Tuesday, April 30, 2024

శాస్త్రవేత్తలకే అంతుచిక్కని సైన్స్.... మహాభారతంలో ఏంటో 🤔చూద్దాం పదండి*

శాస్త్రవేత్తలకే అంతుచిక్కని సైన్స్.... 
మహాభారతంలో ఏంటో 🤔చూద్దాం పదండి*

👉మహాభారతం వ్యాసుడు రచించి 5,000 సంవత్సరాలు అవుతుంది. అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.

*5 వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో సంసృుతం తప్ప వేరే భాష లేదు. ఇప్పటికీ వేరే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా గ్రంధాన్ని రచించడం గొప్ప విషయం.*

👉 మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు, ఇంతటి *5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం వేరే ఏదీ రాకపోవడం విచిత్రం.*

👉 భారతం అప్పటి గొప్ప చరిత్రను తెలియజేస్తుంది, ఇప్పటికీ అందని *సైన్స్ కనుక్కొని విషయాలను ఎన్నో మనకు మహాభారతం చెపుతుంది. 

వాటిలో కొన్ని:

*👉మహాభారతంలోని ఆదిపర్వం లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.*

👉ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక వ్యాసుడు *నియోగ ధర్మం* ద్వారా అంబా, అంబాలిక లకు కనడం. దాసికి *విదురుడు జన్మించడం.*

*👉 ఇందులో ఏం విచిత్రం ఉంది అంటున్నారా?*

👉ఇక్కడ ముగ్గురికి పుత్రుల జన్మించడం జరిగింది మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు.
*1974లో  అయోవ యూనివర్సిటీలో *డోనాల్డ్ లాకె* అనే ఇద్దరూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు, *స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితి లే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాయి, అని ప్రపంచానికి తెలియజేశారు.*

👉నేడు మనం వాడే *స్పెర్మ్ డొనేషన్* ఆనాటి
*నియోగపద్ధతి ఒకటే.*

గాంధారి కుంతి పై అసూయతో తన గర్భంపై కొట్టుకోగా ఆ పిండం కింద పడింది.
👉 వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని 101 కుండల్లో ఆవు నెయ్యి నింపి, ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు, గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు, మాతృ తల్లి ప్రేమ స్పర్శ ద్వారా ఆ కుండలలోని పిండాలు బయట కూడా పెరిగాయి.

*👉 వీటిని నేటి ఆధునిక  వైద్యులు మూడు రకాలుగా విభజించారు.*

పిండాలను ముక్కలు చేయడం మెడికల్ భాషలో 1.*స్లైసింగ్ ఎంబ్రియో*

2.*ఆర్టిఫిషియల్ యూటర్నెస్* కృతిమ గర్భాన్ని పోలిన వాతావరణాన్ని నిర్మాణం చేయడం. 

3. *మదర్ టచ్*

*👉 టెస్ట్ ట్యూబ్ బేబీ లు గా పుట్టిన వారు -వశిష్ఠుడు, అగస్త్యుడు. ద్రోణాచార్యుడు , క్రుతుడు, కృపి. 

అనగా ఆ రోజులలోనే స్త్రీ బీజం నుంచి అండ కణాన్ని  సేకరించి , గర్భాశయం బయట చుట్టూ పోషకాల నుంచి వీర్యకణాలను వదలడం అనేది 5 వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమే కదా!

*👉 ద్రోణుడిని కుంభసంభవుడు అని అంటారు* అంటే ప్రత్యేకమైన కుండ లో పుట్టిన వాడు అని అర్థం.

ఇక శిఖండి పాత్ర:-
*Transgender*  *Trans sexual* *లింగ మార్పిడి*
మహాభారతం కాలం నాటికే ఇది ఉంది భీష్ముడిని చంపేందుకు అంబా శిఖండి గా మారింది. *మొదటి అడ పిల్లగా పుట్టి మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి. ఇప్పుడూ మనం చెప్పుకునే *Transsexualism* ఇపుడు surgery లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఒక యక్షుడు ఆమెకు *సైకియాట్రిక్ treatment చేయటం జరిగింది.* అడ పిల్లగా పుట్టి పూర్తిగా మగ వాడిలా మారడం.

*బృహన్నల పాత్ర:-
*Temporary Trans-sexualisum* ఇప్పటి మోడర్న్ సైన్స్ లో *hermaphroditism*
అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి పురుషుడు గా మారే ప్రక్రియ ఇది ఉర్వశి శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో  శాపం ఆయనకు అదే మేలు చేసింది.

*ఇద్దరు తల్లుల గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన బలరాముడు:-
యోగ మాయ ద్వారా *రోహిణి గర్భం లోకి మార్పు  చేయ బడిన ఎంబ్రీయో ద్వారా ఇది సాధ్య పడింది.

దీనికి నేటి సైన్సు వివరణ:-
*Effortless reciprocal IVF* అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మీరు గానీ *3 నవంబర్ 2018 ఈనాడు పేపర్* తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అమెరికాలో ఇద్దరు యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరికీ ఒక పిల్లవాడిని కనాలనిపించింది. కానీ ఇద్దరు యువతులే కదా ఎలా కంటారు, ప్రకృతి ఒప్పుకోదు కదా! 

కాని దీనిని *Bedford hospital in Texas* వాళ్ళు చేశారు.
IVF ద్వారా ఎంబ్రియో కొన్నాళ్లు ఒక తల్లి గర్భంలో మరికొన్నాళ్లు ఇంకో తల్లి గర్భంలో పెరిగిన బిడ్డనుకన్నారు.

*జరాసంధుడు పాత్ర*
జర అనే రాక్షసి చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు.

ఈమధ్య మోడన్ మెడిసిన్ లో *Replantation surgery* యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోతే దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి సర్జరీ చేస్తే ఆ తెగిపోయిన భాగాన్ని శరీరానికి అతికించవచ్చు దాన్ని  మళ్ళీ యదావిధిగా చేయవచ్చు.

*1962 లో బోస్టన్ లో తెగిన చెయ్యిని 
అతికించారు, award కూడా పొందాడు.*

*అర్జునుడు-  సమ్మోహన ప్రయోగించిన సమ్మోహనాస్త్రం మరొక విచిత్రం.  దీనిని ఉత్తర కుమారుడి తో పాటు కౌరవుల మీద యుద్దం చేసే సమయంలో తను ప్రయోగించిన విషయం మనకు తెలుసు. (నర్తనశాల సినిమాలో మనకు చూపించారు).

ఇలాటిదే మనకు 1770 లో Mesumer ద్వార వచ్చినా mesumerisum BV పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్, PC సర్కార్ వాళ్ళు చేసి చూపారట.

*మహాభారత యుద్దం సమయంలో ఇలాటివే 
అనేక అస్త్ర, శాస్త్రాలూ ఉపయోగించారన్నది 
మనం చదివాము. 
ఉదా:- బ్రహ్మాస్త్రం,  నారాయణ అస్త్రం, పాశుపతాస్త్రం etc*

ఇలాటిదే ఆ మద్య world war లో 06-Aug-1945 హీరోషిమా నాగసాకి పై జరిపిన అణు విస్ఫోటనం*

👉  Physics సూత్రాలు 
*నాసతో విద్యతే బహో నా భావవన్ విద్యతే సతః* అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము, లేని దాని నుంచి పుట్టించలేం.

👉పదార్థం శక్తిగా మారుతుంది, 
శక్తి పదార్థంగా మారుతుంది. E=mc2

*👉 ఓపెన్ హైమర్ అణుబాంబు గురించి అడిగితే గీతా లో దివి సూర్య సహస్రశ్చ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు.*
ఆటంబాంబ్ విస్ఫోటనం తో సమానం శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శనం అంధుడైన  ధృతరాష్ట్రుడు 
ఈ విశ్వరూపన్ని చూసినట్టు మహాభారతం చెబుతోంది. అంటే అందులకు కూడా 
కనిపించెంత శక్తి అదీ. 

మహాభారతంలో *భారతీయులు 
ఇలాంటివి ఎన్నో చేసి చూపారు.  

ఆధునిక కాలంలో ఈ విదేశీయులు చేస్తున్నది 
వేల సం॥ క్రితమే మన పూర్వులు చేసారు.

*AA Garbosky scientists* హర్యానా లోని  అస్తిపంజరాలు సేకరించి వాటిలో *రేడియో యాక్టివిటీ* ఎంత ఉందో పరిశోధన చేశాడు
ఆశ్చర్యంపోయి ఇలా అన్నాడు. *మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నిటికంటే గొప్ప ఆయుధాలను వాడారు కానీ వాటిని అయోగ్యులకు తెలియకూడదు అని గుప్తంగా ఉంచారు అని చెప్పారు.*

*👉 మాక్రో, మైక్రో  వైజేశన్ శరీరం పెరగటం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆసిమ్మం కూడా వివరించారు, స్థూల పెద్ద, సూక్ష్మ చిన్న రూపం.*

*ఎందరో విదేశీయులు మహాభారతంలోని గుర్తించిన విషయాలను మనం గుర్తించలేకపోయారు. మన ఊహకు కూడా అందనంత సైన్స్ టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది.*

*ఇలాంటి విషయాలను తెలుసుకోలేని అజ్ఞానులు అసలు మహాభారతంలో, పురాణాల్లో ఏముందండి అంతా ట్రాష్, పుక్కిటి పురాణాల్లో అని చెప్తారు ఇప్పుడు అలాంటి వారే పాశ్చాత్యులు చెప్తే నోర్లు వెళ్ళబెట్టి చూస్తారు.*

*మన న దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణ ఇతిహాసాల పైన పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కడుక్కున్నాము వాటిని అని నమ్మిస్తే మనం కూడా వారికి జైజైలు కోడుతున్నాము.*

*ఇప్పటికైనా ఆలోచిద్దాం భావితరాలకు* 
*మన పురాణ ఇతిహాసాలలోని*
*గొప్పదనాన్ని వివరింద్దాము.*
సేకరణ

అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!

అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం.
అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం
మనకు అర్థమవుతుంది.
అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు.
మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.
ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.
యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.
ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి,
అతిరథి,
మహారథి,
అతి మహారథి,
మహామహారథి.

1) రథి..💐
ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.
సోమదత్తుడు,
సుదక్షిణ,
శకుని,
శిశుపాల,
ఉత్తర,
కౌరవుల్లో 96మంది,
శిఖండి,
ఉత్తమౌజులు,
ద్రౌపది కొడుకులు -
వీరంతా..రథులు.

2) అతి రథి (రథికి 12రెట్లు)..💐
60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
లవకుశులు,
కృతవర్మ,
శల్య,
కృపాచార్య,
భూరిశ్రవ,
ద్రుపద,
యుయుత్సు,
విరాట,
అకంపన,
సాత్యకి,
దృష్టద్యుమ్న,
కుంతిభోజ,
ఘటోత్కచ,
ప్రహస్త,
అంగద,
దుర్యోధన,
జయద్రథ,
దుశ్శాసన,
వికర్ణ,
విరాట,
యుధిష్ఠిర,
నకుల,
సహదేవ,
ప్రద్యుమ్నులు
వీరంతా..అతిరథులు.

3) మహారథి (అతిరథికి 12రెట్లు).💐
7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
రాముడు,
కృష్ణుడు,
అభిమన్యుడు,
వాలి,
అంగద,
అశ్వత్థామ,
అతికాయ,
భీమ,
కర్ణ,
అర్జున,
భీష్మ,
ద్రోణ,
కుంభకర్ణ,
సుగ్రీవ,
జాంబవంత,
రావణ,
భగదత్త,
నరకాసుర,
లక్ష్మణ,
బలరామ,
జరాసంధులు
వీరంతా..మహారథులు.
4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).💐
86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.
ఇంద్రజిత్తు,
పరశురాముడు,
ఆంజనేయుడు,
వీరభద్రుడు,
భైరవుడు -
వీరు..అతి మహారథులు.
రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు,
అటు ఇంద్రజిత్తు -
ఇటు ఆంజనేయుడు.
రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.

5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .💐
ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,
దుర్గా దేవి,
గణపతి మరియు
సుబ్రహ్మణ్య స్వామి,
వీరంతా..మహామహారథులు.
మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం
హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.
అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు .... లెక్కలకు అందని గొప్ప ధర్మం మన హైందవ ధర్మం.... _శవాల సమాధుల శ్మశానాలా మనకు సాటీ_!!!

Friday, April 26, 2024

ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు ఏడున్నర* *సంవత్సరాలు ఉంటే* *ఆ కాలాన్ని* *"ఏలిన నాటి శని"* *అంటారు.* *ఏలిన నాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరిగా వుంటుంది.*

*ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు ఏడున్నర*  *సంవత్సరాలు ఉంటే*
*ఆ కాలాన్ని*  *"ఏలిన నాటి శని"*
*అంటారు.*   *ఏలిన నాటి శని  ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరిగా వుంటుంది.*


ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం.
శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి  వచ్చాడు. 
అక్కడ వానరులందరూ
సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను  ఏరి పెడుతున్నాడు.  శ్రీ రాముడు
ఒక బండ మీద  ఆశీనుడై 
పర్యవేక్షిస్తున్నాడు.
అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి 
" నేను హనుమంతుని పట్టుకొనే
కాలం వచ్చింది."  అని
శ్రీ రాముని అనుమతి అడిగాడు.  
" నన్నెందుకు అనుమతి అడగడం.. నీ విధిని నీవు చెయ్యి "  అని
అన్నాడు శ్రీ రాముడు.

హనుమంతుని వద్దకు వెళ్ళి శని " నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు   ఉండబోతున్నాను."  అన్నాడు శనీశ్వరుడు. 

"నేను రామ కార్యంలో నిమగ్నమైయున్నాను ఇపుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు .
" సరి ,   ప్రస్తుతానికి ఏడున్నరమాసాలు వుంటాను  ,సరేనా " అన్నాడు.  అందుకు హనుమ ఒప్పుకోలేదు.
...ఏడున్నర వారాలు ..  అంటూ
కాల ప్రమాణం  తగ్గించుకుంటూ  వచ్చాడు 
శనీశ్వరుడు .
హనుమంతుడు ,  రామనామం ఆపకుండా
జపిస్తూనే  చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు. 
అప్పుడు శనీశ్వరుడు  "నీ కాళ్ళలో ప్రవేశించనా" 
అని అడిగాడు. 
హనుమంతుడు "వద్దు ...
సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి ..  పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం"
అన్నాడు.
" సరి, నీ చేతులు పట్టుకోనా"
అన్నాడు శనీశ్వరుడు .
ఆ రాళ్ళని చేతులతోనే  కదా మోసిబి
తెస్తున్నాను.  చేతులు పట్టుకోవద్దు. అన్నాడు
హనుమంతుడు. 
"అయితే, నన్ను ఏం చెయ్యమంటావు? 
నీ భుజాల పైన ఎక్కమంటావా"  అన్నాడు
శనీశ్వరుడు. 

"రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను.  అందువలన
భుజాలు ఎక్కడానికి వీలులేదు " అన్నాడు హనుమంతుడు. 

" పోనీ, నీ  హృదయం లో  వుండవచ్చునా?"
అని అడిగాడు శనీశ్వరుడు.

"ఈ హృదయంలో, మహాలక్ష్మీరూపిణి  అయిన సీతాదేవి,
నా దేవుడైన 
శ్రీరాముడు
నిరంతరంగా నివసిస్తూ వున్నారు ...అక్కడ నీకు
చోటు లేదు. " అన్నాడు
హనుమ.

" సరే , చివరకు నీ శిరస్సు ఒక్కటే
ఖాళీగా వున్నది.  అక్కడే వుంటాను "అని
శనీశ్వరుడు , హనుమంతుని శిరస్సు
పైన ఎక్కి కూర్చున్నాడు.

హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పై( అంటే శనీశ్వరుని
మీద) పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు.
ఆ బండరాళ్ళ బరువును మోయలేక
శనీశ్వరుని కళ్ళుతేలేసాడు.  మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే, 
శనీశ్వరునికి ఊపిరి సలపక
గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని
సముద్రంలో వేసిన మరుక్షణమే
శనీశ్వరుడు హనుమ శిరస్సుపైనుండి  కిందకి దూకేశాడు. 

" మారుతీ, నీ వల్ల నాకు శ్రీ రాముని సేవించుకునే
భాగ్యం కలిగినది . నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీముందు నా శక్తిచాలదు. నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా" 
అంటూ  చేతులెత్తేసి ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు. 
హనుమంతుని ముందా కుప్పిగంతులు!

నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు
 రెండు క్షణాలు కూడా
పట్టుకొనలేడు.  
 పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం
శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి
విముక్తి కలిగి తీరుతుంది.
సేకరణ .
*జై శ్రీరామ్* 🚩
*జై హనుమాన్* 🚩

Thursday, April 25, 2024

పంచ దేవతలు ఎవరు?

పంచ దేవతలు ఎవరు?


🌸🌸🌸🌸🌸

"పంచాయతనము" గురించి క్లుప్తంగా తెలుసుకుందాము:-

"ఆదిత్య మంబికా విష్ణుం, గణనాథ మహేశ్వరమ్!
సర్వేష్టం సారభూతం చ, పంచదేవాయ సేవనమ్!!"

తాత్పర్యం:- 
సూర్యుడు, అంబిక, విష్ణు, గణపతి, ఈశ్వరుడు వీరినే పంచ దేవతలు అంటారు. వీరు కలియుగ పాపకర్మలు భరించలేక కొన్ని ప్రత్యేక శిలల్లో ఉన్నట్లు 'సిద్ధాంత శేఖరం'లో చెప్పబడినది. ఆ శిలలో మాత్రమే ఆ దేవతా విగ్రహాలను మలచి పూజలు సల్పిన సత్ఫలితము లొసంగును. దేవతా పూజా నిరాటంకముగా (ఆటంకం లేకుండా) సాగ గలదు.

పంచదేవతా పూజ చాలా ప్రశస్తమని 'దేవీ భాగవతము' నందు కలదు. కలియుగ ధర్మాన్ని అనుసరించి ఈ అయిదుగురు దేవతలు ఆయా సాలగ్రామ శిలలోనే ఉంటారట.

1) సాల గ్రామ లింగం (విష్ణువు):-
ఈ శిలలు నేపాల్ లో ముక్తినాథ దగ్గర గండకీ నది యందు లభించును. ఈ శిలలు చిన్న చిన్న రంధ్రములు కలిగి ఉంటాయి. నీటిలో రాయి వేసి తులసీ దళం వేసిన ఆ రంధ్రానికి దగ్గరగా తులసి చేరునట. విష్ణువుని మధ్యలో పెట్టి మిగతా దేవతా విగ్రహాలు శాస్త్ర ప్రకారము పెట్టిన, అది విష్ణు పంచాయతన మందురు. అట్లు పూజించిన వారికి విష్ణు సాయుజ్యము కలుగునని పద్మ పురాణంలో గలదు. 

2)బాణ లింగం(శివుడు):- 
మధ్యప్రదేశ్ లో ఓంకారేశ్వర్ దగ్గర నర్మదానదిలో లభించును. బాణలింగ సహిత రుద్రుని పూజించుట వల్ల ఆత్మజ్ఞానం లభించును. బాణలింగ సహిత రుద్రుణ్ణి మధ్యలో పెట్టి పూజించిన శివాపంచాయతనమందురు.

3)స్ఫటిక లింగం (సూర్యుడు):- 
ఈ స్ఫటిక లింగాలు తంజావూరు దగ్గర కావేరీ నదిలో లభించును. ఆదిత్యం ఆరోగ్యం అన్నట్లు సూర్య పూజ వల్ల ఆరోగ్యం లభించును. సూర్యుని మధ్యలో పెట్టి పూజించిన సూర్య పంచాయతనమందురు. 

4)అంబికా లింగం (అంబిక):- 
ఈ లింగములు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి దగ్గర గల సువర్ణముఖీ నదిలో దొరుకును. అంబికాలింగ సహిత పూజ సల్పిన భోగం లభించునని సిద్ధాంత శేఖరంలో గలదు. దేవీస్తానమందు దుర్గనుగాని, లక్ష్మినిగాని, సరస్వతిని గాని, శక్తి శ్రయాన్ని అర్చించవచ్చు.

5)శోణలింగం (గణపతి):-
ఉత్తరప్రదేశ్ లోని శోణభద్ర జిల్లాలో యున్న నదిలో కల శిలలు మైనాక పర్వతం నుండి ఉత్తరంగా వచ్చి గంగలో(పాట్నా వద్ద) కలియుచున్నది. ఈ శోణలింగ సహిత గణపతి పూజ వల్ల కార్యములు నిర్విఘ్నముగా నెరవేరును. గణపతిని మధ్యలో పెట్టి ఉంచిన గణపతిపంచాయతన మందురు.

హరిః ఓమ్

Wednesday, April 24, 2024

అరుణాచలంలో ఉదయం నుండి రాత్రి దాకా భోజనాలు ఎక్కడెక్కడ లభించును అనే ఇన్ఫర్మేషన్ సేకరించి పొందుపరుస్తున్నాం అవసరం ఉన్నవాళ్లు ఉపయోగించుకోండి.

*అరుణాచలంలో ఉదయం నుండి రాత్రి దాకా భోజనాలు ఎక్కడెక్కడ లభించును అనే ఇన్ఫర్మేషన్ సేకరించి పొందుపరుస్తున్నాం అవసరం ఉన్నవాళ్లు ఉపయోగించుకోండి.*


1. ఉదయం 5:00 నుంచి 5:30 లోపు శేషాద్రి అశ్రమం దగ్గర్లో తిరువడు దురై ఆటో వస్తుంది. (కామాక్షి గుడి దగ్గరనుండి వరుణ లింగం వరకు వెళ్తుంది) ఈ ఆటోలో వేడివేడి ఇడ్లీ సాంబారు, హెర్బల్ టీ లభించును.
2. ఉదయం 7.45 గంటలకు అతిధి ఆశ్రమం ముందు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం పక్కన మీనమ్మ అని ఒక ఆవిడ వేడి వేడి ఇడ్లీ చట్నీ సాంబార్ ఇస్తారు. ఇక్కడ ప్లేట్స్ మీరే తీసుకొని వెళ్లాలి.
3. ఉదయం 8 గంటలకు యమాలింగం పక్కన టిఫిన్ పెడతారు.
4. ఉదయం 8 గంటలకు 63 నాయనర్లు గుడి దాటాక షేడ్ (వరుణ లింగం దగ్గర)లో సుకినోభవ ట్రస్టు వారు  వేడివేడి టిఫిన్ అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇస్తారు.
5. ఉదయం 8 గంటలకు 63 నాయనర్లు గుడి వారు ప్రసాదం ఇస్తారు.
6. ఉదయం 8 గంటలకు వళ్ళలార్ (రమణ ఆశ్రమం డిస్పెన్సెర్ ముందు) నందు టిఫిన్ పెడతారు
7. ఉదయం 7:30 నుండి చంద్ర లింగం దాటిన తరువాత (అధికార నందికి ముందు) కుడివైపు వళ్ళలార్ వాళ్ళు గంజి పొస్తారు.
8. ఉదయం 8 గంటలకు సౌత్ గోపురం ముందు వున్న వినాయక గుడిలో గంజి పొస్తారు.
9. ఉదయం 9:00 గంటలకు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం వారు టిఫిన్ పెడతారు.
10. ఉదయం 9:30 గంటలకు రమణ మహర్షి ఆశ్రమం నందు పెరుగన్నం, సాంబార్ అన్నము పెడతారు.
11. ఉదయం 11 గంటలకి యమలింగం దాటిన తర్వాత నంది పక్కన రుద్రాక్ష స్వామి వారు భోజనం ఇస్తారు.
12. ఉదయం 11 గంటలకి రాఘవేంద్ర స్వామి గుడిలో నిత్యగ్ని ట్రస్టు వారు భోజనం పెడతారు.
13. ఉదయం 11:15 గంటలకు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమంలో సాధువులకు (పర్మిషన్ తీసుకున్న వారికి) మాత్రమే భోజనం పెడతారు.
14. ఉదయం 11:30 గంటలకు ఆది అన్నామలై గుడిలో భోజనం లభించును.
15. ఉదయం 11:30 గంటలకు నీర్ అన్నామలై గుడి వెనకాల జీవ కారుణ్య, వల్లలార్, ఇంకొక ఆశ్రమం వుంది ఈ మూడు ఆశ్రమాలలో భోజనం లభించును.
16.  12:00 గంటలకు సద్గురు ట్రస్ట్ (సడై స్వామి) నందు భోజనం లభించును.
17.  12:00 గంటలకి టెంపుల్ దగ్గర గాంధీ బొమ్మ వెనకాల సాదు సదం (సత్రం) గ్రిల్స్ ఉంటాయి అందులో సాధువులకు మాత్రమే భోజనం లభించును ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు గంటలకల్లా అక్కడికి వెళ్లాలి నిమిషం అటు ఇటు అయినా లోపలికి రానివ్వరు.
18.  12:00 గంటలకు అన్నామలై మెయిన్ గుడి భోజనం లభించును దీనికి క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే వెళ్లి నిల్చోగలరు రోజుకి 3 బంతులకు భోజనం పెడతారు.
19. 12:00 గంటలకు వళ్ళలార్ (రమణ ఆశ్రమం డిస్పెన్సెర్ ముందు) నందు భోజనం పెడతారు.
20. 12:00 గంటలకు శేషాద్రి ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నము లభించును.
21. 12:00 నుండి చంద్ర లింగం దాటిన తరువాత (అధికార నందికి ముందు) కుడివైపు వళ్ళలార్ వాళ్ళు భోజనం పెడతారు.
22. 12:30 గంటలకు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నము లభించును.
23. గిరివలం రహదారిలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఆహార వాహనం బండ్లు తిరుగుతూ ఉంటాయి మీకు కనబడినప్పుడు మీరు ఆపి తినవచ్చు.
24. పెద్ద గుడి దగ్గర రాజగోపురం ముందు ఎడమవైపు కుడివైపు మెయిన్ రోడ్ లో ఉదయం పూట, సాయంత్రం పూట ఎవరో ఒకరు బండి మీద ప్రసాదం పెడుతూనే ఉంటారు.
25. సౌత్ గోపురం ముందున్న రోడ్ లో కామాక్షి గుడి దాటాక వచ్చే ఎడమ పక్క రహదారిలో కొంచెం ముందుకు వెళ్ళాక ఆవులు కట్టేసి ఉంటాయి అక్కడ ఉదయం పూట టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం పూట భోజనం పెడతారు, సాయంత్రం పూట భోజనం పెడతారు.
26. గిరి వలం రహదారిలో రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అన్ని ఆశ్రమాలలో అప్పుడప్పుడు (డోనార్స్ వున్నప్పుడు) భోజనం పెడుతూనే ఉంటారు.
27. 4గంటలకు అతిధి ఆశ్రమం (యోగి రాం సూరత్ కుమార్ ముందు) వాళ్ళు సాధువులకు టిఫిన్ పాకెట్స్ ఇస్తారు.
28. సాయంత్రం 5 గంటలకు పలకొత్తు శక్తి అమ్మ గుడి వెనుక చపాతీ కానీ ఇడ్లీ కానీ పాకెట్స్ (పర్మిషన్ తీసుకున్న వాళ్లకు లోపల) ఇస్తారు. 
29. సాయంత్రం 5 నుండి 63 నాయనర్ ట్రస్ట్ (సద్గురు ట్రస్ట్ ఎదురు, వరుణ లింగం వెళ్ళాక ముందు ఎడమవైపు) వాళ్ళు సాంబార్ రైస్ పెడతారు.
30. సాయంత్రం 6 గంటల నుండి సద్గురు ట్రస్ట్ (సడై స్వామి) బండి గిరివలం రోడ్ లో భోజనం పెడుతూ శేషాద్రి ఆశ్రమం వరకు వస్తారు.
31. సాయంత్రం 6:00 గంటలకు  శేషాద్రి స్వామి వారి హారతి తరువాత ప్రసాదం పెడతారు.
32. సాయంత్రం 6:00 నుండి 6:30 గంటల వరకు అగస్తియర్ ఆశ్రమం నందు చపాతీ ఇస్తారు, వీరు ఉదయం 7:00 గంటలకు టిఫిన్ ఇస్తారు, 11:00 గంటల నుండి బోజనం పెడతారు. వీరికి ఇప్పుడు ఫండ్స్ లేవు కనుక చపాతీ మాత్రమే ఇస్తున్నారు. ఈ ఆశ్రమం నాన్నగారి ఆశ్రమం దగ్గర వుంది.
33. సాయంత్రం 7:30 గంటలకు కొడిస్వామి (వరుణ లింగం వెళ్ళాక ముందు ఎడమవైపు) వారు ప్రసాదం పెడతారు.

Tuesday, April 23, 2024

ఉబ్బలి బసవన్న

పూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో ఒక మహా శివభక్తుడైన విశ్వబ్రాహ్మణ మహా శిల్పి వుండేవాడు.

ఆయన ఒకసారి మల్లికార్జున స్వామి ని సేవించ డానికి శ్రీశైలం వచ్చాడు.

అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు.

తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణం లోనూ బయటా కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు.ఉత్సాహంతో పని ప్రారంభించాడు.

శిల్పి నక్త వ్రతాన్ని(పొద్దున్నించీ భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు) పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు.

కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా వున్న నందులను చూసి ఆనందించాడు.

కానీ ఏమి లాభం?వెంటనే విచారం లో మునిగి పోయాడు

.ఈ మహత్తర పెద్ద  నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి?అన్నదే అతని బాధ.

మధ్యలో పాతాళగంగను కూడా దాటాలి మరి.

నిద్రకూడా పట్టలేదు.అర్ధ రాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి.

వెంటనే ఒక కల. 
కలలో స్వామి కరుణించాడు.

స్వామి శిల్పి తో యిలా అన్నాడు.
భక్తా! నీ సంకల్పం మహత్తర మైనది. నీ శ్రమ ఫలించింది.ఇవిగో ఈ పలుపు త్రాళ్ళను తీసుకొని నందుల మెడలకు తగిలించు. వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో...

వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి.

ఎదురుగా పలుపు త్రాళ్ళు కనిపించాయి.

సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు వెంటనే త్రాళ్ళను నందుల మెడలకు తగిలించాడు.త్రాళ్ళను చేత బట్టి శ్రీశైలానికి బయల్దేరాడు.

తెల్లవారు ఝాముకు పాతాళగంగను చేరుకున్నాడు.

 అలాగే కృష్ణానదిని దాట సాగాడు.నీటిలో కొంత దూరం వెళ్ళాడు.రెండవ ఒడ్డుకు చేరబోతున్నాడు.

ఒక నంది అతని ముందు వున్నది యింకొకటి వెనక వస్తున్నది. వెనక వస్తున్న నంది కాలు నీళ్ళలోని రాళ్ళ మధ్య యిరుక్కొని అది రావడం మానేసింది కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి.అంతే కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్ళీ శిలగా మారిపోయింది.

శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నంది తోనే శ్రీశైలం చేరాడు.

 ఇప్పుడు.శ్రీశైలం లో వున్న నంది.ఆ మహాశిల్పి చేసినదే.. 

ఇది యదార్ధ గాధ.

ఊబినుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది 
"ఉబ్బలి బసవన్న" అని పిలువబడుతూ ఇటీవలి కాలం వరకూ భక్తులకు దర్శన మిచ్చేది.

శ్రీశైలం ప్రాజెక్ట్ 
వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతున నీటిలో యిప్పటికీ  వుందట..ఆ పాతాళగంగలో మునిగి ఉన్న  రెండవ నంది ఉబ్బలి బసవడు.🙏🙏🙏

Monday, April 22, 2024

హనుమంతునికి మనం భోజనం పెట్టగలమా

*_"హనుమంతునికి మనం భోజనం పెట్టగలమా!!!"_*
*=================*
_(ఇది సేకరణ మాత్రమే...)_ 


🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*"హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో.. ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను, నేనే స్వయంగా  వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను" అంది సీతమ్మతల్లి...* 

*పిలువు పిలువు...*
*నీకే అర్థం అవుతుంది*
*అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ.*  
*అన్నట్టుగానే సీతమ్మతల్లి స్వయంగా వంటచేసి...* 
*హనుమను భోజనానికి పిలిచింది...*
*తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ...*

*"కడుపునిండా తిను నాయనా...,* 
*మొహమాటపడకు"*  
*అని చెప్పింది...* 

*"సరేనమ్మా"* 
*అని చెప్పి హనుమ*
*తలవంచుకుని భోజనం చేయసాగాడు...*
*సీతమ్మతల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది...* 
*హనుమ వద్దు అనకుండా...* 
*వంచిన తల ఎత్తకుండా* *పెట్టినదంతా తింటున్నాడు.*

*కాసేపట్లో సీతమ్మతల్లి*
*స్వయంగాచేసిన వంటంతా*
*అయిపోయింది...*
 *సీతమ్మతల్లి కంగారు పడి*
*అంఃతపురవాసుల కోసం*
*వండిన వంటంతా తెప్పించింది...* 
*అదీ అయిపోయింది....*
*తలవంచుకునే*  
*ఆహరం కోసం నిరీక్షిస్తూన్నాడు...*
*హనుమ* 
*ఆవురావురమంటూ....*

*సీతమ్మతల్లికి* 
*కంగారు పుట్టి....* 

*"రోజూ ఏం తింటున్నావు నాయనా?"...*
*అని అడిగింది*
*హనుమ ఎంతో వినయంగా...*

*"శ్రీరామ నామం తల్లీ"...*
*వంచిన తలెత్తకుండా*
*జవాబిచ్చాడు  హనుమ...* 

*సీతమ్మతల్లి త్రుళ్లిపడింది...* 
*నిరంతరం  శ్రీరామనామం*
*భుజించేవాడు...,*
*భజించేవాడు...*
*పరమశివుడొక్కడే గదా!...*

*సీతమ్మతల్లి తేరిపార జూసింది...* 
*అప్పుడు కనిపించాడు సీతమ్మతల్లికి....*
*హనుమలో శంకరుడు...*

*శ్రీ శంకరుడే హనుమంతుడు....*

*నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించే వాడికి...*
*ఇంక తాను ఏమి పెట్టగలదు!🤔* 

*బాగా ఆలోచించిన సీతమ్మతల్లి* 
*ఒక అన్నపు ముద్దను పట్టుకుని...* 
*_"శ్రీరామార్పణం"_* 
*అని ప్రార్థించి వడ్డించింది...*
*ఆ ముద్దని భక్తితో* 
*కళ్లకు అద్దుకొని స్వీకరించిన హనుమ....* 

*_"అన్నదాతా సుఖీభవ!"_* 
*అన్నాడు హనుమ తృప్తిగా  ...*
*హనుమలోని పరమేశ్వరుడికి* 
*భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి...🙏* 
🍓🍓🍓🍓🍓🍓🍓🍓

Sunday, April 21, 2024

నవగ్రహ జపసంఖ్యా విషయము

నవగ్రహ జపసంఖ్యా విషయము


శ్లో॥ అయుతం చ సహస్రం చ పటృతం ద్విసహస్రకం ।

చతు:పంచసహస్రేణ

దిననిర్ణయ

తా॥ రవికి 10 వేలు, చంద్రునకు వేయి, కుజునకు 6 వందలు, బుధునకు 2 వేలు, గురునకు 4 వేలు, శుక్రునకు 5 వేలు, శనికి 300, రాహువుకు 300, కేతువుకు 600 చొప్పున ఈ ప్రకారము ఒక దినమునకు జపసంఖ్య నిర్ణయింపబడినది. ఈవిధంగా 40 దినములుగానీ, లేక తదర్ధముగానీ యథాశక్తి గ్రహజపము చేయించవలయును. (గమనిక: ఇది విశేష పద్ధతిగా ఇచట పేర్కొనబడినదని గమనింపగలరు. ప్రస్తుతము ఒక్కొక్క గ్రహమునకు నిర్దేశింపబడిన ఒక నియమిత సంఖ్యగా జపము చేయబడుచున్నది. ఇది కామ్యకర్మ కనుక, వెంటనే శీఘ్రముగా ఫలితము లభించుటకుగాను జ్యోతిషశాస్త్ర గ్రంథములయందు పేర్కొనబడిన విశేష జపసంఖ్యా పద్ధతినిగూర్చి ఇచట పేర్కొనబడినది.)

శ్లో॥ జపసంఖ్యా తద్దశాంశం తర్పణం కారయేత్సుధీః । తద్దశాంశం తు జుహుయా దశాంశం విప్రభోజనమ్ ॥

తా॥ పిమ్మట చేయబడిన జపంసఖ్యలో పదవ అంశము తర్పణము చేయవలెను. ఆ సంఖ్యలో దశాంశము హోమము చేయవలెను. ఆ సంఖ్యలో దశాంశము బ్రాహ్మణులకు అన్నసమర్పణ చేయవలయును.

శ్లో॥ గ్రహాణాం నవధాన్యాని సద్విప్రాయనివేదయేత్ | గ్రహదోషం నిహంత్యాశు గార్గేయవచనం తథా ॥ అపిచ ॥

శ్లో॥ పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధతే। తచ్చాంతిరౌషధైర్దానైర్జపహోమార్చనాదిభిః

గత జన్మలలో చేయబడిన పాపము వ్యాధిరూపంగా మారి ఈ జన్మలో బాధించును. ఇట్టి రోగబాధనుండి దూరమగుటకు ఔషధమును సేవింపవలెను. మరియు నవగ్రహములకు సంబంధించిన దానమును, జపమును, హోమమును మొ॥ వాటిని చేయింపవలెను.

॥ నవగ్రహ జపసంఖ్యావిషయము సమాప్తము ॥

Saturday, April 20, 2024

గురువు యెుక్క ప్రేమ!

*గురువు యెుక్క ప్రేమ!*

                

*1). విహంగ న్యాయం:-*

*పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.*

*అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.( స్పర్శ ప్రేమ మయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)*



*2). భ్రమర కీటక న్యాయం:-*

*భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది.*
*అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.*
*( వాక్కు మధురంగా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు )*



*3). మీన న్యాయం :-*

*చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణంగా చూస్తుంది.  తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలుగా మారుతాయి.*

 *ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడంవల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.*

*4). తాబేటి తలపు న్యాయము :-*

*తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి  ఆహారానికి వెళుతుంది.  ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది'.            ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి.*

*అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను ‘పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి!’ అని సద్గురువు 'సంకల్పిస్తారు'.*
*ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.*.

Wednesday, April 10, 2024

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు


ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది
ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి ఉంటే అది గణేశుని విశేష అనుగ్రహం కలుగజేస్తుంది🙏

🙏సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.🙏

🙏క్షేత్రచరిత్ర,స్థలపురాణం🙏

🙏సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.🙏

🙏ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!🙏

🙏కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!

🙏నిత్యం పెరిగే స్వామి🙏

🙏వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.🙏

🙏కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.🙏

🙏బ్రహ్మహత్యా పాతక నివారణార్థం:🙏

🙏స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.🙏

🙏దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు🙏

🙏మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.🙏

🙏సర్పదోష పరిహారార్థం🙏

🙏వరదరాజస్వామి ఆలయ నిర్మాణంస్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

🙏పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550🙏

🙏సేవాఫలితం: స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.
గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500🙏

🙏సేవాఫలితం🙏

🙏‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.🙏

🙏గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300
గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.🙏

🙏సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58🙏

🙏సేవాఫలితం🙏

🙏‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.🙏

🙏మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300🙏

🙏సేవాఫలితం: దీనినే నారికేళ పూ అంటారు. వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.🙏

🙏సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151🙏

🙏సేవాఫలితం🙏

🙏గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.🙏

🙏పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000🙏

🙏వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.🙏

🙏అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116🙏

🙏సేవాఫలితం: చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.🙏

🙏అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116🙏

🙏సేవాఫలితం: పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.🙏

వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51🙏

🙏సేవాఫలితం🙏

🙏వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.🙏

🙏వసతి & రవాణా సౌకర్యాలు🙏

🙏కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.

🙏తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.🙏

🙏ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లు పఠిస్తే చాలా మంచిది🙏ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి ఉంటే అది గణేశుని విశేష అనుగ్రహం కలుగజేస్తుంది🙏

🙏ఎంతటి కష్టాలైనా తొలగించే మహామహిమాన్వితమైన సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతిరోజూ కనీసం 4 సార్లు అయినా, 6 నెలలు పాటు భక్తి శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది🙏

🙏మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం🙏

🙏ఈ సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి🙏

🙏సంకట నాశన గణేశ స్తోత్రము - సంపూర్ణ అర్ధము🙏

🙏నారద ఉవాచ🙏

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే 1 

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ 2 

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ 3 

నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ 4 

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః 5 

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ 6 

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః 7 

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః 8 

🙏ఇతి సంకట నాశన గణేశ సంపూర్ణం🙏

🙏దేవతలందరికంటే  ముందుగా పూజిపబడే వాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా  నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను🙏

ప్రధమ నామం : వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు)

ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు)

తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు)

చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు)

పంచమ నామం: లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు)

షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు)

సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు)

అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు)

నవమ నామం: ఫాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు)

దశమ నామం: వినాయక (విఘ్నములకు నాయకుడు)

ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి)

ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు)

🙏ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును🙏

🙏ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాలపాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు🙏

🙏ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును🙏

🙏ఓం గం గణపతయే నమః

Tuesday, April 9, 2024

గృహ నిర్మాణం చేయవలసిన స్ధలం యొక్క ఎత్తు పల్లాలు ఫలితాలు ............!!

గృహ నిర్మాణం చేయవలసిన స్ధలం యొక్క ఎత్తు పల్లాలు ఫలితాలు ............!!


వాస్తులో ఎత్తు పల్లాలు(ఉచ్చ నీచలు) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక కాలంలో ఎత్తు పల్లాలకు అధిక ప్రాదాన్యతను ఇస్తూ చాలా ఎక్కువగా చూస్తున్నారు. ఉచ్చ నీచల విషయంలో వివిధ గ్రంధాలలోని శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. 

“వాస్తు విద్య” అను వాస్తు శాస్త్ర గ్రంధంలో తూర్పు ఎత్తుగా ఉంటే పుత్రహాని, ఆగ్నేయం ఎత్తుగా ఉంటే ధన లాభం, దక్షిణం ఎత్తుగా ఉన్న మంచి ఆరోగ్యం, నైరుతి ఎత్తుగా ఉన్నచో స్త్రీ సౌఖ్యం, పడమర ఎత్తుగా ఉన్నచో ధన హాని, ఉత్తరం ఎత్తుగా ఉన్నచో రోగం, ఈశాన్యం ఎత్తుగా ఉన్న మహా రోగం కలుగును.స్ధలం యొక్క తూర్పుదిశ పల్లంగా ఉన్న అభివృద్ధినిస్తుంది. ఉత్తర దిశ పల్లంగా ఉన్న ఐశ్వర్యం, పడమర దిశ పల్లంగా ఉన్న ధనక్షయం, దక్షిణం పల్లంగా ఉన్న మరణం కలుగుతాయి. 

“అపరాజిత పృచ్ఛ” అను వాస్తు శాస్త్ర గ్రంధంలో స్ధలం యొక్క తూర్పుదిశ పల్లంగా ఉంటే ఆయుర్ధాయం, సంపద, బలం పెంపొందిస్తుంది. ఆగ్నేయదిశ పల్లంగా ఉన్న స్ధలం అగ్ని భయం, శత్రువుల వలన ఇబ్బందులు, పాప కృత్యాలను చేపిస్తుంది. దక్షిణ భాగం పల్లంగా ఉన్న స్ధలం రోగం, ధన హాని, పురుషులకు ఇబ్బందులు, దేవాలయం నిర్మించిన అభివృద్ధి ఉండదు. నైరుతి దిశ పల్లంగా ఉన్న స్ధలంలో ధనహాని, పురుషులకు దీర్ఘకాల వ్యాధులు, గృహ యజమానికి మృత్యుబాధలు ఉంటాయి. పశ్చిమ దిశ పల్లంగా ఉన్న ధన ధాన్యాదులను నశింపజేస్తాయి. వాయువ్య దిశ పల్లంగా ఉన్న స్ధలంలో శత్రుబాధలు, స్త్రీ సంతతి తక్కువ, ఎప్పుడు కలతలు, అజీర్ణ వ్యాధి, భయాలు కలుగుతాయి. ఉత్తరం పల్లంగా ఉన్న స్ధలంలో గౌరవం, పుత్ర పౌత్రాభివృద్ధి, ధన ధాన్యాభివృద్ధిని కలిగిస్తుంది. ఈశాన్యం పల్లంగా ఉన్న స్ధలం సౌఖ్యం, సౌభాగ్యం, ధన ధాన్యాలను, ధర్మాన్ని వృద్ధి చేస్తుంది. 

“జ్యోతిర్నిబంధం” అను గ్రంధంలో తూర్పు, పడమర దిశలు పొడవుగా ఉండి ఉత్తర, దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలం “ నాగపృష్ట స్ధలం” అని పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన భార్య, పుత్ర నష్టం కలిగించి శత్రు వృద్ధిని కలిగిస్తుంది. 

తూర్పు ఆగ్నేయ, ఈశాన్య దిశలు ఎత్తుగా ఉండి పశ్చిమదిశ పల్లంగా ఉన్న స్ధలాన్ని “దైత్య పృష్టమని” పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన ధన నాశనం, పుత్ర నాశనం, పశు సంపద లేకపోవటం జరుగుతుంది. 

మధ్యభాగం ఎత్తుగా నుండి నాలుగు దిశలు పల్లంగా ఉన్న స్ధలం “ కూర్మ పృష్ట స్ధలమని” పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన సుఖం, ధనం, ధాన్యం, ఐశ్వర్యం సంప్రాప్తిస్తాయి. 

దక్షిణ, పశ్చిమ, నైరుతి వాయువ్య దిశలు ఎత్తుగా ఉండి మిగిలిన దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని “గజ పృష్టం” అని పిలుస్తారు. ఇందు గృహ నిర్మాణం చేసిన ఐశ్వర్యప్రాప్తి, ఆయువృద్ధిని కలిగిస్తాయి. 

“వాస్తు విద్య” అను గ్రంధంలో ఉచ్చ నీచల గురించి తూర్పు ఆగ్నేయ దిశల మధ్యభాగం పల్లంగా ఉన్న స్ధలం “పితామహవాస్తు” అంటారు. ఇది అశుభాలనిస్తుంది. 

దక్షిణ ఆగ్నేయ దిశల మధ్యభాగం ఎత్తుగా ఉండి వాయువ్య ఉత్తరాల మధ్య దిశల మధ్యభాగం పల్లంగా ఉన్న స్ధలాన్ని “సుపధ వాస్తు” అంటారు. ఇది సర్వకర్మలకు యోగ్యమైనది. 

ఉత్తర, ఈశాన్య దిశలు పల్లంగా ఉండి నైరుతి దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “దీర్ఘాయుర్వాస్తూ” అంటారు. ఇది వంశాభివృద్ధిని కలిగిస్తుంది. 

ఈశాన్య, తూర్పు దిశలు పల్లంగా ఉండి నైరుతి, దక్షిణ దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “పుణ్యక వాస్తు” అంటారు. ఇది శుభకరమైనది. 

తూర్పు, ఆగ్నేయ దిశలు పల్లంగా ఉండి వాయువ్య పశ్చిమ దిశలు ఎత్తుగా ఉన్న “ఆపద వాస్తు” అంటారు. ఇది కలహాలను కలిగిస్తుంది. 

దక్షిణ, ఆగ్నేయ దిశలు పల్లంగా ఉండి వాయువ్య, ఉత్తర దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “రోగ కృద్వాస్తు” అంటారు. ఇందు గృహ నిర్మాణం చేసిన రోగాలను కలిగిస్తుంది. 

నైరుతి, దక్షిణ దిశలు పల్లంగా ఉండి ఉత్తర ఈశాన్యాలు ఎత్తుగా ఉన్న “ఆర్గళ వాస్తు” అంటారు. పాప కృత్యాలను చేయిస్తుంది. 

ఈశాన్య, తూర్పు దిశలు ఎత్తుగా ఉండి పశ్చిమ నైరుతి దిశలు పల్లంగా ఉన్న “శ్మశానవాస్తు” అంటారు. ఇది వంశ నాశనాన్ని కలిగిస్తుంది. 

ఆగ్నేయం పల్లంగా ఉండి నైరుతి, ఈశాన్య, వాయువ్య దిశలు ఎత్తుగా ఉన్న స్ధలాన్ని “శ్యేనక వాస్తు” అంటారు. ఇది నాశనాన్ని, మరణాన్ని కలిగిస్తుంది. 

ఈశాన్య ఆగ్నేయ పశ్చిమ భాగాలు ఎత్తుగా ఉండి నైరుతి దిశ పల్లంగా ఉన్న “శ్వముఖ వాస్తు” అంటారు. ఇది ఎల్లప్పుడు దారిద్ర్యాన్ని కలిగిస్తుంది. 

నైరుతి, ఆగ్నేయ, ఈశాన్య దిశలు ఎత్తుగా ఉండి వాయువ్య, తూర్పు దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని “బ్రహ్మఘ్న వాస్తు” అంటారు. ఇది సర్వదా నింద్యమైనది. 

ఆగ్నేయ దిశ ఎత్తుగా ఉండి నైరుతి ఈశాన్య వాయువ్య దిశలు పల్లంగా ఉన్న “స్ధావర వాస్తు” అంటారు. ఇది వంశ నాశనం కలిగిస్తుంది. 

నైరుతి భాగం ఎత్తుగా ఉండి ఆగ్నేయ, వాయువ్య, ఈశాన్య దిశలు పల్లంగా ఉన్న స్ధలాన్ని “స్ధండిల వాస్తు” అంటారు. ఇది సర్వ నాశనం కలిగిస్తుంది. 

ఈశాన్య భాగం ఎత్తుగా ఉండి ఆగ్నేయ నైరుతి వాయువ్య భాగాలు పల్లంగా ఉన్న స్ధలం “శాండుల వాస్తు” అంటారు. ఇది అశుభాలను కలిగిస్తుంది.

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS