Sunday, December 12, 2021

కాశీ క్షేత్ర పాలకుడైన శ్రీ మహాకాలభైరవుని దర్శనం


*కాశీ క్షేత్ర పాలకుడైన శ్రీ మహాకాలభైరవుని దర్శనం*


కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు. వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ”ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌” అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు. నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.
గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.
కాలభైరవుని ‘క్షేత్రపాలక’ అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు. విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైంది. కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది.
న్యూఢిల్లిద్ పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. పాండవ సోదరుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది. తమిళనాడు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.
భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు.

‘‘కాలభైరవా నమోస్తుతే –  కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే”

ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తోంది.

కాలభైరవ ఆవిర్భావం
ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు ‘నేను సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి’ అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.

దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు.

హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరాడు. శివుని ఆజ్ఞమేరకు కారభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు.

‘నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి..’ అని శివుడు సలహా ఇచ్చాడు.

కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు

కాలభైరవుడు బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు.

అందుకు ‘‘కాలభైరవా! నీవు శివుని పుత్రుడివి. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్లు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది ’అని సలహా మహావిష్ణువు ఇచ్చాడు.

దీనితో కాలభైరవుడు కాశీచేరుకున్నాడు. ఆయనబ్రహ్మహత్యాదోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశిలో పూడ్చి పెట్డాడు. బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని ‘కపాల మోక్ష తీర్థం’

తర్వాత కాలభైరవుని చూసి శివుడు ‘కాలభైరవా! నీవు ఇక్కడే కొలుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి. నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి.’ శివుడు పలికాడు. దీనితో  కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు దీరి క్షేత్రపాలకునిగా పూజలందుకొంటున్నాడు.

కాలభైరవ ఆరాధన
కాశీక్షేత్రాన్ని దర్శించినవారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీనుంచి వచ్చిన వారు కాశీసమారాధన చేయడం ఆచారం అయింది.

కాశీక్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు మినప వడలతో మాలను తయారు చేసి పూజానంతరం ఒక శునకమును కాలభైరవస్వామిగా భావించి  పసుపుకుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు.

ఈ ఏడాది డిసెంబరు 15వ తేదీన కాలభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీకాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు. భైరవుని రూపాలు :…

భైరవుని రూపాలు :…
కాల భైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ
ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం…. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.

కాలభైరవాష్టకం పఠించడం పుణ్యప్రదం
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ ‘కాలభైరవాష్టకం’ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి. శ్రీకాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయి. గ్రహదోషాలు తొలగిపోతాయి.

కాలభైరవాష్టకం:

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||

కాల భైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు. కాని ఆయనకు చాలా విసిస్త్థత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు.గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపసానతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నయి.కాల భైరవుడిని కాశి క్షేత్ర పాలకుడిగా కీర్తించారు.ఏది సాదించాలన్నా ముందుగా అయన అనుమతి తీసుకోవాలని "కాశి క్షేత్ర మహిమ చెబుతుంది.సాక్షాత్తు శివుడే కాల భైరవుడే సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని,అతింద్రమైన శక్తులని అయన ప్రసాదిస్తారు.దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు.కొబ్బరి బెల్లం నైవేద్ద్యం పెడతారు.ఈశ్వరుడు ఆయుషును ప్రసాదిస్తాడు.ఆయనకు పరమ విధీయుడైన కాల భైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.

శ్రీ కాలభైరవస్వామి ప్రధాన క్షేత్రాలు..

1. వారణాసి (ఉత్తరప్రదేశ్) :

కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది.. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు..

2. ఉజ్జయిని (మధ్యప్రదేశ్ లో ఇండోర్) :

గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.. స్వామి విగ్రహం అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము..

3. దంతేవాడ (చత్తిస్ ఘడ్ లో జగదల్ పూర్) :

ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్ధాలు అర్చించబడినాయి.. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పై కప్పుగా పెంకులతో కన్పిస్తుంది..

ఈ మందిరంలో నాలుగు భైరవమూర్తులు దర్శినమిస్తాయి..

1. వనభైరవుడు
2. జటాభైరవుడు
3. గధాభైరవుడు
4. తాండవభైరవుడు.

4. తేజ్ పూర్ (అస్సాం లో గౌహతి) :

ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామి పేరు 'మహాభైరవుడు' లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించినట్లు స్థలపురాణం.

నాగులు ఈ లింగాన్ని పూజించేవి అనుటకి నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి..

5. ఇసన్నపల్లి / రామారెడ్డి (తెలంగాణ లో కామారెడ్డి జిల్లా) :

సుమారు 11 వ శతాబ్దం లో స్వామి వారి ఆలయం నిర్మించబడింది..

దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవక్షేత్రంగా, గ్రహాపీడలను తొలగించే క్షేత్రంగా ఇది చెందినది.

ప్రధాన గర్బాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవస్వామి వారి విగ్రహం నిల్చోని దిగంబరంగా దర్శనమిస్తుంది..

6. రామగిరి (ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా) :

ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కప్రక్కనే ఒకే ప్రాకారంలో అమరియున్నవి.  ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది..

7. భైరవసెల (శ్రీశైల క్షేత్రం దగ్గర) :

ఎచ్చటా కానరాని సహజ సిదమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రంలో ఒకేసారి పాతికమంది కూర్చోవడానికి వీలున్నట్లు భైరవగుహ, ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు.. ఒక శివలింగం.. స్థానిక చెంచుల దేవుడైన నిరాకార 'బయన్న' దర్శనమిచ్చును..

8. అడవివరం (ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం) :

ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం, గోడలు ఏమిలేకుండా పైకి మెట్లు నఇర్మించబడి, చుట్టూ మండపంతో ఓపేన్ ఎయిర్ లో భైరవుడు దర్శనమిస్తాడు..

9. ఖాట్మండు (నేపాల్) :

నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది.. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు..

అందుకే ఇచ్చట అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీకాలభైరవస్వామికి విశేషంగా పూజలు జరుగుతుంటాయి.. ఇక్కడ స్వామి చిత్రవిచిత్రంగా ఆలంకారాలు చేస్తారు..

10. భైరవకొండ (ఆంధ్రప్రదేశ్ లో బంగోలు జిల్లా) :

ఇక్కడ త్రిముఖదుర్గ అమ్మవారు కొలువైఉంటారు.. అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది.. కార్తికపూర్ణిమ నాటిరాత్రి 7 - 8 గం.ల మధ్య దేవీ ఏదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదికి పరావర్తనం చెందుట అపూర్వం.. క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది.

11. తిరువైసనల్లూరు (తమిళనాడు లో కుంబకోణం) :

ఇచ్చటి శివయోగినాథాలయంలోని గర్బగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను నాలుగు విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీ‌లుగా ఉన్నవి.

12. న్యూడిల్లి :

ఈ క్షేత్రంలో పురాణాఖిల్లాకు దగ్గరగా అతిప్రాచీనమైన కాలభైరవస్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం.

13. ధున్నాస్ (ఉత్తరప్రదేశ్) :

ఇచట ధర్మశాలతో పాటుగా శ్రీకాలభైరవస్వామి ఆలయం ఉన్నది. ఇచట నుండి కొంచం దూరం ముందుకు వెల్తే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు..

14. మున్నంగి (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లాలో)  :

స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..

15. భైరవపాడు (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లా) :

స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..

16. అధియమాన్ కొట్టాయ్ (కర్నాటక లోని ధర్మపురి జిల్లా) :

9వ శతాబ్దంలో అధియమాన్ అను చక్రవర్తిచే ఇచ్చట కాలభైరవాలయం నిర్మింపబడినది.

17. కచ్ఛాద్రి (కర్నాటక లోని కొల్లూర్ దగ్గర) :

ఇచ్చట గల కొండపై గల ఆలయంలో శ్రీకాలభైరవస్వామి తో పాటుగా ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు.

 🎶 *స్వరం : గౌతమి*🎙️

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత

విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత


రోజుకు కనీసం ఒక్క సారైనా 
విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.
ఉత్తమ ఫలితాలు పొందండి..

మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం
ఓం నమో నారాయణాయ .
ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది...

విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన 
అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును, 
పాపములు తొలగును. 

స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం. 
మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి

విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. 

అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 

అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?

1. అదృష్టం

2. ఆర్థిక ఇబ్బందులు వుండవు 

3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం 

4. కోరిన కోరికలు నెరవేరుతాయి

5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది

విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.

అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 
108 మార్లు జపించవలెను. 
పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:

1. విద్యాభివృద్ధికి :-
      14వ శ్లోకం.
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

2. ఉదర రోగ నివృత్తికి:-
       16వ శ్లోకం.
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

3. ఉత్సాహమునకు:-
       18వ శ్లోకం.
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

4. మేధాసంపత్తికి:-
       19వ శ్లోకం.
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

5. కంటి చూపునకు:-
       24వ శ్లోకం.
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||

 6. కోరికలిడేరుటకు:-
         27వ శ్లోకం.
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

7. వివాహ ప్రాప్తికి:-
       32వ శ్లోకం.
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

8. అభివృద్ధికి:-
       42వ శ్లోకం.
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||

9. మరణ భీతి తొలగుటకు:-
        44వ శ్లోకం.
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-
         46వ శ్లోకం.
విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||

 11. జ్ఞానాభివ్రుద్ధికి:-
           48వ శ్లోకం.
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |
సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||

12. క్షేమాభివ్రుధ్ధికి:-
           64వ శ్లోకం
అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |
శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||

13. నిరంతర దైవ చింతనకు:-
          65వ శ్లోకం.
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

14. దుఃఖ నివారణకు:-
           67వ శ్లోకం.
ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||

15. జన్మ రాహిత్యమునకు:-
          75వ శ్లోకం.
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||

16. విద్యా ప్రాప్తి కి :-
       80వ శ్లోకం.
అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||

 17. శత్రువుల జయించుటకు:-
            88వ శ్లోకం.
సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !
న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||

18. భయ నాశనమునకు:-
           89వ శ్లోకం.
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||

19. సంతాన ప్రాప్తి కి :-
       90వ శ్లోకం.
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|
అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||

20. మంగళ ప్రాప్తికి:-
         96వ శ్లోకం.
సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |
స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||

21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-
          97 & 98వ శ్లోకం.
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||

22. దుస్వప్న నాశనమునకు:-
            99వ శ్లోకం.
ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||

23. పాపక్షయమునకు:-
           106వ శ్లోకం.
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||

24.సర్వ రోగ నివారణకు:-
     103వ శ్లోకం.
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||

25. సుఖ ప్రసవమునకు:-
    107వ శ్లోకం.
శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|
రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||
శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి

విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను.
(సేకరణ)

పార్వతి దేవి పేర్లు తెలుసును కదూ.



*పార్వతి దేవి పేర్లు తెలుసును కదూ..... అయినా మళ్ళీ మీ కోసమే*...


అంబ, అంబిక, అగజ, అగజాత, అచలజ, అచలాత్మజ, అద్రిజ, అద్రిభువు, అనంత, అన్నపూర్ణ, అపరాజిత, అపర్ణ, ఆద్య, ఆనందభైరవి, ఆర్య, ఆర్యాణి,

ఇ(డ)(ళ), ఈశ, ఈశాని, ఈశి, ఈశ్వర, ఈశ్వరి, ఉమ, ఋద్ది, ఐశి, కన్యాకుమారి, కపాలిని, కరాళిక, కర్వరి, కల్యాణి, కాత్యాయణి, కాలంజరి, కాలక, కాలిక, కాళికాదేవి, కాళి, కిరాతి, కుమారసువు, కౌశికి,

క్షేమ, ఖచరి, గాంధర్వి, గిరిజ, గుహజనని, గౌరి, చండ, చండాలిక, చండి, చండిక, చర్చ, చర్మముండ, చాండాలిక,

చాముండ, ఛాయ, జగజ్జనని, జయంతి, తామసి, త్రిపురసుందరి, దుద్దుర, దశభుజ, దాక్షాయణి, దాక్షి, దుర్గ, దుర్గి, దేవేశి, ధిషణ, నంద, నందయంతి, నగజ,

నగజాత, నగనందిని, నారాయణి, నికుంభిల, నీలలోహిత, నీహారక్షమాభృత్కుమారి, పరమేశ్వరి, పరుల, పాటల, పాటలావతి, పాత్రి, పార్షతి, పింగ, పుత్రి, పురల,

పురుహూతి, ప్రభ, బదరీవాస, బర్హిధ్వజ, బహుభుజ, బాభ్రవి, బృహద్భట్టారిక, బ్రహ్మచారిణి, బ్రహ్మవిద్య, భంజ, భగవతి, భద్రకాలి, భవాని, భవ్య,

భార్గవి, భాలచంద్ర, భీమ, భూతమాత, భైరవి, భ్రామరి, మంగళ, మదోత్కట, మనస్తోక, మనస్వినీ, మలయవాసిని,

మహాదేవి, మహేశ్వరి, మాత, మాతంగి, మాతృక, మాలిని, మృడాని, మేనకాత్మజ, మైనాకస్వస, యమున,

యాదవి, యోగమాయ, యో(గీ)(గే)శ్వరి, రంభ, లంభ, విజయ, విశాలాక్షి, వృషాకపాయి, శంకరి, శంభుప్రియ, శకాక్షి, శక్తి,

శర్వాణి, శాంకరి, శాంతి, శాంభవి, శాకంబరి, శాకిని, శాక్రి, శారద, శిఖరవాసిని, శివ, శివప్రియ, శివవల్లభ, శివాని, శీతాచలపుత్రి, శైలజ, శైలసుత,

శైలేయి, శ్యా(మ)(మా)ల, షడ్భుజ, షష్ఠి, షోడశభుజ, సతి, సత్య, సనాతని, సరస్వతి, సర్వమంగళ, సర్వార్థసాధిక, సహస్రభుజ,

సాత్త్వికి, సావిత్రి, సింహధర, సింహయాన, సింహరథ, సింహవాహిని, సినీవాలి, సుధ్యుపాస్య, సురస, సురసుందరి, సౌమ్య, స్తుతి, హిండి, హిమజ, హై(మా)(మ)వతి......

🙏🙏 *శ్రీ మాత్రే నమః*🙏🙏

సాంబ్రాణితో ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చు............!!

🎻🌹🙏సాంబ్రాణితో ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చు............!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు. 

*ఆదివారం* : 

ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే.. ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.

*సోమవారం*: 

దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.

*మంగళవారం*:

 శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటి దృష్టిలోపాలుండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది.

*బుధవారం* : 

నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది.

*గురువారం*:

 గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.

*శుక్రవారం*: 

లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు చేకూరుతాయి. అన్నింటా విజయాలుంటాయి.

*శనివారం* : 

సోమరితనం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

అష్ట అయ్యప్ప అవతారాలు!

అష్ట అయ్యప్ప అవతారాలు!


 స్వామి అయ్యప్ప అనగానే మనందరికీ కనుల 
ముందు కదలాడే దివ్య రూపం ఒక్కటే!

 శబరి మాలలో పదునెనిమిది సోపానాదిపతిగా వీర పద్మాసనం, యోగ బంధనంతో చిన్ముద్ర , అభయ హస్తాలతో భక్తులను కటాక్షించే కమనీయ రూపం.

 కానీ అయ్యప్ప మూల రూపమైన శ్రీ ధర్మ శాస్త యుగాల క్రిందట నుండే వివిధ రూపాలతో కొలువుతీరి కొలిచిన వారికి కొంగు బంగారంగా ప్రసిద్ది చెందారు. శ్రీ హరి ఆరో అవతార రూపమైన శ్రీ పరశురాముడు సృష్టించిన కేరళలో ఆయనే నెలకొల్పిన నూట ఎనిమిది ఆలయాలలో అనేక భంగిమలలో దర్శనమిస్తారు శ్రీ ధర్మ శాస్త. 

అందరికి సుపరిచితమైన ఎరుమేలిలోని ఎరుమేలి శ్రీ ధర్మశాస్త స్తానక (నిలుచున్న) భంగిమలో ధనుర్భాన ధారిగా, అదే విధంగా కులత్తపుల లోను, శ్రీ పూర్ణ పుష్కల నాధునిగా అచ్చన్ కోయిల్ లోను, అశ్వా రూడునిగా కుథిరన్ (త్రిస్సూర్ - పాలఘాట్ మధ్యలో), శ్రీ ధన్వంతరి శాస్తాగా తిరువనంత పురం, కొచ్చి లలో, భార్య ప్రభా దేవి, కుమారుడు సత్యకన్తో కలిసి శాస్తంకొట్ట (కొల్లం దగ్గర) స్వామి దివ్య స్వరూపాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.

ఎన్నో సంవత్సరాలుగా శబరి యాత్ర చేస్తూ వస్తున్న గురు స్వాములు, శ్రీ అయ్యప్పను కుల దైవంగా భావించి కొలిచే భక్తులు ఎందరో ఉన్నారు. వారంతా కలిసి స్కాంద, శివ పురాణాలను, రామాయణ, మహా భారతాలను, గుహ్య రత్న చింతామణి, శ్రీ భూత నాధ చరితం లాంటి పురాతన మలయాళ గ్రంధాలను ఆమూలాగ్రం శోధించి వెలికి తీసిన అమూల్య విషయం "శ్రీ అయ్యప్ప అష్ట అవతారాలు". ఆ స్వాములు భక్తుల సౌలభ్యం కొరకు, వారి ఇహ పర కోరికలు తీరి, పరమ పదం చేరే మార్గంలో ప్రయాణించడానికి సిద్దమవ్వడానికి వెలుగు లోనికి తెచ్చారు.

 అంతే కాకుండా ఈ పుణ్య పురుషులు తమ పరిశోధనలలో శ్రీ ధర్మ శాస్తా మూల రూపంతో కలిపి మొత్తం తొమ్మిది రూపాలను మానవ జీవితాల మీద ప్రభావం చూపే నవ గ్రహాలకు సరి సమానమైనవిగా గుర్తించారు. అంటే ఈ నవ అయ్యప్ప రూపాలను సేవిస్తే నవ గ్రహాలను సేవించిన ఫలితం దక్కుతుందన్నమాట! సత్య యుగం నుండి పూజలందుకొంటున్న ఆ అవతార రూపాలు యివే.

 శ్రీ ఆది భూత నాధ శాస్త,
 శ్రీ ధర్మ శాస్త,
 శ్రీ జ్ఞాన శాస్త,
 శ్రీ కళ్యాణ వరద శాస్త,
 శ్రీ మహా శాస్త,
 శ్రీ సమ్మోహన శాస్త,
 శ్రీ సంతాన ప్రపత్తి శాస్త,
 శ్రీ వేద శాస్త,
 శ్రీ వీర శాస్త

శ్రీ ఆది భూత నాధ శాస్త 

 స్తితి లయ కారకులైన హరిహరుల అంశతో ఉద్భవించిన వాడే ఈ స్వామి. నేపాళ రాజు పాలింజ వర్మ కుమార్తె పూర్ణా దేవిని, కేరళ రాజ పుత్రిక అయిన పుష్కలా దేవిని దేవేరీలుగా చేసుకొని పొన్నాంబల మేడులో (కాంతి మలై) కాపురం ఉంటున్నారని అంటారు.

శ్రీ ఆది భూత నాధ శాస్త

 ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానునికి ప్రతీక. దివాకర ఆరాధనతో ఏవైతే మానవాళికి లభ్యమవుతాయో అవన్నీ ప్రసాదించేవాడు శ్రీ ఆధి భూతుడు. 

పుడమిలో ప్రజల ఆకలి దప్పికలు తీరేందుకు సకాలంలో వర్షాలు, సంవృద్దిగా పాడి పంటలు, ఆరోగ్యకరమైన వాతావరణం, సమకూర్చేవాడు ఈ స్వామి. అంతే కాదు శత్రువుల నుండి, క్రూర మృగాల దాడుల నుండి, విష సర్పాల బారి నుండి కాపాడే రక్షకుడు కూడా! నియమంగా భక్తి శ్రద్దలతో పూజిస్తే శ్రీ ఆది భూత నాధ శాస్త రాజ యోగం ప్రసాదించేవాని గా ప్రసిద్ది.

 ఈయనకొక ఆలయం తమిళ నాడు లోని తిరునెల్వేలి జిల్లా పాపనాశనం దగ్గరలోని కరైయర్ డాం కు సమీపంలోని అగస్త్య జలపాతం వద్ద ఉన్నది. శ్రీ ధర్మ శాస్త మహర్షికి తొలిసారిగా దర్శనమిచ్చి శబరి మలకు రాదలచిన భక్తులు పాటించవలసిన నియమాలను తెలిపారన్నది పురాణ గాధ. ఇక్కడికి దగ్గరలోనే శ్రీ అగస్త్య మహర్షి ఆలయం కూడా ఉన్నది. సుందర ప్రకృతి ఈ ప్రాంత సొంతం. 

శ్రీ ధర్మ శాస్త 

 శబరి మలలో కొలువు తీరినది ఈ స్వామే! ముక్తి ప్రదాత. కుల మత భావాలను రూపుమాపి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే వాడు శ్రీ ధర్మ శాస్త. పరి పూర్ణ శరణాగతిని కోరే భక్తుల వెన్నంటి ఉండి కాపాడే తోడూ నీడ. శని గ్రహ ప్రభావాన్ని దూరం చేస్తారు. ఎలాంటి తప్పునైనా సరిదిద్ది సక్రమ మార్గంలో నడిపించే మార్గ దర్శి శ్రీ ధర్మ శాస్త.

జ్ఞాన శాస్త 

 అపర సరస్వతి దేవి రూపం . మాణిక్య వీణ ధరించి వట వృక్షం క్రింద ఉపస్థిత భంగిమలో కొలువు తీరి వుంటారు. సకల విద్యా ప్రదాత. ఈ స్వామిని బృహస్పతి (గురువు)గా, శ్రీ దక్షిణా మూర్తిగా భక్తులు ఆరాధిస్తారు. ఇదే రూపంలో స్వామి వారి ఆలయలైతే లేవు. త్రిస్సూర్ జిల్లాలోని తిరువుల్లక్కావు లో వెలసిన శ్రీ స్వామిని విద్యా శాస్తాగా భావించుతారు. నవరాత్రులలో, ఓనం, ఇతర స్థానిక పర్వ దినాలలో ఎందరో భక్తులు తరలివచ్చి తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాట వేసే అక్షరాభ్యాసం చేయించుకొంటారు. భక్తుల సౌలభ్యం కొరకు ఫిబ్రవరి రెండో వారంలో ఏడు రోజులపాటు విద్యా సరస్వతి అర్చన జరుపుతారు. చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ క్షేత్రంలోని మూల విరాట్టు ధనుర్భానాలు ధరించి స్థానక భంగిమలో ఉండటం!

కళ్యాణ వరద శాస్త 

 పురాతన గ్రంధాలైన గుహ్య రత్న చింతామణి, భూతనాధ చరితం లలో శ్రీ కళ్యాణ వరద శాస్త గురించి విపులంగా వివరించబడి ఉన్నట్లుగా తెలియవస్తోంది. దశ భుజాలతో శంఖు చక్రాలతో పాటు వివిధ ఆయుధాలు ధరించి, అభయ వరద హస్తాలతో, ఇరు వైపులా పూర్ణ పుష్కలా దేవేరిలతో కొలువు తీరివుంటారు. పేరుకు తగినట్లుగానే కళ్యాణ కారకుడు. కుజ గ్రహ ప్రభావంతో వివాహం కాని వారు ఈయనను సేవిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. నిండు భక్తితో కొలిచిన వారి జీవితాలలో అన్ని శుభాలను ప్రసాదించి వరదుడు. శ్రీ పూర్ణ పుష్కలా సమేత శ్రీ ధర్మ శాస్తా ఆలయాలు చాల ఉన్నా అచ్చన్ కోవిల్ లోనిదే ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి.

 స్వామికి ఇక్కడ దశ భుజాలుండవు కాని చిత్రమైన భంగిమలో దర్శనమిస్తారు. శ్రీ కళ్యాణ వరద శాస్తా విగ్రహ రూపంలో కాకుండా చిత్రపట రూపంలో పూజలందుకొంటున్న క్షేత్రం ఒకటి మన రాష్ట్రంలో ఉన్నది. అదే అయిదు వందల సంవత్సరాల క్రిందట విజయనగర సామ్రాట్టు శ్రీ కృష్ణ దేవరాయలు స్వయంగా స్థాపించిన తుమ్మగుంట. నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో నాటి నుండి నేటి వరకు ద్రావిడ బ్రాహణులచే కొలవబడుతున్న శ్రీ వృక్ష అయ్యప్ప సకల విద్యలను, శుభాలను ప్రసాదించే శ్రీ గురునాథ స్వామిగా పిలవబడుతున్నారు. అరుదయిన వృక్ష రూప అయ్యప్పతో పాటు ఎన్నో చిత్ర పటాలున్నాయిక్కడ.

శ్రీ మహా శాస్త 

 గజ వాహనారూఢ శ్రీ మహా శాస్త ని అప మృత్యు భయాన్ని తొలగించే మహా కాల శాస్తా గా ఆరాధిస్తారు. అనుకోని ప్రమాదాల బారినుండి, ఆకస్మిక ఇక్కట్ల నుండి, తలా తోక లేని విషమ పరిస్థితుల నుండి కాపాడి విజయం వైపు నడిపించేవాడు శ్రీ మహా శాస్త అన్నది సేవించేవారి నమ్మకం. తమిళ నాడులోని ఆలయాల నగరం కుంభకోణంకి ముప్పై కిలోమీటర్ల దూరంలో సేన్గాలిపురం దగ్గరలో ఉన్న త్రియంబకాపురం లో కరి వాహన మహా కాల శాస్తా ఆలయం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

శ్రీ సమ్మోహన శాస్త 

 చతుర్భుజాలతో కుడి కాలు క్రిందకి పెట్టి, ఎడమ కాలుని పైకి మడిచి అరుదైన భంగిమలో దర్శనమిస్తారు పూర్ణ పుష్కలా సమేత శ్రీ సమ్మోహన శాస్త. 

వెన్నెలంత చల్లని అభిమానాన్ని భక్తుల మీద చూపేవానిగా ప్రసిద్ది. నమ్మిన వారికి అడుగడుగునా అండగా నిలిచి కాపాడుతారు శ్రీ సమ్మోహన శాస్త. నిండైన ప్రేమకు ప్రతి రూపం. శ్రీ సమ్మోహన శాస్తాకు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఒకటి తమిళనాడు రాష్ట్రం నాగాపట్టినం జిల్లా లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం సిర్కాలికి సమీపంలోని కైవిలంచ్చేరి లో ఉన్నది. స్వామిని కై విడే అప్పార్ అని పిలుస్తారు. 

శ్రీ సంతాన ప్రపత్తి శాస్త

 పదిహేనో శతాబ్దంలో రచింపబడిన తంత్ర సముచయం అనే గ్రంధం ప్రకారం త్రేతా యుగంలో సంతానాపేక్షతో పుత్రకామేష్టి యజ్ఞం చేసిన దశరధ మహారాజుకి యజ్ఞ ఫలం అందించిన యజ్ఞ పురుషుడు శ్రీ సంతాన ప్రపత్తి శాస్తానేఅని తెలుస్తోంది. శిల్పారాధానం అనే మరో పురాతన గ్రంధంలో కూడా ఈ విషయం వివరించబడినది.

 ఈ కారణంగా ఈయనను బ్రహ్మ శాస్తా అని కూడా పిలుస్తారు. ఆదాయం, అబివృద్ది, కీర్తి, సత్సంతానం ఇలా అన్నింటా శుక్ర మహర్దశ ప్రసాదించేవాడీ స్వామి. అభయ హస్తంతో విలాసంగా భార్య ప్రభా దేవి, కుమారుడు సత్యకన్తో కలిసి దర్శనమిస్తారు. కేరళ రాష్ట్రంలో ఉన్న ఎన్నో శ్రీ ధర్మశాస్త ఆలయాలలో కొల్లం జిల్లా ఆదూర్ కి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న శాస్తంకొట్ట లోని శ్రీ ప్రభా సత్యకన్ సమేత ధర్మ శాస్త ఆలయం ప్రసిద్ది చెందినది. ఎన్నో ప్రత్యేకతలుగల క్షేత్రమిది. శ్రీ రామ పాద స్పర్శ తాకిన దివ్య క్షేత్రం శాస్తంకొట్ట. 

శ్రీ వేద శాస్త 

 శివ పురాణంలో పూర్ణ పుష్కలా సమేతంగా సింహాన్ని అధిరోహించిన శ్రీ వేద శాస్త ప్రస్తావన ఉన్నది. బుద్దిని వికసింపచేసి, గ్రహణ శక్తిని పెంపొందించి, విషయ జ్ఞానాన్ని మెరుగుపరచేవాడు. మానవాళికి మేలు చేసేవాడు శ్రీ విద్యా శాస్త. వేద రూపుడైన స్వామికి సేలం జిల్లాలో ఒక ఆలయం ఉన్నట్లుగా చెబుతారు. 

శ్రీ వీర శాస్త

 జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు రచించిన ఆదిశంకర విచరితమ్ లో శ్రీ వీర శాస్త ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది. 

 జగద్గురువులు వర్ణించినట్లుగా స్వామి ఖడ్గం ధరించి ఆశ్వ వాహనం మీద దర్శన మిస్తారు. యోధుని మాదిరి కనిపించే స్వామి దుర్మార్గులను దండించేవాడు, అధర్మాన్ని అణిచేవాడు. ఆపన్నులను గాచేవాడు.

 శ్రీ వీర శాస్తకు త్రిస్సూర్కు పాలఘాట్ కు మధ్యలో వచ్చే కుథిరన్ అనే ఊరిలో ఏంతో పురాణ ప్రసిద్ది చెందిన ఆలయం ఉన్నది. శ్రీ ఆది శంకరులు ఈ స్వామిని కొలిచినట్లుగా స్థానిక కధనాలు తెలుపుతాయి. ఇవే కాకుండా శ్రీ శాస్త ధన్వంతరిగా, యోగ మూర్తిగా, ధ్యాన రూపునిగా కొలువు తీరిన ఆలయాలు కేరళాలో ఉన్నాయి.

 శరణ ఘోషతో పిలిచే వారిని చేరదీసి చింతలు బాపేవాడు శ్రీ ధర్మ శాస్త. వేద సంస్కృతి...వారు సహకారం హరహర మహాదేవ శంభోశంకర

Thursday, December 9, 2021

పితృధ్యానం - పితృకర్మ

💐💐పితృధ్యానం - పితృకర్మ :💐💐


ప్రతీ దిశకు ఒక ప్రత్యేకత ఉంది. తూర్పు వైపు ఇంద్రుడు లేక శుక్రుడి స్థానం. దక్షిణం యముడు లేక పితృదేవతల స్థానం. పశ్చిమం వరుణుడు లేక ఋషి స్థానం. ఉత్తరం సోముడు లేదా కుభేరుడి స్థానం.

    దీపం యొక్క వత్తిని తూర్పు వైపుకు పెట్టి దీపం వెలిగిస్తే, ఇంద్రుడు ప్రసన్నుడు అవుతాడు.  శుక్రుడు కూడా ప్రసన్నుడు అవుతాడు. ఇలా చేయడం వల్ల మీకు సంపద,ఐశ్వర్యము,సమృద్ధి,మంచి నిద్ర కలుగుతాయి. దీపానికి స్వచ్ఛమైన ఆవునెయ్యి వాడడం మంచిది. 

 పితృ దీపం : దీపం ఒత్తి దక్షిణం వైపు ఉండేలా చేసి, మీరు దీపాన్ని వెలిగిస్తే యముడు ప్రత్యక్షం అవుతాడు. పితృ దేవతలు ప్రసన్నులు అవుతారు. ప్రమాదాలు తప్పిపోవడం, అప మృత్యు దోషాలు తప్పడం,మంచి ఆరోగ్యం చేకూరడం,కుటుంబంలో శాంతి సామరస్యాలు కలగడం జరుగుతాయి. దీనికి నువ్వుల నూనె వాడితే మంచిది.

ఋషి దీపం : పశ్చిమం వైపు వత్తి ఉండేలా చేసి, మీరు దీపాన్ని వెలిగిస్తే వరుణుడు ,ఋషులు ప్రసన్నులవుతారు. వ్యవసాయంలో సమృద్ధిగా గింజలు పండడం,మంచి వర్షాలు, మంచి జ్ఞానం,మంచి మేధస్సు, జ్ఞాపక శక్తి,మంచి ఆరోగ్యం ...శాంతి చేకూరతాయి.దీనికి నువ్వుల నూనె శ్రేష్టం.

కుబేర దీపం :  దీపం యొక్క వత్తి ఉత్తరానికి ఉండేలా చేసి మీరు దీపాన్ని వెలిగిస్తే, సోముడు లేక కుబేరుడు ప్రసన్నులవుతారు. సంపద, వ్యాపారంలో విజయం, ప్రమోషన్లు, ఆఫీసులో విజయము, బంగారం , వజ్రాలు విరివిగా లౌకిక సంపదలు సమకూరుతాయి. దీనికై ఆవునేతిని వాడితే మంచిది.

      పిల్లల మీద కోపం వచ్చినప్పుడు అప్రయత్నంగా కొన్ని మాటలు తల్లిదండ్రుల నోళ్ళ నుండి వెలువడుతాయి. ఉద్దేశపూర్వకంగా రానివే అయినా, పిల్లల శ్రేయస్సును దృష్టలో తీసుకొని చెప్పినవే అయినా,అవి శాపంగా పరిగణించబడతాయి.ఇవి కూడా ఒక రకమైన పితృ శాపాలు.

రాహుకాలం దుర్గ పూజ - విశిష్టత

🙏🙏🙏🙏🙏
🌹రాహుకాలం దుర్గ పూజ - విశిష్టత🌹

🌹🌹🌹🌹🌹
రాహువుకు శరీరమంతా విషమైతే..
తోకలో మాత్రం అమృతం ఉంటుందట!

మహిళలు మంగళ, శుక్రవారాల్లో దుర్గాపూజ చేస్తుంటారు.
దుర్గాదేవిని మంగళ, శుక్రవారాల్లో భక్తిశ్రద్ధలతో పూజించి..
కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారయువతులైతే వివాహ ప్రాప్తి కోసం..
వివాహితులైతే దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం.

ముఖ్యంగా వారంలోని ఈ రెండు రోజుల్లో
దుర్గాపూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

ఇందులో మంగళవారం రాహుకాల పూజకు
ప్రత్యేక విశిష్టత ఉంది.
రాహు దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజున రాహు కాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ
పూజ చేయాలని పురోహితులు అంటున్నారు.

దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో
విష్ణు అవతార తిథులైన అష్టమి, నవమి
తిథుల్లోనూ అమ్మవారిని పూజించడం
విశేష ఫలితాలను ఇస్తుంది.
ఇంకా అమ్మవారిని
అమావాస్య,
పౌర్ణమి,
మంగళ,
శుక్ర,
ఆదివారాల్లో
పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.

రాహు దోషం తొలగిపోవాలంటే!
రాహు గ్రహానికి, దుర్గాదేవికి ఓ సంబంధం ఉంది. రాహు గ్రహానికి అధిదేవత దుర్గాదేవి.
అందుచేత రాహు కాలంలోనే దుర్గాపూజ జరుగుతోంది.

ఆదివారం రాహు కాల పూజ విశిష్టమైనది. రాహువుకు శరీరమంతా విషంతో నిండివుంటుంది. కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది. అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారివుంటుంది.

అంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుండి
6 గంటలలోపు దుర్గాదేవిని పూజించినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

అనారోగ్య సమస్యలు,
ఈతిబాధలు,
రుణబాధలు
తొలగిపోవాలంటే.. ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా
గల ఆలయంలో ఒక నిమ్మపండును సగంగా కోసి.. నిమ్మరసాన్ని పిండేసి..
నిమ్మపండును ప్రమిదల్లా తిప్పి..
అందులో నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపమెలిగించాలి.
ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లు వెలిగించాలి.
ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లెపువ్వులు లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి.

అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదే
పూజ చేయాలి.
దీపం వెలిగించాక అమ్మవారిని మూడుసార్లు ప్రదక్షణ చేసుకుని నమస్కరించుకోవాలి.
దుర్గాస్తుతి చేయాలి.*
*దుర్గాపూజ తర్వాత నవగ్రహ ప్రదక్షణలు కూడదు.

ఇంటికొచ్చాక పూజగదిలో నెయ్యిదీపమెలిగించి
 ఐదు అగరవత్తులు, కర్పూరంతో పూజ చేయాలి. ఇలా తొమ్మిదివారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే కుజదోషాలు పటాపంచలవుతాయని పండితులు చెప్తున్నారు.🙏

మార్గశిర సుబ్రహ్మణ్య షష్టి

మార్గశిర సుబ్రహ్మణ్య షష్టి


ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని... ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి.ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.

జాతకంలో కాలసర్పదోషం ఉన్న వారు,కుజ,రాహు,కేతు దశలు నడుస్తున్నవారు,కుజ దోషం ఉన్నవారు,సంతానంలేని వారు,వివాహం కానివారు,దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి,సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు ,తాంత్రిక పూజలు చేసే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామార్ద్యాలు కలిగి ఉంటారు.

సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.

శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం...
దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం
స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం...
కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం

ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లయినా మనస్ఫూర్తిగా పఠించితే శత్రు విజయం చేకూరుతుంది.

తప్పిపోయిన మనుష్యులు వచ్చుటకు, రాని బాకీలు వసూలగుటకు.........!!

తప్పిపోయిన మనుష్యులు వచ్చుటకు, రాని బాకీలు వసూలగుటకు.........!!

శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం
కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము.
ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.
ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం
కార్తవీర్య ఖలద్వేషి కృతవీర్య సుతోబలి
సహస్రబాహు శత్రుఘ్నో రక్త్రవాసా ధనుర్ధః
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తు అభీష్టదః
రాజసైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్
సంపదః తస్య జాయంతి జనాస్తస్య వషంఘదః
అనాయతాషు క్షేమలాభయుతం ప్రియమ్.
కార్తవీర్యార్జునోనామ రాజా బాహు సహస్రభృత్
తస్య స్మరణ మాత్రేన హృతం నష్టం చ లాభయతి
కార్తవీర్యః మహాబాహో సర్వ దుష్ట విభర్హణః
సహస్రబాహుం సాహస్రం స
రక్తాంబరం రక్తకిరీట కుణ్డలమ్,
చోరాని దుష్టభయ నాశనం ఇష్టదం తం
ధ్యాయేత్ మహాబల విజ్హృంభిత
కార్తవీర్యం యస్య సంస్మరణాదేవ
సర్వ దుఃఖ క్షయోభవేత్ తం నమామి మహావీర్యార్జునమ్
కార్తవీర్యజం హైహయాధిపతేస్తోత్రం
సహస్ర వర్తనం క్రియం వాంచితార్థప్రదం నరాణామ్
శూద్ర దయైర్యాతి నామ శ్రుతమ్
ఇతి దమర తంత్రే ఉమామహేశ్వర సంవాదే
కార్తవీర్యస్తోత్రమ్ సంపూర్ణమ్.
తప్పిపోయిన మనుష్యులు వచ్చుటకు, రాని బాకీలు వసూలగుటకు.

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS