Thursday, September 9, 2021

అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారో తెలియాలంటే అష్టమి రోజున రాత్రి చంద్రడ్ని చూసి తీరాలి

 అష్టమి తిథి🙏🌼 రాత్రి ఒక్కసారి చంద్రుడ్ని చూడండి🙏🌼🌿కోట్లజన్మల పుణ్యఫలం అష్టమి నాటి చంద్రుడ్ని చూసి, అందులో అమ్మవారిని దర్శించగలగడం🙏🌼🌿*


🌿🌼🙏అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారో తెలియాలంటే అష్టమి రోజున రాత్రి చంద్రడ్ని చూసి తీరాలి🙏🌼🌿ఆ అనుభూతిని ఆస్వాదించాలే గానీ మాటల్లో వర్ణించలేము🙏🌼🌿కోట్లజన్మల పుణ్యఫలం అష్టమి నాటి చంద్రుడ్ని చూసి, అందులో అమ్మవారిని దర్శించగలగడం🙏🌼🌿

🌿🌼🙏చంద్రుని యొక్క అష్టమికళ ఏ తిధిన ఉంటుందో అది అష్టమి తిధి అనబడుతుంది.🙏🌼🌿

🌿🌼🙏అష్టమిరోజున చంద్రుడు సమంగా ఉంటాడు. అంటే అర్ధచంద్రుడు. అగ్నిపురాణంలో
అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది🙏🌼🌿

🌿🌼🙏చంద్రుడికి పదహారు కళలున్నాయి🙏🌼🌿

🌿🌼🙏పాడ్యమి దగ్గరనుంచి పూర్ణిమ వరకు తిథులు పదిహేను పదహారవకళ సాక్షాత్తూ
సచ్చిదానందస్వరూపిణి అయి ఉన్నది🙏🌼🌿

🌿🌼🙏చంద్రుని యొక్క పదహారుకళలు సూర్యునిలో దాగి ఉంటాయి. శుద్ధపాడ్యమి అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి చంద్రునిలో ప్రవేశిస్తుంది. ఆరకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజును పూర్ణిమ అంటారు🙏🌼🌿

🌿🌼🙏ఆ తరువాత ప్రతిరోజూ ఒక్కొక్క కళ చంద్రుని నుంచి విడిపోయి సూర్యునిలో చేరిపోతుంది. ఈ రకంగా పదిహేను కళలు చంద్రుని వదలి వెళ్ళిపోయిన రోజును అమావాస్య అంటారు. ఆ రోజు చంద్రుడు కళావిహీనుడు. ఇవే శుక్ల కృష్ణ పక్షాలు. ఈ రెండింటిలోనూ కూడా అష్టమినాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు. అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు. ఇతడే అర్ధచంద్రుడు🙏🌼🌿

🌿🌼🙏తిథులు నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. నిత్యలు మొత్తం పదహారు.
వీటిని గురించి వసిష్టసంహితలో వివరించబడింది🙏🌼🌿

🌿🌼🙏ఈ నిత్యల గురించి వామకేశ్వరతంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది.🙏🌼🌿

🌿🌼🙏
కామేశ్వరి,
భగమాలినీ,
నిత్యక్తిన్న,
భేరుండ,
వహ్నివాసిని,
మహావజ్రేశ్వరి,
శివదూతి,
త్వరిత,
కులసుందరి,
నిత్య,
నీలపతాక,
విజయ,
సర్వమంగళ,
జ్వాలామాలినీ,
చిత్ర,
మహానిత్య
🙏🌼🌿

🌿🌼🙏ఇవి పదహారునిత్యలు. ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతుండటంచేతనే
చంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతున్నాయి. శుక్ల కృష్ణ పక్షాలయందున్న తిధులు నిత్యలు
ఈ దిగువ ఇవ్వబడ్డాయి.🙏🌼🌿

🌿🌼🙏శుక్లపక్షము తిథి, నిత్యాదేవత కృష్ణపక్షము తిథి🙏🌼🌿

1. పాడ్యమి ,కామేశ్వరి. 1. పాడ్యమి, చిత్ర

2. విదియ, భగమాలిని. 2.విదియ,జ్వాలామాలిని

3. తదియ ,నిత్యక్షిన్న 3. తదియ,సర్వమంగళ

4. చవితి , భేరుండా. 4. చవితి,విజయ

5. పంచమి, వహ్నివాసిని  5. పంచమి,నీలపతాక

6. షష్టి ,మహావజ్రే్ేశ్వరి 6.షష్ఠి,నిత్య

7. సప్తమి ,శివదూతి 7. సప్తమి,కులసుందరి

8. అష్టమి, త్వరిత 8 అష్టమి,త్వరిత

9. నవమి, కులసుందరి. 9నవమి,శివదూతి

10. దశమి ,నిత్య 10.దశమి మహావజ్రేేశ్వరి

11. ఏకాదశి ,నీలపతాక 11. ఏకాదశి వహ్నిివాసిని

12. ద్వాదశి ,విజయ 12. ద్వాదశి, భేరుండా

13. త్రయోదశి | సర్వమంగళ 13. త్రయోదశి | నిత్యకిన్న

14. చతుర్దశి, జ్వాలామాలిని 14. చతుర్దశి భగమాలిని

15. పూర్ణిమ ,చిత్ర 15. కామేశ్వరి

🌿🌼🙏చంద్రుని యొక్క కళలు ఈ రకంగా మారినప్పుడు తిథి ఒకటే అయినప్పటికీ శుక్ల,కృష్ణ పక్షాలలో నిత్యాదేవతలు వేరుగా ఉంటాయి. ఆ విషయం పైన పట్టిక చూస్తే తెలుస్తుంది. కాని రెండు పక్షాల యందు అష్టమినాడు మాత్రం “త్వరిత” అనబడే నిత్యాదేవతయే ఉంటుంది. దాన్నే *త్వరితాకళ* అని కూడా అంటారు. అనగా *ఎటువంటి మార్పులేనివాడు అష్టమినాటి చంద్రుడు* అందుచేతనే అష్టమినాటి చంద్రునితో దేవి
ముఖాన్ని పోల్చటం జరిగింది🙏🌼🌿

🌿🌼🙏గుండ్రని ముఖానికి పైన కిరీటము పెట్టటంచేత, దేవి యొక్క లలాటము అర్థచంద్రాకారంగా అష్టమినాటి చంద్రునిలాగా కనిపిస్తుంది
🙏🌼🌿

*శ్రీ మాత్రే నమః*

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS