రీ గోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుస్టానం చేసేవారట.

శ్రీ చక్ర పాదుకలు మెట్లు దాటి బయటికి వస్తే శ్రీ చక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీ చక్ర పాదుకలున్నాయి. అర్చనలన్నీ వీటీకే చేస్తారు. అందరూ వీటిని పూజించ వచ్చు. ఈ చక్ర పాదుకలకు ,చిదగ్ని కుండ దేవికి తంత్ర సంబంధ అను సంధానం ఉంది. ధనం కా వాలంటే ఎరుపు రంగు విద్య కావాలంటే తెలుపు ,శత్రు జయం కలగాలంటే నల్లని స్వరూపం తో అమ్మవారిని ధ్యానించాలి. ఈ పాదుకల వెనుక సిద్దేశ్వర పాదుకలుంటాయి. వీటిని ‘’గురుపాదాలు ‘’అంటారు. శ్రీ విద్యా సాంప్రదాయం లో వీటి ప్రాధాన్యం ఎక్కువ. గురుపాదుకలకు ప్రక్కనే బ్రాహ్మీ లిపి లో ‘’గురుపాదకా మంత్రం ఉంది’’. చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణా మూర్తి లింగం ఉంది .స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు.

ఛిన్నమస్తా దేవి చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ‘’చిన్న మస్తా దేవి’’చిన్న మండపం లో కనిపిస్తుంది. ఈమెనే ప్రచండ చండిక అని ,వజ్ర వైరోచని అని అంటారు. ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె దశ మహా విద్యలలో ఆరవ మహా విద్య. ఈమెను ఉపాశిస్తే కలిగే ఫలితం ‘’యామళం’’అనే గ్రంధం వివరించింది. ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు. ఇవి ఇప్పుడు నిజంగా చిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్ట బడి ఉన్నాయి.

రక్త పాత్రలు సాధారణం గా శక్తి ఆలయాలలో సింహ వాహనం ధ్వజస్తంభం ఉండాలి. ఈ రెండు ఇక్కడ లేవు. కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని , స్వయంభు అని భావిస్తారు. వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత. ’’సవ్యాప సవ్య మార్గస్థా’’. ఒక్కప్పుడు ఈ ఆలయం లో ‘’పంచ మకారార్చన’’జరిగేది. అందుకే గర్భాలయం లో రాతి తో చేయబడిన ‘’రక్త పాత్ర ‘’ఉంది. దీనికి ‘’ఉగ్రపాత్ర ‘’అనే పేరుకూడా ఉంది. ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు ,రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్ని దున్నల్ని బలిచ్చినా ,ఒక్కో పొతూరక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు. ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యం లో మామూలు భక్తులు వేరొక రక్త పాత్ర ఉన్నది. దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే ‘’యూప స్థంభం ‘’కూడా ఉంది. దీనిపై సంస్కృత శాసనం ఉంది. శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు.

దీన్ని ఒక కవి పద్యం లో ‘’మదపు టేనుగు నైన ,కొదమ సింగం బైన –యూప శిలకు దా,సమీప మంద – మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న –లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’ వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని ‘’దేవతాగ్రణీ’’ అని స్తుతించారు స్కాంద పురాణం శ్రీశైల ఖండం లో- ‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణీ దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’

కదంబ వనవాసిని త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబ వనం .ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి. అతి సున్నితంగా రక్త వర్ణం తో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి. అందుకే ‘’కదంబ కుసుమ ప్రియాయై నమః ‘’అని లలితా సహస్రం లో చెప్పారు. కదంబ వృక్షాలే కల్ప వృక్షాలే శ్రీ శంకర భగవద్పాదులు తెలియ జేశారు. ’’కదంబ కాననావాసా ‘’-కదంబ నామా కల్ప వృక్ష యుక్తం యత్కాననం వనం తత్ర గృహం యస్యాః సా తదా ‘’అని భాష్యం చెప్పారు.

వీర శిలలు అమ్మవారి ఉత్తర ద్వారం కు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీర శిలలే. ఇవి భక్తుల వీర కృత్యాలకుప్రతి బింబాలు. ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది. ఇందులో అధికభాగం స్త్రీ శిల్పాలే .వివిధ ఆలం కారాలతో కేశ పాశాలతో వీరులు బల్లాలను తలలో ,గుండెలో ,గొంతులో ,తొడలలో పోడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు. వీరు ఎందుకు వీరక్రుత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి. ’’స్వస్తిశ్రీ సోమతుశివ దేవా గురు అల్లడ్డ వీర మల్లునికి మేలుగావలేన్ అని తల త్రిపురా దేవి కిన్ ఇచ్చే ‘’ అని ఒక శాసనం. ఇంకోదానిపై ‘’దేవికి తల ఇస్తున్నాను తెలుంగు నాయని బావ మరది చావుండయ్య వీర’’అని అసంపూర్తి శాసనం కనిపిస్తాయి. ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం.

అపరాదేశ్వరీ ఆలయం –గుహలు అమ్మవారి ఆలయానికి దగ్గరలో బయట రోడ్డుమీద ‘’అపరాదేశ్వరీ ‘’లేక బాలమ్మ ఆలయం ఉంది. ఇది శిధిల రూపం లోనే ఉంది. దీనికి దగ్గరలో చింతామణి గుహ ,ఉన్నది. ఇది అమ్మవారి ఆలయమే నని భావన ఆధారం ‘’చింతామణి గుహాంతస్త ‘’ అనే నామం. ఇక్కడే పూర్వం లక్ష్మీ గణపతి ఆలయం ఉండేదట. అమ్మవారికి వెనక ‘’వైడూర్య శిఖరం. అనే కొండ మీద ధ్యానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట. ఇకడే తమాషా అయిన తెల్లని రాతి వరుస ఉందట. దీని రహస్యం సిద్ధులకు మాత్రమె ఎరుక.

మహా సర్పం –మరికొన్ని విశేషాలు బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంది. అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది. సంతానార్ధులు ,నాగ దోషమున్నవారు ,ఈ పుట్టకు పొంగళ్ళు సమర్పిస్తారు ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్ని గుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట. అమ్మవారి గుడికి దగ్గరే ఉండే తెల్లని గుండ్రాయి ని ‘’ఈశ్వరుని తల గుడ్డ ‘’అంటారు .ఇది మహత్వం కల శిల అని ఇప్పుడు చెరువులో కూరుకు పోయి కనిపించటం లేదు. త్రిపురాంతక శివునికి పడమర గా పదమూడు కిలో మీటర్ల దూరం లో ఒక కొండ ,దానికి పశ్చిమంగా ఒక ద్వారం ఉన్నాయి. అక్కడ నలభై అడుగుల దూరం లో ‘’మండే కాంతులు ‘’అనిపిస్తాయి. అక్కడి మామిడి పండు ఆకారం లో ఉన్న రాళ్ళను గుడ్డలో వేసి మూట కట్టాలి. అది ఎర్రగా మారుతుంది. ఆ గుడ్డను పాలల్లో వేయాలి. పాలు ఎర్రగా మారుతాయి. ఆ పాలను సాధకుడు వారం రోజులు అదే విధం గా తాగితే వజ్ర సమాన శరీరుడు అవుతాడు ,ఆయుస్సు పెరుగుతుంది అని ‘’రస రత్నాకరం ‘’లో నిత్య నాద సిద్ధుడు రాశాడు.

బిలాలు శివాలయానికి ఉత్తరాన ‘’కోకిలా బిలం ‘’ఉంది. సాధకుడు శుచిగా అందులో ప్రవేశించాలి. నలభై అడుగులు లొపలీ వెడితే కోకిల ఆకారపు రాళ్ళు కనిపిస్తాయి. ఆ రాళ్ళను తీసుకొని వాటి వెనక నువ్వులు పెడితే అవిపగిలిపోతాయి. అప్పుడు ఆ రాళ్ళను పాలలో వేస్తె పాలు నల్లగా మారుతాయి. ఈ పాలను గొంతు నిండే దాకా తాగాలి. అప్పుడు దివ్య శరీరం పొంది తెల్లజుట్టు ముడుతలు పోయి ,రోగాలు లేనివాడై మూడు బ్రహ్మ దినాలు జీవిస్తాడు. మహా బలవంతుడై వాయువేగం కలుగుతుంది.

గుండ్ల కమ్మ నదికి తూర్పు కొండపై చంద్ర మౌళీశ్వరాలయం ఉంది. దాని దగ్గరేకాశి కేశుడు ,ఒక కోనేరు ,నృసింహ బిలం ఉన్నాయి. బిలం లో ప్రవేశిస్తే యోగసిద్ధి కలుగుతుంది. దానిలో నుంచి కాశీ వెళ్ళచ్చు.

వీరశైవం –మఠాలు త్రిపురాంతకం శైవమత వ్యాప్తికి దోహద పడింది. ఇక్కడి ‘’గోళకీ మఠం’’ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దం లో వీర శైవం విజ్రుమ్భించింది. 1312నాటికి పూజారులు 72నియోగాల వారు స్తానాదిపతుశ్రీ అసంఖ్యాత మహా మహేశ్వరులకు లోబడి ఉండాలన్న నిబంధన ఏర్పడింది. ఇక్కడి ‘’విశుద్ధ శైవ మఠం’’ఉచిత అన్న వస్త్రాలిచ్చి వేదం వేదాంగాలు శాస్త్రాలు సాహిత్యం బోధించింది. పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య ‘’కాపాలిక మతం ‘’అభి వృద్ధి చెందింది. అప్పుడే ‘’పంచ మకారార్చన ‘’జరిగేది (మద్యం మాంసం మగువ ).

ఉత్సవాలు ప్రతి సోమ ,శుక్రవారాలలో విశేష ఉత్స్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం జరిగేదని వసంత నవరాత్రులు ,శరన్నవ రాత్రులు శ్రావణ మాసం లోప్రత్యెక ఉత్సవాలు కార్తీకం లో అభషెకాలు సంతర్పణలు జరిగేవని శాసనాల వలన తెలుస్తోంది. తర్వాత ఆలయం శిధిలా వస్తకు చేరింది. శ్రీశైలం దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తతకు తీసుకోని పునరుద్ధ రించి మళ్ళీ నిత్య ధూప దీప నైవేద్యాలు ఉత్సవాలు నిర్వహింప జేస్తోంది. దాతలు ముందుకు వచ్చి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్యనిర్వాహణ అధికారి మరియు ఇతర సిబ్బంది మహాశివరాత్రి ని అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని వర్గాల వారు మూడు రోజుల పాటు అన్న దాన సత్రాలు వసతి సముదాయలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు స్వామి వారి రథొత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇంతటి మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం మహా శివరాత్రి నాడు వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంత కేశ్వరుని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి.

RECENT POST

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు –  భూమండలంపై గ్రహాల ప్రభావం: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అన...

POPULAR POSTS