Monday, January 31, 2022

జమ్మిచెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత?

 జమ్మిచెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత?

            🌳🌳🌳🌳🌳


దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే! కానీ ఈ దసరా రోజుకీ జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి.

కాస్త జమ్మి గురించి...

జమ్మి భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకనే రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే ‘అరణి’ని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ వరకు పొడి ప్రాంతాలలోని ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తోంది.


పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి; దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి; ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు.

దసరా- జమ్మిచెట్టు

ఏడాదిపాటు అజ్ఞానవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది చెబుతారు (రామస్య ప్రియదర్శనీ). పైగా జమ్మిచెట్టుని స్త్రీస్వరూపంగా (శక్తిగా) భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే, ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట.


జమ్మి చెట్టుకి మన పురాణాలలోనూ, జీవితాలలోనూ ఇంతటి సంబంధం ఉండబట్టే దసరానాడున జమ్మిచెట్టుకి పూజలు చేస్తారు. శమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఈ క్రింది శ్లోకాలను చదువకుంటారు-

‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.’’

‘’శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,

ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ,

కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,

తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''

జమ్మి బంగారం

పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్నా ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా కుబేరుడు ఒకనాడు రఘమహారాజుకి భయపడి జమ్మిచెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ ఎలాగూ ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలను కూడా జతచేస్తారు.

పాలపిట్ట

దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ... అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ బయల్దేరింది.

కొసమెరుపు

జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ (UAE) భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టుని నాటమని సూచిస్తోంది. కానీ మనదగ్గర మాత్రం ఉన్న కాసిని జమ్మి చెట్లూ నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి పిల్లలైతే జమ్మి చెట్టుని గుర్తిస్తారో లేదో కూడా అనుమానమే! ఇక పాలపిట్ట సంగతి చెప్పనే అక్కర్లేదు. విజయదశమినాడు పంజరాల్లో పాలపిట్టలను తీసుకుని వచ్చి దర్శనం చేయిస్తున్నారంటే... ఇవి అంతరించిపోయేందుకు ఎంతటి సమీపంలో ఉన్నాయో తెలిసిపోతుంది. జమ్మిచెట్టు, పాలపిట్ట తిరిగి మన జీవితాలలో భాగమైనప్పుడే అసలైన విజయదశమి

సమస్యలు-తంత్ర పరిహారములు

 సమస్యలు-తంత్ర పరిహారములు



దంపతులకు వివాహం జరిగి చాలా కాలం గడచినా సంతానం కలుగకపోవటం, గర్భస్రావాలు జరగడం, ఎన్ని మందులు తీసుకన్నా సంతానం కలుగకపోవడం, సంతానము తమ మాట వినకపోవటం, సంతానం ప్రేమ వ్యవహారాలలో చిక్కుకోవడం, వాటి వలన తల్లిదండ్రులు మానసిక , సామాజిక సమస్యలను ఎదుర్కోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ సంతాన కారక గ్రహములు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం వలన ఇవన్నీ జరుగుతాయి. దీనికి పరిహారం సంతానేష్టి, నవనాగమండల తంత్ర పరిహారములు. ఏవిద్య సరిగ్గా రాకపోవటం, పై చదువులకు ఆటంకము కలుగటం పోటీ పరీక్షలలో నెగ్గలేకపోవటం, విద్యాలయాలలో వత్తిళ్ళు, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఇతర విషయాల వలన చదువు మందగించటం, తద్వారా తల్లిదండ్రులకు విద్యార్థుల చదువుల రూపములో  ధన నష్టం జరుగుతుంది.12వ భావ వ్యతిరేకత అనుకూలతలను అనుసరించి చంద్ర గురు గ్రహములు ఫలితాలను ఇస్తారు. ఉద్యోగ సమస్య పరిష్కారమునకు తగిన హోమం వలన ఉద్యోగ. విదేశీయాన సమస్యలు తొలగిపోతాయి. 6వస్థానాధిపతి జాతకునిపై వ్యతిరేక ఫలితములను ఇస్తున్నప్పుడు ఊహించని విధముగా అనారోగ్యములు , దీర్ఘ కాలిక వ్యాధుల ప్రభావం ఎక్కువ అవుతుంది. హోమముల ద్వారా ఉపద్రవములను తొలగించుకోవచ్చు. 

ఉదాహరణగా :- 

జౌదుంబరీభి రిధ్మాభిః పశుకామస్య శస్యతే | దధ్నా చైవాన్నకామస్య పయసా శాన్తి మిచ్ఛతః ||

అపామార్గ సమిద్భిశ్చ కామయన్‌ కనకం బహు | కన్యాకామో ఘృతాక్తాని యుగ్మశో గ్రధితాని చ ||

జాతి పుష్పాణి జుహుయాద్గ్రామార్ధీ తిలతండులమ్‌ | వశీకర్మణి శాఖోటవాశాపామార్గ మేవచ ||


మేడి సమిథల యిధ్మములతో జేయుహోమము పశుసమృద్ధి నొసంగును (సమిథలు ఇరువది యొకటి కట్టిన ఇధ్మమం) అన్నకాముడు పెరుగు తోను శాన్తికాముడు పాలతోను హోమము చేయనగును. సువర్ణ సమృద్ధి గోరునాతడు ఉత్తరేణిసమిధల తోను కన్యాకాముడు నేతితో తడిపి రెండేసిజాజిపూలు కలిపి హోమము చేయవలెను. నువ్వులు, బియ్యము గ్రామార్థి (ఒక గ్రామము సొంతము కావలెనని కోరువాడ) హోమము సేయవలెను. వశీకరణ మందు శాఖోటము = బరివెంక సమిధలు వాశా (శీ) బాడిద సమిథలు ఉత్తరేణి సమిథలను వాడవలెను.ఇది గురువులు (ఉపదేశం) చెప్పిన విధముగా చేయుట వలన శీఘ్ర ఫలములు లభించును.

పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు

 పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు 🌺🙏



🌺 సంతానం విషయంలో విచారం ఉన్నవారు కాళికాదేవికి నిమ్మకాయలదండ సమర్పిస్తే సంతానవృద్ధి చెందుతారు. నిమ్మకాయలు బేసి సంఖ్యలో ఉండేట్లు చూసుకోవాలి.🌺


🌺 భూవివాదాలు ఏర్పడినప్పుడు ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతివంట లేదా స్వగృహంలోనే భోజనంచేయడం కొంతవరకు వివాదాల్ని తగ్గిస్తుంది.


 ఇల్లు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్నవారు ఇంటిలోపల ఏదోఒక గదిలో పసుపురంగును వేయిస్తే ఆఇల్లు అతితొందరలో మంచిధరకు అమ్ముడువుతుంది.


 రహస్య శత్రువులు ఉన్నవారు 7 ఎండు మిరపకాయలను పసుపురంగు గుడ్డలోవేసి కట్టి దానిని తీసుకెళ్లి ఇంటికిదూరంగా పడేసిరండి. ఇది రాహుకాలంలో చేయడం సత్ఫలితాన్నిస్తుంది. ఇలా చేసేటప్పుడు మనసులో శత్రునివారణ జరగాలని కోరుకోవాలి.🌺


🌺పంట దిగుబడి సరిగారాని రైతులు పొలంలో భూసూక్త పారాయణం చేస్తే మంచిఫలితం ఉంటుంది.


 చుట్టుపక్కలవారితో మీకు గొడవలు జరుగుతుంటే ఉత్తరంవైపున ఏవైనా పిచ్చిమొక్కలు ఉన్నాయేమో గమనించుకుని అవిలేకుండా చూసుకోండి.


 అధికమైన రుణబాధలతో మీరు బాధ పడుతుంటే ప్రతినిత్యం ఇంట్లోనుంచి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు మీకాళ్లు గడపకు తగలకుండా చూసుకోండి.


 ఏదైనా కార్యాలలో ఆటంకాలు ఎదురవుతుంటే వినాయకుడిని గరికతో నిత్యం పూజించండి.🌺


🌺 ఆ కారణంగా అవమానాలపాలు ఆవుతున్నవారు ఎడమచేతికి ఎరుపురంగు తాడు రక్షగా కట్టుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుంది.


  దాయాదులతో ఆస్తి తగువులు ఉన్నవారు  ఉన్నవారు పిత్రుకర్మలను నిర్వర్తించడం తోపాటు ప్రతినిత్యం కాకికి అన్నంముద్దపెడితే తప్పకుండా న్యాయంగా మీకురావాల్సిన ఆస్తి వస్తుంది.


 మీ సంపాదన చాలీచాలకుండా ఉంటే శుక్రవారంనాడు గులాబీపువ్వును అత్తరులోముంచి మీపూజామందిరంలో ఉంచండి. ఇలా 6 శుక్రవారాలు చేస్తే మీసంపాదన  గతంకంటే కొంతపెరుగుతుంది.🌺


🌺అకారణవివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటే వెంటనే నవగ్రహాలకు ప్రదక్షిణలు ప్రారంభించండి.


 చదువులో వెనకపడిపోతుంటే మీరు చదువుకునే గదిలో హంసబొమ్మను పెట్టుకొని దాని ఎదురుగా చదువుకోండి.


 మీకు శత్రువులు ఎక్కువవుతుంటే మంగళవారంనాడు పారుతున్ననీటిలో ఆముదంలో ముంచిన తొమ్మిది రాగిముక్కలను విడిచిపెట్టండి.🌺


🌺దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీ వయసెంతో అన్ని బొగ్గు ముక్కలను తీసుకుని పారేనీటిలో వదలండి.


 ఏ కారణం చేతనైనా మీరు విదేశాలు వెళ్లే అవకాశం మిస్ అయిపోతుంటే గణపతి ఆలయంలో నిమ్మకాయడొప్పలో దీపారాధన చేయండి.


చదువుకునే పిల్లలకి ఏకాగ్రత కుదరడానికి ఐదు గోమతిచక్రాలను ఆకుపచ్చని వస్త్రంలోవేసి మూటకట్టి 

స్కూల్ బాగ్ లో పెట్టండి.🌺


🌺 వ్యాపారాభివృద్ధికి 27 గోమతి చక్రాలను పట్టువస్త్రంలో మూటకట్టి వ్యాపార స్థలానికి లోపలిసింహద్వారం పైభాగాన కట్టండి. విపరీతమైన జనాకర్షణతో ధనాకర్షణకూడా పొంది నరఘోష, దిష్టి తొలిగి విపరీతంగా వ్యాపారాభివృద్ధి చెందగలదు.


పూజామందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పొంగలి నైవేద్యంగాపెట్టి ఉసిరికాయతో నేతి దీపారాధనచేస్తే లక్ష్మీకటాక్షం కలిగి దారిద్ర్యబాధలు తొలగుతాయి.🌺


🌺 శత్రువులు ఎక్కువ ఉన్నప్పుడు లేదా కుటుంబసభ్యులే వ్యతిరేకులవుతూ ఉంటే లేదా ఏది తలచినా జరగకుండా ఉన్నప్పుడు నారింజకాయని రెండుముక్కలుగా చేసి డొప్పలలో ఉన్న తొనలని తొలగించి, పూజామందిరం దగ్గర వీటిని పసుపు కుంకుమలతో అలంకరించి డొప్పలమధ్యన తేనెలో ముంచిన పువ్వొత్తులతో దీపారాధన చేయండి. శత్రువులు మిత్రులవుతారు. ఊహించిన దానికంటే ఎక్కువగా శుభఫలితాలను పొంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు.🌺


🌺లక్ష్మీ దేవి ఆలయంలో ఏదైనా శుక్రవారం రోజున యజమాని చేతితో సమానమైన ఎత్తుకల్గిన రెండు దీపపుకుందెలను ఆవునెయ్యి ఒత్తులతో గుడిలో దీపారాధనచేసి అమ్మవారికి సమర్పిస్తే కటికదారిద్ర్యంతో బాధపడే వారికీ, ఆర్థికఇబ్బందులతో బాధపడేవారికీ, వ్యాపారాదులు నడవక ధనపరంగా రుణబాధలు పడుతున్నవారికీ ఈ దీపదానంవల్ల మంచి ధనికులు కాగలరు.🌺


🌺మంగళవారంరోజున సుబ్రహ్మణ్య స్వామిగుడిలో యజమాని లేదా యజమానురాలి యొక్క చేతిపరిమాణంలో గల దీపపుకుందెల్లో ఆవు నెయ్యి వత్తులు నింపి స్వామికి దీపారాధనచేసి అనంతరం ఆలయానికి సమర్పిస్తే గృహంలో కుజదోషమున్న పిల్లలు ఉంటే దోషనివృత్తి జరుగుతుంది. అలాగే ఋణం,రోగ, శత్రుబాధలు తొలగిపోతాయి.

గర్భవతులు: వాస్తు, పూజలు, వ్రతాలు

 గర్భవతులు: వాస్తు, పూజలు, వ్రతాలు



మహిళలకు భక్తిభావం అధికంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు చేయడంలో శ్రద్ధ చూపిస్తారు. నిత్యం పూజ కోసం పూలు కోసి, మాలగా కట్టి భగవంతునికి సమర్పించడంలో సంతోషాన్ని, సంతృప్తిని పొంతుతారు. పూజలు, వ్రతాలు, అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ ఉంటారు. ఇక శ్రావణ.. కార్తీక వంటి మాసాల్లో అయితే వాళ్లు మరింత తీరిక లేకుండా దేవుని సన్నిదానంలోనే గడుపుతుంటారు.


అయితే వారు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..? వారిపై ఇంటి వాస్తు ప్రభావం పడుతుందా..? అనే సందేహాలు ప్రతి వారిలో వస్తుంటాయి.


వాస్తు ప్రభావం

గర్భవతి నివాసం ఉండే గృహ ప్రభావం ఆమెపైన, ఆమె గర్భస్థ శిశువుపైనా పడుతుందని శాస్త్రం చెబుతోంది. అందువల్ల మూడు నెలలు పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు, కొత్త నిర్మాణాలు చేయకూడదు. ఇంటికి మార్పులు చేసేటపుడు పూర్తిగా చేయకపోయినా, కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం వలన ఆగిపోయినా వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్త శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కనుక ఇంటికి మార్పులు, చేర్పులు కాని, కొత్త నిర్మాణం చేపట్టడం గానీ మంచిది కాదు.


పూజలు, వ్రతాలు

 స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా? లేదా ? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలనీ, కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని, గుడి చుట్టు ప్రదక్షిణాలు చేయకూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ, పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదు.


కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం,  కోటి స్తోత్రాలు చదవడంకన్నా ఒకసారి జపం చేయడం, కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.


5వ నెల వచ్చే వరకు వ్రతాలు చేయవచ్చని, ఆ తర్వాత చేయకూడదని శాస్త్రం చెబుతోంది.


పూజలు, వ్రతాలు పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి.. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులుపడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది...

ఆలయాలలో దానం చేయవలసిన వస్తువులు

 ఆలయాలలో దానం చేయవలసిన వస్తువులు



ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే.. ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం. 


దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు.


ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటంలాంటి శ్రమదానాలకు శ్రీమహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్పాయి పురాణాలు. అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు. గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు.


చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. 


మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు. కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది. వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి. ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తే ఫలితం. చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది.


దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం. ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు. దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది.


దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు. వెండి మంచి రూపానికి, బంగారం సర్వకోరికలు సిద్ధించటానికి దానం చేస్తుంటారు. పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి, బండిని లాగేఎద్దునిస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచరగాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా వేయింతల ఫలం లభిస్తుంది.


వన్యమృగాలు, పక్షులదానం అగ్నిష్ఠోమయాగ ఫలితాన్ని ఇస్తుంది. పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి. నీలపతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి. శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి, దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.


దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహపాప్తికి కారణమవుతుంది. ఈ వరుసలోనే ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహితస్థితి కలుగుతుంది. వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే. పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి, జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్‌కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.


దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలోవారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.

శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..? బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే? ఏమి జరుగుతుంది

 శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..? బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే? ఏమి జరుగుతుంది



శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. సంపదలతో తులతూగాలి అనుకునే వారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంట పసుపు, ఉప్పు అయిపోయాయనే మాట వినబడ కూడదు. పసుపును కొనాలి. లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు.


ఉప్పు, పసుపు అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయే లోపు ఇంట తెచ్చుపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు.


ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు పొందాలంటే.. విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు, మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.


శుక్రవారం నాడు సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను వినియోగించాలి.


* శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి, రంగ వల్లికలతో అలంకరించి.. దీపారాధన చేయాలి.


రోజూ లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితరులు, దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ వుండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి.


శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచివుంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది.


* తెల్ల వక్కలను, నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనవృద్ధి వుంటుంది.


శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

అలాగే శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్ర దానం చేసినా శుభఫలితాలుంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించినా, శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

108 నవాంశలు వాటి ఫలితాలు.

జోతిష్యంలో

108 నవాంశలు వాటి ఫలితాలు.💐


27 నక్షత్రాలలోను ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. మొత్తం నూట ఎనిమిది పాదాలే గాక వాటికి విడివిడిగా రాశ్యంశలు కూడా ఉంటాయి.

           అశ్వని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణం, పూర్వాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు మేషాంశకు, ద్వితీయ పాదాలు వృషభాంశకు, తృతీయ పాదాలు మిధునాంశకు, చతుర్ధ పాదాలు కర్కటాంశకు చెంది ఉంటాయి.

          భరణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, చిత్ర, అనూరాధ, పూర్వాషాడ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు సింహాంశకు, ద్వితీయ పాదాలు కన్యాంశకు, తృతీయ పాదాలు తులాంశకు, చతుర్ధ పాదాలు వృశ్చికాంశకు చెంది ఉంటాయి.

 కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాడ, శతభిషం, రేవతి  అనబడే తొమ్మిది నక్షత్రాల ప్రధమ పాదాలు ధనురాంశకు, ద్వితీయ పాదాలు మకరాంశకు, తృతీయ పాదాలు కుంభాంశకు, చతుర్ధ పాదాలు మీనాంశకు చెంది ఉంటాయి.

1) అశ్వని నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

1) తస్కరాంశ:- అశ్వని నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. మంచి సంపద, భోగాలను అనుభవించువాడు, తగాదాలనిన ఇష్టం కలవాడు, లోభ గుణం కలవాడు, పరస్త్రీల యందు ఆసక్తి కలవాడు, చోర గుణం కలవాడు అగును.

2) భోగ్యాంశ:- అశ్వని నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ధర్మ నిరతుడు, తేజస్సు కలవాడు, ధన, ధాన్యాభివృద్ధి కలవాడు, దాన గుణం కలవాడు అగును.

3) విచక్షణాంశ:- అశ్వని నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. సమస్త భోగాలు కలవారు, ప్రతి పనిని సాధించువాడు, పనులను నేర్పుతో చేయువాడు అగును.

4) ధర్మాంశ:-అశ్వని నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది.  భగవంతుడి పైన భక్తి కలవాడు, పూజలు చేయువాడు, సంధ్యావందన తత్పురుడును, నిత్యం ధర్మ కార్యాచరణలో ఉండువారు అగును.

2) భరణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

5)నృపాంశ:- భరణి నక్షత్ర ప్రధమ పాదం రవిది. గౌరవ, మర్యాదలు పొందువారు, మంచి లక్షణాలు కలిగి ఉంటారు. కార్య సఫలత కలవారు, ధర్మాత్ముడు అగును.

6) నపుంసకాంశ:- భరణి నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. లోభత్వం కలవారు, నపుంసకుడు, పిసినారి, పనులయందు నేర్పరి, మధ్యవర్తిత్వం చేయువారు అగును.

7) అభయాంశ:-భరణి నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ప్రశాంతమైన మనస్సు కలవారు, ఉత్సాహవంతులు, శూరులు, బాద్యతారాహిత్యమైన జీవితాన్ని ఆశించేవారు అగును.

😎 పాపాంశ:- భరణి నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. క్రూర స్వభావం కలవారు, కృతజ్ఞత కలవారు, అధిక పుత్ర సంతానవంతులు, ఫలితాలను ఆశించని వారు అగును.

3) కృత్తిక నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

9) ధానాంశ:- కృత్తిక నక్షత్ర ప్రధమ పాదం గురువుది. దాన, ధర్మాలు చేయువారు, ధనవంతులు, ప్రతాపవంతులు, పనులలో నైపుణ్యం కలవారు అగును.

10) పాపాంశ:- కృత్తిక నక్షత్ర ద్వితీయ పాదం శనిది. మొహమాటం లేకుండా ఉంటారు, పాప కర్మలు చేయువారు, వేశ్యా గృహాలలో జీవించే వాళ్ళుగా ఉంటారు.

11) ఉగ్రాంశ:- కృత్తిక నక్షత్ర తృతీయ పాదం శనిది. చెడు సావాసాలు చేయువారు, నైపుణ్యం ఉన్నప్పటికి మంద బుద్ధులుగా ఉంటారు, దుష్ఠులైన మిత్రులు కలవారు అగును.

12) ఉత్కృష్టాంశ:- కృత్తిక నక్షత్ర చతుర్ధ పాదం గురువుది. విద్యా వినయాలు కలవారు, ధర్మాత్ములు, ధార్మికులు, ఎల్లప్పుడు  సంతోషం కలవారు అగును.

4) రోహిణి నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

13) సేనాంశ:- రోహిణి నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. చంచలత్వం కలవాడు, ఎర్రని వెంట్రుకలు కలవాడు, శూరుడు, దెబ్బలాటలకు ప్రీతి కలవాడు, నిష్టూరంగా మాట్లాడు వాడు అగును.

14) భృత్యాంశ:-రోహిణి నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. పొడవైన శరీరం కలవాడు, ఓటమిని అంగీకరించలేని తనం కలవారు, మంచి నడవడిక కలవారు అగును.

15) విద్యాంశ:- రోహిణి నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. పండితులు గాను, కవులు గాను, గణిత శాస్త్రజ్ఞులు గాను, లోక వ్యవహార జ్ఞానం కలవారు గాను ఉంటారు.

16) అత్యాశ:- రోహిణి నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఇతరుల ధనంపైన ఆశపడేవారు, తెలివైన వారుగాను, బుద్ధిమంతులుగాను, సజ్జనులుగాను ఉందురు.

5) మృగశిర నక్షత్ర నాలుగు పాదాలకు అంశ గుణాలు

17) రాజాంశ :- మృగశిర నక్షత్ర ప్రధమ పాదం రవిది. స్దూలమైన శరీరం కలవారు, శత్రువులపైనా విజయం సాదించువారు, ధనవంతులు, తలకు మించిన పనులను నెత్తిన వేసుకొనేవారు గాను ఉంటారు.

18)చండాంశ:- మృగశిర నక్షత్రం ద్వితీయ పాదం బుధుడిది. యజ్ఞ యాగాదులు చేయువారు, భాగ్యవంతులు గాను, మంచి వాక్ శుద్ధి కలవారు గాను ఉంటారు.

19) అభయాంశ:- మృగశిర నక్షత్రం తృతీయ పాదం శుక్రుడిది. ఉదార స్వభావం కలవారు గాను, దేనికైనా సిద్ధపడేవారు గాను, ముఖ వర్చస్సు కలవారుగాను, మంచి పనులు చేయువారు, శౌర్యవంతులు గాను ఉందురు.

20) నీచాంశ:-మృగశిర నక్షత్రం చతుర్ధ పాదం కుజుడిది. కామత్వం కలవార…


కుజ గ్రహ దోషానికి సాధారణ పరిహారములు

 సాధారణంగా  కుజదోషం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు.


కుజ దోషంగా చెప్పబడే స్థానాలు..లగ్నం, రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంట, పన్నెండవ ఇంట  కుజుడు ఉండకూడదు.వివాహ సమయంలో వధూవరుల జాతకాలు పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించవలసిన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతాన హీనత , ఇళ్ళు సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహపొతనలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటే ఏయే ఫలితాలోకూడా చెప్పబడింది

వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి. కావున భయపడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి, జాతక పరిశీలన చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది. వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహర క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం, నమ్మకము, విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ  ఉండాలి. భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్న భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు జాతకంలో కుజ  గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు  కుజగ్రహ దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.  


కుజ గ్రహ దోషానికి సాధారణ పరిహారములు


సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణలు చేయాలి.

ఎర్రని పుష్పాల మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.

బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పు కొద్దిగా  గోవుకు తినిపించాలి.

మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.

స్త్రీలు ఏడు మంగళవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, దానం చేయాలి. ఎర్ర చందనం, కందులు, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దానం ఇవ్వాలి.

కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.

రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.

పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.

రక్త దానము చేయుట చాల మంచిది.

అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.

కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కంది పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.

రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తాంబూలంతో మంగళవారం  దానం చేయాలి.

కుజగ్రహం వలన  కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వారా నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.

కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.

ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు తల స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వత్తుల దీపం వెలిగించి సాయంకాలం  కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్యా భర్తలు  సంతోషంగా ఉంటారు, సమయానికి డబ్బు అందుతుంది.

కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగే అవకాశం కలదు.

Sunday, January 30, 2022

నవగ్రహలు * మానవ శరీరం *!!

 నవగ్రహలు * మానవ శరీరం *!!




చాల మంది భక్తులు భగవంతుని దర్శనార్థం గుడికి వెళ్ళడం జరుగుతూ వుంటుంది 



దైవ దర్శనార్థం తరువాత అక్కడ నవగ్రహలు కనబడగానే తొమ్మిది చుట్లు తిరగడం జరుగుతూ వుంటుంది *


అలా నవగ్రహల చుట్టూ తిరగడం వల్ల మనకు పట్టిన శని ప్రభావం తగ్గు తుందని అందరూ భావించడం జరుగుతూవుంటుంది *



కానీ ఇందులో ఇంకొక విషయం కూడా దాగి వున్నదని చాలా మందికి తెలియదు *


అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకొందాం *


మన మానవ శరీరం నవగ్రహాల నిర్మితం *


శరీరంలోని వున్న ప్రతి అవయమ భాగాలపై నవగ్రహ కూటమిలో వున్న ఒక్కొక్క గ్రహం యెుక్క ఆధిపత్యం ఉండటం జరుగుతూ వుంటుంది *


కనుక ప్రతి గ్రహాన్ని భక్తితో స్మరిస్తూ తిరగడం వల్ల ఆ గ్రహం యెుక్క అనుగ్రంతో మన శరీరంలో వున్న ప్రతి అవయవం సంవూర్ణ ఆరోగ్యాన్ని సంతరించడం జరుగుతుంది *


కనుక మన శరీరంలో వున్న అవయవాలపై ఏఏ గ్రహం యెుక్క ప్రభావం వుంటుందో తెలుసుకొందాం *


1.రవి..

వెన్నెముక,శారీరకబలం,గుండే


2.చంద్ర..

పొట్ట,జీర్ణకోశం


3.కుజ..

తల,కండరాలు,ఎముకలలోనిమజ్జ, రుచిని..వాసనని తెలిపేవి.


4.బుధ..

జ్ఞానేంద్రియలు,చర్మం,చేతులు,అవటుగ్రంధి,నరాలు


5.గురు..

కాలేయం,తొడలు,పాదాలు,ఎదుగుదల


6.శుక్ర..

స్పర్శజ్ఞానం,మూత్రపిండాలు,మెడ


7.శని..

చర్మం,జుట్టు,పళ్ళుఎముకలు,వెన్నుముక


8.రాహు..

ఊపిరితిత్తులు,మోకాళ్ళు,వెన్నముక,కాటరాక్ట్


9.కేతు..

కళ్ళు,పొట్ట


నవగ్రహసోత్రం


'ఆదిత్యయ చ సోమాయ మంగళాయ బుధాయ చ / 

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః//'


ప్రతి ఒక్కరూ నవగ్రహ ప్రధక్షన సమయంలో ఈ సోత్రం జపిస్తూ తరగడం వల్ల మనకు నవగ్రహల యెుక్క అనుగ్రహం సిద్ధిస్తుంది *


నవగ్రహ అనుగ్రహం సిద్ధిరస్తు

Saturday, January 29, 2022

రాహు దోషం

 రాహు దోషం



   అన్ని గ్రహాలు రవి వలన అస్తంగతులైతే.. రవి చంద్రులను కూడా నిస్తేజులుగా చేయగల చండ ప్రచండుడు రాహువు. అందుకే ఈయన స్తోత్రంలో "చంద్రాదిత్య విమర్ధనం" అని మర్దించే శక్తీ రాహువుకు గలదని చెప్పబడింది. ప్రాణ శక్తీ కారకుడైన సూర్యుని, మనః శక్తీకి కారకుడైన చంద్రుని మర్ధించే శక్తి ఉంది. అందుకే రాహు మహా దశః బాగు లేనివారు పడే పాట్లు వర్ణనాతీతం.

కొత్త దాన్ని ఆవిష్కరించే స్వభావం రాహువుది. మనుషులకు ఫారిన్ ప్రయాణం కానీ, వ్యక్తులతో పరిచయాలు గానీ, అలవాట్లతో అనుభూతులు కానీ కల్గించేవాడు రాహువు. ఈ గ్రహం గారడీ చేయించే శక్తి కలవాడు. అబద్ధాలు, అల్లకల్లోలాలు, కొత్త అలవాట్లు. కొత్త వేష భాషలు కలిగించడంలో సిద్దహస్త్తుడు. గ్రీకు పురాణ గాధల్లో డ్రాగన్ అనే రాకాసి బల్లి వంటి జంతువు తలగా రాహువును, తోకగా కేతువును ప్రతీకలుగ చిత్రీకరించారు. శని గ్రహం వలే రాహువు కర్మ గ్రహం. పూర్వ జన్మ కర్మల్ని అతి విడ్డురంగా అనుభవింప చేయగలడు. దుర్మార్గ స్వభావం కలవారు. అందలం ఎక్కడానికి సాహస కార్యక్రమాలు చేపట్టి వారికీ చేయూత ఇవ్వడానికి రాహువు బాగా సహకరిస్తాడు.

అంతేకాదు రాహు మహా దశలో ఖచ్చితంగా పితృ కర్మలు చేయిస్తాడు. కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రాహు దశఃకానీ, అంతర్ దశః కానీ జరుగుతున్నపుడు తండ్రి, తాత, తల్లి, అమ్మమ్మలో ఒకరికి ఆయువు తీరుతుంది. రాహువుకు యోగాలు కల్గించడం ఉన్నా, అనుభవంలో అవయోగాలు ఎక్కువుగా కల్గిస్తాడు."రాహు మహా దశః పట్టిందిరా అనేది వాడుక. అల్పుల అందలం ఎక్కుట వల్ల ఏర్పడిందే. ఫారిన్ భాషలు, ఫారిన్ వస్తువులు ఫారిన్ జబ్బులు తెప్పించడంలో రాహువుదే ఆగ్రాతాంబూలం

రాహువు వల్ల ఏర్పడే పరిణామాలు

రాహువు వల్ల పలు పరిణామాలు ఏర్పడతాయి. రాజ్యాధికారం కల్పించుటలో , పదవిచ్యుతుని చేయుటలో రాహువు కారకుడు. వర్ణాంతర వివాహాలు చేసుకోనటలో కూడా ప్రభావం కలవాడు. కుట్రలు, పన్నాగాలు, ఎత్తు గడలు, కులద్రోయుట వంటి నీచ గుణాలు కలిగిస్తాడు. సాంప్రదాయాల సంస్కరణకు, మతబ్రస్థత్వాం పట్టిస్తాడు. తక్కువ స్థితిగల స్త్రీ సాంగత్యానికి పురిగొల్పుతాడు. సంకుచిత ఆలోచనలు కల్గిస్తాడు. వ్యసనపరులుగా, పోకిరిలుగా మార్చి దుష్ట్ట స్నేహాలను కల్గిస్తాడు. నైరుతి దిశలో కలిగే లాభ నష్టాలకు కారకుడు. పీడ కలలు, భయందోళనలు కలిగిస్తాడు. రహస్య స్టావరాల పనులు, రహస్య మంతనాలకు ప్రేరేపిస్తాడు. వన దుర్గ దేవి ఆరాధనతో రాహువు ప్రీతీ చెందుతాడు. ఉర్దూ, పర్షియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవడానికి కారకుడు అవుతాడు.

రాహువు కలిగించే బాధలు

రాహువు అనేక బాధలు కలిగిస్తాడు. కుటుంబంలో కల్లోలాలు సృష్టిస్తాడు. స్వంత బుద్ధి లోపించి ఇతరుల చెడు సలహాలను పాటించుట, ముర్ఖునిగా ప్రవర్తించుట, అధికార దుర్వినియోగం చేసి అల్లరి పలగుట, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల నష్టాలు, పొలిసు గూడచారి సంస్థల వల్ల బాధ కలుగును. కుటుంబంలో పెద్దవారికీ ఆకస్మిక మరణాలు, పిల్లలు తప్పిపోవుట లేదా ఎత్తుకు పోవుట, కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుపోవుట, మిలటరీ సంబంధ, బిల్డింగ్  కాంట్రాక్టు సంబంధ నష్టాలు, పాములు, తేల్లు, గేదెలు, విష జంతువుల వల్ల బాధలు కలిగిస్తాడు. విష గ్యాసులు, ఆమ్లాలు, వాతావరణ కాలుష్యం వల్ల ప్రమాదాలు, న్యూన్యత భావం, ఎక్కడికో పారి పోదామనే మానసిక ప్రవర్తన, జైలు వరకు తీసుకొని వెళ్ళుట చేయిస్తాడు.

చంద్రునితో కలిస్తే  గొప్ప బుద్ధి చాంచల్యం గానీ పిచ్చి కానీ కల్గించవచ్చును. కుజుని తో కలిసి చెడిపోతే ఆకస్మిక ప్రమాదాలు, దెబ్బ లాటలు, గాయాలు కల్గిస్తాడు. రవితో కలిస్తే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బ తీస్తాడు. శని రాహువుల కలయిక త్రీవ్రమైన పరిస్తితిలకు దారి తీయవచ్చును. గురునితో కలిస్తే సద్భావన ఉన్నా, తప్పని పరిస్థితిలలో తప్పులు చేయిస్తాడు. ఎంత రహస్యంగా పనులు చేసినా బహిర్గాతం చేసి పరువు తీయిస్తాడు. రాహువు ఎంత యోగం కల్గించినా, ఎంతో కొంత అప్రదిష్ట చేయకుండా ఉండలేడు.

రాహువు కలిగించే అనారోగ్యాలు

రాహువు వాయుతత్వ కారకుడు కావడం వల్ల మనవ శరీరంలోని సమస్త వాయు  సంబంద రోగాలను కల్గిస్తాడు. నొప్పి ఎక్కడుందో అక్కడ రాహువు ఉంటాడు. కడుపు, నాభి, మర్మాంగాల నొప్పులకు ప్రతీక. ఉచ్చ్వాస నిశ్వాసల్లోని గమన సిలత్వాన్ని కంట్రోలు చేసే శక్తీ రాహువుది. ఉరఃపంజర సంబంధ రోగాలను కలిగిస్తాడు. శుక్ర రాహువుల కలయికతో చర్మ సౌంధర్యాన్ని దెబ్బ తీస్తాడు. సమస్తమైన అంటు వ్యాధులకు రాహువు అధిపతి. టైఫాయిడ్, మలేరియా, మసూచి, ఇన్ ఫ్లూ,అనేక రకాల వైరస్ జ్వరాలకు రాహువు పెట్టింది పేరు. కన్య రాశిలో వుంటే అన్ని రకాల పురుగులను కడుపులో పెంచుతాడు.


శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించి..

బ్యాక్టిరియాను ఆహ్వానిం

చడంలో రాహువు మొదటి వాడు. రాహువు స్టితి బట్టి పక్షవాతం, కీళ్ళవాతం, నడుము నొప్పి కలుగుతాయి.సరియైన జ్యోతిష్యునిచే మీ జాతకచక్రం పరిశీలించుకొని తగిన పరిహారాలు చేసుకున్న ఎడల రాహువు అనుకూల స్థితి లోమంచి ఫలితాలు ఇవ్వగలరు.

తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు?

 తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు?


హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత..



హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ)  ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.  భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.


తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?


క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు 

చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.


 తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం 

తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.


సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.


తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.


జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.


విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.


శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.


తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.


భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.


సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది .

అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ

  ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి...



 ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. 


2)  తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది 

తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. 

పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది 

ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది 

దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది


అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టట,దుర్భాష లాడుట చేయరాదు. 


ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు.

 

ఎట్టిపరిస్థితిలో నైనా ఒడిలో కంచెం పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును. 


భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం 

భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు.

పెళ్లి అయిన స్త్రీలు దీపారాధన చేయాలి అంటే రోజూ తల స్నానం చేయాలా*?

 పెళ్లి అయిన స్త్రీలు  దీపారాధన చేయాలి అంటే రోజూ తల స్నానం చేయాలా*?



ఇది సాధారణంగా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇదే అనుమానంతో రోజూ దీపారాధన చేయడం మానేస్తున్నారు.. 


వివాహం అయిన స్త్రీలు  నిత్య దీపారాధనకి రోజూ తల స్నానం చేయవలసిన పని లేదు, మాములుగా స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరించి నిత్యా దీపారాధన రోజూ చేసుకునే పూజ చేయవచ్చు.. ఆడవాళ్లకు పాపిటలో గంగమ్మ నివాసం ఉంటుంది.. పాపిట లో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లి ని అక్కడ నిలుపుకొని పూజించి నట్టు అందువల్ల ఆడవాళ్లకు రోజూ తలస్నానం అవసరం లేదు..పాపిటలో కుంకుమ ధరిస్తే తల స్నానం తో సమానం.


అయితే ఏదైనా వ్రతం ,పూజ, ముడుపు, దీక్ష లాంటివి ఉన్నపుడు తలస్నానం చేసే చేయాలి.. ఆడవాళ్లకు బుధ, శనివారం, తలస్నానం చేయడం మంచిది, శుక్రవారం వ్రతాలు ఉన్నపుడు శుక్రవారం చేయవచ్చు, మైలు ఉన్నపుడు కచ్చితంగా, 1, 3, 4,5,   రోజుల్లో తలస్నానం చేయాలి.. ఆ సమయంలో తిని తాగి మిగిల్చింది ఎవరికి పెట్టకూడదు.. అలా పెట్టడం వల్ల తిన్నవారికి పెట్టిన వారికి కూడా ఆర్ధిక ఇబంధులు వస్తాయి, ముఖ్యంగా భర్తకు పెట్టకూడదు.

మగవారు మాత్రం తలస్నానం చేసే పూజ చేయాలి.

*అప్పు …* *ఇచ్చిపుచ్చుకునే నియమాలు.

*అప్పు …*
      *ఇచ్చిపుచ్చుకునే నియమాలు..!*

                     ➖➖➖✍️

*మంగళ, శుక్రవారాలలో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు....?  కారణం ఏమిటి...?*


*మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.*

*కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు.*

*ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు.*

*మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటినుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ, అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు.*

*తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో. మరి బూజులు దులపక పోవటానికి కూడా ఒక కధ చెప్తారు…*

*శ్రీ కాళహస్తీశ్వరుని కధ అందరికీ తెలిసిందే కదా.*
*శ్రీ అంటే సాలె పురుగు, పాము, ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ. *
*శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్ధం వుంది. బూజులు, అంటే సాలె పురుగులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి ఆ శ్రీలక్ష్మీకి ఎందుకా రోజుల్లో అపచారం చెయ్యాలని బూజులు దులపరు.*

*ఇవి పాటించవలసిన విషయాలేనా ? ఇందులో ఎంత వరకూ నిజం వుంది ?*

 *బూజుల సంగతి వదిలేద్దాం. ఎందుకంటే ఆ రెండు రోజులూ కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు. మరి డబ్బుల సంగతేమిటి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ, శుక్రవారాలలో డబ్బులు ఇవ్వటం మంచిదా..? చెడ్డదా..?*

*సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ రెండు రోజైలైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము..అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరుకి గానీ ఆపదసమయాల్లో ఈ నియమం పనికిరాదు. ఇలా చేయ్యటం వల్ల మరింత ధనం పోతుంది.*


*ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం వుందిట. అందుకే బ్యాంక్ ఎక్కౌంటు తెరిచి డబ్బు దాచుకోదలిచారా ? మంగళవారం నాడు చెయ్యండి. ఆ ఎక్కౌంటు లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే వుంటారు.*

*అలాగే ఎక్కువ అప్పు ఏమైనా వుండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారా? మంగళవారం నాడు తీర్చండి. తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు, త్వరలో ఋణ విముక్తులవుతారు.*

*ఫ్రాంతాలవారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ వుంటాయి. కొందరు మంగళ, శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు, విశాఖ పట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు. అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చెయ్యవు. ఎవరి నమ్మకాలూ, ఆచారాలూ వారివి.....*

*ఏది ఏమైనా అప్పు ఎదో ఒక రూపంలో తొందరగా తీర్చుకోవడం ఉత్తమం.
    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

కొత్త కొత్తగా వ్యాపారం పెట్టిన వారు.. లాభాల బాటలో పయనించేందుకు కొన్ని పనులను చేయాలి. వ్యాపారం పెట్టిన వారు.. లాభాల బాటలో పయనించేందుకు కొన్ని పనులను చేయాలి.

 కొత్తగా వ్యాపారం పెట్టిన వారు.. లాభాల బాటలో పయనించేందుకు కొన్ని పనులను చేయాలి.


ఎవరైతే మహాలక్ష్మీ అనుగ్రహం అనునిత్యం కావాలని కోరుకుంటారో.. ఆ దేవత తమ ఇంట నివాసం ఉండాలని ఎవరైతే భావిస్తారో.. వారంతా శుక్రవారం నాడు ఐశ్వర్య కాళీ దీపం వెలిగించాలి.

 ఇలా చేయడం వల్ల తక్కువ వేతనంతో బాధపడుతున్న వారికి ఎక్కువ వేతనం లేదా పూర్తి జీతం వస్తుంది

అలాగే వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఈ ఐశ్వర్య కాళీ దీపాన్ని ఏ దిశలో పెట్టాలి. ఎలా పెట్టాలి.. ఏయే సమయాల్లో పెడితే మీకు శుభప్రదంగా ఉంటుంది.. అలాగే పూజ గదిలో క్రమం తప్పకుండా వేటిని మార్చాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఐశ్వర్య దీపం అంటే..

ఉప్పుతో పెట్టే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంట సకల దోషాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

 ఐశ్వర్య కాళీ ఫొటో..



ఎవరైతే అనారోగ్య వాతావరణంతో బాధపడుతున్నారో.. ఎవరి ఇల్లు అయితే కళావిహీనంగా ఉందో.. ఎవరెవరు కార్యాలయంలో సమస్యల గురించి బాధపడుతున్నారో అవన్నీ తొలగిపోయేందుకు భోజపత్ర యంత్ర యుక్తమైన గోమాత, పంచభూత, శక్తి పీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదుకలను ఉన్న ఫొటో ఉంచితే.. అక్కడ దోషాలన్నీ తొలగిపోయి.. శుభాలు ప్రారంభమవుతాయి.


సిరి సంపదలు పెరిగేందుకు..


ఎవరి ఇంట లేదా కార్యాలయంలో సిరి సంపదలు పెరగాలని కోరుకుంటారో.. అలాంటి వారు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలకు కొరత అనేదే ఉండదని పండితులు చెబుతున్నారు.

 ఎలా వెలిగించాలంటే..


ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి.

వెడల్పుగా ఉండే రెండు ప్రమిదలను తీసుకోవాలి.

శుక్రవారం నాడు ఉదయాన్నే రాళ్ల ఉప్పును తీసుకోవాలి.

కలకండ, అక్షింతలు సిద్ధం చేసుకుని, పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. వాటితో పాటు చిన్న బెల్లం ముక్క.. రెండు అరటిపండ్లు, తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి.


పూజ గదిలో..


పూజకు ముందు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని, పూజ గదిలో లక్ష్మీదేవి ఫొటో లేదా ప్రతిమను శుభ్రం చేసుకున్న తర్వాత, చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో కలిపి ముగ్గులను వేయాలి. ఆ తర్వాత ఇత్తడి ప్లేటును తీసుకుని, అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి. దానిపై నెయ్యి లేదా నువ్వుల నూనెనుతో దీపాన్ని వెలిగించాలి.

 ప్రతి శుక్రవారం..


ఈ దీపాన్ని ప్రతి శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత వెలిగించాలి. ఆ దీపం వెలిగించినప్పుడు శ్లోకాన్ని చదువుకోవాలి. పండ్లు లేదా పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి. అలాగే కనకధార స్తోత్రం కూడా చదివితే శుభప్రదంగా ఉంటుంది. ఇలా 11 శుక్రవారాలు లేదా 16 శుక్రవారాలు లేదా 41 శుక్రవారాలు సంకల్పంగా చేసుకుని ఇంట్లో ఐశ్వర్యదీపం వెలిగించాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది. శుక్రవారం ఇలా దీపారాధన చేశాక తర్వాతి రోజు అంటే శనివారం రోజు ఆ ప్రమిదలను ఉప్పును నీటిలో కలపాలి లేదా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాలి. లేదా పారే నీళ్లలో వేయొచ్చు. ఆ తర్వాత ఆవుకు అరటిపండ్లు,

 తోటకూర లేదా గడ్డిని పెట్టి మూడు ప్రదక్షిణలు చేయాలి.

ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా.....?

 ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా.....?



బయట వినిపించే అసంబద్ధమైన మాటల్లో ఇదొకటి.. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు.. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు.., దేవతా మూర్తుల చిత్రపటాలను ఒక బట్టలో చుట్టి, అటక మీద పెట్టేస్తారు.. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తారు..

(కానీ మిగిలిన పనులన్నీ భోజనాదులతో సహా అన్నీ లోపం లేకుండా చేసుకుంటాం కదా)


 అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవారాధన, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. 


దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన, దైవారాధన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభ స్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు... అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు.. 


నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్య ప్రదానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు... మనం నిత్యం ఇంతకు ముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు..  కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకు ముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే,సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయ దర్శనం చేయవచ్చు. 


మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా... కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి.


 ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటినన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు...


ఈ విషయంలో పూజలు  చేయవచ్చు అనడం కంటే.. చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధానం అవుతుంది.!!


ఏకశ్లోక భాగవతం ఏకశ్లోక భారతం ఏకశ్లోక రామాయణం ఏకశ్లోక భగవద్గీత

 ఏకశ్లోక భాగవతం 



ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం

మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం

కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతాపాలనం

హ్యేతధ్బాగవతం పురాణ కధితం శ్రీకృష్ణలీలామృతం



ఏకశ్లోక భారతం 


ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనం

ద్యూతే శ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనం

లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియా జృంభణం

భీష్మద్రోణ సుయోధనాది నిధనం హ్యేతన్మహాభారతం



ఏకశ్లోక రామాయణం 


ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం

వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం

వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం

పశ్చాద్రావణ కుంభకర్ణనిధనం హ్యేతద్ధి రామాయణం 


ఏకశ్లోక భగవద్గీత


ఓం యత్ర యోగీశ్వర: కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర:

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ

పార్ధాయ ప్రతిబోధితాం – భగవతా నారాయణన స్వయమ్‌!

వ్యాసేన గ్రథితాం – పురాణమునినా మధ్యే మహాభారతమ్‌ !

అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీ

మంబ త్వా మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్‌

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం:

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం:


సూర్య దోషం తొలగడానికి : ఆదివారం 

మనం స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు గాని ఎర్రటి పూలు గాని ఆ బకెట్లో కొంచెం వేసి స్నానం చేసుకుంటే సూర్య దోషం తగ్గుతుంది

చంద్ర దోషం తొలగడానికి: సోమవారం

నీటిలో కొంచెం పాలు కానీ లేక పెరుగు గాని వేసుకుని స్నానం చేస్తే చంద్ర దోషం తగ్గుతుంది

కుజదోషం తొలగడానికి: మంగళవారం

నీటిలో బిల్వ ఆకులను గాని బిల్వ ఆకు పొడిని గాని వేసి స్నానం చేస్తే కుజదోషం తగ్గుతుంది

బుదదోషం తొలగడానికి: బుధవారం

నీటిలో సముద్రపు నీరు గానీ గంగా నది నీరు గాని లేక రాళ్ల ఉప్పు గాని వేసి స్నానం చేస్తే బుధ దోషం తగ్గుతుంది

గురు దోషం తొలగడానికి: గురువారం

నల్ల యాలకులను నీటిలో ఉడికించి వాటిని మనం స్నానం చేసే నీటిలో పోసి స్నానం చేస్తే గురు దోషం తగ్గుతుంది

శుక్ర దోషం తొలగడానికి: శుక్రవారం

యాలకులను నీటిలో ఉడికించి ఆ ఉడికించిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శుక్ర దోషం తగ్గుతుంది

శని దోషం తొలగడానికి: శనివారం

నీటిలో నల్ల నువ్వులను నేటి స్నానం చేస్తే శని దోషం తగ్గుతుంది

రాహు దోషం తొలగడానికి: శనివారం

(మహి షాసి, అనేది సామ్రాణి ఇది నాటు మందు షాపులో దొరుకుతుంది )ఈ మహిషా సి పొడిచేసి నీటిలో ఉడకబెట్టి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే రాహు దోషం తగ్గుతుంది

కేతు దోషం తొలగడానికి: మంగళవారం

గరిక (గడ్డి) నీ ఉడకబెట్టి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కేతు గ్రహ దోషం తగ్గుతుంది
పైన చెప్పిన విధంగా ఆయా రోజుల్లో స్నానాన్ని ఆచరించి గ్రహ దోషాలను తగ్గించుకోవాలని కోరుకుంటూ

 జై గురు భైరవ..

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS