Monday, January 27, 2020

🌞నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు ఎందుకు అద్దుకుంటారు...🌺

🌞నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు ఎందుకు అద్దుకుంటారు...🌺

మానవుని శాస్త్ర జ్ఞానము అంతగా అభివృద్ధి చిందని కాలములో ఋషులు , మునునులు ఆన్ని అరోగ్య సూత్రాలను ఆత్యాద్మికము గా రూపొందించారు . వైద్య రంగము అంతగా అభివృద్ధి చెందని కాలములో సుచి , శుబ్రత , వ్యాధినిరోదకత అన్నీ దైవకార్యాలరూపములో ఉండేవి . పుణ్యము , పురుషార్ధము వస్తుందంటే సామాన్యప్రజలు ఆనురిస్తాననేదే ముఖ్యాంశము . 

" అది చేస్తే ఆరోగ్యము ... ఇది చేస్తే అనారోగ్యము--- అలా చెబితే చాదస్తము గా కొట్టిపారేస్తారు " కాని అందులో ఎంతో ఆరోగ్యము , ఉత్సాహము దాగిఉన్నాయి . 

నిద్రలేవగానే రెండుచేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతులలో్ని ఉష్ణశక్తి , వేడి కళ్ళకు తగిలి కళ్ళలోని రక్త ప్రసరణ ఎక్కువై ఆరోగ్యవంతంగా తెజోవంతము గా ఉంటాయి. కళ్ళజబ్బులకు దూరముగా ఉండవచ్చును . కళ్ళ అద్దాల అవసము అంతతొందరగా రాదు . ఇది వైద్యశాస్త్రము చెప్పిన ఆరోగ్యసూత్రము .

కాని ఋషులు ఏమిచెప్పారు : చేతులు రుద్దుకునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతిగీతలు అనుకోకుండ చూడడం ద్వారా బ్రహ్మను పూజించినంత ఫలితము ఉంటుందని , బ్రహ్మజ్ఞానము కలుగుతుందని ... అలా ప్రతిరోజూ చేయడము వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము సంప్రాప్తిస్తుందని పెద్దలు అంటారు

శ్రీ మాత్రే నమః

Sunday, January 26, 2020

శివ కుటుంబ చిత్రపటం పూజా మందిరంలో పెట్టుకుంటే….......!!

శివ కుటుంబ చిత్రపటం పూజా మందిరంలో పెట్టుకుంటే….......!!

పూజా మందిరాలలో శివ కుటుంబ చిత్రపటాన్ని ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. 

 కొందరు చిత్ర పటాన్ని చూసి ఈ పటం ఉందేమిటి అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి అసలు ఈ పటాన్ని పూజామందిరంలో ఉంచుకోవచ్చో లేదో వారికే తెలియదు. కానీ శివ కుటుంబంతో ఉన్న చిత్ర పటాన్ని పూజా మందిరంలో ఉంచటం చాలా మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

పార్వతీ పరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు. పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే, అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. తమ బిడ్డలను అనుగ్రహించడంలోను, ఆదరించడంలోను ఆ తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. ఇక వినాయకుడు తనని ప్రార్థించిన వారికి ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూస్తాడు.

విద్యాభివృద్ధిని కలిగిస్తాడు. కుమారస్వామి తేజస్సును, చైతన్యాన్ని కలిగిస్తాడు. జ్ఞానాన్ని పెంచడమే కాకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా పార్వతీపరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి కుటుంబంలోని వారికి ఆయురారోగ్యాలను, విజయాలను, జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలిగిస్తారు. అందువలన వాళ్లంతా కలిసి వున్న శివ కుటుంబ చిత్రపటం పూజా మందిరంలో ఉండటం చాలా మంచిదని అంటారు.🙏


శక్తిపీఠాలు


ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః
శక్తి పీఠం దర్శనం 
ఎంతో పుణ్యపలము
ఆలయము దర్శనములో     
శక్తిపీఠాలు 
51 శక్తిపీఠాలలో  10వ శక్తిపీఠం బిరాజా దేవి శక్తిపీఠం
దుర్గ-శక్తి
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

పురాణ కథ
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.
కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది

#బొట్టు_ఎందుకు_పెట్టుకోవాలి#బొట్టుతో_బోలెడన్ని_ప్రయోజనాల #దృష్టి_దోషం_తగలకుండా_బొట్టు#స్టికర్_బొట్లతో_చర్మరోగాలు #స్టిక్కర్_బొట్ల_పుండ్లకు_చక్కని_యోగం

#బొట్టు_ఎందుకు_పెట్టుకోవాలి

భూవోఘ్రాణ స్వయస్సంధిః అంటే నాసిక పై భాగం భ్రుకుటి మధ్యభాగం కలుసుకొనే చోట పెట్టుకోవాలి అర్థం. ఇక్కడ ఇడ,పింగళ ,సుషుమ్న లేక గంగ ,యమున ,సరస్వతి లేక సూర్య ,చంద్ర ,బ్రహ్మ అని పిలువబడే మూడు ప్రధాననాడులు కలుస్తయ్ .దీనినే "త్రివేణి సంగమం "అని అంటారు. ఇది పీయూష గ్రంధికి అనగా ఆజ్ఞాచక్రానికి అనుబంధస్ధానం .ఇదే జ్ఞానగ్రంధి అనికూడా పిలువబడుతుంది. ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కల్గిస్తారో వారు మేధావులౌతారు.మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యుటరీ గ్రంధుల పై ఉంటుంది. " కేనన్ " అనే పాశ్చాత్య శాస్ర్తవేత భ్రుకుటి స్థానాన్ని మానవ ధన (+), మెడ వెనుక భాగాన్ని ఋణ (-) విద్యుత్ కేంద్రాలు అన్నారు .ఇవి రెండు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణ ం చేస్తుంటయ్.అందుకే జ్వరం వస్తే వైద్యులు నుదుటి పై చల్లటి గుడ్డ వేయమంటారు.

#బొట్టుతో_బోలెడన్ని_ప్రయోజనాల 

పైన పేర్కొన్న కీలక సున్నిత నాడులను తీక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు కుంకుమ ధరించాలి. సాయంత్రం రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూతి వల్ల రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించ బడుతుంది. ఓజస్సు వృద్ధి చెంది ,చర్మరోగాలు రాకుండా రక్షణ కలుగుతుంది.

బొట్టు శరీరంలో ఉష్ణాన్ని పీల్చీవేస్తుంది.జఠరశ్వాసకోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది. మనం సూర్యుని నేరుగా చూడలేము .అదే "రంగుల " కళ్ళద్ధాలు లేదా ఒకవైపు రంగు ఉన్న గాజుద్వారా సూర్యుని చూడగలం .ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దంపైబడి పరావర్తనం చెందటం వల్లకళ్ళకు హానికలుగలదు.

అంటే ఇక్కడ సూర్య కిరణాల వల్ల కళ్ళకు హాని కలుగకుండారంగు ఏవిధంగా పని చేస్తుందో , ఆవిధంగానే బొట్టు కూడా భ్రుకటిస్థానం లోని జ్ఞాననాడికి హానికలుగకుండా మానవులను కాపాడుతూ వుంటుంది.

#దృష్టి_దోషం_తగలకుండా_బొట్టు

మనుషుల్లో కొందరు క్రూర స్వభావం కలిగి ఉంటారు. వారు ఎల్లవేళలా ఇతరుల పైన అసూయా ద్వేషాలతో రగిలిపోతూ ఇతరుల వినాశనాన్ని కోరుకుంటూ వుంటారు. వారి మనసులో ని చెడుఆలోచనల ప్రభావమంతా వారి చూపుల ద్వారా ఇతరుల పైన ప్రసరిస్తూ ఉంటుంది.

మానవశరీరంలో అన్నిభాగాలకన్నా ముఖభాగమే అత్యంత ప్రధానమైనది.ఎవరు ఎవరితో మాట్లాడాలాన్నా ముఖంచూసే మాట్లాడగలుగుతారు.అందువల్ల పైన తెలిపిన క్రూరస్వభావం కలిగిన వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి ముఖం చూసి "అబ్బా వీరి ముఖం ఎంతందంగా ఉంది " అని పలుమార్లు మనసులో అసూయపడుతారు. అలా వారి అసూయ చూపుల ద్వారా ఎదుటివారిలోకి ప్రసరించి క్షణాల్లోవారికి తలనొప్పి కలగడం ఎంతోసేపటికిగాని అది తగ్గకపోవడం నిత్యజీవితంలో మనమందరం గమనిస్తూనే వుంటాం .

అందుకే ఈ మానవస్వభావాల పైన పరిశోధనలు చేసిన ఆయుర్వేద మహర్షులు ఇతరుల దృష్టి దోషం మరొకరికి అనారోగ్యం కలిగించకుండా నివారించడంకోసం కూడా ప్రతి మనిషి విధిగా బొట్టుపెట్టుకోవాలి అనే సదాచారాన్ని అలవాటు చేశారు.

బొట్టుపెట్టుకుంటే దృష్టి దోషం ఎలా నివారించబడుతుంది ??? అని మీకు సందేహం కలగవచ్చు . బొట్టు ఎర్రగా నిండుగా కళకళలాడుతూ ప్రకాశిస్తూ వుండటం వల్ల ఇతరులు ముఖంలోకి చూడగానే వారిదృష్టిని ముందుగా ఈ బొట్టే ఆకర్షిస్తుంది. వారెంత ప్రయత్నించినా ముఖంలోని అందమైన ఇతరభాగాల వైపు చూడలేరు . ఈ విధంగా దృష్టి దోషం అనే సమస్య నుండి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడానికే ఈ బొట్టు అనే విధానాన్ని ప్రవేశపెట్టారని మనం తెలుసుకోవాలి.

#స్టికర్_బొట్లతో_చర్మరోగాలు 

నేటి స్ర్తీలు గతంలో ఎవరికివారు స్వయంగా తయారుచేసుకునే కుంకుమను బొట్టుగా ధరించకుండా ,విషరసాయనపదార్థాలతో తయారుచేసిన స్టికర్లను బొట్టుగా వాడటంవలన భ్రుకుటి వద్ద చర్మరోగాలు వస్తున్నాయి. దీనివల్ల కొందరు స్ర్తీలు బొట్టు పెట్టుకోలేఖపోతున్నారు.కొందరు బొట్టు ధరించనివారు కూడా మేధావులయ్యారు కాదా అని అనవచ్చు. నిజమే , అయితే ఆ మేధావులు బొట్టు ధరించి ఉంటే మరింత మేధాసంపున్నులు అయ్యే వారని మరిచిపోవద్దు.

#స్టిక్కర్_బొట్ల_పుండ్లకు_చక్కని_యోగం 

స్టిక్కర్ బొట్లకు అడుగున ఉండే రసాయనాల ప్రభావం వల్ల ఈ బొట్లను అతికించుకున్నవారికి కాలగమనంలో భ్రుకుటి పైన ముందుగా మచ్చలుపడతయ్.క్రమక్రమంగా ఆ మచ్చలే పుండుగామారి బొట్టుపెట్టుకునే భాగమంతా నల్లగా వికృతంగా తయారై పుండుపడి ముఖసౌంధర్యం దెబ్బతింటుంది .అందరూ ఏమైందీ ఏమైందీ అని అడగటంవల్ల వీరి మానసిక స్ధైర్యం కూడా దెబ్బతిని క్రమంగా వీరు మానసిక రోగులుగా మారిపోతారు.

ఈ సమస్య కోసం ఆస్పత్రులకు వెళ్తే అక్కడ వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ వంటి శస్ర్తచికిత్స చేయాలని హడలకొడతారు .అంతఖర్చుకష్టం లేకుండా ఓ సులభమైన విధానంతో ఈ సమస్య నుండి బయట పడవచ్చని సలహా. పరమశివుని పూజించే పరమపవిత్రమైన మహాఔషధవిలువలుగల మారేడు చెట్టును పూజించి మనసులోనే బాధను నివేధించి , ఆ చెట్టు నుండి కొన్ని ఆకులు తీసుకొచ్చి నీడలో ఆరబెట్టి దంచిజల్లించి పొడిచేసుకోవాలి. రోజూ రాత్రి నిద్రించేముందు తగినంతపొడిలో రెండుమూడు చిటికెల మంచిపసుపు కలిపి కొంచం నీరు కూడా చేర్చి గుజ్జులాగా నూరి భ్రుకుటిపైన పుట్టిన పుండుకు పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడుగుతుండాలి.ఇలా క్రమంతప్పకుండా చేస్తుంటే కొద్ది రోజుల్లోనే ఆ పుండు దాని తాలూకు మచ్చ పూర్తిగా హరించిపోయి తిరిగి సహజమైన చర్మపురంగు ప్రాప్తిస్తుంది.

Friday, January 24, 2020

మాఘమాసం

🌷మాఘమాసం🌷

చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది. 

అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.

మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు. శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు. శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి. శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం. నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు. ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వ కర్మ జయంతిగా పేరు పొందింది. మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు. కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు.

ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.🙏

#వేంకటేశ్వరుడికి_ఏడు_శనివారాలు_పూజ_చేస్తే ?

#వేంకటేశ్వరుడికి_ఏడు_శనివారాలు_పూజ_చేస్తే ?

హిందూ దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. కోరినవారికి కొంగుబంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాందవుడు, అనాధ రక్షకుడు. మన జీవితంలో శని దేవుడి ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాము. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చెయ్యాలి. ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు. 

ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు పూజ చేయాలి. ఒకవేళ మహిళలు చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపారో అక్కడ నుండి చేస్తే సరిపోతుంది. మరి ఆ పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం...

1. శనివారం ఉదయాన్నే లేచి దేవుడి గదిని శుభ్రం చేసుకుని వంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా బియ్యపుపిండి, పాలు ఒక చిన్న బెల్లం ముక్క మరియు అరటి పండు వేసి కలిపి చపాతిలా చేసి దానితో ప్రమిదలా చేయాలి. ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవునెయ్యి వేసి వెలిగించాలి. 

2. శనివారం వేంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించినవారికి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం.

3. శనివారం సాయంత్రం పూట వేంకటేశ్వర ఆలయం దర్శంచి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణశాస్త్రాలు, గ్రంధాలు చెబుతున్నాయి.

Monday, January 6, 2020

అరకు అందాలుఅరకు (Araku) ఆంధ్రా ఊటీ

అరకు (Araku)
ఆంధ్రా ఊటీ

     విశాఖపట్నం నకు వాయువ్యం దిశగా, సుమారు  115 కీ.మీ దూరాన, ఆంధ్రా - ఒడిశా సరిహద్దు కు సమీప ప్రాంతములో అరకు అను గిరిజన గ్రామం కలదు.  విశాఖపట్నం జిల్లా, డుంబ్రిగుడ మండలం పరిధి లోనికి వస్తుంది.  అరకు ప్రాంతము చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు,లోతైన లోయలు,  కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలు మరియు  ప్రకృతి ప్రసాదించిన ఎన్నెన్నో అందాలు తో బహు సుందరము గా ఉంటుంది.  ఊటీ, కొడైకెనాల్. సిమ్లా, కులు, మనాలి, డార్జీలింగ్ మొదలగు వేసవి విడిది  ప్రదేశాలకు ఏమాత్రం తీసిపోని అందాలతో పాటు, గ్రామీణ గిరిజన సంస్కృతికి సజీవ సాక్ష్యంగా అరకు  ప్రాంతము మన కన్నులముందు ఒకమ అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది.  నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం.
     అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టము నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి.  కొండజాతులు వారు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు.  అరకు లోయ నందు పర్యాటకులుకు మంచి వసతులున్నాయి. అన్ని తరగతులు వారికి లాడ్జీలు, హోటల్స్ దొరుకుతాయి.  బస్ స్టాప్ కు సమీపంలో హరిత హిల్ల్ రిసార్ట్  (మయూరి) ఉంది.  వీరి పోన్ నెం. 08936 249204 & 249393 వీటితో పాటు  Tribal cottage, Sun N Shine Resort, యాపిలి రిసార్ట్ మొదలగు పెక్కు వసతులు అరకు లోయ ప్రాంతములో దొరుకుతాయి.  చుట్టూ ప్రక్కల ప్రాంతములు సందర్శించుటకు వాహనములు, భోజన హోటల్స్ ఉన్నాయి.
అరకు చుట్టూ ప్రక్కల చూడవలసిన ప్రదేశాలు:
ట్రైబల్ మ్యూజియం,  కాఫీ మ్యూజియం,
శ్రీ వేంకటేశ్వరాలయం,  పద్మాపురం గార్డెన్స్  
రణజిల్లెడ వాటర్ ఫాల్స్,   చాపరాయి జలపాతం
మత్స్యగుండం,  అనంత గిరి మౌంటెన్
బొర్రా గుహలు,  కవిటి వాటర్ ఫాల్స్ 
అనంత గిరి వాటర్ ఫాల్స్,  తాడిగుడ వాటర్ ఫాల్స్   
టైడా (Tyada) జంగిల్ బెల్స్  మొదలగునవి చాడదగినవి.  అనంత గిరి మౌంటెన్ వద్ద కూడ మంచి వసతులున్నాయి.

     అరకు బస్ స్టాండ్ కు సమీపంలో  ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, శ్రీ వేంకటేశ్వర ఆలయం ఉంటాయి.  అరకు లోయ కు వాయువ్యం దిశగా, సుమారు మూడు కీ.మీ. దూరాన, పాడువా (ఒడిశా) వైపు అరకు రైల్వే స్టేషన్ & రైల్వే కాలనీ ఉంటాయి.  అరకు బస్సులు రైల్వే స్టేషన్ వరకు వస్తాయి.  ఇక్కడ కూడ భోజన హోటల్స్ ఉన్నాయి. ఆటో సర్వీసులు ఉంటాయి.  అరకు లోయ - అరకు రైల్వే స్టేషన్ రోడ్డు కు సుమారు మూడు కీ.మీ లోపలకి 
పద్మాపురం ఉద్యాన వనం ఉంది. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితరాలు ఉన్నాయి.  ఇక్కడి చెట్లపై నిర్మించిన హట్స్‌ పర్యాటకులకు మరువలేని అనుభూతిని అందిస్తున్నాయి. చల్లని వాతావరణం మధ్య హట్స్‌లో బస చేసే సౌకర్యం ఉంది. గార్డెన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళ, మత్స్యకన్య, అల్లూరి సీతారామరాజు, శివపార్వతుల విగ్రహాలు, టాయ్‌ ట్రైన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గార్డెన్‌లో గులాబీ మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.  ఉద్యాన వనాన్ని దర్శించేందుకు ప్రవేశ రుసుము ఉంది.

     అరకు లోయ కు ఉత్తరం దిశగా. సుమారు ఏడు కీ.మీ దూరాన రణజిల్లెడ వాటర్ ఫాల్స్ కలవు. 
అరకు - పాడేరు రోడ్డు  మార్గం లో చాపరాయి  జలపాతం ఉంది.  అరకు గిరిజన మ్యాజియం నుంచి 16 కిమీ. దూరంలో గల చాపరాయి జలపాతం  చూడగలం. బండరాయి వంటి చాపరాతి మీదగా నీటి ప్రవాహం జాలువారుతుంది.  సందర్శకులు నీటిలో తేలియాడవచ్చు.  ప్రవేశ రుసుము ఉండును.  స్థానికలు జలపాతం ప్రాంతములో  బొంగులో చికెన్‌ విక్రయించుతారు.  మాంసాహార ప్రియులు బొంగులో చికెన్‌ను భుజించుతారు.  తిరుగు ప్రయణం లో అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు,    త్యాడ/టైడా (Tyada) లో జంగిల్ బెల్స్ లాంటివి చూడవచ్చును.  అరకు లోయ ప్రాంతమను నవంబర్ నుండి మే నెల వరకు సందర్శించవచ్చు. ఆగస్టు లో కూడా వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుంది. శీతాకాలంలో అరకు అందాలు వీక్షిచడంతో ఒక గొప్ప అనుభూతిని పొందవచ్చును. జలపాతములుకు పోవు మార్గములు అసౌకర్యం గా ఉండును.
                                """"""

 బొర్రా గుహలు (Boers Caves):
     ప్రకృతిలో  ఎన్నో వింతలు, అద్భుతాలున్నాయి. వీటిలో సహజసిద్ధమైన బొర్రాగుహలు ఒకటిగా చెప్పవచ్చును.  తూర్పు కనుమలో ప్రకృతి  ప్రసాదించిన వింత  అద్భుత ప్రదేశం బొర్రా గుహలు.  AP టూరిజం శాఖ వారు అరకు & బొర్రా గుహలు టూర్స్ (Train cum Road) నిర్వహించుచున్నారు. విశాఖపట్నం నుంచి Train లో బొర్రా గుహలు చేరుకొంటారు.  పిమ్మట బొర్రా గుహలు నుంచి అరకు వరకు టూరిజం బస్సులో  ప్రయాణం. తిరుగు ప్రయాణం లో అరకు నుంచి విశాఖపట్నం వరకు టూరిజం బస్ ప్రయాణం.  కొంత మంది పర్యాటకులు విశాఖపట్నం నుంచి Train లో అరకు చేరి, పిదప Private  vehicles సహాయంతో బొర్రా గుహలు సందర్శించి తిరిగి అరకు చేరుకొంటారు. అరకు నుంచి 
విశాఖపట్నం నకు RTC బస్ ప్రయాణం చేస్తారు.

     అరకు కు సుమారు 26 కీ.మీ దూరాన (విశాఖపట్నం రోడ్)  అనంతగిరి Police station కలదు. సుంకర మెట్ట  దాటిన తరువాత అనంతగిరి  PS వస్తుంది.  దీనికి సమీపంలో అనంత గిరి మౌంటెన్ కలదు.  ఇచ్చట హరిత హిల్ల్ రిసార్ట్ ఉంది.  పర్యాటకులుకు వసతులు దొరుకుతాయి. Ph. No. 08936 - 231898 & Mobile: 7382982574. అరకు - విశాఖ రోడ్డుకు దక్షిణ దిశగా ఒక కీ.మీ దూరాన అనంత గిరి వాటర్ ఫాల్స్ కలవు.  హరిత హిల్ల్ రిసార్ట్ కు సుమారు 4 కీ.మీ దూరాన, అరకు - విశాఖపట్నం రోడ్ (Y - Junction) నుంచి  బొర్రా గుహలు పోవు దారి  విడిపోతుంది.  ఇక్కడ నుంచి రవాణా సౌకర్యములు ఉండవు.  Way to Borra caves  నుంచి సుమారు 6 కీ.మీ దూరంలో బొర్రా గుహలు రైల్వే స్టేషన్ ఉంటుంది.  దీనికి సుమారు 
1 కీ.మీ దూరంలో గుహలున్నాయి.  అనంతగిరి ప్రాంతం విశాఖ జిల్లా మరియు బొర్రా గుహలు ప్రాంతం విజయనగరం జిల్లా పరిధి లోనికి వస్తాయి.

     బొర్రా గుహలను 1807 లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ళ క్రితంనాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బోనేట్‌తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది.    కొంతకాలం పాటు ఈ విధంగా  నీరునిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు ఏర్పడతాయి. 
     గోస్తనీ నది ఈ గుహ్గల్లో పుట్టి జలపాతంగా మారి తూర్పు దిశలో ప్రవహించి భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.  కొండలపై నుంచి చిన్న చిన్న వాగులు గోస్తని నది వైపు ప్రవహించిట వల్ల బొర్రా గుహలు ఏర్పడ్డయి.  కాల్షియమ్ బై కార్బోనేట్,  ఇతర ఖనిజాలు కలిగిఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటివల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్‌మైట్స్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలక్టైట్స్ అనేవి కాడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్‌మైట్స్ & స్టాలక్టైట్స్ వింతవింత ఆకృతులను సంతరించు కున్నాయి. స్థానిక గిరిజనులు  బొర్రాగుహలను బోడో దేవుడి  (పెద్ద దేవుడు) నివాసంగా ఆరాధించుతారు.  వివిధ రూపాల్లో ఉన్న స్టాలగ్‌మైట్స్ మరియు స్టాలక్టైట్స్ లను శివ -పార్వతి, తల్లి-బిడ్డ, ఋషి గడ్డం, మానవ మెదడు, మొసలి, పులి-ఆవు వంటి పేర్లతో పిలుస్తూ గిరిజనులు పూజిస్తూoటారు.
     బొర్రా గుహలకు వందమీటర్ల వ్యాసంతో ప్రవేశద్వారం ఉంది.  కిలోమీటరు పొడవునా సొరంగం ఉంటుంది. ఇందులో చాలా చోట్ల మూడు అరలు కలిగిన సొరంగాలు ఉన్నాయి. పూర్వం స్ధానికులు కాగాడాల సహాయంతో గుహలను చూపించేవారు.  1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల మొక్కలు నాటి  పరిసరాలు చాలా అందంగా తీర్చినారు.  గుహ లోపల ఆధునిక దీపాలంకరణ చేయటం, గుహ లోపలి వింత వింత ఆకారాలపై, రాళ్ళపై రకరకాల రంగులు, నీడలు పడేవిధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చటం జరిగింది.  బొర్రా గుహలు కు సుమారు 3 కి.మీ. దూరంలో ఉన్న కటికి జలపాతాన్ని, అక్కడి నుంచి అనంతగిరి చేరుకుని తాడిగుడ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లవచ్చును.  సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి నీరు అంచెలంచెలగా తాడిగుడ జలపాతం పారుతుంది.  
                              """""""
 రైలు ప్రయాణం (Train journey)

     విశాఖపట్నం నుంచి అరకు మీదగా ప్రతి రోజు ఒక ప్యాసింజర్ రైలు సర్వీసు కలదు.  Train No. 58501 విశాఖపట్టణం నుంచి ఉదయం 06:50 బయిలు దేరుతుంది.  దీనిని  కిరండూల్  ప్యాసింజర్ గా పిలుస్తారు.  కిరండూల్  రైలు మార్గములో కొత్తవలస, ఎస్. కోట, బొర్రా గుహలు, అరకు, కోరాపుట్, జైపూర్, జగదలపూర్, దంతేవాడ మొదలగు రైల్వే స్టేషన్స్ ఉంటాయి.  విశాఖపట్టణం - హౌరా రైలు మార్గములో కొత్తవలస జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంది.  కొత్తవలస జంక్షన్ నుంచి కిరండుల్ వరకు బ్రాంచి రైలు మార్గము ఉంది.
     కొత్తవలస - కిరండుల్ రైలు మార్గం ను  ఇనుప ఖనిజం జపాన్ దేశం నకు ఎగుమతి చేయుటకు నిర్మించారు.  రైల్వే సంస్ధ "KK Line" గా పిలుస్తుంది.  ఎస్ . కోట రైల్వే స్టేషన్ దాటగానే రైలు బండి భూమి ఉపరితలం నుంచి  కొండ అంచులకు చేరుతుంది.  బొడ్డవర - శిమిలగుడ రైల్వే స్టేషన్స్ మధ్య గల కొండలను తొలుచుకుంటూ సొరంగ రైలు మార్గం (టన్నెల్స్) ఏర్పార్చినారు.  పర్వతల మధ్యన గల లోయల పైన వంతెనలు నిర్శించారు.  ఒకటి, రెండు చోట్ల తుళ్ళింత నాట్యాలతో జారిపడే జలపాతాలు వర్షాకాలం లో నయనానందకరం గా దర్శనమిస్తాయి.  ఘాట్ రైలు మార్గం అకస్మిక మలుపులు,  సుందర గిరిజన ప్రాంతాలు  మీదగా సాగుతుంది. ఇది యాత్రిక మన్యులకు దృశ్యమానం గా కనిపించుతుంది.  అసక్తి గల ప్రకృతి సౌందర్యాధకులకు  ఘాట్ రైలు ప్రయాణం బహు తమాషా గా ఉంటుంది.  రైలు బండి బొర్రా గుహల కొండ పై నుంచి సాగుతూ బొర్రా గుహలు రైల్వే స్టేషన్స్ చేరుతుంది.
     విశాఖపట్నం - కిరండూల్‌ వెళ్లే పాసింజరు రైలుకు అద్దాల బోగీని జత చేసి అరకు వరకు మాత్రమే రైల్వే శాఖ నడుపుతోంది. కిరండూల్‌ పాసింజరు అరకు స్టేషన్‌కు 10.45 గంటలకు చేరుతుంది.  అక్కడ  అద్దాల బోగీని  కిరండూల్‌  పాసింజరు నుంచి వేరు చేస్తారు.  తిరుగు ప్రయాణం లో Train No. 58502 కిరండూల్‌ పాసింజరు కు అద్దాల బోగీని కలుపుతారు.    Train No. 58502 కిరండూల్‌ పాసింజరుఅరకు స్టేషన్‌ నుంచి 14:55 బయులు దేరుతుంది.  బొర్రా గుహలు 15:54 & విశాఖపట్నం 20:30 చేరుతుంది. అద్దాల బోగీలో 40 సీట్లు మాత్రమే ఉంటాయి.  ప్రయణికులు సీట్లును ముందుగా రిజర్వేషన్‌ చేయించుకోవటం అవసరం.  అద్దాల బోగీలో నుంచి సొరంగ మార్గాలు, ఇరువైపులా గల ప్రకృతిరమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను చక్కగా చూడవచ్చును.
     విశాఖపట్నం నుంచి 06:50 బయులు దేరిన
కిరండూల్‌ పాసింజర్ బొర్రా గుహలు స్టేషన్‌ కు 09:40 చేరుకుంటుంది.  బొర్రా నుంచి బయలుదేరిన రైలు బండి  అరకు స్టేషన్‌కు 10.45 గంటలకు చేరుతుంది. ప్రయాణంలో " సిమిలిగుడ " అనే స్టేషను వస్తుంది. ఇది భారతదేశంలో అతి ఎత్తులో వున్న Broad gauge స్టేషను అంటారు.  అరకు ముందున గల అరకులోయ లో ఒక నిముషం ఆగుతుంది.  సమీపంలో హరిత హిల్ల్ రిసార్ట్  (మయూరి) ఉంది. ఇది un-official halt.  అరకు రైల్వేస్టేషన్‌ నుంచి అరకులోయ వెళ్ళుటకు ప్రైవేటు వాహనాలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.  అరకులోయ లో యాత్రికులుకు మంచి వసతులు దొరుకుతాయి.
                                   """""

 బస్ ప్రయాణం (Bus journey)
     విశాఖపట్నం ద్వారకా RTC Bus Complex నుంచి బస్సులు ప్రతి 45 నిముషాలకు అరకు కు బయులు దేరుతాయి.  ఉదయం 5:00 గంటలు నుంచి రాత్రి 07:30 వరకు దొరుకుతాయి.  బస్సులు (వయా) కొత్తవలస, ఎస్. కోట, కాశీపట్నం,   అనంతగిరి మౌంటెన్, సుంకర మెట్ట, అరకు లోయ మీదగా ఉంటాయి. ఎస్. కోట దాటిన తరువాత ఘాట్ రోడ్డు మొదలవుతుంది.  మార్గ మద్యన పర్వతార్యణాలు, చిన్న చిన్న గిరిజన గ్రామీణ ప్రాంతములు, లోయలు, కొండ మలుపులు మొదలగునవి దర్శనమిస్తాయి.  అనంతగిరి మౌంటెన్
దాటిన తరువాత ' Y " జంక్షన్ వద్ద బొర్రా గుహలు రోడ్డు విడిపోతుంది.  అరకు లోయ ప్రాంతములో RTC bus stand ఉంటుంది.  కొన్ని బస్ సర్వీసులు అరకు రైల్వే స్టేషన్ వరకు ఉంటాయి .  అరకు లోయ ప్రాంతములో వసతులు, భోజన శాలలు, Private వాహనములు, స్ధానిక గైడ్స్ మొదలగు సౌకర్యములు దొరుకుతాయి.  విశాఖ - అరకు బస్ ప్రయాణం కూడ ఆహ్లోదకరంగా ఉంటుంది.
                                   """""

Train services:     Train No. 58501 
Visakhapatnam - Kirandual passenger
Visakhapatnam Dep: 06:50
Araku Arvl: 10:45
Distance = 129 Kms.
Total seats : 40

FARE:  General  Sleeper  * Executive    AC
             coach      coach      coach        2 Tier

Adult        45          100         665            700
Child        15             40         300            325
Sr.Cit (F)  30            60         365            380
Sr.Cit (M) 35            70         425            445

Sr.Cit (F) : Sr. Citizen (Female)
* Executive coach  : Vistadome (Glass) coach charges. (Train No. 00501)
Reservatio:  Advance Reservation Period for booking accommodation in trains 120 days (excluding the date of journey).
Visakhapatnam Reservation Office 
and Online booking also.
                                 
                                    """"

  aptdc : (Andhra Pradesh Development Corporation Ltd.)/Visakhapatnam.
On line booking: www.aptdc.in
 Central Reservation Office, Behind Lalitha Jewellery, RTC Complex, Visakhapatnam's Ph. No. 0891 - 2788820 & Mobile: 9848813584.
 Reservation Centre: Visakhapatnam Railway Statiin's Ph: 0891 - 2788821 & 9848813585.
 Package Details
 Road Package Tour:   (Daily Non A/c Coach) Mobile: 9848813584.
Adult 956/- Child 765/- (Including Breakfast, Mineral water, Lunch, Tea, Snaks & Borra caves entrance Fee)

 Places covered:   
Borra caves, Padmapuram gardens, Tribal Museum, Ananthagiri coffee plantations, Gali konda, View point, Jungle Bells-Tyda.

** రైలు బండి సంద్శకులును బొర్రా గుహలు నుంచి  pick up చేసే సౌకర్యం  కూడ కలదు.  aptdc టూర్జిం శాఖ బస్సులు ద్వారా పై package ఉపయోగించు కోవచ్చును.
 ARAKU RAIL CUM ROAD TOUR: (One day) Mobile : 9848813585.
⭐  No services available present.

Daily (one day tour) Araku by Train Borra Caves, Dep. 6.00am Arr. 8.30pm 
FARE: Adult Rs. 983/- Child: Rs. 787/- (including Breakfast, Lunch, Tea, Snaks & Borra caves entrance Fee)

 ARAKU RAIL CUM ROAD TOUR: (Two days) Mobile : 9848813585.
⭐  No services

Daily (Two days tour) Araku via Borra Caves, Rail cum road. Dep. 6.00am Arr. 8.30pm (Next day) (including one day accommodation at Araku, Breakfast, Lunch, Tea, Snaks & Nin-A/c Transportation)
                                
31-08-2018                     కె. కె. మంగపతి
                                          Yatra - Telugu
------------------------------------------------------------------                   మీకు నచ్చితే షేర్ చేయండి లేదా ఒక లైక్ ఇవ్వండి

నవ నందుల దర్శనం

#నవనందుల దర్శనం :
కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS