Saturday, August 3, 2024

చుక్కల అమావాస్య

చుక్కల అమావాస్య

ఆషాఢమాసంలో వచ్చే అమావాస్యను (చివరిరోజు) చుక్కల అమావాస్య అని అంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈనాడు కొత్తగా పెళ్ళైన కోడళ్లు  ‘చుక్కల అమావాస్య’ పేరుతో నోము నోచుకుంటారు. దీనినే దీపస్తంభ వ్రతమని కూడా పిలుస్తారు. ఈ వ్రతంలో ప్రధాన దేవత గౌరీదేవి. 

సూతుడు శౌనకాది మునులకు చెప్పినట్లుగా
స్కాంద పురాణంలో ఈ వ్రత ప్రసక్తి కనబడుతుంది.

వివాహం అయిన మొదటి సంవత్సరం ఒక పీటపై సున్నంతో వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. బియ్యం పిండితో చేసిన వంద చుక్కలను నివేదిస్తారు. ఈ సంఖ్య సంవత్సరానికో వందచొప్పున పెరిగి ఐదో సంవత్సరం ఐదువందలకు చేరుతుంది. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ మెడలో ధరిస్తారు. కొంతమంది నక్షత్ర దర్శనం అయ్యాకే భోజనం చేస్తారు.

ఐదు సంవత్సరాల వరకు ఆచరించే ఈ వ్రతంలో చివరి సంవత్సరం ఉద్యాపనగా స్తోమత ఉన్నవారు బంగారపు చుక్కలను కూడా దానం చేస్తారు. తమ ఆచార వ్యవహారాలననుసరించి వ్రతాన్ని ఆచరించి, తమ మాంగళ్యం కళకాలం నిలచి ఉండాలని గౌరమ్మ ను వేడుతారు.

అప్పాల శ్యాంప్రణీత్ శర్మ

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS