Sunday, January 4, 2026

*క్రమం తప్పకుండా క్షురకర్మ hair cut చేసుకోవాలి*??

క్రమం తప్పకుండా క్షురకర్మ hair cut చేసుకోవాలి*??


 జుట్టు, గోళ్లు కత్తిరించుకోవడం చేయడం వల్ల కలిగే ప్రయోజనం 
పాపశమనం హర్షలాఘవసౌభాగ్యవర్ధనమ్ |
ఉత్సాహబలమోదార్థం క్షురకర్మ ప్రశస్యతే ||

ఇది పాపాలను అశుభాన్ని తొలగిస్తుంది, మనసుకి ఉత్సాహాన్ని, శరీరానికి తేలికదనాన్ని, అందాన్ని మరియు బలాన్ని ఇస్తుంది.

*బ్రహ్మచారులు*  ఎప్పుడూ చేసుకోవాలి???
బ్రహ్మచారి విద్యాభ్యాసం లో ఉండి నిష్ఠగా ఉండే వారు

మాసి మాసి చతుర్థ్యాం వా పౌర్ణమాస్యాం తథైవ చ|
క్షురకర్మ ప్రకర్తవ్యం బ్రహ్మచారివతైస్థితైః ||

 బ్రహ్మచారి వ్రతంలో ఉన్నవారు నెలకు ఒకసారి ముఖ్యంగా చతుర్థి లేదా పౌర్ణమి వంటి తిథులలో శాస్త్రోక్తంగా క్షురకర్మ చేసుకోవాలి.

*గృహస్థులు ...ఎప్పుడూ చేసుకోవాలి???
పక్షాంతే వా పక్షముఖే గృహస్థస్య విధీయతే |
క్షురకర్మ విశేషేణ శ్రేయస్కామస్య సర్వదా ||

శ్రేయస్సును కోరుకునే గృహస్థుడు పక్షం ముగిసేటప్పుడు (అమావాస్య/పౌర్ణమికి ముందు) లేదా పక్షం మొదట్లో క్షురకర్మ చేసుకోవాలి. అంటే నెలకు రెండుసార్లు చేసుకోవడం ఉత్తమం.

*యతీశ్వరులు ఎప్పుడూ ???
ఓషధ్యః ప్రసవంతి చ మాసి మాసి వపంత్యపి |
ఋతుసంధిషు వా కుర్యాత్ పక్షాంతేషు చ వా యతిః ||
 యతులు మాస సంధి (నెల నెలకు) లేదా ఋతు సంధి (ప్రతి రెండు నెలలకు) లేదా పక్షాంతమున (పక్షం చివరన) వపనం చేయించుకోవాలి.
*ప్రస్తుత ఆచారం: చాలామంది సన్యాసులు ప్రతి పౌర్ణమికి వపనం చేయించుకోవడం ఒక నియమంగా పాటిస్తారు.

************

*క్షుర కర్మ Hair cut చేసుకునే క్రమం???
నఖాని ప్రథమం ఛింద్యాత్ తతః శ్మశ్రూణి వపయేత్ 
తతః కక్షౌ తతః శీర్షం ఏష క్షురవిధిః స్మృతః ||"

*నఖాని ప్రథమం: మొదట గోళ్లను కత్తిరించాలి.
*తతః శ్మశ్రూణి: ఆ తర్వాత మీసాలు/గడ్డం ముఖం క్షౌరం చేయాలి.
*తతః కక్షౌ: ఆ తర్వాత చంకలు.
*తతః శీర్షం: చివరగా తల వెంట్రుకలను కత్తిరించాలి ఇది శాస్త్ర సమ్మతమైన క్షుర విధి.

*దిశ మరియు కూర్చునే పద్ధతి క్షౌరం చేయించుకునేటప్పుడు ఏ దిశకు ముఖం పెట్టాలి??? Direction 

"ప్రాఙ్ముఖః క్షురకర్మాణి కారయేత్ ప్రయత్నతః |
ఉదఙ్ముఖో వా కుర్వీత ఆయుష్యమభివర్ధతే ||"

ఆయుష్షు పెరగాలని కోరుకునే వారు తూర్పు ముఖంగా (East) లేదా ఉత్తర ముఖంగా (North) కూర్చుని క్షురకర్మ చేయించుకోవాలి. పడమర లేదా దక్షిణ దిశలు నిషిద్ధం.

*భోజన నియమం (నిరాహారిగా ఉండటం)???
క్షురకర్మను ఆహారం తీసుకోకముందే పూర్తి చేయాలని శాస్త్రం చెబుతోంది.
***"భుక్త్వా క్షురకర్మ న కుర్వీత"***
Before having food 
 భోజనం చేసిన తర్వాత క్షురకర్మ (క్షౌరం) చేయించుకోకూడదు. ఎందుకంటే క్షౌరం తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి , భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం ఆరోగ్యానికి (జీర్ణక్రియకు) హానికరం.
*******************
ముఖ్యంగా.......
*చెడు కాలాలు క్షురకర్మ hair cut అశుభం ????
"ఆయుష్య్యం కర్మణో హానిః పుత్రానాం చైవ నాశనమ్ |
ధనధాన్య వినాశశ్చ వారేషు క్షురకర్మణి ||"

తగని రోజుల్లో క్షురకర్మ (క్షౌరము haircut) చేయించుకోవడం వల్ల ఆయువు క్షీణించడం, పనులకు ఆటంకం కలగడం, సంతానానికి కష్టం కలగడం మరియు ధనధాన్యాలు నశించడం వంటి ఇబ్బందులు కలుగుతాయని దీని అర్థం.
*********
మరి ఏ రోజులు మంచివి?????

*శుభప్రదమైన తిథులు* (Auspicious Tithis)

"ద్వితీయా చ తృతీయా చ పంచమీ సప్తమీ తథా |
దశమీ చ త్రయోదశ్యాం క్షురం కుర్యాత్ శుభావహమ్ ||"
2 (విదియ), 3 (తదియ), 5 (పంచమి), 7 (సప్తమి), 10 (దశమి), 13 (త్రయోదశి) ఈ తిథులలో క్షౌరము శుభ ఫలితాలను ఇస్తుంది.
*********
*నిషిద్ధ తిథులు (Forbidden Tithis)???

"అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చైవ సర్వదా 
పర్వసంధిషు యత్నేన క్షురకర్మ వివర్జయేత్ ||"

*అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య (పర్వదినాలు) మరియు సంక్రాంతి వంటి రోజుల్లో క్షవరం చేసుకోకూడదు.

*సమయం: గృహస్థులు సాధారణంగా నెలకు రెండుసార్లు (పక్షానికి ఒకసారి) క్షురకర్మ చేసుకోవడం ఉత్తమమని శాస్త్రం చెబుతోంది.

*రిక్తా తిథులు మరియు పర్వదినాలు నిషిద్ధం???

"చతుర్థీ నవమీ చైవ చతుర్దశ్యాం చ పర్వసు |
క్షురకర్మ న కుర్వీత పుత్రాయుః క్షేమ నాశనమ్ ||"

నిషిద్ధ తిథులు చతుర్థి (4), నవమి (9), చతుర్దశి (14). వీటిని 'రిక్తా' తిథులు అంటారు.

*పర్వదినాలు అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఏకాదశి మరియు సంక్రాంతి వంటి పుణ్య దినాల్లో క్షౌరము చేసుకోకూడదు.

*నిషిద్ధ నక్షత్రాలు (Forbidden Stars)*????
వ్యాధి లేదా ఆయుక్షీణతను కలిగించే నక్షత్రాలు:
"కృత్తికా భరణీ చైవ మఘా చాశ్లేష విశాఖః |
జ్యేష్ఠా మూలార్ద్ర నక్షత్రే క్షురం వర్జ్యం ప్రయత్నతః ||"
వర్జ్య నక్షత్రాలు: కృత్తిక, భరణి, మఖ, ఆశ్లేష, విశాఖ, జ్యేష్ఠ, మూల మరియు ఆరుద్ర నక్షత్రాలలో క్షౌరము ఖచ్చితంగా మానుకోవాలి.

*******

*శుభప్రదమైన నక్షత్రాలు (Auspicious Stars)???
క్షౌరమునకు అనుకూలమైన నక్షత్రాలు తెలుసుకుందాము ????

"అశ్విన్యుశన రోహిణ్యః పుష్యే పునర్వసు తథా |
శ్రవణం చ ధనిష్ఠా చ శతభిషక్ హస్త రేవతీ ||"
ఈ క్రింది నక్షత్రాలు క్షురకర్మకు ఉత్తమమైనవి
అశ్విని
మృగశిర
రోహిణి
పుష్యమి
పునర్వసు
శ్రవణం
ధనిష్ఠ
శతభిషం
హస్త
రేవతీ
స్వాతి, అనురాధ (కొన్ని గ్రంథాల ప్రకారం)
**********************

*వారాలను బట్టి ఫలితాలు ??????
రవౌ తాపః సోమే శోకో భౌమే మృత్యుర్బుధే ధనమ్ 
గురౌ పుత్రవినాశశ్చ భృగౌ లక్ష్మీః శనౌ మృతిః ||"

*రవౌ (ఆదివారం): తాపము (వేడి లేదా మనస్తాపం) కలుగుతుంది.
*సోమే (సోమవారం): శోకము (దుఃఖం) కలుగుతుంది. (గమనిక: కొన్ని గ్రంథాల్లో సోమవారం శుభప్రదమని కూడా ఉంది).
*భౌమే (మంగళవారం): మృత్యు భయం లేదా ఆయు క్షీణత.
*బుధే (బుధవారం): ధన లాభం మరియు శుభం కలుగుతుంది.
*గురౌ (గురువారం): సంతానానికి హాని లేదా విద్యా విఘ్నం.
*భృగౌ (శుక్రవారం): లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం కలుగుతుంది.
*శనౌ (శనివారం): మృతి (అనారోగ్యం లేదా ఆపదలు).

ఇంకో వివరణ 

ఆదివారే హరేదాయుః సోమవారే వివర్ధతే |
బుధవారే ధనం ధాన్యం శుక్రవారే చ సంపదః ||"

*ఆదివారం: ఆయువును హరిస్తుంది (తగ్గిస్తుంది).
*సోమవారం: ఆయువును వృద్ధి చేస్తుంది (పెంచుతుంది).
*బుధవారం: ధనధాన్యాలను ప్రసాదిస్తుంది.
*శుక్రవారం: సంపదను మరియు శుభాలను ఇస్తుంది.

*******
 వివాహము, ఉపనయనము వంటి శుభకార్యాల సమయంలో మరియు యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు ఈ నియమాలకు మినహాయింపు ఉంటుంది.
********

క్షౌరము చేసుకున్న తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలి  శాస్త్రం ప్రకారం, "క్షురకర్మణి స్నానం ఆచరేత్" అంటే క్షురకర్మ తర్వాత స్నానం చేయకపోతే అది అశుభంగా పరిగణించబడుతుంది.

*************
స్త్రీలకు క్షౌర శాస్త్ర విధి లేదు ( చేయకూడదు )

*సర్వాన్ కేశాన్ సముద్ధృత్య ఛేదయేదంగుళద్వయమ్ |
ఏవం నారీకుమారీణాం శిఖాయాస్తు వివర్జనమ్ ||

*స్త్రీలు లేదా కుమారిలు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా పూర్తిగా గుండు చేయించుకోకూడదు. జుట్టు చివరలను కేవలం రెండు అంగుళాల మేర మాత్రమే కత్తిరించాలి (వపనానికి బదులుగా).

*శాస్త్రం ప్రకారం స్త్రీల జుట్టు లక్ష్మీ స్వరూపం. కాబట్టి, వేదోక్తంగా లేదా ధర్మబద్ధంగా స్త్రీలు గుండు చేయించుకోవడం లేదా అనవసరంగా జుట్టు కత్తిరించుకోవడం నిషిద్ధం.
************************************
'ముండనం' (मुण्डनम्) గుండు కొట్టించడం??????

*పుణ్యక్షేత్ర కాశీ, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పురుషులు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలని శాస్త్రం చెబుతుంది, కానీ స్త్రీలకు ఆ నియమం లేదు.

"ముండనం చోపవాసశ్చ సర్వతీర్థేష్వయం విధిః |
వర్జయిత్వా కురుక్షేత్రం విశాలం పుష్కరం గయామ్ ||"
ఈ విధి పురుషులకు వర్తిస్తుంది. స్త్రీల విషయంలో కేవలం "వేణి దానం" (వేణి అంటే జడ - జడ చివరను కొద్దిగా కత్తిరించడం) మాత్రమే చేయాలని నిర్ణయించబడింది.

ప్రయాగే కాశీకాపుర్యాం గయాయాం చ విశేషతః |
వపనం చైవ కర్తవ్యం పితౄణాం తారణాయ చ ||

ప్రయాగలో, కాశీలో, మరియు ముఖ్యంగా గయలో పితృదేవతల ఉద్ధరణ కోసం మరియు తన పాప పరిహారం కోసం క్షౌరం (గుండు) చేయించుకోవాలి.

 ఈ శ్లోకం అక్కడ చదువుకోవాలి....

యాని కాచాపి పాపాని బ్రహ్మహత్యా సమాని చ |
కేశానాశ్రిత్య తిష్ఠంతి తస్మాత్ కేశాన్ వపామ్యహమ్ ||

 బ్రహ్మహత్యా పాతకంతో సమానమైన నా పాపాలన్నీ నా వెంట్రుకలను ఆశ్రయించి ఉన్నాయి. అందుకే ఆ పాపాలను వదిలించుకోవడానికి నేను ఈ కేశాలను తొలగించుకుంటున్నాను.
**************

కొందరి వంశాలలో?????

పితృకార్యము/అశౌచ సందర్భంలో 

"జ్ఞాతిభిః సహితః కుర్యాత్ కేశశ్మశ్రు నఖచ్ఛేదనం |
సర్వపాప విశుద్ధ్యర్థం వపనం కారయామ్యహమ్ ||"

జ్ఞాతులతో (బంధువులతో) కలిసి, చేసిన సమస్త పాపాల నుండి విముక్తి పొంది, శుద్ధిని సాధించడం కోసం శిరోజాలను, మీసాలను, గోర్లను తొలగించుకుంటున్నాను అని దీని అర్థం.
*************

ఒకే కుటుంబం లో తండ్రి కొడుకు క్షౌరము నిషిద్ధం????

పితాపుత్రౌ తథా భ్రాతృ ద్వయం చైకత్ర వాసరే |
క్షౌరం చ నైవ కుర్వీత ముండనం మరణప్రదమ్ ||"

తండ్రి మరియు కుమారుడు, అలాగే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒకే రోజున క్షౌరం లేదా గుండు చేయించుకోకూడదు. అలా చేయడం వల్ల వంశానికి కీడు జరుగుతుందని లేదా ఆయుక్షీణం (మరణప్రదం) కలుగుతుందని శాస్త్రం హెచ్చరిస్తోంది.

ఈ నియమానికి సంబంధించిన ముఖ్య విషయాలు
*వరుస క్రమం: ఒకే ఇంట్లో తండ్రి, కొడుకు ఉండగా.. ముందు తండ్రికి క్షౌరం జరగాలి, ఆ తర్వాత కొడుకుకి జరగాలి. కానీ ఇద్దరూ ఒకే రోజు చేయించుకోవడం నిషిద్ధం.

*మినహాయింపులు ఈ నియమం సాధారణ సందర్భాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో దీనికి మినహాయింపులు ఉన్నాయి

*తీర్థయాత్రలు: కాశీ, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, గంగానది తీరంలో మొక్కులు తీర్చుకునేటప్పుడు తండ్రి-కొడుకు కలిసి గుండు చేయించుకోవచ్చు.

*అశౌచం (మైల) కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు వచ్చే అశౌచ సమయంలో శుద్ధి కోసం అందరూ కలిసి క్షౌరం చేయించుకోవచ్చు.

*యజ్ఞ దీక్ష: ఏదైనా యజ్ఞం లేదా పెద్ద వ్రతం చేసే సమయంలో దీక్షాంగంగా చేసే క్షౌరానికి ఈ దోషం వర్తించదు.
****************************************
బ్రిటిష్ వాళ్ళు కావాలని sundays అలవాటు చేసి 
ఆరోగ్యం ఆయుషు  భారతీయుల్ని దారి మళ్లించారునెలల ప్రకారం ఆయు క్షీణ విషయం 

రవివారే భవేన్మాసం, మంగళే చ చతుర్దశ |
గురువారే అష్టమాసం చ, శనివారే తు సప్తచ ||"

*ఆదివారం: క్షౌరం చేసుకుంటే 1 నెల ఆయువు క్షీణిస్తుంది.
*మంగళవారం: క్షౌరం చేసుకుంటే 8 నెలల ఆయువు క్షీణిస్తుంది.
*శనివారం: క్షౌరం చేసుకుంటే 7 నెలల ఆయువు క్షీణిస్తుంది.
*గురువారం: క్షౌరం చేసుకుంటే 10 నెలల ఆయువు క్షీణిస్తుంది. దీనికి exeption ఉంది

*పై చిత్రం చిన్నహాస్యం ఆనందం  కోసం మాత్రమే
ఎవరిని నిందించడం అభిప్రాయం కాదు*
*************************************
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 
*రాళ్ళబండి శర్మ*

No comments:

Post a Comment

RECENT POST

దానాలు - శుభ ఫలితాలు*

దానాలు - శుభ ఫలితాలు*  ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుంది.. అనే మాటలు మనం వింటూ ఉంటాము. పురాణాలు కూడా దానం చ...

POPULAR POSTS