Tuesday, February 26, 2019

కుజగ్రహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

కుజగ్రహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
కుజుడు సామాన్యునిలో ఉత్తేజాన్ని, హంతకునిలో హింసను, బాలునిలో భయాన్ని, ప్రేమికునిలో రక్తిని, కార్మికునిలో శ్రమశక్తిని ఉత్తేజపరుస్తుంది.
కుజదోషాన్ని పూర్వం ఆడవారికి మాత్రమే చూసేవారు. కుజుడు ప్రధమ భావంలో జలరాశిలో ఉంటే స్త్రీ లోలుడు, మద్యపాన ఆశక్తి కలవాడు అవుతాడు.
కుజుడు షష్ఠం లో ఉంటే తొందరగా, హడావుడిగా మాట్లాడతారు. జాతకంలో కుజుడు దోషి అయినప్పుడే అతనికి దోషం అవుతుంది. యోగ కారకుడైన కుజదృష్టి గుణప్రదమే అవుతుంది.
మకరరాశిలో సూర్య, చంద్రులు ఉండి కుజ ప్రభావం ఉంటే మోకాలు సమీపంలో అనారోగ్యాలు గాని దెబ్బలు గాని తగిలే అవకాశాలు ఉన్నాయి.
శిరస్సుకు కారకుడైన కుజుడు పాపగ్రహ ప్రభావానికి లోనయితే శిరస్సుపై దెబ్బలుంటాయి. కుజుడు లగ్నం నుండి ఏ భావంలో ఉన్నాడో చూసి ఆ భావానికి సంబందించిన శరీర స్దానంలో కాని అతడున్నరాశికి చెందిన శరీరభాగంలో గాని చిహ్నం ఉంటుంది. శరీరంలో దక్షిణ భాగంలో పుట్టుమచ్చ లేదా చిహ్నమునకు కుజుడు కారకుడు.
కుజుడు వెనుక నుండి ఉదయిస్తాడు కావున కుజగ్రహ ప్రధానుడైన వ్యక్తి ఎదుటి వారి మాటలను మరోకోణంలో ఆలోచిస్తాడు.
కుజుడు శని లగ్నంలో ఉండగా ఈ స్ధానం పై గోచార రవి సంచారం చేస్తున్నప్పుడు దుర్ఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి.
కుజుడు, శుక్రులు కలసి ద్వితీయంలో ఉంటే యుక్త వయస్సులోనే పళ్ళు ఉడిపోవటం, పుచ్చిపోవటం జరుగుతుంది.
కుజుడు వ్యయంలో ఉంటే ఋణాను బంధాలను తీర్చుకోవటానికి మళ్ళీ మానవ జన్మ ఎత్తుతారు.
చంద్రాత్ కేంద్రగతే భౌమే యోగో మంగళ కారకః
మంగళాఖ్యే సరోజాతః నిత్య శ్రీర్నిత్య మంగళం
ఈ శ్లోకం ఆదారంగా చంద్రునకు సప్తమ కేంద్రంలో కుజుడు ఉన్నప్పుడు చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఇట్టి యోగమున్న జాతకులకు కుజదోషం ఉండదు. ఈ యోగ జాతకులు నిత్య లక్ష్మీ కటాక్షం ఉన్నవారుగా, నిత్యం శుభములు పొందేవారుగా ఉంటారు.
గురు మంగళ సంయోగే కుజదోషోనవిద్యతే
చంద్ర మంగళ సంయోగే కుజదోషోనవిద్యతే
శుక్లపక్ష చంద్రుడితో కుజుడు కలసి ఉన్న, కుజునిపై గురుదృష్టి ఉన్న కుజదోషం ఉండదు.
కుజదోషం ఉన్న వారిని కుజదోషం ఉన్న వారికే ఇచ్చి వివాహాం చేయాలనుకోవటం వల్ల దోషం పరిహారం కాదు. ఒక దోషం ఒక జాతకంలో ఉన్నప్పుడూ పరిహారాలు చేసుకోవటం శాస్త్రీయం. దోషం గల మరియొక జాతకునితో వివాహాం చేయటం వలన దోషం బలపడుతుండే గాని దోషం నశించదు. దోష నివారణకు వైధవ్య దోష పరిహారకములైన వ్రతాదులు చేసుకోవలయును.
దర్మశాస్త్రాలు కూడ వైధవ్య యోగాదులకు శాంతి విధానాలనే బోధిస్తున్నాయి. విశిష్టమైన జ్యోతిష్య గ్రంధాలలో కూడ ఒక జాతకమందలి ఒక దుష్టయోగం మరియొక శుభయోగం వలనే పరిహారం అవుతాయని భోదిస్తున్నాయి. తప్ప ఒక జాతకము నందలి దుష్టయోగం మరియొక జాతకమందలి దుష్టయోగం చేత పరిహారింపబడుటలేదు. గాంధారికి వైధవ్యయోగం ఉందన్న కారణం చేత ధర్మ శాస్త్ర విహితమైన మార్గంలో ఆ దోషాన్ని తొలగించి వివాహాం చేశారని భారత సారం అనే గ్రంధం తెలుపుతుంది.
జాతకమందలి వైధవ్య యోగం ఉన్నప్పుడు సావిత్రీ వ్రతం గాని, పిప్పల వ్రతం గాని చేయించి జాతకంలో దీర్ఘాయువు గల వరునితో వివాహం చేయాలి.

శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం

శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.
పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.
శ్రీశైలంలో  ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.
శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

Saturday, February 23, 2019

*మహా శివునికి ముగ్గురు కుమార్తెలు.....*

* *మహా శివునికి ముగ్గురు కుమార్తెలు.....* మహా శివునికి ముగ్గురు కుమార్తెలు.....*
కార్తికేయ, వినాయకుడు, అయ్యప్ప.. ఈ ముగ్గురూ.. శివుడి కొడుకులని మనందరికి తెలుసు. కానీ శివుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని..చాలా తక్కువ మందికి మాత్రమే.. తెలుసు. అసలు శివుడికి కూతుళ్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడా ఎక్కువ ప్రస్తావించలేదు ?
శివుడి కొడుకులు అయినంత ఫేమస్ కూతుళ్లు ఎందుకు కాలేదు. శివుడి ముగ్గురు కూతుళ్లను, కొడుకులను పూజించినట్టు ఎందుకు పూజించడం లేదు. అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు.
అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో.. శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శిడుకి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. అసలు వాళ్లు ఎలా జన్మించారు ? ఎప్పుడు పుట్టారు ? ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం
శివ పుత్రికలు శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు.
1. అశోక సుందరి...
పార్వతి దేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం.. అశోక సుందరిని సృష్టించారు.
పద్మపురాణం....
పద్మ పురాణంలో.. అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తీగా వివరించారు. గుజరాత్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా.. అశోక సుందరి వచ్చింది. ఈమెను పార్వతిదేవి సృష్టించింది.
పేరులోని అర్థం ....
అశోక అంటే పార్వతీదేవి శోకం, బాధను తగ్గించడం అని, సుందరి అంటే.. అందమైన అని అర్థం.
వినాయకుడి తల ...
శివుడు వినాయకుడి తల నరికేసినప్పుడు.. భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని.. ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా.. జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్ లో పూజిస్తారు.
2. జ్యోతి ....
ఈమె పార్వతి దేవి తలలో వచ్చిన మెరుపు, శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెబుతున్నాయి.
దేవత ...
జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతికగా భావిస్తారు. ఈమె మాత్రం శివుడు, పార్వతి.. ఇద్దరి శారీరక వ్యక్తీకరణం ద్వారా జన్మించిందని చెబుతారు. మరొకటి పార్వతిదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెబుతారు.
పూజించడం ....
జ్యోతి దేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి.. జ్వాలాముఖిగా పూజిస్తారు.
3. మానస
శివుడి వీర్యం పాముల తల్లి కాడ్రు విగ్రహానికి తగలడం వల్ల.. పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు. పార్వతి కూతురు కాదని వివరిస్తాయి.
వాసుకి సోదరి ....
వాసుకి సోదరి మానస అని.. బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. వాసుకి అంటే.. పాముల రాజు.
కోపం, సంతోషం లేకపోవడం ....
తన తండ్రి, భర్త, పార్వతి దేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం, సంతోషం లేకుండా.. ఉంటుందని.. కథలు ఉన్నాయి.
పూజించడం ....
మానసను.. బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను.. ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు. ఎందుకంటే.. ఆ సమయంలో పాములు యాక్టివ్ గా ఉంటాయి. అలాగే.. ఈమె పాము కాటు, ఇన్ఫెక్షన్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు.

అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?

"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "
- అంటే అర్ధం తెలుసా???
SUN'DAY
MO(O)N'DAY
TUESDAY
WEDNESDAY
THURSDAY
FRIDAY
SATUR(N)DAY
- అంటే ఏమిటో తెలుసా?
అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?
వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?
సూర్యహోర
చంద్రహోర
కుజహోర
బుధహోర
గురుహోర
శుక్రహోర
శనిహోర - అంటే తెలుసా?
ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగమని తెలుసా?
ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారని తెలుసా???
తెలియదా!? సరే... ఇప్పుడైనా తెలుసుకుందాం! రండి!
ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి!
వారము - అంటే 'సారి' అని అర్ధము.
1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!
కాస్త విపులంగా....
భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే. ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.
#మందా_మరేడ్య_భూపుత్ర_సూర్య_శుక్ర_బుధేందవః
అనగా... పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇవి కేవలం మూఢ విశ్వాసమా?
ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల(హిందువుల) విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.
భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.
ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. ఆ భాగాలను వారు "హోర" అన్నారు.
"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా, [H ఎందుకు Silent అయిందో తెలిసిందా???] మార్చి, పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.
హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.
ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే, మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.
మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది కనుక ఆ రోజు - మంగళవారం,
ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.
ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.
అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, క్రైస్తవ, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది! అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. వస్తున్నా... అక్కడికే వస్తున్నా...
ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో, ఆగ్రహం పేరే - ఆదిత్యుడు, అనగా మొదటివాడు.
అదే మొదటిరోజు, అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.
ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది. అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.
ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మీ, క్రాస్ బ్రీడులారా! వారాల పేర్లు బైబిల్ లో ఇమడవు కదా! మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ? పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు??? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీసెయ్యడానికి కుదరలేదు... అదిరా... భారతీయ ఋషుల గొప్పదనం! నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప బైబిల్ లో ఉండే చెత్త లాంటిది కాదు! కబడ్దార్!!!
వీకీపీడియాలో బ్రిటిష్ వారు ఏ విధంగా వీటిని స్వంతం చేసుకున్నారో, బైబిల్ పిట్టకథలకి ఏవిధంగా ఆపాదించుకున్నారో ఈ లింక్ ద్వారా తెలుసుకోండి!
https://en.m.wikipedia.at-is-the-origin-of-indian-weekday-names
మన భారతీయులు ఇలాంటివేవీ వాడలేదా? వాడితే ఎప్పుడు వాడారు? ఎలా వాడారు? లాంటి ప్రశ్నోత్తరాల వెబ్ సైట్ లోకి వెళ్లి చూడొచ్చు. లింక్:
https://history.stackexchange.com/questions/5878/what-is-the-origin-of-indian-weekday-names
ప్రపంచంలో హిందువుల క్యాలెండర్ మాత్రమే శాస్త్రీయమైనదని తెలిపే విదేశీయుడు NICLAS MARIE నడిపే వెబ్ సైట్ - చూడండి!
https://m.timecenter.com/articles/brief-history-of-the-hindu-calendar-by-timecenter/
(Niclas Marie is the founder and CEO of TimeCenter Online Scheduling and lives in Helsingborg, Sweden. He loves to code beautiful and simple web apps, and occasionally enjoys a game of blitz chess.)
ధన్యవాదాలు .
CHALAM HINDUSTANI.

ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు...

ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు...

                     ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగించడంలో యోగాసనాలు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి. అయితే యోగ సాధనకు కాల నియమం ఉంది. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళలలోనే ఆసనాలను అభ్యాసం చేస్తారు. అయితే యోగ ముద్రలకు కాలనియమం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ ముద్రలను సాధన చేయవచ్చు. చేతి వేళ్లు, అరికాళ్లలో మన శరీరంలోని నాడులన్నింటికీ కేంద్ర స్థానాలు ఉంటాయి. ఇందులో మన శరీరానికి అరచేయి ప్రాతినిధ్యం వహిస్తుంది. అనగా మన చేతి వేళ్ల ద్వారా మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించుకోవచ్చు. మన చేతి వేళ్లు అయిదూ పంచభూతాల్లో ఒక్కో తత్త్వానికి సంకేతం.
            చిటికెన వేలు జలతత్త్వం, ఉంగరపు వేలు పృధ్వీతత్త్వం, బొటనవేలు అగ్నితత్త్వం, ఇలా ఒక్కోవేలు ఒక తత్త్వాన్ని సూచిస్తుంది. చేతి కొసల మధ్యలో, కణుపుల వద్ద, మూలాలలో బొటనవేలితో కలపడం లేదా దగ్గరగా ఉంచడం వలన ఎన్నో ముద్రలు తయారవుతాయి. ఈ ముద్రల సాధన చేయడం వలన ఒక్కోరకమైన ఫలితం వస్తుంది. మనిషి రుగ్మతను బట్టి ఆయా తత్త్వలను నియంత్రించడం యోగ ముద్రలతో సాధ్యపడుతుంది. వీటిని సాధన చేసే కొద్ది వీటి ప్రయోజనాలు అనుభవంలోకి వస్తాయి. వాటిలో కొన్ని సులభమైన ముద్రలను ఇప్పుడు చూద్దాం...
1. జ్ఞాన ముద్ర (నాలెడ్జి సీల్‌) : బొటను వేలు చూపుడు వేలు కలిపి గట్టిగా ఒత్తాలి. మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర మనోశక్తిని, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. కోపాన్ని నియంత్రిస్తుంది. ఈ ముద్ర పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. దీని వలన అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇలా చేస్తే మైగ్రేన్‌ తలనొప్పికి కూడా ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే మానసిక గందరగోళం విడిపోయి స్థిరమైన ఆలోచనలు సిద్ధిస్తాయి.
2. వాయు ముద్ర (విండ్‌ సీల్‌) : బొటన వేలును కొద్దిగా వాల్చి చూపుడు వేలును సున్నా ఆకారంలో మడవాలి. ఈ ముద్ర వలన శరీరంలోని వృధా వాయువులను బయటకు పంపుతుంది. గ్యాస్‌, ఛాతినొప్పి నివారిస్తుంది. పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది.
3. శూన్య ముద్ర (జీరో సీల్‌) : మధ్యవేలుతో బొటను వేలును గట్టిగా బంధించాలి. మిగిలిన మూడు వేళ్ళు నిటారుగా ఉంచాలి. ఈ ముద్రతో చెవిపోటు తగ్గుతుంది. ఉన్నట్టుండి తలతిరగడాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్‌ సమస్యలను నయ్యం చేస్తుంది. ఇది క్రమశిక్షణ మరియు ఓర్పును పెంచుతుంది. చెముడు మరియు చెవికి సంబంధించిన రుగ్మతను తగ్గిస్తుంది. బద్దకాన్ని నివారిస్తుంది. రెండు మూడు రోజులు చేస్తే ఫలితం ఉండదు రెగ్యులర్‌గా చేయాలి.
4. ఆపాన ముధ్ర (డిసెంమ్‌డింగ్‌ ఎనర్జీ సీల్‌) : మధ్యవేలు, ఉంగరం వేలు రెండు బొటనవేలు అంచుని తాకేలా చేయాలి. చిటికెన వేలు చూపుడు వేలు లాగిపెట్టాలి. కలిసిన మూడు వేళ్ళ మధ్య వత్తిడి కలిగించాలి. ప్రోస్టేట్‌, మోనోపోజ్‌ సమస్యలను ఇది బాగా తగ్గిస్తుంది. శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు విసర్జించేందుకు సహాయపడుతుంది. మూత్ర సమస్యలు తొలగిపోతాయి. మధుమేహాన్ని కూడా నివారిస్తుంది.
5. ఆపాన వాయు ముధ్ర (డిసెండింగ్‌ విండ్‌ సీల్‌) : వాయు ముద్రలాంటిదే ఇది కూడా. చిటికెన వేలు తప్ప మిగిలిన నాలుగు వేళ్లను చివరి అంచులతో బంధించాలి. ఈ ముద్ర హృదయ సంబంధిత తీవ్రతను తగ్గిస్తుంది. జీర్ణకోస సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
6. పృద్వీ ముద్ర (ఎర్త్‌ సీల్‌) : ఉంగరం వేలు బొటనవేలు అంచులు కలిపి ఒత్తిడి కలిగించాలి. మిగిలిన మూడు వేళ్ళు ఆకాశం వైపు చూస్తుండాలి. ఈ ముద్ర మానసిక ఆందోళనలను తగ్గిస్తుంది. అధిక బరువవును తగ్గించడమే కాదు భవిషత్తులో బరువు పెరగకుండా కూడా చేస్తుంది. శరీర బలహీనతను పోగొడుతుంది. చర్మకాంతిని పెంచుతుంది. ఓర్పును పెంచుతుంది. ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది.
7. సూర్య ముద్ర (సన్‌ సీల్‌) : బొటన వేలు, ఉంగరం వేలు రెండూ మడవాలి. మిగిలిన మూడు వేళ్ళు నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర కనుక రెగ్యులర్‌గా చేస్తే మానసిక నిగ్రహం పెరుగుతుంది. అధిక ఒత్తిళ్ల వల్ల వచ్చే మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ పెరగకుండా కాపాడుతుంది.
8. శక్తి ముద్ర (డిటర్‌ ఎనర్జీ సీల్‌) : చివరి రెండు వేళ్ళను బొటను వేలితో కలపాలి. మిగిలిన రెండు వేళ్ళను ఒకదానితో ఒకటి తాకుతుండాలి. శక్తి ముద్ర అన్నిటికంటే శక్తివంతమైనది. జీవన సామర్థ్యాన్ని పెంచుతుంది. దృష్టి లోపాన్ని సరిచేస్తూనే కంటి చూపుని మెరుగుపరుస్తుంది.
9. వరుణ ముద్ర (వాటర్‌ సీల్‌) : బొటన వేలు, చివరి వేలు కలిపితే వరుణ ముద్ర. మిగిలిన మూడు వేళ్ళను ఒకదానికి ఒకటి తాకకుండా కాస్త ఎడంగా ఉంచాలి. ఈ ముద్ర వలన కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది. ప్రోస్టెడ్‌ సమస్యలు తగ్గిపోతాయి. రాత్రిళ్ళు పక్క తడిపే అలవాటు కూడా తగ్గుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అందాన్ని పెంచుతుంది. కండరాలు ముడతలు పడకుండా కాపాడుతుంది.
10. బ్రహ్మ ముద్ర : రెండు చేతుల బొటన వేళ్లనూ మడిచి, మిగతా నాలుగు వేళ్లనూ దాని మీదుగా మడవాలి. ఆ తర్వాత రెండు చేతులనూ దగ్గరికి నాభి ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే రక్తపోటు సమస్యల్ని నియంత్రిస్తుంది.
11. ఆది ముద్ర : బొటన వేలును మడిచి, మిగతా నాలుగు వేళ్లనూ బొటనవేలు మీద ఉంచాలి. దీనివల్ల జ్ఞానేంద్రియాలకు ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. మనసుకు ఉత్సాహాన్నిస్తుంది. రక్తపోటు తక్కువ ఉన్నవారు ఈ ముద్ర జోలికి వెళ్లకపోవడం మంచిది.
12. లింగ ముద్ర : అన్ని వేళ్లనూ ఒకదానితో ఒకటి పెనవేసి కుడిచేతి బొటనవేలిని మాత్రం పైకి ఉంచాలి. కుడిచేతి బొటనవేలిని మాత్రం పైకి ఉంచాలి. ఈ ముద్ర జలుబు, రొంప తదితర అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఊపిరితిత్తులను బలపరుస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది.
అందుకే మీ చేతి వేళ్ళలో ఏ రెండు వేళ్లను కలిపినా మీ శరీరంలో ఏదో ఒక భాగం ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం ఈ ముద్రలు వేస్తే ఆరోగ్యంగా ఉంటామనుకోకండి. పోషక ఆహారం తీసుకుంటూ, చక్కటి వ్యాయామం చేస్తూ, ఈ ముద్రలు వేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది

శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా , ఘంటానాదం విన్నారా ?

శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,

ఘంటానాదం విన్నారా ?
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొనే భక్తులెవరైనా ఆలయం గర్భ గుడిలో ఘంట వేలాడ దీయ బడి ఉండటం కాని, లేక అర్చకులు ఘంటా నాదం తో స్వామికి అర్చన చేయటం కానీ చూశారా ? భలే ప్రశ్న వేశావయ్యా ? అసలే తొడ తొక్కిడి ముందూ వెనకా ఒకటే తోపుడు, జనరద్దీ అక్కడి బెత్తంగాళ్ళు (వేత్ర హస్తులు )శీఘ్రం శీఘ్రం అంటూ అరవం లో ,పోండా,పోండా అంటూ తెలుగులో మువ్, మువ్ క్విక్లీ, అంటూ ఆంగ్లం లో మమ్మల్ని తోసేస్తుంటే క్షణకాలమైనా దర్శనం చేసుకోనివ్వకుండా ఉంటే, ఘంట ఉందొ ,మోగించారో లేదో ఎవడు చూశాడు? ఎప్పుడు బయట పడదామా అనే ఆరాటమే తప్ప అని కొందరు ,ఆహా! ఆహా !ఏమి దివ్య దర్శనం !ఆ దివ్య సుందర మంగళ స్వరూపుని కనులారా గాంచి ఆ పంగనామాలయ్యను చూస్తూ పరవశిస్తుంటే ఘంటో ,పంటో మీద దృష్టి ఉంటుందా అని కొందరూ అనవచ్చు .కాని దుర్భిణీ పెట్టి వెతికినా ,చెవులకు స్పీకర్లు పెట్టుకొని విన్నా గర్భాలయం లో ఘంట కనిపించదు ఘంటా నాదం విని పించదు. ఇదేం విడ్డూరం అయ్యా బాబూ అసలు ఘంట లేకుండా గుడి ఉంటుందా ,ఘంటానాదం లేకుండా అర్చన ఉంటుందా ?అంటారా ? .అసలు ఘంట ఉంటే కదా కనపడటానికి , మోగిస్తే కదా వినిపించటానికి ?నువ్వేదో మోకాలి చిప్పకూ బట్టతలకు ముడి పెట్టే వాడివిగా కనిపిస్తున్నావు అని నన్ను అంటారు కదూ – నిజమండి బాబూ –ఆ బాలాజీ మీద ఒట్టు . ఈ ఒట్లూ, పట్లూమాకెందుకుగాని అసలు విషయమేమిటో నాన్చకుండా చెప్పవయ్యా అంటారా –ఇదిగో చెబుతాను జాగ్రత్తగా వినండి . శ్రీ వారి ఘంట ను ఒకావిడ మింగేసిందయ్యా బాబూ. ’ఎన్నాపైత్యకారీ!ఘంటమింగటం ఏమిటయ్యా అదీ ఆడకూతురు అంటున్నావ్ . నమ్మ మంటావా ?లేక నిమ్మకాయ నెత్తిన మర్దన చేయమంటావా ? అదేమీ అక్కర్లేదు కానీ ‘’నిఝ౦ గా నిజమయ్యా ‘’బాపు రమణల భాషలో . టెన్షన్ తట్టుకోలేకున్నాం అసలు విషయం చెప్పవయ్యా అంటారా –ఇదిగో చెప్పేస్తున్నా చెప్పేస్తున్నాఆ కథ చెప్పేస్తున్నా –
శ్రీ వైష్ణవ లేక విశిష్టాద్వైత సంప్రదాయం లో శ్రీ వేదాంత దేశికులు అని గొప్ప కవి వందకు పైగా గ్రంధాలు సంస్కృత తమిళభాషలో రచించిన మహా వేదాంతి ఉన్నారు .ఆయన క్రీ. శ. 1268 -1369 కాలం లో ఉన్నారు . 101 సంవత్సరాలు సార్ధక జీవనం గడిపి విశిష్టాద్వైత మత వ్యాప్తికి కృషి చేసినవారు ,నిజమైన దేశికోత్తములు .అసలు పేరు వెంకట నాధుడు .కంచి దగ్గర అన్మించి కంచి ,శ్రీరంగ౦ లలో తమ ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి ,భగవద్రామానుజులు నియమించిన 74 శ్రీ భాష్య సి౦హాసనాధిపతులలో ఒకరైన వ్రాత్యవరదుల వారి శిష్యులు .
దేశికులవారి తండ్రి అనంతసూరి .తల్లి తోతాద్ర్యమ్మ లేక తోతాద్ర్య౦బ . శ్రీ వారి ఘంటను మింగిన మహా తల్లి ఈవిడే-అంటే దేశికులవారి తల్లిగారే . మళ్ళీ మధ్యలో సస్పెంసేమిటి ?అనకండి .ఈ దంపతులకు పెళ్లి అయిన 12 ఏళ్ళ దాకా సంతానం కలగలేదు .ఒక రోజు స్వప్నం లో దంపతులకు ఇద్దరికీ విడివిడిగా శ్రీనివాస ,పద్మావతీ దంపతులు ప్రత్యక్షమై ,తిరుమలకు వచ్చి తమ దర్శనం చేసుకొంటే పుత్రుడు జన్మిస్తాడు అని ఆనతిచ్చారు . అంతకంటే కావాల్సిందేముంది? దానికోసమే కదా ఇన్నేళ్ళ ఎదురు చూపు .తిరుమల యాత్ర చేసి పద్మావతీ శ్రీనివాస దర్శం చేసి ,మానసిక ఆనందాన్ని పొందుతారు అనంత సూరి తోతాత్ర్యంబ దంపతులు . ఆరాత్రి తిరుమల శ్రీనివాసుడు చిన్నరి వైష్ణవ బాలుడి రూపం లో తోతాత్ర్యంబ కు కలలో కనిపించి ,శ్రీ వారి ఆరాధనలో వినియోగించే’’ ఘంట’’ను ఆమె చేతిలో పెట్టి మింగమని ఆదేశించాడు .తన ఆజ్నను పాటించ గానే పుత్ర సంతానం కలుగుతుందని అభయమి చ్చి ,ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు .ఆమె భక్తి తో దాన్ని మహా ప్రసాదంగా పటిక బెల్లం ముక్క లా భావించి గుటుక్కున మింగేసింది .
శ్రీ వారి ఆలయ అర్చకులు ప్రభాత వేళ ఆలయం తెరచి చూస్తే ఘంట కనిపించలేదు .ధర్మకర్తలు అర్చకులను అనుమానిస్తారు .అప్పుడు శ్రీనివాసుడు ప్రధాన అర్చకుని లో ‘’ఆవేశించి’’ ఎవ్వరినీ అనుమాని౦చవద్దనీ,తానే ఒక ఒక పుణ్య స్త్రీకి ఆశీర్వాదం గా ఆ ఘంట ను ప్రసాది౦చానని చెప్పాడు .అందరూ సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు .
శ్రీ వారి ఘంట ను కలలో మింగినామె అంటే తోతాత్ర్యంబ క్రీ .శ .1268 లో ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది .శ్రీనివాస వర ప్రసాది కనుక అ బాలుడికి ‘’వేంకట నాథుడు’’ అని నామకరణం చేశారు .ఆయనే వేదాంత దేశికులై విరాజిల్లారు .కనుక వేదాంత దేశికులను శ్రీ వేంకటేశ్వరుని ‘’ఘంటావతారం’’గా భావిస్తారు .ఘంటానాదం అసుర శక్తులను తరిమేస్తుంది .’’సంకల్ప సూర్యోదయం’’ అనే తమ గ్రంథం లో దేశికులు ఈ విషయాన్ని నిక్షిప్తం చేశారు –‘’ఉత్ప్రేక్ష్యతే బుధ జనై రుపపత్తి భూమ్నా –ఘంటా హరేః సమజ నిష్ట యదాత్మనేతి ‘’
అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయం లో గంట లేదు, అర్చనలో ఘంటా నాదం ఉండదు .గర్భాలయం బయట వ్రేలాడే పెద్ద ఘంట ను మాత్రమే వినియోగిస్తారు .ఇదండీ బాబూ అసలు విషయం . 
అలాగే ”ముకుందమాల ”రచించిన కులశేఖర ఆళ్వార్ తాను భక్తుల పాద ధూళితో పవిత్రమై శ్రీవారి గర్భ గుడి వాకిట ”గడప”గా ఉండాలని కోరుకుని అలాగే అయ్యారు .దాన్ని కులశేఖర గడప అంటారు . 
ఆధారం –శ్రీమతి శ్రీదేవీ మురళీధర్ తాను అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో వివరణాత్మకంగా,సమగ్రంగా రిసెర్చ్ గ్రంథంలాగా రచించి ఆదరంగా ‘’వేదాంత దేశికులు ‘’ గ్రంథం .

Friday, February 15, 2019

దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా ?

దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా ?
మనిషికి దేవుడు ఉన్నాడా లేడా , ఒకవేళ ఉన్నా కూడా నా భక్తికి ప్రసన్నుడై దేవుడు సాక్షాత్కరిస్తాడా అనే సందేహం తరచుగా మదిని తొలుస్తూనే ఉంటుంది . మనలానే దేవునికి కూడా ఇన్ని జీవరాశులలో ప్రత్యేకంగా సృష్టించిన మానవులకు జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చాను కదా,ఏ మానవుడైన మనఃపూర్వకమైన భక్తితో , ఆర్తితో నన్ను చూడాలని పరితపించే భక్తుడు ఒక్కడైన ఉన్నాడా అని నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటాడు .
దేవుని కరుణకు అవధులు లేవు . ఆయన కృపకు అందరూ పాత్రులే అయితే ఆ పాత్రత మనలో ఉండాలి అంతే . రాక్షసుడైన ప్రహ్లాదుని భక్తికి మెచ్చి నరసింహ అవతరందాల్చి హిరణ్యకసపుని కడతేర్చిన వృతాంతం మనకు సుపరిచితమే .
అయినా అవన్నీ ఎప్పుడో కృత యుగం లో జరిగిన సంగతి కదా అంటారా . శ్రీ రాముడు త్రేతా యుగం లోనూ , శ్రీ కృష్ణుడు  ద్వాపర యుగం లోనూ అవతరించారు ప్రస్తుత కలియుగంలో అటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా ?  అటువంటి భక్తుని కోసం దేవదేవుడు అవతరించిన వృతాంతం ఏదైనా ఉందా ? ఒక ఆలయానికి యుగాల నాటి చరిత్ర తప్పకుండా ఉండాలా , కనీసం ఆ ఆలయం కొన్ని వేల సంవత్సరాలో , వందల సంవత్సరాల చరిత్ర అయినా ఉండాలా ? ఆ భక్తునికి భగవంతుడు సాక్షాత్కరించాడు అనడానికి ఆధారాలు ఏవైనా ఉన్నాయా ? ఆ భక్తుని స్వామి వారి అనుగ్రహం కలుగుతుండగా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా , ముఖ్యంగా నాస్తికులు , హేతువాదులు , అన్యమతస్థులు ప్రత్యక్షంగా చూసి , వాటిని నమ్మి అంగీకరించిన సంఘటనలు ఉన్నాయా ?
పైన చెప్పిన వాటికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది ఈ భక్తుని వృతాంతం . దీన్ని కధ అనడం లేదు ఎందుకంటే ఇది యదార్ధ గాధ కనుక .
అది 1889 వ సంవత్సరం .  విశాఖ పట్టణము జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావెల్లి గ్రామములో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం, రామమ్మ దంపతులు ధార్మికంగా జీవనం సాగిస్తుండేవారు.వారికి దేవుని యందు భక్తి ప్రపత్తులు మెండు.ఆ పుణ్య దంపతులకు 1889 ఏప్రిల్ 4వ తేదీన దేవుని అనుగ్రహం వలన ఒక మగబిడ్డ జన్మించాడు.ఆ బాలునికి నరసింహం అని నామకరణం చేశారు తల్లిదండ్రులు . ఆ అబ్బాయికి కూడా తల్లిదండ్రుల లానే  చిన్నతనంనుంచే దైవ భక్తి చాలా ఎక్కువ.భగవన్నామస్మరణ , కీర్తనలు , భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే చాలా ఇష్టం . జీవనోపాధికి తన కుల వృత్తి స్వీకరించి ఆభరణాలు తాయారు చేయడంలో సిద్ధహస్తులయ్యారు . ఏ పని చేస్తున్నా అతని జిహ్వ భగవన్నామస్మరణ చేయడంలో ఉత్సహించేది అందులోనే సేద తీరేది . ఆయనకు పండరీపురం విఠలునిపై యెనలేని భక్తి ఉండేది .
తన 18వ ఏట బందరు జిల్లా చిలకలపూడి గ్రామానికి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు నరసింహం గారి తల్లిదండ్రులు . అప్పటికే ఆభరణాల తయారీలో ఆరితేరిన నరసింహం గారు బంగారు పూతతో తాయారు చేసే నకిలీ నగలు తాయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు . ఆయన కనిపెట్టిన విధానమే నేటికి ( రోల్డ్ గోల్డ్ , ఉమా గోల్డ్ , గిల్టు నగలు , 1 గ్రాము గోల్డ్ ) అమములో ఉంది . వాటికి ఆధ్యులు నరసింహం గారే .
గురువు అనుగ్రహం :
జీవితంలో ఏదైనా సంపాదించవచ్చు కానీ గురువు అనుగ్రహం పొందటం అంత తేలిక కాదు . గురువంటే మన అజ్ఞానాన్ని తొలగించి , తగిన ఉపదేశమిచ్చి , నిత్యానిత్య వివేకమును కలిగించి , న్మార్గంలో ప్రవేశింపజేసి , గమ్యాన్ని తెలిపి , ఆ గమ్యాన్ని చేరుకోవడంలో పడే ప్రయాసల నుండి రక్షించి చివరి వరకు వెన్నంటి ఉండే భగవంతుని రూపమే. నరసింహం గారి జీవితంలో అటువంటి గురువు దర్శన భాగ్యం , అనుగ్రహం కలిగి ఆయన జీవిత గమ్యాన్ని నిర్దేశించిన సంఘటన పండరీపురంలో జరిగింది . నరసింహంగారు ఒకసారి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహీపతి గూండా మహరాజ్ అనే గురువుగారి దర్శనమయింది. ఆయన నరసింహంగారికి పాండురంగోపాసన విధానం తెలిపి శ్రీ విఠ్ఠల మంత్రముతో తులసిమాల ప్రసాదించారు. కొంతకాలం తరువాత శ్రీ విఠ్ఠల మహామంత్ర రాజమునుకూడా ఉపదేశించారు.
నరసింహం గారు తరచుగా పండరీ యాత్ర చేసి గురువు గారిని దర్శించుకునే వారు . 1929 వ సంవత్సరంలో ఆయన పండరీ పురం వెళ్ళినప్పుడు మహీపతి గుండా మహారాజ్ గారు " నీవు తరచుగా పండరీ యాత్ర చేస్తున్నావు కదా , నీకు ఈ పండరీ నాధుని వృతాంతం తెలుసునా ? " అని అడిగారు . నరసింహం గారు " తెలుసును గురువు గారు , పండరీనాధుడైన విఠలు తన భక్తుడైన పాండురంగని కోసం అతని ఇంట్లో వెలిసారని సమాధానమిచ్చారు .
మరి నీవు కూడా ఆ పండరీనాధుని భక్తుడవు నీకోసం స్వామి వారు అక్కడే సాక్షాత్కరిస్తారు కదా ఇంత దూరం రావడం దేనికీ ? అని ప్రశ్నించారు . తరువాత ఇలా అన్నారు " ఇక నీవు పండరీ యాత్ర చేయవలసిన అవసరం లేదు , నీకోసం స్వామి వారే నీ ఊరిలోనే వేలుస్తారు . అక్కడే ఆలయం నిర్మించి కొలుస్తూ ఉండు అని చెప్పారు .
స్వామి వారి మాటలు విని విస్మయమొందిన నరసింహం గారు గురువు గారి అనుగ్రహంతో ఆలయం నిర్మించాలని నిశ్చయించుకుని చంద్రభాగా నది ( పండరీపురంలో ప్రవహించే నది ) లోని కొన్ని రాళ్ళను తీసుకువెళ్ళి శంకుస్థాపన చేస్తున్న సమయంలో వాటిని అక్కడ ప్రతిష్టించాలని అనుకున్నారు . కానీ చంద్రభాగానది ఆ సమయంలో మహా
ఉధృతంగా ప్రవహిస్తూ, ఈతగాళ్ళుకూడా నదినుండి రాళ్ళు తియ్యలేని పరిస్ధితిగా వున్నది. అప్పుడు నరసింహంగారు చంద్రభాగను ప్రార్ధించగా పుండరీక దేవాలయము పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది.
నరసింహంగారు పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో ఒక చిన్న గుండురాయి దొరికింది. వాటన్నింటినీ పాండురంగని ముందుంచి, నరసింహంగారు, వారి గురువుగారు ప్రార్ధనా తన్మయత్వంలో వుండగా పాండురంగనినుంచి ఒక జ్యోతి ఆ గుండ్రని రాయిలో ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగడు నరసింహంగారి కలలో సాక్షాత్కరించి, కీర పండరీక్షేత్రములో శ్రీ శుక్లనామ సంవత్సరం, కార్తీక శుధ్ధ ఏకాదశి బుధవారం (13-11-1929) పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహంగారు సంతోషంగా తిరిగివచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
కొంతకాలం తర్వాత గురువుగారైన మహీపతి మహరాజ్ గారికి పాండురంగడు స్వప్న దర్శనమిచ్చి నీశిష్యునికోసం తాను తెలిపిన రోజున కీర పండరిపురంలో సాక్షాత్కరిస్తానని తెలుపగా వారు లేఖద్వారా నరసింహంగారికి ఈ విషయం తెలియజేశారు. పాండురంగని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణము పూర్తయినది. పాండురంగని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విశేషం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.
గర్భ గుడికి తాళం :
ఆ రోజు రానే వచ్చింది , అందరూ ఎంతో  ఉత్కంటగా ఎదురుచూసే సమయం అది . స్వామి వారు నిజంగానే ప్రత్యక్షమవుతారా ? ఈ కలికాలంలో ఇది సాధ్యమేనా ? నరసింహం గారు నిజంగానే అంతటి భక్తులా ?ఇలా ఎన్నో సందేహాలు . అప్పటి పాలకులైన బ్రిటీషు వాళ్ళు , నాస్తుకులు , హేతువాదులు ఈ విషయాన్ని నమ్మలేదు . అప్పటి బ్రిటిషు అధికారి ఆలయపు గర్భ గుడిని మూయించి , తాళం వేసి , బయట బందోబస్తును పెట్టించి , స్వామి వారు రావడం బూటకం అని నిరుపించాలనుకున్నాడు . 
ఆంజనేయ స్వామి అభయం :
ఆంజనేయస్వామి ఆలయంలో ఆయనను ప్రార్ధిస్తూ తన్మయావస్తలో వుండగా ఆంజనేయుడు ఆయనకి ఆభయమిచ్చాడుట.. పన్నెండు గంటలయ్యేసరికి శ్రీ పాండురంగడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి స్ధాపిస్తానని .
పగలు పదిన్నర అయింది:
ఉన్నట్లుంది ఆకాశం బ్రద్ధలవుతున్నాట్లు పెద్ద శబ్దం . ఉరుములు మెరుపులతో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది వాతావరణం . అంతలో గర్భ గుడిలో ఒక పెద్ద చప్పుడు పిడుగు పడినట్లు అనిపించింది .  దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులు తీయటానికెంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భక్త నరసింహంగారు అనేక ప్రార్ధనలు చేయగా తలుపులు తెరువబడి దివ్య తేజస్సులమధ్య పాండురంగని విగ్రహ సాక్షాత్కరించింది. మూడు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహము పండరీపురములోని పాండురంగని విగ్రహమువలెనున్నది. చల్లని చిరుజల్లు కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది.
నాస్తికులు ముక్కున వేలేసుకుని , తమ నాస్తిక వాదం వదిలి పాండురంగడి పాదాక్రాంతులయ్యారు . ఆ బ్రిటిషు అధికారి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి స్వామి వారి భక్తుడయ్యాడు . ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటనగా ఆలయ చరిత్రలో లిఖించారు .
ఆ పండరీనాధుడే ఇక్కడ ఆయన భక్తుడైన నరసింహం గారి కోసం వెలిసారని వేయినోళ్ళ కొనియాడారు.పండరీపురంలో లాగానే ఇక్కడ కుడా భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదములు తాకి నమస్కరించవచ్చు.
తదుపరి భక్త నరసింహంగారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞము తలబెట్టగా భారతావనిలో అనేకమంది ఈ యజ్ఞములో పాల్గొని శ్రీ విఠలనామమును వ్రాశారు. ఆ పుస్తకములన్నియు తగు పూజావిధానముతో ఆలయప్రాంగణములోని విఠల్ కోటి స్ధూపములో నిక్షిప్తంగావించబడ్డాయి.
శ్రీ పాండురంగని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహంగారికి అభయమొసగిన ఆంజనేయస్వామి ఆలయం వున్నది. ప్రక్కనే వేరొక ఆలయంలో సహస్ర లింగ కైలాస మంటపము విరాజిల్లుతుంటే ఇంకొకపక్క రాధ, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు వేరొక ఆలయము నిర్మింపబడ్డది. ఆరు ఎకరాల స్ధలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయాలకు చుట్టూ భక్త మందిరాలు..వాటిలోనే షిర్డీ సాయిబాబా మందిరం..దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వధ్ధ వృక్షము, దానికింద చిన్న సిధ్ధేశ్వరాలయము. 400 ఏళ్ళ పైనుంచి వున్న ఈ అశ్వధ్ధ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలంనుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ వున్నారనీ, భక్త నరసింహంగారికి ఆయన దర్శనమిచ్చారనీ అంటారు.
భగవంతుడు భక్త సులభుడు అని మరొకసారి నిరూపించిన నరసిహంగారు 16-1-1974 సంవత్సరంలో పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరంనుంచి విద్యుత్కాంతిలాంటి వెలుగు వెలువడి పాండురంగనిలో ఐక్యమందటం, సహస్రలింగ మంటపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేకమంది చూశారంటారు.
దేవాలయ నిర్మాణ సమయంలోనే పాండురంగని ఆజ్ఞ ప్రకారం మహా మండపమునందు సమాధి నిర్మించి దానిమీద ఒక రాయి పరచి వుంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ వుంచమన్నారు. ఆవిధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్ధాపించారు.
ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేము కట్టించి ఆలయంలో సందర్శకులకోసం వుంచారు. శ్రీ నరసింహంగారి మనుమలు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.
సముద్ర తీరంలో వున్న ఈ ఆలయానికి, ఆషాఢ, కార్తీక
మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రంనుంచే కాక ఒరిస్సానుంచికూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఆలయం ఇప్పటికీ భక్త నరసింహంగారి సంతతివారిచేతే నిర్వహించబడుతున్నది. కృష్ణాజిల్లా ముఖ్యపట్టణమైన చిలకలపూడిలో వున్న ఈ ఆలయం చేరుకోవటానికి వివిధ ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. విజయవాడకి 82 కి.మీ. ల దూరంలో వున్నది.
భక్తుని కోసం భగవంతుడు వెలసిన నిదర్శనాలు ఎన్నో మన సనాతన ధర్మంలో ఉన్నాయి .
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

అందరం  " ఓం నమో నారాయణాయ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహానికి  పాత్రులమవుదాం ...
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ

జై శ్రీ కృష్ణ
బొబ్బిలికి చెందిన ఓ విశ్వకర్మ కుటుంబం గురించి, వారు వలస వెళ్ళి బందరు దగ్గర చిలకలపూడి లో పాండురంగ స్వామి గుడి కట్టించడం, రోల్డ్ గోల్డ్ నగలు తయారి ఎలా మొదలైంది, వివరిస్తూ, ఓ కులేతరుడు (నా SBI మిత్రుడు) వ్రాశాడు.  జాతిని గౌరవించాడు.  తప్పక చదివి అభిప్రాయం వ్యక్తం చేయండి.

నవగ్రహ దోషములు- పరిహారాలు - నవగ్రహ మంత్రములు

నవగ్రహ దోషములు- పరిహారాలు - నవగ్రహ  మంత్రములు
మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబం ధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విము క్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివా రు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు.
సూర్యుడు: ఎవరి జాతకంలో అయితే రవి బల హీనంగా ఉంటా డో వారికి అనారోగ్య ము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధు లు, తండ్రి తరుపు బంధు వులతో పడకపోవు ట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపో వుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొ నేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమ స్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పా రాయణం, గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారప దార్థ ములు దానం చేయు ట. తండ్రి గారిని లేదా తండ్రితో సమా నమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.
చంద్రుడు: చంద్రుడు జాతక చక్రంలో బల హీనంగా ఉన్నప్పుడు మనస్సు నిలకడగా లే పోవుట, భయం, అనుమానం, విద్యలో అభి వృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరో గ్యం సరిగా లేకపోవుట, స్ర్తీలతో విరోధము, మాన సిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టకపో వుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కు వగా ఉండుట, స్ర్తీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి, చంద్ర గ్రహ అను గ్రహం కొరకు మాతృ సమానమైన స్ర్తీలను గౌరవించుట, బియ్యం దానం చేయుట, పా లు, మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం, శివునికి ఆవుపాలతో అభిషే కం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుట మొదలగు వాటి ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహానికి పాత్రులు అయి అభివృద్ధి చెందుతారు.
కుజుడు: జాతకచక్రంలో కుజు డు బలహీనంగా ఉం డడం వల్ల ధైర్యం లేక పోవుట, అన్న దమ్ము లతో సఖ్యత నశించుట, భూమికి సంబంధిం చిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధిం పులు అప్పులు తీరకపోవుట, ఋణదా తల నుండి ఒత్తిడి, రక్త సంబంధించిన వ్యాధులు, శృంగారంనందు ఆసక్తి లేకపోవడం, కండరా ల బలహీనత, రక్తహీనత సమస్యలను ఎదు ర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలు గుచున్నప్పుడు కుజ గ్రహ దోషముగా గుర్తిం చి కుజ గ్రహాను గ్రహం కొరకు సుబ్రహ్మ ణ్యస్వామి, ఆంజనే య స్వామి వారిని పూజిం చాలి. అలాగే హను మాన్‌ చాలీసా పారాయ ణం, కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం, అన్న దమ్ములకు సహాయం చేయడం, వారి మాట లకు విలువ ఇవ్వడం, స్ర్తీలు ఎర్రని కుంకుమ, ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి.
బుధుడు: జాతక చక్రంలో బుధుడు బలహీ నంతగా ఉన్నట్లయితే.. నరాల బలహీనత, జ్ఞా పకశక్తి లేకపోవటం, చదువులో అభివృద్ధి లేక పోవడం, నత్తిగా మాట్లాడడం, వ్యాపారాల్లో నష్టాలు, సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తెలివితేటలు లేకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అనుమానం, తరుచూ ధననష్టం మొదలగునవి జరుగు చున్నప్పుడు బుధ గ్రహ దోషంగా గుర్తించి.. బుధ గ్రహానుగ్రహం కొరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, వేంక టేశ్వరస్వామి వారిని, విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించుట, వారికి సంబంధించిన క్షేత్రాలను దర్శించుట, ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి ఆహారంగా ఇచ్చుట, పెసలు దానం చేయుట, విద్యార్థు లకు పుస్తకాలను దానం చేయట వలన బుధుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.
గురువు: జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, ని యంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బం దులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతా లు చేసి నా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరా యణ చేయడం, గురువుల ను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శిం చుట, శనగలు దా నం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.
శుక్రుడు: జాతకంలో శుక్రుడు బలహీనము గా ఉన్నప్పుడు స్ర్తీలకు అనారోగ్యము కలుగు ట. వాహన సౌఖ్యము లేకపోవుట. భార్యా భ ర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట. వ్యసనము ల యందు ఆసక్తి, వివాహం ఆలస్యం అగుట, కిడ్నీ వ్యాధులు, వ్యభిచారం, మత్తుపానీయాలు సేవించుట, కుటుంబంలోని స్ర్తీలకు అనారో గ్యము సరిగా లేనప్పుడు శుక్ర గ్రహ దోషము గా గుర్తించి శుక్ర గ్రహ అనుగ్రహం కొరకు లక్ష్మీ అమ్మవారిని పూజించుట, లక్ష్మీ స్తోత్ర ము పారాయణం చేయుట, బొబ్బర్లు దానం చే యుట, వివాహం కాని స్ర్తీలకు వారి వివా హం కొరకు సహకరించుట, స్ర్తీలను గౌరవిం చుట. వజ్రం ఉంగరం ధరించుట, సప్తముఖి రుద్రా క్షను ధరించుట వలన శుక్ర గ్రహ అను గ్రహము పొందవచ్చును.
శని: ఆయుష్షు కారకులు అయిన శని జాతక చక్రము నందు బలహీనముగా ఉన్నచో బద్ధ కము, అతినిద్ర దీర్థకాలిక వ్యాధులు, సరయి న ఉద్యోగము లేకపోవుట, జన సహకారం లేకపోవుట, ఎముకలు, తల్లిదండ్రులలో విరో ధములు, ఇతరుల ఆధీనములో పని చేయు ట, సేవకా వృత్తి, నీచ వృత్తులు చేపట్టుట, గౌర వం లేకపోవుట, పాడుపడిన గృహముల యందు జీవించుట, ఇతరుల ఇంట్లో జీవన ము సాగించుట, భార్య పిల్లలు అవమానిం చుట, కుటుం బమును విడిచి అజ్ఞాతముగా జీవించుట, సరయిన భోజనం కూడా లేకపో వుట మొదల గు కష్టములు కలుగును. శని గ్రహ అనుగ్ర హమునకు శివునికి అభిషేకము చేయుట. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయుట.
శనివారము నియమము గా ఉండుట, ఆంజనేయ స్వామి వారిని ఆరా ధించుట, హనుమాన్‌ చాలిసా పారాయణం చేయుట, హనుమాన్ కు తమలపాకు పూజ చేపిస్తే మంచిది.స్వామి అయ్యప్ప మాల ధారణ చే యుట, శని గ్రహానికి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయుట. నల్ల నువ్వులు దానము చేయుట, దుప్పటి వస్తువులు దానం చేయుట, నీలము ఉంగరం గాని నాలుగు ముఖములు గల రుద్రాక్షను ధరించుట వలన శని గ్రహ అనుగ్రహం కలుగుతుంది.
రాహువు: రాహువు జాతక చక్రంలో బలహీ నముగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలా పాలు చేయుట, నీచ స్ర్తీలతో సహవాసము, కు ష్టు లాంటి వ్యాధులు, జైలు శిక్షలు అనుభవిం చుట, విద్యార్థులు విద్య మధ్యలో మానివేయు ట, పాడుపడిన గృహములలో నివసించుట, ఇంట్లో బొద్దింకలు, పందికొక్కు లు, పాములు వంటివి సంచరించుట, శుభకార్యములు వాయిదా పడుట, వాహన ప్రమాదములు జరుగుట, గృహంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడగుట, విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవు ట, మొదలగున వి సంభ వించు చున్నప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి దోష నివార ణకు కనక దుర్గ అమ్మవారిని పూజించుట, దే వి భాగవతం పారాయణం చేయుట, గోమేధి కం గాని  ఎనిమిది  ముఖములు గల రుద్రాక్ష ను గాని ధరించ వలెను. భవాని మాల ధరిం చుట, స్ర్తీలను గౌరవించుట వలన రాహు గ్రహ అనుగ్రహం కలుగును.దుర్గా సప్తశ్లోకి పఠించటం మంచిది.
కేతువు: కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తన లో తానే ఊహించుకొనుట, తనని తాను దేవు డు గానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి వేసి దేశ సంచారం చేయుట. పిచ్చి వాని వలె ప్రవర్తించుట, విచిత్ర వేషధార ణ, సంతానం కలుగకపోవుట, గర్భం వచ్చి పో వుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచి త్ర వ్యాధులకు కేతువు కారణం అగుచున్నా డు. కేతు గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు రంగులో ఉన్న కంబళి దానం చేయు ట. దేవాలయములు కట్టుటకు విరాళములు ఇచ్చుట. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సేవ చేయుట. అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిగించుట. వైఢూర్య ము గాని తొమ్మిది ముఖములు గల రుద్రాక్ష ధరించుట వలన కేతు గ్రహ అనుగ్రహం పొందుతారు.
ప్రతిరోజు సూర్య నమస్కారం చేసు కొని ఇష్టమైన దేవాలయమును సందర్శించినచో ఎటువంటి గ్రహ దోషములు ఉన్నను పరిహారం జరుగును.
"ఆకృష్ణేన'' అను మంత్రముతో సూర్యుని, "ఇమం దేవా' అను మంత్రముతో చంద్రుని, ""అగ్నిర్మూర్ధా'' అను మంత్రముతో కుజుని, ""ఉద్బుధ్యస్వ'' అను మంత్రముచే బుధుని, ""యదర్య'' అను మంత్రముచే గురువును, ""అన్నాత్పరిస్రుతః'' అను మంత్రముచే శుక్రుని, ""శం నో దేవీ'' అను మంత్రముచే శనిని, ""కాండాత్‌'' అను మంత్రముచే రాహువును, ""కేతుం కృణ్వన్న కేతవ'' అను మంత్రముచే కేతువును. ధ్యానించవలయును.
జల్లేడు. మోదుగు, జువ్వి ఉత్తరేణి, రాగి, మేడి, జమ్మి, గరక, దర్భలు, సమిధలు యథాక్రమముగా ఒక్కొక్క గ్రహమునకు 108, కాని 28 సార్తు కాని హోమమును చేయవలయును. అట్లే తేనెతో, నేయితో, పెరుగుతో, పాలతో కాని హోమము చేయవలయును.
ఋగ్వేద యజుర్వేదముల  యందలి  నవగ్రహ  మంత్రములు:
1. సూర్య మంత్రము:  
ఓం ఆ కృష్ణేన  రజసా  వర్తమానో  నివేశ  యన్న మృతం  మర్త్యంచ l
హిరణ్యేన  సవితా  రథేనాఽఽ దేవోయాతి  భువనాని  పశ్యన్ ll
(ఋగ్వేదము 1-35..2 యజుర్వేదము 33-43 )
ఓం భూర్భువః  స్వః  సూర్య  ఇహాగచ్ఛ  ఇహ సః  సూర్యాయ నమః
బీజ మంత్రము :-ఓం  హ్రాం  హ్రీం  హ్రౌం  సః  సూర్యాయ నమః
జపకాలము: ఉదయము

2. చంద్ర మంత్రము:
ఓం  హందేవా  అసపత్నం  సువధ్వం మహతే   క్షత్రాయ మహతే  జ్యేష్టాయ మహతే జ్ఞాన రాజ్యాయేంద్ర  స్యేంద్రియాయ l  ఇమమముశ్య పుత్రమముష్యే పుత్ర మస్యై విశాఽ ఎషవోఽ మీరాజా సోమోఽ స్మాకం  బ్రాహ్మణానాం రాజా ll 
( యజుర్వేదము 9-40 )
ఓం భూర్భువః  స్వః  చంద్ర ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ  సోమాయ నమః ll
బీజ మంత్రము :-ఓం  శ్రాం  శ్రీం  శ్రౌం  సః  చంద్రాయ నమః
జకాలము: సంధ్యా కాలము

3. మంగళ మంత్రము:
ఓం అగ్ని ర్మూర్దా  దివః  కకుత్పతి: పృథివ్యా  అయం l
అపాంరే తాంసి జిన్వతి ll
( యజుర్వేదము 8-44-16; యజుర్వేదము 13-14)
ఓం భూర్భువః  స్వః  భౌమా ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  భౌమాయ నమః
బీజ మంత్రము :-ఓం  క్రాం  క్రీం  క్రౌం  సః  భౌమాయ నమః
జపకాలము: రెండు గంటల సమయము

4. బుధ మంత్రము:
ఓం ఉద్బుద్య స్వాగ్నే ప్రతిజాగృ హిత్వమిష్టా  పూర్తేం
సంసృజేదామయంచ  అస్మిస్సదస్థే అధ్యుత్తరస్మిన్
విశ్వేదేవా  యజమానశ్చ సీదత ll
( యజుర్వేదము 15-54 )
ఓం భూర్భువః  స్వః  బుధ ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  బుధాయ నమః
బీజ మంత్రము :-ఓం బ్రాం బ్రీం భ్రౌంసః  బుధాయ నమః
జపకాలము: ఐదు గంటల సమయము.

5. గురు మంత్రము:
ఓం బృహస్పతే  అతియదయోం ఘ్రుమద్ విభాతి క్రతుమజ్జనేషు l
యద్దీదయచ్చ వనఋతుప్రజాత  తదస్మాసు ద్రవిణం దేహిచిత్రం ll
( ఋగ్వేదము 2-23-25 ; యజుర్వేదము 26-3 )
ఓం భూర్భువఃస్వః   బృహస్పతే ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  బృహస్పతయే నమః
బీజ మంత్రము :-ఓం  గ్రా౦  గ్రీం  గ్రౌం సః  గురవే నమః
జపకాలము:  సంధ్యా కాలము

6. శుక్ర మంత్రం :
ఓం అన్నాత్పరిశృతోరసం బ్రహ్మణాన్యపిబత్ క్షం పయః సోమం ప్రజాపతిః l 
ఋతేన సత్య మింద్రియం విపానాం శుక్ర మందస ఇంద్ర స్యేంద్రియ మిదం పయో మృతం మధు l l
(యజుర్వేదం 19-65)
బీజమంత్రం: ఓం ద్రాం ద్రీం ద్రౌంసః శుక్రాయనమః 
కాలము : సూర్యోదయ సమయం

7.  శని మంత్రము :
ఓం శంనో  దేవీరభిష్టయ ఆపోవబంతు పీతయే l
శంయోరభిస్ర  వంతునః ll
( ఋగ్వేదము 10-9-4 ; యజుర్వేదము 36-12 )
ఓం భూర్భువఃస్వః   శనై  శ్చరః  ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  శనైశ్చరాయ నమః
బీజ మంత్రము :-ఓం ప్రాం  ప్రీం  ప్రౌంసః  శనైశ్చరాయ నమః
జపకాలము:  సంధ్యా కాలము

8. రాహు మంత్రం : 
ఓం కయానాశ్చిత్ర ఆభువధూతీ  సదావృధాఃసఖా l కాయాశాశ్చిష్ఠయావృతా l l
(ఋగ్వేదం 4-31-1, యజుర్వేదం 26-39) 
ఓం భూర్భువః స్వః రాహో ఇహాగచ్ఛ ఇహతిష్ఠ l రాహవేనమః 
బీజమంత్రం:- ఓం భ్రాం భ్రీం బ్రౌంసః రాహవేనమః 
జపకాలం :- రాత్రి సమయం

9. కేతు మంత్రం:
ఓం కేతుం కృణ్వన్న కేతవేపేశే మర్యా అపేశసే l సముపద్భి రాజాయధాః l l
(ఋగ్వేదము 1-6-3; యజుర్వేదము 29-37) 
బీజమంత్రం :- ఓం స్త్రాం స్త్రీం సౌం సః l కేతవేనమః 
జపకాలం :- రాత్రి సమయం.

కాశీ పట్టణంలో షట్టంచశద్వినాయకుల పేర్లు

కాశీ పట్టణంలో షట్టంచశద్వినాయకుల పేర్లు
ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్ధి నాడు 56మంది వినాయకులను దర్శించటమే చప్పన్ యాత్ర. ఇందులో ఏడు ఆవరణలుంటాయి ఒక్కో ఆవరణలో ఎనిమిది మంది వినాయకులు .ఏడు ఆవరణల్లో కలిపి యాభై ఆరు మంది అవుతారు.
మొదటి ఆవరణ లో –లోలార్క కుండం లోనీ అర్క వినాయకుడు ,దుర్గా కుండం లో దుర్గా వినాయకుడు ,భీమ చండి లో భీమ చండీ వినాయకుడు ,ప్రసిద్ధమ్ లో ఉన్న దేహలీ వినాయకుడు ,భుయిలీ లో ఉద్దండ వినాయకుడు ,సదర్ బజార లో పాశ పాణి వినాయకుడు ,వరుణా సంగమం దగ్గరున్న ఖర్వ వినాయకుడు ,మణి కర్ణికా ఘాట్ వద్ద సిద్ధి వినాయకుని దర్శిస్తే ప్రధమ ఆవరణం పూర్తీ అయినట్లు.
రెండవ ఆవరణలో –కేదార్ ఘాట్ వద్ద లంబోదర వినాయకుడు ,కుమి కుండ మహల్ దగ్గర కూట దంత వినాయకుడు ,మాడు అమేహ్ వద్ద కాల కూటవినాయకుడు ,ఫుల్ వరియా లో కూష్మాండ వినాయకుడు ,వారాణసీ దేవి మందిరం లో ముండ వినాయకుడు ,ధూప చండీ దేవి వెనుక వికట దంత వినాయకుడు ,పులుహీ కోటలో రాజ పుత్ర వినాయకుడు ,త్రిలోచనా ఘాట్ లో ప్రణవ వినయ దర్శనం తో ద్వితీయ ఆవరణం పూర్తీ .
మూడవ ఆవరణం –చోసట్టీ ఘాట్ లో వక్ర తుండ లేక సరస్వతీ వినాయకుడు ,బంగాలీ బోలా వద్ద ఏక దంత వినాయకుడు ,సిగిరావార్ లో త్రిముఖ వినాయకుడు (వానర ,సింహ ,ఏనుగు ముఖాల తో )పిశాచ మోచన తాలాబ్ పై పంచాస్య వినాయకుడు ,హేరంబ వినాయకుడు ,చిత్ర కూట సరోవర్ దగ్గర విఘ్న రాజ వినాయకుడు ,ప్రహ్లాద్ ఘాట్ వద్ద వరద వినాయకుడు ,ఆది దేవ మందిరం లో మోదక ప్రియ వినాయకుడు ల దర్శనం తో తృతీయ ఆవరణం సంపూర్ణం.
నాలుగవ ఆవరణం –శూల కన్తేశ్వర స్వామి ఆలయం లోనీ అభయద వినాయకుడు ,బాల ముకుంద చౌహట్టా లో సింహ తుండ వినాయకుడు ,లక్ష్మీ కుండం పై కూణితాక్ష వినాయకుడు ,పితృ కుండం పై క్షిప్ర ప్రసాదన వినాయకుడు ,ఇసర్ గంగీ పై చింతా మణి వినాయకుడు బడా గణేష్ ఆవరణ లోనీ దంత హస్త వినాయకుడు ,ప్రహ్లాద ఘాట్ లో  పిచండిలా వినాయకుడు ,వారాణసీ దేవి మందిరం లోనీ ఉద్దండ ముండ వినాయకుని దర్శిస్తే చతుర్ధ ఆవరణం పూర్తీ .
అయిదవ ఆవరణం –మాన్ మందిర్ ఘాట్ లో స్తూల దంత వినాయకుడు ,సాక్షి గణపతి వద్ద కలిప్రియ వినాయకుడు ,ధవేశ్వర్ మందిరం లో చతుర్దంత వినాయకుడు ,సూర్య కుండం దగ్గర ద్విదంత వినాయకుడు ,మహల్ కాశీ పురా లో జ్యేష్ట వినాయకుడు ,మిక్చర్ ఘట్టా లో గజ వినాయకుడు ,రాం ఘాట్ లో కాల వినాయకుడు ,ఘోసలా ఘాట్ లో నాగేశ వినాయకులను చూస్తె పంచమ ఆవరణం అయినట్లు.
ఆరవ ఆవరణం –మణి కర్ణిక వద్ద మణి కర్ణ వినాయకుడు ,మీర్ ఘాట్ లో ఆశా వినాయకుడు ,కాళికా గల్లీ లో సృష్టి వినాయకుడు ,డుండి రాజు వద్ద యక్ష వినాయకుడు ,బాన్స్ ఫాఠక్ వద్ద గజకర్ణ వినాయకుడు ,చాందినీ చౌక్ లో చిత్ర ఘంట వినాయకుడు ,పంచ గనఘా ఘాట్ వద్ద స్థూల జంఘ వినాయకుల దర్శనం తో షష్ఠ ఆ వరణం పూర్తీ.
ఏడవ ఆవరణం –జ్ఞాన వాపి వద్ద మోద వినాయకుడు ,విశ్వనాధ కచాహరి లో ప్రమోద వినాయకుడు ,సముఖ వినాయకుడు దుర్ముఖ వినాయకుడు గజ నాద వినాయకుడు ,జ్ఞాన వాపీ దగ్గర జ్ఞాన వినాయకుడు విశ్వనాధ ద్వారం వద్ద ద్వార వినాయకుడు అవి ముక్తేశ్వరుడి వద్ద అవి ముక్త వినాయకులను దర్శిస్తే సప్తమ ఆవరణ తో పాటు చప్పన్ వినాయక దర్శనం పరి పూర్తీ అయినట్లే.
  ఈ వినాయక దర్శనం లో కనీసం ఇరవై ఒక్క గరికల తో పూజించటం శ్రేష్టం ఓపిక ఉంటె ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు సమర్పించ వచ్చు.

గణపతి ఉపాసన

గణపతి  ఉపాసన 
*సనాతన భారతీయ ధర్మంలో ఒకే పరమేశ్వరుడి ఆరు రూపాలతో ఆరాధించే సంప్రదాయాలు అనూచానంగా వ్యాప్తిచెందాయి. ఆ ఆరు- 1. శైవం 2. వైష్ణవం 3. శాక్తేయం 4. సౌరం (సూర్యారాధన) 5. గాణపత్యం 6. స్కాందం. ఈ షణ్మతాలు వేదాలను, మంత్ర శాస్త్రాలను ఆధారం చేసుకొని విస్తరిల్లాయి. ఈ ఆరింటిలో దేనికదే పరిపూర్ణం.*
*గణపతిని పరమాత్మగా ఉపాసించే గాణపత్యం మహారాష్ట్రలోని ‘మోర్‌గాఁవ్‌’ మొదలైన అష్టవినాయక క్షేత్రాల్లో ప్రబలంగా ఉంది. గణపతి పరిపూర్ణ బ్రహ్మమనే తలంపుతో ముప్ఫైరెండు రకాల మంత్రాలతో, ఉపాస్య మూర్తులతో ఆరాధించే విధానాలు ఆయా క్షేత్రాల్లో పరంపరగా సశాస్త్రీయంగా కొనసాగుతున్నాయి.*
*గణపతి సూక్తం, బ్రహ్మణస్పతి సూక్తం, తాపినీయోపనిషత్తులు, అధర్వ శీర్షం, హేరంబోపనిషత్తు, ఋగ్వేదాదుల్లోని మంత్రాలను వారు అనుష్ఠిస్తారు. గణేశ పురాణం, ముద్గల పురాణం, మంత్రసంహితలను పారాయణం చేస్తారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లోనూ ఈ ఉపాసనలు ప్రసిద్ధంగా ఉన్నాయి.*
*ప్రకృతీ పురుషతత్వమే విశ్వకారణం, విశ్వవ్యాప్తం. ఆ ప్రకృతీపురుషులే శివపార్వతులు. వారిరువురి ఏకతత్వమే గణపతి. కేవలం శివపార్వతుల పుత్రుడిగానే కాక- అనేక సందర్భాల్లో లోకరక్షణ కోసం విభిన్నమూర్తులతో విఘ్ననాథుడు సాక్షాత్కరించాడు.*
*అ, ఉ, మ- అనే అక్షరాలు త్రికాలాలను, త్రిలోకాలను, సృష్టి స్థితి లయలను, సత్త్వరజస్తమో గుణాలను తెలియజేస్తాయి. అంటే మూడు అక్షరాలు కలిపి- వ్యక్తమైన సగుణబ్రహ్మ స్వరూపం. నాలుగోది (తురీయం) అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మం. ఆ సగుణ-నిర్గుణతత్వమే ఓంకారం. ప్రపంచ రూపుడైన పరమాత్మ (జగం) మూడక్షరాల సగుణరూపం- ప్రపంచాతీతుడు నిర్గుణం. ఈ నిర్గుణతత్వం ‘గజ’ వదనం. సగుణతత్వం ‘జగద్రూ’పం- మానవరూపంలో కంఠం నుంచి పాదం వరకు కనిపిస్తుంది. జగతిని, జగతికి అతీతమైన తత్వాన్ని కలిపి ఒకే ఈశ్వరుడిగా ఆరాధించే జ్ఞానమే ‘గణపతి’గా ప్రత్యక్షమవుతుంది. గణనకు అందే విశ్వం ‘గణం’. దీనిలో వ్యాపించి, శాసించి దీనికి అతీతుడైనవాడే ‘ఈశుడు’. వెరసి, గణేశుడు.*
*భక్తితో ఆరాధించేవారి బుద్ధులను ‘తీర్చిదిద్ది’(వినయనం) స్వామి కనుక వినాయకుడు. వంకర బుద్ధులను తొలగించేవాడు వక్రతుండుడు. ‘చవితి’- తురీయ తత్వానికి సంకేతం. ధ్యానదృష్టితో త్రిగుణాలను దాటి, త్రిగుణాతీత బ్రహాన్ని(నాలుగోదాన్ని) యోగులు సమాధిస్థితిలో అనుభూతి చెందుతారు. ఆ నాలుగో భూమికలో శుద్ధ చైతన్యమే గణపతి...’ అని గణపతి ఆగమాల తత్వవివేచన.*
*సామాన్య దృష్టిలో- కార్యాలకు సిద్ధికి ప్రతికూలతలే విఘ్నాలు. వాటిని తొలగించి సఫలతను అనుగ్రహిస్తాడు గణపతి. వేదాంతదృష్టిలో ముక్తికి, బ్రహ్మజ్ఞానానికి ప్రతిబంధకాలైన అవిద్యావృత్తులే విఘ్నాలు. జిజ్ఞాసతో నిష్కామంగా కొలుచుకొనే భక్తులకు ఆ అవిద్యను నిర్మూలించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు విఘ్నపతి- అని గణేశగ్రంథాలు వివరిస్తున్నాయి.*
*పూజాపద్ధతిలో- గరికలు, శమీ (జమ్మి) పత్రాలు, మారేడు, శ్వేతార్కం (తెల్ల జిల్లేడు), ఎర్రని పువ్వులు హేరంబుడికి ప్రీతి. ఉండ్రాళ్లు, మోదకాలు, లడ్లు, నేరేడు పళ్లు, దానిమ్మ, చెరకు, కొబ్బరి, పనసతొనలు, అరటిపళ్లు, వెలగపళ్లు స్వామికి ఇష్టమైనవి. భక్తితో వీటిని అర్పించి ఆరాధించి ఉమాపుత్రుడి దయ పొందవచ్చునని పూజాశాస్త్రాలు చెబుతున్నాయి.*

*విచారణ పద్ధతుల్లో- స్థూల సూక్ష్మకారణ (అ, ఉ, మ) శరీరాలకు చైతన్యాన్ని ఇస్తూనే, హృదయంలో వీటికి అతీతంగా (తురీయం) భాసించే పరంజ్యోతి స్వరూపుడిగా గణపతిని జ్ఞానమార్గంలో యోగులు వివేచన చేస్తారు. ఆ సాధనా ఫలంగా విశ్వమంతా గణేశమయంగా దర్శనమిస్తుంది. సామాన్య పూజలనుంచి అసాధారణ తత్వమార్గం వరకు అందరికీ అందుబాటులో ఉండే అద్భుత స్వరూపం గణపతి!*

ఊర్మిళా దేవి నిద్ర

ఊర్మిళా దేవి నిద్ర..!!ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం..
రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది.
ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. .
లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.
ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.
నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిందని తెలుసు.
కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,' అని అడిగారు.
''మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,'' అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు.
కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది.
''లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!'' అని పరిహాసంగా అడిగారట రాములవారు.
''అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు.
నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు.
ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు.
మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది.
ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,'' అని బదులిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. 
అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు.
''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!'' అన్నారట
రాములవారు.రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి.
కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు.
ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.
''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను.
నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు.
నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు.
అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని అందించారట.
ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు.
పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే!
ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది..స్వస్తి..
శ్రీరామ జయరామ జయ జయరామ..!!*లోకా సమస్తా సుఖినోభవంతు..!!

అభిజిత్ నక్షత్రము.

అభిజిత్ నక్షత్రము.

ఉత్తరాషాఢ- శ్రవణముల మధ్య ఉండే అప్రకాశక నక్షత్రము ‘అభిజిత్’. అభిజిత్ వా ప్రకాశకం అని పేరు.
ఉత్తరాషాడ నక్షత్రంలో చివరిపాదం, శ్రావణా నక్షత్రంలో మొదటి 1/15వ భాగం కలిపి 'అభిజిత్' నక్షత్రం అంటారు. అనగా మకరరాశిలో 6 డిగ్రీలు .40 నుండి 10డిగ్రీలు .53'20” వరకు అభిజిత్ నక్షత్రము.....
కానరానిచుక్క - అభిజిత్ నక్షత్రము.
అభిజిత్తు .....పగలు పదునాల్గు గడియలపై నుండు గడియల కాలము,
‘‘ఖి,ఖూ,ఖె,ఖో’అనే అక్షరాలు ఆ నక్షత్ర ప్రభావితములు. అభిజిత్ నక్షత్రము వేరు. అభిజిత్ లగ్నం వేరు.
‘‘అభిజిత్ సర్వదోషఘ్నం’’అని  ఉత్తమమైనది.

నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు. ఇవన్నీ దక్షప్రజాపతి కుమార్తెలు. దక్షుడు ఈ నక్షత్ర కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లిచేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ అనురాగాన్ని పెంచుకొని ఆమెతోనే ఎక్కువకాలం గడుపుతుండేవాడు. ఓసారి వసంత రుతువులో చంద్రుడు ఒక్క రోహిణి దగ్గరే ఉంటూ మిగతా నక్షత్రాలను నిర్లక్ష్యం చేశాడు. దాంతో మిగిలిన నక్షత్రాలు కొంత రుకున్నా శ్రవణా నక్షత్రం మాత్రం సహనాన్ని కోల్పోయింది. ఓపిక పట్టలేక తన నుంచి తనలాగే ఉండే ఒక ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి విషయాన్ని గురించి తన తండ్రికి చెప్పేందుకు వెళ్లింది. ఆ శ్రవణా నక్షత్రపు ఛాయ ఒక నక్షత్రమైంది. దానిపేరు అభిజిత్తు.
అలా ఇరవైఏడు నక్షత్రాలే కాక అభిజిత్తు అనే ఇరవై ఎనిమిదో నక్షత్రం ఏర్పడింది. ఆ తర్వాత కాలాలలో శ్రవణం చెప్పిన విషయాన్ని దక్షుడు వినటం, ఒకటికి రెండుసార్లు ఆయన చంద్రుడిని హెచ్చరించినా చంద్రుడు వినకపోయేసరికి ఆయన శపించటం ఇవన్నీ జరిగాయి. అయినా అభిజిత్తు మాత్రం ఓ పవిత్రమైన స్థానాన్నే పొందింది.
అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్ళలో "గడ్డపలుగు"ముహూర్తం అని అంటారు. గడ్డపలుగు భూమిలో పాతిన దాని నీడ మాయమయ్యే మిట్ట మధ్యాన్న సమయాన్ని అభిజిత్ ముహూర్తంగా, మంచి ముహూర్తంగా నిర్ణయించారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు పంచాంగం చూడటం రాని పల్లె ప్రజలకు ఎటువంటి గందరగోళం లేకుండా స్ధూలమైన మంచి ముహూర్తం ఈ విధంగా ఎన్నుకోవచ్చని తెలియజేశారు. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమకేంద్రంలో ఉంటాడని ఈ యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుందని తెలియజేసేవారు.
అభిజిత్తు అంటే మధ్యాహ్నం 11-45నుండి 12-30వరకు ఉన్న సమయాన్ని అభిజిన్ముహూర్తం అని, సూర్యోదయం నుండి లేదా సూర్యాస్తమయం నుండి ఎనిమిదవ ముహూర్తం అభిజిత్ ముహూర్తం అంటారు. పగటి భాగం లో ఎనిమిదవ ముహూర్తం ఇది .దీనికే ‘’విజయ ముహూర్తం ‘’అంటారు. ఈ అభిజిత్ ముహూర్తం లోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం మొదలు పెట్టారు. ఈ శుభ ముహూర్తం లోనే దేవరాజు ఇంద్రుడు దేవ సింహాసనం అధిరోహించాడు. శ్రీరాముడు జన్మించినది, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టింది .


Saturday, February 9, 2019

జపం, జపమాలలు ఎన్నిరకాలు? వాటి ఫలితాలు ఏమిటి?

జపం, జపమాలలు ఎన్నిరకాలు?
వాటి ఫలితాలు ఏమిటి?

జకారో జన్మ విచ్చేద:
పకారో పాపనాశక:
జన్మపాప వినాశిత్వాత్
జప ఇత్యభిదీయతే
జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘;పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశము. అందుచేతనే భగవద్గీతలో శ్రీక్ర్ష్ణపరమాత్మ అర్జునినితో, ‘యజ్ణ్జానాం జప యజ్ణ్జోస్మీ అని చెప్పడం జరిగింది. అంటె, యజ్ణ్జాలన్నింటిలో నేను జపయజ్ణ్జాన్ని! అని చెప్పాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సాధారణంగా జపం మూడు విధాలుగా ఉంటుంది.
1. వాచింకం: మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.
2. ఉపాంశువు: తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.
3. మానసికం: మనస్సులోనే మంత్రాన్ని జపించడం.
వాచిక జపం కంటె ఉపాంశు జపం వంద రెట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం వెయ్యిరెట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడ చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్టదేవతాపుజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదనేది శాస్త్రం. జపం  చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.
జపమాలలు మూడు రకాలు.
1. కరమాల: అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలము వరకు గల పది కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లువుతుంది.
2. అక్షమాల: ‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా  ’క్షా కల్మషాలను తోలిగిస్తుంది.
3. మణిమాలలు: రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.
రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాలజపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటిగుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపుమాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసిమాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.
అన్ని యజ్ఞాలకన్నా జపయజ్ఞం గొప్పదని మనుస్మృతి చెబుతోంది. తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్రపరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.
త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా
తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే
అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠవ్రేళ్ళపై ఉంచి, చేతి బోటనివేలితో, మధ్యవేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురుకర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ణ్జానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మరల దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచిపెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్ , సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.
దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.
గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీదగాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జపసంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. చివరగా, కర్మలు, యజ్ఞాలు, వ్రతాలు, దానాలు, తపస్సులు ఎన్ని చేసినప్పటికి జపానికి సరికావన్నది పెద్దల వాక్కు. అందుకనే జపాన్ని ఒక యోగం అన్న మన పెద్దలు, దానికి పెద్దపీటను వేసారు.


మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ? మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ? మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

గ్రామదేవతా వ్యవస్థ:
గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను #గ్రామదేవతలని అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.

ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు కచ్చితముగా విద్వాంసులను పిలిచి #పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.
గ్రామదేవతల ఆవిర్భావము:
#పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.

పృధ్వీ దేవత:పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన పృధ్వినీ దేవతను #కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో #గోగులమ్మని యేర్పాటు చేసారు. జొన్నలు పండేచోట #జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో #నూకాళమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూవుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి #అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.

జల దేవత:జలానికి సంభందించిన తల్లి #గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.

 అగ్ని దేవత:మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా #సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా #పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ పౌర్ణమినాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు #ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).
వాయు దేవత:నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు #కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.

ఆకాశ దేవత:ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున #కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన. ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.
గ్రామదేవతా నామ విశేషాలు
మనం రకరకాల పేర్లతో పిలిచే  ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది 
వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా #పోలేరమ్మ అయింది.
'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే '#ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, #పోచమ్మ పోషణ కలిగిస్తుంది.
ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో #కట్టమైసమ్మ అయింది.
స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి #అచ్చమ్మగా అయ్యింది.
సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది #మావుళ్ళమ్మ' అయింది.
ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి #తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.
శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ, #అంకాళమ్మ గా మారిపోయింది.
పొలిమేరలో వుండే మరొక తల్లి #శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.
పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి #పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే '#నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి #పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=#సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.
బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి #బతుకమ్మ.
గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= #సత్తెమ్మ. 
అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ #పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా #అప్పలమ్మ అయినది.
#బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు.
అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= #పెంటమ్మ.
భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= #బోనాలమ్మ.
అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను '#అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.
లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= #గుర్రాలమ్మ అయినది.
ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ' అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట..
సర్వేజనా సుఖినో భవంతు..
ఓం శాంతి శాంతి శాంతి హీ..
*ఓం శ్రీ మాత్రే నమః*


RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS