కదంబ వృక్ష మహిమ :
కదంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు.
దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్‌సిస్.
దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్‌సిస్.
ఇది ఆకురాల్చదు. ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుందంటున్నారు. ఉష్ణ మండల ప్రాంతంలో విరివిగా లభిస్తుందంటున్నారు బయాలజిస్టులు.
పురాణాల్లో కదంబ వృక్షం:
ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తరభారతంలో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతంలో పార్వతీవృక్షమనీ అంటారు. ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షము అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’.. అలాగే దీనికి పార్వతీవృక్షమని కూడా పేరు. నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు ‘నారాయణా నారాయణి’ లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.
హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం..
అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. గార్దబాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమిమీద, మనుషులతో, జంతువులతో మరణంలేకుండా ఉండాలని వరం కోరతాడు. శివయ్య తథాస్సు అని అంతర్థానమవుతాడు. వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రున్ని తరిమికొడతాడు గార్దబుడు. దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంటపెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు. గార్దబాసురుని చంపమని కోరతాడు శ్రీమహావిష్ణువు. అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు. నువ్వు గార్దబాసురుని చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు. దానికి శివయ్య నువ్వు గనుక గార్దబాసురుని చంపినట్టైతే నేనే దాసుడిగా మారతానని దానికి మరో మాట కలుపుతాడు. అయితే మోహినీ రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి. దక్షిణాన ఉన్న గార్దబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు. అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్యరూపంలో వస్తుంది పార్వతీదేవి. అమ్మవారి అందానికి ముగ్దులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరతారు. మరోవైపు మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు. దీంతో కదంబాసురున్ని ఆకాశంలోకి ఎగరేసి.. తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు. ముఖం తోడేలు.. మొండెం మనిషి రూపంలో ఉండి… పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు. అలా సంహరిస్తున్న తరుణంలో అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరిని సంహరిస్తుంది అమ్మవారు. దీంతో గార్దబాసురుని సంహారం జరిగిపోయింది. అయితే సరదాగా అన్న మాట మాటే కాబట్టి… రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలు అందించాడు శివుడు.
జ్యోతిష్య శాస్త్రంలో….
ఆ కదంబ వృక్షానికి పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు. గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు. పసుపు, కుంకమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు. గ్రహదోషాలు ఉన్నవాళ్లు… కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. ఓం శక్తిరూపణ్యై నమః మంత్రంతో పూజించాలి అంటారు.
ఇదండీ.. కదంబ వృక్ష మహిమ. ఈ వృక్షం ఎందరికో నీడనివ్వాలని కోరుతోంది .
Teliyani vishyalu telipinanduku dhanyavadalu
ReplyDeleteThanks for information
ReplyDeleteThanks for infermation
ReplyDeleteThank u guruv garu
ReplyDelete