Sunday, December 30, 2018

విజయనగరం సంస్ధానాధీశుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మ వారి ఆలయం

విజయనగరం

     విజయనగరం సంస్ధానాధీశుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మ వారి ఆలయం యం.జి.రోడ్, మూడు లాంతర్ల సెంటర్ కు సమీపంలో ఉంది.  గుడి నిత్యం భక్తులుతో సందడిగా ఉంటుంది.  మంగళవారం నాడు మరికొంత విశేషముగా ఉండును.  విజయదశమి వెళ్ళిన మొదటి మంగళవారం నాడు  " సిరిమాను " ఉత్సవం చాల ఘనంగా జరుగుతుంది.  సిరిమాను ఉత్సవాలు వీక్షించుటకు ఉత్తరాంధ్ర ప్రాంతము నుంచి సందర్శకులు తరలి వస్తారు.  అమ్మ  వారి ఆదేశం ప్రకారం ఒక వృక్షం ను సిరిమానుగా వడ్రంగి చేత తయారు చేయుంచుదురు.  ఆలయ పూజారి (అమ్మ వారు) సిరిమాను పై భాగంలో ఆశీనుడుగా ఊరేగుతాడు.  అమ్మ వారి గుడి నుంచి రాజకోట వరకు మూడు పర్యాయములు తిరుగుతుంది. 
     సిరిమాన ఉత్సవం ముగిసిన పిమ్మట (15 రోజులు తరువాత) ఊయల - కంభాల ఉత్సవాలు జరుగుతాయి.  అమ్మవారిని మేళతాళాలుతో ఊరేగిస్తు " వనం గుడి" తీసుకొని వెళ్ళి అనుపు ఉత్సవం జరుపుతారు.  అమ్మ వారి మూల విరాట్టు ను వనం గుడిలో దర్శించగలము.  రైల్వే స్టేషన్ ప్రాంతములో వనం గుడి ఉంటుంది. 
     హౌరా - చెన్నై రైలు మార్గంలో విజయనగరం జంక్షన్ కలదు.  జంక్షన్ నుంచి రాయపూర్ కు రైలు మార్గం ఉంది.  రాయపూర్ జాతీయ రహదారి (NH-26) కలదు. రైల్వే స్టేషన్ కు సమీపంలో RTC బస్ స్టాండ్ ఉంది.  జిల్లా కేంద్ర మైన విజయనగరం నందు యాత్రికులుకు మంచి వసతుల, రవాణా సౌకర్యములున్నాయి.
                                          కె. కె. మంగపతి
                                          Yatra - Telugu

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు భాగవతం, మహాభారతం

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు 
భాగవతం, మహాభారతం
1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.
2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.
3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.
13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.
14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.
17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.
18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.
20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.
21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.
23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.
24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.
25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.
30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.
34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.
35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.
36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.
39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.
40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.
41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.
43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.
44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.
ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు.
:::::::::::::::::::::::::::::::::::::
రామాయణం
:::::::::::::::::::::::::::::::::::::
1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
3. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.
10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.
11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16 దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.
19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.
21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక
23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.
26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.
29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.
31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.
సేకరణ  : -  మన వేదం

పంచలింగాలు

పంచలింగాలు

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు.
ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
అందులో కీలకమైన పంచలింగాలు.
పృథ్విలింగం,
ఆకాశలింగం,
జలలింగం,
తేజోలింగం,
వాయులింగములను
పంచభూతలింగాలు అంటారు.
1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం.
కంచిలోఉంది.
ఏకాంబరేశ్వర స్వామి అంటారు.
పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి.
అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది.
ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది.
లింగ దర్శనముండదు.
అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు.
ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది.
ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు.
అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి.
బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.
4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది.
అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు.
ఈయన పేరే అరుణాచలేశ్వరుడు.
అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని
శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం.
ఈయన పేరు కాళహస్తీశ్వరుడు.
అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ.
సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.
ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.
ఓం నమః శివాయ..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
    ఓం శ్రీ సాయి రామ్                   శ్రీ మాత్రే నమః

ఏ రోజు ఏ వ్రతం చేయాలి? వాటి శుభఫలాలు

ఏ రోజు ఏ వ్రతం చేయాలి? వాటి శుభఫలాలు
వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. దాని ప్రకారం ఒక్కో దేవతకూ ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, మన జనన మరణాలపై ప్రభావం చూపే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో, వ్రతం ఏదో ముందుతరాలవారు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం! రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు.
ఆదివారవ్రతం:

చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతానక్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారంనాడు ఉపవాసం ఉండి, సూర్యారాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగ ఆచరించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారంనాడు ఆరంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలూ ఆచరించాలి. అలా ఆచరించలేనివారు కనీసం 12 వారాలైనా చేయాలి.
వ్రతవిధానం:
ఆదివారంనాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆపైన గంగాజలాన్ని, లేదా శుద్ధోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం ఉంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.
సోమవార వ్రతం:
అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.
వ్రతవిధానం:
చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ‘ఓం నమశ్శివాయ’అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పూవులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండిఉంగరాన్ని ధరించాలి. పూజాసమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతోపాటు పాలు, పెరుగు, తెలుపురంగు వస్తువులను లేదా ఫలాలను దానం చేయాలి.
మంగళవారం:
ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవారవ్రతం ఆచరించాలి.
వ్రతవిధానం:
ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, రుణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపు రంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరం లేదా మూలమంత్రం పఠించాలి.
బుధవారవ్రతం:
 
స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి.
వ్రతవిధానం:
ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజచేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పండ్లు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడి పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.
గురువారవ్రతం:
మానసికప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివృద్ధిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రేయుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యాఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు గురువార వ్రతం చేయాలి.
వ్రతవిధానం:
ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్లపాటు చేయాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచులోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిపిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు, ఒక పూట తప్పనిసరిగా ఉపవాసం ఉండి, స్వామికి నివేదించిన పదార్థాలను స్వీకరించాలి.
శుక్రవార వ్రతం:
దుర్గ, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్ఠమైనది.
వ్రతవిధానం:
ఈ పూజను శ్రావణమాసం లేదా ఏమాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారంనాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లనితల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.
శనివారవ్రతం:

వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివార వ్రతం చేయాలి.
వ్రతవిధానం:
శ్రావణమాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారంనాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచరణ చేయాలి. వేంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వులనూనె, గేదెనెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి....మీ..చింతా గోపి శర్మ సిద్ధాంతి
..9866193557

ఏకాదశ రుద్రులు

ఏకాదశ రుద్రులు

శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును. ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకా య త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" అని రుద్రనమకంలో చెప్పబడినది. దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్రయంబకుడు , 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11.శ్రీమన్మహాదేవుడు. ఏకాదశ రుద్రులు మరియు వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు క్రింద ఈయబడినవి.
1.అజపాదుడు- ధీదేవి
2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి
3. త్రయంబకుడు- ఆశనదేవి
4.వృషాకపి- ఉమాదేవి
5.శంభుడు- నియుత్ దేవి
6.కపాలి- సర్పిదేవి
7.దైవతుడు- ఇల దేవి
8.హరుడు- అంబికాదేవి
9.బహురూపుడు- ఇలావతీదేవి
10.ఉగ్రుడు- సుధాదేవి
11.విశ్వరూపుడు- దీక్షాదేవి
అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థంలో ఏకాదశ రుద్రులతోకూడిన ప్రభలు సంక్రాంతి పండుగలలో కనుమరోజు భక్తజనులకు దర్శనమిచ్చి తరింపజేయుచు న్నారు. వాటి వివరణ
1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):
పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆపులి శివలింగరూపాన్ని పొందిందని కధనము కలదు. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.
2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):
పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగముకొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధనముకలదు. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను.
3. త్రయంబకేశ్వరుడు - ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):
రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధనము కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను.
4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):
తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధనము కలదు. అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను.
5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):
మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.
6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):
రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.
పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధనముకలదు.
7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ):
దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు.
ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.
8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను.
ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మిగ్రామ మునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను.
9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి):
దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారము నందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.
10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్ప వారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపు వ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితి నని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించివిష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్త ములచే ప్రతిష్ఠింపబడెను.
11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):
పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.
శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈకార్తీకమా స పుణ్యదినములలోఏకాదశ రుద్రులకు మాకుటుంబ సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు........ సర్వేజనాః సుఖినోభవంతు.......... సమస్త సన్మంగళాని సంతు........ స్వస్తి.

Monday, December 10, 2018

మీసాల గోపాలుడు! - తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో

ఆ మీసం ఆపద్ధర్మం!
 తెలంగాణలోని చెల్లాపూర్‌ గ్రామంలో మీస మాధవుడు కొలువు తీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. 200 ఏళ్ళ కిందటి మాట. దుబ్బాక సంస్థానాన్ని పాలించే దొరల వల్ల వేధింపులకు గురైన ఆ గ్రామస్తులు కప్పం కట్టకూడదని నిర్ణయించుకున్నారు. నిలువు నామాలు కలిగిన వేణుగోపాలస్వామి ఆలయాన్ని కట్టి, ఆ పేరు చెప్పి కప్పానికి ఎగనామం పెట్టాలనుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. కాశీ నుంచి విగ్రహం తెప్పిద్దామనుకున్నారు. అయితే ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో నిరాదరణకు గురైన ఆలయం నుంచి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠిద్దామన్న ఆలోచన చేశారు.
 
రాత్రి వేళల్లో ఎడ్ల బండ్ల మీద తిరుగుతూ విగ్రహాన్వేషణ చేశారు. రామ్‌గోపాల్‌పేట అనే గ్రామంలో అలాంటి విగ్రహం కనిపించింది. దాన్ని తెచ్చి, ప్రతిష్ఠించాలనుకుంటూండగా, రామ్‌గోపాల్‌పేట గ్రామస్తులు విగ్రహాన్ని వెతుకుతూ వస్తున్నారని తెలిసింది. దీంతో విగ్రహాన్ని చెరువులో దాచిపెట్టారు. తరువాత విగ్రహ ప్రతిష్ఠకు ఉపక్రమించారు. విగ్రహాన్ని రామ్‌గోపాల్‌పేట వారు గుర్తుపట్టకుండా... దాని తలపై ఉన్న కొప్పును తొలగించి కిరీటం పెట్టారు. విగ్రహానికి వెండి మీసాలను చేర్చారు. దీంతో మీసాల కృష్ణుడు ఆ ఆలయంలో కొలువుతీరి, అదే రూపంలో పూజలందుకుంటున్నాడు.
 
ఎక్కడుంది?: తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో
 
ఎలా వెళ్ళాలి?: హైదరాబాద్‌కు 128 కి.మీ., మెదక్‌కు 55 కి.మీ. దూరంలో చెల్లాపూర్‌ ఉంది. ఆ ప్రాంతాలనుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
 
ప్రత్యేకతలు: ఈ ఆలయంలో అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఇది సుమారు 200 ఏళ్ళ నుంచి నిరంతరాయంగా వెలుగుతూనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివల్ల గ్రామం పాడిపంటలు, సిరిసంపదలతో తులతూగుతుందని వారి నమ్మకం. వ్యవసాయ పనులు మొదలు పెట్టగానే స్వామికి ముడుపులు కడతారు. అలాగే, ఎలాంటి వివాదమైనా వేణుగోపాలుని ఆలయం మెట్లు ఎక్కితే ఇట్టే పరిష్కారం అవుతుందనీ, స్వామి సన్నిధిలో అబద్ధం ఆడినవారికి తప్పదని స్థానికులు విశ్వసిస్తారు.

మీసాల గోపాలుడు-ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండిలో


మీసాల గోపాలుడు
చేతవెన్న ముద్ద పట్టిన చిన్నారి కన్నయ్య... గోపికా మానసచోరుడు... కంస-చాణూర మర్దనుడు... గీతాచార్యుడు... ఇలా అనేక పాత్రల్లో శ్రీకృష్ణుని రూపం అందరికీ పరిచితమే... అయితే వీటిలో ఏ రూపంలోనూ మీసం మనకు కనిపించదు... నాసాగ్రాన మౌక్తికాన్ని తప్ప ముక్కుకింద మీసాన్ని ఊహించుకోలేం... కానీ నల్లనయ్య మీసంతో కనిపించే ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి.
 
*శంఖ చక్రపాణి!*
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పేరు వినగానే నోరూరించే పూతరేకులు గుర్తుకొస్తాయి. ఆ ప్రాంతం వారికి కృష్ణుడు అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేది మీసాల కృష్ణయ్య. అఖండ గోదావరి రెండు పాయలై... వశిష్ఠ, గౌతమి నదులయ్యాయి. ఆ నదులను ఆనుకున్న ప్రధాన కాలువలూ, కనుచూపు మేర పచ్చని పంట పొలాలతో ప్రకృతి సోయగాల మధ్య అలరారే పల్లెటూరు పులిదిండి. గౌతమీ గోదావరి నది చెంతనే ఉన్న ఆ గ్రామం మధ్యలో మీసాల వేణుగోపాల స్వామి స్వయంభువుగా వెలిసిన ఆలయం ఉంది.

*ఎక్కడుంది?:*
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండిలో

*ఎలా వెళ్ళాలి?:*
రాజమండ్రి నగరానికి సుమారు 27 కి.మీ. దూరంలో పులిదిండి ఉంది. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం రాజమండ్రిలో ఉంది.

*ప్రత్యేకతలు:*
సుమారు 300 ఏళ్ళ కిందట వెలసిన పులిదిండి వేణుగోపాల స్వామి నల్లరాతి విగ్రహం విలక్షణంగా ఉంటుంది. కుడిచేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ధరించి, మీసాలతో శోభాయమానంగా స్వామి దర్శనమిస్తారు. నిండు మనసుతో కొలిస్తే, కోరిన కోర్కెలను తీర్చే దైవంగా భక్తులు మీసాల వేణుగోపాలుణ్ణి ఆరాధిస్తారు. స్వామివారికి ఏటా కళ్యాణం, నిత్య ధూపదీప నైవేద్యాలూ జరుగుతున్నాయి. ఆయనకు మొక్కుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం కూడా ఉంది.  ఆయనకు మొక్కుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయన్న నమ్మకం కూడా ఉంది. 1967లో విడుదలైన ‘సాక్షి’ సినిమా చిత్రీకరణ ఈ ఆలయంలో జరిగింది.
 
ప్రముఖ నటులు కృష్ణ, విజయనిర్మల మీద వివాహ దృశ్యాన్ని తీశారు. ‘‘ఈ స్వామి దగ్గర పెళ్ళి సీన్‌ నటించారు కాబట్టి మీకు నిజంగా వివాహం జరుగుతుంది!’’ అని హాస్య నటుడు రాజబాబు వారితో అన్నారట. ఆ తరువాత కృష్ణ, విజయనిర్మల దంపతులయ్యారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో విజయనిర్మల స్వయంగా చెప్పారు. ‘సాక్షి’తో పాటు బాపు దర్శకత్వంలో రూపొందిన ‘బుద్ధిమంతుడు’, ‘ముత్యాలముగ్గు’, ‘తూర్పు వెళ్ళే రైలు’ తదితర చిత్రాల షూటింగ్‌ ఈ ఆలయంలో జరిగింది.
 జై శ్రీమన్నారాయణ 
⚛⚛⚛⚛⚛⚛

స్వర్ణ దేవాలయం

శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం”

శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి. ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని “గర్భ గుడి” సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి.
ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ “ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”. కాని “శ్రీ విద్య” అనే ప్రాచీనమైన, అరుదైన “శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే లభించాయని ఆయన తెలియజేశారు. ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశారు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను “జీర్ణోద్ధరణ” కూడా కావించారు.
ఇక్కడ విశేషమేమంటే, ఈ దేవాలయములో గర్భగుడికి “మూడు వైపులా” నీరు, ఒకవైపు ద్వారం వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు.
ఇవిగో..ఆ స్వర్ణ దేవాలయ అపురూప చిత్రాలు .. చూసి తరించండి..!! శుభం భూయాత్

Tuesday, November 20, 2018

రాత్రిపూట హనుమాన్ చాలీసా చదివితే.💐శ్రీ💐

హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది.
హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది.

హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం, పద్ధతి ఉన్నాయి.
అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు.

పొద్దున లేదా రాత్రి ఈ హనుమాన్ చాలీసా చదవటానికి మంచి సమయాలు.

శనిప్రభావం ఉన్నవారు ప్రతిరాత్రి హనుమాన్ చాలీసాను 8సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

హనుమాన్ చాలీసా ముందు పంక్తులు 8 సార్లు చదవటం వల్ల ఎవర్ని అయినా నిందించటం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి.

రాత్రి హనుమాన్ చాలీసా పఠనం వల్ల దుష్టశక్తుల నీడ మీ జీవితంపై నుంచి తొలగిపోతుంది.
పిల్లలకి దెయ్యాలంటే భయం ఉన్నప్పుడు భయం పోగొట్టుకోడానికి రాత్రిపూట వారు ఇది చదవడం మంచిది.

హనుమాన్ చాలీసా చదవటంవల్ల హనుమంతుడి కృపకి పాత్రులయి మీకష్టాలను తొలగించుకోగలుగుతారు.

ఏదైనా పెద్దపనిలో విజయం సాధించాలనుకుంటే, మంగళ, గురు, శని లేదా
మూలా నక్షత్రం ఉన్నరోజు
రాత్రులు 108 సార్లు ఇది చదివితే మంచిది.
సరియైన శ్రద్ధ, విశ్వాసంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు.

హనుమాన్ ..చాలీసా.💐

దోహా💐

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్

ధ్యానమ్💐

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||

చౌపాఈ💐

జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||

రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవూ సాజై || 5||

శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||

విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || 8||

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |
వికట రూపధరి లంక జరావా || 9 ||

భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 ||

లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 ||

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 ||

సహస వదన తుమ్హరో యశగావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||

సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||

యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 ||

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||

తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా || 17 ||

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||

రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే || 21 ||

సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||

ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనోఁ లోక హాంక తే కాంపై || 23 ||

భూత పిశాచ నికట నహి ఆవై |
మహావీర జబ నామ సునావై || 24 ||

నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||

సంకట సేఁ హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||

సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || 27 ||

ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై || 28 ||

చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||

సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||

అష్టసిద్ధి నవ నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || 31 ||

రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా || 32 ||

తుమ్హరే భజన రామకో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 ||

అంత కాల రఘువర పురజాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34 ||

ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ || 35 ||

సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || 36 ||

జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరో గురుదేవకీ నాయీ || 37 ||

జో శత వార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ || 38 ||

జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహా డేరా || 40 ||

దోహా💐

పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||

సియావర రామచంద్రకీ జయ |
పవనసుత హనుమానకీ జయ |
బోలో భాయీ సబ సంతనకీ జయ |
జై శ్రీరామ్..!!🙏

Sunday, September 30, 2018

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి



ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి

ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి....తిధి రోజున వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి..

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది.
అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు..
వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.

తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురించి..

పాడ్యమి..
అధిదేవత – అగ్ని.
వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.

విదియ :-
అధిదేవత – అశ్విని దేవతలు.
వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.

తదియ :-
అధిదేవత – గౌరీ దేవి.
వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.

చవితి:-
అధిదేవత – వినాయకుడు.
వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట.

పంచమి:-
అధిదేవత – నాగ దేవత.
వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.

షష్టి :-
అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి.
వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.

సప్తమి:-
అధిదేవత – సూర్య భగవానుడు.
వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.

అష్టమి:-
అధిదేవత – అష్టమాత్రుకలు.
వ్రత ఫలం – దుర్గతి నాశనము.

నవమి:-
అధిదేవత – దుర్గాదేవి.
వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.

దశమి:-
అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు.
వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.

ఏకాదశి:-
అధిదేవత – కుబేరుడు.
వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.

ద్వాదశి:-
అధిదేవత – విష్ణువు.
వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.

త్రయోదశి:-
అధిదేవత – ధర్ముడు.
వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.

చతుర్దశి:-
అధిదేవత – రుద్ర.
వ్రత ఫలం – మృత్యుంజయము, శుభప్రదం.

అమావాస్య:-
అధిదేవతలు – పితృదేవతలు.
వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.

పౌర్ణమి:-
అధిదేవత – చంద్రుడు.
వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.
స్వస్తి..!!

*లోకా సమస్తా సుఖినోభవంతు..!!*

శ్రీ మాత్రే నమః

30 రకాల శివలింగాలు - ఫలితాలు



30 రకాల శివలింగాలు - ఫలితాలు

సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...

01.  గంధలింగం: రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

02.  పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

03.  నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

04.  రజోమయలింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.

05.  ధాన్యలింగం: యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

06.  తిలిపిస్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

07.  లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

08.  కర్పూరాజ లింగం: ముక్తిప్రదమైనది.

09.  భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.

10.  శర్కరామయలింగం: సుఖప్రదం

11.  సద్భోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.

12.  పాలరాతి లింగం: ఆరోగ్యదాయకం

13.  వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

14.  కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.

15.  పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16.  దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది

17. ఫలోత్థలింగం: ఫలప్రదమైనది

18.  రాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.

19.  గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.

20. దూర్వాకాండజలింగం: గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

21. వైడూర్యలింగం: శత్రునాశనం, దృష్టిదోషహరం

22. ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.

23.  సువర్ణనిర్మితలింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.

24. రజతలింగం: సంపదలను కలిగిస్తుంది.

25. ఇత్తడి - కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.

26.  ఇనుము - సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.

27. అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.

28.  తుష్ణోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.

29.  స్పటిక లింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

30.  సీతాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.

జపముఎలాచేస్తేఎంతఫలితంవస్తుంది జపముఎక్కడచేస్తేఎంతఫలితం



జపముఎలాచేస్తేఎంతఫలితంవస్తుంది
జపముఎక్కడచేస్తేఎంతఫలితం

జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః |
జన్మపాప వినాశత్వాత్ జప ఇత్య భి ధీయతే ||

'జ'కారం జన్మ లేకుండా చేస్తుంది. 'ప'కారం పాపాలను నశింపచేస్తుంది. జన్మరాహిత్యాన్ని పాపపరిహారాన్ని చేహడంవల్ల 'జప'మనబడుతోది.

జపం మూడు విధాలు. వాచికం, ఉపాంశువు, మానసికం.
మంత్రం సమీపంలోని వారికి వనబడునట్లు ఉచ్చరిస్తే వాచిక జపం.పెదవుల కదిల్కద్వారా దగ్గరుండే వారికి మాత్రమే వినబడేటట్లుగా జపిస్తే ఉపాంశు జపం.
ధ్యానంలో పరవశిస్తూ జపించడం మానసిక జపం.

వాచిక జపం కంటే ఉపాంశు వెయ్యి రెట్లు అధికం, దీనికి వెయ్యి రెట్లు అధిక ఫలం మానసిక జపం వలన కలుగుతుంది. కాబట్టి మానసిక జపమే శ్రేష్టం.

"న దోషో మనసే జాపే సర్వ దేశే ఫై సర్వధా!" అంటే మానసిక జపానికి ఏ దోషం అంటదు అటువంటి వ్యక్తికీ ఎటువంటి హానీ కలుగదు అంటోది తత్వశాస్త్రం.

యక్షో రక్షః పిశాచాశ్చ గ్రహం సర్వేచ భీషణాః |
జాపినం నొప సర్వంతి భయ భీతా స్సమంతతః ||

జపేన పాపం శమయే దశేషం యత్తత్క్రుతం జన్మపరం పరాసు |
జపేన భోగానె జయతేచ మృత్యుం జపేన సిద్ధి లభతేచ ముక్తిం ||

యక్షరాక్షస పిశాచాది భయంకర గ్రహాలు జపం చేసేవారిని చూసినంత మాత్రానే భయపడి దూరంగా పరిగెత్తుతాయని, జన్మాంతర సంచిత పాపం నశిస్తుందని, సుఖ-శాంతులు మరియు ముక్తి లభిస్తాయని లింగపురాణం అంటోంది.

అంతటి మహత్యం కలది కాబట్టే శ్రీ కృష్ణభగవానుడు యజ్ఞానం జప యజ్ఞోస్మి అంటూ గీతలో జపాన్ని యజ్ఞంతో పోల్చి చెప్పాడు.

వివిధ స్థానాల్లో మంత్రజప ఫలం :

ఇంట్లో చేసే జపం జప సంఖ్యతో సమాన ఫలితాన్నిస్తుంది.
గోశాలలో అయితే జపసంఖ్య కన్నా నూరు రెట్లు ఎక్కువ.
నదీతీరంలో అయితే జపసంఖ్య కన్నా లక్షరెట్లు ఎక్కువ.

సాగర తీరాలు, దేవ జలాశయాలు, పర్వత శిఖరాలు, పవిత్ర ఆశ్రమాలు, శివ సాన్నిధ్యం, సూర్యబింబంలో నారాయణుని దర్శిస్తూ, అగ్నిసన్నిధిలో, దీపం వద్ద, గురుసన్నిధిలో జపం చేయడం వీశేష ఫలప్రదామని లింగ పురాణం చెబుతోంది. అలాగే తులసీవనం, అశ్వద్ధ వృక్షము, ఉసిరి, మారేడు వృక్షములలో చేసే జపం విశేష సిద్ధి ప్రదామని పురాణాలు చెబుతున్నాయి.

జపపూసలు మరియు సంఖ్య

జప సాధనకు జపమాల, దానిలో 108 పూసలుంటాయి. సూర్యులు ద్వాదశాదిత్యులని 12 విష్ణు స్వరూపులు. సూర్యునికి ద్వాదశ రాశులుంతాయి. ఆ సూర్యుడే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ సంఖ్య 9. 12 సంఖ్యలు గల సూర్యునితో బ్రహ్మను గుణిస్తే 108 సంఖ్య అవుతుంది. 108 యోగము 1+8=9 అవుతుంది. నవ సంఖ్య బ్రహ్మకు ప్రతీకము. అందువలననే బ్రహ్మవేత్తలైన సన్యాసులు నామములకు మునుపు బ్రహ్మకు ప్రతినిధిగా 108 అని వ్రాస్తున్నారు.

జపమాలను బొటన వ్రేలితో కలిపి ఎట్టి ప్రస్థితులలోనూ చిటికెన వేలుతో తిప్పరాదు. అది పూర్తిగా నిషిద్ధము. తర్జనివ్రేలు, శత్రువినాశకరమని, అంగుష్టము మోక్షదాయకమని, మధమాంగుఌ ధనదాయకమని, అనామిక శాంతిప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అతి తప్పనిసరిగా బొటనవ్రేలును ఉపయోగించాలి.

జపమాల జారటం, తెగటం అనేవి జరగకుండా తగు జాగ్రత్త వహించాలి.

తూర్పు ముఖ జపం వశీకరణ కారకం.
దక్షిణ ముఖ జపం అభిచారిక (గారడి) కారకం.
పడమర ముఖ జపం సంపద కారకం.
ఉత్తర ముఖ జపం పౌష్టిక కార్యాలు, శాంతి, మోక్ష కారకం.

మానసిక జపానికి ఎక్కువ నియమాలు లేవు. 'మానసిక జపో నియమోనాస్తి' అని శాస్త్రం చెబుతోంది.

అశుచిర్యా శుచిర్వాః గచ్ఛం స్తిష్ఠన్ స్వజన్నపి |
మంత్రైక శరణోవిద్వాన్ మన శైవం సదాభ్యసేత్ ||
నదోషో మనసే జాపే సర్వదేశేపి సర్వదా |
జపనిష్టో ద్విజశ్రేష్ఠో జప యజ్ఞఫలం లభ్యత్ ||

పవిత్రునిపై కాని అపవిత్రునిపై కాని, నడచుచూ కాని, నిలబడి కాని, పరుండి కాని మనసులో మంత్రాన్ని జపించవచ్చును. మానవ జపము సర్వకాల, సర్వదేశ, సర్వావస్థల్లో చేయవచ్చు. అట్టివారు సర్వ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు.

క్రుష్ణాజిన ఆసనం జ్ఞాన సాధకం.
చిత్రాసనం సర్వార్ధ సాధకం.
కుశాసనం మంత్రసిద్ధి.
వ్యాఘ్రాసనం పురుషార్ధ సాధకం.
జింక చర్మంపై జపం భగందర రోగం నయం.

ఒకరు ఉపయోగించిన ఆసనం వేరొకరు ఉపయోగించరాదు.

నేలపై కూర్చొని చేసే జపం దుఃఖ కారకం.
పీటపై దౌర్భాగ్యం.
వెదురుచాప దరిద్రం.
గడ్డిపై ధన, కీర్తి హాని
చిగురుటాకులు లేక పెద్ద ఆకులూ చిత్తాన్ని చలింపచేస్తాయి.

ఆసనం అంటే -- 'ఆ'సనం అంతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. ఆ'స'నం సర్వరోగాలను బాగుపరిచేది ఆస'న' నవ నిధులను ప్రసాదించేది అని అర్థం. జప, తపస్సు, దేవతారాధన మరియు సంధ్యావందనమునకు ఆసనం ప్రధానం.

Wednesday, August 29, 2018

ఏ జాతకాలూ తెలియకపోయినా సత్ప్రవర్తనను కలిగిఉండి దైవంపైన భారం వేసి జీవించే వ్యక్తికి దైవమే సరియైన దారిని చూపిస్తారు. అయితే , చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సుకతతో జాతకాలను చూపించుకుంటారు. జాతకం మంచిగా ఉంటే ఆనందాన్నీ, ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు. ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది.

ఏ జాతకాలూ తెలియకపోయినా సత్ప్రవర్తనను కలిగిఉండి దైవంపైన భారం వేసి జీవించే వ్యక్తికి దైవమే సరియైన దారిని చూపిస్తారు.
అయితే , చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సుకతతో జాతకాలను చూపించుకుంటారు. జాతకం మంచిగా ఉంటే ఆనందాన్నీ, ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు.
ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది.
రాసిపెట్టిఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం మనకు ? అని చాలామంది నిరాశగా అనుకుంటారు.... అలా భావించటం పొరపాటు.
మన సత్ప్రవర్తన ద్వారా ......... మన తలరాతను మార్చుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు.
జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా ముందే జాగ్రత్తపడి..... తమ చెడు ప్రవర్తనను మార్చుకుని, ..... దైవప్రార్ధన, పుణ్యకార్యాలు చేయటం, సత్ప్రవర్తనతో మెలగటం, ఇలాంటివి చేయటం ద్వారా రాబోయే కష్టం చాలావరకూ తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు. పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంధాలలో కనిపిస్తాయి.
మరి మీరు కూడా మీ జాతకం మీకు కలసి రాలేదని భావించకుండా జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే కలసిరాని జాతకం కూడా మంచిగా మారుతుంది..
మీ ఇంటి ముఖ ద్వారానికి, ఒక మంచి రోజు బయట లోపల లక్ష్మీదేవి ఫోటో ఉంచడం, ఆ లక్ష్మీదేవి వెనుక రెండు ఏనుగులు బంగారపు కలశాలతో లక్ష్మీ దేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. అలా ఉంచినట్లైతే మీ ఆర్థికపరమైన పనులలో ఆటంకాలు ఉండవు.
పిలక ఉన్న కొబ్బరి కాయపై
పిలక ఉన్న కొబ్బరి కాయపై చుట్టూ 7 సార్లు , 7 దారాలు చుట్టి, మీ చుట్టూ 7 సార్లు తిప్పుకోవాలి. పై నుంచి క్రిందికి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుకోవాలి. ఒక మంచి రోజు, అలాచేస్తే మీ అద్రుష్ట సమయాలలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి.
లక్ష్మీ దేవికి 7 శుక్రవారాలు,
లక్ష్మీ దేవికి 7 శుక్రవారాలు, 7 గురు ముత్తైదువులకు, ఇంటి గ్రుహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి (కుంకుమ, పసుపు, చందనం, తాంబూలం, వీలు అయితే ఎరుపు రంగు జాకెట్ )దక్షణగా ఇప్పించాలి. అలా చేస్తే మీ ఇంటి గ్రుహినికి మంచిని తప్పక లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.
ప్రతి నెలా వచ్చే అమావాస్య నాడు
ప్రతి నెలా వచ్చే అమావాస్య నాడు ఇల్లంతా శుభ్రపరచడం వల్ల మంచి జరగుతుంది.
గోమతి చక్రం
ఇంట్లో ఉండే దేవుని మందిరంలో ఒక మంచి రోజు, ఒక కుంకుమ భరిణలో గోమతి చక్రం అనేది కుంకుమ భరిణలో ఉంచి మూత పెట్టి, కదలించకుండా, దేవుని మందిరంలో ఉంచాలి. దానికి పూజాది కార్యక్రమాలు, ఏమి చేయనవసరం లేదు. అలా చేస్తే మీ ఇంట్లో పరిష్కారం కానీ, సమస్యలు ఏమైనా ఉంటె పరిష్కారం అవటానికి అవకాశం ఉన్నది. (గోమతి చక్రం , పూజా సామాగ్రి దొరికే దుకాణంలో దొరుకును)
గోమతి చక్రాలు 3 తీసుకుని
గోమతి చక్రాలు 3 తీసుకుని, వాటిని పొడి చేసి, ఒక మంచి రోజు , ఇంటి ముందుర చల్లాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక బాధలు తొలగిపోవును.
లైట్ వేసిన తర్వాత ఇల్లు చిమ్మరాదు.
సాయంత్రం, ఉదయం లైట్ వేసిన తర్వాత ఇల్లు చిమ్మరాదు.
పగిలిన అద్దం ఉండకూడదు.
ఇంట్లో మూత లేకుండా డస్ట్ బిన్ ఉండకూడదు, పగిలిన అద్దం ఉండకూడదు.

శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం .


శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం .
తిరుమలలో ప్రధానాలయంలో శ్రీనివాసుడు ఉండే గర్భగుడి పైనున్న గోపురాన్ని ఆనంద నిలయంఅంటారు.
ఇది బంగారపు పూతతో కనుల పండువుగా దర్శనమిస్తుంది. శ్రీవైష్ణవ సంప్రదాయంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ గోపుర విమానాన్ని "ఆనంద నిలయం" అని, శ్రీరంగంలోని శ్రీరంగనాధ స్వామి ఆలయ గోపుర విమానానన్ని "ప్రణవ విమానం" అని, కంచిలోనివరదరాజస్వామి ఆలయ గోపుర విమానాన్ని "పుణ్యకోటి విమానం" అని అంటారు.
ఆనంద నిలయం లో కొలువున్న వెంకటేశ్వర స్వామి వారిని విమాన వెంకటేశ్వర స్వామి వారు అని అంటారు.
విమాన వేంకటేశ్వరస్వామి సంక్షిప్త చరిత్ర
           విజయనగర పాలకుల కాలంలో తిరుమల శ్రీవారికి లెక్కకు మించిన ధన కనక వస్తు వాహనాలను విజయనగర ప్రభువులు అందించారు. అలాంటి సమయంలో కొంత మంది అర్చకులు స్వామి వారి నగలను ధరించి తిరుగాడటం మహారాజు దృష్టిలో పడింది. ఆగ్రహంతో ఆ మహారాజు తొమ్మండుగురు వైష్ణవ అర్చకులను తన కరవాలంతో కడతేర్చాడు.  నరహత్య మహాపాప మనుకుంటే ఏకంగా  తొమ్మండుగురిని ఆలయంలోనే మట్టుపెట్టాడు మహారాజు.
            అత్యంత పవిత్రమైన దేవాలయంలో జరిగిన యీ ఘోరమైన పాప పరిహారానికి నడుము బిగించారు విజయనగర సామ్రాజ్య రాజ గురువులైన శ్రీ వ్యాసరాయలవారు.  12 సంవత్సరములపాటు రాజగురువులు శ్రీవారి గర్భాలయంలో అత్యంత కఠోర దీక్షతో పాప పరిహార పూజాదికములను నిర్వహించారు. ఆ 12 సంవత్సరముల కాలంలో భక్తులకు గర్భగుడి లోని మూలవిరాట్ దర్శనభాగ్యాన్ని నిషేధించారు.
           అందుకు ప్రతిగా ఆనందనిలయ విమానం మొదటి అంతస్తులో శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యార్చన దర్శనాదులకు ఆటంకం లేకుండా చేయబడింది. ఈ విగ్రహం ఆనందనిలయానికి ఉత్తర వాయువ్యం మూలకు వుంటుంది. శ్రీవారి మూలమూర్తి రూపానికి యిదొక్కటే ప్రతిరూపంగా సంభావింపబడుతూ ఆనందనిలయ విమాన వేంకటేశ్వరునిగా ప్రసిధ్ధిగాంచారు.
          గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చే వాడైతే ఈ విమాన వేంకటేశ్వరుడు కేవలం మోక్ష ప్రదాత. అందుకనే ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి.
          గర్భాలయం లో స్వామిని దర్శించుకోవడానికే సమయం సరిపోదు.  కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంత సేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు.          శుభమ్ భూయాత్.

ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి గురించి ఇచ్చిన సంపూర్ణ వివరణ -

ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి గురించి ఇచ్చిన సంపూర్ణ వివరణ  -
  సకల చరాచర సృష్టిలో సర్పాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకు వాటిలోని రకాలు గురించి పూర్తిగా వివరిస్తాను.
               సర్పజాతులు ఈ ప్రపంచంలో రెండు  రకాలుగా ఉన్నాయి.       అవి
1 .  దివ్యములు ఇవి  .
2 .  భౌమములు  ఇవి భూమి నందు ఉండునవి .
   దివ్యసర్పములు లలో భూమి యందు తిరిగే
సర్పాలు , మండలీ సర్పములు , ఉపజాతి సర్పములు కూడా ఉండును.
  దివ్య సర్పములలో రకాలు  -
   1 .  అనంతుడు.
    2 .  వాసుకి.
    3 .  తక్షకుడు.
    4 .  కర్కోటకుడు .
    5 .  పద్ముడు .
    6 .  మహాపద్ముడు .
    7 .   శంఖపాలుడు .
    8 .   కులికుడు .
  దేవతాసర్పములకు ఉండు గుర్తులు  -
      అనంతుడుకి ఫణాగ్రము నందు తెల్లటి పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును.  కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నము ఉండును. వాసుకి వీపు భాగంలో నల్ల కలువ వంటి గుర్తు ఉండును. కర్కోటకునికి మూడు నేత్రములు పోలిన చిహ్నం ఉండును. తక్షకుని కి పడగ యందు స్వస్తిక్ వంటి గుర్తు ఉండును. శంఖుపాలునికి వీపు నందు అర్ధచంద్ర త్రిశూలాకారం గల గుర్తు ఉండును. మహాపద్మునికి చిన్నచిన్న మణుల
వంటి చుక్కలు ఉండును.పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును.
             పైన చెప్పిన గుర్తులను బట్టి అవి దేవతా సర్పములుగా గ్రహించవలెను.
  దేవసర్పములకు విషము ఎక్కువ ఉండు సమయములు  -
      ఆది, సోమ , మంగళ, బుధ , గురు, శుక్ర , శని వారాల్లో పగలు సమయంలో దేవతా సర్పములకు విషం ఎక్కువ ఉండును. రాత్రి సమయంలో విషప్రభావం చాలా తక్కువ ఉండును. ఒక్క శనివారం రాత్రి సమయంలో మాత్రం విషప్రభావం ఎక్కువ ఉండును. ఈ సమయంలో మాత్రమే అనంతుడు వంటి దేవతా సర్పాలు కరుచును .
  దేవతాసర్పముల యొక్క మహిమ  -
      అనంత, వాసుకి , తక్షక జాతికి సంబంధించిన దేవతా సర్పాలు ఎనిమిది రకాల సర్పాలు కు జరామరణాదులు లేవు . వీటి విషం అత్యంత తీవ్రం అయినది. వీటి విషం నుంచి కాపాడే ఔషదం ఏమి లేదు .
  భూమి యందు ఉండు సర్పముల భేదములు
   1 - ఉపజాతి సర్పములు .
   2 -  దర్వీకరములు .
   3 -  మండలీ సర్పములు .
   4 -  రాజీమంతములు .
           అను నాలుగు రకముల సర్పములు కలవు.
  భౌమ సర్పముల యొక్క లక్షణములు -
   
       పడగలు గరిట వలే ఉండునవి దర్వీకరములు అనియు , శరీరం అంతయు రత్నాలతో కూడిన కంబళి వలే గాని చిత్రవిచిత్రమైన పొడలు కలిగి ఉండునవి మండలీ సర్పములు అని , శరీరం నందు సన్న చుక్కలు , రేఖలు ఊర్ధ్వంగా ఉండి తిర్యక్ అగ్రరేఖలు కలిగి చిత్రాకారంగా ఉండునవి రాజీమంతములు అని చెప్పబడును
     ఉపజాతి సర్ప లక్షణములను విష లక్షణములను తరువాత వివరిస్తాను.
  మూడు రకాల సర్పాల విష గుణము  -
      దర్వీకముల యొక్క విషము కొంచం వేడి కలిగి ఉండి కారముగా ఉండును. మండలీ విషము వేడిగా ఉండి పులుపు రుచి కలిగి ఉండును. రాజీమంత విషము చల్లగా ఉండి మధురముగా ఉండును.
          పైన చెప్పిన రుచులను బట్టి ఆయా సర్పాలు కరిచినప్పుడు వాటి విషం శరీరం లో ప్రవేశించి వాతాదిదోషములను కలుగచేయును  .
  మూడు రకాల సర్పములు యొక్క వాతదోషముల వివరములు  -

      దర్వీకర జాతి సర్పములు  వాతోద్రేకం , మండలీ సర్పములు పిత్తోద్రేకం , రాజీమంత సర్పములు శ్లేష్మోద్రేకం కలిగి ఉంటాయి.
  భూమి యందు ఉండు మూడు రకాల సర్పాల సంఖ్య  -
1 -  దర్వీకములు అనగా త్రాచుపాములు వీటిలో మొత్తం 14 రకాలు కలవు.
2 -  మండలీ సర్పములు అనగా పింజరలు వీటిలో మొత్తం 21 రకాలు కలవు.
3  - రాజీమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు వీటిలో 36 రకాలు కలవు.
భూమి ముందు ఉండు సర్పాలలో ప్రముఖమైనవి , ప్రమాదకరమైనవి త్రాచుపాములు ఇవి మొత్తం 14 రకాలు .  అవి
   *  చింతపువ్వు వన్నె త్రాచు.
   *  నాగజెర్రి .
   *  రేలత్రాచు .
   *  నాగజెర్రి.
   *  సెనగపువ్వు త్రాచు.
   *  నల్లత్రాచు.
   *  అరికెవన్నె త్రాచు.
   *  కందిపొడల త్రాచు.
   *  మొగలిపువ్వు త్రాచు.
   *  తెల్ల త్రాచు.
   *  కోడె త్రాచు.
   *  గిరినాగు .
   *  నీరు త్రాచు .
   *  గోధుమ త్రాచు.
   *  రాచపాము
          ఈ విధంగా 14 రకాలుగా త్రాచుపాములు ఈ భూమి యందు నివసించుచున్నాయి.
   ఇప్పుడు వీటి లక్షణాలు తెలియచేస్తాను .
*  చింతపువ్వు వన్నె త్రాచు  -
          దీని యొక్క శరీరం మంచి ఛాయతో ఉండి దీని యొక్క కోపం సాధారణంగా ఉండును. ఆదివారం నాడు దీని యొక్క విషతీవ్రత తీవ్రంగా ఉంటుంది.
*  నాగజెర్రి  -
           ఇది సగం త్రాచు వలే , సగం జెర్రిపోతు వలే ఉండును. చెట్లు , తోటల యందు , చెట్ల పై భాగంలో నివసించుతూ గోధుమవన్నే తెలుపురంగు కలిగి అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అత్యంత కోపం . సోమవారం నాడు విషాదిక్యత కలిగి ఉండును. నాగజెర్రిని త్రాచుపాముల జాబితాలోనే మన పూర్వికులు చేర్చారు .
*  రేలత్రాచు  -
            అడవుల యందు నివసించుట, సన్నంగా, పొడవుగా శరీరం కలిగి ఉంటుంది. సామాన్యమైన కోపం కలిగి ఉంటుంది.సోమవారం నందు దీనియొక్క విష తీవ్రత అధికంగా ఉంటుంది.
*  శెనగపువ్వు త్రాచు  -
             ఇది శెనగ పువ్వు వర్ణం కలిగి ఉంటుంది. సువాసన గల ప్రదేశాలలో ఉంటుంది. సోమవారం నందు దీని యొక్క విషప్రభావం అధికంగా కలిగి ఉంటుంది.
*  నల్లత్రాచు  -
             నేరేడు పండు వర్ణం కలిగి ఉండి కొంచం తక్కువ పొడవు కలిగి ఉంటుంది. అత్యంత దుష్టత్వం , అత్యంత కోపం కలిగి ఉంటుంది. దీని విషం స్వచ్చంగా ఉంటుంది. పర్వతాలు, అడవుల యందు నివసిస్తుంది. మంగళవారం తీవ్ర విషాదిక్యత కలిగి ఉంటుంది.
*  అరికెవన్నె త్రాచు  -
             ఈ త్రాచు ఎక్కువుగా మనుష్యుల మల విసర్జణ చేసే ప్రదేశాలలో సంచారం చేయును . మలభక్షణం చేయును . అత్యధిక కోపం , స్వచ్చమైన గరళం కలిగి ఉండును. బుధవారం నందు తీవ్ర విషాదిక్యత కలిగి ఉండును. అరిక ధాన్యం వంటి వర్ణం కలిగి ఉంటుంది.
*  కందిపొడల త్రాచు  -
            కందికాయ మీద ఉండునట్టి పొడలు వలే దీని శరీరం పైన ఉంటాయి. సామాన్యం అగు కోపం కలిగి ఉంటుంది.బుధవారం నందు దీని విషతీవ్రత అధికంగా ఉండును.
*  మొగలిపూత్రాచు -
             దీనియొక్క శరీరం వెండితో సమానం అయిన ఛాయ ఉంటుంది.పరిమళములు గుభాళించు ప్రదేశాలలో ఉంటుంది. మొగలి పొదలు , పరిమళ ఔషదాలు గల అరణ్యముల
యందు సంచరిస్తుంది. కోపం తక్కువ, అతిశాంతం , సూక్ష్మమైన మొగలి రేకు ప్రమాణం ,  గురవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును.
*  తెల్లత్రాచు  -
              కోపం తక్కువ , సాత్విక గుణం , శాంతస్వభావం , వెన్నెలవంటి శరీర రంగు కలిగి ఉండి తెల్లత్రాచు అని చెప్పబడును .
*  కోడెత్రాచు  -
              18 అంగుళముల పొడువు ఉండును. కోళ్ళని భ్రమ చెందించి ఆకర్షించుట కొరకు కోళ్ళవలె అరుచును. ఇండ్ల యందు , కోళ్ల గూళ్ళ యందు నివాసం ఉండును. అత్యధిక కోపం కలిగి ఉండును. రాత్రుల యందు కోళ్ళని భక్షించును. రూపం భయంకరంగా ఉండును. అత్యంత చురుకుగా ఉండును. శుక్రవారం నందు అత్యథిక విషతీవ్రత కలిగి ఉండును.
*  గిరినాగు  -
           చంద్రబింబం వంటి వంక కలిగి , మెరుస్తున్న పడగ కలిగి ఉండి పర్వతముల యందు సంచారం చేస్తూ చెట్ల కొమ్మల యందు నివాసం ఉండును. ఇది పక్షులను భక్షించును . పడగ యందు వర్తులాకారం గా కృష్ణపాదములు కలిగి ఉండును. శుక్రవారం నందు విషోద్రేకం కలిగి ఉండును.
*  నీరుత్రాచు  -
          అధికం అగు విషం , అతికోపం కలిగి ఉండి జలం నందు సంచారం , జలజంతు భక్షణ చేయుచూ శుక్రవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును.
*  గోధుమత్రాచు  -
         సాత్విక స్వభావం కలిగి ఉండి గజము పొడవు ఉంటుంది. శనివారం నందు విషోద్రేకం కలిగి ఉండును.
*  రాచనాగు అను త్రాచు  -
          పడగ గుండ్రంగా ఉండి , కృష్ణపాదములు లేని పడగ ఉండి మూడు అడుగుల పొడవు కలిగి ఉండి అధికకోపం కలిగి ఉంటుంది. చాలా భయంకర స్వభావం కలిగి ఉంటుంది. పగదీర్చుకొను పట్టుదల ఉండును. పర్వతాలు అరణ్యముల యందు నివాసము ఉండును.
          ఇప్పుడు మీకు పెంజర పాముల గురించి వివరిస్తాను.
ఇవి మొత్తం 21 రకాలు  అవి .
*  కాటుకపోడ పెంజర .
*  రక్త పెంజర .
*  ఉడుముపొడ పెంజర.
*  కలంకారీ పెంజర.
*  పొట్ల పెంజర.
*  తివాసిపోడ పెంజర.
*  ఊదుపొడ పెంజర .
*  పిచ్చుకపోడ  పెంజర.
*  అగ్నిపోడ  పెంజర.
*  పొడ పెంజర.
*  సున్నపుపొడ పెంజర.
*  తేనెపొడ పెంజర.
*  కుళ్ళుపొడ పెంజర.
*  పాదిరీపొడ పెంజర.
*  గువ్వపొడ పెంజర.
*  గరికపోడ పెంజర.
*  మోదుగపూపొడ పెంజర.
*  పసుపుపొడ పెంజర.
*  దొండపండు పొడ పెంజర.
*  గవ్వపోడ  పెంజర.
*  రెండు తలల శిఖండి.
           పైన చెప్పిన విధంగా 21 రకాలుగా ఉన్నాయి .
  మండలీ సర్పముల లక్షణములు  -
*  కాటుకపోడ పెంజర లక్షణము  -
       ఈ పెంజర మిక్కిలి లావుగా , అమితమైన పొడవు , శరీరం అందు పంగనామాలు  కలిగి ఉండును. ఇది జీవజంతువులను కరుచును. దీని కాటు వలన దేహమంతయు వాపు , తెల్లగా పాలిపోవడం , దురద, నిస్సత్తువ కలుగును. మరణం మాత్రం కలుగదు . దీనిని దాసరిపాము అని కూడా పిలుస్తారు .
*  రక్త పెంజర  -
       రక్త పెంజర అనునది చెయ్యి పొడవు కలిగి ఉండి ఎర్రని మచ్చలు , భయంకరమైన విషం కలిగి ఉండును. దీని కాటు వలన మైకం , భ్రాంతి, మూర్చ, నోటివెంట నురుగు పడును. నేత్రములు , పండ్ల చిగుళ్లు , రోమకూపములు , ముక్కు , కంఠం వీటి నుండి విపరీతంగా రక్తస్రావం కలుగును.ఎనిమిది జాములలో మనిషి మరణించుట జరుగును. ఆ సమయం దాటిందో చిత్రంగా బతుకగలడు.
*  ఉడుముపొడ పెంజర -
        ఈ పెంజర పెద్ద శిరస్సు కలిగి ఉండి గరుకు శరీరం , ఉడుము వంటి ఆకారం కలిగి భయంకరంగా ఉండును. దీని కాటు వలన కలిగిన గాయము నుండి అధికంగా రక్తం స్రవించును . మైకంలో  ఉండి మంత్ర మరియు ఔషధ చికిత్సలకు లొంగక 3 దినములలో తప్పక మనిషికి మరణము కలుగును.
*  కలంకారీ పెంజర  -
        కలంకారీ పెంజర అనునది మూరెడు పొడవు కలిగి ఉండి కలంకారీ రంగుల వంటి పొడలు కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం మంటలు పుట్టును . శోఫ , కలంకారి పని చేయబడిన చాందిని వంటి మచ్చలు , కంఠం యందు శోఫ , దాహము కలుగును. కాటుపడిన చోట ఆముదం , నూనె మొదలయిన చమురు పదార్థాలను ఉంచిన అవి ఇనికిపోవును . ఇట్టి లక్షణాలు కలిగిన మనిషి ఒక్క రోజులో మరణించును.
*  పొట్ల పెంజర  -
        పొట్ల పెంజర అనునది తలయును , తోకయును సన్నంగాను , శరీరం లావుగాను , పొట్లకాయ రంగు కలిగి మూరెడు పొడవు కలదై పొట్లకాయ వలే ఉండును. దీని కాటు తిన్నవారికి గొంతుక యందు గురక కలుగుట , శరీరం వాచుట మొదలగు లక్షణాలు కలుగును. దీని కాటు తినినవాడు 4 వ దినం నందు తప్పక మరణించును.
*  తివాసిపోడ పెంజర  -
        ఈ పెంజర అనునది 20 అంగుళాల పొడవు ఉండి తివాసి రంగుల వంటి మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడిన వారి శరీరం అంతా మంటలు , వాపు , మైకం , కనులకు చీకటి కమ్మడం వంటి లక్షణాలు కలిగి నాలుగు జాములలో మరణం సంభంవించును.
*  ఊదు పొడ పెంజర -
         ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు . నరులు మొదలయిన వాని శరీరం నందు బుస్సుమని వూదును. అందువలన దేహమందు వాపు , రక్తక్షీణత , పాండు రోగం , నిస్సత్తువ , కీళ్ల యందు చచ్చుదనం వంటి దుర్గుణములు ఏర్పడి చాలా కాలం తరువాత మరణం కలుగును.
*  పిచ్చుకపోడ పెంజర  -
          ఈ పెంజర అనునది అడుగు పొడవు ఉండి ముఖం నందు మూడు మచ్చలు ను కలిగి ఉండును. ఇది ఇండ్ల చూరుల యందు ఉండును. ఇది ప్రాకును. మరియు దుముకుతూ వేగంగా పోవును . దీనికాటు పడిన వారికి దేహం నందు పిచ్చుక మచ్చలు వంటివి మచ్చలు కలుగును. కడుపులో తిప్పును. రొమ్మునందు పసరు చేరినట్టు ఉండును. దీనివలన మరణం కలగదు .
*  అగ్నిపోడ పెంజర  -
          అగ్నిపోడ పెంజర  అనునది  18 అంగుళాల పొడవు కలిగి ఉండును. ఇది మనుషుల శరీరం నందు కాటువేయుట , ఊదుట , చొల్లు కార్చుట చేయును . ఈ మూడింటిలో ఏ విధంగానైనా అగ్నిపోడ పెంజర విషాన్ని మనుష్యుని  మీదకు విషాన్ని ప్రయోగించిన శరీరం నందు మిక్కిలి మంటలు కలుగును. కొంతకాలం తరువాత చిన్నగా అనారోగ్యం కలుగును. మరణం లేదు .
*  పొడపెంజర  -
          ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు. ఊదును. దీని నోటి విషపు గాలి తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా భగ్గున మంట మొదలగును. గాలిసోకిన స్థలం నందు రెండు మూడు దినముల పిమ్మట నిప్పుతో కాల్చబడినట్టు బొబ్బలు జనించును. నూనె మొదలగు సేవించినట్టైన  శరీరం నందు నల్లని మచ్చలు పుట్టును . కొంతకాలం ఇలా బాధపడిన తరువాత మృత్యువు సంభంవించును.
*  సున్నపు పొడ పెంజర  -
           ఇది అడుగు పొడవు మాత్రమే ఉండును. ఇది వరిమళ్ళ లోని ఎండ్రకాయ బొక్కలలో నివసిస్తూ ఎండ్రకాయలను భక్షించును . ఇది కరవదు. ఇది మనుజుల శరీరం నందు ఊదును. దీని విషపు గాలి తగిలిన వెంటనే మంట పుట్టును . శరీరం నందు మచ్చలు , దద్దుర్లు , గ్రంథులు ఏర్పడి , దురద మొదలయి కుష్టురోగి వలే ఉండును.  దీనివల్ల మృతి కలగదు .
*  తేనె పొడ పెంజర  -
          ఇది రెండు మూరల పొడవు కలిగి ఉండి గుర్రపు వన్నె గల మచ్చలు కలిగి ఉండును. ఇది కరిచిన శరీరం నందు వాపు , మచ్చలు జనియించి కొన్నిదినములకు మృతి చెందును
*  కుళ్లు పొడ పెంజర  -
           ఇది ఒక గజం పొడవు ఉండును. దీని శరీరం పైన అనేక వర్ణములు గల పొడలును కలిగి ఉండి చూచుటకు అసహ్యం కలిగి ఉండును. దీని కాటు పడిన వారికి శరీరం బరువు ఎక్కును. ముక్కులు ఎగురుచుండును. శ్వాస బంధించును. కాళ్లు , చేతుల యెక్క గోళ్లు పుచ్చిపోవును . కుష్టువ్యాధి సంభవించినట్టు శరీరం కుళ్ళి దుర్గందం ఏర్పడును . ఇది కరిచిన సంవత్సరం తరువాత మరణించును.
*  పాదిరీ పొడ పెంజర  -
           ఇది చేతి పొడవు ఉండును. కలిగొట్టు పువ్వు వన్నె మచ్చలు కలిగి ఉండి మొద్దు స్వభావం కలిగి ఉండును. ఇది కరవదు. మనుజుల శరీరములను నాకును. అందువలన శరీరం నందు పైత్యం , నవ, శరీరం రంగు    మారు ట , నిస్సత్తువ, వాంతులు ఎక్కిళ్లు , అరిచి సంభంవించును. మృతి ఎంత మాత్రం కలగదు .
*  గువ్వపోడ పెంజర  -
           ఇది ముప్పది అంగుళముల పొడవును , పావురపు రంగు శరీరం కలిగి ఉండి పసుపు వన్నె మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడినవారికి శరీరం నందు పాండు వ్యాధి , దురద, శోఫ , పసుపు వర్ణము గల మచ్చలు , దద్దురులు కలుగును. కొంతమందికి మాత్రమే మరణం కలుగును.
*   గరికపోడ పెంజర  -
            ఇది గరిక వర్ణపు మచ్చలను కలిగి ఉండి అడుగు పొడవును కలిగి ఉండును. దీని కాటు వలన మనుజులకు శరీరం నందు దురద, వాపు , మాంద్యం, నొప్పి, కన్నులు భ్రమ గప్పుట, దేహంలో నిస్సత్తువ , శరీరం అంతా ఆకు పసుపు వర్ణం గల పొడలు , శరీరం నందు వణుకు వంటి లక్షణాలు కలిగి కుష్టువ్యాది జనింపజేయును . కాళ్ల యొక్క చేతుల యొక్క వ్రేళ్లు వంకరలై ఎండిపోయినట్టు అయ్యి శుష్కించి ఉండును.
*  మోదుగుపూ పొడ పెంజర  -
           ఇది రెండు అడుగుల పొడవు , ఎర్రని మచ్చలు కలిగి ఉండును. దీని కాటు తిన్న వారికి శరీరం నందు వాపు , గాయం నందు పోట్లు , శరీరం నందు గ్రంథులు కట్టుట, అప్పటికప్పుడే రక్తం వాంతి అగుట , దగ్గిన రక్తం పడుట వంటి లక్షణాలు కలిగి ఉండును.
*  పసుపుపొడ పెంజర  -
           ఇది చేతి పొడవు కలిగి ఉండును. పసుపు వన్నె మచ్చలను కలిగి యుండును. దీని కాటు వలన శరీరం నందు పసుపు రంగు బొబ్బలు , జ్వరం , గాయాల్లో పోట్లు ఏర్పడి మరణం సంభంవించును.
*  దొండపండు పొడ పెంజర  -
          ఇది చేతేడు పొడవు ఉండును. చక్కగా పండిన దొండపండు వర్ణం కలిగి ఉండును. దీని కాటువలన శరీరం నందు నరములు ఉబ్బి ఎర్రగా కనిపించును. దేహం శుష్కించును . గాయం నందు పోట్లు కలుగును. మారుతి సంభవింపదు.
*  గవ్వపోడ పెంజర  -
          ఇది మూడు మూరల పొడవును , లావుగా భయంకరంగా గవ్వ  వర్ణం కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం నందు పాండువు , ముఖం , నేత్రములు పసుపు వర్ణం కలిగి ఉండును. కాటుపడిన ప్రదేశం కుంగి గుంట పడుట జరుగును. మరణం సంభవించదు.
*  రెండు తలల శిఖండి  - 
         ఈ పెంజర రాగిరంగు కలిగి ఉండును. తెల్లని మచ్చలు , గజము పొడవు కలిగి ఉండును. దీని తోక వైపు మొద్దుగా ఉండటం చేతను తలవైపుకు ప్రాకినట్లే తోకవైపుకు పాకును. అందువలన జనులు దీనికి రెండు తలలు ఉండునని భావించును. దీనిని కర్రతో కొట్టినా చావదు. జెముడు , జిల్లేడు కర్రలతో కొట్టినను , నిప్పులతో కాల్చినను చనిపోవును . ఇది కరవదు . మనుజుల శరీరం నాకును . ఇందువలన దేహం అంతయు నవ, పాండు రోగం , పొడలు , వాపు కలిగి అన్నం తినటం మీద ద్వేషం కలుగును.

   ఇప్పటివరకు  మీకు 21 రకాల పెంజర సర్పాల గురించి తెలియచేశాను . ఇప్పుడు మీకు రాజీమంత సర్పాల గురించి తెలియచేస్తాను . 
     ఈ రాజీమంత సర్పాలలో 4 రకాల సర్పాలు కలవు.       అవి
  *  క్షుద్రజాతి సర్పాలు .
   *  కుంభీ వస సర్పాలు .
   *  మహా సర్పాలు .
   *  నిర్విష సర్పాలు .   అని 4 రకాలు కలవు.
  రాజీమంత సర్పాలలో బేధాలు  -
     పైన చెప్పబడిన నాలుగు జాతుల సర్పాలలో క్షుద్రజాతి సర్పములు 9 జాతులుగాను , కుంభీవస సర్పాలు 8 కులములుగాను , మహాసర్పములు 3 బేధములుగాను , నిర్విష సర్పములు 16 తరగతులుగా పుట్టి ఉన్నవి.
  క్షుద్రసర్పములలో రకాలు  -
*  పెద్ద కట్లపాము.
*  నాగుల కట్లపాము.
*  నూనె కట్లపాము.
*  బఱ్ఱె కట్లపాము.
*  కట్లపాము.
*  తాటిబొలుగు పాము.
*  చెట్టెగురు పాము.
*  గొడ్డలి ముఖపు పాము.
*  గోడప్రాకుడు పాము.   
         ఈ విధంగా మొత్తం 9 విధాలుగా ఉండును.
*  పెద్ద కట్లపాము లేదా పెద్ద పరుగుడు పాము
          ఇది గజము పొడవు ఉండి గోధుమవన్నె త్రాచు పాముని పోలి ఉంటుంది.  దీని కాటు పడిన వానికి మాటిమాటికి విషం ఎక్కి భాధించును. కాని మరణం కలగదు.
*  నాగుల కట్లపాము  -
           దీనిని నాగ పరుగుడు అని కూడా అంటారు. ఇది 36 అంగుళముల పొడవు ఉండును. ఇది చూడటానికి నల్ల త్రాచువలె ఉండును. దీని కాటువలన విషం ఎక్కడం దిగడం జరుగును. మంత్రౌషదాల వలన విషం విరుగును. మరణం కలగదు.
*  నూనె కట్లపాము  -
            ఇది 36 అంగుళముల పొడవు కలిగి ఉండి శరీరం అంతయు తెల్లని కట్లు కలిగి ఉండి మెరుస్తూ ఉంటుంది. దీని విషం మిక్కిలి చురుకు అయినది. దీని కాటు వలన బాధ కలుగును. విషం వలన మరణం సంభవించదు.
*  బర్రెకట్ల పాము  -
            ఇది 50 అంగుళాల పొడవు ఉండి మొద్దు వలే లావును , శరీరం నందు గరుకు కలిగి ఉండును. ఇది క్రూరమైన విషం కలిగి ఉండును.
*  కట్లపాము లక్షణము  -
             ఇది మూడుమూరల పొడవు , శరీరం నందు గణుపుల వంటి కట్లు కలిగి ఉండును. ఇది కాటు వేయడం వలన మాటిమాటికి విషం ఎక్కడం , దిగడం జరుగును. మరణం కలుగనేరదు .
*  తాడిగిరి లేదా తాటిబొలుగు పాము  -
              ఇది  చిటికెన వ్రేలు లావును , మూడు జానల పొడవు నూనె రంగును కలిగి ఉండును. ఇది తీగ జాతి చెట్లలో విశేషంగా తాటిచెట్ల యందును సంచరించును. మనుజుల నిది తలమీదనే తప్ప మరి వేరే ప్రదేశంలో కరవదు. అందువలన తక్షణమే విషమెక్కి మనుజుడు గంటలోపునే చచ్చును. దీని విషముకు విరుగుడు లేదు . ఇది పగబట్టిన మనిషిని చంపియే తీరును . ఒకవేళ చంపలేక పోతే నిరసన వ్రతం బూని 6 నెలలలో అతనికోసం వేచి చూసి చివరకు చచ్చును.
*  చెట్టగురు పాము  -
            ఇది చిటికెన వ్రేలు లావు , అడుగున్నర పొడవు ఉండి ఎప్పుడూ చెట్ల మీదనే ఉండును. ఇది ఒక చెట్టు పై నుంచి మరియొక చెట్టు పైకి తటాలున దుమక గలదు. ఇది మనుజులను తలమీద కాని కన్నుల మీద కాని కరుచును. ఇది పగ సాధించుట విషయంలో  తాడిగిరి పామును పోలి ఉండును. ఇది కరిచినచో ఔషదం ఇచ్చు సమయం కూడా ఉండదు. అంతలోపు మనుజుడు మరణించును. జీవజంతువులు ను చంపుటలో దీని విషాన్ని మించినది లేదు . కావున పర్వాతారణ్యాలు , ఉద్యానవనాలు యందు తిరిగే వారు ఈ సర్పాన్ని సదా కనిపెట్టి తిరగగలరు.
*  గొడ్డలిమొగపు పాముల లక్షణము  -
             ఇది ఉదారంగును , గొడ్డలి వంటి తల కలిగి ఉండును. రేగటి మట్టి భూములలో , చౌడు భూముల్లో , బురద నేలల్లో నివసించును. వర్షాకాలంలో మాత్రమే బయట తిరుగును. మూరెడు పొడవు కలిగి ఉండును. ఈ పాముచే కరవబడిన మనుజుడు యొక్క అంగాలు కుంచించుకు పోయి పొట్టివాడు అగును.
*  గోడప్రాకుడు పాము లక్షణము  -
              ఇది రెండు మూరల పొడవు కలిగి తెల్లని శరీరం కలిగి శరీరం పైన నల్లని అడ్డు చారలు కలిగి ఉండును. వేలెడు లావు కలిగి ఉండును. అతిక్రూరమైన విషము కలిగి ఉండును.ఈ సర్పము ఎంత చదరము అయిన గోడని అయినా ప్రాకి ఎక్కగలదు. కాని దిగుట తెలీదు . గబుక్కున కింద పడును.
ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి వివరణ - 5
        అంతకు ముందు పోస్టులో రాజీమంత సర్పాలు మొత్తం 21 రకాలు వాటి గురించి సంపూర్ణ వివరణ ఇచ్చాను. ఇప్పుడు కుంభీన జాతి సర్పాలు గురించి వివరిస్తాను.
   ఈ కుంభీని జాతి సర్పాలు మొత్తం 8 రకాలు .
  *  ఘంటాపుచ్చము .
  *  గరున్నాగము .
  *  త్రిశూలి .
  *  జటాధరము .
  *  కుంభీనసము .
  *  శోణముఖము .
  *  లోహితాక్షము .
  *  ఛత్రపతి.
       ఈ విధంగా 8 రకాలుగా ఉంటాయి.
*  ఘంటాపుచ్చ సర్ప లక్షణము  -
         మిక్కిలి పొడవు శరీరం , క్రూరత్వం , మిక్కిలి పరాక్రమం సంచరించునప్పుడు తోక చివర యందు ఘంటానాదం కలిగి ఉంటుంది. ఈ సర్పం సర్వ జంతువులను భక్షించును . ఉగ్రమైన విషం కలిగి ఉండును. సంచారం బయలుదేరడం మొదలు కాగానే దీని తోక యందు ఘంటానాదం వినపడును. ఆ నాదం వినపడిన వెంటనే సమస్త జంతువులు పారిపోవును. ఈ సర్పం ఆఫ్రికా దేశ పర్వతారణ్యములలో సంచరించును.
*  గరున్నాగ సర్ప లక్షణము  -
         ఖడ్గము వంటి నాలుక , గబ్బిలపు రెక్కల వంటి రెక్కలు , గుడ్లగూబ వంటి ముఖం, భూమి మీద మరియు ఆకాశ గమనం , 8 మూరల పొడవు కలిగి ఉండును. ఇది పక్షిజాతులను భక్షించును . ఇది ఆఫ్రికా దేశ పర్వతారణ్యాలలో నివశించును.
*  త్రిశూలీ సర్ప లక్షణము  -
           పిల్లివంటి ముఖం , తోక యందు గరుడపచ్చ కాంతి వంటి రేఖలతో ప్రకాశించుట , మీసాలు కలిగి ఉండును. 16 మూరలు పొడవు కలిగి ఉండిన దేహము , తోక త్రిశూలం వంటి మూడు చీలికలు కలిగి ఉండును. ఇది ఆఫ్రికా ఖండం నందు ఉండును.
*  జటాధరా సర్ప లక్షణము  -
           మేకవంటి స్వరము , అతి పెద్ద శరీరం , గొఱ్ఱెవలె జడలు , 6 మూరల పొడవు , కంబడి చాయ వంటి లక్షణములు కలది. ఇది సింహళ ద్వీపం నందు ఉండును.
*  కుంభీనస సర్ప లక్షణము  -
           మూడు మూరల పొడవు , పంది ముఖం , కడవ వంటి కడుపు , కురచ అయిన తోక , చిన్నగా పాకును .  తుమ్మెద ధ్వని వంటి కూత ఈ లక్షణములు గలది కుంభీనస సర్పం అనబడును. ఇది అన్ని దేశాలలో ఉండును.
*  శోణముఖ సర్ప లక్షణం  -
          స్పటిక ఛాయ గల శరీరం , పద్మరాగ మణి వంటి శిరస్సు , అతి భయంకరమైన కామక్రోధములు , భయంకరమైన గర్జన , 12 మూరల పొడవు గల శరీరం కలిగి ఉండునది శోణముఖ సర్పం అనబడును.
*  లోహితాక్ష సర్ప లక్షణం  -
         నల్లని వర్ణం, భూమి నుండి చెట్ల పైకి , చెట్ల పై నుంచి భూమి పైకి దుముకుట , బారెడు పొడవు గల శరీరం , అగ్ని కణముల వంటి నేత్రములు , భయంకర ఆకారం కలిగి ఉండును.
*  ఛత్రపతి సర్ప లక్షణము -
         5 మూరల పొడవు , అతిస్నిగ్ధమైన కోమలాకారం , సంచరించునప్పుడు శరీరం వికసించును. సంచరించనప్పుడు శరీరం ముడుచుకుని ఉండును. శ్వేత ఛత్రం గల శిరస్సు , సర్వ జంతువుల ధ్వనిని చేయగలిగి ఉండును. క్షణంలో ప్రాణం తీయును.రాత్రుల యందు చెట్ల మీద నివసించును . ఇది కేరళ నందు నివసించును .
  మహాసర్పముల వివరణ  -
     మహాసర్పములు మొత్తం 3 రకాలు  అవి
  *  దాసరి పాము .
  *  కొండ చిలువ .
  *  సముద్రపు చిలువ .
*  దాసరిపాము లక్షణము  -
         60 మూరల పొడవు , బారెడు లావుగల శరీరం , శరీరం అంతా త్రిపుండ్రాకారం గల నామములు , కాటుక వంటి ఛాయ , ముఖం నందు ఊర్ద్వత్రిపుండ్రములు కలిగి ఉండునది దాసరిపాము అని చెప్పబడును . దీనికి దొరికిన ఏ జంతువుని అయినా బిర్రుగా చుట్టుకుని చంపి దిగమింగును.
*  కొండచిలువ లక్షణము  -
         నూరు మూరల పొడవు , మూడు బారల వలయము , వెడల్పు గల తెల్లని పొడలు , నీలవర్ణం గల శరీరం కలిగి ఉండునది కొండచిలువ అని చెప్పబడును . ఇది ఏ జంతువుని అయినా చటుక్కున మింగి చెట్టుకు చుట్టుకుని నీల్గును . అంతట పొట్టలోని జంతువు జీర్ణం అగును.ఇది కొండల యందు మాత్రమే నివసించును .
*  సముద్రపు పాము లక్షణము  -
          మిక్కిలి పొడవు , స్థూలమగు శరీరం గలది . దీనిచేత కరవబడిన మనిషిని భూమి పైకి తీసుకొచ్చి చికిత్స చేసిన విషము హరించదు. సముద్రము నందు ఉంచే చికిత్స చేయవలెను .
          *  సర్పజాతి వివరణ సంపూర్ణం *
      ఇప్పుడు మీకు సర్పాలు కాటువేసినప్పుడు చేయవలసిన చికిత్సల గురించి వివరిస్తాను.  

     సర్ప విషములకు చేయవలసిన చికిత్సలు -
   
    అంతకు ముందు పోస్టులలో మీకు సర్పాలలో రకాలు మరియు వాటి లక్షణాలు సంపూర్ణంగా వివరించాను. ఇప్పుడు వాటి చికిత్సలు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.
*  1వ చికిత్స -
   
          ఏ సర్పం కోపోద్రేకంతో ఉండునో అట్టి సర్పం నోటి నుండి పొగ వెడలుచుండును. యే మనుజుడు అయినా అట్టి సర్పముచే కరవబడినను ఆ సర్పం వదిలిన పొగచే స్మృశించబడిన ఆహార పదార్థాలను భక్షించిన వెంటనే విషం ఎక్కును.ఆ విషాన్ని చికిత్సల ద్వారా తొలగించవలెను .  వెంటనే ఆ విషార్తునకు ఆవుపాలు , ఆవునెయ్యి , తేనె సమాంతరములుగా కలిపి అందు రెండు గురిగింజల అంత వత్సనాభిని కలిపి త్రాగించి గాయమునకు కూడా వత్సనాభిని కరిచినచొట పైపూతగా రాయవలెను .వెంటనే విషం హరించును .
*  2 వ చికిత్స  -
           సర్పం కాటువేసిన వానికి వెంటనే  ఎడమ ముక్కునందు చెవిలో గులిమి పట్టించి మనిషి మూత్రం ఆ ముక్కులో ఉంచిన విషం ఎక్కదు.
*  3 వ చికిత్స  -
           నేలగుమ్ముడు గడ్డను గంథం తీసి కాటువేసిన చోట లేపనం చేసిన విషం హరించును . దీని చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ షాపులలో దొరకును.
*  4 వ చికిత్స  -
            పెన్నేరు గడ్డ అనగా అశ్వగంధ , చిర్రివేరు , మహిసాక్షి , కరిదువ్వ ఈ వస్తువులను గోమూత్రం తో నూరి పట్టించిన సర్పవిషం హరించును . విషంని హరించుటలో దీన్ని మించిన గొప్ప ఔషదం లేదు .
*  5  వ చికిత్స  -
          ఆగాకర గడ్డ ని గంథం తీసి అనగా సానమీద అరగదీసి ఆ గంధాన్ని తీసి కాటువేసిన స్థలం నందు దానిని పూసిన విషం హరించును .
*  6 వ చికిత్స -
          కాటువేసిన స్థలం నందు జిల్లేడు వేరు అరగదీసి పట్టించినను లేదా ఎర్ర చిత్రమూలం , ఆరుద్ర పురుగు కలిపి నూరి పట్టించినను విషం విరుగును.
*  7 వ చికిత్స  -
          కరక్కాయ , తేనె , మిరియాలు , ఆకుపత్రి , ఇంగువ, మణిశిల , వస వీనిని సమానంగా నీరు వేసి నూరి ముక్కులో వేసిన సర్పముచే కరవబడిన వాడు జీవించును.
*  8 వ చికిత్స  -
           మణిశిల , ఇంగువ, వస , త్రికటుకములు అనగా శొంటి,పిప్పిళ్లు , మిరియాల సమాన చూర్ణం , కరక్కాయలు, లవంగచెక్క, ఆకుపత్రి అనునవి సమానంగా తీసుకుని నీటితో కలిపి నూరి ముక్కులో వేసినచో ఎంత విషపూరితమైన సర్పం కరిచినను ఆ వ్యక్తి బ్రతుకుతాడు.
*  9 వ చికిత్స  -
           దేవకాంచన చెట్టు వేరు గంధంని ముక్కులోపల వేసినచో అసాధ్యం అయిన సర్పవిషం హరించును .
*  10 వ చికిత్స  -
           నేపాళపు గింజల్లోని పప్పులను నిమ్మపండ్ల రసంలో 21 సార్లు భావన చేయవలెను . భావన అనగా నిమ్మపండ్ల రసంలో గింజల్లోని పప్పు నానబెట్టి మళ్ళీ పూర్తిగా ఎండించడం మరలా నానబెట్టి మరలా ఎండించడం ఈ విధముగా 21 సార్లు చేయవలెను . ఆ తరువాత దానికి ఉమ్మి తో నూరి కణికలు చేసి ఎండించి మాత్రలులా చేసుకోవలెను . కావలసినప్పుడు ఉమ్మితో అరగదీసి కాటువేసిన స్థలం నందు లేపనం చేయవలెను . తరువాత కన్నులకు కాటుక వలే ఆ గంధాన్ని పట్టించవలెను  . విషం విరిగిపోవును.
*  11 వ చికిత్స  -
              గుంటగలగర వేఱు గాని , తిప్పతీగ వేఱు కాని , త్రిశూలి చెట్టు వేఱు గాని నీటితో నూరి లోపలికి తీసుకుని కాటువేసిన స్థలం నందు పూయడం వలన సర్పవిషం హరించును .
*  12 వ చికిత్స  -
                భావంచి విత్తనాలు గోమూత్రంలో నానబెట్టి గోమూత్రంతోనే నూరి లోపలికి తాగవలెను .
*  13 వ చికిత్స -
             తెల్లగురిగింజ వేరుని నోటిలో ఉంచుకుని రసం మింగుచున్న సర్పవిషం హరించును .
*  14 వ చికిత్స  -
             అశ్వగంధ సమూలం మేక మూత్రంతో నూరి దానినే గాయమునకు పట్టించిన సర్వ జంతువుల విషంని హరించును .
*  15 వ చికిత్స  -
             నల్ల ఉమ్మెత్త వేఱు చిన్న ముక్కను తీసుకుని 10 ml కానుగ విత్తనాల నూనె వేసి నూరి మాత్ర వలే చేసి పుక్కిట పట్టుకొని ఆ మాత్రని నిమ్మపండ్ల రసముని కలిపి త్రాగిన సర్పవిషం హరించును .
*  16  వ చికిత్స  -
             అత్తిపత్తి చెట్టు వేఱు అనగా దీనిని పట్టుకున్నచో ఆకులు ముడుచుకొనిపోవును . మరియు నీలివేరు ను మంచి నీటితో నూరి పుచ్చుకొని తెల్ల గురిగింజ లోని పప్పుల గంధమును కాటువేసిన స్థలం నందు పట్టించిన సర్పవిషం హరించును .
*  17  వ చికిత్స  -
              గొమూత్రంలో గాని మనుష్యుని మూత్రంలోగాని పాత నెయ్యిలో గాని పసుపు చూర్ణం కలిపి తాగించిన సర్పవిషము హరించును .
*  18 వ చికిత్స  -
            పాము కరిచిన వెంటనే నరమూత్రం సేవించిన విషం ఎక్కదు.
*  19 వ చికిత్స  -
          కటుకరోహిణి , నేలతాడిగడ్డలు నీళ్లతో నూరి పుచ్చుకొనిన సర్పవిషం హరించును .
*  20 వ చికిత్స  -
          కుంకుడువేరు నూరి కుంకుడు గింజ ప్రమాణంలో పుచ్చుకొనిన సర్పవిషం హరించును .
*  21 వ చికిత్స  -
          నాగముష్టి వేరు నూరి రసం తీసి తాగిన అన్ని రకాల సర్పవిషాలు హరించును .
*  22 వ చికిత్స  -
           జిల్లేడు యొక్క లేత మొగ్గలని కోసి ఆ మొగ్గలు తెంచునపుడు స్రవించు పాలను ఒక గ్లాసులో పట్టి ఆ పాలతో ఆ మొగ్గలను నూరి రేగు పండు ప్రమాణం మాత్రలను చేసి ఆ మాత్రలను తమలాపాకులో చుట్టి గంటకి ఒకసారి  మింగించిన సర్పవిషం హరించును . ఇలా 6 మాత్రలు కు తక్కువలేకుండా మింగించవలెను . మింగలేని స్థితిలో ఉన్నచో నీటితో కలిపి తాగించవలెను .
*  23 వ చికిత్స  -
           జిల్లేడు ఆకులకు ఇరువైపులా అంటుకొని ఉండే దూది వంటి తెల్లని నునగును గీచి ఒక గాజుపాత్రలో వేసి జిల్లేడు లేత మొగ్గలను తుంచునప్పుడు తొడిమలు నుండి స్రవించు పాలతో తడిపి చేతితో చక్కగా పిసికి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి నీడలో ఎండపెట్టి ఆ మాత్రలకు గాలి తగలకుండా సీసాలో వేసి కార్క్ మూత బిగించి ఈ మాత్రలను గంటకొకటి చొప్పున మూడు గంటలసేపు మింగించిన సర్పవిషం నిస్సందేహంగా నివర్తించును. 
          ఈ మాత్రలు తయారుచేసిన రెండు నెలల వరకే పనిచేయును . కావున రెండు నెలలోకసారి ఈ మాత్రలు తయారుచేసి నిలువ ఉంచుకొనవలెను .
       * సర్ప విష చికిత్సలు సంపూర్ణం *
గమనిక  -
          కొంతమంది ప్రాచీన వైద్య పండితులు పాము కరిచిన సాధారణంగా మనుషులకు మృతి సంభవించదు అని తమతమ గ్రంథాలలో వివరించారు . పాము కరిచినవారికి స్మృతి తప్పి ఉచ్వాస నిశ్చ్వాసములు ఆగి , హృదయచలనం ఆగి నాడిగమనం ఆగి ఉన్న సమయంన  మృతుడు అయినట్టు నిర్ణయించుకుని చక్కగా కూర్చొండబెట్టి 500 వందల బిందెల నీటిని నెత్తిన ధారగా పోసిన బొందిలోకి ప్రాణం వచ్చి లేచును.
                     ఈ విధంగా చేసినను ప్రాణం రానిచో ఒక గచ్చు తొట్టిలో కాని , చెక్క తొట్టిలో కాని నిండుగా నీరు నింపి మూడు దినములు ఉంచిన ఉదకం నుండి బుడగలు వచ్చును. బుడగలు మొదలు అయినచో శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తుంది అని అర్థం. ఈ విధంగా బుడగలు మొదలయిన గడియ తరువాత కాటు తిన్న వాని శరీరం బయటకి తీసి కూర్చుండబెట్టి శిరస్సు పై నుంచి నీటిని ధారగా పోయ?

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS