Monday, July 31, 2023

అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారు ?


అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారు ?


చంద్రుని యొక్క అష్టమికళ ఏ తిధిన ఉంటుందో అది అష్టమి తిధి అనబడుతుంది.

అష్టమిరోజున చంద్రుడు సమంగా ఉంటాడు. అంటే అర్ధచంద్రుడు. అగ్నిపురాణంలో
అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది.

చంద్రుడికి పదహారు కళలున్నాయి.

పాడ్యమి దగ్గరనుంచి పూర్ణిమ వరకు తిథులు పదిహేను పదహారవకళ సాక్షాత్తూ
సచ్చిదానందస్వరూపిణి అయి ఉన్నది.

చంద్రుని యొక్క పదహారుకళలు సూర్యునిలో దాగి ఉంటాయి. శుద్ధపాడ్యమి
అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి
చంద్రునిలో ప్రవేసిస్తుంది. ఆరకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజును
పూర్ణిమ అంటారు. ఆ తరువాత ప్రతిరోజూ ఒక్కొక్క కళ చంద్రుని నుంచి విడిపోయి
సూర్యునిలో చేరిపోతుంది. ఈ రకంగా పదిహేను కళలు చంద్రుని వదలి వెళ్ళిపోయిన
రోజును అమావస్యా అంటారు. ఆ రోజు చంద్రుడు కళావిహీనుడు. ఇవే శుక్ల కృష్ణ
పక్షాలు. ఈ రెండింటిలోనూ కూడా అష్టమినాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు.
అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు. ఇతడే అర్ధచంద్రుడు.

తిథులు నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. నిత్యలు మొత్తం పదహారు.
వీటిని గురించి వసిష్టసంహితలో వివరించబడింది.

ఈ నిత్యల గురించి వామకేశ్వరతంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది.

కామేశ్వరి, భగమాలినీ, నిత్యక్తిన్న భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,
శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ,
జ్వాలామాలినీ, విచిత్ర, మహానిత్య

ఇవి పదహారునిత్యలు. ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతుండటంచేతనే
చంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతున్నాయి. శుక్ల కృష్ణ పక్షాలయందున్న తిధులు నిత్యలు
ఈ దిగువ ఇవ్వబడ్డాయి.

శుక్లపక్షము తిథి, నిత్యాదేవత కృష్ణపక్షము తిథి

1. పాడ్యమి ,కామేశ్వరి. 1. పాడ్యమి, చిత్ర

2. విదియ, భగమాలిని. 2 జ్వాలామాలిని
3. తదియ ,నిత్యక్షిన్న 3 సర్వమంగళ
4. చవితి , భేరుండా. 4 విజయ

5. పంచమి, వహ్నివాసిని 5 నీలపతాక
6. షష్టి ,మహావజ్రే్ేశ్వరి 6. నిత్య

7. సప్తమి ,శివదూతి 7 కులసుందరి
8. అష్టమి, త్వరిత 8 త్వరిత

9. నవమి, కులసుందరి. 9 శివదూతి
10. దశమి ,నిత్య 10. మహావజ్రేేశ్వరి
11. ఏకాదశి ,నీలపతాక 11. ఏకాదశి వహ్నిివాసిని
12. ద్వాదశి ,విజయ 12. ద్వాదశి భేరుండా
13. త్రయోదశి | సర్వమంగళ 13. త్రయోదశి | నిత్యకిన్న
14. చతుర్దశి, జ్వాలామాలిని 14. చతుర్దశి భగమాలిని
15. పూర్ణిమ ,చిత్ర 15. కామేశ్వరి

చంద్రుని యొక్క కళలు ఈ రకంగా మారినప్పుడు తిథి ఒకటే అయినప్పటికీ శుక్ల
కృష్ణ పక్షాలలో నిత్యాదేవతలు వేరుగా ఉంటాయి. ఆ విషయం పైన పట్టిక చూస్తే
తెలుస్తుంది. కాని రెండు పక్షాల యందు అష్టమినాడు మాత్రం “త్వరిత” అనబడే
నిత్యాదేవతయే ఉంటుంది. దాన్నే త్వరితాకళ అని కూడా అంటారు. అనగా ఎటువంటి
మార్పులేనివాడు అష్టమినాటి చంద్రుడు. అందుచేతనే అష్టమినాటి చంద్రునితో దేవి
ముఖాన్ని పోల్చటం జరిగింది.

గుండ్రని ముఖానికి పైన కిరీటము పెట్టటంచేత, దేవి యొక్క లలాటము అర్థచంద్రాకారంగా అష్టమినాటి చంద్రునిలాగా కనిపిస్తుంది.

                         ఓం శ్రీ మాత్రే నమః
🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷

గురు అక్షరమాల స్తుతి

 గురు అక్షరమాల స్తుతి



అ - అద్వైతమూర్తి - గురువు

ఆ - ఆనందస్ఫూర్తి - గురువు

ఇ - ఇలదైవం - గురువు

ఈ - ఈశ్వరరూపము - గురువు

ఉ - ఉద్ధరించువాడు - గురువు

ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు

ఋ - ఋజువర్తనుడు - గురువు

ౠ - ఋణము లేనివాడు - గురువు

ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు

ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు

ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు

ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు

ఓ - ఓంకార రూపము - గురువు

ఔ - ఔదార్య మేరువు - గురువు

అం - అందరూ సేవించేది - గురువు

అః - అహంకార రహితుడు - గురువు

క - కళంకము లేనివాడు - గురువు

ఖ - ఖండరహితుడు - గురువు

గ - గుణాతీతుడు - గురువు

ఘ - ఘనస్వరూపము - గురువు

ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు

చ - చక్రవర్తి - గురువు

ఛ - ఛత్రము వంటి వాడు - గురువు

జ - జనన మరణములు లేని వాడు - గురువు

ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు

ఞ - జ్ఞానస్వరూపము - గురువు

ట - నిష్కపటుడు - గురువు

ఠ - నిష్ఠకలవాడు - గురువు

డ - డంబము లేనివాడు - గురువు

ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు

ణ - తూష్ణీభావము కలవాడు - గురువు

త - తత్త్వోపదేశికుడు - గురువు

థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు

ద - దయాస్వరూపము - గురువు

ధ - దండించి బోధించువాడు - గురువు

న - నవికారుడు - గురువు

ప - పంచేంద్రియాతీతుడు - గురువు

ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు

బ - బంధము లేనివాడు - గురువు

భ - భయరహితుడు - గురువు

మ - మహావాక్యబోధకుడు - గురువు

య - యమము కలవాడు - గురువు

ర - రాగద్వేష రహితుడు - గురువు

ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు

వ - వశీకరణశక్తి కలవాడు - గురువు

శ - శమము కలవాడు - గురువు

ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు

స - సహనశీలి - గురువు

హ - హరిహర రూపుడు - గురువు

ళ - నిష్కళంకుడు - గురువు

క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు

ఱ - ఎఱుకలేనివాడు - గురువు

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం..

 శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం..




ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః |

లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ ౧


సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ |

అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ ౨


నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ |

ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశ్యంతి సూరయః ౩


ఏవమజ్ఞానగాఢాంధతమోపహతచేతసః |

న పశ్యంతి తథా మూఢాః సదా దుర్గతి హేతవే ౪


విష్ణ్వాదీని స్వరూపాణి లీలాలోకవిడంబనమ్ |

కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ ౫


తత్తదుక్తాః కథాః సమ్యక్ నిత్యసద్గతిప్రాప్తయే |

భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా ౬


సర్వాన్కామానవాప్నోతి భవదారాధనాత్ఖలు |

మమ పూజామనుగ్రాహ్య సుప్రసీద భవానఘ ౭


చపలం మన్మథవశమమర్యాదమసూయకమ్ |

వంచకం దుఃఖజనకం పాపిష్ఠం పాహి మాం ప్రభో ౮


సుబ్రహ్మణ్యస్తోత్రమిదం యే పఠంతి ద్విజోత్తమాః |

తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ౯ ..🙏

శ్రీ కాళహస్తి

 శ్రీ కాళహస్తి 


దక్షిణ భారతదేశంలోనే ప్రశస్తమైనది ఈ దేవాలయం అదే శ్రీ కాళహస్తి.*63 నయనారులలో ఒకడైన కన్నప్ప ఇక్కడే శివలింగం కళ్ళలోనుండి వస్తున్న రక్తాన్ని ఆపడానికి తన కళ్ళను పెరిగి శివలింగానికి అమర్చిన హృదయాన్ని ద్రవింపజేసే మహత్తర ఘట్టం చోటు చేసుకున్న పుణ్యస్థలం ఈ శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది.వాయుదేవునికై నిర్మించిన ఏకైక దేవాలయం శ్రీకాళహస్తిలో ఉంది. వాయుదేవుడు ఇక్కడ శివుని రూపంలో శ్రీకాళహస్తీశ్వరునిగా పూజలందుకుంటాడు. చోళరాజు శ్రీ రాజేంద్ర చోళుని చే 12వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మించబడింది.

భారతీయ ఖగోళశాస్త్రంలో ప్రముఖులైన రాహువు, కేతువు లకు కూడా ఇక్కడ గుడులు నిర్మించారు. సువర్ణముఖి నది ఒడ్డున ఉంది. శ్రీ కాళహస్తిని 'దక్షిణ కైలాసం' గా భావిస్తారు. మొదటి శతాబ్దానికి చెందిన శైవ సన్యాసులు ఈ దేవాలయం గూర్చి గానం చేశారు.

వాస్తుశిల్పకళ ప్రకారంగా కూడా శ్రీకాళహస్తి ఒక అధ్బుతమైన శివాలయం.

పురాతన సాంప్రదాయ రీతిలో నిర్మించబడిన 120 అడుగుల (36.5m) ఎత్తున్న పెద్ద గోపురం దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ. పెద్ద రాతిగుట్ట ను తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. మెదట పల్లవ రాజులు ఈ దేవాలయ నిర్మాణం గావించారు. తమిళులైన చోళ రాజులతో పాటూ విజయనగర రాజులూ ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేశారు. ఐతే ఇతర దేవాలయాల్లాగే శ్రీకాళహస్తి నిర్మాణం కూడా శతాబ్దాలపాటూ జరిగింది. పదో శతాబ్దంలో చోళరాజులు దేవాలయాన్ని పునరుద్దరించి ఒక రూపునిచ్చారు. ప్రాకారపు గోడలు, నాలుగు గోపురాలు పన్నెండో శతాబ్దంలో వీరనరసింహరాయార్ చే నిర్మించబడ్డాయి. 120 అడుగుల ఎత్తున్న ప్రధాన గోపురాన్ని, వందకాళ్ళ మంటపాన్ని విజయనగర రాజు శ్రీ క్రిష్ణ దేవరాయలు క్రీ.శ. 1516లో నిర్మించారు.

దేవాలయాన్ని పునరుద్దరించి ఒక రూపునిచ్చారు. ప్రాకారపు గోడలు, నాలుగు గోపురాలు పన్నెండో శతాబ్దంలో వీరనరసింహరాయార్ చే నిర్మించబడ్డాయి. 120 అడుగుల ఎత్తున్న ప్రధాన గోపురాన్ని, వందకాళ్ళ మంటపాన్ని విజయనగర రాజు శ్రీ క్రిష్ణ దేవరాయలు క్రీ.శ. 1516లో నిర్మించారు.

దేవక్కొట్టకు చెందిన నట్టుక్కొట్ట చెట్టియార్ 1912లో ఒక మిలియన్ డాలర్లు వెచ్చించి ప్రస్తుతమున్న రూపు తెచ్చారు. అప్పార్, సుందరార్, సంబందార్ మొదలైన నయనారులు శ్రీకాళహస్తీశ్వరున్న తమ 'తేవారం' భక్తిగీతాల్లో కొనియాడారు.

పంచబూతాల రూపంలో శివుని ప్రార్దించడం శైవ సాంప్రదాయం. శ్రీకాళహస్తిలో శివున్ని పంచబూతాల్లో ఒకటైన 'వాయు' రూపంలో పూజిస్తారు. (నీరు- తిరువనైకావల్, అగ్ని-అన్నామలైయార్, భూమి-ఏకాంబరేశ్వరార్ దేవాలయం, ఆకాశం (విశ్వం)- చిదంబరం దేవాలయం)గర్భగుడిలో గాలి చలనం లేకున్నా, గర్భగుడి ప్రదాన ద్వారం మూసివేసినా అక్కడి దీపాలపై మంట కదులుతూ ఉండటం అద్భుతం. శివుని ఉచ్వాసనిశ్చ్వాస లకు అనుగుణంగా ఆ దీపాలు కదులు తున్నాయని నమ్మకతప్పదు. శ్రీకాళహస్తిలో కలదు అద్భుతమైన స్వయంభూ లింగం.

దక్షిణాయణ_పుణ్యకాలం

 దక్షిణాయణ_పుణ్యకాలం



 దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి సమయంగా భావిస్తారు. దక్షిణాయణం దేవతలకు రాత్రి అవడం వల్ల ఆ సమయంలో వారు నిద్రిస్తారని అంటారు. అందుకే విష్ణుమూర్త్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెబుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్ల్ల ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు.


దక్షిణాయణంలో సూర్యుడు దక్షిణార్థ గోళం దిశగా పయనిస్తాడు. ఇందుకు భిన్నంగా ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరార్థ గోళం దిశగా పయనిస్తాడు. దక్షిణాయనం ఇప్పుడు (జులై మధ్య కాలంలో) ప్రారంభవమై జనవరి 14 వరకూ కొనసాగుతుంది. 


ముఖ్యంగా దక్షిణాయణం లోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేం దుకు భూమి పైకి వస్తారని చెబుతారు. ఈ దక్షిణాయణంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి వంటివి జరుగుతాయి. శ్రాద్ధాదులు మానివేయడం కూడా సంతానం కలగక పోవడానికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. శ్రాద్ధాదులు చేయక పోవడమే పిల్లలు లేక పోవడానికి కారణమని భావించి, వాటిని యధావిధిగా చేయడం మొదలు పెట్టి సంతానం పొం దామని చెప్పినవారు కూడా ఉన్నారు.


బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి, ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు మనను కన్న తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య. ప్రతి దక్షి ణాయణంలో చలి వంటివి పెరగడం వ్ల్లల ఎక్కువగా మర ణాలు కూడా సంభవిస్తాయి. అయితే ఉత్తరాయణాన్ని పుణ్య కాలంగా భావిస్తారు. ఆ సమయంలో మరణించడం మంచిదనే అభిప్రాయం ఉంది. భీష్ముడు స్వచ్ఛంద మరణం వరంగా ఉన్న వాడు కనుక ఉత్తరాయణం వచ్చే వరకూ వేచి ఉండి అప్పుడు ప్రాణం వదిలాడు.  చాతుర్మాస్యం దక్షిణాయణం లోనే వస్తుంది.   పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు వంటివి చేయడం, సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, అవసరంలో ఉన్న వారకి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామం చేయడం, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణ ఇటువంటివి చేస్తే అవి శరీరానికి, మనస్సుకు మంచి చేస్తాయి. పాపాలు తొలగిపోతాయి.

సుందరకాండ పారాయణంతో సకల దోషాల విముక్తి

 సుందరకాండ పారాయణంతో సకల దోషాల విముక్తి



సుందరకాండ పారాయణ వల్ల సకల దోషాలు తొలగి పోతాయి. శని,రాహు,కుజ, కేతు దోషాల వల్ల మనుషులు ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతూ ఉన్నారు.అటువంటి బాధల నుంచి విముక్తిపొందేందుకు సుందరకాండ పారాయణను చేయడం అత్యంత శ్రేష్ఠమని సాక్షాత్తు పరమశివుడు పార్వతి దేవితో ఓ సందర్భంలో అంటాడు. 'ఓ పార్వతీ! సకల దేవతల్లో శ్రీరాముడు ఎంతగొప్పవాడో, ఉన్నతుడో,వృక్షజాతుల్లో కల్ప వృక్షం ఎంత మంగళకరమైనదో, అంతటి గొప్పది అయిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణంలో అత్యంత కీలకమైనది సుందరకాండ. సుందరకాండ పారాయణ తులసివనంలో చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. బిల్లవృక్షం వద్ద చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది.నదీ తీరాల్లో సుందరకాండ పారాయణ ఎంతో శుభప్రదం. ఇంట్లో పారాయణ చేసేవారు శుచి, శుభ్రత లను పాటించాలి. సుందరకాండ పారాయణం వల్ల మనిషిలో ఉదాత్త గుణాలు కలుగుతాయి.ఎవరితోనూ తగవులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించేందుకు అవసరమైన బుద్ధిని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు. సుగ్రీవుని మంత్రిగా ఆంజనే యుడు రామలక్ష్మణులను చూసిన నాటి నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకూ వహించిన పాత్ర ఆయనలోని బుద్ధి బలాన్నీ, యశోధైర్యాన్ని సుబోధకం చేస్తుంది.


ఆంజనయుణ్ణి కేవలం వానరంగా కాకుండా, ఈశ్వరాంశ సంభూతు నిగా, శ్రీరామచంద్రు నికి నమ్మిన బంటుగా ఆరాధిస్తే ఎంతో మేలు జరుగుతుంది. నవగ్రహ పీడలు తొలగి పోతాయి. మనిషిలో నిదానం వృద్ధి చెందుతుంది.ఏ కార్యాన్ని చేపట్టినా ఆలోచ నకు పదును పెట్టగలుగుతారు. ఆలోచన లేకుండా ఏ పని చేపట్టినా అది సక్రమమైన రీతిలో పూర్తి కాదు. అంతెకాక,అహంకార,  మమకారాలకు ప్రభావితం కాకుండా మనిషి సంయమనాన్ని అలవర్చుకోగలుగుతాడు. ప్రలోభా లాకు, బెదిరింపులకు చలించకుండా తన పనిని సక్రమంగా నిర్వహించుకోగలుగు తాడు. బృహద్ధర్మపురాణంలో సుందర కాండ పారాయణ పాశస్త్యాన్ని గురించి వివరించ బడింది. మనిషికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం అంతకంటే ఎక్కువ.


ఆరోగ్యమే మహాభాగ్యమనే సామెత అందుకే పుట్టింది. మనిషిలో నైరాశ్యాన్ని పోగొట్టి, ధైర్యాన్నీ,ఉత్సాహాన్ని కలిగిం చేది సుందర కాండ. కుటుంబ పరమైన క్లేశాల్లో ఉన్నవారు సుందరకాండ పారాయణ చేస్తే వీలైనంత త్వరలోనే వాటి నుంచి విముక్తి పొందుతారు. మనిషిలోఏకాగ్రతను పెంచు తుంది.చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది.

సుందరకాండ పారాయణకు మన పెద్దలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.ఆంజనేయుడు సీతామాత కోసం లంకా నగరంలో అన్వేషించిన సమయంలో అడుగడుగునా ఎదురైన అడ్డంకి లను ఏ విధంగాతొలగించుకుంటూ ముందుకు సాగుతాడో మనిషి కూడా తాను చేపట్టిన పనికి ఎదురైన అవరోధాలను తొల గించుకోవడానికి సుందరకాండ పారాయణ ఎంతో ఉపయోగ పడుతుంది.


రాముణ్ణి సేవించి ఆంజనేయుడు తాను తరించి తనను నమ్ముకున్నవారిని తరింపజేస్తున్నాడు. శ్రీరామదూతం శిరసానమామి అని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారి జోలికి భూత,ప్రేత పిశాచాలు రావు. శత్రువులు వారిని ఏమీ చేయలేరు. వాల్మీకి,తులసీదాసు ప్రభృతులు చెప్పిన పరమ రహస్యం ఇదే.

(సేకరణ)

దక్షిణామూర్తి" విగ్రహాన్ని పరిశీలిస్తే "కుడిచెవి"కి "మకరకుండలం"... ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి.

 దక్షిణామూర్తి" విగ్రహాన్ని పరిశీలిస్తే "కుడిచెవి"కి "మకరకుండలం"... ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. 



"మకరకుండలం" పురుషుల శ్రవణాలంకారం. "తాటంకం" స్త్రీల అలంకృతి...

దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది "శివశక్తుల" సమైక్య రూపమేనని తెలియజేస్తాయి... 

ఈ రెండు అలంకారాలు. 


సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే... ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. 


అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా..

ఈ విషయాన్నే "లలితాసహస్రం"లో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" 

అని వివరిస్తోంది.


స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు. 

ఉత్తరం జ్ఞానదశ.... ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి....


వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ. 

అంటే యమ (మృత్యు) దిశ. 

దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో... వారు యముని ( మృత్యువుని ) చూడరు. 


యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది. 

  

 ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి' 


యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి


దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'.


ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. 


ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం)... భగవంతునికి మాత్రమే ఉంది. 

ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే...    "దక్షిణామూర్తి"


అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. 

అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. 

ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే...జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే  "దక్షిణామూర్తి"


గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్  నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:🙏


"దక్షిణామూర్తి" సకల జగద్గురు మూర్తి కనుక  స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది.   ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి...

పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.

భాస్కరరాయులు

 భాస్కరరాయులు 



లలితాసహస్రానికి అనేకమంది వ్యాఖ్యలు వ్రాశారు. వాటన్నింటిలోకి మొట్టమొదటిది, మూలమైనది భాస్కరరాయులవారు వ్రాసిన “సౌభాగ్య భాస్కరము”. తరువాత వచ్చిన వ్యాఖ్యలన్నింటికీ ఇదే మాతృక అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. వీరు క్రీస్తుశకం 17, 18 శతాబ్దాల మధ్య జీవించారు.


కర్ణాటక రాష్ట్రంలోని బీజపూరు నందు బీజపూరు నవాబుకు విశ్వామిత్ర గోత్రీకుడైన గంభీరరాయ దీక్షితులు మంత్రిగా ఉండేవాడు. గంభీరరాయలు మహాపండితుడు. 


సోమయాజి, బహు గ్రంథకర్త, రాజనీతిజ్ఞుడు. మహాభారతాన్ని పార్శీభాషలోకి అనువదించి "భారతి" అని బిరుదు పొందాడు. ఈయన భార్య కోనమాంబ. రాచకార్యము మీద ఈయన హైదరాబాదు నగరానికి వచ్చినప్పుడు అక్కడ ఈ పుణ్యదంపతులకు భాస్కరరాయలు జన్మించాడు. 


బాలభాస్కరుడు దినదిన ప్రవర్ధమానుడై నారాయణపేట దగ్గరగల 'లోకాపల్లి' అనే గ్రామంలో సాక్షాత్తూ సరస్వతీస్వరూపమైన నృశింహయాజి దగ్గర సమస్త విద్యలు అభ్యసించి, ఆ తరువాత సూరత్ నగరవాసి అయిన “ప్రకాశానంద నాథ” అనే దీక్షానామంగల శివదత్తశుక్ల దగ్గర ఉపదేశం పొందాడు. గురువు యొక్క అనుగ్రహంతో పరదేవతా సాక్షాత్కారం పొందిన భాస్కరాచార్యుడు దేశాటన చెయ్యటం ప్రారంభించాడు.


ఆ రోజుల్లో మహారాష్ట్ర దేశానికి సేనాధిపతి అయిన 'చంద్రసేన జాదవు' భాస్కరాచార్యుని శిష్యుడైనాడు. చంద్రసేనుడికి సంతానం లేదు. అందుచేత అతడు భార్యతో సహా గురువుగారైన భాస్కరాచార్యుని దగ్గరకు వెళ్ళి, సంతానాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. కరుణామయుడైన భాస్కరాచార్యుడు చంద్రసేనుడికి పుత్రసంతానం కలుగుతుంది అని దీవించాడు. కాలక్రమంలో చంద్రసేనుడి భార్య గర్భవతి అయింది.


ఆ రోజులలో నారాయణదేవుడు అనేవాడు భాస్కరునికి శిష్యుడుగా ఉండేవాడు. అతడు పండితుడు, సద్గుణసంపన్నుడు. అన్నిటికీ మించి గురువుగారి మీద అచంచలమైన భక్తిప్రపత్తులు కలవాడు. నారాయణదేవుని యొక్క దీక్షకు మెచ్చి భాస్కరాచార్యుడు అతడికి వాగ్దేవీ మంత్రాన్ని ఉపదేశించాడు. గురుకటాక్షవీక్షణాల వల్ల మంత్రసిద్ధి జరిగి నారాయణదేవుడికి వాక్సిద్ధి లభించింది. ఈ రకంగా వాక్సిద్ధిని పొందిన నారాయణదేవుడు కూడా దేశాటన చేస్తూ మహారాష్ట్ర ప్రాంతంలో చంద్రసేనుడున్న నగరానికి వచ్చాడు. 


అతడి గొప్పతనాన్ని విన్నటువంటివాడై చంద్రసేనుడు అతని వద్దకు వెళ్ళి, తన భార్య గర్భవతి అని చెప్పి, తనకు ఏ సంతానం కలుగుతుంది ? అని అడిగాడు. దానికి నారాయణదేవుడు స్త్రీ సంతానము కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే చంద్రసేనుడు “అయ్యో ! అదెలా జరుగుతుంది ? మా గురువుగారు భాస్కరాచార్యుల వారు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు కదా!" అన్నాడు. 


ఆ మాటలు వినగానే నారాయణదేవుడు ఎక్కడో పొరపాటు జరిగిపోయిందని గ్రహించి "ఓ మూర్ఖుడా ? భాస్కరాచార్యుల వారే నాకు కూడా గురువుగారు. వారి దయవల్లనే నాకు వాక్సిద్ధి లభించింది. అటువంటి నాతో వేరేరకంగా చెప్పించావు. కాబట్టి నీకు ఆడామగా కాని శిశువు జన్మిస్తుంది." అని శాపం పెట్టాడు.


చంద్రసేనుడు తను చేసిన పనికి విచారించసాగాడు. కొంతకాలానికి చంద్రసేనుని భార్య ప్రసవించింది. నారాయణదేవుడు చెప్పినట్లే నపుంసకుడు జన్మించినాడు. ఈ పరిణామానికి చంద్రసేనుడు విపరీతంగా దుఃఖించసాగాడు. కొంతకాలానికి భాస్కరరాయలవారు 'భలాకి' అనే నగరానికి వచ్చినట్లుగా తెలిసి, కుమారుణ్ణి వెంటపెట్టుకుని అక్కడకు వెళ్ళి గురువుగారి పాదాలనాశ్రయించి, నపుంసకుడైన తన కుమారుని పురుషుడుగా చెయ్యమని కోరాడు. 


కరుణాంతరంగుడైన భాస్కరాచార్యుడు రామచంద్ర జాదవుడనే పేరు గల ఆ బాలుణ్ణి వెంటపెట్టుకుని కృష్ణాతీర మందలి "మలిమడుగు" అనే పుణ్యక్షేత్రానికి పోయి కృష్ణలో తృచార్ఘ్యదానానుష్ఠానము మొదలుపెట్టాడు.


మలిమడుగు నుంచి కృష్ణానది కొంచెం దూరంగా ఉన్నది. ప్రతిరోజూ ఆచార్యుడు నదీ తీరానికి కాలినడకన ఏగి అనుష్ఠానం పూర్తి చేసుకుని వస్తుండేవాడు. ఇలా చెయ్యటం వల్ల అతడి కాళ్ళు బొబ్బలెక్కి పుండ్లు పడిపోసాగాయి. అది చూసిన శిష్యులు "గురుదేవా! మన నివాసం నదీతీరానికి మారుద్దాం!" అన్నారు. ఆ మాటలు విన్న భాస్కరుడు "కృష్ణానదినే మన దగ్గరకు రప్పిద్దాం" అన్నాడు. దానికోసం మరునాటి నుండి సూర్యోపాసన ప్రారంభించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమై భాస్కరాచార్యుని కోరిక తెలుసుకుని, "బ్రహ్మ యొక్క సృష్టిని ఎదిరించటం కూడని పని. రామచంద్రుడికి పుంసత్వాన్ని నేను ప్రసాదిస్తాను. ఆ పని మానుకో" అన్నాడు. ఆ మాటలు విన్న భాస్కరాచార్యుడు కుపితుడై, “రామచంద్రుణ్ణి పురుషునిగా చెయ్యగల సామర్థ్యం నాకున్నది. నేనడిగినట్లుగా నువ్వు కృష్ణానదిని మళ్ళించు లేకపోతే సూర్యోపాసన ప్రయోజనం లేనిది అని ప్రచారం చేస్తాను” అన్నాడు. 


ఆ మాటలు విన్న సూర్యభగవానుడు భాస్కరుని కోరిక మన్నించి, నదీ ప్రవాహాన్ని మలిమడుగుకు మళ్ళించాడు. ఆ సందర్భంలోనే భాస్కరాచార్యుడు “తృచభాస్కరము” అనే గ్రంథాన్ని రచించాడు. తరువాత భాస్కరుని ఉపాసనతో రామచంద్రుని నపుంసకత్వం కూడా పోయింది. దీనికి ఆనందించిన రామచంద్రుని తండ్రి చంద్రసేనుడు మలీమడుగు గ్రామాన్ని భాస్కరునకివ్వగా, భాస్కరాచార్యుడు ఆ గ్రామాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు.ఆ గ్రామంలో చింత చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుచేత చింతకాయలను ఎవరూ అమ్మరాదు. ఎవరికి కావలసినవి వారు కోసుకుని వాడుకోండి. ఒకవేళ ఎవరైనా వాటిని అమ్మాలని చూస్తే, వాటిల్లో పురుగులొస్తాయని ఆంక్ష పెట్టాడు భాస్కరుడు.


భాస్కరాచార్యుడు శంకరాచార్యుని పరంపరగా అద్వైతమతాన్నే

ప్రచారం చేశాడు. ఆ రోజులలో సత్యబోధస్వామి మధ్వమఠాధిపతిగా ఉండేవాడు. భాస్కరాచార్యుడు దేశాటన చేస్తూ సత్యబోధస్వామిని వాదనలో జయించాడు. ఈ సత్యబోధుని సోదరుని కుమార్తె పార్వతి. శాస్త్రప్రకారము ముద్రాంకితురాలు. మధ్వ సంప్రదాయంలో శంఖు చక్ర ముద్రలు వేయించుకున్న వారే సంప్రదాయులు. అటువంటి ఆమెకు ప్రాయశ్చిత్తం చేయించి స్మార్తవిధిని ఆమెను వివాహం చేసుకున్నాడు.

సుబ్రహ్మణ్య ఆరాధన -సంతాన ప్రదాతకం

 సుబ్రహ్మణ్య ఆరాధన -సంతాన ప్రదాతకం


సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. రాహు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి,

పూజలు చేస్తారు.

మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తిని, ధనాన్ని ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి.

సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.


మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చండ్ర సమిధలు నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరించాలి.


దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది.


* కాలసర్పదోషం ఉన్నవారికి మేలైనవి:


జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, రాహు కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు.

సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానప్రాప్తిని కోరే స్ర్తిలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుంది. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుంది.

కుటుంబంలో వివాహం కావలసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ తరచుగా కుటుంబ వ్యక్తుల పైన అత్యధిక స్థాయిలో కోపం ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా వారికి వివాహం కూడా ఆలస్యం అవుతుంది. అది కుజదోష ప్రభావం. వివాహం ఆలస్యం అవుతుందా లేదా వారి కోపం తారా స్థాయిలో ఉన్నప్పటికీ వారి జాతకం పరిశీలించుకుని తగిన పరిహారాలు చేసుకున్న ఎడల త్వరగా వివాహం జరిగి వారి జీవితం సుఖమయం అయ్యే అవకాశం కలదు.

కుజదోష నివారణకు పరిహారం :

 కుజదోష నివారణకు పరిహారం :



కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి. 


సుబ్రహ్మణ్య ఆలయ స్తుతి దర్శనం చేయాలి. షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి. 


సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి.


ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. 


కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్ధాలను నైవేద్యం పెట్టాలి. 


కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి. 


మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి. 


ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి. 


స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు ధరించి చేసి దుర్గాదేవిని పూజించుట, అమ్మవారికి ఎర్రని పూలను మాలలను సమర్పించి కుంకుమపూజ చేయాలి. దుర్గాదేవిని స్తుతించాలి. 


మంగళ వారాలు దుర్గాదేవి ఆలయదర్శనం చేసి ప్రదిక్షిణం చేసి స్తుతించి పూజించాలి. గణపతి స్తోత్రం చేయాలి. ఆంజనేయస్వామి దండకం స్తుతి చేయాలి. 


బలరామ ప్రతిష్ఠిత నాగావళీ నదీతీర పంచలింగాలను దర్శించాలి. 


మంగళ వారాలాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదిక్షిణం, స్తుతి చేయాలి. 


మంగళ వారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. 


ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్భై మార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి. 


నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 


కోతులకు తీపి పదార్ధములు పెట్టాలి, ఎర్రమి కుక్కకు ఆహారం పెట్టాలి. 


మంగళ వారం రాగిపళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి.

కృష్ణ, సంఖ్య 8 మరియు అనంతం (విశ్వరూపం)

 కృష్ణ, సంఖ్య 8 మరియు అనంతం (విశ్వరూపం)


 ~

 అంకె 8 అనేది శని గ్రహంతో సంబంధం కలిగి ఉంది మరియు అందువల్ల చాలామంది భయపడతారు.


 అతని పుట్టినప్పటి నుండి మరియు అతని మరణం వరకు, శ్రీకృష్ణుడు సంఖ్య 8 గురించి సూక్ష్మమైన సూచనలను వదలివేసాడు;  లెక్కిస్తూ ఉండండి...


 1. అతను విష్ణువు యొక్క 8వ అవతారం.


 2. అతను దేవకి మరియు వసుదేవులకు 8వ సంతానం.


 3. అతను కృష్ణ పక్షం (క్షీణిస్తున్న చంద్రుడు) 8 వ రోజు (అష్టమి) నాడు జన్మించాడు.


 4. కృష్ణ భగవానుడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో జన్మించాడు, ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క ఎనిమిదవ నెల.


 5. శ్రీ కృష్ణుడు తన జీవితంలో ఎనిమిది మంది ప్రధాన భార్యలను కలిగి ఉన్నాడు (అష్టభార్య): రుఖ్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, సత్య, భద్ర & లక్ష్మణ.


 6. శ్రీ కృష్ణుడు దుష్ట నరకాసురునిచే బందీగా ఉంచబడిన 16100 (1+6+1+0+0= ఎనిమిది) రాణుల (గోపికలు-కృష్ణుని భక్తులు-స్త్రీలు) ప్రాణాలను రక్షించాడు.


 7. ఆధునిక చరిత్రకారులు మరియు అధ్యయనాల ప్రకారం, శ్రీ కృష్ణుడు దాదాపు 125 (1+2+5=8) సంవత్సరాలు, 8 నెలలు మరియు 8 రోజులు భూమిపై ఉన్నాడు.


 8. భగవద్గీత 4వ అధ్యాయంలోని 8వ శ్లోకం ఈ గొప్ప జ్ఞాన పుస్తకం నుండి చాలా తరచుగా పునరావృతమయ్యే పంక్తులు:

 పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే !!!

 (సత్పురుషుల రక్షణ కొరకు, దుష్టుల నాశనము కొరకు, ధర్మ స్థాపన కొరకు నేను ప్రతి యుగములోను జన్మిస్తాను.)


 9. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ఎనిమిది రకాల తీపి పదార్థాలు (భోగ్) అందించబడ్డాయి.


 10. అతను చంద్రునితో సంబంధం ఉన్న రోహిణి నక్షత్రంలో జన్మించాడు మరియు అతను చంద్ర వంశంలో మరియు అర్ధరాత్రి జన్మించాడు.  అతని చిన్ననాటి ప్రియురాలు మరియు గొప్ప భక్తురాలు శ్రీమతి రాధారాణి శుక్ల అష్టమి (8వ చంద్రుని వృద్ధి చెందుతున్న చంద్రుని రోజు) నాడు జన్మించారు.


 11. శ్రీమతి రాధారాణి ఎనిమిది మంది ప్రధాన గోపికలను అష్టశకిలుగా పిలుస్తారు: లలిత, విశాఖ, సిత్ర, ఇందులేఖ, కంపకలత, రంగ-దేవి, సుదేవి మరియు తుంగవిద్య.


 12. నాటకంలో 8 రసాలు లేదా భావోద్వేగాలు ఉన్నాయి (ప్రేమ, హాస్యం, విచారం, కోపం, ధైర్యం, భయం, భయానక మరియు అద్భుతం).  శ్రీకృష్ణుడు రాస్లీలాకు అధిపతి.


 13. యోగా శాస్త్రంలో ఎనిమిది అవయవాలు, అష్టాంగ యోగం లేదా ఎనిమిది అవయవాల యోగా ఉన్నాయి.  అష్టాంగ యోగం పూర్తి యోగాగా పరిగణించబడుతుంది మరియు శ్రీ కృష్ణుడిని యోగిరాజ్ అని పిలుస్తారు.


 14. శ్రీ కృష్ణ భగవానుడికి నమస్కారము యొక్క ఉత్తమ రూపం ఎనిమిది రెట్లు నమస్కారం (అష్టాంగ నమకస్కారం) గా పరిగణించబడుతుంది.


 15. రాధా (విశాఖ నక్షత్రం) నక్షత్రంలో 3 డిగ్రీల వృశ్చిక రాశిలో చంద్రుడు క్షీణిస్తాడు.  అనురాధ నక్షత్రం (శ్రీమతి రాధారాణి జన్మ నక్షత్రం అశ్విని నుండి 17వది = 1+7 = 8 మళ్ళీ).


 16. కృష్ణుడు 89 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు (8+9 = 17 = ఎనిమిది);  మెగా యుద్ధం (కురుక్షేత్ర యుద్ధం) జరిగింది.


 17. 7 రోజుల పాటు భారీ వర్షపు తుఫానుల నుండి బ్రజ్ ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన్ పర్వతాన్ని తన చిటికెన వేలికి గొడుగులా ఎత్తాడు.  8వ రోజు భారీ వర్షం ఆగింది.  కృష్ణుడు చిన్నతనంలో రోజూ 8 చిన్న భోజనం చేసేవాడు మరియు 7 రోజులు కురిసిన వర్షంలో అతని వద్ద ముద్ద కూడా లేదు, కాబట్టి బ్రజ్ గ్రామస్థులు కృతజ్ఞతా చిహ్నంగా గోపాల కృష్ణకు 56 (7 రోజులు X 8 భోజనం) అందించారు.  వివిధ రకాల ఆహారాన్ని నైవేద్యంగా 'చప్పన్ భోగ్' అని పిలుస్తారు.


 18. చివరగా, కృష్ణ అవగాహన మరియు స్పృహ అష్ట వికారాలను అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది: కామం, పశ్చాత్తాపం, క్రోధం, భయంకరమైన పాలించలేని కామం, నిర్లక్ష్యం, ఆడంబరం, అహంకారం & అసూయ.

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం.......!!

 గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం.......!!


సూర్య దోషం తొలగడానికి : ఆదివారం 

మనం స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు గాని ఎర్రటి పూలు గాని ఆ బకెట్లో కొంచెం వేసి స్నానం చేసుకుంటే సూర్య దోషం తగ్గుతుంది


చంద్ర దోషం తొలగడానికి: సోమవారం


నీటిలో కొంచెం పాలు కానీ లేక పెరుగు గాని వేసుకుని స్నానం చేస్తే చంద్ర దోషం తగ్గుతుంది


కుజదోషం తొలగడానికి: మంగళవారం


నీటిలో బిల్వ ఆకులను గాని బిల్వ ఆకు పొడిని గాని వేసి స్నానం చేస్తే కుజదోషం తగ్గుతుంది


బుదదోషం తొలగడానికి: బుధవారం


నీటిలో సముద్రపు నీరు గానీ గంగా నది నీరు గాని లేక రాళ్ల ఉప్పు గాని వేసి స్నానం చేస్తే బుధ దోషం తగ్గుతుంది


గురు దోషం తొలగడానికి: గురువారం


నల్ల యాలకులను నీటిలో ఉడికించి వాటిని మనం స్నానం చేసే నీటిలో పోసి స్నానం చేస్తే గురు దోషం తగ్గుతుంది


శుక్ర దోషం తొలగడానికి: శుక్రవారం


యాలకులను నీటిలో ఉడికించి ఆ ఉడికించిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శుక్ర దోషం తగ్గుతుంది


శని దోషం తొలగడానికి: శనివారం


నీటిలో నల్ల నువ్వులను నేటి స్నానం చేస్తే శని దోషం తగ్గుతుంది


రాహు దోషం తొలగడానికి: శనివారం


(మహి షాసి, అనేది సామ్రాణి ఇది నాటు మందు షాపులో దొరుకుతుంది )ఈ మహిషా సి పొడిచేసి నీటిలో ఉడకబెట్టి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే రాహు దోషం తగ్గుతుంది


కేతు దోషం తొలగడానికి: మంగళవారం


గరిక (గడ్డి) నీ ఉడకబెట్టి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కేతు గ్రహ దోషం తగ్గుతుంది

పైన చెప్పిన విధంగా ఆయా రోజుల్లో స్నానాన్ని ఆచరించి గ్రహ దోషాలను తగ్గించుకోవాలి.

మానవ జీవితం పైన గ్రహాల ప్రభావం...........!!

మానవ జీవితం పైన గ్రహాల ప్రభావం...........!!

మనిషి ఆకారాన్ని బట్టి, మాట్లాడే తీరును బట్టి, ప్రవర్తించే తీరుని బట్టి ఏ గ్రహం ఆ సమయంలో అతనిపైన పనిచేస్తోందో తెలుసుకోవచ్చు. అలాగే జాతకంలోని బలీయమైన గ్రహాన్ని కూడా వెంటనే తెలుసుకోవచ్చు. తరువాత జాతకాన్ని పరిశీలిస్తే ఇది నిజం కావటం జరుగుతుంది. దీని ద్వారా కొన్ని ఆశ్చర్య పరిచే విషయాలు తెలుస్తాయి.

గ్రహాల ప్రభావాలు స్థూలం గా ఇక్కడ ఇస్తున్నాను. ఇవన్నీ జ్యోతిష గ్రందాలనుంచి సేకరించబడినవి, మరియు నా అనుభవంలో అనేకసార్లు నిజాలుగా రుజువు అయినవి.

 సూర్యుడు - అధికారం చెలాయించటం, ఉన్నతులమని భావించటం మాత్రమె కాక అలాగే ప్రవర్తించటం, నాయకత్వ లక్షణాలు, పదిమందిలో తేలికగా గుర్తింపు ఉంటే వారు సూర్యుని ప్రభావం లో వారు.

>పూర్ణ చంద్రుడు- మృదు స్వభావం, జాలిపడే తత్త్వం, సహాయ పడే తత్వం, మానవ సంబంధాలు.

>క్షీణ చంద్రుడు-ఏదీ తేల్చుకోలేని ఊగిసలాట ధోరణి, బలహీన మనస్తత్వం, పిచ్చి ధోరణి, విపరీత ఆలోచనలు.

>బుధుడు-తెలివి తేటలు, బహుముఖ ప్రజ్న,హాస్య చతురత, కలుపుగోలు తనం.

>కుజుడు-ధైర్యం, దురుసుతనం, కయ్యానికి కాలుదువ్వటం,సాహసం, మొండి పట్టుదల.

>గురువు- ధార్మిక మనస్తత్వం, మంచితనం, సహాయపడే గుణం, అడ్డదారులు తొక్కని మనస్తత్వం, ముక్కుసూటితనం.

>శుక్రుడు-అందం, విలాసాలు, జల్సాలు, కళా కౌశలం , ఖరీదైన జీవితం .

>శని- కాయకష్టం చెయ్యటం, సోమరితనం, అశుభ్రం గా ఉండటం, పిరికితనం, చొరవ లేకపోవటం.

>రాహు- మోసం, ఇతరుల సొమ్ము ఆశించటం, కుట్రలు, దౌర్జన్యాలు, సంప్రదాయాన్ని ప్రశ్నించటం, ఎదురు తిరగటం, వృధాగా తిప్పట, కాళ్ళరిగేలా తిరిగే ఉద్యోగాలు, అతి వాగుడు, గమ్యం లేని జీవితాలు గడపటం .

>కేతు-చాప కింద నీరులాంటి మనస్తత్వం, పిరికి ఆధ్యాత్మికత, మెట్ట వేదాంతము, ప్రమాదకర కుట్రలు చెయ్యటం, లేక ముచ్చు లాంటి ప్రవర్తన.

ఇక రెండు మూడు గ్రహాల కలయికలో ఆయా గుణాల సమ్మిలిత ప్రభావం మనిషి మీద ఉంటుంది. ఆయా గ్రహాల దశలు జరిగేటప్పుడు పైన చెప్పిన లక్షణాలు ఎక్కువగా కనిపించటం, ఆలోచనలు అలాంటివే కలగటం, ప్రవర్తనలు కూడా అలాగే ఉండటం చూడవచ్చు.

కొందరు మనుషులను చూస్తె వారిలో కొన్ని గ్రహాల మూర్తీభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇంకొందరి ప్రవర్తన చూస్తె వారికి ఏ దశ జరుగుతున్నదో అంచనా వెయ్యవచ్చు. అంతే కాదు కొన్నికొన్ని శరీరభాగాల తీరును బట్టి కొన్ని గ్రహాల ప్రభావం చాలావరకూ అంచనా వెయ్యవచ్చు.

ఉదాహరణకు...... ఎత్తుపళ్ళు ఉన్నవారికి రాహువు రెండవభావంలో ఉండటం చాలా జాతకాల్లో చూచాను.అంతేకాక పిల్లికళ్లు ఉన్నవారిమీద రాహు/కేతువుల ప్రభావం ఉండటం వారి మాటలలో చేతలలో గమనించవచ్చు. అలాగే ఒక కాలు కుంటివారికి ఎక్కువగా శనిగ్రహప్రభావం ఉండటం గమనించాను.అలాగే బట్టతల ఉన్నవారి మీద శని రాహుగ్రహాల ప్రభావం అమితంగా ఉండటం చూడవచ్చు. 

పొట్టిగా బొద్దుగా ఉన్నవారిమీద బుధ గ్రహప్రభావం ఉంటుంది.అవకాశ వాదులు అతిగా వాగే వారిమీద బుధ రాహుగ్రహాల ప్రభావం ఉంటుంది. అలాగే మొండిపిల్లలు,క్రమశిక్షణ లేని పిల్లల మీద రాహు,కుజుల ప్రభావం ఉంటుంది.ఇవన్నీ గ్రంధాలలో సూటిగా చెప్ప బడకపోయినా,అన్యాపదేశంగా చెప్పబడ్డాయి.నా పరిశీలనలో ఇవన్నీ నిజాలు కావటం గమనించాను.

తెల్లగా అందంగా ఉన్నవారు ఎక్కువగా వృషభ,తులాలగ్నాలలో పుట్టటం గమనించవచ్చు.అలాగే కురూపుల మీద కేతు ప్రభావం ఉండటం చూడవచ్చు. వయసుకంటే ఎక్కువ ముసలివారిగా కనిపించేవారి మీద శని ప్రభావం, సాంప్రదాయ మతవాదులు,వేషభాషలలో ఆచారపరుల మీద గురుప్రభావం జాతకంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.దురుసుగా ప్రవర్తించేవారు,రౌడీలు ఇటువంటి జాతకాలలో కుజ/రాహువుల పాత్ర కనిపిస్తుంది.నాటక,సినీ రంగాల వారిమీద శుక్ర/రాహు ప్రభావం ఉంటుంది.

ఆయా వ్యక్తుల మీద ఆయాగ్రహాల ప్రభావం,జాతకంలో ప్రముఖ గ్రహ పరంగానూ(అది లగ్నం అధిపతిగా కావచ్చు,లేదా ఆత్మ కారకునిగా కావచ్చు, లేదా బలీయమైన గ్రహంగా కావచ్చు) లేదా అప్పుడు నడుస్తున్న దశ/అంతర్దశల పరంగానూ ఉంటుంది.

ఈ విధంగా పరిశీలన జరిపెకొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ, మనిషిని చూట్టంతోనే, అతని జాతకంలో ముఖ్యవిషయాలు మనసుకు స్పురించటం మొదలౌతుంది. అలాగే అతనికి అప్పుడు జరుగుతున్న దశ చూచాయగా తెలియటం జరుగుతుంది.ఇలా నాకు చాలా సార్లు జరిగింది.త్వరలో మీకు ఫలానా సంఘటన జరుగుతుంది అని మనసుకు తోచటం,అవి చెప్పటం,అవే సంఘటనలు జరగటం కూడా చాలాసార్లు జరిగింది.

అయితే జాగ్రత్తగా ఉండమని మనం చెప్పినప్పటికీ వారు వాటిని తప్పించుకోలేక పోవటం ఎక్కువసార్లు జరిగింది. దీనికి కారణం నూటికి తొంభై పాళ్ళు ఆయా వ్యక్తుల నిర్లక్ష్యధోరణి మాత్రమె కారణం అవుతుంది. కర్మ బలీయంగా ఉన్నపుడు, మనల్ని పరిహారాలు చెయ్యనివ్వదు.అంతేకాక ఆ వ్యక్తి మీద రకరకాలుగా పనిచేసి ఆ కర్మను అనుభవించేటట్టు చేస్తుంది. ఏలాగంటే, నిర్లక్ష్యధోరణి,అహంకారం, లేదా వీడికేమి తెలుసులే అనే తిరస్కార ధోరణి,జరిగేది జరుగక మానదు అనే నిరాశాపూరిత ధోరణి,పరిహారాలు మొదలు పెట్టి మధ్యలో వదిలెయ్యటం ఇలా రకరకాలుగా మనిషి మీద పనిచేసి మొత్తానికి రేమేడీలు చెయ్యలేకపోవటం,ఆ కర్మను అనుభవించటం చేయిస్తుంది.అంతేకాక మాట తీరు, ప్రవర్తనను బట్టి వారి జాతకంలో ఉన్న దోషాలు మనస్సుకు స్పురించటం కూడా జరుగుతుంది.

ఇదెలా జరుగుతుంది? అంటే నాకు తెలిసి ఒక కారణం కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన డాక్టరుకు రోగిని చూడటంతోనే ఒక ఊహ వస్తుంది. ఇతనికి రక్తహీనత ఉంది, లేదా బీపీ ఉండవచ్చు,లేదా గుండెజబ్బు ఉండవచ్చు ఇత్యాదిగా ప్రాధమికంగా ఎలాగైతే ఒక అవగాహన కలిగి తరువాత ప్రశ్నల ద్వారా పరీక్షల ద్వారా ఆ ఊహను నిజమా కాదా నిర్థారించుకుంటారో, అలాగే జ్యోతిర్విజ్ఞానంలో కూడా జరుగుతుంది.

ఏళ్ళతరబడి మనకు ఈ విధమైన విశ్లేషణ అలవాటు అయినప్పుడు, మన అన్తఃచ్చేతనలో మనకు తెలీకుండానే కొన్నిరకాల ఆలోచనా విధానాలు (thought patterns)తయారై ఉంటాయి. అవి అలవాటు మీద, కొన్నికొన్ని పరిస్థితులలో వాటంతట అవే ఉత్తెజితాలై మనకు కొంత సమాచారాన్ని అందిస్తాయి.దాన్నే మనం స్ఫురణ అని అనుకుంటాము.అంటే సమాచారం మనకు తెలీకుండానే ఒక రూపాన్ని సంతరించుకొని మనకు స్పురించటం జరుగుతుంది. ఆయా ఆలోచనల మధ్యన సంక్లిష్ట సమీకరణాలు మనకు తెలీని అన్తఃచ్చేతనలో జరిగి ఫలితం మాత్రం పైకి ఉబికి ఉపరితలానికి వస్తుంది. ఇదెలా ఉంటుందంటే కంప్యూటరు క్లిష్టమైన లెక్కలను లోపల్లోపల చేసి ఫలితాన్ని మాత్రం తెరమీద చూపినట్లు ఉంటుంది.

కొంతమందిని చూచి మీది ఫలానాలగ్నం లేదా ఫలానా నక్షత్రం అవునా అని అడిగితే వారు ఆశ్చర్యపోయి నిజమే మీకెలా తెలుసు అని అనటం నాకు చాలా సార్లు జరిగింది. కొన్ని సార్లు ఫెయిల్ కూడా అయ్యాను.కాని చాలాసార్లు సరిగ్గా జరిగినపుడు తప్పకుండా వీటికి ఏవో లింకులు ఉన్నాయి, ఇది మనకు అర్థం కాక పోయినా ఒక గొప్ప శాస్త్రమే అని అనిపించక మానదు.

దీనివల్ల ఇంకొక లాభం కూడా ఉంది. ఈ విధమైన పరిశీలన అలవాటైతే, మనిషికి బోరు అనేది ఉండదు. దానికి తోడూ లోతైన పరిశీలనాశక్తి అలవాటు అవుతుంది.మనుషుల మధ్యన ఉండికూడా, మౌనంగా ఉంటూ, ఏ పుస్తకాలు, టీవీలు,సెల్ ఫోన్లు లేకుండానే బోరు అనేది లేకుండా ఉండటం అలవాటు అవుతుంది.

ఇంకొంచెం అనుభవం మీద, అతి దగ్గిరలో జరుగబోయే విషయాలు స్పురించటం చాలాసార్లు జరిగింది. ఫలానా వ్యక్తి మీద ఫలానా గ్రహం ప్రభావం ఉంది అని తెలిసినపుడు, త్వరలో ఆ గ్రహానికి గోచారరీత్యా పట్టబోతున్న అవస్త మనకు తెలుసు గనుక ఈవ్యక్తికి కూడా అదే అవస్త పడుతుంది అని అనిపించటం అలాగే జరగటం చాలాసార్లు జరిగింది.

ఉదాహరణకు....... గురుగ్రహ ప్రభావంలో ఉన్న వ్యక్తికి గురువు నీచలో ఉన్నపుడు, నీచజీవితం గడపటం,మంచికి పొతే చెడు ఎదురు కావటం, అనుకున్న పనులు జరుగకపోవటం ఊహించి చెప్పాను.ప్రస్తుతం అవే జరుగుతూ ఆ వ్యక్తిని నన్నూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీన్నే కొంచెం పొడిగించి,గ్రహంయొక్క, అతిచార, స్తంభన, వక్ర,అస్తన్గత,గ్రహయుద్ధ, ఉచ్చ,నీచ స్థితులను గమనిస్తూ పోతే ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ఈ గ్రహస్థితులకు వ్యక్తుల జీవితంలో జరిగే సంఘటనలకు ఖచ్చితమైన సంబంధం కనిపించింది.

ఇదే రీజనింగును ఇంకొంచం పొడిగించి, కొన్నికొన్నిసార్లు ఫలానా రోజు నీకు ఈ సంఘటనా జరుగవచ్చు అని చెప్పటం అదే జరగటం కూడా జరిగింది. కొన్ని సార్లు ఫెయిల్ అవటం కూడా అయింది. కాని ఫెయిల్ అయినపుడు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే కొన్ని కొత్త విషయాలు అర్థం అయ్యాయి. ఆ గ్రహానికి గల ఒక కారకత్వానికి సంబంధించిన సంఘటన జరుగవచ్చు అని మనం అనుకుంటే ఇంకో కారకత్వానికి సంబంధించిన సంఘటన జరిగింది. కాని ఆ గ్రహ కారకత్వాన్ని దాటి ఇంకో గ్రహ కారకత్వానికి సంబంధించిన సంఘటన మాత్రం జరుగలేదు. అంటే చాలావరకూ విశ్లేషణ సరిగ్గా ఉన్నప్పటికీ సూక్ష్మ స్థాయిలలో ఇంకా పరిపూర్ణత రాలేదు అని అర్థం అయింది. 

ఉదాహరణకు.... ఒక వ్యక్తి కుజ గ్రహ పరిధిలో ఉన్నపుడు, గోచారరీత్యా శనిగ్రహ ప్రభావం కుజుని మీద పడుతుంది అనుకున్న రోజున లేదా ఆ పీరియడ్ లో ప్రమాదం జరుగవచ్చు అని చెప్పాం అనుకుందాం.ఆ సమయంలో ప్రమాదం జరుగకుండా,ఎవరితోనో గొడవ జరగటం,తద్వారా దెబ్బలు తగలటం,రక్త దర్శనం కలగటం జరుగుతుంది.ప్రమాదంలో కూడా రక్తదర్శనం జరుగవచ్చు, లేదా గొడవలో కూడా జరుగవచ్చు, లేదా పొరపాటున ఏ వేలో కోసుకొని కూడా జరుగవచ్చు.వీటిలోని సూక్ష్మభేదాలు పట్టుకోవటం,అంచనా వెయ్యటం కష్టం.రక్తం కళ్ళచూడటం జరుగుతుంది అనిచెబితే అది సరిగానే జరుగుతుంది.


Sunday, July 30, 2023

*వత్తులు , ప్రాముఖ్యత* ....!!



*వత్తులు , ప్రాముఖ్యత* ....!!


1 ) ఒక వత్తి : సామాన్య శుభం
2 ) రెండు వత్తులు : కుటుంబ సౌఖ్యం
3 ) మూడు వత్తులు : పుత్ర సుఖం

4 ) ఐదు వత్తులు : ధనం , సౌఖ్యం , ఆరోగ్యం ,

ఆయుర్ధాయం , అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము .

 *దీపారాధన విధానం* 

 *1 ) నెయ్యి*: 

నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును .

*2) నువ్వుల నూనె* : 

నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును .

*3 ) ఆముదం* : 

ఆముదముతో దీపారాధన చేసిన , దేదీప్యమానమగు జీవితం , బంధుమిత్రుల శుభం , దాంపత్య సుఖం వృద్ధియగును .

*4 ) వేరుశెనగ నూనె* :

వేరుశెనగనూనెతో దీపారాధన చేసి నిత్య ఋణములు , దుఖం , చోర భయం , పీడలు

మొదలగునవి జరుగును .

 *5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , యిలప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన , వారికి దేవీ అనుగ్రహం కలుగును* .

*6 ) వేపనూనె , నెయ్యి , యిలపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగును* .

 *7 ) ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి జరుగంటలలోపు చేసిన సర్వరుభములు , శాంతి కలుగును* .

🌹దీపాల యొక్క దిక్కుల ఫలితములు:- 🌹

🌸1 ) తూర్పు : 

కష్టములు తొలగును , గ్రహదోషములు పోదురు ,

🪷 2 ) పశ్చిమ : 

అప్పుల బాధలు , గ్రహదోషములు , శనిదోషములు తొలగును ,

🌸 3 ) దక్షిణం : 

ఈ దిక్కున దీపము వెలిగించరాదు కుటుంబమునకు కష్టము కలును ,

🪷 4 ) ఉత్తరం : 

ధనాభివృద్ధి , కుటుంబములో శుభకార్యములు జరుగును .


🌷దీప వత్తుల యొక్క ఫలితములు : ....🌷

🌸1)పత్తి:-

పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును .

🪷 2 ) అరటినార :-

ఆరటి నారతో దీపము వెలిగించినదో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును .

🌸 3 ) జిల్లేడినార:- 

జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత , ప్రేత , పిశాల బాధలు ఉండవు ,

🪷4 ) తామర నార :-

పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును . ధనవంతు లగుదురు .

🌸5 ) నూతన పసుపు వస్త్రము :-

అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు

🪷 6)నూతన ఎరుపు వస్త్రము :- పెళ్ళిళ్ళు అగును , గొడ్రాలికి సంతానము కల్గును

🌸7 ) నూతన తెల్ల వస్త్రము :-
పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును , సాయంత్ర సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును.

అభిజిత్ లగ్నం అంటే?

అభిజిత్ లగ్నం అంటే?


అభిజిత్ అనేది కాంతిలేని నక్షత్రం. పురాణాల్లో దీని వెనుక ఓ ఆసక్తికర కథ కూడా ఉంది.

అందరూ టక్కున చెప్పే సమాధానం ఇరవై ఏడు అని. కానీ అభిజిత్ అనే ఓ నక్షత్రం ఉందనీ, దానికి కొంత ప్రత్యేకత ఉందని ఎంతమందికి తెలుసు?

#ఆ విశేషాలేమిటో మనం తెలుసుకుందాం….

అభిజిత్ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు. అంటే కాంతిలేనిదన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు…. అనేక నక్షత్రాల సమూహం.

వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్వని, భరణి ..... అంటూ పేర్లు నిర్ణయించారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం, శ్రవణా నక్షత్రంలోని మొదటి 15ఘడియలు కలిపి అభిజిత్ నక్షత్రం గా చెప్పబడింది. ఇది లక్ష్మీనారాయణాత్మకమైనది. ఉత్తరాషాఢ మహాలక్ష్మీ సంబంధం. శ్రవణం నారాయణ సంబంధం. అందుచేతనే ఇది విజయప్రదమని పేరు. మధ్యాహ్నం లో సూర్యోదయాదో నాలుగవ లగ్నం అభిజిత్ అని అంటారు.

 ఈ నక్షత్రం వెనుక ఓ పురాణ కథ ఉంది అదేంటో మనం తెలుసుకుందాం….

మనకున్న 27 నక్షత్రాలనూ దక్షప్రజాపతి కుమార్తెలుగా చెబుతారు. దక్షుడు వీరిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.

అందరికన్నా రోహిణి మీదే చంద్రుడికి ప్రేమ ఎక్కువ. ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి తండ్రి దగ్గరకు వెళ్లింది.

శ్రవణా నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు. అది 28వ నక్షత్రంగా ఏర్పడింది.

ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది. సర్వ దోషాలనూ పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది.

ప్రతి రోజూ ఈ నక్షత్రానికి సంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు. ఆ వివరాలు చూద్దాం….

ఈ పదం ఒకప్పుడు పల్లెటూళ్లకు కొత్త కాదు. కాలంమారింది కాబట్టి ఇప్పుడది అంతగా వినపడటం లేదు. అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్లలో అలా పిలిచేవారు. గడ్డపలుగును భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డ పలుగు ముహూర్తం అనేవారు. అంటే మిట్టమధ్యాహ్నం అన్నమాట.

ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని, ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం.

ప్రస్తుతం రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో జరుగుతున్న భూమిపూజను ఈ అభిజిత్ లగ్నంలోనే చేశారంటే దీనికున్న ప్రాధాన్యం ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు.

ఈ ముహూర్తం మధ్యాహ్నం 11-45 నుండి 12-30 వరకు ఉంటుంది.

ఈ ముహూర్తం లోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు.

ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం ప్రారంభించారు.

ఈ శుభ ముహూర్తం లోనే ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు.

శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం… ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి.

ఈ ముహూర్తంలో పెళ్ళి జరిగింది కాబట్టి ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా, ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు.

ఇంకా ఈ ముహూర్తానికి సంబంధించి మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది.

దక్షిణం యమస్థానం కాబట్టి బుధవారం మాత్రం ఆ దిక్కుకు వెళ్లరాదని నారద సంహిత పేర్కొంది.

అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదని పేర్కొంది. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. 

ఆ నక్షత్రాధిపతుల సమయంలో ఈ అభిజిత్ ముహూర్తం వస్తే మాత్రం దక్షిణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్రయాణం చేయవచ్చు. సూర్యుడు చీకటిని ఎలా పారదోలతాడో అలా సర్వదోషాలనూ ఈ ముహూర్తం హరించి వేస్తుందని వశిష్ఠ సంహిత పేర్కొంది. ముహూర్త వల్లరి అనే గ్రంథం మాత్రం అభిజిత్ ముహూర్తం కేవలం ప్రయాణాలకే తప్ప ఇతర కార్యాలకు పనికిరాదని అంటోంది. ఈ లగ్నంలో వివాహం చేస్తే నష్టమని బ్రహ్మ శపించినట్లు నారద సంహిత పేర్కొంది. ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అభిజిత్ లగ్నం ఉపనయనానికి తప్ప వివాహాది సమస్త శుభకార్యాలకు ఇది శ్రేష్టం.

సర్వశ్రేయోదాయకమని అనేక గ్రంథాలు 
పేర్కొన్నాయి.

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS