Thursday, October 28, 2021

మన పండుగల గొప్పతనం తెలుసు కోండి

*🌈మన పండుగల గొప్పతనం తెలుసు కోండి...🌈*

*❤#ఉగాది:- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.*

*🧡#శ్రీరామ నవమి:- భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.*

*💛#అక్షయ తృతీయ:- విలువైన వాటిని  కూడబెట్టుకోమని.*

*💚#వ్యాస (గురు) పౌర్ణమి :-  జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.*

*💙#నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.*

*💜#వరలక్ష్మి వ్రతం :-  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.*

*💝#రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.*

*💞#వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.*

*🖤#పితృ అమావాస్య:-   చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.*



*💘#దసరా ( ఆయుధ పూజ)  :- ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.*

*💖#దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.*

*❣#కార్తీక పౌర్ణమి :-  చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.*

*💕#సంక్రాంతి :-  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.*

*💓#మహాశివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.*



*💝#హోలీ :-  వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు,  పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని...*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

108రూపాలలోమహాగణపతులు

*🙏#108రూపాలలోమహాగణపతులు🙏*

1. ఏకాక్షర గణపతి
ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక
దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య

2. మహా గణపతి
భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం
భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం
గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్

3. బాల గణపతి
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం
బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం

4. తరుణ గణపతి
పాశాంకుశాపూస కపిత్ధ జంబూ
ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ:
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:

5. విఘ్నరాజ గణపతి
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే 
మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:

6. సిద్ది గణపతి
ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్
అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్

7. బుద్ధి గణపతి
త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే
బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే
నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||

8. లక్ష్మీ గణపతి
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:
శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

9. సంతాన లక్ష్మీ గణపతి
శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||

10. దుర్గా గణపతి
తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||

11. సర్వశక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం
పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం 
భయాపహం శక్తి గణేశ మీఢే

12. విరివిరి గణపతి
సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||

13. క్షిప్ర గణపతి
దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం

14. హేరంబ గణపతి
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:
కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా

15. నిధి గణపతి
విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ

16. వక్రతుండ గణపతి
స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్

17. నవనీత గణపతి
దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||

18. ఉచ్ఛిష్గ్ట గణపతి
లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:

19. హరిద్రా గణపతి
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ
భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్

20. మోదక గణపతి
నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||

21.మేధా గణపతి
సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం 
అఖిలదేవ ప్రదాయకం మమ ఆత్మరక్ష వినాయకం

22.మోహన గణపతి
రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక 
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్

23.త్రైలోక్య మోహన గణపతి
గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే
పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ
మంగాధి రూఢం స పత్న్యా ||

24. వీర గణపతి
భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ
ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి

25. ద్విజ గణపతి
యం పుస్తకాక్ష గుణ దండకమండలు
శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం
త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||

26. ఋణవిమోచన గణపతి
సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే

27. సంకష్టహర గణపతి
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే

28. గురు గణపతి 
ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||

29. స్వర్ణ గణపతి 
వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||

30. అర్క గణపతి 
మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||

31. కుక్షి గణపతి 
సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||

32. పుష్టి గణపతి 
ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||

33. వామన గణపతి 
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||

34. యోగ గణపతి 
యోగరూఢో యోగ పట్టాభిరామో
బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో
పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:

35. నృత్య గణపతి 
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం

36. దూర్వా గణపతి 
దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||

37. అభీష్టవరద గణపతి
నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||

38. లంబోదర గణపతి 
లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||

39.విద్యా గణపతి 
భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||

40. సరస్వతీ గణపతి 
వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||

41. సంపత్ గణపతి 
పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:

42. సూర్య గణపతి 
హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||

43. విజయ గణపతి 
శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత
పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:

44. పంచముఖ గణపతి 
గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||

45. నీలకంఠ గణపతి 
వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||

46. గాయత్రి గణపతి 
యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||

47. చింతామణి గణపతి 
కల్పద్రుమాధ: స్థితకామధేయం |
చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |
య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||

48. ఏకదంత గణపతి 
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

49. వికట గణపతి 
వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||

50. వరద గణపతి 
వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||

51. వశ్య గణపతి 
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||

52. కుల గణపతి 
శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||

53. కుబేర గణపతి 
రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |

54. రత్నగర్భ గణపతి 
హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||

55. కుమార గణపతి 
మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:

56. సర్వసిద్ధి గణపతి 
పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||

57. భక్త గణపతి 
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్

58. విఘ్న గణపతి 
పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:

59. ఊర్ధ్వ గణపతి 
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,
దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా
దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే

60. వర గణపతి 
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్

61. త్ర్యక్ష్యర గణపతి 
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్

62. క్షిప్రప్రసాద గణపతి 
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్

63. సృష్టి గణపతి 
ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాస చతురం శివయో: శివాయ

64. ఉద్దండ గణపతి 
ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం
సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్

65. డుండి గణపతి 
అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:

66.ద్విముఖ గణపతి 
స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:

67. త్రిముఖ గణపతి 
శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:
పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా
పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:

68. సింహ గణపతి 
వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:
వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం
శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో
దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:

69. గజానన గణపతి 
సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|
ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||

70. మహోదర గణపతి 
మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:
మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||

71. భువన గణపతి 
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |
నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||

72. ధూమ్రవర్ణ గణపతి 
ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ

73. శ్వేతార్క గణపతి 
ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే
శ్వేతార్కమూలనివాసాయ
వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ
సూర్యవరదాయ కుమారగురవే

74. ఆధార గణపతి 
నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర
వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం
హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్
పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార
ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||

75. భూతరోగ నివారణ గణపతి 
ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |
అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |

76. ప్రసన్న విఘ్నహర గణపతి 
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

77. ద్వాదశభుజవీర గణపతి 
సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|
అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||

78. వశీకర గణపతి 
బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|
వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||
ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ
విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||

79. అఘౌర గణపతి 
గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతరాజం పురాణం
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||

80. విషహర గణపతి 
నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |
త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||

81. భర్గ గణపతి 
బాలార్కకోటి ద్యుతి మప్రమేయం
బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |
భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||

82. సర్వ సమ్మోహన గణపతి 
స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |
స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||

83. ఐశ్వర్య గణపతి 
సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |
అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||

84. మాయావల్లభ గణపతి 
సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |
కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |
వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |
సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||

85. సౌభాగ్య గణపతి 
తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |
సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||

86. గౌరి గణపతి 
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||

87. ప్రళయంకర్త గణపతి 
అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |
హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||

88. స్కంద గణపతి 
కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|
ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||

89. మృత్యుంజయ గణపతి 
సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||

90. అశ్వ గణపతి 
రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |
చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||

91. ఓంకార గణపతి 
వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం
విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||

92. బ్రహ్మవిద్యా గణపతి 
బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||

93. శివ అవతార గణపతి 
విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |
సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||

94. ఆపద గణపతి 
ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||

95. జ్ఞాన గణపతి 
గుణాతీతమౌనం చిదానంద రూపం |
చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |
ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |
పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

96. సౌమ్య గణపతి 
నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||

97. మహాసిద్ధి గణపతి 
గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||

98. గణపతి 
సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం
దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర
విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై
భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||

99. కార్యసిద్ధి గణపతి 
యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |
యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |
సదాతం గణేశం నమామో భజామ: ||

100. భద్ర గణపతి 
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||

101. సులభ గణపతి 
వందే గజేంద్రవదనం – వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం – క్వులయినీ జారకోరకా పీడమ్ ||

102. నింబ గణపతి 
విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||

103. శుక్ల గణపతి 
అంతరాయ తిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలంమహ: ||

104. విష్ణు గణపతి
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

105. ముక్తి గణపతి
పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||

106. సుముఖ గణపతి
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||

107. సర్వ గణపతి
చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:

108. సిద్ధిబుద్ధి గణపతి
సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో
విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||🙏
సేకరణ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పితృ పక్షం.. అంటే 15 రోజుల పాటు పూర్వీకులను ఆరాధించే పండుగ ఇది.

పితృ పక్షం.. అంటే 15 రోజుల పాటు పూర్వీకులను ఆరాధించే పండుగ ఇది. ఇది సెప్టెంబరు 21 మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ 15 రోజుల పాటు పూర్వీకులకు పిండ ప్రధానం చేస్తారు. హిందుమతాన్ని అనుసరించే ప్రతి ఇంట్లోనూ పితృదేవతలకు శ్రద్ధా కర్మలను చేయడం, పిండాలను అర్పించడం తప్పనిసరి అని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఈ విధంగా చేయనట్లయితే కొన్ని అనుకోని ఆందోళనలు, అశుభ సంకేతాలతో ప్రజలు కలవరపడతారు. అంటే వారి పితృ దోషాలు అంటుకుంటాయని అర్థం చేసుకోవాలి. ఈ దోషాలు అంటుకున్నప్పుడు ఇంట్లో కొన్ని అపశకునాలు, లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా బోజనం చేసేటప్పుడు ఆహారంలో వెంట్రుకల కనిపిస్తూ ఉంటాయి. కానీ విరివిగా కనిపిస్తున్నాయంటే ఆ అంశాన్ని అంత సులభంగా విస్మరించవద్దు. కుటుంబ సభ్యుల్లో బోజనం చేసేటప్పుడు చాలాసార్లు జుట్టు వస్తుంటుంది. అది ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికి అంతుపట్టదు. ఇంట్లోనే కాదు వారు బయటకు వెళ్లి రెస్టారెంట్లు, హోటెళ్లో తినాల్సివచ్చినా ఆహారంలో వెంట్రకుల వస్తాయి. కొన్ని సార్లు ఎదుటివారు ఎగతాళి చేస్తారు. ఈ విధంగా తరచూ జరుగుతూ ఉంటే మీ జాతకాన్ని ఓ సారి జ్యోతిష్కుడికి చూపించుకుంటే మంచిది.

​ఇంట్లో దుర్వాసన..

ఇల్లు ఎంత శుభ్రంగా, అందంగా ఉన్నప్పటికీ దుర్వాసన వస్తుందంటే ఆ విషయాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. అసలు చెడువాసన ఎక్కడ నుంచి వస్తుందో అర్థం కాదు. అసలు అక్కడ ఏమి లేకపోయినప్పటికీ చెడు వాసన వస్తుందని బయట నుంచి వచ్చిన వాళ్లు అంటుంటారు. ఈ విధంగా దుర్వాసన వస్తుందంటే పూర్వీకులకు కోపం వచ్చిందని అర్థం చేసుకోవాలి. పితృ దోషాలు వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని అస్సుల మర్చిపోకూడదు.

​పూర్వీకులు కలలోకి వస్తారు..

చనిపోయిన బంధువులు, పూర్వీకులు తరచూ కలలోకి వస్తున్నారని కొంతమంది చెబుతుంటారు. ఈ అంశాన్ని యాదృచ్ఛికమని చెప్పలేం. పూర్వీకుల గురించి పదేపదే కలలు కనడమంటే వారి కోరికలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయని కొంతమంది నమ్ముతుంటారు. ఒకవేళ మీకు కూడా ఈ విధంగా జరుగుతున్నట్లయితే చనిపోయిన మీ పూర్వీకులు, బంధువులకు ఇష్టమైన వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే మంచిది.

​శుభకార్యాల్లో అవంతరాలు..

మీరు కొన్ని శుభకార్యాలు చేయాలని తలపెట్టినప్పుడు వాటికి పదే పదే అవంతరాలు ఎదురవుతున్నాయంటే కొద్దిగా దృష్టిపెట్టాలి. లేదా మీరు పని మధ్యలో ఉన్నప్పడు ఏవైనా సంఘటనలు జరిగితే పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. దీపావళి, హోళీ లాంటి పండుగులప్పుడు కొన్ని అపశకునాలు లేదా దుర్ఘటనలు జరిగుతున్నాయంటే అవి పితృ పక్షం వారి అసంతృప్తిని తెలియజేస్తుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా జరిగితే బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి గౌరవంగా ఆరాధించి భిక్ష ఇవ్వాలి.

​వివాహం ఆలస్యమైతే..
 
ఈ రోజుల్లో వివాహం ఆలస్యంగా చేసుకోవడమనేది తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఏమి కాకుండానే పెళ్లిళ్లు ఆలస్యమవుతాయి. ఇలా సంబంధం విచ్ఛిన్నమయ్యే ప్రతిసారి పూర్వీకుల అసంతృప్తిని తెలియజేస్తుంది. కొన్నిసార్లు పూర్వీకుల కోపం వల్ల విడాకులు తీసుకోవాల్సిన స్థితి రావచ్చు. ఇంకా పరిస్థితుల ఎంత దూరమైన వెళ్లవచ్చు. కాబట్టి ఇంట్లో పూర్వీకులను ఆరాధించడం తప్పనిసరి.

​సంతానం లేకపోవడం..

కొన్ని కారణాల వల్ల పూర్వీకులు మీపై కోపంగా ఉండే అవకాశముంది. మీరు వారితో మంచిగా ప్రవర్తించకపోయినా, వారి గురించి పట్టించుకోకపోయినా.. పితృ దోషం జరుగుతుంది. ఫలితంగా సంతానం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పూర్వీకులకు సేవ చేయడం ఎంతో ముఖ్యం. వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో 15 రోజుల్లో ఏదోక సమయంలో వారికి పిండప్రధానం చేసి వారిని సంతృప్తి పరచడాలి. వీలైతే వారి పేరు మీద విరాళాలు ఇస్తే మంచిది

శ్రీ దత్తాత్రేయ స్వామి అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు.

ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః

శ్రీ దత్తాత్రేయ స్వామి  అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు.
అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ


ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనఘాదేవి లో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామి లో బ్రహ్మ,రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వ జ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన, ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు (అణిమా,లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం ,ఈశిత్వం, వశిత్వం, కామావసాయితా, మహిమా ) పుత్రులై అవతరించారు .

అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంనందు ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది, కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే “మధుమతి ” అనే పేరు కూడా కలదు. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము . “అఘము” అంటే పాపము, ఇది మూడు రకాలు. అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం.

దత్తుని రూపంలో అంతరార్థం:
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే •

1. మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.

2. నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.

3. ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.

4. మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.

5. త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.

6. చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.

7. డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.

8. కమండలము:సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.

దత్త తత్వం:
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!

దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది.

శ్రీ సిద్దమంగళ స్తోత్రం

1. శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీ పాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

5. సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

6. దో చౌపాతీ దేవ్‌లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

7. పుణ్యరూపిణీ రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

8. సుమతీ నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పరమ పవిత్రమయిన యీ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమీ వ్రతము చేసి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏక భుక్తం చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుదురు.

ఓం ద్రాo దత్తాత్రేయాయ నమః

పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం " పితృ దోషం' ...

పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం "
పితృ దోషం' ...

మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...
అలాగే... 
తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.
మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.
అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -
 మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే.
అదే
" పితృ దోషం "
ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.
అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.
పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.
ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.
వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.
పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...
చిన్న వారు అకాలమరణం పొందడం 
శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.
అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా
ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం
మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం
ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం
దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.
స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...
అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.
1. కాశీ
2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)
అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.
విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .
అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం -
స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....
పాలు అన్నముతో చేసిన పాయసం,
అన్నము, ముద్దపప్పు, నేయి,
వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు . 
స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.
ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును ) 
అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.
ఈ ఆలయ ప్రాముఖ్యము మా గురువు గారు అయిన తంత్ర గురు "భరణి స్వామి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !
ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని గ్రూపులో పెట్టడం జరిగింది !
చేరుకొనే విధానం :
అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "
ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశిశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి !
ఈ ఆలయ విశేషాల గురించి ' స్మశాన నారాయణుడి పూజ గురించి సంప్రదించవలసిన ఆలయ పూజారి నంబర్లు :
9182883807,
7995464344.
పదిమందికి ఉపయోగపడే విషయం . దయవుంచి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి
సర్వేజనా సుఖినోభవంతు
శ్రీ గురుభ్యోన్నమః

*శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఏ దేవాలయానికి వెళ్లకూడదంటారు.. ఎందుకు ?*

*శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఏ దేవాలయానికి వెళ్లకూడదంటారు.. ఎందుకు ?*


తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకొంటారు. అవి పాపనాశనం, కాణిపాకం.. చివరగా శ్రీకాళహస్తి.

శ్రీకాళహస్తి దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదంటారు. అలా వెళితే అరిష్టం అని హిందు సాంప్రదాయంలో చెప్పబడింది. శ్రీకాళహస్తి దేవాలయమే ఎందుకు చివరగా దర్శించుకోవాలి. మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. వెళ్తే ఏమవుతుంది?

శ్రీకాళహస్తి దర్శనం తరువాత నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి?
పంచ భూతాల నిలయమైన ఈ విశ్వంలో (గాలి, నింగి, నేల, నీరు, నిప్పు) వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వరగా వెలసిన వాయులింగం.

అయితే ఇక్కడి గాలిని తగిలిన తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదు అనేది ఇక్కడి ఆచారం. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా తొలగుతాయని చెబుతారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణేశ్వరుని దర్శనంతో కాలసర్పదోషం తొలుగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న వారు నేరుగా ఇంటికే వెళ్లాలని చెబుతారు ఇక్కడి  పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ జరగదని ఇక్కడి విశ్వాసం.

గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అందరు దేవుళ్ళకు శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని పురాణాలలో ఉంది. ఇందుకు నిదర్శనంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దేవాలయంతో సహా మిగిలిన అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణ జరిపిన తరువాతే పునఃదర్శనం ప్రారంభమవుతుంది.

కానీ మూసివేయని ఒకే ఒక్క దేవాలయం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరునిది. ఇక్కడి దేవుడికి గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. గ్రహణ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా చేస్తారు. అందుకే ఇక్కడి దేవుడి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయానికి వెళ్లనవసరం లేదన్నమాట.

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS