Sunday, September 27, 2020

గృహస్థులు- విధి విధానాలు:

గృహస్థులు- విధి విధానాలు:


1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.

2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా  కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.

3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు..

4.చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు...

5. లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.

6. కాళికా , ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు.

7. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే  మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు...

8. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్క ఉండవచ్చు..

9.ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు,వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫోటో  కానీ పెట్టడం మంచిది..

10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండి.. 

11. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి తొండం కుడి వైపు ఉండాలి..వ్యాపారం చేసే ప్రాంతంలో లో నిల్చున్న వినాయకుడు ఉండాలి.

12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది..

13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన  నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి.

14.పూజ గదిలో  ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాంకొమ్ముతో తిరు నామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు(అడ్డనామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి, వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రద్దీ నామాలు పెడతారు, మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం , ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు.

15. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు  తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.

16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు.

17. బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు.. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ  నమస్కారాలు చేయకూడదు.

18. నవగ్రహాలు తాకి మొక్క కూడదు...

19. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, పెరుగు చేతితో చిలక కూడదు, 

20. నీరు,పాలు, పెరుగు, నైయి కి అంటు ఉండదు.అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు..

21. లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి, లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి.. అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి.. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది, పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు...పంచి పెడితే ఇంకా మంచిది.

22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటారు వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.. సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు...

23.ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు..

24.పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు..

25.ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో

కూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప

్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి..

26. జపానికి వాడే జప మాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడ కూడదు..

27. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు....

28.దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు...

29. ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు... మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనం కి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లెవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి..అలా ఓక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు..

30.ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది.

31.అద్దె ఇల్లు వాస్తు మీ జాతకనికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన wallmat గోడకు డెకరేషన్ గా పెట్టాలి....

32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం  అవుతుంది..

బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి..

 బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి.. 



ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. 


ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. 


దీనిని ఎవరైతే వారి పుట్టినరోజునాడు తండ్రికి నమస్కరించి వారివద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది.


బ్రహ్మ ఉవాచ:.💐


 నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!

సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!

ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.


సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!

సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!

సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 


నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!

సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!

సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.


దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!

సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!

ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.


తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!

మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!

ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. 


యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!

అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!

ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము.


ఫలశ్రుతి:.💐


ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!

ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ 

స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా 

న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్ 

నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః 

సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ 

పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!

శ్రీవేంకటేశ్వర స్వామి వైభవం.....

శ్రీవేంకటేశ్వర స్వామి వైభవం.....

* ఈ భూమండలంలో ఎక్కడ కనిపించని లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం ....
* శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎందుకు ఉంటుంది ..??
* మహ అద్భుతమైన శ్రీవేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ .....
* శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడాని గల కారణం ..??
.
పద్మావతీ వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడు. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడు. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలందుకుంటున్నాయి. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వేంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీరామానుజాచార్య, శ్రీ కులశేఖరాళ్వారులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అర్చావతారుడై వెలసి ఉన్నాడు.
వేంకటాద్రి సమమ్ స్థానమ్ బ్రహ్మాండే నాస్తి |
వెంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి || అని కంఠోక్తిగా చెప్పబడింది.
అనగా వేంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం, ఈ బ్రహ్మండమంతటిలోనూ మరొకటి లేదు. అంటే బ్రహ్మాండం అంతటిలోనూ మహోత్తమమైన దివ్యక్షేత్రం శ్రీ వేంకటాచల క్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వరునితో సరితూగగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు. ఇకముందు భవిష్యత్తులో ఉండబోరు. భూత, భవిష్యత్, వర్తమానాలలో సరిసాటిలేని పరమదైవం శ్రీ వేంకటేశ్వరుడు. అలాంటి శేషాద్రివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎందుకు ఏర్పడిందనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
పరమదైవమైన శ్రీ వేంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుని ప్రీత్యర్థంగా, ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది. నవ (తొమ్మిది) సంఖ్యకు- బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి. ముందురోజున జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, చివరోజున జరిగే శ్రీ పుష్పయాగం- ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని, ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం.
ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వేంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికా గ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం జరుపబడతాయి. అదే రోజున ప్రప్రథమంగా శ్రీ వేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విష్వక్సేన భగవానుని యథావిధిగా పూజిస్తారు. విష్వక్సేనుల వారిని చతుర్వీథుల ఉత్సవం పేరిట ఊరేగించి, తీసుకుని వస్తారు. విష్వక్సేనుడు దేవాలయానికి తిరిగివచ్చిన తర్వాత యాగశాలలో, మృత్తికా గ్రహణం అంకురారోపణం చేస్తారు.
అలాగే ధ్వజరోహణం ఎలా చేస్తారంటే.. ఒక దృఢమైన నూతన వస్త్రంపైన శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని లిఖిస్తారు. ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపైన ఎగురవేస్తారు అర్చకులు. దీనినే ధ్వజారోహణం అంటారు. గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వేంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాలోని సకల దేవతా గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ సమయంలో వేదపండితులు మంత్రపఠనం చేస్తారు. ఆ విధంగా శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
శ్రీవారి వజ్రం ....
శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12 కిలోల బరువుతో కూడుకున్నది. దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట. ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు. దీనివిలువ మాత్రమే రూ. లక్ష కోట్లు.
రాజేంద్ర చోళుడు, కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా నిరాయుధపాణిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట....!
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా? స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది. తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశము.
తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.
శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు.
అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు.
ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే.. స్వామివారికి ధరించే పీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు.
తిరుమల సుప్రభాత సేవ :......
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రతిదినం 'సుప్రభాతం' అనబడే 'మేలుకొలుపు' సేవ తో ఆ రోజు నిర్వహించబోయే పూజా కార్యక్రమం ప్రారంభమై బంగారు వాకిలి ద్వారములు తెరుస్తారు.
తిరుమల లో ప్రతిరోజు నేటికి ప్రప్రధమంగా శ్రీ వారి దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి 'సన్నిధి గొల్ల'. ఆదిలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చే మొదటి దర్శన భాగ్యాన్ని వరం గా పొందిన ఆనాటి గోపాలకుని (యాదవుని) సంతతికి చెందిన వ్యక్తే ఈ గొల్ల. తిరుమల స్వామి వారి సన్నిధి సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి 'సన్నిధి గొల్ల' అని అంటారు. ప్రతి దినం బ్రాహ్మ ముహూర్తంలో (తెల్లవారు జామున 2-30 నుండి 3-00 గంటల ప్రాంతం లో) సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గొవింద నామాన్ని పఠిస్తూ దివిటీ (కాగడ) పట్టుకొని తిరుమల ఉత్తర మాఢావీధి లో ని శ్రీవారి నిత్యసేవా కైంకర్యపరులైన శ్రీ వైఖానస అర్చకుల తిరుమాళిగ (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాములను ఆలయానికి ఆహ్వానిస్తాడు.
శ్రీవారి అర్చకులు శుచిస్నాతులై, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలను(12 నామాలు) ధరించి, సంధ్యానుష్టానాదులు పూర్తి చేసి ఆలయానికి బయలుదేరుతారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున వున్న చిన్న మంటపం(నగారా మంటపం లేదా నౌబత్ ఖానా) లో అర్చకుల రాకను తేలియజేయడానికన్నట్టు పెద్ద పలక గంటను మోగిస్తారు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారువాకిలి వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరువడానికి సిద్ధంగా వుంటారు.
ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులను 'వైకుంఠం క్యూ' ద్వార ఆలయం లోనికి అనుమతిస్తారు. వీరంతా బంగారువాకిలి ముందు దక్షిణం వైపు పురుషులు - ఉత్తరం వైపు స్త్రీలు వరుసగా నిలిచి వుంటారు.
ఇలా అందరూ సిద్ధంగా వుండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర,వెన్న, తాంబూలం గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వీరితో పాటుగా తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు అన్నమయ్య కీర్తననొకదానిని ఆలపిస్తూవుండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పు పై పవళించి వున్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధి లో శ్రీవారి కి మొట్టమొదటి నివేదనగా పాలు (పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డం పై పచ్చకర్పూరపు చుక్క ని అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచ పాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్థం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు, మొదలైన వార్లు, భక్తులు లోనికి వచ్చి శ్రీవారి ని విశ్వరూప దర్శనం చేసుకుంటారు. సుప్రభాత సేవ ఆర్జిత సేవ అనగా నిర్ణీత రుసుము చెల్లించి భక్తులు సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవ కు రుసుము రూ.120-00. సుమారు 1 సంవత్సరం ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేస్కోవచ్చు. సిఫార్సు లేఖల ద్వార ఒక రోజు ముందుగా కూడా ఈ సేవ టికెట్లు పొందవచ్చు. ఈ సిఫార్సు లేఖలను తిరుమల జే.ఈ.ఓ వారి క్యాంపు కార్యాలయంలో సమర్పించి టిక్కెట్లు పొందవచ్చు. ఈ విధంగా ఖరీదు చేసే టిక్కెట్టు వెల 240-00 వుంటుంది. సంవత్సరంలో ఒక్క మార్గశిర (డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు) మాసంలో మాత్రం ఈ సేవను నిర్వహించరు. సుప్రభాతం స్థానంలో ధనుర్మాసం 30 రోజుల పాటు 'తిరుప్పావై' (గోదాదేవి రచించిన భక్తి పాటలు) పఠిస్తారు. ఈ తిరుప్పావై ఆర్జిత సేవ కాదు, ఏకాంతంగా నిర్వహిస్తారు.

హనుమాన్ జంక్షన్

 హనుమాన్ జంక్షన్




*విజయవాడ-ఏలూరు హైవేలో ప్రయాణం చేస్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్ రాగానే, మన అందరం వెతుక్కునేది ఆంజనేయ స్వామి విగ్రహం. అలా కారులోనో, బస్సు లో నో వెళ్తూ, ఆ విగ్రహానికి నమస్కారం చేస్తాం. హనుమాన్ జంక్షన్ కే ఒక ఐకాన్ ఈ, ఆంజనేయ స్వామి విగ్రహం. అంత పేరు ఉంది ఈ విగ్రహానికి. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలను సరిహద్దులో ఉంది ఈ విగ్రహం. స్వామి పాదాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి. గర్భగుడి పశ్చిమగోదావరి జిల్లాలో, మెట్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయి*
                                🌺*ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర* *లక్షణాలకంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా* *కనిపిస్తాయి ఇంకో స్పెషల్ ఏంటి అంటే, నాలుగు ప్రధానమైన రోడ్డుల కూడలి కనుక, దీన్ని జంక్షన్ అని కూడా అంటారు. ఏలూరు రోడ్,గుడివాడ రోడ్,* *నూజివీడు రోడ్, విజయవాడ రోడ్, ఈ నాలుగు రోడ్డులు ఇక్కడే కలుస్తాయి. స్వామి వారి విగ్రహాన్ని 1938వ సంవత్సరం లో* *ప్రతిష్టించారుఈ విగ్రహం ఎవరు ప్రతిష్టించారు ? హనుమాన్ జంక్షన్ కు ఆ పేరు ఎలా వచ్చింది ?*
*పూర్వం ఈ ప్రాంతాన్ని, నూజివీడు జమిందారు శ్రీ ఎం.ఆర్ అప్పారావు గారు పరిపాలించేవారు. ఆయన తండ్రి, శ్రీ మేకా వెంకటాద్రి బహద్దూర్ గారు 1938వ సంవత్సరం లో, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు*

                               🌹*జమిందార్ మేకా వెంకటాద్రి బహద్దూర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయడం తో ఆహారం కోసం వెతికారు. ఎటుచుసిన బీడు భూములు, డొంకల, ముళ్ళు పొదలతో నిండి అక్కడ అంతా నిర్మానిష్యముగా ఉంది. జమిందార్ కి ఆకలి బాధ ఎక్కువ అయింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. హటాత్తుగా అక్కడకు ఒక కోతి వచ్చి జమిందార్ చేతి లో అరటిపండు పెట్టి అదృశ్యమైపోయింది. ఆకలితో ఉన్న జమిందార్ ఆ పండును భుజించగానే అతనికి ఎంతో శక్తి వచ్చినట్లయింది.*
                                    🌻🌷*సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చి అరటిపండు ను ఇచ్చి వెళ్ళాడని గ్రహించి, భక్తపారవశ్యం తో తన్మయత్వం చెంది శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అక్కడ ప్రతిష్టించాలని భావించారు. భక్తులను దుష్టగ్రహ పిడముల బారి నుండి రక్షించే నిమిత్తం ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహాన్నితయారు చేయించి నాలుగు రోడ్ల కూడలి అయిన హనుమాన్ జంక్షన్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనాడు దండకారణ్యం లో శ్రీ రాముడికి ఆకలివేయగా, ఆంజనేయస్వామి వచ్చి అరటి పండు ఇచ్చి స్వామి ఆకలి తీర్చాడు. అదే విధంగా ఈ జంక్షన్ లో ఆంజనేయ స్వామి "రామా. ఆగు ఇవిగో అరటిపండ్లు" అంటున్నట్లుగా ఉన్న ఆంజనేయ విగ్రహన్ని, ఆంజనేయస్వామి గుడి ఎదురుగా రోడ్డు అవతల రామాలయాన్నినిర్మించారు*
         
  *శత సహస్ర నమస్కారములతో*  

🌺🌹🌿🌻🌼 శ్రీ ఆంజనేయస్వామి కీ జై జైజై 🌹🌼🌿🌻🌺🌸

ఈ శతాబ్ధపు అధిక మాసాలు

ఈ శతాబ్ధపు అధిక మాసాలు


సంవత్సరముమాసము
2001 వృష– ఆశ్వీయుజ మాసము
2004 తారణ– శ్రావణ మాసము
2007 సర్వజిత్తు– జ్యేష్ట మాసము
2010 వికృతి– వైశాఖ మాసము
2012 నందన– భాద్రపద మాసము
2015 మన్మథ– ఆషాడ మాసము
2018 విలంబి– జ్యేష్ట మాసము
2020 శార్వరి– ఆశ్వీయుజ మాసము
2023 శోభకృతు– శ్రావణ మాసము
2026 పరాభవ– జ్యేష్ట మాసము
2029 సాధారణ– చైత్ర మాసము
2031 విరోధికృతు– భాద్రపద మాసము
2034 ఆనంద– ఆషాడ మాసము
2037 పింగళ– జ్యేష్ట మాసము
2039 సిధ్ధార్థి– ఆశ్వీయుజ మాసము
2042 దుందుభి– శ్రావణ మాసము
2045 క్రోధన– జ్యేష్ట మాసము
2048 శుక్ల– చైత్ర మాసము
2050 ప్రమోదూత– భాద్రపద మాసము
2053 శ్రీముఖ– ఆషాడ మాసము
2056 ధాత– వైశాఖ మాసము
2058 బహుధాన్య– ఆశ్వీయుజ మాసము
2061 వృష– శ్రావణ మాసము
2064 తారణ– జ్యేష్ట మాసము
2067 సర్వధారి– చైత్ర మాసము
2069 విరోధి– శ్రావణ మాసము
2072 నందన– ఆషాడ మాసము
2075 మన్మథ– వైశాఖ మాసము
2077 హేవిలంబి– ఆశ్వీయుజ మాసము
2080 శార్వరి– శ్రావణ మాసము
2083 శోభకృతు– జ్యేష్ట మాసము
2086 ప్లవంగ– చైత్ర మాసము
2088 కీలక– శ్రావణ మాసము
2091 విరోధికృతు– ఆషాడ మాసము
2094 ఆనంద– వైశాఖ మాసము
2096 నల– భాద్రపద మాసము
2099 సిధ్ధార్థి– శ్రావణ మాసము

.

#తుంగభద్ర_పుష్కరాలు.. 20 - 11 - 2020 నుండి 1 -12- 2020. వరకు తుంగభద్ర పుష్కరాలు తుంగభద్రా నదీతీరంలో విశేష ఆలయాలు ఏవి?

📷 #తుంగభద్ర_పుష్కరాలు..

20 - 11 - 2020 నుండి 1 -12- 2020.  వరకు తుంగభద్ర పుష్కరాలు  తుంగభద్రా నదీతీరంలో విశేష ఆలయాలు ఏవి?*_
పన్నెండేళ్ళకోసారి వచ్చేది పుష్కరం. పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు శ్రీ శార్వరి నామ సంవత్సరంలో జరుగనున్నాయి. 2008 లో  ఈ నదికి పుష్కరాలు జరిగాయి. మళ్ళీ 12 ఏళ్ళతర్వాత 2020 నవంబరు 20 నుంచి డిసెంబరు ఒకటి వరకూ తుంగభద్రమ్మకు పుష్కరాలు జరుగనున్నాయి.
*తుంగభద్రమ్మ నడక ఇలా*
కర్నాటక ఎగువ భాగాన తుంగ , భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది. రాష్ట్రంలో కౌతాళం మండలం మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. నదీ తీరంలో కొలువుదీరిన దేవతలను తాకుతూ సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది. 2008లో తుంగభద్ర నదికి పుష్కరాలు జరిగాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయం నిండుగా ఉంది. కౌతాళం , కొసిగి , మంత్రాలయం , నందవరం , సి.బెళగళ్ , గూడూరు మండలాలతో పాటు కర్నూలు నగరం వరకు 107 కిలోమీటర్ల మేర తుంగభద్రమ్మ నదీతీర ప్రాంతంఉంది.
*పుష్కరాలు ఎప్పుడు వస్తాయి?*
ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులని , 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటారు. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27 , తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి. గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో బ్రహ్మ , బృహస్పతి , పుష్కరుడు , నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి. ఇక శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి శక్తి ఉంటుంది.
*ప్రత్యేకత గల ఆలయాలు*
కర్నూలు జిల్లాలో తుంగభద్రానది ముందుగా మేళిగనూరు వద్ద రామలింగేశ్వరస్వామి ఆలయాలన్ని తాకి వస్తుంది. స్వామి ఆలయం నదీతీరంలో ఉంది. కోసిగిలో ఆర్డీ‌ఎస్ ఆనకట్ట , అనంతరం మంత్రాలయం మండలంలో రాంపురం రామలింగేశ్వర స్వామి ఆలయం , మాధవరం వద్ద నదిలోనే ఓ శివాలయం ఉంది. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆలయాలను తాకుతూ , దిగువన గురజాల ఇసుక రామలింగేశ్వర స్వామి ఆలయం మీదుగా కర్నూలు నగరం చేరుకుంటుంది. కర్నూలు నగరం లోని సంకల్భాగ్ శ్రీ వెంక టెశ్వర స్వామి వారి పాదాలను తాకుతూ, దక్షిణ షిరిడి గా పేరుగాంచిన శ్రీ సాయిబాబా వారి సాక్షిగా ముందుకు సాగి శ్రీ సంఘమేశ్వరుని చెంత కృష్ణా నది లో కలుస్తుంది. ఈ నదీ తీరాన ఆలంపూర్ జోగులాంభ అష్టాదశా శక్తి పీఠముు కూడా వున్నది,కర్నూల్ కు ఆలంపూర్ అతిసమీపాన వున్నది,కర్నూల్ నుండి ఆలంపూర్ కు బస్సులున్నవి,ఈ నదీకి ఆలంపూర్ క్షేత్రానికి తెలంగాణ , కర్నాటక రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారు.

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS