పవిత్ర గోదావరి నదీ తీరంలోని ఓ పర్వతం పై వీరభద్రుడు లింగ రూపంలో కొలువై ఉన్నారు. ఇలా వీరభద్రుడు శివలింగం రూపంలో కొలువై ఉన్న పుణ్యక్షేత్రం భారత దేశంలో ఇక్కడ మాత్రమే ఉంది. ఇక ఇక్కడే వీరభద్రుడు భద్రకాళిని వివాహం చేసుకొన్నట్లు చెబుతారు.
ఇక ప్రమధ, భూత గణాలకు అధిపతి అయిన వీరభద్రుడు కొలువై ఉన్న ఈ క్షేత్రం 🙏🙏🙏
శివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. అదే విధంగా పౌర్ణమి రోజున, సోమవారాల్లో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు
పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలం నందు పట్టిసం అను గ్రామం కలదు. ఈ పాంతమును పట్టిసీమ గా పిలుస్తారు. అఖండ గోదావరి నదీ గర్భములో దేవకూట పర్వతం ఉంది. పూర్వం " పట్టిసాద్రి " గా పిలిచేవారు. ఇది హరి హర క్షేత్రం గా ఖ్యాతి పొందినది. దక్షుడ్ని సంహరించిన వీరభద్రుడు తన ఆయుధమగు పట్టసాన్ని (కత్తి) గోదావరి నదిలో కడిగి, కొండపైన స్వయంభూ లింగమగా వెలిసాడు. ఆ లింగమును " శ్రీ వీరేశ్వర స్వామి " గా పిలుస్తారు. స్వామి ఉగ్రరూపం ను శాంతి పర్చుటక, మహావిష్ణువు కమలములుతో ఆ లింగమును ఆరాధించినట్లు స్ధల పురాణం తెల్పుతుంది. ఇది పంచ శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రతీతి. ఈ క్షేత్రం నకు దూరంగా గల పర్వతాలును "ఏనుగుల కొండ" గా పిలుస్తారు. ఇచ్చట గజేంద్ర మోక్షం జరిగినట్లుగా చెప్పుచుంటారు. దేవకూట పర్వతం నకు దక్షిణ భాగంలో శైవాలయం ఉంది. ఇది గొప్ప శిల్ప సంపద కలిగియున్నది. కొండకు ఉత్తర భాగంలో వైష్ణ్వాలయం ఉంటుంది. ఇది పంచ భావనారాయణ ఆలయాల్లో ఒకటి. ఈ రెండు ఆలయాలుకు మధ్యన " అనిస్త్రీ - పునిస్త్రీ " అను గ్రామదేవతులు మరియు సీతారామస్వామి ఆలయాలున్నాయి.
కొండపైన గల ఆలయాలు చేరుటకు మెట్లు మార్గం కొండకు దక్షిణ భాగంలో ఉన్నాయి. ఆలయ ప్రవేశం రాజగోపురం క్రింద నుంచి జరుగుతుంది. ముందుగా శివాలయం దర్శనం అవుతుంది. గర్భాలయం నందు శ్రీ వీరభద్రస్వామి లింగ రూపంలో తూర్పు అభిముఖంగా దర్శనమిస్తాడు. స్వామికి నిత్య పూజలుతో పాటు మహాశివరాత్రికి గొప్ప మేళా జరుగుతుంది. కార్తీక మాసం నందు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించుతారు. పూజ సామగ్రి కొండపైన విక్రయించుతారు. ఆలయ దర్శనం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలు వరకు లభ్యమవుతుంది. వీరభద్ర స్వామి గర్భాలయం చుట్టూ నందీశ్వరుడు, త్రిశూళం, భద్రకాళి దేవి, సూర్యనారాయణ స్వామి, లక్ష్మీ-గణపతి, నవగ్రహ మండపం మొదలగు సన్నిధిలు కలవు.
శివాలయం దాటగానే అనిస్త్రీ - పునిస్త్రీ అను గ్రామదేవతల సన్నిధి పశ్చిమ ముఖంగా ఉండును. పట్టిసీమ ప్రాంత ప్రజలు సంతానం మరియు సౌభాగ్యం కోసం గ్రామదేవతులును ఆరాధించుతారు. మరికొంత దూరంలో సీతారామస్వామి ఆలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
శ్రీ భావనారాయ స్వామి ఆలయం కూడ పశ్చిమాభి ముఖంగా ఉండును. శ్రీ వైష్ణువులు కొండ ప్రాంతమును "నీలా చలం" గా ఆరాధించుతారు. గర్భాలయం నందు శ్రీ - భూ - నీల సమేత స్వామి చక్ర - శంఖు - గద -అభయ ముద్రతో దర్శనమిస్తాడు. ఇచ్చట స్వామి వారి వామన హస్తం నందు శ్రీ చక్రం చూడగలం. ఇది క్షేత్రం విశేషం గా చెప్పుచుంటారు. స్వామికి నిత్య అర్చనలుతో పాటు చైత్ర శుద్ధ ఏకాదశి కి కళ్యాణోత్సవాలు నిర్వహించుతారు.
సమీప రైల్వే స్టేషన్ కొవ్వూరు. ఇచ్చట ప్యాసింజర్ మరియు కొన్ని ఎక్సెప్రెస్ సర్వీసులు ఆగుతాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ లో అన్ని ముఖ్య రైలు ఆగుతాయి. ప్రయాణికులుకు మంచి సౌకర్యములు రాజమండ్రి లో దొరుకుతాయి. రాజమండ్రి మెయిన్ బస్ స్టాండ్ నుంచి పోలవరం కు (రూట్ నెం. 110) బస్సులు ప్రతి 20 నిముషాలుకు బయులుదేరును. ఇవి కొవ్వూరు బస్ స్టాండ్, తాళ్ళపూడి, పట్టిసం మీదగా ఉంటాయి. ప్రయాణికుల అభ్యర్ధన బట్టి బస్సులు పట్టిసం తీర్ధాల రేవు వద్ద ఆగుతాయి. భక్తులు ముందుగా పుణ్య స్నానములు ఆచారించుతారు. పిమ్మట తీర్ధాలు రేవు నుంచి అవతలి తీరం కు లాంచీ లో ప్రయాణం సాగించుతారు. ప్రయాణం నకు రుసం చెల్లించాలి. ఆవలి తీరం నుంచి మెట్లు వరకు ఇసుక తిన్నెలు (దిబ్బలు) పైన నడక ప్రయాణం. రాజమండ్రి నందలి కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి పోలవరం కు షేరింగ్ ఆటోలు బయులు దేరుతాయి. ఇవి గోదావరి నది గట్టు (కట్ట) మీదగా వయా కొవ్వూరు(గోష్పాద), కుమారదేవం, తాళ్ళపూడి, పట్టిసం మీదగా ఉంటాయి.