Saturday, June 30, 2018

SAITV SHATABDHI EVENT AT ELURU Part 1,2,3

ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేకం"..!!

ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేకం"..!!💐శ్రీ💐
ఉద్యోగం లేనివాళ్ళు..
ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్న వారు..
ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు..
ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు.. ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు..
తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు
శ్రీమద్రామాయణము నందలి బాలకాండము నందు మొదటి సర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి.
నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||
ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||
న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||
న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||
న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||
నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||
గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||
రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||
ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||
చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను.
శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో సుఖఃసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు, ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు.
రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద(మరణ)ములు గాని, వాయు భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో వర్థిల్లుచుందురు.
అనేకములైన అశ్వమేథాదిక్రతువులను, సువర్ణ్క యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి, వాసికెక్కును.
రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.
ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును, ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారిపుత్త్రపౌత్త్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.
జై శ్రీరామ్.. స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!💐

ఏదైన విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు..!


ఏదైన విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు..!!💐శ్రీ💐
" ఓం గం గణపతయే నమః' " వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం.
ఎంత ఆర్భాటాలు చేశామన్నది ముఖ్యం కాదు.మనం ఎంత సేపు స్వామి మీద ధ్యాస పెట్టి నిలకడగా కూర్చున్నామన్నదే ముఖ్యం.
కూర్చుని ఏమి చేయాలి?
స్వామికి సంబంధించిన ఒక శ్లోకం, మంత్రం(ఓం వినాయకాయ నమః లాంటి మంత్రాలు ఉంటాయి కదా)కాని లేదా అష్టొత్తరం కాని చదవండి.ఏది రానివారు"ఓం " అని జపించండి. కేవలం చదవడమే కాదు, చదువుతున్నప్పుడు మనస్సు మొత్తం స్వామి మీద లగ్నం చేయండి. వేరే ఏ పని చేయకండి. మీకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి నైవేధ్యం పెట్టి స్వీకరించండి. చిన్న బెల్లం ముక్క పెట్టినా ఫర్వాలేదు.
ఇలా మీరు చేసి చూడండి. ఒక సంవత్సరకాలంలో మీలో అద్భుతమైన మార్పు కనపడుతుంది.
మీరు కనుక రోజు క్రమం తప్పకుండా స్నానం చేసిన తరువాత పైన చెప్పిన విధంగా చేయగలిగితే చాలు మీరే గమనిస్తారు మీలో కలిగిన మార్పు.
మీరు నమ్మనంతగా మారతారు.
చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేయగలుగుతారు. విద్యార్థులు చదువు మీద ఎప్పుడు లేనంతగా శ్రద్ధ పెడతారు.
ఉద్యోగులకు పనిభారం తగ్గినట్టుగా అనిపిస్తుంది.
ఏదైన విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు.
వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి
"స్థిరొ భవ,వరదొ భవ, సుప్రసన్నొ భవ, స్థిరాసనం కురు" అని చదువుతారు.
అందుకే గజాననుని ముందు, రోజు కూర్చునే ప్రయత్నం చేయండి. అద్భుతమైన విద్యాబుద్ధులను, జ్ఞానాన్ని పొందండి.
మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టి పూజించమన్నది ముఖ్యం కాదు.స్వామి ముందు ఎంతసేపు కూర్చున్నామన్నది ముఖ్యం.
అందరూ రోజు కాసేపు గణపతికి కేటాయించండి. మీలో కలిగే మార్పులను గమనించండి. జీవితంలో అతి త్వరగా పైకి ఎదగండి.
దీని అర్దం విద్యార్ధులు చదవడం మానివేసి, మిగతావారు తమ రోజు వారి కార్యక్రమాలు మానివేసి గణపతి ముందు కూర్చొమని మాత్రం కాదు.
మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్దం అవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది
కనుక గణపతి ఆరాధనను మీ నిత్యజీవితంలో భాగం చేసుకొండి. ఆసనం(చాప వంటివి)వేసుకోవడం మరవకండి. న్యూస్ పేపర్లు, కాగితాలు లాంటివి ఆసనంగా వేసుకోకూడదు. పిలిస్తే పలికే దైవం గణనాధుడు.
ఓం గం గణపతయే నమః..స్వస్తి..!!💐
సర్వే జనా సుఖినోభవంతు..!!💐
💐శ్రీమాత్రే నమః💐

జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది

గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం..💐శ్రీ💐
జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.
భక్తి బావనలు..
ఉన్నత విద్య..
విదేశి విద్య..
కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.
గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు.
సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.
సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.
హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.
జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే
జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.
హయగ్రీవుని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి.
విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది.పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.
హయగ్రీవస్తోత్రం.💐
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||
ఫలశ్రుతి :💐
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||

మీ సొమ్ము అన్యాయముగా ఎవరైనా తీసుకొన్నచో.. లేక మీ సొమ్ము దొంగిలించబడిన ఈకార్తవీర్యార్జున స్తోత్రముః స్తోత్రమును పఠించవలెను


కార్తవీర్యార్జున స్తోత్రముః..💐
మీ సొమ్ము అన్యాయముగా ఎవరైనా తీసుకొన్నచో..
లేక మీ సొమ్ము దొంగిలించబడిన ఈకార్తవీర్యార్జున స్తోత్రముః స్తోత్రమును పఠించవలెను..💐
కార్తవీర్యార్జున స్తోత్రముః💐
కార్తవీర్య ఖలద్వేషి కృతవీర్య సుతోబలి
సహస్రబాహు శత్రుఘ్నో రక్త్రవాసా ధనుర్ధః
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తు అభీష్టదః
రాజసైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్
సంపదః తస్య జాయంతి జనాస్తస్య వషంఘదః
అనాయతాషు క్షేమలాభయుతం ప్రియమ్.
కార్తవీర్యార్జునోనామ రాజా బాహు సహస్రభృత్
తస్య స్మరణ మాత్రేన హృతం నష్టం చ లాభయతి
కార్తవీర్యః మహాబాహో సర్వ దుష్ట విభర్హణః
సహస్రబాహుం సాహస్రం స
రక్తాంబరం రక్తకిరీట కుణ్డలమ్,
చోరాని దుష్టభయ నాశనం ఇష్టదం తం
ధ్యాయేత్ మహాబల విజ్హృంభిత
కార్తవీర్యం యస్య సంస్మరణాదేవ
సర్వ దుఃఖ క్షయోభవేత్ తం నమామి
మహావీర్యార్జునమ్
కార్తవీర్యజం హైహయాధిపతేస్తోత్రం
సహస్ర వర్తనం క్రియం వాంచితార్థప్రదం నరాణామ్
శూద్ర దయైర్యాతి నామ శ్రుతమ్
ఇతి దమర తంత్రే ఉమామహేశ్వర సంవాదే
కార్తవీర్యస్తోత్రమ్ సంపూర్ణమ్..!!

వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి?

వెంకటేశ్వరస్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి?                                                               .  💐శ్రీ💐              తి రుమలకు వెళ్ళిన భక్తులు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి…? చాలామంది భక్తులకు అసలలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు.
తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి.
అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి.
ఈ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు.
ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది...స్వస్తి..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!💐
💐శ్రీ మాత్రే నమః💐

ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు పఠించవలసిన ప్రార్దనలు.


ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు పఠించవలసిన ప్రార్దనలు.
ఉదయం లేస్తూనే.. కరదర్శనం.💐
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి
కరమూలేతుదైి గౌరి ప్రభాతే కరదర్శనం.!
ఉదయం లేవగానే..భూప్రార్ధన.💐
సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే.!
మానసిక శుద్ది.💐
అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:
స్నాన సమయంలో.💐
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
భోజనానికి ముందు.💐
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి
అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే.!
భోజనము తరువాత.💐
అగస్త్యం కుంభ కర్ణం చ శమ్యం చ బడబానలం
ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం.!
ప్రయాణ సమయంలో 21 పర్యాయములు పఠించాలి.💐
గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ.!
అన్ని ఆరోగ్య సమస్యలకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి.💐
ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహీ కురుకురు స్వహా.!
( మరియు / లేక )
“క్రీం అచ్యుతానంత గోవింద”
విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి.💐
ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా
వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః
ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం
నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం
శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం
ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి”
విద్యార్జన లేక ఉద్యోగ నిమిత్తం నివాసానికి దూరంగ ఉన్నప్పుడు ... మానసిక / ఆరోగ్య సమస్యలు లేకుండ ఉండటానికి పఠించాల్సిన మంత్రం.💐
గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ
ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ.!
ప్రారంబించిన పనిని విజయవంతంగ పూర్తి చేయడానికి ఈ మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి.💐
ఓం నమో మహామాయే మహా భోగదాయిని హూం స్వాహా
చేపట్టిన కార్యంలొ, పోటి పరిక్షలొను విజయం సాదించడానికి ఈ మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి.💐
శ్రీ రామ జయరామ జయజయ రామరామ.!
అన్ని సమస్యలకు ప్రతి నిత్యం సూర్యోదయానికి సూర్య నమస్కారం ఉత్తమం.💐
ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ:
ఉద్యోగంలొ ఉన్నతి కొరకు, పై అదికారుల అబిమానం మరియు తన వద్ద పనిచేయువారి సహకారం లబించాలంటె క్రింది మంత్రాన్ని ప్రతి దినం గంట సమయం పఠించాలి.💐
ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ మమ గృహే పూరయ పూరయ దూరయ దూరయ స్వాహా.!
( మరియు / లేక )
“శ్రీ రాజ మాతంగ్యై నమ :”
ఉత్తమ భర్తను పొందుటకు ఈ మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.💐
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా
తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్.!
ఉత్తమ భార్యను పొందుటకు ఈ మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి.💐
పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్.!
వివాహాం తోందరగా జరగడానికి ఈ మంత్రాన్ని 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.💐
ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే.!
అమ్మాయిలకు వివాహాం తోందరగా జరగడానికి.ఈ
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.💐
కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరీ
నందగోపసుతం దేవిపతిం మేకురుతేనమ:
పతింమనోహరం దేహి మనోవృత్తానిసారిణం
తారక దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం
పత్నీమనోరమాం దేహి మనోవృత్తానిసారిణం
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం.!
అబ్బాయిలకు వివాహాం తోందరగా జరగడానికి ఈ
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.💐
విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః
స్త్రీలకు వైవాహీక జీవన సౌఖ్యం కొరకు ఈ మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.💐
“హరిస్త్వా మారాధ్య ప్రణిత జనసౌభాగ్య జననీం
పురానారి భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
స్మరోపిత్వాం వత్యా రతినయన లేహ్యేన వవుషా
మునీనాప్యంత: ప్రభవతి మోహాయ మహతామ్”
వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు ఈ
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి.💐
శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం.!
కుటుంభాన్ని నిర్లక్ష్యం చేయు భర్తను మార్చుకోవడానికి ఈ మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి.💐
ఓం క్లీం త్రయంబకం యజామాహే సుగంధీం పతిర్వర్దనమ్
పతిం ఉర్వారుకవ బంధతృతి మోక్ష మామృతాత్ క్లీం.!
కుటుంబంలొ వచ్ఛు సమస్యలు తొలగి సౌఖ్యంగ ఉండడానికి ఈ మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి.💐
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ
( మరియు / లేక )
“సదాశాంతా సదాశుద్దా గృహచ్ఛిద్ర నివారిణి
సత్సంతానప్రదారామా గ్రహోపద్రవనాశిని”
కుటుంబ సమస్యలతో దూరమైన భర్తను పొందడానికి ఈ మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి.💐
ఓం నమో మహాయక్షిణ్యై మమపతిం
మే వశ్యం కురు కురు స్వహా.!
ఆరోగ్య సమస్యలు లేని గర్భధారణ కొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం.💐
ఓం దేవకిసుత గోవింద జగత్పతె
దేహిమే తనయం కృష్ణ త్వామహాం శరణాగత:.!
సుఖ ప్రసవం కొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం.💐
ఆస్తి గోదావరీ జలతీరే జంభలానామ దేవతా
తస్యాః స్మరణ మత్రేణ విశల్యాగర్బిణీ భవేత్ జంభలాయై నమః.!
ఆపదలు తగ్గడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం.💐
గౌరి వల్లభకామారే కాలకూట విషాదన
మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక.!
ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం.!💐
అపదామపర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం.!
( మరియు / లేక )
దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ
అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని.!
సర్వకార్యసిద్దికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం.💐
నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ
మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల..!
స్వస్తి..!!
సర్వే జనా సుఖినోభవంతు..💐
💐💐

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS