Friday, December 31, 2021

నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో మణిద్వీప వర్ణన పారాయణ చెయ్యాలి. ఎందుకు చేస్తారు

 నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో మణిద్వీప వర్ణన పారాయణ చెయ్యాలి. ఎందుకు చేస్తారు?


శ్రీదేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన ఉంది. గృహనిర్మాణము  చేస్తున్న వారు గృహము కొనడానికి సిద్ధంగా ఉన్నవారు గృహ యోగం కావలసిన వారు ప్రతి రోజు సాయంత్రం పారాయణ చేస్తే తప్పకుండా కోరిక సిద్ధిస్తుంది.....  గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తోంది. శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.

మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని

మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1

సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు

అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2

లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు

లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు|| 3

పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు

గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే కైవల్యం|| 5

పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు

మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 6

అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు

పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు|| 7

అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు

సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు|| 8

కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు

కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు|| 9

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే కైవల్యం||

కంచుగోడల ప్రాకారాలు రాగిగోదల చతురస్రాలు

ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు|| 10

పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు

ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు|| 11

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు

పుష్పరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు|| 12

సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు

శ్రీగాయత్రీ జ్నానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు|| 13

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే కైవల్యం||

మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు

విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు|| 14

కుబేర ఇంద్ర వరుణదేవుల శుభాలనొసగే అగ్నివాయువులు

భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు|| 15

భక్తిజ్నాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు

సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు|| 16

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు

ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిదులు|| 17

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే కైవల్యం||

మంత్రిణి దండిని శక్తిసేవలు కాళికరాళి సేనాపతులు

ముప్పది రెందు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 18

సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు

గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు|| 19

సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు

నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు|| 20

మానవ మాధవ దేవగనములు కామధేనువు కల్పతరువులు

సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు|| 21

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే కైవల్యం||

కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవెదములు ఉపనిషత్తులు

పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 22

దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు

దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 23

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్నానముక్తి ఏకాంత భవనములు

మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు|| 24

పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు

సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు|| 25

చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు

వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు|| 26

ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు

ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు|| 27

పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు

సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం || 28

చింతమణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన

మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో|| 29

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే కైవల్యం||

మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి

సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో|| 30

పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో

అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది||2|| 31

నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు

చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు||2|| 32

శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట

తిష్ట వేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చకొనుటకై||2|| 33

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం

దేవదేవుల నివాసము అదియే కైవల్యం||

పరదేవత అయిన ఆ శ్రీమాత ప్రపంచాన్నంతటనీ పరిరక్షిస్తుంది. ఆమె నిత్యం

నివసించే గృహమే చింతామణి గృహం. అది మణిద్వీపంలో ఉంటుంది.

సర్వలోకోత్తమోత్తమైన ఆ మణిద్వీపాన్ని స్మరిస్తే చాలు సర్వపాపాలూ

నశిస్తాయని దేవీభాగవతం పన్నెండో స్కంధం వివరిస్తోంది. దుష్టశిక్షణ,

శిష్టరక్షణ చేస్తూ జగత్తునంతటినీ పాలించే ఈ భువనేశ్వరీ మాత నివసించే

చింతామణి గృహం వేయిస్తంభాల మండపాలతో విరాజిల్లుతుంటుంది. ఇలాంటి మండపాలు నాలుగుంటాయి. శృంగార మండపం, ముక్తిమండపం, జ్ఞానమండపం, ఏకాంత మండపం అని వాటికి పేర్లు. కోటి సూర్యప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తుంటాయి. వాటిచుట్టూ కాశ్మీరం, మల్లికా, కుందవనాలు అలరారుతుంటాయి. ఆ వనాలలో కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తుంటాయి. అక్కడే సుధారసపూర్ణంగా ఉండే ఒక పెద్దసరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు, సోపానాలన్నీ అనేకానేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ సరోవరం మధ్యలో ఓ మహాపద్మవనం, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ ఉంటాయి.

చింతామణి గృహంలో పదిమెట్లతో ఉన్న ఓ వేదిక ఉంటుంది. ఆ వేదికకు

ఉన్న పదిమెట్లూ పది శక్తిస్వరూపాలు. దానికి ఉండే నాలుగు కోళ్లపై ఉండే

ఫలకమే సదాశివుడు. ఆ ఫలకం మీద మాత భువనేశ్వరుడి వామాంకంలో కూర్చొని ఉంటుంది. ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డాణం, వైఢూర్యాలు తాపడం చేసిన అంగదాలు అలరారుతుంటాయి. శ్రీచక్రరూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం కళకళలాడుతుంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండ్లలా ఉండే పెదవులు, కస్తూరి కుంకమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన చూడామణి, ఉదయభాస్కర బింబంలాంటి ముక్కుపుడక ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు, మైపూతతో శ్రీమాత అలరారుతుంటుంది. ఆ మాతకు పక్కభాగంలో శంఖ, పద్మ నిధులు

ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్లు తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుతుంటాయి.

జగజ్జనని భువనేశ్వరుడి పక్కన ఉన్నది కాబట్టే ఆయనకంతటి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత నివసించే చింతామణి గృహం వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గృహానికి ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మ శక్తిప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవీ ఉపాసకులంతా చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా ఆ మాత కన్పిస్తుంటుంది. ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మీ అనే దేవాంగనలు ఉంటారు.

జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, అఘోర, మంగళ, దోగ్ద్రి అనే తొమ్మిది పీఠాశక్తులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ ఉండటం కన్పిస్తుంది. కేవలం దేవి ఉపాసకులకేకాక నిరంతరార్చన తత్పరులకు ఇక్కడే స్థానం దొరుకుతుంది. ఈ ప్రదేశంలో మరో గొప్ప తనమేమిటంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి, చెరకురసాల జీవనదులు ప్రవహిస్తుంటాయి. కోర్కెలను తీర్చే మహత్తర వృక్షాలు ఇక్కడ ఎన్నెన్నో. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలుండవు. అంతా నిత్యయౌవనంతో ఆనందంతో ప్రకాశిస్తుంటారు. వారంతా మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా ఇక్కడికి వచ్చి అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపమూ అందులోని చింతామణి గృహమూ ఒక్కోసారి ఒక్కో విధంగా పవిత్రకాంతులనువెదజల్లుతూ ఉంటాయి.

ఐశ్వర్యానికీ, యోగానికీ అన్నిటికి అది పరమావధి. జగత్తునంతటినీ తానై యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం దేవీభాగవతంలో ఇలా కన్పిస్తుంది. తన భక్తులకు బాధ కలిగిందని తెలిసినప్పుడల్లా తానే స్వయంగా ముందుకువచ్చి దుష్ట శిక్షణ చేస్తుండే ఆ పరాంబిక ఎక్కడుంటుంది అని ఎవరికైనా కలిగే సందేహమే. ఆ సందేహానికి సమాధానమిస్తూ మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో ఉండే ఆ శ్రీమాత గురించి ఈ కథా సందర్భం ఇలా వివరించి చెప్పింది. మణిద్వీప వర్ణన, చింతామణి గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తకోటి నమ్మకం.

ఫలశ్రుతి: పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసినీ, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు 9 దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారము నాడు మీ పుజానతరం తొమ్మిది సార్లు చదివిన దన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్నాన వైరాగ్య సిద్దులతో ఆయురారోగ్య,అయిశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపము చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.

ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా?!!

 ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా?!!


శివుడు , విష్ణువు పూజలు అందుకునే ఆ పురాతన ప్రాంత విశిష్టత ఏంటో మీకు తెలుసా?


అయితే ఒక్కసారి దీనిని చదవండి.



దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.


కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది.


క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.


పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.


హరిహరాదుల క్షేత్రం..


శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.


పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.


చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.


కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.


పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. .


వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.


జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.

బుధ అష్టమి

 బుధ అష్టమి



బుధ అష్టమి అనునది హిందువులకు అతి పవిత్రమైనది. ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , బుధవారము నాడు సంభవించినచో   ఆ అష్టమిని “బుధాష్టమి” అని అంటారు.

ఈ బుధాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. ఈ దినమున భక్తులు మిగుల భయ భక్తులచే పార్వతి , పరమేశ్వరులను ఆరాదించెదరు. 

మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి , శివారాధన , పార్వతిదేవి ఆరాధన చేస్తారో , అట్టి వారు , వారి మరణానంతరం నరకమునకు పోవరట. ఈ బుధాష్టమి వ్రతము సలుపు వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు. 


ఈ బుదాష్టమి వ్రతమును ఉత్తర దేశమున , అనగా గుజరాత్ యందును , మహారాష్ట్ర యందును ఎక్కువగా ఆచరిస్తారు.


బుధాష్టమి వ్రత విధానము:


ఈ దినమున అనగా బుదాష్టమి నాడు భక్తులు నవగ్రహాలలో ఒకడైన బుదుడిని ఆరాదించి , ఆయన అనుగ్రహమును పొందుతారు. 


ఈ దినము భక్తులు ఉపవాసముండి బుదుడికి ప్రత్యేక నైవేద్యమును నివేదించుతారు. 


వ్రత పూజ పిదప ఆ ప్రసాదమును మాత్రము తీసుకొన వలయును. 


ఈ వ్రతమునకై బుధ విగ్రహము కానీ , బంగారు , వెండి కాసులో చిత్రీకరీంచిన బుధరూప కాసు ను కానీ , ఉపయోగించెదరు. 


ఈ బుధుడి ముందు నీటితో నింపిన కలశమును పెట్టి కొబ్బరి బోండామును ప్రతిష్టించెదరు. 


పిదప భయ భక్తులచే వివిధ పూజలను చేసి , ఆ నైవేద్య ప్రసాదమును అందరికీ పంచి ఇస్తారు.


ఈ వ్రతము ప్రారంబించినవారు వరుసగా 8 మార్లు ఆచరించవలెను. 


ఈ విధముగా ఆచరించిన పిదప , కడపటి బుధాష్టమి నాడు నీరు పేదలకు , భోజనాలు పెట్టి , తోచిన వస్త్ర దానం చేయవలెను. వారికి నెలకు సరిపడ బియ్యం , నూనె , పప్పులు దానము చేయవలెను , ఈ విధముగా బుధ అష్టమి వ్రతమును చేసిన వారికి , వారి సకల దోషములు తోలగి , పుణ్యం లభించి నరక లోకమునకు పోక కైవల్య ప్రాప్తి పొందుతారు. 

కొందరు ఈ దినమున శివ పార్వతులకు పూజలు కూడా నిర్వహిస్తారు.


ఈ బుధాష్టమి విశిష్టత:


ఈ బుధాష్టమి యొక్క విశిష్టత బ్రహ్మాండ పురాణము నందు వివరింప బడివున్నది. ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుత , పూర్వ , జన్మ పాపముల నుండి విముక్తి లభించును. శివ , పార్వతి ఆరాధన ఈ బుధాష్టమి నాడు చేసిన అంతటి ఫలితం లభించును. ఈ వ్రతమాచరించిన వారికి బుధ గ్రహ దోషములు నివారింపబడి , బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును.


బుధ అష్టమి వ్రతంలో ముఖ్యమైన సమయాలు


Sunrise September 29, 2021 6:21 AM

Sunset September 29, 2021 6:12 PM

Ashtami Tithi Begins September 28, 2021 6:17 PM

Ashtami Tithi Ends September 29, 2021 8:30 PM



శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం


బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః

దృఢవ్రతో దృఢబలః శ్రుతిజాలప్రబోధకః || ౧ ||


సత్యవాసః సత్యవచాః శ్రేయసాంపతిరవ్యయః

సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః || ౨ ||


వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్వరః

విద్యావిచక్షణ విభుర్ విద్వత్ప్రీతికరో బుధః || ౩ ||


విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః

వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః || ౪ ||


త్రివర్గఫలదోఽనంతః త్రిదశాధిపపూజితః

బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః || ౫ ||


వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః

ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః || ౬ ||


సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధుః సదాదరః

సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః || ౭ ||


వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్

స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః || ౮ ||


అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః

విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః || ౯ ||


చారుశీలః స్వప్రకాశః చపలశ్చ జితేంద్రియః

ఉదఙ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః || ౧౦ ||


సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ

సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః || ౧౧ ||


పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః

ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః || ౧౨ ||


ఆత్రేయగోత్రజోఽత్యంతవినయో విశ్వపావనః

చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః || ౧౩ ||


వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః

బంధుప్రియో బంధముక్తో బాణమండలసంశ్రితః || ౧౪ ||


అర్కేశానప్రదేశస్థః తర్కశాస్త్రవిశారదః

ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః || ౧౫ ||


మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః

కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః || ౧౬ ||


బుధస్యైవం ప్రకారేణ నామ్నామష్టోత్తరం శతమ్ ||



బుధ కవచం


అస్య శ్రీబుధకవచస్తోత్రమంత్రస్య , కశ్యప ఋషిః ,

అనుష్టుప్ ఛందః , బుధో దేవతా , బుధప్రీత్యర్థం జపే వినియోగః |

అథ బుధ కవచమ్


బుధస్తు పుస్తకధరః కుంకుమస్య సమద్యుతిః |

పీతాంబరధరః పాతు పీతమాల్యానులేపనః || 1 ||

కటిం చ పాతు మే సౌమ్యః శిరోదేశం బుధస్తథా |

నేత్రే ఙ్ఞానమయః పాతు శ్రోత్రే పాతు నిశాప్రియః || 2 ||

ఘ్రాణం గంధప్రియః పాతు జిహ్వాం విద్యాప్రదో మమ |

కంఠం పాతు విధోః పుత్రో భుజౌ పుస్తకభూషణః || 3 ||

వక్షః పాతు వరాంగశ్చ హృదయం రోహిణీసుతః |

నాభిం పాతు సురారాధ్యో మధ్యం పాతు ఖగేశ్వరః || 4 ||

జానునీ రౌహిణేయశ్చ పాతు జంఘే ??ఉఖిలప్రదః |

పాదౌ మే బోధనః పాతు పాతు సౌమ్యో ??ఉఖిలం వపుః || 5 ||

అథ ఫలశ్రుతిః

ఏతద్ధి కవచం దివ్యం సర్వపాపప్రణాశనమ్ |

సర్వరోగప్రశమనం సర్వదుఃఖనివారణమ్ || 6 ||

ఆయురారోగ్యశుభదం పుత్రపౌత్రప్రవర్ధనమ్ |

యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ || 7 ||


ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే బుధకవచం సంపూర్ణమ్




శ్రీ బుధ స్తోత్రం


 

ధ్యానం |

భుజైశ్చతుర్భిర్వరదాభయాసి-

గదా వహంతం సుముఖం ప్రశాంతమ్ |

పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం

సింహే నిషణ్ణం బుధమాశ్రయామి ||


పీతాంబరః పీతవపుః కిరీటీ చ చతుర్భుజః |

పీతధ్వజపతాకీ చ రోహిణీగర్భసంభవః ||


ఈశాన్యాదిషుదేశేషు బాణాసన ఉదఙ్ముఖః |

నాథో మగధదేశస్య మంత్ర మంత్రార్థ తత్త్వవిత్ ||


సుఖాసనః కర్ణికారో జైత్త్రశ్చాత్రేయ గోత్రవాన్ |

భరద్వాజఋషిప్రఖ్యైర్జ్యోతిర్మండలమండితః ||


అధిప్రత్యధిదేవాభ్యామన్యతో గ్రహమండలే |

ప్రవిష్టస్సూక్ష్మరూపేణ సమస్తవరదస్సుఖీ ||


సదా ప్రదక్షిణం మేరోః కుర్వాణః కామరూపవాన్ |

అసిదండౌ చ బిభ్రాణః సంప్రాప్తసుఫలప్రదః ||


కన్యాయా మిథునస్యాపి రాశేరధిపతిర్ద్వయో |

ముద్గధాన్యప్రదో నిత్యం మర్త్యామర్త్యసురార్చితః ||


యస్తు సౌమ్యేన మనసా స్వమాత్మానం ప్రపూజయేత్ |

తస్య వశ్యో భవేన్నిత్యం సౌమ్యనామధరో బుధః ||


బుధస్తోత్రమిదం గుహ్యం వసిష్ఠేనోదితం పురా |

దిలీపాయ చ భక్తాయ యాచమానాయ భూభృతే ||


యః పఠేదేకవారం చా సర్వాభీష్టమవాప్నుయాత్ |

స్తోత్రరాజమిదం పుణ్యం గుహ్యాద్గుహ్యతమం మహత్ ||


ఏకవారం ద్వివారం వా త్రివారం యః పఠేన్నరః |

తస్యాపస్మారకుష్ఠాదివ్యాధిబాధా న విద్యతే ||


సర్వగ్రహకృతాపీడా పఠితేఽస్మిన్నవిద్యతే |

కృత్రిమౌషధదుర్మంత్రం కృత్రిమాదినిశాచరైః ||


యద్యద్భయం భవేత్తత్ర పఠితేఽస్మిన్నవిద్యతే |

ప్రతిమా యా సువర్ణేన లిఖితా తి భుజాష్టకా ||


ముద్గధాన్యోపరిన్యస్త పీతవస్త్రాన్వితే ఘటే |

విన్యస్య విధినా సమ్యక్ మాసమేకం నిరంతరం ||


యే పూజయంతి తే యాంతి దీర్ఘమాయుః ప్రజాం ధనమ్ |

ఆరోగ్యం భస్మగుల్మాదిసర్వవ్యాధివినాశనమ్ ||


యం యం కామయతే సమ్యక్ తత్తదాప్నోత్యసంశయః

ద్వాదశ జ్యోతిర్లింగాలు, జ్యోతిర్లింగ ఉపలింగాలు గురించి తెలుసుకుందాం.

 ద్వాదశ జ్యోతిర్లింగాలు, జ్యోతిర్లింగ ఉపలింగాలు గురించి తెలుసుకుందాం.



 మహేశ్వరుని మహిములు వర్ణనాతీతము. మహాదేవుని మహాత్సంకల్ప భాగ్యమే సృష్టిస్థితి లయాత్మక ప్రపంచం. అటువంటి మహేశుని మహానందభరితమైన జ్యోతిస్వరూపమే జ్యోతిర్లింగములుగా ఆవిర్భవించెను. అదే ఏకరూపతికి నిదర్శనం. బ్రహ్మాండమున, శివలింగములను లెక్కించడం ఎవరి తరం? నిజం చెప్పాలంటే ఈ బ్రహ్మాండమే ఒక మహాలింగమని అందలి చరాచర ప్రాణులలో శివుడు, జ్యోతిర్లింగ స్వరూపునిగా, అంతర్యామిగా నుందువాడని భావము. ఈ పుణ్యభూమిలో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అటకం నుండి కటకం వరకు అనాదిగా ఏకాత్మతను ప్రసాదించుచున్న పన్నెండు జ్యోతిర్లింగములు పరచుకొని ఉన్నాయి. అవే ద్వాదశ జ్యోతిర్లింగములుగా వ్యవహరింపబడుతున్నాయి.


అవి:

1. సౌరాష్ట్ర సోమనాథంచ - సోమనాథలింగం (గుజరాత్) 

2. శ్రీశైలే మల్లిఖార్జునమ్ - మల్లిఖార్జునలింగం (ఆంధ్రప్రదేశ్) 

3. ఉజ్జయిన్యాం మహాకాల - మహాకాలేశ్వరుడు (మధ్యప్రదేశ్)

4. ఓంకారే పరమేశ్వరం - ఓంకారేశ్వరుడు (మధ్యప్రదేశ్) 

5. కేదారం హిమవత్పృష్ఠే‍‌‍ - కేదారేశ్వరుడు (ఉత్తరాంచల్)

6. ఢాకిన్యాం భీమశంకరం - భీమశంకరుడు (మహారాష్ట్ర) 

7. వారణస్యాంచ విశ్వేశం - విశ్వేశ్వరుడు (ఉత్తరప్రదేశ్) 

8. త్ర్యంబకం గౌతమతటే - త్రయంబకేశ్వరుడు (మహారాష్ట్ర)

9. వైద్యనాథం చితాభూమౌ - వైద్యనాథుడు (బీహారు) 

10. నాగేశం దారుకావనే - నాగేశ్వరలింగం (గుజరాత్) 

11. సేతుబంధేచ రామేశం - రామనాథ లింగం (తమిళనాడు)

12. ఘుశ్మేశంచ శివాలయే - ఘుశ్మేశ్వర లింగం (మహారాష్ట్ర) 


 ఈ విధంగా వివిధ రాష్ట్రాలలో ఆవిర్భవించిన పండ్రెండు జ్యోతిర్లింగాలలో సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతం తీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రపు ఒడ్డున సోమనాధ లింగం), నది ఒడ్డున మూడు (గోదావరి ఒడ్డున త్రయంబకేశ్వర లింగం, రేవానది (నర్మాదానది) తీరంలో ఓంకారేశ్వరుడు, గంగానదీ తీరాన విశ్వేశ్వరుడు) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయ పర్వత శిఖరాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వత శిఖరాలలో భీమశంకరుడు, మేరుపర్వత శిఖరాలలో వైద్యనాథలింగం) మైదానంలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, వేలురు గ్రామంలో ఘుశ్మేశ్వరలింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) గాను పండ్రెండు క్షేత్రాలలో తేజోస్వరూపుడైన పరమశివుడు జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి చెందాడు.


ద్వాదశ జ్యోతిర్లింగానికి చెందిన ఉపలింగములు కూడ ప్రసిద్ధి చెందినవి. సోమనాథుని ఉపలింగము అంతకేశుడని, మహానది - సముద్రము కలసిన చోట విలసిల్లెను‌. మల్లికార్జునుని ఉపలింగము రుద్రేశ్వరుడనబడే భృగుకక్ష అనే స్థలంలో నెలకొనియున్నదనియు మహాకాలుని ఉపలింగము నర్మదా నదీతీరంలో దుగ్దేశుడనే పేరుతో విరాజిల్లుచున్నది, ఓంకారేశ్వరుని ఉపలింగం కర్థమేశుడనబడుచు బిందు సరస్సు చెంత ప్రసిద్ధమైనది. కేదారేశ్వరుని ఉపలింగము యమునా తీరమున భూతేశుడను పేరుతో ప్రఖ్యాతమైయున్నది.‌‌‍ భీమశంకరుని ఉపలింగము సహ్యపర్వతము పై భీమేశ్వరుడని చెప్పబడుచున్నది. విశ్వేశ్వరుని ఉపలింగము ఆత్రేశ్వరుడని మందాకినీ నదితీరంలోను, త్రయంబకేశ్వరుని ఉపలింగము మహాబలేశ్వరుడు గోకర్ణమనే ప్రాంతంలోనూ, వైద్యనాథుని ఉపలింగము నందేశ్వరుడనే పేరుతోను, నాగేశ్వరుని ఉపలింగము యమునా తీరమున భూతేసుడను పేరుతో మల్లికా సరస్వతి సంగమమున విరాజిల్లుతున్నది. రామేశ్వరుని ఉపలింగము గుప్తేశ్వరుడని గుప్తకాశీలోను, ఘుశ్వేశ్వరుని ఉపలింగము వ్యాఘ్రేశ్వరుడని ప్రసిద్ధి కెక్కినవి. ద్వాదశ జ్యోతిర్లింగములకు ఎంతటి మహత్తు గలదో అంతటి మహత్తు ఈ ఉపలింగాలకు కూడా కలదని శివమహాపురాణం తెలియజేస్తోంది.


ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించినా, స్పృశించినా వేరు వేరు మహిమలు తెలియజేస్తున్నట్లు శివపురాణాంతర్గత కోటి రుద్రసంహిత యందు, శివవిజ్ఞాన సర్వస్వములోను ప్రథమాధ్యాయంలో తెలియవస్తోంది. సోమనాధుని మొదలు ఘుశ్మేశ్వరుని వరకు గల ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానికి ఒకొక్క మహిమ కలదు. అయితే ఈ పండ్రెండు జ్యోతిర్లింగములు దర్శించలేని వారు కనీసం ఒక్క లింగమునైన దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుంది‌

శ్రీసూక్తం!!

 ఆధ్యాత్మికం - శ్రీసూక్తం!!



ఓం హిర'ణ్యవర్ణాం హరి'ణీం సువర్ణ'రజతస్ర'జాం | 

చంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ||


ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. 


తాం మ ఆవ'హ జాత'వేదో లక్ష్మీమన'పగామినీ''మ్ |

యస్యాం హిర'ణ్యం విందేయం గామశ్వం పురు'షానహమ్ ||


ఎవరి కరుణ, కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము.


అశ్వపూర్వాం ర'థమధ్యాం హస్తినా''ద-ప్రబోధి'నీమ్ |

శ్రియం' దేవీముప'హ్వయే శ్రీర్మా దేవీర్జు'షతామ్ ||


గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను.తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము.


కాం సో''స్మితాం హిర'ణ్యప్రాకారా'మార్ద్రాం జ్వలం'తీం తృప్తాం తర్పయం'తీమ్ |

పద్మే స్థితాం పద్మవ'ర్ణాం తామిహోప'హ్వయే శ్రియమ్ ||


చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను.


చంద్రాం ప్ర'భాసాం యశసా జ్వలం'తీం శ్రియం' లోకే దేవజు'ష్టాముదారామ్ |

తాం పద్మినీ'మీం శర'ణమహం ప్రప'ద్యేఽలక్ష్మీర్మే' నశ్యతాం త్వాం వృ'ణే ||


చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను.ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు.


ఆదిత్యవ'ర్ణే తపసోఽధి'జాతో వనస్పతిస్తవ' వృక్షోఽథ బిల్వః |

తస్య ఫలా'ని తపసాను'దంతు మాయాంత'రాయాశ్చ' బాహ్యా అ'లక్ష్మీః ||


సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక!


ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి'నా సహ |

ప్రాదుర్భూతోఽస్మి' రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృ'ద్ధిం దదాదు' మే ||


కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు!


క్షుత్పి'పాసామ'లాం జ్యేష్ఠామ'లక్షీం నా'శయామ్యహమ్ |

అభూ'తిమస'మృద్ధిం చ సర్వాం నిర్ణు'ద మే గృహాత్ ||


ఆకలి దప్పికలతో కృశించినది,శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని (అలక్ష్మి)నేను నాశనం చేస్తాను. నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు.


గంధద్వారాం దు'రాధర్షాం నిత్యపు'ష్టాం కరీషిణీ''మ్ |

ఈశ్వరీగ్^మ్' సర్వ'భూతానాం తామిహోప'హ్వయే శ్రియమ్ ||


సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను.


మన'సః కామమాకూతిం వాచః సత్యమ'శీమహి |

పశూనాం రూపమన్య'స్య మయి శ్రీః శ్ర'యతాం యశః' ||


ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము.


కర్దమే'న ప్ర'జాభూతా మయి సంభ'వ కర్దమ |

శ్రియం' వాసయ' మే కులే మాతరం' పద్మమాలి'నీమ్ ||


కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి. 


ఆపః' సృజంతు' స్నిగ్దాని చిక్లీత వ'స మే గృహే |

ని చ' దేవీం మాతరం శ్రియం' వాసయ' మే కులే ||


మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి. దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు. 


ఆర్ద్రాం పుష్కరి'ణీం పుష్టిం సువర్ణామ్ హే'మమాలినీమ్ |

సూర్యాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ||


ఓ అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.


ఆర్ద్రాం యః కరి'ణీం యష్టిం పింగలామ్ ప'ద్మమాలినీమ్ |

చంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ ||


అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.


తాం మ ఆవ'హ జాత'వేదో లక్షీమన'పగామినీ''మ్ |

యస్యాం హిర'ణ్యం ప్రభూ'తం గావో' దాస్యోఽశ్వా''న్, విందేయం పురు'షానహమ్ ||


అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము. ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి.


ఓం మహాదేవ్యై చ' విద్మహే' విష్ణుపత్నీ చ' ధీమహి |

తన్నో' లక్ష్మీః ప్రచోదయా''త్ ||


మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తున్నాను.


శ్రీ-ర్వర్చ'స్వ-మాయు'ష్య-మారో''గ్యమావీ'ధాత్ పవ'మానం మహీయతే'' |

ధాన్యం ధనం పశుం బహుపు'త్రలాభం శతసం''వత్సరం దీర్ఘమాయుః' ||


సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత. పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు. గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించుఅమ్మవారికి స్తోత్రం అంటే ప్రీతి.. శుక్రవారం ఇలా చేస్తే అమ్మవారిని స్తోత్రించిన వారికి అభీష్ట సిద్ధి లభిస్తుంది. ఒక్కొక్క దేవతకీ ఒక్కొక్కటీ ప్రీతి. శివునికి అభిషేకం, విష్ణువునకు అలంకారం, సూర్యునికి నమస్కారం, గణపతికి తర్పణము, అమ్మవారికి స్తోత్రము ప్రీతికరం. అందుకే తల్లికి స్తోత్రముల చేత అభినందించి ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అందుకే "స్తుతా దిశసి కామం'' స్తోత్రం చేత సర్వాభీష్టాలు కలుగుతాయి. అలాగే పాపాలను ఈ స్తోత్రం పోగొడుతుంది.


అలాగే కోరిన కోరికలు నెరవేరాలంటే శుక్రవారమే కాకుండా ప్రతి రోజూ 108 సార్లు ఈ శ్లోకాన్ని పఠించాలి. స్తోత్రములు అమ్మవారి మహిమ, గుణము, లీల, రూపము, తత్త్వము చెప్పబడుతున్నాయి. వాటిని స్తోత్ర రూపంలో పట్టుకుంటే కోరికలు నెరవేరుతాయి. అలాగే స్మరణ అనేది మనస్సుకు సంబంధించినది కనుక స్మరణ చేస్తే పాపాలు నశించి పోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 


అలాగే ఐశ్వర్య సిద్ధికి శ్రీ సూక్తం విశేష ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీ అర్చనలో ఉచ్చరించే పరమశుద్ధ మంత్రాలు శ్రీసూక్తం. ఇవి అధర్వణ వేదంలో మంత్రాలు. రుగ్వేదంలో కూడా దర్శనమిస్తాయి. ప్రతిదినం భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాలను పఠిస్తూ అగ్నిలో ఆజ్యం వేల్చి హారతులిస్తే లక్ష్మీ అనుగ్రహం సత్వరం కలుగుతుంది. శ్రీ మాత్రే నమః

మార్గశిర బహుళ అష్టమి సమస్త కోరికలను సిధ్ధింపచేసే అనఘాష్టమి వ్రతం.


మార్గశిర బహుళ అష్టమి
సమస్త కోరికలను సిధ్ధింపచేసే అనఘాష్టమి వ్రతం.

▫️
గురు దత్తాత్రేయునికి గృహస్తు రూపం కూడా ఉంది.
అటువంటి గృహస్తు రూప దత్తునకే “అనఘస్వామి” అని పేరు. 
ఆ స్వామి అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు. 
ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము.
అఘము అంటే పాపము. ఈమె అనఘ. 
అంటే ఏవిధమైన పాపము లేనిది, అంటనిది అని అర్థం.

మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. 
ఈ మూడు విధాలుగా జరిగే పాపాలను 
అనఘాదేవి పోగొడుతుంది. 
అందుకే అనఘాదేవి ఉపాసన సకల పాపాలను
హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి,
మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి.
అనఘస్వామిలో బ్రహ్మ,రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి.

అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. 
ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన 
జీవనం గడుపుతూ భక్తులకు తత్వ జ్ఞానాన్ని అనుగ్రహించే
అతి ప్రాచీన, ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు
(అణిమా,లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం ,ఈశిత్వం, వశిత్వం,
కామావసాయితా, మహిమా ) పుత్రులై అవతరించారు.

అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగం నందు ప్రీతిగలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది.
వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. 
కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే “మధుమతి ” అనే
పేరు కూడా కలదు. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి
ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను 
వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము .

అనఘాదేవి యోగశక్తి తాలూకు ప్రకాశస్వరూపంగా
ఉపాసకులు భావిస్తారు. అనఘా ఉపాసన ద్వారా
సిద్ధిపదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారు.
కవితాశక్తి, కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది.
అనఘాదేవి యోగేశ్వరి… జగన్మాత.
ఈమెకు మధుమతి అనే పేరు కూడా ఉంది. 
అనఘను ధరించిన స్వామి అనఘుడు. 
అతడే దత్తాత్రేయుడు. 
అనఘాదేవిని స్మరిస్తూ చేసే వ్రతం అనఘాష్టమీ వ్రతంగా
అత్యంత ప్రసిద్ధి పొందింది. 
▫️

సంతానం అనుగ్రహించే సోమస్కంద మూర్తులు

సంతానం అనుగ్రహించే సోమస్కంద మూర్తులు.......!!

ఈ ఫోటో ఇంట్లో పెట్టి పూజించండి...పూర్తిగా చదవండి...
సంతానం కలగాలని కోరుకునే దంపతులు 
శ్రీ సోమస్కంద మూర్తి చిత్రపటం గానీ, విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే, పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వలన,  సుబ్రహ్మణ్యుని వంటి తేజోమూర్తి అయిన సుపుత్రుడు జన్మిస్తాడు అని శాస్త్ర వచనం. అంతే కాదు పిల్లలు ఉన్నవారైనా సరే, ఈ సోమస్కంద మూర్తిని ఆరాధిస్తే, పిల్లలు చక్కని తెలివితేటలు, బుద్ధి కుశలత, చురుకుదనం, తేజస్సు పొందుతారు. అందుకే తమిళనాట సోమస్కంద మూర్తి ఆరాధన విశేషంగా చేస్తుంటారు ...

తమిళనాడులో ఈ మూర్తి ప్రతి శివాలయమున ఉంటారు ...

మన ఆంధ్రరాష్ట్రమున కపిలతీర్థం మరియు శ్రీ కాళహస్తీ దేవాలయాల్లో మాత్రమే మనకు కనిపిస్తారు ...

ఒక్కసారి ఈ సోమస్కంద మూర్తిని గమనించండి ...

పార్వతి పరమేశ్వరుల మధ్యలో చిన్న బాలుడుగా  ఆడుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారు ...    

సో- ఉమా- స్కంద మూర్తి ...    

సోముడు అనగా శివుడు , 
ఉమా దేవి అనగా పార్వతి దేవి, 
స్కందుడు అనగా సుబ్రహ్మణ్యస్వామి వారు, 

 వీళ్ళ ముగ్గురూ కలసి ఉన్న మూర్తినే సోమస్కంద మూర్తి అంటారు,చాలా విశేషమైన మూర్తి .🌹🙏🌹

భైరవ మంత్రాలు

కాల భైరవ  మంత్ర                                                                                                                                         ఒక రక్ష కవచం సాధకుడికి . భైరవ అంటే భవిష్యత్తులో జరిగే సంఘటనలు,ఇబ్బందులు, సమస్యలను అడ్డుకోవడం అని అర్థం. కాల  భైరవుడు తన భక్తులను భయంకరమైన శత్రువులు, దురాశ, కామం మరియు కోపం నుండి రక్షిస్తాడు. భైరవుడు తన భక్తులను ఈ శత్రువుల నుండి రక్షిస్తాడు. ఈ శత్రువులు ప్రమాదకరమైనవి, ఎందుకంటే వారు మానవులను లోపల దేవుణ్ణి వెతకడానికి అనుమతించరు.కాలభైరవుడిని ఆరాధించే వారు జ్ఞానం మరియు విముక్తి యొక్క మూలాన్ని కలిగి ఉంటారు, ఇది ఒక వ్యక్తి యొక్క న్యాయతను పెంచుతుంది మరియు దుఃఖం, అనుబంధం, నిరాశ, దురాశ, కోపం మరియు వేడిని నాశనం చేస్తుంది - శివుని (కాలభైరవుడు) పాదాల సామీప్యానికి వెళతారు. , తప్పనిసరిగా.భైరవ లేదా కాల భైరవ అనేది శివుని యొక్క ఉగ్రమైన అభివ్యక్తి. 52 శక్తి పీఠాలలో ఒక్కొక్క భైరవుడికి కాపలా చేసే పనిని శివుడు నియమించాడు .భైరవుడు  యొక్క రూపాలు 52, వాస్తవానికి అవి శివుడి యొక్క వ్యక్తీకరణలుగా పరిగణించబడతాయి. చెడులు మరియు శత్రువుల నుండి రక్షణ కోసం భైరవ దీక్ష స్వీకరింవచ్చు ,🌺   

భైరవ మంత్రాలు


 కష్టములు తొలగుటకు : ఓం హూం జూం భం కాలభైరవాయ సంకష్టనాశాయ నమః
శత్రువినాశమునకు : ఓం హూం జూం భం కాలభైరవాయ శత్రువినాశాయ భీషణాయ నమః
యుద్దంలో గెలవడానికి : ఓం హూం జూం భం కాలభైరవాయ సంగ్రామ జయదాయినే నమః
దుఃఖ నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ దుఃఖ నివారణాయ నమః
వ్యాధి నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ వ్యాధినివారణాయ నమః
గ్రహదోష నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ గ్రహస్వరూపాయ గ్రహాణాంపతయే నమః
వివాహ సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ మాంగళ్యరూపాయ నమః
విఘ్న నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ విఘ్న నివారణాయ నమః
దివ్య దృష్టికి : ఓం హూం జూం భం కాలభైరవాయ యోగినేెత్రాయ నమః
విష నివారణకు : ఓం హూం జూం భం కాలభైరవాయ గరుడరూపాయ నమః
అపవాదులు, అపకీర్తి పోవుటకు: ఓం హూం జూం భం కాలభైరవాయ కళంకనాశాయ నమః
 సిద్ధానుగ్రహప్రాప్తికి : ఓం హూం జూం భం కాలభైరవాయ సిద్ధస్వరూపాయ నమః
అధికార ప్రాప్తికి : ఓం హూం జూం భం కాలభైరవాయ పాలకరూపాయ నమః
 భయ నివారణకు: ఓం హూం జూం భం కాలభైరవాయ భయహంత్రే నమః
ధ్యాన సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ ధ్యానాదిపతయే నమః
మంత్ర సిద్ధికి : ఓం హూం జూం భం కాలభైరవాయ మంత్రప్రకాశాయ మంత్రరూపాయ నమః🌺

🌺ముఖ్యమైన భైరవ మంత్రాలు🌺

🌺ఉగ్రభైరవ మంత్రము : ఓం నమో భగవతే ఉగ్రభైరవాయ షర్వ విఘ్ననాశాయ ఠ ఠ స్వాహా
మహాభీమ భైరవ మంత్రం : హ్రీం నమో మహభీమ భైరవాయ సర్వలోక భయంకరాయ సర్వశత్రు సంహారకారణాయ హ్రుం హ్రుం దేవదత్తం ధ్వంసయ ధ్వంసయ స్వాహా
క్రోధ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఋం క్రోధ భైరవాయ నమః
కపాల భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఏం కపాల భైరవాయ నమః
అఘోర భైరవ మంత్రం : హ్రీం రీం అఘోర భైరవాయ దేవదత్తం మోహయ మోహయ హుం ఫట్ స్వాహా
ఉన్మత్త భైరవ మంత్రం : 
ఓం ఐం ల్పుం ఉన్మత్త భైరవాయ నమః
చండ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఉం చండ భైరవాయ నమః
 రురు భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఇం రురు భైరవాయ నమః
అసితాంగ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం అం అసితాంగ భైరవాయ నమః
క్షేత్రపాల భైరవ మంత్రం : క్షాం క్షేత్ర పాలాయ నమః
బడబానల భైరవ మంత్రం : పాం ఓం నమో భగవతే బడబానల భైరవాయ జ్వల జ్వల ప్రజ్వల వైరిలోకం దహదహ స్వాహా
మహాభైరవ మంత్రం : ఓం శ్రీం మం మహాభైరవాయ నమః
సంహార భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం అం సంహార భైరవాయ నమః
భీషణ భైరవ మంత్రం : ఓం ఐం హ్రీం ఊం భీషణ భైరవాయ నమః
మోహన భైరవ మంత్రం : ఓం శ్రీం మోం మోహన భైరవాయ నమః
వశీకరణ భైరవ మంత్రం : ఓం శ్రీం వం వశీకరణ భైరవాయ నమః
ధూమ్ర భైరవాయ నమః : ఓం శ్రీం ధూం ధూమ్ర భైరవాయ నమః
సింహ భైరవ మంత్రం : ఓం శ్రీం సిం సింహ భైరవాయ నమః
రక్త భైరవ మంత్రం : ఓం హ్రీం స్ర్ఫం రక్త భైరవాయ నవ శవ కపాల మాలాలంకృతాయ నవాంబుధ శ్యామలాయ ఏహి ఏహి శీఘ్రమేహి ఏం ఐం ఆగామి కార్యం వదవద అఖిలోపాధిం హరహర సౌభాగ్యం దేహి మే స్వాహా.🌺

Thursday, December 23, 2021

సినీ_దర్శకుడు_చిత్రకారుడు_బాపు_* గారికి *జయంతి* _నివాళులు డిశెంబర్15

*_సినీ_దర్శకుడు_చిత్రకారుడు_బాపు_*  గారికి *జయంతి* _నివాళులు డిశెంబర్15_  🙏🏻
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


    *బాపు* (డిసెంబరు 15, 1933 - ఆగష్టు 31, 2014) తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.

*బాపు*
సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ
జననం
డిసెంబరు 15, 1933
మరణం
ఆగష్టు 31, 2014
చెన్నై
నివాస ప్రాంతం
చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లు
*బాపు*
వృత్తి
చిత్రకారుడు,
కార్టూనిస్ట్
సినిమా దర్శకుడు
మతం
హిందూ
భార్య / భర్త
భాగ్యవతి
తండ్రి
వేణు గోపాల రావు
తల్లి
సూర్యకాంతమ్మ

బాపు శైలి సవరించు
'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది.

కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.ఆయనకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, ముళ్ళపూడి వెంకటరమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకూ కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే 'బాల' అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు 'అమ్మమాట వినకపోతే' అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్ట్‌గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్మ ప్రత్యేకమైనది. ఆయన రాత కూడా అంతే. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు... కానీ ఆ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పేవరకూ చాలా మందికి తెలీదు. రమణ రాత, బాపు గీతలో వెలువడ్డ 'కోతికొమ్మచ్చి' 'బుడుగు'లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు. దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి. తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండితెరపై సృష్టించారు. అందులో 'ముత్యాలముగ్గు' సినిమాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు
ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపొయాయనటం పొగడ్త కాదు.

క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.

బాపు గీత కు గురువు సవరించు
బాపు బొమ్మ తెలుగుజాతి ప్రతి నిధి అయినట్టే, గోపులు బొమ్మ తమిళిత్వానికి ప్రతీక. ఇద్దరూ మంచి మిత్రులు. ‘నాకు గురువు’ అని బాపు, కాదు ‘నాకే గురువు’ అని గోపులు ఇష్టంగా చెప్పుకునేవారు
బాపు ఒక వారధిగా లేకపోతే, తెలుగువారికి గోపులు ఇంతగా తెలియడానికి అవకాశం లేదు. బాపు పబ్లిసిటీ సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో పరిచయం, కడదాకా కొనసాగింది.ముందుగా చెప్పక పోతే వీరిద్దరిలో ఎవరు గీసిన బొమ్మొ చెప్పడం కొంచెం కష్టమైన విషయమే!

విద్యారంగానికి ఈయన చేసిన కృషి 
జీవితంగీసిన 
బాపు  సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933 వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు.
 1955 వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నాడు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. 2014 ఆగస్టు 31న చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు.
 
పురస్కారాలు సవరించు
బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి,ఆయన తీసిన సీతాకల్యాణం సినిమా లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అందులో ముఖ్యమయినవి కొన్ని:

బాపు దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ బహుమతితో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యాకి ఛాయగ్రాహకుడిగా బహుమతి.
1986 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక బహుమతి మదర్ థెరిస్సా బహూకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణతో కలిసి స్వీకారం.
చెన్నై (తమిళనాడు) లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిష్ఠాత్మకమయిన రాజ్యలక్ష్మి బహుమతి 1982 వ సంవత్సరంలో ఇవ్వబడింది.
1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహూకరణ.
1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) వారిచే శిరోమణి బహుమతి అమెరికాలో స్వీకరణ.
మిస్టర్ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ బహుమతి. (1993 వ సంవత్సరం).
1995 వ సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (TANA) వారిచే తెలుగు చిత్ర కళా, సాహిత్య, సాంస్కృతిక, సినిమా రంగాలకు తన ఏభై సంవత్సరాల (గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకు గాను ఘన సన్మానం.
బాపు మీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.
2001 జూన్ 9 వ సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ (IIC) వారిచే జీవిత సాఫల్య బహుమతితో సన్మానం.
2002లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట బహుమతి
అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవార్డు బహూకరణ.
బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975), పెళ్లి పుస్తకం (1991), మిస్టర్ పెళ్ళాం (1993), శ్రీరామరాజ్యం (2011) సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.
2013 కు గానూ ప్రకటించిన పద్మ పురస్కారాలలో కళల విభాగంలో తమిళనాడు రాష్ట్ర విభాగంలో పద్మశ్రీ బహుమతి.
బాపు చిత్రమాలిక సవరించు
అసంఖ్యాకంగా ఈయన గీసిన అందమయిన, అద్భుతమయిన చిత్రాలలో నుండి మచ్చుకు కొన్ని...

బాపు దర్శకత్వం వహించిన సినిమాలు 
*_శ్రీరామరాజ్యం,2011 (తెలుగు)_*
సుందరకాండ,2008 (తెలుగు)
రాధా గోపాళం,2005 (తెలుగు)
రాంబంటు,1996 (తెలుగు)
పెళ్ళికొడుకు,1994 (తెలుగు)
పరమాత్మా,1994 (హిందీ )
శ్రీనాథ కవిసార్వభౌమ,1993 (తెలుగు)
మిష్టర్ పెళ్ళాం,1993 (తెలుగు)
పెళ్ళి పుస్తకం,1991 (తెలుగు)
ప్రేమ్ ప్రతిజ్ఞా,1989 (హిందీ )
దిల్ జలా,1987 (హిందీ )
ప్యార్ కా సిందూర్,1986 (హిందీ )
కళ్యాణ తాంబూలం,1986 (తెలుగు)
మేరా ధరమ్,1986 (హిందీ )
ప్యారీ బెహనా,1985 (హిందీ )
బుల్లెట్,1985 (తెలుగు)
జాకీ,1985 (తెలుగు)
మొహబ్బత్,1985 (హిందీ )
సీతమ్మ పెళ్ళి,1984 (తెలుగు)
మంత్రిగారి వియ్యంకుడు,1983 (తెలుగు)
వోహ్ సాత్ దిన్,1983 (హిందీ )
ఏది ధర్మం ఏది న్యాయం,1982 (తెలుగు)
కృష్ణావతారం,1982 (తెలుగు)
నీతిదేవన్ మయగుగిరన్,1982 (తమిళం )
పెళ్ళీడు పిల్లలు,1982 (తెలుగు)
బేజుబాన్,1981 (హిందీ )
రాధా కళ్యాణం,1981 (తెలుగు)
త్యాగయ్య,1981 (తెలుగు)
హమ్ పాంచ్,1980 (హిందీ )
వంశవృక్షం,1980 (తెలుగు)
కలియుగ రావణాసురుడు,1980 (తెలుగు)
పండంటి జీవితం,1980 (తెలుగు)
రాజాధిరాజు,1980 (తెలుగు)
తూర్పు వెళ్ళే రైలు,1979 (తెలుగు)
మనవూరి పాండవులు,1978 (తెలుగు)
అనోఖా శివభక్త్,1978,హిందీ
గోరంత దీపం,1978 (తెలుగు)
స్నేహం,1977 (తెలుగు)
భక్త కన్నప్ప,1976 (తెలుగు)
సీతాస్వయంవర్,1976 (హిందీ )
శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్,1976 (తెలుగు)
సీతాకల్యాణం,1976 (తెలుగు)
ముత్యాల ముగ్గు,1975 (తెలుగు)
శ్రీ రామాంజనేయ యుద్ధం,1974 (తెలుగు)
అందాల రాముడు,1973 (తెలుగు)
సంపూర్ణ రామాయణం,1971 (తెలుగు)
బాలరాజు కథ,1970 (తెలుగు)
ఇంటి గౌరవం,1970 (తెలుగు)
బుద్ధిమంతుడు,1969 (తెలుగు)
బంగారు పిచిక,1968, తెలుగు
*_సాక్షి,1967 (తెలుగు)_*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS