Sunday, February 20, 2022

అష్ట అయ్యప్ప అవతారాలు!

 అష్ట అయ్యప్ప అవతారాలు!



 స్వామి అయ్యప్ప అనగానే మనందరికీ కనుల 

ముందు కదలాడే దివ్య రూపం ఒక్కటే!


 శబరి మాలలో పదునెనిమిది సోపానాదిపతిగా వీర పద్మాసనం, యోగ బంధనంతో చిన్ముద్ర , అభయ హస్తాలతో భక్తులను కటాక్షించే కమనీయ రూపం.


 కానీ అయ్యప్ప మూల రూపమైన శ్రీ ధర్మ శాస్త యుగాల క్రిందట నుండే వివిధ రూపాలతో కొలువుతీరి కొలిచిన వారికి కొంగు బంగారంగా ప్రసిద్ది చెందారు. శ్రీ హరి ఆరో అవతార రూపమైన శ్రీ పరశురాముడు సృష్టించిన కేరళలో ఆయనే నెలకొల్పిన నూట ఎనిమిది ఆలయాలలో అనేక భంగిమలలో దర్శనమిస్తారు శ్రీ ధర్మ శాస్త. 


అందరికి సుపరిచితమైన ఎరుమేలిలోని ఎరుమేలి శ్రీ ధర్మశాస్త స్తానక (నిలుచున్న) భంగిమలో ధనుర్భాన ధారిగా, అదే విధంగా కులత్తపుల లోను, శ్రీ పూర్ణ పుష్కల నాధునిగా అచ్చన్ కోయిల్ లోను, అశ్వా రూడునిగా కుథిరన్ (త్రిస్సూర్ - పాలఘాట్ మధ్యలో), శ్రీ ధన్వంతరి శాస్తాగా తిరువనంత పురం, కొచ్చి లలో, భార్య ప్రభా దేవి, కుమారుడు సత్యకన్తో కలిసి శాస్తంకొట్ట (కొల్లం దగ్గర) స్వామి దివ్య స్వరూపాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.


ఎన్నో సంవత్సరాలుగా శబరి యాత్ర చేస్తూ వస్తున్న గురు స్వాములు, శ్రీ అయ్యప్పను కుల దైవంగా భావించి కొలిచే భక్తులు ఎందరో ఉన్నారు. వారంతా కలిసి స్కాంద, శివ పురాణాలను, రామాయణ, మహా భారతాలను, గుహ్య రత్న చింతామణి, శ్రీ భూత నాధ చరితం లాంటి పురాతన మలయాళ గ్రంధాలను ఆమూలాగ్రం శోధించి వెలికి తీసిన అమూల్య విషయం "శ్రీ అయ్యప్ప అష్ట అవతారాలు". ఆ స్వాములు భక్తుల సౌలభ్యం కొరకు, వారి ఇహ పర కోరికలు తీరి, పరమ పదం చేరే మార్గంలో ప్రయాణించడానికి సిద్దమవ్వడానికి వెలుగు లోనికి తెచ్చారు.


 అంతే కాకుండా ఈ పుణ్య పురుషులు తమ పరిశోధనలలో శ్రీ ధర్మ శాస్తా మూల రూపంతో కలిపి మొత్తం తొమ్మిది రూపాలను మానవ జీవితాల మీద ప్రభావం చూపే నవ గ్రహాలకు సరి సమానమైనవిగా గుర్తించారు. అంటే ఈ నవ అయ్యప్ప రూపాలను సేవిస్తే నవ గ్రహాలను సేవించిన ఫలితం దక్కుతుందన్నమాట! సత్య యుగం నుండి పూజలందుకొంటున్న ఆ అవతార రూపాలు యివే.


 శ్రీ ఆది భూత నాధ శాస్త,

 శ్రీ ధర్మ శాస్త,

 శ్రీ జ్ఞాన శాస్త,

 శ్రీ కళ్యాణ వరద శాస్త,

 శ్రీ మహా శాస్త,

 శ్రీ సమ్మోహన శాస్త,

 శ్రీ సంతాన ప్రపత్తి శాస్త,

 శ్రీ వేద శాస్త,

 శ్రీ వీర శాస్త


శ్రీ ఆది భూత నాధ శాస్త 


 స్తితి లయ కారకులైన హరిహరుల అంశతో ఉద్భవించిన వాడే ఈ స్వామి. నేపాళ రాజు పాలింజ వర్మ కుమార్తె పూర్ణా దేవిని, కేరళ రాజ పుత్రిక అయిన పుష్కలా దేవిని దేవేరీలుగా చేసుకొని పొన్నాంబల మేడులో (కాంతి మలై) కాపురం ఉంటున్నారని అంటారు.


శ్రీ ఆది భూత నాధ శాస్త


 ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానునికి ప్రతీక. దివాకర ఆరాధనతో ఏవైతే మానవాళికి లభ్యమవుతాయో అవన్నీ ప్రసాదించేవాడు శ్రీ ఆధి భూతుడు. 


పుడమిలో ప్రజల ఆకలి దప్పికలు తీరేందుకు సకాలంలో వర్షాలు, సంవృద్దిగా పాడి పంటలు, ఆరోగ్యకరమైన వాతావరణం, సమకూర్చేవాడు ఈ స్వామి. అంతే కాదు శత్రువుల నుండి, క్రూర మృగాల దాడుల నుండి, విష సర్పాల బారి నుండి కాపాడే రక్షకుడు కూడా! నియమంగా భక్తి శ్రద్దలతో పూజిస్తే శ్రీ ఆది భూత నాధ శాస్త రాజ యోగం ప్రసాదించేవాని గా ప్రసిద్ది.


 ఈయనకొక ఆలయం తమిళ నాడు లోని తిరునెల్వేలి జిల్లా పాపనాశనం దగ్గరలోని కరైయర్ డాం కు సమీపంలోని అగస్త్య జలపాతం వద్ద ఉన్నది. శ్రీ ధర్మ శాస్త మహర్షికి తొలిసారిగా దర్శనమిచ్చి శబరి మలకు రాదలచిన భక్తులు పాటించవలసిన నియమాలను తెలిపారన్నది పురాణ గాధ. ఇక్కడికి దగ్గరలోనే శ్రీ అగస్త్య మహర్షి ఆలయం కూడా ఉన్నది. సుందర ప్రకృతి ఈ ప్రాంత సొంతం. 


శ్రీ ధర్మ శాస్త 


 శబరి మలలో కొలువు తీరినది ఈ స్వామే! ముక్తి ప్రదాత. కుల మత భావాలను రూపుమాపి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే వాడు శ్రీ ధర్మ శాస్త. పరి పూర్ణ శరణాగతిని కోరే భక్తుల వెన్నంటి ఉండి కాపాడే తోడూ నీడ. శని గ్రహ ప్రభావాన్ని దూరం చేస్తారు. ఎలాంటి తప్పునైనా సరిదిద్ది సక్రమ మార్గంలో నడిపించే మార్గ దర్శి శ్రీ ధర్మ శాస్త.


జ్ఞాన శాస్త 


 అపర సరస్వతి దేవి రూపం . మాణిక్య వీణ ధరించి వట వృక్షం క్రింద ఉపస్థిత భంగిమలో కొలువు తీరి వుంటారు. సకల విద్యా ప్రదాత. ఈ స్వామిని బృహస్పతి (గురువు)గా, శ్రీ దక్షిణా మూర్తిగా భక్తులు ఆరాధిస్తారు. ఇదే రూపంలో స్వామి వారి ఆలయలైతే లేవు. త్రిస్సూర్ జిల్లాలోని తిరువుల్లక్కావు లో వెలసిన శ్రీ స్వామిని విద్యా శాస్తాగా భావించుతారు. నవరాత్రులలో, ఓనం, ఇతర స్థానిక పర్వ దినాలలో ఎందరో భక్తులు తరలివచ్చి తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాట వేసే అక్షరాభ్యాసం చేయించుకొంటారు. భక్తుల సౌలభ్యం కొరకు ఫిబ్రవరి రెండో వారంలో ఏడు రోజులపాటు విద్యా సరస్వతి అర్చన జరుపుతారు. చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ క్షేత్రంలోని మూల విరాట్టు ధనుర్భానాలు ధరించి స్థానక భంగిమలో ఉండటం!


కళ్యాణ వరద శాస్త 


 పురాతన గ్రంధాలైన గుహ్య రత్న చింతామణి, భూతనాధ చరితం లలో శ్రీ కళ్యాణ వరద శాస్త గురించి విపులంగా వివరించబడి ఉన్నట్లుగా తెలియవస్తోంది. దశ భుజాలతో శంఖు చక్రాలతో పాటు వివిధ ఆయుధాలు ధరించి, అభయ వరద హస్తాలతో, ఇరు వైపులా పూర్ణ పుష్కలా దేవేరిలతో కొలువు తీరివుంటారు. పేరుకు తగినట్లుగానే కళ్యాణ కారకుడు. కుజ గ్రహ ప్రభావంతో వివాహం కాని వారు ఈయనను సేవిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. నిండు భక్తితో కొలిచిన వారి జీవితాలలో అన్ని శుభాలను ప్రసాదించి వరదుడు. శ్రీ పూర్ణ పుష్కలా సమేత శ్రీ ధర్మ శాస్తా ఆలయాలు చాల ఉన్నా అచ్చన్ కోవిల్ లోనిదే ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి.


 స్వామికి ఇక్కడ దశ భుజాలుండవు కాని చిత్రమైన భంగిమలో దర్శనమిస్తారు. శ్రీ కళ్యాణ వరద శాస్తా విగ్రహ రూపంలో కాకుండా చిత్రపట రూపంలో పూజలందుకొంటున్న క్షేత్రం ఒకటి మన రాష్ట్రంలో ఉన్నది. అదే అయిదు వందల సంవత్సరాల క్రిందట విజయనగర సామ్రాట్టు శ్రీ కృష్ణ దేవరాయలు స్వయంగా స్థాపించిన తుమ్మగుంట. నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో నాటి నుండి నేటి వరకు ద్రావిడ బ్రాహణులచే కొలవబడుతున్న శ్రీ వృక్ష అయ్యప్ప సకల విద్యలను, శుభాలను ప్రసాదించే శ్రీ గురునాథ స్వామిగా పిలవబడుతున్నారు. అరుదయిన వృక్ష రూప అయ్యప్పతో పాటు ఎన్నో చిత్ర పటాలున్నాయిక్కడ.


శ్రీ మహా శాస్త 


 గజ వాహనారూఢ శ్రీ మహా శాస్త ని అప మృత్యు భయాన్ని తొలగించే మహా కాల శాస్తా గా ఆరాధిస్తారు. అనుకోని ప్రమాదాల బారినుండి, ఆకస్మిక ఇక్కట్ల నుండి, తలా తోక లేని విషమ పరిస్థితుల నుండి కాపాడి విజయం వైపు నడిపించేవాడు శ్రీ మహా శాస్త అన్నది సేవించేవారి నమ్మకం. తమిళ నాడులోని ఆలయాల నగరం కుంభకోణంకి ముప్పై కిలోమీటర్ల దూరంలో సేన్గాలిపురం దగ్గరలో ఉన్న త్రియంబకాపురం లో కరి వాహన మహా కాల శాస్తా ఆలయం ఉన్నట్లుగా తెలుస్తోంది. 


శ్రీ సమ్మోహన శాస్త 


 చతుర్భుజాలతో కుడి కాలు క్రిందకి పెట్టి, ఎడమ కాలుని పైకి మడిచి అరుదైన భంగిమలో దర్శనమిస్తారు పూర్ణ పుష్కలా సమేత శ్రీ సమ్మోహన శాస్త. 


వెన్నెలంత చల్లని అభిమానాన్ని భక్తుల మీద చూపేవానిగా ప్రసిద్ది. నమ్మిన వారికి అడుగడుగునా అండగా నిలిచి కాపాడుతారు శ్రీ సమ్మోహన శాస్త. నిండైన ప్రేమకు ప్రతి రూపం. శ్రీ సమ్మోహన శాస్తాకు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఒకటి తమిళనాడు రాష్ట్రం నాగాపట్టినం జిల్లా లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం సిర్కాలికి సమీపంలోని కైవిలంచ్చేరి లో ఉన్నది. స్వామిని కై విడే అప్పార్ అని పిలుస్తారు. 


శ్రీ సంతాన ప్రపత్తి శాస్త


 పదిహేనో శతాబ్దంలో రచింపబడిన తంత్ర సముచయం అనే గ్రంధం ప్రకారం త్రేతా యుగంలో సంతానాపేక్షతో పుత్రకామేష్టి యజ్ఞం చేసిన దశరధ మహారాజుకి యజ్ఞ ఫలం అందించిన యజ్ఞ పురుషుడు శ్రీ సంతాన ప్రపత్తి శాస్తానేఅని తెలుస్తోంది. శిల్పారాధానం అనే మరో పురాతన గ్రంధంలో కూడా ఈ విషయం వివరించబడినది.


 ఈ కారణంగా ఈయనను బ్రహ్మ శాస్తా అని కూడా పిలుస్తారు. ఆదాయం, అబివృద్ది, కీర్తి, సత్సంతానం ఇలా అన్నింటా శుక్ర మహర్దశ ప్రసాదించేవాడీ స్వామి. అభయ హస్తంతో విలాసంగా భార్య ప్రభా దేవి, కుమారుడు సత్యకన్తో కలిసి దర్శనమిస్తారు. కేరళ రాష్ట్రంలో ఉన్న ఎన్నో శ్రీ ధర్మశాస్త ఆలయాలలో కొల్లం జిల్లా ఆదూర్ కి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న శాస్తంకొట్ట లోని శ్రీ ప్రభా సత్యకన్ సమేత ధర్మ శాస్త ఆలయం ప్రసిద్ది చెందినది. ఎన్నో ప్రత్యేకతలుగల క్షేత్రమిది. శ్రీ రామ పాద స్పర్శ తాకిన దివ్య క్షేత్రం శాస్తంకొట్ట. 


శ్రీ వేద శాస్త 


 శివ పురాణంలో పూర్ణ పుష్కలా సమేతంగా సింహాన్ని అధిరోహించిన శ్రీ వేద శాస్త ప్రస్తావన ఉన్నది. బుద్దిని వికసింపచేసి, గ్రహణ శక్తిని పెంపొందించి, విషయ జ్ఞానాన్ని మెరుగుపరచేవాడు. మానవాళికి మేలు చేసేవాడు శ్రీ విద్యా శాస్త. వేద రూపుడైన స్వామికి సేలం జిల్లాలో ఒక ఆలయం ఉన్నట్లుగా చెబుతారు. 


శ్రీ వీర శాస్త


 జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు రచించిన ఆదిశంకర విచరితమ్ లో శ్రీ వీర శాస్త ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది. 


 జగద్గురువులు వర్ణించినట్లుగా స్వామి ఖడ్గం ధరించి ఆశ్వ వాహనం మీద దర్శన మిస్తారు. యోధుని మాదిరి కనిపించే స్వామి దుర్మార్గులను దండించేవాడు, అధర్మాన్ని అణిచేవాడు. ఆపన్నులను గాచేవాడు.


 శ్రీ వీర శాస్తకు త్రిస్సూర్కు పాలఘాట్ కు మధ్యలో వచ్చే కుథిరన్ అనే ఊరిలో ఏంతో పురాణ ప్రసిద్ది చెందిన ఆలయం ఉన్నది. శ్రీ ఆది శంకరులు ఈ స్వామిని కొలిచినట్లుగా స్థానిక కధనాలు తెలుపుతాయి. ఇవే కాకుండా శ్రీ శాస్త ధన్వంతరిగా, యోగ మూర్తిగా, ధ్యాన రూపునిగా కొలువు తీరిన ఆలయాలు కేరళాలో ఉన్నాయి.


 శరణ ఘోషతో పిలిచే వారిని చేరదీసి చింతలు బాపేవాడు శ్రీ ధర్మ శాస్త. వేద సంస్కృతి...వారు సహకారం హరహర మహాదేవ శంభోశంకర

తారాబలం దోష పరిహారాలు

 తారాబలం దోష పరిహారాలు


తారాబలం వివాహ సంబంద విషయాలలో ముఖ్యంగా చూస్తారు. అమ్మాయి నక్షత్రం నుండి అబ్బాయి నక్షత్రానికి తారాబలం సరిపోతే ఇద్దరు ఒకరి మనస్సుని ఒకరు అర్ధం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు.

చంద్రుడు మనకు ఏ తార ద్వారా కనపడతాడో ఆ తార మనకు జన్మ తార అవుతుంది. చంద్రుడు మనస్సుకి, నీటికి కారకుడు. నక్షత్రాన్ని బట్టి మనకు ప్రకృతి తెలుస్తుంది. మన జన్మతార మన మనస్సును నిర్ణయిస్తుంది. దాదాపుగా ఒకే నక్షత్రంలో ఉన్నవారు ఒకే విధమైన మానసిక చంచలత్వం కలగి ఉంటారు. చంద్రుడు 1, 3, 6, 7, 10, 11 స్ధానాలలో ఉన్నప్పుడు బలంగా ఉంటాడు.

జన్మ నక్షత్ర మారభ్య నిత్య నక్షత్ర గణ్యతే ı

నవ సంఖ్యా హరద్భాగం శేషం ఫల మిదం శృణు ıı

జన్మ సంపద్విపత్ క్షేమ ప్రత్యక్సాధన నైధన ı

మిత్రం పరమ మైత్రం చ నవతారాఃప్రకీర్తితాః

జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం నుండి లెక్కించి వచ్చిన దానిని తొమ్మి దిచే భాగించగా మిగిలిన శేషాన్ని బట్టి తొమ్మిది తారలు నిర్ణయిస్తారు.

శేషం 1 అయితే జన్మతార అని, శేషం 2 అయితే సంపత్ తార అని, శేషం 3 అయితే విపత్ తార అని, శేషం 4 అయితే క్షేమతార అని, శేషం 5 అయితే ప్రత్యక్ తార అని, శేషం 6 అయితే సాధనతార అని, శేషం 7 అయితే నైధన తార అని, శేషం 8 అయితే మిత్రా తార అని, శేషం 9 అయితే పరమమిత్ర తార అని నిర్ణయిస్తారు.

నవతారల ఫలాలు

జన్మనో దేహ పీడాచ సంపత్సంపద మేవాచ

విపదే ప్రీతి నాశాయ క్షేమం క్షేమ కరోభవేత్

ప్రత్యక్కార్య వినాశాయ సాధన కార్య సాధనం

నైధనే నిధనం చైవ మిత్రేణ సుఖ సంపదాః

పరమ మైత్రే ధనం లాభం ఇత్యేతే తార లక్షణమ్

జన్మతార దేహ నాశనాన్ని, సంపత్తార సంపదను, విపత్తార కష్టాలను, క్షేమతార క్షేమాన్ని, ప్రత్యక్తార కార్య నాశనాన్ని, సాధనతార కార్య సాధనాన్ని, నైధన తార మరణాన్ని, మిత్రతార సుఖసంపదలను, పరమ మైత్ర తార ధన లాభాన్ని కలిగిస్తాయి.

వివాహానికి ప్రత్యక్తారలలో ముహూర్తం పెట్టుకోవచ్చు. అను జన్మ తారలలోను పెట్టుకోవచ్చును. విపత్, నైధన తారలను వదిలిపెట్టాలి.

ప్రధమ నవకంలో జన్మతారను, ద్వితీయ నవకంలో విపత్తారను, తృతీయ నవకంలో ప్రత్యక్తారను, మూడు నవకాలలో నైధనతారను విడిచిపెట్టాలి.

తారాదోష పరిహారార్దం దానాలు

తారా దోష పరిహారానికి అంటే తారల వల్ల కలిగే నష్టాలు పోవటానికి ఈ క్రింది దానాలు చేయాలి.

శాకం గుడంచ లవణం సతిలం కాంచనం తధా ı

అరిష్ట పరిహారాయ దద్యాద్దానం సమాచరేత్ ıı

జన్మతార, విపత్తార, ప్రత్యక్తార, నైధనతారలు అశుభాన్ని కలిగిస్తాయి. ఆ తారల దోష పరిహారార్ధం ఈ క్రింది దానాలు చేయాలి. జన్మతారకు ఆకుకూరలు, విపత్తారకు బెల్లం, ప్రత్యక్ తారకు ఉప్పు, నైధనతారకు నువ్వులతో కూడిన బంగారం దానంగా ఇవ్వాలి.

దానం ప్రకృతికి చేస్తే మంచిది. ఉదా:-ఉప్పును కొబ్బరి చెట్టుకి పోస్తే మంచిది. దానం చేసేది వ్యక్తులకు ఉపయోగపడాలి. దానం పొందిన వారి ద్వారా మనకు పుణ్యబలం వస్తుంది. దానం చేసే స్ధోమత లేనప్పుడు మనస్సులోనే దానం చేసినట్లు భావించాలి.

కాశీ లోని కొన్ని వింతలు..విశేషాలు..

 #కాశీ లోని కొన్ని వింతలు..విశేషాలు..!!



1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపు కొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.


2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.


3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి 

శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.


4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు.


5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?


6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు.


7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.


8. కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మలేపనం తో పూజ ప్రారంభిస్తారు.


9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి 

పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.


10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.


11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.


12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.


13. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీి లోనే వున్నది.


కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..


ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :


1) దశాశ్వమేధ ఘాట్:

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.


2) ప్రయాగ్ ఘాట్:

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతి లు కలుస్తాయి.


3) సోమేశ్వర్ ఘాట్:

చంద్రుని చేత నిర్మితమైనది.


4) మీర్ ఘాట్:

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.

ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.


5) నేపాలీ ఘాట్:

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.


6) మణి కర్ణికా ఘాట్:

ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.


7) విష్వేవర్ ఘాట్:

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.


8) పంచ గంగా ఘాట్:

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.


9) గాయ్ ఘాట్:

గోపూజ జరుగుతున్నది.


10) తులసి ఘాట్:

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.


11) హనుమాన్ ఘాట్:

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది

ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.


12) అస్సి ఘాట్:

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.


13) హరిశ్చంద్ర ఘాట్:

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...


14) మానస సరోవర్ ఘాట్:

ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.


15) నారద ఘాట్:

నారదుడు లింగం స్థాపించాడు.


16)చౌతస్సి ఘాట్:

ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... 

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.


17) రానా మహల్ ఘాట్:

ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.


18)అహిల్యా బాయి ఘాట్

ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ

విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.


కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.


పూర్వం కాశీలో దేవతలు, ఋషులు రాజులు నిర్మించిన అనేక మందిరాలు, కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.


కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని చూస్తున్నాము.


విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.


నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.


అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.


ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు


  ........ కాశీ స్మరణం సదా మోక్షకారకం.....

🙏సర్వోజనా సుఖినోభావంత్

వివాహం కోసం..

 వివాహం కోసం..



1.వివాహ ఆలస్యానికి సూచించదగిన కాత్యాయని మంత్రం (ఈ మంత్రం ఆడవాళ్లు ,మగవాళ్లు, వారి కోసం ఎవరైనా సంకల్పం చెప్పి కూడా ఈ శ్లోకాన్ని 108 సార్లు రోజూ జపం చేయాలి)


మంత్రం:


"హే గౌరీ శంకర అర్థాంగి యథా త్వాం శంకర ప్రియా ! 

తథా మమ్ కురు కళ్యాణి కంటకం సుదుర్లభం !!"


2.ఏ మంత్రం పెళ్లి కాని ఆడవాళ్లు రోజు కొద్దిగా పసుపు నీటిలో వేసి స్నానం చేసుకోవాలి దేవిడి దగ్గర దీపం పెట్టి పసుపు కొమ్ములతో 108 సార్లు ఇదే మంత్రం చెప్తూ ఒక్కో కొమ్ము సమర్పించాలి... ఏ అమ్మవారి ఫోటో ఇంట్లో ఉన్న ఆ ఫోటో కి అర్చన ఈ మంత్రం చెప్తూ కొమ్ములతో అర్చన చేయండి

అరటి చెట్టు కానీ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడ దీపం పెట్టండి..

(పెళ్లి అయిన ఆడవాళ్లు ఈ శ్లోకం చదివితే, భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు..)పెళ్లి అయిన వారు అయితే పసుపుకొమ్ములతో చేయవల్సిన పని లేదు 108 సార్లు చదువు కుంటే చాలు


మంత్రం:

"కాళి పస్యస్వ వదనం భర్తుహు: శశిధర ప్రబం సమదృష్టి: భూత్వ కురుశ్వాగ్ని ప్రదక్షిణం"


3.వివాహము ఆలస్యం అవుతున్న మగవాళ్ల కోసం 


ఈ పరిహారం... ప్రతి రోజూ నీటిలో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇది ఎన్నో రకాల దోషము దిష్టి తొలగించి శుభాన్ని కలిగిస్తుంది... అలా చేసి సూర్యుడికి నమస్కారం చేసుకుని...దేవిడి దగ్గర కానీ లేదా ఎక్కడ అయినా శుభ్రంగా ఉన్న ప్రదేశంలో కూర్చుని

 " ఓం కామేశ్వరాయ నమః"

 అని 108 సార్లు జపం చేసుకోవాలి..రోజంతా కూడా ఈ నామాన్ని మనసులో తలచుకోవడం మంచిది, వారి చేత్తో ఎక్కడైనా అవుకి గడ్డి కానీ, బియ్యం గాని, అరటి పండ్లు గాని గురువారం రోజు మీరు సంతోషం గా తినిపించాలి...అవులో ముక్కోటి దేవతలు ఉంటారు వారికి స్వయంగా తినిపించి నట్టు..గురువారం లక్ష్మీ వారం కనుక బృహస్పతి అనుగ్రహం కూడా లభించి మంచి అమ్మాయితో వివాహం జరుగుతుంది..

శయన నియమాలు

 శయన నియమాలు



పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు


1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశాన వాటికలో కూడా పడుకోకూడదు.( మను స్మృతి)


2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు.  ( విష్ణు స్మృతి)


3. విద్యార్థి, నౌకర మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో  వీరిని మేల్కొలపవచ్చును.( చాణక్య నీతి)


4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం 

బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.

( దేవీ భాగవతము).

పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.

( పద్మ పురాణము)


5. తడి పాదము లతో నిద్రించవద్దు... 

పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది.( అత్రి స్మృతి)

 విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం. ( మహాభారతం)


6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.( గౌతమ ధర్మ సూత్రం)


7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, 

పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత,

ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు,ఇంకా 

దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది.

( ఆచార మయూఖ్)


8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో  1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది)


9. పగటిపూట  సూర్యోదయము  మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు.

( బ్రహ్మా వైవర్తపురాణం)


10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి


11. ఎడమవైపు పడుకోవడం వలన  స్వస్థత లభిస్తుంది.


12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు యముడు మరియు దుష్ట గ్రహము ల  నివాసము వుంటారు...

దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు*  లేదా   అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.


13.గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.


14.పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.


15. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)


ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి,  నిరోగి మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు

రాశి ప్ర‌కారం …ఏ రంగాన్ని ఎంచుకుంటే స‌క్సెస్ అవుతారు

 రాశి ప్ర‌కారం …ఏ రంగాన్ని ఎంచుకుంటే స‌క్సెస్ అవుతారు



మేషరాశి =

వీరి గుణం: వీరికి  తెలివి తేటలు ,పట్టుదల అధికం

రాణించ‌గ‌లిగే రంగాలు: వీళ్లు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు. కాబట్టి మిలట్రీ, రాజకీయాల‌లో రాణించగలుగుతారు. అలాగే పారిశ్రామిక వేత్తలుగా కూడా సక్సెస్ అవవచ్చు.


వృషభ రాశి=

వీరి గుణం:  హార్ట్ వర్క్ చేస్తారు. చాలా లగ్జరీగా, అందంగా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు:  డిజైనర్స్ లేదా చెఫ్ గా అయితే సక్సెస్ అవుతారు.


మిధున రాశి=

వీరి గుణం:చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. అలాగే తెలివైనవాళ్లు.

రాణించ‌గ‌లిగే రంగాలు: టెక్నికల్ వింగ్, మార్కెటింగ్, సేల్స్ జాబ్స్లో సక్సెస్ అవుతారు.


కర్కాటక రాశి=

వీరి గుణం: చాలా ఎమోషనల్ గా ఉంటారు. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. క్రియేటివిటీ ఎక్కువ‌

రాణించ‌గ‌లిగే రంగాలు: టీచర్స్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్స్ జాబ్స్లో సక్సెస్ అవుతారు.


సింహరాశి =

వీరి గుణం: వీళ్లకు భయమంటే తెలియదు. ప్లాన్డ్ గా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: వీళ్లు సీఈవో, మేనేజర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు.


కన్యా రాశి=

వీరి గుణం: చాలా లాజికల్ గా ఉంటారు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలసిస్  జాబ్స్లో  సక్సెస్ అవుతారు.


తులారాశి=

వీరి గుణం: తెలివైనవాళ్లు. వీళ్లకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది. అలాగే ఎదుటివాళ్లు చెప్పే విషయాలు ఓపిగ్గా వింటారు. వీళ్లకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటివాళ్లను ఆకట్టుకుంటాయి.

రాణించ‌గ‌లిగే రంగాలు:ఆట‌గాళ్లుగా  స‌క్సెస్ అవుతారు.


వృశ్చిక రాశి= 

వీరి గుణం: చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: కాబట్టి వీళ్లు డిటెక్టివ్, సర్జన్, సైంటిస్ట్ వంటి ప్రొఫెన్స్ ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు.


ధనస్సు రాశి=

వీరి గుణం:చాలా సైలెంట్ గా ఉంటారు. ట్రావెలింగ్ ను ఇష్టపడతారు. ఆధ్మాత్మికత ఎక్కువ‌.

రాణించ‌గ‌లిగే రంగాలు: ఇతరులను ప్రేరేపించడానికి, కోచింగులు ఇవ్వడానికి, మంత్రులుగా, ఫిలాసఫర్లుగా రాణిస్తారు.


మకర రాశి =

వీరి గుణం: చాలెంజ్ లను ఇష్టపడతారు.. జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. చాలా మెచ్యూర్ గా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: ఐటీ, మెడిసిన్, బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం మంచిది.


కుంభరాశి=

వీరి గుణం: చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు. క్యూరియాసిటీ ఎక్కువ‌. ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు: సైంటిస్ట్ లు ఏరోనాటిక్స్, ఆస్ట్రానమీ, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి ప్రొఫెన్స్ లో మంచి ఫలితాలు పొందుతారు.


మీన రాశి=

వీరి గుణం: సహాయపడే గుణం ఉంటుంది. చాలా సృజనాత్మకంగా, పాషినేట్ గా ఉంటారు.

రాణించ‌గ‌లిగే రంగాలు:   ఆర్టిస్ట్ లుగా మంచి లైఫ్ ఉంటుంది.


జాతక రీత్యా ఎవరు ఏ రంగాన్ని ఎంచుకుంటే సక్సెస్ అవుతారు అనే విషయం చాలా విస్తృతంగా ఉంటుంది. మరొకసారి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము.

గుర్రపు నాడా

 గుర్రపు నాడా 



గుర్రపునాడాని నల్లగుర్రానికి కొట్టబడిన వెనకనున్న ఎడమకాలి నాడాని మాత్రమే స్వీకరించాలి . గుర్రా నికి కొట్టకుండా ఉన్న నాడాని ఉపయో గించిన ఎటువంటి ఫలితము ఉండదు .


 గుర్రపునాడాని శనివారంగాని , శని త్రయోదశినాడు గాని సేకరించి గుర్రపునాడాకి హనుమాన్ సింధూరం పూసి ఉంచాలి . 


సింధూరంతో పూసిన గుర్రపునాడాని శనివారం ఉదయం “ ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః " అనే మంత్రం పఠిస్తూ ఇల్లు లేదా ఆఫీసు లేదా ఫ్యాక్టరీ యొక్క ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఉంచాలి . 


ఇంటికి సంబంధించినంత వరకు గుర్రపునాడాని “ A ” ఆకారంలో ఉంచాలి . ఇలా ఉంచటం వలన శనిదోషం , నరదృష్టి ప్రభావాలు తుప్పురూపంలో కిందకి అణగద్రొక్కబడతాయి . 


గుర్రపునాడాని వ్యాపార స్థలంలోగాని , ఫ్యాక్టరీ ప్రధాన ద్వారానికి ఎడమవైపున “ U ” ఆకారంలో ఉంచాలి . ఇలా ఉంచడం వలన ఇంటికిగాని , ఆఫీసుకిగాని శత్రుబాధలు , దృష్టిదోషాలు దరిచేరనివ్వదు


సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.

  సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ. 



ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.


ఓం గం గణపతయే నమః    సంకటహర గణపతి స్తోత్రం


ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం

భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం

లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ

సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం

ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్

ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం

నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో

విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం

పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్

జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్

సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

చామరం ( Chamaram )


 చామరం ( Chamaram ) 


లలితా సహస్రనామంలో చామరం గురించి ప్రస్తావన ఉంది . లలితా సహస్రనామ స్తోత్రములో ' స చామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా .

 " చామర ( మృగము వెంట్రుకలతో చేయబడిన ) వింజామరము లను చేతిలో కలిగిన రమా ( లక్ష్మీదేవి ) , వాణీ సరస్వతీదేవి ) , ఎడమ ( సవ్య ) , కుడి ( దక్షిణ ) వైపు ఉండి సేవిస్తుంటారు . " పంచభూత తత్వాలతో దేవా లయంలోను , 

పూజామందిరంలోను దేవతా విగ్రహా లకు పూజలు నిర్వహిస్తారు .

 దేవతా విగ్రహాలకు చందనం పూయుట “ భూతత్వం " , గంట మ్రోగించటం “ ఆకాశ తత్వం ” , దీపారాధన చేయటం " అగ్నితత్వం " , తీర్థప్రసాదం ఇవ్వటం “ జలతత్వం ” , చామరసేవ ( వింజామర వీచుట ) " వాయు తత్వం " గాను పూజలు నిర్వహిస్తారు .

 కొన్ని దేవాలయాలలో వింజామర సేవలు ( చామర సేవ ) నిర్వహిస్తారు . చామరం హిందూ దేవాలయాలలో కొన్ని పూజా సమయాలలో దేవునికి వింజామరలాగ వీచే ఉపకరణం .


 కొన్ని సేవలలో భక్తుల చేత కూడా వీనితో విసరమని చెబుతారు . దీనిని పొడవైన తెల్లని లేదా లేత గోధుమరంగులో ఉండే మెత్తని వెంట్రుకలతో తయారుచేస్తారు . ఈ వెంట్రుకలు ' చమరీ మృగం ' తోకభాగం నుండి తీస్తారు . 

పట్టుకోవడానికి అనువుగా వెండితో చేసిన పిడి ఉంటుంది . 


చమరీ మృగం వెంట్రుకలు కలిగిన క్షీరదాలు . దేవతల పూజాకార్యక్రమాలలో ఉపయోగించే చామరం దీని వెంట్రుకలతో తయారుచేస్తారు . కాబట్టి చమరీ మృగానికి ఇంత ప్రాముఖ్యత లభించింది .


కోరల పౌర్ణమి

కోరల పౌర్ణమి 

మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే. మార్గశిర మాసంలో . ఈ రోజు కోరల పౌర్ణమి అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు , అందువల్ల అనేక రకాల వ్యాధులు , అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికీ నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభం అయింది. కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారుచేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్ర వ్రతం చేయాలనీ పురాణాలు చెపుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు , అపమృత్యు భయాలు తొలగిపోతాయి.

శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం - పిఠాపురం

శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం - పిఠాపురం 

పిఠాపురాన్ని ఒకప్పుడు పీఠికాపురమని పిలిచేవారు. దేశంలోని త్రిగయల్లో పిఠాపురంలోని పాదగయ క్షేత్రం ఒకటి. ఇక్కడే కుక్కుటేశ్వరస్వామి ఆలయం కూడా ఉంది. గయాసురుడనే రాక్షసుడ్ని సంహరించడానికి శివుడు కోడిరూపం ధరించడంతో స్వామికి కుక్కుటేశ్వరుడనే పేరువచ్చింది. ఆదిశంకరాచార్యుడు ప్రతిష్టించిన రాజరాజేశ్వరీ దేవి ఆలయం కూడా ఇక్కడే ఉంది. పిఠాపురం సుప్రసిద్ధ దత్తక్షేత్రం. దత్తాత్రేయుని తొలి అవతారమైన శ్రీపాదవల్లభుడు తిరిగిన ప్రాంతం ఇది. కుక్కుటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో వున్న ఔదంబర వృక్షం (మేడిచెట్టు) మహిమాన్వితమైనదని చెబుతారు. చెట్టు మొదలులో ఉన్న పాదుకలు శ్రీపాదవల్లభునివని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీపాదవల్లభుని వృత్తాంతం : పూర్వం పిఠాపురంలో సుమతి, అప్పరాజు శర్మ అనే దంపతులు ఉండేవారు. వారు దత్తుడి భక్తులు. పిఠాపురంలో స్వయంభువుగా వెసిన దత్తుడు వారి ఇంటికెళ్ళి నిత్యం బిక్ష స్వీకరించేవాడు. ఓ సందర్భంలో సుమతి కోరికను మన్నించి దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాదవల్లభుడి రూపం కళ్ళకు కట్టినట్లు చూపించాడు. కంటే ఇలాంటి బిడ్డను కనాలి అనుకుంది ఆ ఇల్లాలి. ఆ కోరికను మన్నించి సుమతమ్మ గర్భంలో జన్నించాడు దత్తుడు. భరద్వాజ మహర్షి ఇక్కడొక యజ్ఞాన్ని చేస్తాడు. . ఆ ఫలాన్ని దత్తాత్రేయుడికిస్తూ ఇక్కడ జన్మించి ఈ నేలను చరితార్థం చేయగలవా అని వేడుకున్నాడు. అలా మహర్షి కోరిక మరియు పుణ్య దంపతుల కోరిక తీర్చడానికి శ్రీపాదవల్లభుడిగా పిఠాపురంలో జన్మిస్తాడు. ఆరో ఏట ఉపనయనం అయిన పిమ్మట చతుర్వేదాలను గడగడా అప్పజెప్పాడు. పదహారో ఏట తన అవతార లక్ష్యాన్ని తల్లికి వివరించి సన్యాస దీక్ష స్వీకరించాడు. వెంటనే దత్తధర్మ ప్రచారానికి బయలుదేరాడు. అట్నుంచి అనేక ప్రాంతాల్లో సంచరించి మహబూబ్‌నగర్ జిల్లాలోని కురుపురానికి చేరుకొని భక్తకోటికి అనేక మహిమలు చూపాడు . శ్రీపాద వల్లభుడితో పాటు శ్రీ నరసింహ సరస్వతి స్వామి (మహారాష్ట్ర), శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్‌ (గుల్బర్గా), అక్కల్‌కోట మహారాజ్‌ (అక్కన) దత్తుని అవతారామని చెబుతారు. . దత్తాత్రేయ జననం : అత్రి మహర్షి అననూయాదేవి ఆదర్శ దంపతులు. ముల్లోకాలోనూ ప్రసిద్ధికెక్కారు. ఒకసారి లక్ష్మీ,సరస్వతీ,పార్వతీ దేవి అనసూయను పరీక్షించటానికి త్రిమూర్తులను భిక్షువుల రూపంలో భూలోకానికి పంపారు. ఆ అతిధులను సాదరంగా ఆహ్వానించింది అనసూయా దేవి. అప్పుడు వారు దేవీ నువ్వు వివస్త్రగా మారి మాకు వడ్డన చేయాలి అన్న షరతు విధించారు. అనూయాదేవి ఆ ముగ్గురును పసిపిల్లలుగా చేసి గోము చేసి గోరుముద్దలు తినిపిస్తుంది. జోలపాడి నిద్రపుచ్చుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పసిసిల్లలై పోవటంతో నారదుడి సలహాప్రకారం లక్ష్మీ,సరస్వతీ, పార్వతీదేవి ముగ్గురూ అనసూయాదేవిని క్షమాపణ అడిగారు. దీంతో త్రిమూర్తులకు ఇదివరకటి రూపాలు వస్తాయి. అనసూయా దేవి భక్తికి మెచ్చి తమ అంశతో ఒక బిడ్డను ప్రసాదిస్తారు.. మార్గశిర పౌర్ణమినాడు దత్తాద్రేయుడు అనసూయా దేవి గర్భాన జన్మిస్తాడు. . ఎలా వెళ్ళాలి : పిఠాపురానికి, సామర్లకోట వరకూ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో చేరుకుని అక్కనుండి పదికిలోమీటర్ల దూరం ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. లేదంటే కాకినాడకు వెళ్ళి 20 కి.మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వెళ్ళవచ్చు జై శ్రీమన్నారాయణ🙏🏻

Friday, February 18, 2022

జపం-జపమాలలు-ఫలితాలు

 జపం-జపమాలలు-ఫలితాలు



జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు.

జపమాలలు 3 రకాలు

1. కరమాల

అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.

2. అక్షమాల

‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా  ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.

3. మణిమాలలు

రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.

ఫలితములు

రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాల జపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటి గుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపు మాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసి మాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.

జపం 3 విధాలుగా ఉంటుంది

1. వాచింకం

మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.

2. ఉపాంశువు

తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.

3. మానసికం

మనస్సులోనే మంత్రాన్ని జపించడం.

వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడా చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్ట దేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం చెబుతోంది. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.

తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.


త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే


అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా రుక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.

దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.

గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. 

జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో 'పగడాల మాల' కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి.

అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో మూలా నక్షత్రం లేదు.

 అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో మూలా నక్షత్రం లేదు.


అక్షరాభ్యాసం  శిశువుకు ఐదవ సంవత్సరంలో ఐదవ నెల ఐదవ రోజున  అక్షరాభ్యాసము చేయాలి. పాడ్యమి, అష్టమి, చతుర్దశీ, పౌర్ణిమ, అమావాస్య రోజులలో అక్షరాభ్యాసం చేయరాదు. ఇది బాగా తెలుసుకోండి. అలాగే దసరాలలో మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసం చేయరాదు. మీకు ధర్మశాస్త్రం మరియు పురాణాలలో ఈ విషయం రాసి ఉన్నది. నేడు సంఘంలో ఆచారం అయినది మూలానక్షత్రం రోజు పుస్తక రూపంలో సరస్వతీ ఆవాహన చేసి నాటి నుండి విజయదశమి రోజు వరకు వ్రాయుట, చదువుట, పాఠం చెప్పుట నిషేధం అని శాస్త్రం. 

 భవిష్యోత్తర పురాణంలో సరస్వతీ పూజ విషయమై ‘వేన్మూలాద్య పాదోవై క్షణాదాయాం కురూత్తమ తదా సరస్వతీ పూజా ప్రభాతే స్యాత్ పరేహని.. నాధ్యాపయేన్నచ లిఖేన్నాధీ రుూత కదాచన పుస్తకే స్థాపితే దేవ విద్యాకామో ద్విజోత్తమః’ అని వున్నది. ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా సమర్థించాయి. విజయ దశమి విశేషమే. అలాగే మరొక కొత్త ఆచారం ‘బాసరలో చేసినా’ ‘శ్రీపంచమి రోజు చేసినా’ ముహూర్తంతో అవసరం లేదు అని. 

 తారాబలం, గ్రహబలం లేని రోజులలో ముహూర్తం చేయవద్దు. మూఢమి అనధ్యయనం, ఆషాఢం, భాద్రపదం, పుష్య మాసములలో చేయవద్దు. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిధులు విశేషం. మంగళవారం నిషేధం. ఆది శనివారాలలో మాధ్యమం. అలాగే ‘ప్రదగ్గతే భాస్వతి పంచమేబే ప్రాప్తేక్షర స్వీకరణం శిశూనాం’ అన్నారు కావున ఉత్తరాయణం విశేషం. అయిదవ సంవత్సరం అక్షరాభ్యాసమునకు విశేషం. హస్త, పునర్వసు, స్వాతీ, అనూరాధ, ఆర్ద్ర, రేవతీ, అశ్వినీ, చిత్త, శ్రవణ నక్షత్రములు విశేషం. 

లగ్నాత్ అష్టమ స్థానము నందు వున్న శుభ పాపగ్రహం ఏదైనా చెడు ఫలితాలే ఇస్తుంది. అందువలన అష్టమ శుద్ధి కావాలి. కేవలం పూర్వాహ్ణంలోనే 12.00 వరకే కార్యక్రమం విశేషం. 3,6,10,11 స్థానములు లగ్నాత్ పాప గ్రహములతో కూడిన యెడల విశేషం. 1,2,4,5, 7,9,12,10 లలో 11లోను శుభ గ్రహములు వుండాలి. చంద్రుడు, గురువు మనసు విద్యలకు కారకులు కావున వారు బలంగా వున్న ముహూర్తం విశేషంగా చూడాలి. ‘

ఉత్తరాయణే సూర్యే కుంభ మాసం వివర్జయేత్’ ఉత్తరాయణంలో కుంభ మాసం విసర్జించాలి. ఇంత శాస్త్రంతో పని లేకుండా శ్రీపంచమి, దసరాలలో మూలా నక్షత్రం విశేషం అంటే ఎలాగ. ముహూర్త దర్పణం, ముహూర్త  రత్నావళి  చదవండి. అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో ‘మూల’ లేదు. పంచాంగాలలో అక్షరాభ్యాస నక్షత్ర లిస్ట్ చదవండి. మూలా నక్షత్రం లేదు.

అభ్యంగన స్నానం

 అభ్యంగన స్నానం



మానవుడికి స్నానం అనునది ఒక భోగం. ఒక యోగం. స్నానాన్ని ఏదో ఒళ్లు తడిపాము అన్నట్లుకాక తనువు మనసు తడిచేలా అనుభూతి చెందుతూ స్నానం ఆచరించాలి. చన్నీటి స్నానం శిరస్సు నుంచి ప్రారంభించాలి. వేడి నీటి స్నానం పాదాల నుంచి ప్రారంభించి తరువాత శరీరం తడపాలి. పురుషులు విధిగా రోజూ శిరస్నానం ఆచరించాలి. పర్వదినాలలోనూ, జన్మదినముననూ, విశేష క్రతువుల ప్రారంభంలోనూ అభ్యంగన స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి.


తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. శరీరానికి తైలాన్ని (నువ్వులనూనెను) బాగా రాసి మర్దన చేసి నలుగు పిండితో ఒళ్ళు రుద్దుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేయడాన్ని 'అభ్యంగన(తలంటి)స్నానం' అంటారు. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.


'అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం' (అభ్యంగన స్నానం అన్ని అవయవాలూ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడింది.


అయితే అభ్యంగన స్నానం నిత్యం చేయకూడదు. శ్రాద్ధ దినములయందు, ఆది, మంగళ వారములు, పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్ధశి తిధులయందు అభ్యంగన స్నానం చేయకూడదు. అనివార్యమై చేయవలసి వచ్చినప్పుడు ఈ కింద సూచించిన విధము చేయడం వలన దోషము తొలిగి శుభం కలుగుతుంది.


అభ్యంగన స్నాన వారదోషములు


ఆదివారం      - తాపము. నివారణకు నూనెలో పుష్పములు.

సోమవారం    -   కాంతి, మనోల్లాసము.

మంగళవారం - మృతి. నివారణకు నూనెలో మన్ను.

బుధవారం    - లక్ష్మీ కటాక్షము.

గురువారం     - ధన నాశం. నివారణకు నూనెలో గరిక.

శుక్రవారం     - విపత్తు. నివారణకు నూనెలో గోమయం.

శనివారం       - భోగము


అయితే పండుగ, శుభదినములకు ఈ దోషము వర్తించదు. స్త్రీలకు గురు, శుక్రవారములు శుభములు.

సంకట నాశన గణేష్ స్తోత్రం, గణపతి అధర్వణ శీర్షం ప్రాముఖ్యత

 సంకట నాశన గణేష్ స్తోత్రం, గణపతి అధర్వణ శీర్షం ప్రాముఖ్యత 


బహుళ చవితి అంటే పౌర్ణమి తరువాత చవితి ని “సంకటహర చతుర్ధి” అని అంటారు. ఈ పర్వదినాన వినాయకుడిని అర్చిస్తే సకల కష్టాలు దూరమవుతాయని పురోహితులు చెబుతున్నారు. జాతకంలో దోషాలు ఉంటే కేతువు బాగోలేక పోతే,  వివాహ ఆటంకాలు, సంతానం ఆటంకాలు,  ఇల్లు ఆటంకాలు, విద్యలో ఆటంకాలు, ఏదయినా ఒక పని ఆలస్యం  అవుతుంది అనుకునే వారు అందరు ఈ పూజ చేయవచ్చు.

సంకట హర చతుర్థి పూజ చేసే విధి విధానం :

సంకటాలు ఉన్నపుడు, వినాయకుడు సంకల్పం చెప్పుకుని అ రోజు తెల్లవారుఝామున లేచి తలారా స్నానం చేసి దీపం పెట్టుకుని మిగిలిన పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంకాలం మల్లి స్నానం చేసి ఇంట్లో ఒకవేళ వినాయక విగ్రహం ఉంటే గణపతి అధర్వణ శీర్షం తో అభిషేకం చేసుకోవటం మరీ విశేషం.

గణపతి అధర్వణ శీర్షం చదువుకోవడం, వీలయితె గణపతి మంత్రాని “ఓం గం గణపతయే నమః” అనే నామాన్ని జపించుకోవచ్చు.

గరిక, ఎర్రని గన్నేరు పూలు, ఎర్రని మంధార పూలు, ఎర్రని గులాబీలు, ఎర్రని రక్త చందనం పెట్టి గణపతికి పూజ చేయాలి. తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే మహా విశేషం.

సంకట నాశన గణేష్ స్తోత్రం

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |

భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |

తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |

సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||

నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |

న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |

పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |

సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||

అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ |

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||

గణపతి అధర్వణ శీర్షం

గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్)

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః

భద్రం పశ్యే మాక్ష భిర్యజత్రాః

స్థిరై రంగై స్తుష్ఠువాగ్‍ం సస్తనూభిః

వ్యశే మదేవ హితం యదాయుః

స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః

స్వస్తి నః పూషా విశ్వవేదాః

స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః

స్వస్తి నో బృహస్పతిర్దధాతు

మూల మంత్రం[మూలపాఠ్యాన్ని సవరించు]

ఓం నమస్తే గణపతయే

త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి

త్వమేవ కేవలం కర్తాసి

త్వమేవ కేవలం ధర్తాసి

త్వమేవ కేవలం హర్తాసి

త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి

త్వం సాక్షా దాత్మాసి నిత్యమ్ ||1||

ఋతం వచ్మి

సత్యం వచ్మి ||2||

అవ త్వం మామ్

అవ వక్తారమ్

అవ శ్రోతారమ్

అవ దాతారమ్

అవ ధాతారమ్

అవా నూచాన మవ శిష్యమ్

అవ పశ్చాత్తాత్

అవ పురస్తాత్

అవో త్తరా త్తాత్

అవ దక్షిణా త్తాత్

అవ చోర్ధ్వా త్తాత్

అవా ధరా త్తాత్

సర్వతో మాం పాహి పాహి సమంతాత్ ||3||

త్వం వాఙ్మయః త్వం చిన్మయః

త్వ మా నందమయః త్వం బ్రహ్మమయః

త్వం సచ్చిదా నందా ద్వితీయోసి

త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి

త్వం ఙ్ఞానమయో విఙ్ఞానమయోసి ||4||

సర్వం జగదిదం త్వత్తో జాయతే

సర్వం జగదిదం త్వత్త స్తిష్ఠతి

సర్వం జగదిదం త్వయి లయమేష్యతి

సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి

త్వం భూమి రాపోనలో నిలో నభః

త్వం చత్వారి వాక్పదాని ||5||

త్వం గుణ త్రయా తీతః

త్వమ్ అవస్థా త్రయా తీతః

త్వం దేహ త్రయా తీతః

త్వం కాల త్రయా తీతః

త్వం మూలా ధార స్థితో సి నిత్యమ్

త్వం శక్తి త్రయాత్మకః

త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్

త్వం బ్రహ్మా

త్వం విష్ణు

త్వం రుద్ర

త్వం ఇంద్ర

త్వం అగ్ని

త్వం వాయు

త్వం సూర్య

త్వం చంద్రమా

త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ ||6||

గణాదిం పూర్వ ముచ్చార్య వర్ణాదీం స్తదనం తరమ్

అనుస్వారః పరతరః

అర్ధేందు లసితమ్

తారేణ ఋద్ధమ్

ఎత త్తవ మను స్వరూపమ్

గకారః పూర్వ రూపమ్

అకారో మధ్య మరూపమ్

అనుస్వా రశ్చాంత్య రూపమ్

బిందు రుత్తర రూపమ్

నాదః సం ధానమ్

సగ్ంహితా సంధిః

సైషా గణేశవిద్యా

గణక ఋషిః

నిచ్రుత్ గాయత్రి చ్ఛందః

శ్రీ మహా గణపతి ర్దేవతా

ఓం గం గణ పతయే నమః ||7||

ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి

తన్నో దంతిః ప్రచోదయాత్ ||8||

ఏకదన్తం చతుర్హస్తం పాశ మంకుశ ధారిణమ్

రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషక ధ్వజమ్

రక్తం లంబో దరం శూర్పక ర్ణకం రక్త వాస సమ్

రక్త గంధా ను లిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్

భక్తా నుకంపి నం దేవం జగత్కారణ మచ్యుతమ్

ఆవి ర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురు షాత్పరమ్

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః ||9||

ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః

ప్రమథ పతయే నమస్తేస్తు లంబోదరాయ

ఏకదంతాయ విఘ్నవినాశినే శివ సుతాయ శ్రీవరద మూర్తయే నమో నమః ||10||

ఏ తద థర్వ శీర్షం యోధీతే

స బ్రహ్మభూయాయ కల్పతే

స సర్వ విఘ్నైర్న బాధ్యతే

స సర్వతః సుఖ మేధతే

స పంచ మహా పాపాత్ ప్రముచ్యతే

సాయ మధీయానో దివస కృతం పాపం నాశయతి

ప్రాత రధీయానో రాత్రి కృతం పాపం నాశయతి

సాయం ప్రాతః ప్రయుంజానో యపాపో భవతి

ధర్మార్థ కామ మోక్షం చ విందతి

ఇదమ థర్వశీర్షమ శిష్యాయ న దేయమ్

యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి

సహస్రా వర్తనాద్యం యం యం కామమ ధీతేతం తం

తమనేన సాధయేత్ ||11||

ఫలశ్రుతి[మూలపాఠ్యాన్ని సవరించు]

అనేన గణపతి మభిషిం చతి

స వాగ్మీ భవతి

చతుర్థ్యా మనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి

ఇత్య థర్వణ వాక్యమ్

బ్రహ్మా ద్యాచరణం విద్యాన్న బిభేతి కదాచనేతి ||12||

యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి

యో లాజైర్యజతి స యశోవాన్ భవతి

స మేధావాన్ భవతి

యో మోదకసహస్రేణ యజతి స వాఞ్ఛితఫలమవాప్నోతి

యః సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వంలభతే ||13||

అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి

సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వాజప్త్వా సిద్ధమంత్రో భవతి

మహా విఘ్నాత్ ప్రముచ్యతే

మహా దోషాత్ ప్రముచ్యతే

మహా పాపాత్ ప్రముచ్యతే

మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే

స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి

య ఏవం వేద

ఇత్యుపనిషత్ ||14||

చివరి శాంతి మంత్రం

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః

భద్రం పశ్యే మాక్ష భిర్యజత్రాః

స్థిరై రంగై స్తుష్ఠువాగ్‍ం సస్తనూభిః

వ్యశే మదేవ హితం యదాయుః

స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః

స్వస్తి నః పూషా విశ్వవేదాః

స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః

స్వస్తి నో బృహస్పతిర్దధాతు

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS