Thursday, February 13, 2025

నవగ్రహ గ్రహ గుణగణాలు

ఆదిత్యుడు :

కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ( మూలాధారం,స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆగ్య్హ్నా చక్రం ,సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం,విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్యదోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యునిపూజించటం వలన ఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.

ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి
చంద్రుడు :
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకుకంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అనిపేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమతల్లి తారక.
అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.
కుంభ రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.

అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
మంగళ :
అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం.ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకిఅధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.
భార్య / పిల్లలు / అన్నదమ్ముల వాళ్ళ సమస్యలు ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు.

అధిదేవత : భూదేవి

వర్ణం: ఎరుపు
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
బుధుడు :

తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్రదోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి,సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి.
మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం
గురు :

బృహస్పతి అని కూడా అంతము. దేవతలకు, దానవులగురువైన శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణసంపన్నుడు. పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.
పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి 
ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడైఉంటాడు.

అధిదేవత : బ్రహ్మ
ప్రతదిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం

శుక్రుడు :

ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.
అనుకోని పరిస్థితుల వల్లనా కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం ఉంది.
వృషభ, తులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం

శని :
సూర్యభగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయా దేవి (నీడ). నల్లని వర్ణం తో, నలుపు వస్త్రదారనతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు.
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలంటిబాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టికస్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు.
కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : యముడు
ప్రతదిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
/> వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం

రాహువు :

సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడేరాహువు ను ఒక పాము రూపం లో వారిన్స్తారు. ఒకకత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.
పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవిరాహు ప్రభావములే.
పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.
అదిదేవత : దుర్గ
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం : నిలపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం

కేతువు :

భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.
ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.

ప్రతి మానవుడు తనకు సంతోషం కలగాలని ఆనందంగా బ్రతకాలని కోరుకుంటాడు. కాని ఈ ఆనందము సంతోషము వేటిని ఆచరిస్తే కలుగుతాయో వాటిని మాత్రం ఆచరించడు ప్రతివారు `దుఃఖ మాభూత్' నాకు దుఃఖము కలుగాకున్డుగాక కష్టాలు నాకు రాకూడదు అని కోరుకుంటారు అని గీతా వచనము మానవుడు ఈజన్మలోను, రాబోవు జన్మలోను సుఖసంతోషములతో ఉండాలంటే శాస్త్రములందు ప్రమాణ బుద్ధి కలిగి అవి చెప్పిన రీతిననుసరించి మానవుడు మాధవుడవుతాడు అనడంలో సందేహం ఏ మాత్రము లేదు.

ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
రవి
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
చంద్ర
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవంనమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
కుజ
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభంకుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
బుధ
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధంసౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
గురు
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభంబుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
శుక్ర
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుంసర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
శని
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
రాహు
అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనంసింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
కేతు
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్
2. 4. నవగ్రహ ధ్యాన శ్లోకములు
నవగ్రహాలను స్తుతించే ఒక బహుళ ప్రచారంలో ఉన్న శ్లోకం
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచగురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
రవి
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
చంద్ర
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవంనమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
కుజ
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభంకుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
బుధ
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధంసౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
గురు
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభంబుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
శుక్ర
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుంసర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
శని
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
రాహు
అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనంసింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
కేతు
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహ

సూర్యుడు లేదా రవి గ్రహం

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం. సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో అధికంగా రవి అని వ్యవహరిస్తారు.
లింగం :- సూర్యుడు పురుష గ్రహం.
స్వభావం :- సూర్యుని స్వభావం పాప స్వభావం.
రాశి చక్రంలో స్థితి :- సూర్యుడు రాశి చక్రంలో సింహంలో రాజ్యాధికారంలోను, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు.
ఈతర నామాలు :- సూర్యుడికి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కుడు, ఆదిత్యుడు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు.
జాతి :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని జాతి క్షత్రియ,
తత్వం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని తత్వం అగ్ని,
వర్ణం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని వర్ణం రక్తవర్ణం,
గుణం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని గుణం రజోగుణం,
గ్రహతత్వం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్వభావం పాప స్వభాభావం, స్థిర స్వభావం,
రుచి :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుడు కారకత్వం వహించే రుచి కారం,
గ్రహ స్థానం :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్థానం దేవాలయం,
జీవులు :- జ్యోతిష శాస్త్రంలోసూర్యుడు కారకత్వం వహించే జీవులు పక్షులు,
గ్రహోదయం :- పృష్టోదయం,
ఆధిపత్య దిక్కు :_ తూర్పు,
జలభాగం :- నిర్జల,
లోహం :- రాగి,
పాలనా :- శక్తి రాజు,
ఆత్మాధికారం :- ఆత్మ, శరీర
ధాతువు :- ఎముక,
కుటుంభ సభ్యుడు :- తండ్రి,
గ్రహవర్ణం :- శ్యాల వర్ణం,
గ్రహ పీడ :- శిరోవేదన, శరీర తాపం,
గృహంలో భాగములు :- ముఖ ద్వారం, పూజా మందిరం,
గ్రహ వర్గం :- గురువు,
కాల బలం :- పగటి సమయం,
దిక్బలం :- దశమ స్థానం,
ఆధిపత్య కాలం :- ఆయనం,
శత్రు క్షేత్రం :- మకరం, కుంభం,
విషమ క్షేత్రం :- వృశ్చికం, ధనస్సు, మకరం.
మిత్రక్షేత్రం :- మీనము.
సమ క్షేత్రం :- మిధునం, కన్య.
సూర్యుడు సింహ రాశిలో 20 డిగ్రీలలో మూల త్రికోణంలోనూ, మేష రాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛలోను, తులా రాశిలో 10 డిగ్రీలలో పరమ నీచను పొందుతుంది. *మిత్రగ్రహాలు :- కుజుడు, చంద్రుడు, గురువు.
శత్రు గ్రహాలు :- శుక్రుడు, శని.
సమ గ్రహం :- బుధుడు.
నైసర్గిక బల గ్రహం :- శుక్రుడు,
వ్యధా గ్రహం, :- శుక్రుడు.
దిన చలనం :- 1 డిగ్రీ.
ఒక్కొక్క రాశిలో ఉండే సమయం :- 30 రోజులు,
రాశిలో ఫలమిచ్చే భాగం :- మొదటి భాగం,
ఋతువు :- గ్రీష్మ ఋతువు,
గ్రహ ప్రకృతి :- పిత్తము.
దిక్బలం :- దక్షిణ దిక్కు.,
పరిమాణం :- పొడుగు,

1. సూర్య గ్రహ గుణగణాలు
సూర్యుడు జ్యోతిష శాస్త్రంలో ఇలా వర్ణించారు. గుండ్రని ముఖం, రక్తవర్ణం, పొడగరి, గోధుమ వర్ణం కలిగిన జుట్టు కలిగిన వాడుగా వర్ణించబడ్డాడు. గుణత్రయాలలో సూర్యుని స్వభావం రజోగుణం. రుచులలో సూర్యుడు కారం రుచికి కారకత్వం వహిస్తాడు. చాతుర్వర్ణములలో సూర్యుడు క్షత్రియ జాతికి కారకత్వం వహిస్తాడు. తత్వం అగ్ని తత్వం, ప్రకృతి పిత్త ప్రకృతి. దిక్కు తూర్పు దిక్కు, లోహము రాగి, రత్నము మాణిక్యము, దిక్బలం దశమ స్థానం, రాశి సంఖ్య 1, కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తర ఆషాఢ నక్షత్రాలకు నక్షత్రాధిపత్యం వహిస్తాడు. శరీరావయవాలలో గుండే మరియు పురుషులకు కుడి కన్ను, స్త్రీలకు ఎడమ కన్ను, రాశ్యాధిపత్యం సింహరాశి, మేహరాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిని, సింహరాశిలో 20 ఇగ్రీలలో రాజ్యాన్ని, తులా రాశి 10 డిగ్రీలలో నీచను పొందుతాడు.
2. సూర్యుని ప్రభావం
సూర్యుని ప్రభావం ఉన్న వారు ఆత్మాభిమానం, చురుకు తనం కలిగి ఉంటారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. దుబారా వ్యయం, పొగడ్తలకు లొంగుట, ఆవేశపడుట, సమయస్పూర్తి కలిగి ఉంటారు. చక్కని సంపాదన ఉంటుంది. కంటి జబ్బులు, గుండె జబ్బులు, వడదెబ్బకు గురి అగుట వంటి శారీరక అవస్థలకు గురి ఔతుంటారు. పిత్త ప్రకృతి కలిగి ఉంటారు.
3. కారకత్వములు
సూర్యుడు ఆత్మకు, తండ్రికి, శక్తికి, అగ్నికి, ప్రతాపానికి, ఆకాశము, దిక్కు తూర్పు, దేశాధిపత్యములకు కారకత్వము వహిస్తాడు. ముళ్ళ చెట్లకు, పంటలలో మిరియాలు, మిరపకాయలు, కొబ్బరి, వాము, బియ్యం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. శివ భక్తులు, శివ పూజ, శివాలయాలకు కారకత్వం వహిస్తాడు, జంతువులలో సింహం, ఎలుగుబంటి, గుర్రము, సర్పములకు కారకత్వం వహిస్తాడు. పక్షులలో కాకి కోకిల, కోడి, హంసలకు కారకత్వం వహిస్తాడు. వృత్తులలో ప్రభుత్వ కార్యాలయాలు, హృదయ సంబంధిత మందులు, వైద్యులు, రిజర్వ్ బ్యాంక్ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు. ఆకాశ సంబంధిత విమానాలు, విమానాశ్రయము, ఖ్హగోళము, వాతావరణము, విమాన చోదకులు, విద్యుత్ సంబంధిత బ్యాటరీలు, విద్యుత్తు ఉత్పత్తి, భూకంపాలు, ఆకాశ వాణి, దూరదర్శన్వంటి ప్రసార సంబంధిత మాద్యమ వృత్తులు, విద్యుత్తు ఉపకరణ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు.
4. రాశులు సూర్యుడు
సూర్యుడు మేష రాశి 10 డిగ్రీలలో ఉచ్చ స్థితిని పొందుతాడు. సిం,హరాశిలో 20 డిగ్రీల వద్ద రాజ్యా స్థితిని పొందుతాడు. సింహం సూర్యునికి స్వక్షేత్రం మరియు మూల త్రికోణ క్షేత్రం. సూర్యుడికి కుంభరాశి, మకర రాశి శత్రు క్షేత్రాలు, కాగా కన్యా రాశి, మిధున రాశి సమ క్షేత్రాలు. మీనం మిత్ర క్షేత్రం. వృశ్చిక, ధనస్సు, మకరాలు విషమ క్షేత్రాలు.
5. సూర్యుడు గ్రహాలు
సూర్యుడికి గురువు, చంద్రుడు, కుజుడు మిత్ర గ్రహాలు. శుక్రుడు, శని శత్రు గ్రహాలు. బుధుడు నైసర్గిక బలం కలిగిన గ్రహం. వ్యధా గ్రహం శుక్రుడే.
6. సూర్య ఆరాధన
సూర్యుడు తెలుగు సంవవత్సరం ప్రభవ మాఘ శుద్ధ సప్తమి ఆదివారం నాడు విశాఖ నక్షత్రంలో అతిధి, కశ్యపులకు జన్మించాడు కనుక సూర్యునికి రధసప్తమి నాడు విశేష పూజలు జరుపుతారు. సూర్యుడి పూజార్ధం రాగి విహగ్రహం ప్రతిష్ఠిస్తారు. గోధుమలు, బెల్లంతో వండిన పాయసం నైవేద్యంగా పెడతారు. గ్రహ ప్రీత్యర్ధం బెల్లం కలిపిన అన్నం సమర్పిస్తారు. సూర్యుడికి పళ్ళు లేవని అందువలన పాయసం అతడికి ప్రీతి కలిగిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సూర్యుడు సప్త వర్ణాలకు ప్రతీకగా సప్త అశ్వములు పూన్చిన రధం మీద ఆరూఢుడై ఉంటాడు. వినతా పుత్రుడైన అనూరుడు సూర్యుడికి సారధి. అనూరుడు గరుత్మంతుని అన్న. శ్రీరామ నవమి సూర్య గ్రహ ప్రీత్యర్ధం చేయబడే మరి ఒక పండుగ. సూర్యుడికి ప్రీతికరమైన తిధి జ్యేష్ట శుక్ల ద్వాదశి, కార్తిక శుక్ల సప్తమి. సూర్యుడి ప్రీత్యర్ధం ఆదివార వ్రతం చేస్తారు. సూర్యుడిని వివిధరకాలుగా స్త్రోత్రం చేస్తారు. వాటిలో కొన్ని ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య అష్టోత్తర శతనామావళి మొదలైనవి. సూర్యుని ప్రీత్యర్ధం విష్ణుసహస్రనామ పారాయణ, హరి వంశ పురాణం పారాయణ చేస్తారు. గాయత్రీ మంత్రోపాసన, దీక్ష. జపం సూర్యునికి ప్రీతి కలిగిస్తుంది. సూర్యునికి ప్రతి రోజు త్రి సంధ్యలలో సంధ్యా వందనం చేయడం హిందూ సంప్రదాయాలలో ఒకటి.
7. ద్వాదశభావాల్లో సూర్యుడు
మేషం :- సూర్యుడు మేషరాశిలో ఉన్న వ్యక్తి కార్యకుశలత లలిగి ఉంటాడు. వీరికి పట్టుదల అధికం. కష్టసాధ్యమఇన పని అయినా శ్రమ పడి సాధిస్తారు. తమ మీద విశ్వాసం ఎక్కువ ఇతరుల సామధ్యం మీద విశ్వాసం తక్కువ కనుక ఇతరులు వీరిని గర్వము కలినన వారుగా భావిస్తారు. కాని వీరు నిష్కపటులు అని సన్నిహితులు గ్రహిస్తారు. పొగడ్తలకు లొంగే గుణము కలిగి ఉంటారు. ధైర్యసాహసాలు కలిగి ఉంటారు.
వృషభం :- సూర్యుడు వృషభంలో ఉన్న వారు స్థిరమైన స్వభావము కలిగి ఉంటారు. అలంకార ప్రియులు. తమకు వీలైంతగా తామున్న ప్రదేశాలను అలంకరిస్తారు.
అలంకరణ సామాగ్రికి అధికంగా వెచ్చిస్తారు.
మిధునం :- సూర్యుడు మిధున రాశిలో ఉన్న వారు వాక్చాతుర్యం కలిగి ఉంటారు. సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఇతరుల అభిప్రాయాలు సరి అయిన వాదనతో మార్చగలిగిన చతురత ప్రదర్శిస్తారు. వీరు తమ వాహనాదులను తరచూ మారుస్తుంటారు. తమ నేర్పు సమయస్పూర్తి వాకచాతుర్యంతో తామున్న చోటుకంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు.
కర్కాటకం :- సూర్యుడు కటకరాశిలో ఉన్న వ్యక్తి హాస్యసంభాషణా ప్రియులు. బంధువులను ఆదరించే గుణము. పొదుపు పాటించడము. భూతభవిష్యత్తు వర్తమాన కాలములను భేరీజు వేస్తూ పొదుపు చేసి ఖచ్చితమైన నిప్రణాళిక వేస్తుంటారు. మనసులోని విషయాలు ఒక పట్టాన బయట పెట్టరు. హృదయపూవకంగా మాట్లాడుతారు. జరిగిన విషయాలను జీవివితకాలం మరువరు కనుక ఇతరుల మనస్తత్వాన్ని భేరీజు వేసి జాగరూకతగా మెలుగుతుంటారు. ఎవరితోను పేచీలకు దిగరు, ద్వేషము పెంచుకోరు, అనేక విషయాలలో ఇతరులతో సర్దుకు పోయినా అవసరమైన ప్రదేశాలలో కోపం ప్రదర్శిస్తారు. అతిథులను ఆదరంచి సత్కరిస్తారు.

చంద్రుడు

చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మద్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఏడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మద్య భాగమును సూచించును. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు, సూర్యుడు మిత్రులు. చంద్రుడికి శత్రువులు లేరు.
1. చంద్రుని ప్రభావం
చంద్ర ప్రభావిత వ్యక్తులు శ్లేష్మమ వ్యాధి పీడితులుగా ఉంటారు. వీరు కొంత సమయం ఉత్సాహంతోనూ మరి కొంత సమయం నిరుత్సాహంగానూ ఉంటారు. కొంత కాలం ధైర్యము మరి కొంత కాలం భయం కలిగి ఉంటారు. కొంత కాలం ధనవంతులుగా మరి కొంతకాలం ధనహీనులుగా ఉంటారు. స్థూలంగా మానసిక స్థితి, సందలు అస్థిరంగా ఉంటాయి. అభిప్రాయాలూ తరచూమార్చుకుంటారు. మిత్రులనూ తరచూ మార్చుకుంటారు. భోజన ప్రియులుగా ఉంటారు. ఆ కారణంగా యుక్త వయసు దాటే సమయానికి పొట్ట పెద్దది అయ్యే అవకాశం ఎక్కువ. స్వతంత్రించి ఏకార్యం చెయ్య లేరు. నీటి పారుదల, జల విద్యుత్, ప్రజా ప్రాతినిధ్యం, బియ్యము, వస్త్రములకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. పాండు రోగం, క్షయ, మధుమేహం, శ్వాశకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.
2. చంద్రుని కారకత్వాలు
చంద్రుడు తల్లికి, జలరాంతాలు, జలం, పూలు, సముద్రం, నదులు, ముఖము, ఉదరం, మహిళా సంఘాలకు, స్త్రీ సంక్షేమ సంఘాలకు చందుడు కాకత్వం వహిస్తాడు. వృత్తి సంబంధంగా నౌకా వ్యాపారం, ఓడ రేవులు, వంతెనలు, ఆనకట్టలు, చేపల పెంపకం, వెండి, మత్యములకు కారకత్వం వహిస్తాడు. వ్యాధులలో రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్(రాచ పుండు) మొదలైన వాటికి కారకుడు, ఆహార సంబంధంగా చెరకు, తేనె, పాలు, పెరుగు, భోజనము, గోధుమలు, జొన్నలు, రొట్టెలు, గోధుమలు, చేపలు, పంచదార, అరటి పండు, నెయ్యి, దోసకాయలు, తమలపాకులు, గుమ్మడి, క్యాబేజీ, కర్బూజా ఫలం, కుక్కగొడుగులు, ఆవులు, గుడ్లు తాబేలు, గుడ్లగూబ, బాతు, గబ్బిలం, పిల్లి, నీటి గుర్రం, సొర చేపల వంటి ప్రాణులకు కారకత్వం వహిస్తాడు., తిమింగలం మొదలైన ప్రాణులకు కారకత్వం వహిస్తాడు. గుడ్లు, క్కర్పూరం, నికెల్, జర్మన్ సిల్వర్ లాంటి వస్తువులకు కారకత్వం వహిస్తాడు. సంగీతం, నాటం, కవిత్వం లాంటి లలిత కళలకు కారకత్వం వహిస్తాడు. మనస్తత్వ శాస్త్ర పఠనం,వ్యవసాయం, విద్యా సంబంధిత వృత్తులు, జల వనరులవంటి వృత్తులకు కారకత్వం వహిస్తాడు. మూలికలు, స్త్రీలు, జీర్ణ వ్యవస్థ, జున్ను చంద్రుడు కారకత్వం వహించే ఇతరములు.
3. రూపురేఖలు
పురాణ కధనం అనుసరించి చంద్రుడు గౌరవర్ణం కలిగిన వాడు. శ్వేత వస్త్ర ధారణ చేయువాడు. శ్వేత వర్ణ ఆభరణములతో అలంకరించబడిన వాడు. రెండు భుజములతో, శిరస్సున బంగారు కిరీటము ధరించి మెడలో ముత్యాల మాలను ధరించి ఒక చేత గధ, ఒకచేత వరద ముద్రతో దర్శనం ఇస్తాడు. దశాశ్వములను పూన్చిన రధమును అధిరోహించి సంచరిస్తాడు.
4. చంద్రుడు రాశులు
చంద్రుడు కర్కాటకంలో స్వక్షేత్రంలోనూ వృషభంలో మూడు డిగ్రీల వద్ద ఉచ్ఛ స్థితిలోనూ, వృశ్చికంలోని మూడు డిగ్రీల వద్ద నీచస్థితిలోనూ ఉంటాడు. చంద్రుడికి శత్రువులు లేరు అలాగే శత్రు క్షేత్రం లేదు. చంద్రుడికి మిధునం, కన్య, సింహములు మిత్ర క్షేత్రములు. వృషభం త్రికోణ స్థానం. శుక్ర, శనులు సములు. కుంభం, మకరం, తులా రాశులు సమ రాశులు.

కుజుడు లేదా అంగారకుడు

అంగారకుడు ఉగ్ర స్వభావుడు. అధిపతి కుమారస్వామి.పురుష గ్రహం,రుచి చేదు, జాతి క్షత్రియ, అధి దేవత పృధ్వి, దిక్కు దక్షిణం, తత్వం అగ్ని, ప్రకృతి పిత్తము, ఋతువు గ్రీష్మం, లోహములలో ఇనుము, ఉక్కు, రత్నము పగడము, గ్రహ సంఖ్య ఆరు, భావరీత్యా దశమస్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు. గుణం తమో గుణం, ప్రదేశం కృష్ణా నది మొదలు లంక వరకు. అంగారకుడు మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలకు అధిపతి. శరీరావయావలో ఎముకలో మజ్జ, కండరాలు, బాహ్యంలో జ్ఞానేంద్రియాలు. అంగారకునికి సూర్యుడు, చంద్రుడు, గురువు మిత్రులు, శత్రువు బుధుడు, సములు శుక్రుడు, శని.
1. అంగారకుడి ప్రభావం
అంగారక ప్రభావితులు పొడుగుగా దృఢంగా ఉంటారు. బంధువులంటే అపార ప్రేమ కలిగి ఉంటారు. అదుపు చేయ లేని ఆవేశ పరులు. విపరీత బంధు ప్రీతి కలిగి ఉంటారు. అధికారం, పదవి, సేవకులను కలిగి ఉంటారు. యంత్రములు, ఆయుధములు మొదలైన వాటిలో శిక్షణ పొందుటలో ఆసక్తుడు. అధిక దానధర్మములు కలిగి ఉంటారు.
2. అంగారకుడి రూపు రేఖలు
అంగారకుడు ఎర్రని మేని ఛాయ కలవాడు. సన్నని నడుము, కండలు తిరిగిన శరీరం, వంకీల జుట్టు కల వాడు. వయసు పద హారు. ఎర్రని వస్త్రధారణ, శంఖం వంటి మెడ, వాహనం పొట్టేలు, ఆయుధం శూలం, మంగళప్రదమైన రూపము.
3. కుజదోష నివారణకు పరిహారం
కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.
సుబ్రహ్మణ్య ఆలయ స్తుతి దర్శనం చేయాలి.
షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి.
సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి.
ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి.
కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్ధాలను నైవేద్యం పెట్టాలి.
కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి.
ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి. స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు ధరించి చేసి దుర్గాదేవిని పూజించుట, అమ్మవారికి ఎర్రని పూలను మాలలను సమర్పించి కుంకుమపూజ చేయాలి.
దుర్గాదేవిని స్తుతించాలి. మంగళ వారాలు దుర్గాదేవి ఆలయదర్శనం చేసి ప్రదిక్షిణం చేసి స్తుతించి పూజించాలి. గణపతి స్తోత్రం చేయాలి. ఆంజనేయస్వామి దండకం స్తుతి చేయాలి.
బలరామ ప్రతిష్టిత నాగావళీ నదీతీర పంచలింగాలను దర్శించాలి.
మంగళ వారాలాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదిక్షిణం, స్తుతి చేయాలి.
మంగళ వారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.
ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్భై మార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి.
నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి.
కోతులకు తీపి పదార్ధములు పెట్టాలి,
ఎర్రమి కుక్కకు ఆహారం పెట్టాలి.
మంగళ వారం రాగిపళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి.
4. భావాలు పరిహారం
కుజుడు కటకంలో నీచ స్థితి పొందుతాడు. కటకం లగ్నం నుండి పన్నెండు భావాలలో ఉన్నప్పుడు ఆయాభావాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కనుక వాటికి తగిన పరిహారాలు కింద ఇవ్వబడ్డాయి.
మొదటి భావం లేక లగ్నం కుజుడికి నీచ స్థానమైన కటకం అయి అందులో కుజుడు ఉంటే అబద్ధములు చెప్పకూడదు, దంతంతో చేసిన వస్తువులు వాడరాదు. దానం తీసుకోరాదు.
కుజుడు రెండవ స్థానంలో ఉండి అది కుజుడికి నీచ స్థఆనమైన కటకం అయిన ఎడల కంఠ సమస్యలు ఉంటాయి కనుక కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యస్వామిని సేవించి గంట, దీపం దానం చేయాలి. రెండవ స్థానం కటకం అయి అందు కుజుడు ఉన్న అది కుజుడికి నీచ స్థితి కనుక ధన సమస్యలు ఉంటాయి. పరిహారంగా ఎర్రటి చేతి గుడ్డను ఎప్పుడూ వాడుతుండాలి. ఏడు మంగళ వారాలు చిన్న పిల్లలకు బెల్లం గోధుమలతో చేసిన ఆహారం తినిపించాలి.
కుజుడు అన్నదమ్ములకు చిహ్నం. మూడవ ఇంట కుజుడు ఉన్న సోదరులతో చిక్కులు ఉంటాయి కనుక పరిహారం కొరకు ఏనుగు దంతంతో చేసిన వస్తువును ఇంటికి దక్షిణంలో ఉంచి కుజుడిని ఆరాధించాలి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఇరుగు పొరుగుతో వివాదాలకు దూరంగా ఉండాలి. వెండి ఉంగరంలో పొదిగిన పగడపు ఉంగరం ఎడమ చేతికి ధరించవచ్చు.
నాగవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కోతులకు, తల్లికి భోజనం పెట్టాలి. పంచదార వంటి తీపి పదార్ధాల సంబధిత వ్యాపారం చేయాలి.
పంచమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు రాగి పాత్రలో రాత్రి అంతా ఉంచిన నీటిని తెల్లవారిన తరువాత పచ్చని చెట్టుకు పోయాలి. ఇంటికి దక్షిణంలో వేప చెట్టు నాటాలి.
ఆరవ స్థానం రోగ, శత్రు స్థానం కనుక కుజ స్తోత్రం చదువుకోవాలి. తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఇంట్లో ఉంచరాదు.
ఏడు స్థానంలో కుజుడు ఉన్న భార్యాభర్తల మద్య వివాదాలు ఉంటాయి కనుక పరిహారంగా శిరః స్నానమాచరించి ఇంటికి దక్షిణ భాగంలో మూడు వత్తులతో దీపం వెలిగించి కుజుడి స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయాలి. కంది పప్పుతో చేసిన ఆహారం తీసుకుంటే ధన సమస్యలు తీరి భార్యాభర్తల మద్య అనుకూలత కుదురుతుంది.
ఎనిమిదవ స్థానం ఆయుషు స్థానం స్త్రీలకు మాంగల్య స్థానం కనుక సుబ్రహ్మణ్య, దుర్గ, ఆంజనేయ, గణపతి, శివులకు విశేష పూజలు చేయాలి.
తొమ్మిదవ స్థానం అందు కుజుడు నీచమైన; పెద్ద వారిని గౌరవించడం, వెండితో పొదిగిన పగడపు ఉంగరం ధరించడం చెయ్యాలి.
పదవ స్థానం అందు కుజుడు నీచమైన; కార్యాలల్లో సుబ్రహ్మణ్య స్వామిని ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కార్యాలు మొదలు పెట్టాలి.
పదకొండవ స్థానం లాభస్థానం, అన్నతో పేచీలు ఉంటాయి. మట్టి పాత్రలో సింధూరం లేక తేనె ఉంచిన దోష పరిహారం ఔతుంది.
వ్యయ స్థానం కుజుడు నీచమైన తేనె త్రాగుట, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి.

బుధుడు

బుధుడు నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు.
బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు.
1. బుధుడి ప్రభావం
బుధ ప్రభావితులు పొట్టిగా ఉంటారు. చురుకుగా ఉంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో కూడా యవ్వనంతో కనిపిస్తారు. దీర్ఘాలోచ కల వారు, మేధా సంపత్తి కల వారుగా ఉంటారు. సందేహ ప్రవృత్తి కలవారుగా ఉంటారు. విషయ జ్ఞానం అందు ఆసక్తులు. రచయితలు, కళాకారులుగా ఉంటారు. తలనిప్పి, తల నొప్పి, అల్సర్ వ్యాధి పీడితులయ్యే అవకాశం ఉంది. ప్రసార రంగంలోనూ, కళారంగంలోనూ, గణికులుగా ఉంటారు.
2. బుధుడి కారకత్వాలు
బుధుడు వాక్కుకు, మేనమామకు, మేనకోడలికి, మేనల్లుడికి, మాతా మహులకు కారకత్వం వహిస్తున్నాడు. ఉపన్యాసంలో నైపుణ్యం, లలిత కళలు, గణిత శాసత్రం, వాణిజ్యం, అర్ధ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వ్యాపార శాస్త్రం, వ్యాకరణం, జ్యోతిషం, వివిధరకాల భాషలు, శిల్పి, మంత్రం, తంత్రం, వివేకం, పుస్తక పచురణ, గ్రంధాలయం మొదలైన వాటికి కారణం. దౌత్యం, వైద్యం, మద్యవర్తిత్వం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వైష్ణవులు, వైష్ణవ భక్తి, వైష్ణవాలయం మొదలైన వారికి కారకత్వం వహిస్తాడు. నాభి, నరము,స్వరపేటిక, చర్మమును సూచిస్తాడు కనుక నరముల బలహీనత, మూర్చ, చ్చెముడు, మెదడుకు సంబంధించిన వ్యాదులకు కారకత్వం వహిస్తాడు. సకల విధ ఆకు కూరలు, కాయ కూరలకు కారకత్వం వహిస్తాడు. సభా నిర్వాహకులు, ప్రజాసంబంధిత వ్యవహారికులు, ప్రచారకులు, ఉపన్యాసకులు, ఉపాద్యాయులు, న్యాయవాదులు మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. వాక్సంబంధిత వృత్తులకు బుధుడు కారకుడు. మేధావులు, పండితులు, చరిత్రకులు, గుమస్తాలు, చిత్రకారులు, రాయబారులు, విద్య, గణికులు, దస్తూరి, నవలలు, వ్యాసాలు, కల్పితాలు, చిన్న పుస్తకములు, యువకులు, ప్రకటనలు, వాహనములు, వ్యాపారం, నిఘంటువులు, సత్యవాదముకు బుధుడు కాకత్వం వహిస్తాడు.
3. బుధుని రూపురేఖలు
బుధుడు దుర్వాదళ దేహకాంటి కలిగిన వాడు. నాలుగు భుజములు కలిగి పీత వస్త్రములను ధరించి పసుపు పచ్చని మాలా ధారణ చేసి గధ, కత్తి, డాలు ఆయుధములను చేత పట్టి ఉంటాడు. బుధుడు సింహమును అధిరోహించి ఉంటాడు.
4. బుధుని పూజించు విధానం
బుధుడిని పూజించుటకు బంగారు ప్రతిమను చేయాలి. పాలతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. అధిదేవత విష్ణువు, అధిష్టాన దేవత దుర్గ. ప్రసాదము పులిహోర, వడపప్పు, దోషనివారణకు దానం చేయవలసిన లోహం బంగారం. బుధుడికి శ్రావణ్ శుక్ల పంచమి, వైశాఖ పూర్ణిమ, ఆచరించ వలసిన వ్రతం సత్యనారాయణ వ్రతం, పారాయణ చేయవలసిన గ్రంధం దేవీ భాగవతం, పారాయణ చేయవలసిన బుధగ్రహ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్ర నామం, ధరించవలసిన మాల తులసి మాల, తీసుకోవలసిన దీక్ష గోవింద దీక్ష, ధరించ వలసిన రుద్రాక్ష చతుర్ముఖ రుద్రాక్ష, దర్శించ వలసిన ఆలయాలు విష్ణాలయం దుర్గాలయం, పూజ దుర్గా పూజ, దానం చేయవలసిన వాస్థువులు పెసలు ఆకు పచ్చని వస్త్రాలు, ఆసనం బానాకారం, గ్రహ శాంతికి చేయ వలసిన జపం పది హేడు వేలు, హోమముకు వాడవలసిన సమిధ ఉత్తరేణి.
5. బుధుడు రాశులు
బుధుడు కన్యారాశిలో 15 డిగ్రీలలోఉచ్ఛ స్థిలోనూ, మీన రాశిలో 15 డిగ్రీలలోపరమ నీచ స్థితిలోనూ ఉంటాడు. కన్యారాశి బుధునికి త్రికోణ స్థానం. శత్రు క్షేత్రం కర్కాటక రాశి. విషమ క్షేత్రం కర్కాటక రాశి. మిత్ర క్షేత్రములు వృషభ రాశి, తులా రాశి, సింహ రాశి. సములు కుంభరాశి, మకర రాశి, మేష రాశులు, వృశ్చిక రాశులు, ధనస్సు, మీనములు. రాశిలో 30 డిగ్రీల వరకు శుభఫలితం ఇచ్చాడు. బుధుడు ఒక రాశిలో ఒక నెల రోజులు ఉంటాడు. దిన చలనం ఒక డిగ్రీ. లగ్నంలో దిగ్బలం చెందుతాడు. గోచార రీత్యా బుధుడు 2, 4, 6, 11 స్థానములలో శుభుడు. గోచార రీత్యా అశుభ స్థానములు 1, 3, 5, 7, 8, 9, 12. వేధ స్థానములు 3, 5, 9, 12. దశాసంవత్సరములు పదిహేడు.

గురువు

గురువు దేవ గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒకటి.ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, ఆంగీరస, జీవ అనే ఇతర నామాలు ఉన్నాయి. ఆది వారంతో మొదలయ్యే వారాలలో గురువుది అయిదవ స్థానం. అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా అంటారు. అత్యంత శక్తి వంతమైన గ్రహం. పురుష గ్రహం, అధి దేవత బ్రహ్మ, రుచులలో తీపికి రుచి కారకుడు, వయసు ముప్పై, ప్రకృతి కఫ ప్రకృతి, హేమంత ఋతువుకు అధిపతి, తత్వం ఆకాశ తత్వం, దిక్కు ఈశాన్య దిక్కును సూచిస్తాడు. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచిస్తాడు. గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కటక రాశిలో ఉచ్ఛ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. గురువు ధనస్సు రాశికి, మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు. గురువుకు మిత్రులు రవి, చంద్ర, కుజులు. శత్రువులు బుధ, శుక్రులు. సముడు శని. గురుదశ పదహారు సంవత్సరాలు. స్వభావం మృదు స్వభావం, సత్వగుణం, శుభ గ్రహం, జీవులు ద్విపాదులు, స్థానం ధనాగారం, అత్మాధికారత్వం జ్ఞానం, ధాతువు కొవ్వు, కుటుంబ సభ్యులు పుత్రుడు, గృహ స్థానం పూజ గది, ధన స్థానము, కాల బలం పగలు, స్థాన బలం లగ్నం, కాల ఆధిపత్యం మాసము, దిక్బలం తూర్పు, వర్ణం పసుపు వర్ణం, రాశిలో ఉండే కాలం ఒక సంవత్సరం, సమిధ రావి, మూలిక రావి అరటి వేరు, గోత్రము అంగీరస, వేదము ఋగ్వేదము, అవతారం వామనుడు.
1. రూపం
గురువుది స్థూల శరీరం, కపిల వర్ణ కనూలు, కపిల వర్ణ వెంట్రుకలు, పీతవర్ణ శరీర కాంతి కలవాడు. నాలుగు భుజములు కలిగి చేతులలో దండము, కమండలం, రుద్రాక్షమాల ధరించి ఉంటాడు. గురువు పీతాంబర ధారి, వాహనము సింహము. గురువు భార్య తార, తండ్రి అంగీరసుడు, తల్లి ప్రజాపతి మారీచి పుత్రిక అయిన సురూప.
2. గురువు కారకత్వం
ధనం,విద్య,పుత్రులు,జ్యేష్ట భ్రాత,దేహపుష్టి,బుద్ధి,అర్ధసంపద,యజ్ఞం,కీర్తి,గృహం,బంగారం,శస్త్రం,అశ్వం,మెదడు,జ్యోతిషం,వేదశాస్త్రం,శబ్ధశాస్త్రం, వాహనశాస్త్రం,ఆందోళికం,గంజం,యజ్ఞయాగాధి క్రతువులు,కర్మ,ఆచారం,ఛాందసం,సుజనత్వం,శాంతం,మంత్రిత్వం,ఐశ్వర్యం,బంధివృద్ధి,దయ, దాక్షిణ్యం,ధర్మం,దైవభక్తి,వస్త్రం,సత్యం,తర్కం,మీమాంస,సింహాసనం,వాగ్దోరిణి,పసుపురంగు,నృపసన్మానం,ధర్మం,వెండి,బ్రాహ్మణులు,జ్ఞానం, కోశాగారం,నవీనగృహం,బంధుసమూహం,సుబుద్ధి,ఉత్తరదిశ,కావ్యజ్ఞానం,నిక్షేపం,వైడూర్యం,ఊరువులు,అగ్నిమాంద్యం,దంతములు,వేదాంతజ్ఞానం, బ్రాహ్మణభక్తి,శ్రద్ధ,పాండిత్యం,బ్రాహ్మణవృత్తి,ఉపాద్యాయవృత్తి,ముద్రాధికారం,భాతృశుఖం,సంపత్తి,బహువిధ విద్వత్తు,వ్యాకరణం,రక్తం,పిత్తాశయం, రక్తనాళములు,ఉన్నత విద్యపై అధికారం,వాణిజ్య విషయములు,ధన విషయములు మొదలైనవి గురుగ్రహ కారకత్వాలు. ఆహార పదార్ధాలు నెయ్యి, నూనె, పాలు, వెన్నలకు కారకత్వం వహిస్తాడు. శనగలు, పనస కాయలు, దబ్బకాయలకు కారకత్వం వహిస్తాడు. పక్షులలూ పావురం, హంసలు జంతువులలో గుర్రములు, ఏనుగులకు, సింహములు వృక్షములలో వట వృక్షం కారకత్వం వహిస్తాడు. పుస్తకములు, కళాశాలలు, వైద్యులు, లాయర్లు, పూజారులు, ఫాదర్లు, బిషప్పులు, చర్చి మసీదు వంటి మత సంస్థలు, కరుణ, సంతోషం, పెట్టుబడులు, అభివృద్ధి , ఐశ్వర్యం, ఉపాసన, వీదేశీయులు, భవిష్యత్తు, బహుమతులు, ఆచారాలు బ్యాంకులు, ధనుర్విద్య, రేసులు, టైటిల్స్, నిజాయితీలను సూచిస్తాడు.
3. గురు ప్రభావం
గురు ప్రభావితులు స్థూలకాయం కలిగి మంచి ఆకారం కలిగి ఉంటారు. గురుగ్రహ ప్రభావితులకు ఆహారం, వస్త్రం వంటి జీవిత సౌఖ్యములు పుష్కలంగా ఉంటాయి. సంప్రదాయాల పట్ల గౌరవం, దైవభక్తి, పాండిత్యం, న్యాయ బుద్ధి, ధర్మనితరి, జ్ఞానం కలిగి ఉంటారు. చక్కని కంఠధ్వని, విశాల నేత్రాలు కలిగి ఉంటారు. విద్యావంతులై విద్యా సంస్థలతో సంబంధం కలిగి ఉంటారు. న్యాయశాస్త్ర అధ్యయనం, దేవాలయ వ్యవస్థ, విద్యా సంబదిత పదవులలో రాణిస్తారు.
4. కొన్ని విశేషములు
వృత్తులు :- గురువు న్యాయవాదులు, న్యాయ మూర్తులు, బోధకులు, ఉపాద్యాయులు, సామాజిక రచయితలు, మత ప్రవక్తలు, పురోహితులు, మత ప్రచారకులు, ఉన్నత ప్రభుత్వ పదవులు వహిస్తారు. గురువు రవి చంద్రులతో కలిసిన బ్యాంకులు, అధ్యక్షులు, మేయర్, కౌన్సిలర్లు, పార్లమెంటు సభ్యులు, మేనేజరు, మేనేజింగు డైరెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. గురు బుధులు కలిసిన విదేశీ భాషలు, ఎగుమతులు దిగుమతులు , సివిల్ ఇంజనీరింగ్ వంటి వృత్తులను సూచించును.
వ్యాధులు :- మధుమేహం, కాలేయము, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, బోధకాలు, చెమట, నీరు చేరటం, నిస్సంతానం, కాన్సర్ వంటి వ్యాధులు.గురువు చంద్రుడితో కలిసిన గర్భాశయ వ్యాధులు, శుక్రుడితో కలిసిన మధుమేహం, విచిత్రమైన కోరికలు, రవితో కలిసిన కొలెస్ట్రాల్, మూత్ర పిండ వ్యాధులు, అతిమూత్ర వ్యాధి, పసికర్లు కామెర్లు వంటి వ్యాదులను సూచించును.
గురువు ఆశ్వీజ శుక్ల ద్వాదశి గురు వారం ధనిష్టా నక్షత్రం నాడు అంగీరస సురూపలకు పుత్రుడుగా జన్మించాడు.
5. పూజా విధానం
గురువుని పూజించుటకు బంగారు ప్రతిమను వాడాలి. దధ్యోజనం, శనగలు నైవేద్యం చేయాలి. శివ సహస్ర నామావళి, గురువుకుఆధిదేవత బ్రహ్మ, ప్రత్యధి దేవత ఇంద్రుడు కనుక వీరిని ఆరాధించాలి. దోష నివారణకు పసుపు వర్ణ వస్త్రములను దక్షిణ తాంబూలముతో దానం చెయ్యాలి. గురు అష్టోత్తర నామావళి, దత్త చరిత్ర, బ్రహ్మంగారి చరిత్ర వంటి గురు చరిత్రలను పారాయణం చెయ్యాలి. గురువుకు ఇష్టమైన వ్రతం అనఘా వ్రతం. గురువుకు ప్రీతికరమైన రోజు అషాఢ పూర్ణిమ. ధరించ వలసిన మాలలు చందన మాల, పుష్యరాగ మాలలు. పంచ ముఖ రుద్రాక్షను ధరించ వచ్చు. బంగారం, పసుపు, శనగలు, పసుపు రంగు వస్త్రాలు దానం చెయ్యాలి. పసుపు రంగు పండ్లు, పసుపు రంగు పూలను పూజకు ఉపయోగించాలి. గ్రహశాంతికి చేయవలసిన జపం పదహారు వేలు. హోమముకు రావి చెట్టు పుల్లలను వాడాలి. గురువులను ఆరాధించుట, గురువు ఆలయాలను దర్శించుట, గురుదీక్షలను స్వీకరించుట వలన దోష నివారణ చేయవచ్చు.

శుక్రుడు

శుక్రుడు రాక్షస గురువు, భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం, రుచులలో పులుపుకు ప్రతీక, వర్ణం తెలుపును సూచిస్తాడు. జాతి బ్రాహణ జాతి, అధి దేవత ఇంద్రాణి, ఏడు సంవత్సరాల వయసును సూచిస్తాడు, మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. ప్రకృతి శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తాడు. తత్వము జలతత్వం, దిక్కు ఆగ్నేయము, రత్నము వజ్రము, లోహము వెండి, ఋతువు వసంతం, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము రజోగుణము, ప్రదేశం కృష్ణా గోదావరి నదుల మద్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్త. శుక్రుడు వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. శత్రువులు రవి, చంద్రులు. మిత్రులు శని, బుధులు. సములు కుజుడు, గురువులు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.
1. కారకత్వములు
శుక్రుడు శారీరక సుఖము, భార్య, యౌవనం, సౌందర్యం, రాజసము, వినోదము, స్త్రీలు, ఐశ్వర్యం, జలవిహారం, ఆభరణములు, సౌందర్య సాధనములు, చతుషష్టి కళలు, వీర్యము, మన్మధుడు, సుఘంధద్రవ్యములు, గౌరి, లక్ష్మి ఆలయములు, క్రీడా ప్రదేశములు, పాలు, పాల కేంద్రాలు,పాలకు సంబంధించిన వస్తు విక్రయము, వస్త్రములు దానికి సంబంధించిన వృత్తులు, అలంకార సామాగ్రి, పరిమళ ద్రవ్యములు వాటికి సంబంధించిన వృత్తులు, పానీయములు, పండ్లరసాలు వాటికి సంబంధించిన సంస్థలు, పెట్రోలు వాహనములు, నౌకలు, సముద్ర యానం, ర్స సంబదం ఉన్న నిమ్మ, నారింజ, కమలా, బత్తాయి మొదలైన పండ్లు, నేత్ర, సుఖ, చర్మ, కంఠముకు సంబంధించిన రోగములు. దర్జీ, కళాసంబంధ వృత్తులు, సౌందర్య సంబధిత వృత్తులు , స్నేహితులు, బహుమతులు, హనీమూన్, ప్రేమ, విందులు విలాసా విహారాదులు, పూలు, అలంకరణ సామాగ్రి, లౌక్యము, లాభము, ఒప్పందము, ఆకర్షణ మొదలైన వాటికి కారకుడు.
2. రూపము
శుక్రుడు వర్ణం ధవళ వర్ణం. నాలుగు భుజములు కలిగి ఉంటాడు. చేతులలో దండము, కమండలం, రుద్రాక్షమాలను ధరించి ఉంటాడు. రధాన్ని అధిరోహిస్తాడు. ఇతడి తండ్రి భృగువు తల్లి హిరణ్య కశిపుని కుమార్తె ఉష. ఇతడికి కావ్యుడు, సితుడు, భృగుసుతుడు, దానవాచార్యుడు, ఉశనుడు అనే ఇతర నామాలు ఉన్నాయి.
3. వ్యాధులు
గర్భాశయ వ్యాధులు, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాదులు మొదలైన వాటికి కారకుడు. కుజుడితో కలిసిన గొంతు నొప్పి. టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి. బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం, శనితో కలిసిన సుఖ వ్యాధులు, రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాదులు, కేతువుతో కలిసిన సంతాన లేమి మొదలైన వ్యాధులకు శుక్రుడు కారకుడు.
4. వృత్తులు
శుక్రుడు కళారంగ సంబంధిత వృత్తులు, స్వీట్ షాపులు, పానీయాల షాపులు, పండ్లరసాల వ్యాపారం, పాల సంబంధిత వృత్తులు, వెండి, బంగారు, రత్జ్ఞ వ్యాపారములు, ఫ్లాస్టిక్, కలప, రబ్బరుకు సంబంధించిన వృత్తులు శుక్ర ప్రభావితులకు లాభిస్తాయి. సముద్ర యానం, నౌకాయాన సంబంధిత వృత్తుఇలు. సముద్ర సంబంధిత వృత్తులు. ఆహార సంబంధిత వృత్తి వ్యాపారాలు, ఉప్పు సంబంధిత వృత్తి,వ్యాపారాలు. పెట్రోలు , వాహన సంబంధిత వ్యాపారులు. ముత్యముల వ్యాపారం, మత్యకారులను సంబంధిత వృత్తి వ్యాపారాలను సూచిస్తుంది.
5. శుక్రుడి గురించి పరాణాలలో
శ్రీకృష్ణుడి చేత కుచేలుడికి అనుగ్రహించబడిన అపార ధన సంపత్తిని ఉశనుడు అపహరించబూనడంతో ఈశ్వరుడు ఆగ్రహించి శుక్రుడిని సంహరించడానికి ఉద్యుక్తుడైనాడు. ఉశనుడు తన తపశ్శక్తితో ఈశ్వరుడి ఉదరంలో ప్రవేశించి ఈశ్వరుడిని స్తుతించసాగాడు. భోళాశంకరుడైన ఈశ్వరుడు ఉశనుడికి అభయం ఇచ్చి శుక్ర శోణిత రూపంలో బయటకు పంపాడు. అప్పటి నుండి అతడికి శుక్రుడన్న పేరు సార్ధకం అయింది.చైత్ర శుద్ధ ఏకాదశి నాడు మఖ నక్షత్రంలో మన్మధ సంవత్సరంలో ఉశనుడు శుక్రుడిగా అవతరించాడు. శివుడు అతడి స్తుతికి మెచ్చి ధన్వీర్యాలకు అధిపతిగానూ, రాక్షసులకు గురువుగానూ చేసి గ్రహమండలంలో స్థానం కల్పించాడు. అసురుల గురువైన శుక్రుడు వారి అభ్యున్నతి కొరకు ఘోర తపస్సు చేసాడు. ఈశ్వరుడిని మెప్పించి మృతసంజీవనీ విద్యను సాధించాడు. శుక్రుడు సంపదలకు, మంత్రములకు, రసాలకు, ఔషధులకు అధిపతి. అద్భుతమైన శక్తి సామర్ధ్యాలు కలిగిన ఇతడు తన సంపదలను దానవ శిష్యులకు అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. వర్షాలపై ఆధిపత్యం వహిస్తూ అతి వృష్టి, అనావృష్టికి కారకుడౌతాడు. వర్షాలను నిరోధించే వారిని శాంతింపచేస్తాడు.

శని

శని నపుంసక గ్రహం. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరివాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు.
1. శని ప్రభావం
సాదారణంగా శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలా మంది భయపడుతుంటారు. శని పాపములకు తగిన దండన ఇస్తాడని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఎలిన నాటి శని కాలం ఏడున్నర సంవత్సరమముల కాలం, శని మహర్దశా కాలంలో, అర్ధాష్టమి, అష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. పరిహారాలు ఉంటాయి. శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశుల వారికి , మిత్ర స్థానాలు అయిన మిధున, కన్యా, వృషభ, తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మింక్ష్చిన వారికి, కొంత వెసులుబాటు ఉంటుంది. కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియ చేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుంది. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు.
2. కారకత్వం
ఆయుఃకారకుడు, ఆటంకములు, విరోధం, కష్టం, బాధలు, దుఃఖం, సేవకత్వం, దురాచారము, బంధనం, మూర్ఖత్వం, జూదము, జైలు జీవితం, మద్యపానం, అంగవైకల్యం, మూర్చ రోగం, అంగవైకల్యం, బ్లాక్ మార్కెట్, అన్యాయార్జన, జీవహింస, అవమానము, రాజదండన, బద్ధకం, క్షుద్రశక్తులు, అప్పులు, మృత్యుదేవతారాధాన, అంద విహీనత, బంధు మిత్ర తిరస్కారం సూచిస్తాడు. వంటవారు, నపుంసకులు, చండాలురు, అక్రమసంతానం, సేవకులు, నీచులను సూచిస్తాడు. పురాతన భవనాలు, పురాతన వస్తువులు, పూరావస్తు శాఖ, సొరంగాలు, గుహలు, చలివేంద్రములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. నువ్వులు, ఉల్లి, వేరు శనగ, బంగాళాదుంపలు, రాగులు, జొన్నలు, మినుములు, దున్నపోతు, గాడిద, ఒంటె, కోడి, బొగ్గు, తారు, నల్లమంగోళ్ళకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం, కిరోసిన్, వెంట్రుకలు, ఎముకలు, దంతములను సూచిస్తాడు. కలప, తోలు పరిశ్రమలను సూచిస్తాడు. ఆలస్యము, దురదృష్టము, సరిహద్దులు, దహనకార్యక్రమాలు, అపవాదు, పదవీ విరమణ, నిర్మాణం, శాస్త్రీయదృక్పదం, ఒంటరి తనం సూచిస్తాడు. గనులు, వంతెనలు, చర్మము, ఆనకట్టలు, పిరికి వాళ్ళు, రాళ్ళు, ఆస్తి, ఆపద, మంచు, ఆందోళన, వినయము, అనుమానము, అనుకూలత, వినయము, సెరామిక్స్, మట్టిని సూచిస్తాడు.
3. వ్యాధులు
శని వాత సంబంధ వ్యాదులను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాదులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాదులు, పని చేయలేని అశక్తి, డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు. చంద్రుడితో కలిసిన మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి, తల నొప్పి, బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు. గురువుతో చేరిన జీర్ణ వ్యస్థకు సంబంధించిన వ్యాధులు. బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుంట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవి సంబధిత వ్యాదులు సూచిస్తాడు. కుజుడితో కలిసిన కండరాల నొప్పి, కండరాల జబ్బులు సూచిస్తాడు. శుక్రుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, పైల్స్, విరోచనాలు మొదలైన వ్యాదులను సూచిస్తాడు. రాహువుతో కలిసిన విషప్రయోగం, వైరస్ వ్యాదులను సూచిస్తాడు.కేతువుతో కలిసిన రక్త పోటు వ్యాదులను సూచిస్తాడు.
4. వృత్తులు వ్యాపారాలు
జైలర్, ప్లంబర్, వాచ్‌మన్, పాకీపని చేయు వారు, వీధులు ఊడ్చు వారు, కూలీలు, మేస్త్రీ పని వారు, తోటమాలి, రైతులను సూచిస్తాడు. లోహాలు, తోలు, కలప వ్యాపారాలు. చంద్రుడితో కలిసిన సివిల్ ఇంజనీర్లు, బిల్డర్స్, సర్వేయర్లు, ఎక్స్‌రే టెక్నీషియన్లను సూచిస్తాడు. రవితో కలిసిన ప్రభుత్వరంగ సేవలు చేసే వారు. గురువుతో కలిసిన భూముల కొనుగోలు అమ్మకాల వ్యాపారం, గనుల యజమానులు, సైంటిఫిక్ లాబ్‌లో పని చేయు వారు. బ్యాంక్ సిబ్బంది, ప్రచారం చేయు వారిని సూచిస్తాడు. బుధుడితో కలిసిన రచయితలు, శాస్త్రవేత్తలు, కలప కోయు వారు, ఉపాధ్యాయులు, సెన్సార్ బోర్డ్, సి ఐ డి డిపార్ట్ మెంటులో పని చేయు వారిని సూచిస్తాడు.
5. రూపము
శని నీల కాంతి కలిగిన మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు కలవాడు. ధనుర్భాణాలు, శూలం ధరించిన వాడు. కాకిని వాహనంగా చేసుకున్న వాడు. శనికి నిదానంగా సూర్యుడిని చుట్టి వస్తాడు కనుక మందుడు అని పిలుస్తారు. పంగు, సౌరి అను ఇతర నామాలు ఉన్నాయి. సూర్యుడికి ఛాయాదేవికి కలిగిన పుత్రుడు. మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్ధశి నాడు ధనిష్ఠా నక్షత్రంలో విభవానామ సంవత్సరంలో జన్మించాడు. శనిభగవానుడి సోదరి యమున, సోదరుడు యముడు, భార్య జ్యేష్టాదేవి. సూర్యుడి భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సజ్ఞాదేవి సూర్యుడి తాపం భరించ లేక తనకు ప్రతిగా ఛాయాదేవిని సృష్టించి పుట్టింటికి వెళ్ళిన సమయంలో శని జన్మించాడు. తరువాత కాలంలో సూర్యుడిని చేరిన సజ్ఞాదేవి శనిని సరిగా చూడని కారణంగా శని ఆమెను కాలితో తన్నాడు. ఆకారణంగా శనిని ఆమె శపించంగా శనికి మందగమనం ప్రాప్తించింది.
6. పరిహారం
శని దశా ప్రారంభ సమయం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిననాటి శని కాలం శని సమస్యలను ఇచ్చే సమయం. శివారాధన,శివార్చన, శివాలయ దర్శనం సమస్యలకు పరిస్కారంగా చేయాలి. శని క్షేత్రాలయిన తిరునల్లారు, శని సింగినాపురం లాంటి క్షేత్ర దర్శనం. శ్రీకూర్మ దేవాలయ దర్శనం చేయాలి. శని దశాకాలం పందొమ్మిది సంవత్సరాలు కనుక పంతొమ్మిదివేల సార్లు జపం చేయించాలి. నువ్వులు, మినుములు, నూనెలను దానం ఇవ్వాలి. నల్ల వస్త్రాలు ధరించి శని గాయత్రి, శని శ్లోకం లాంటివి పారాయణం చేయాలి. అయ్యప్ప జయంతి, శనీశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం, అయ్యప్పస్వామి పూజ చేయాలి. కూర్మపురాణ పారాయణం, వేంఖటేశ్వర శతనామావళి, శని అష్టోత్తరం చేయాలి.ఆంజనేయుడిని పూజించి దర్శించుట. పూజకు ఇనుముతో చేసిన ప్రతిమను వాడాలి. నైవేద్యం నువ్వులతో కలిపిన అన్నం, నువ్వు చిమ్మిరి, నువ్వు ఉండలు, ద్రాక్షరసం వాడాలి. కపిల గోవు దానం చేయాలి. శనికి ప్రీతికరమైన జ్యేష్టశుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి నాడు పూజలు జపాలు నిర్వహించడం శ్రేష్టం. దోషనివారణకు నీలమణి, ఎర్రచందన మాల, చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ చేయాలి. హోమముకు వాడవలసిన సమిధ జమ్మి. ప్రీతికరమైన వారం శనివారం.

రాహువు

రాహువు స్త్రీ గ్రహం.ఇది ఛాయా గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా వెనక్కు నడుస్తుంది. రాహువు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ మూడు నక్షత్ర జాతకులకు మొదటి దశ రాహుదశా శేషంతో ప్రారంభం ఔతుంది. రాహు దశాకాలం పద్దెనిమిది సంవత్సరాలు. సాధారణంగా రాహుదశాకాలంలో మనిషి జీవితంలో ఒడి దుడుకులు అధికం. కాని కొన్ని నక్షత్రాలకు కొంత వెసులు బాటు ఉంటుంది. రాహువుకు రాశిచక్రంలో ఇల్లు లేదు. రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితి పొందుతాడు. రాహువు వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతాడు. కొన్ని ప్రాచీన గ్రంధాలలో జ్యోతిహ శాస్త్ర రాహువు ప్రస్తావన లేదు. కాని ఆధునిక శాస్త్రంలో రాహువుకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. రాహువు పాపగ్రహం. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది. అందుకనే రాహువుకు విషముతో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడూ రోదశీలో ఉండే సూర్యుడిని కొంత కాలం కనిపించకుండా చేస్తాడు కనుక కల్పనా జగత్తుకు ప్రతీకగా జ్యోతిష పండుతులు విశ్వసిస్తారు. కళాకారుల జీవితంలో రాహువు ప్రధాన పాత్ర పోషిస్తాడని జ్యోతిష శాత్ర పండితులు విశ్వసిస్తారు.
1. గుణగణాలు
రాహువు తమోగుణ ప్రధానుడు, గ్రహ సంఖ్య రెండు, అధిదేవత గౌరి, ముసలి వారిని సూచిస్తాడు. బుధుడు, శుక్రుడు, శని మిత్రులు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రువులు. గురువు సముడు. స్వక్షేత్రం కుంభం, శత్రు క్షేత్రం సింహం, మిత్ర క్షేత్రం తుల. అసుర, బహి, స్వర్భాను, తమస అనేవి ఇతర నామాలు. జాతి మ్లేచ్ఛ, స్వాభావము క్రూరము, రుచులలో పులుపును సూచిస్తాడు. ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. దిక్కు నైరుతి, పాలనా శక్తి భటుడు, ఆత్మాధికారం కష్టాలు, లోహము సీసం, గృహ స్థానం ఉపయోగంలో లేని ప్రదేశం, గ్రహపీడ సంతాన లేమి, గ్రహం రాశిలో ఉండే కాలం ఒకటిన్నర సంవత్సరం. వృక్షము పొదలు, ఆహార పదార్ధాలు మినుములు, ఖర్జూరం, ఆవాలు. జంతువులు ఏనుగు, పాములు అడవి ఎలుకలు. వస్తువు గొడుగు, సమిధ దుర్వ, మూలిక చందనం, దేవ వర్గం శైవ, అవతారం వరాహావతారం.
2. కారకత్వం
రాహువు పితామహుడు (తాత), వృద్ధాప్యము, శ్వాస, భాష, అసత్యము, భ్రమ, వాయువు, విచారము, జూదము, కఫము, సంధ్యా సమయం, బయట ప్రదేశం, గొడుగు, పల్లకి, అపరి శుభ్రం, గొడుగు, పల్లకి, విమర్శ, అంటరాని తనం, నల్లులు, దోమలు, గుడ్లగూబలు, విషకీటకములను సూచిస్తాడు.
వృత్తులు :- విషసంబంధిత రసాయనాల తయారీ సంస్థలు, పాములు పట్టుట, భూతవైద్యము, శ్మశానంలో పని చేయుట, నాగ పూజ, దొంగతనం, వైద్య శాస్త్రం, గారడీ విద్యలు. శుక్రుడితో కలిసి ఉంటే సినీరంగం,నాటక రంగం, అడ్వర్టైజ్ మెంటు రంగం, బుధుడితో చేరిన రచయిత, గారడీ విద్య, శనితో చేరిన మోసపూరిత జీవితం, గురువుతో కలిసిన కపట గురువు మొదలైనవి. జైళ్ళు, క్రిమినల్ కోర్ట్లో ఉద్యోగాలు, ఎలెక్ట్రిక్‌సిటీ, ఆటోమొబైల్స్, గ్యాస్, ఇనుము, నిప్పుకు సంబంధించిన వృత్తులు. అగ్నిమాపక దళ వృత్తులను సూచిస్తాడు.
వ్యాధులు :- నులి పురుగులు, గుల్మ రోగం, అంతు చిక్కని రోగాలు మొదలైనవి. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆయాగ్రహ సంబంధిత రోగాలను ఇస్తాడు.
విద్యలు :- రాహువు ఏగ్రహముతో చేరిన ఆగ్రహ సంబంధిత విద్యలను సూచిస్తాడు.
3. రూపము
రాహువు క్రూర రూపము కలవాడు, పొడగరి, నల్లని మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు గలవాడు. కత్తి, త్రిశూలమును ధరించి కవచ ధారణ చేసి ఉంటాడు. సింహాన్ని అధిరోహించి ఉంటాడు. తండ్రి కశ్యపుడు, తల్లి సింహిక, భార్య కరాళ. పార్ధివ నామ సంవత్సరం భాద్రపద శుక్ల పూర్నిమ నాడు పూర్వాభద్రా నక్షత్రములో జన్మించాడు. రాహువు క్షీర సాగర మధన సమయంలో దేవతా రూపం ధరించి మోహినీ చేతి అమృతపానం చేసాడు. దానిని సూర్య, చంద్రులు విష్ణు మూర్తికి చెప్పడంతో విష్ణువు అతడి తలను మొండెం నుండి వేరు చేయడంతో పాము శరీరం పొందాడు. విష్ణు మూర్తి అతడిని అనుగ్రహించి గ్రహ మండలంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి సూర్యచంద్రులకు శత్రువై గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తుంటాడని పురాణ కధనం వివరిస్తుంది. రాహువు రాక్షస నామ సంవత్సరం మాఘ కృష్ణ చతుర్ధశి ఆశ్లేష నక్షత్రంలో గ్రహజన్మను ఎత్తాడు.
4. రాహుకాలం
రాహు కాలం వారంలో ప్రతి రోజు ఒకటిన్నర గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆంటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆసమయంలో చేయరు. కాని దోష నివారణ కొరకు రాహుకాలంలో పూజలు నిర్వహిస్తారు. దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మడిప్పలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. ఆది వారం సాయంత్రం 4 1/2(నాలుగున్నర )గంటల నుండి 6 గంటల వరకు, సోమ వారం ఉదయం 71/2(ఏడున్నర) 9 వరకు, మంగళ వారం 3 గంటల నుండి 41/2(నాలుగున్నర) గంటల వరకు, బుధ వారం 12 గంటల నుండి 11/2(ఒకటిన్నర), గురువారం 1/2 గంటల నుండి 3 గంటల వరకు, శుక్ర వారం 10 1/2 గంటల నుండి 12 గంటల వరకు, శని వారం 9 గంటల నుండి 101/2 గంటల వరకు రాహుకాలం ఉంటుంది.
5. పరిహారం
రాహువును శాంతింప చేయడానికి చేయవలసిన పరిహార విధులు. ప్రతిమకు కావలసిన లోహము సీసం, ప్రతిమకు పూజకు గ్రహ ఆసనం చేట, సమిధ దూర్వ, నైవేద్యం మినప సున్ని, మినప గారెలు, ఖర్జూరం, చేయవలసిన పూజ అధిష్టాన దేవత అయిన సరస్వతి పూజ, దుర్గా పూజ, సుభ్రహ్మణ్య స్వామి పూజ, శివారాధన, రాహుకాలంలో దుర్గకు నిమ్మకాయ దీపం పెట్టడం. ఇది దేవాలయంలో దుర్గాదేవి సన్నిధిలో చేయాలి. ఇంట్లో అయితే నేతి దీపం పెట్టాలి.ఆచరించ వలసిన వ్రతం సరస్వతి వ్రతం, రాహువుకు ప్రియమైన తిధి చైత్ర బహుళ ద్వారశి, పారాయణ చేయవలసినవి రాహు అష్టోత్తరం, లలితా సహస్రనామం, ఆచరించవలసిన దీక్ష భవానీ దీక్ష, ధరించవలసిన మాల రుద్రాక్ష మాల, అష్టముఖ రుద్రాక్ష, రత్నము గోమేధికము, దర్శించవలసిన దేవాలయములు సరస్వతి, దుర్గ, సుభ్రహ్మణ్య స్వామి దేవాలయం, శివాలయాలు, నవగ్రహాలయాలు. దానం చెయ్యవలసినవి ఎండు ద్రాక్ష, తేనె, ఖర్జూరములు. చేయవలసిన జపసంఖ్య పద్దెనిమిది వేలు.

కేతువు

కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల కాలం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర స్వభావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్యము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మాధికారం మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యుడు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ ప్రదేశాలను సూచిస్తాడు, కాల బలము పగలు, కాల బలం పగలు, శత్రు క్షేత్రం కటకం, సమ క్షేత్రం మీనము, ఉచ్ఛ క్షేత్రము వృశ్చికము, నీచ క్షేత్రము వృషభము, మిత్రులు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శత్రువులు శని, శుక్రుడు, సములు గురువు, బుధుడు. వయసు ముసలి వయసు, చెట్లు ముళ్ళ చెట్లు, ధాన్యం ఉలవలు, పండ్లు సీతా ఫల, ప్రదేశములు గుహలు, బిలములు. దేశంలో కేతువు ఆధిక్యత ఉన్న ప్రదేశం అంతర్వేధి.ధాన్యము ఉలవలు, పక్షులు రాబందు, గద్ద, కోడి. జంతువులు కుక్క, పంది, గాడిద. మూలికలు తెల్ల జిల్లేడు, పున్నేరు వేరు, సమిధలు దర్భ. దైవ వర్గం వైష్ణవ, గోత్రము పైఠీనస. అవతారం మీనావతారం. గ్రహారూఢ వాహనం గ్రద్ద, రత్నము వైఢూర్యం, రుద్రాక్ష నవ ముఖ రుద్రాక్ష, లోహము కంచు, శుభ సమయం ఉదయ కాలం. వారము ఆదివారం. స్వభావం చంచల స్వభావం. దృష్టి అధోదృష్టి.
1. కారకత్వము
కేతువు కుటుంబ సభ్యులలో తాత(తల్లికి తండ్రి)ను సూచిస్తాడు. కేతువు దైవోపాసన, వేదాంతం, తపస్సు, మోక్షము, మంత్ర శాస్త్రము, భక్తి, నదీస్నానం, మౌన వ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసము, పరుల సొమ్ముతో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తాడు.
వ్యాధులు :- అజీర్ణం, స్పోటకము, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, అసిడిటీ, వైద్యము, జ్వరము, వ్రణములను సూచిస్తాడు కేతువు ఏగ్రహముతో కలిసిన ఆ అవయవమునందు బాధలు కలిగిస్తాడు. రోగ నిర్దారణ సాగదు కనుక చికిత్స జరుగుటలో సమస్యలు సృష్టిస్తాడు. ఇతడు మృత్యు కారకుడు, భయాన్ని కలిగిస్తాడు, రక్తపోటు, అలర్జీ, మతి స్థిమితం లేక పోవుట మొదలైన వ్యాధులకు కారకుడౌతాడు.
2. రూపము
కేతువు పార్ధివ నామసంవత్సరం ఫాల్గుణమాసం శుక్ల పౌర్ణమి అభిజిత్ నక్షత్రంలో బుధవారం జన్మించాడు. కేతువు గోత్రం జైమినీ పైఠీనస. కేతువు బూడిద(బూడిద)వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుండి అనేక వ్యాధులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది. బ్రహ్మ ఆజ్ఞానువర్తి అయి కేతువు ధూమ్ర కేతువుగా సంచరించ సాగాడు. క్షీరసాగర మధన సమయంలో మోహినీ చేతి అమృతం తాగిన తరువాత విష్ణువు చేత పాము తలను ధరింప చేయబడ్డాడు. అప్పటి నుండి కేతువుగా నామధేయం చేయబడి విషు అనుగ్రహం చేత గ్రహస్థితి పొందాడు. కేతువు పత్ని చిత్ర రేఖ. సాధారణంగా కేతువు ఒంటరిగా కుజ ఫలితాలను ఇచ్చినా ఏగ్రహంతో చేరి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. గ్రహస్థానం పొందిన కేతువు విష్ణువుకు అంజలి ఘటిస్తూ ఉంటాడు.
3. పరిహారం
కేతుగ్రహ పరిహార పూజార్ధంగా కంచు ప్రతిమ శ్రేష్టం. అధి దేవత బ్రహ్మ. నైవేధ్యం చిత్రాన్నం, కుడుములు, ఉలవ గుగ్గిళ్ళు. ప్రీతికరమైన తిధి చైత్ర శుద్ధ చవితి. ఆచరించ వలసిన వ్రతం పుత్ర గణపతి వ్రతం, పారాయణం చేయవలసినది శ్రీ గణేశ పురాణం, కేతు అష్టోత్తర శతనామావళి, గణేశ శతనామావళి. దక్షిణగా ఇవ్వ వలసిన జంతువు మేక, ధరించ వలసిన రతజ్ఞం వైడూర్యం, ధరించ వలసిన మాల రుద్రాక్ష మాల, ధరించ వలసిన రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష. ఆచరించ వలసిన దీక్ష గణేశ దీక్ష. చేయ వలసిన పూజ విజ్ఞేశ్వర పూజ, సూర్యారాధన, దానం చేయవలసిన ఆహార పదార్ధాలు ఖర్జూరం, ఉలవలు. గ్రహస్థితిని పొందిన వారం బుధవారం. మండపం జెండా ఆకారం. గ్రహం బలంగా ఉంటే ఆధ్యాత్మిక చింతన బలహీనమైన అతి భయం కలుగుతుంది.

ఉమ్మడి జిల్లాల్లో (కర్నూలు/నంద్యాల) ఉన్న శివ క్షేత్రాల వివరాలు....

ఉమ్మడి జిల్లాల్లో (కర్నూలు/నంద్యాల) ఉన్న శివ క్షేత్రాల వివరాలు.... 


1:శ్రీశైలం:శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి,జ్యోతిర్లింగ శక్తి పీఠం,పాతాళ గంగ(కృష్ణా నది)ఉత్తర వాహినీ
2:నవ నందులు/మహా నంది: సోమ, శివ(రుద్ర),విష్ణు(కృష్ణ),సూర్య,వినాయక, గరుడ,ప్రధమ,నాగ,మహా నందీ ఆలయాలు...
3:సప్త నదీ నివృత్తి సంగమేశ్వరం:శ్రీ లలితా సంగమేశ్వర స్వామి 
4:కొలను భారతీ: శ్రీ భారతీ(మహా సరస్వతి) సహిత,సప్త మాతృకా సమేత సప్తర్షి లింగేశ్వర ఆలయాలు, భైరవ,వీరభద్ర సన్నిధులు
5:శ్రీ రుద్రాణి రుద్రకోటేశ్వర స్వామి:రుద్ర కోడూరు(రుద్ర కోటి/కోటి రుద్రం),ఇలాస్పదం అనే తీర్థము(కోనేరు),శ్రీ రుద్రాణి మహా దేవీ సన్నిధ్య విశేషం
6:గుమ్మితం (గుప్త మల్లికార్జున స్వామి క్షేత్రము):శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి,కింద పైన వేరు వేరు రెండు సన్నిధులు, ఇక్కడ waterfalls "గుప్త పాపహర/సర్వ పాప హర తీర్థము",భైరవుడు క్షేత్ర పాలకుడు....
7:యాగంటి:శ్రీమదుమామహేశ్వర స్వామి,యాగంటి నంది,కోనేరు అద్భుతం....
8:కాల్వ బుగ్గ:శ్రీ భ్రమరాంబిక సమేత బుగ్గరామలింగేశ్వర స్వామి
9:ముచ్చట్ల:శ్రీ భ్రమరాంబిక సమేత ముచ్చట్లయ్య(మల్లికార్జున స్వామి),ఇక్కడ నుండే యాగంటి కి నీళ్లు వెళ్తాయని అంటారు
10:శ్రీ త్రిలింగేశ్వర స్వామి,నందవరం, చౌడేశ్వరమ్మ దేవాలయం కంటే ప్రాచీనమైన శివాలయాల సమూహం
11:శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి/శ్రీ త్రిపుర సుందరీ భోగేశ్వర స్వామి, దుర్గా భోగేశ్వరం....ఇక్కడ 5 కొనేర్లు ప్రత్యేకత,అన్నా చెల్లెళ్ళ పెళ్లి పాపం పోగొట్టిన క్షేత్రము
12:శ్రీ ఉమా పానికేశ్వర స్వామి, పాత పాణ్యం,పాణ్యం,ఇది పెద్దగా వెలుగులోకి రాని దేవాలయం, పురావస్తు శాఖ కింద ఉంది అద్భుతమైన శిల్పకళా నిలయం...
13:శ్రీ ఉమా రాజరాజేశ్వరి బ్రహ్మ నందీశ్వర స్వామి,కోట వీధి,నంద్యాల, ఈ స్వామి మహనందీశ్వర స్వామికి అన్న అని అంటారు పడమర ముఖ శివాలయం,మహా నంది ఉత్సవాలకు ఈ స్వామే పెద్దగా వ్యవహారం చేస్తారు
14:శ్రీ ఉమా మహేశ్వరీ గంగా సమేత ఓంకార సిద్దేశ్వర స్వామి,ఓంకారం,ఈ స్వామి ఉత్సవ మూర్తులు బండి ఆత్మకూరు లో ఉంటాయి, ఉత్సవాల్లో వెళ్లి వస్తారు
15:శ్రీ అన్నపూర్ణ విశ్వనాథ స్వామి: కాచింతల/కాశింతల,ఆళ్లగడ్డ... ఇక్కడ దర్శనం కాశీ దర్శన సమాన పుణ్యం
16:శ్రీ వింధ్యా వాసిని నగరేశ్వర స్వామి, కోట,కర్నూల్,ఇది కర్నూల్ లో అత్యంత ప్రాచీనమైన శివాలయం, దాదాపు శివ స్వాములు ఇరుముడులు ఇక్కడ నుండే వెళ్తాయి
17:శ్రీ అన్నపూర్ణ శ్రీచక్ర లింగేశ్వర స్వామి, యేటి గడ్డ శివాలయం,కర్నూల్,ఇక్కడ స్వామి లింగం.పైన శ్రీచక్రం ఉంది ప్రాచీన శివాలయం...
18:శ్రీ కామాక్షి ఓంకారేశ్వర స్వామి,నాయనాలప్ప, ఇది కర్నూలు/కడపజిల్లా సరిహద్దుల్లో ఉన్న క్షేత్రము శివునికి నేత్రాలు ఇచ్చిన వీర శైవ యోగి అధిష్టాన ఆలయం
19:శ్రీ లలితా బ్రహ్మ లింగేశ్వర స్వామి,బ్రహ్మ గుండం,కర్నూల్/డోన్ మధ్యలో ఉన్న ప్రాచీనమైన శివ క్షేత్రము.... పెద్ద కోనేరు,కాళీ అమ్మవారు క్షేత్ర పాలకురాలు
20:శ్రీ రాజరాజేశ్వరి గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి,గుండ్ల బ్రహ్మేశ్వరము,దట్టమైన నల్లమల లో ఉన్న క్షేత్రము అశ్వద్ధామ రోజు వచ్చి ఇక్కడ సేవిస్తారని పెద్దలు చెబుతుంటారు
21:శ్రీ ఉల్లేడ్ల మల్లీశ్వర స్వామి,ఉల్లేడ్ల,నల్లమల అటవీ ప్రాంతం ,దిగువ అహోబిలం,కాశీ నాయన వెలికి తెచ్చిన అద్భుతమైన ఆలయం
22:శ్రీ ఉమా రూపాల సంగమేశ్వర స్వామి,కొత్త గట్టు(దీన్నే దేవర పాడు)కర్నూలు,ఇది సంగమేశ్వరం నుండి తెచ్చి ఇక్కడ పెట్టిన దేవాలయం శివరాత్రి కి ఇక్కడ వైభవంగా 2 రోజుల జాతర జరుగుతుంది......
నాకు గుర్తున్న క్షేత్రాలు దాదాపు వీటి అన్నిట్లో శివరాత్రి జాగరణ,3 రోజు తేరు వైభవంగా జరుగుతున్నాయి.... ఇంకా ఏమైనా ఉంటే జిల్లా మిత్రులు తెలియచేయగలరు

సేకరణ
మీ 
మణి ద్వీప్

Monday, February 10, 2025

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు

తిరుమల వైభవం


తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు

తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. 
ఈ మూర్తులు వరుసగా .

భోగ శ్రీనివాసమూర్తి, 
ఉగ్ర శ్రీనివాసమూర్తి, 
మూలమూర్తి, 
కొలువు శ్రీనివాసమూర్తి, 
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. 

👉ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో  

🌷మూలమూర్తి (ధ్రువబేరం) 
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

🌷భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం) 

ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.

🌷ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)

ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.

🌷శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)

13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.

🌷కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)

గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.

🌷🙏మూడు గoటలు🙏🌷

♦️🙏తిరుమలలో మొదటి గంట🙏♦️ 

నైవేద్యం సుప్రభాతసేవ, అభిషేకాలు, కొలువు, సహస్రనామార్చనల తర్వాత శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూస్తారు. తిరుమామణి మంటపంలో రెండుసార్లు గంటలు మోగిస్తారు. ఇలా తిరుమామణి మంటపంలో గంటలు మోగగానే అర్చకులు స్వామివారికి తొలి నైవేద్యం సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తారు. జీయంగారు లేదా ఆయన సహాయకుడు వైష్ణవ సంప్రదాయంలోని ప్రబంధ అధ్యాయాలను పఠిస్తారు. దీన్ని సట్టుమురా అంటారు. వేంకటేశ్వరుని ముందు మెట్టుకు ఇవతలి నుండి నైవేద్యం పెడతారు. స్వామివారికి నైవేద్యంగా పులిహోర, దద్దోజనం, లడ్డూలు, వడలు, పొంగలి, చక్రపొంగలి, అప్పాలు, పోళీలు నివేదిస్తారు.
నైవేద్యం స్వామివారికే కాకుండా విష్వక్సేనుడు, గరుడుడు, నిత్యాసురులకు కూడా నివేదిస్తారు. ఇలా గంటలు మోగించి, నైవేద్యం సమర్పించడాన్ని వ్యవహారంలో మొదటి గంట లేదా ఆలయ మొదటి గంట అంటారు. 

♦️🙏తిరుమలలో రెండో గంట, అర్చన 🙏♦️

తిరుమలేశుని దేవాలయంలో అష్టోత్తర శతనామార్చన తర్వాత రెండో గంట మోగిస్తారు. ఈ సంప్రదాయాన్ని రెండో గంట లేదా అపరాహ్న పూజ ( Second Bell or Aparahna Pooja) అంటారు. ఇలా రెండో గంట మోగించినప్పుడు స్వామివారికి రెండోసారి నైవేద్యం సమర్పిస్తారు. రెండోసారి జరిగే ఈ అర్చనలో ''వరాహపురాణం'' లోని శ్రీ వేంకటేశ్వరుని నామావళిని జపిస్తారు. పోటు నుండి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆనక తాంబూలం సమర్పించి, కర్పూరహారతి ఇస్తారు.
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో రెండో గంట మోగినప్పుడు చేసే అష్టోత్తర నామార్చనను చూసేందుకు భక్తులను అనుమతించరు. ఇది ఏకాంత సేవ. ప్రత్యేక సేవలకోసం టికెట్లు కొనుక్కున్న భక్తులు నివేదించిన ''చెరుపులు'' (పులిహోర, దద్దోజనం), ''పన్యారాలు'' (లడ్డూలు) మొదలైన నైవేద్యాలను తిరుమల వేంకటేశ్వరునికి సమర్పిస్తారు. భక్తులు తెచ్చిన దాంట్లో నుండి కొంత మాత్రమే వేంకటేశ్వరునికి సమర్పించి, తక్కిన పదార్ధాలను వారికి తిరిగి ఇచ్చేస్తారు.

♦️🙏తిరుమలలో మూడో గంట🙏♦️

తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ఉదయం జరిపే తోమాలసేవ, రాత్రిపూట కూడా జరుపుతారు. ఆ సేవ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి అష్టోత్తర శతనామార్చన చేస్తారు. శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు. ఆ సమయంలో మూడో గంట మోగిస్తారు. అప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం సర్వదర్శనం తిరిగి ప్రారంభమౌతుంది. 

♦️🙏తిరుమల విమాన వేంకటేశ్వర స్వామి🙏♦️

పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిదిమంది , స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిదిమంది అర్చకులనూ విచక్షణా రహితంగా అక్కడికక్కడే చంపేశాడు.

నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిదిమందిని హత్య చేశాడు రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు. మహా పాపం. ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు. పన్నెండేళ్ళ పాటు భక్తులెవర్నీ ఆలయంలోనికి అనుమతించలేదు. వ్యాసరాయలవారు గర్భగుడిలో ప్రవేశించి, పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట.

ఆ పన్నెండేళ్ళ కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలగలేదు కానీ, అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా ప్రతిష్టించిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహమే విమాన వేంకటేశ్వర స్వామి. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్టించిన విమాన వేంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. తిరుమల వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది.

ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వేంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు, వెండి పూత పూసి, మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వరుని దర్శించుకుంటారు.

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

12 స్థానాలు - ప్రధానమైన రూల్స్ kp పద్దతిలో చక్కని విశేషాలు.........!!

12 స్థానాలు - ప్రధానమైన రూల్స్ kp

పద్దతిలో చక్కని విశేషాలు.........!!
లగ్నం - ప్రధానమైన విషయాలు......
లగ్నాధిపతి - గురు, బుధ మరియు శుక్ర గ్రహాలతో కలిసి కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయితే పూర్ణ ఆయుర్దాయం ఉంటుంది. అలాగే అదృష్టాలు కూడా కలిసి వస్తాయి.
· 2వ స్థానాధిపతి లగ్నములో ఉంటె - కుటుంబముతో ఆనందంగా ఉంటారు
· 3వ స్థానాధిపతి లగ్నములో ఉంటె - సోదరులతో మంచి అనుబంధం ఉంటుంది
· లగ్నాధిపతి మరియు 4వ స్థానాధిపతి బలంగా ఉంటె - తల్లి వైపు బందుల నుండి సహాయం అవసరానికి అందుతుంది
· 5వ స్థానాధిపతి లగ్నములో ఉంటె - పుత్రులు చెప్పిన మాట వింటారు.
· లగ్నాధిపతి మరియు 6వ స్థానాధిపతికి మంచి సిగిని ఫీ కేసన్స్ ఉంటె - అందరితో కలిసిమెలిసి ఉంటారు. క్షమించే గుణం ఉంటుంది
· 7వ స్థానాధిపతి లగ్నములో ఉంటె - తన మాట వీనే జీవిత భాగస్వామి లభిస్తుంది.
· 8వ స్థానాధిపతి లగ్నములో ఉంటె - తను చెప్పిన మాటనే వినాలి అనే మనస్తత్వం కలవారు
· 9వ స్థానాధిపతి లగ్నములో ఉంటె - తండి కొడుకుల మధ్య మంచి అనుబంధము ఉంటుంది
· 10వ స్థానాధిపతి లగ్నములో ఉంటె - ధన సంపాదన బాగుంటుంది
· 11వ స్థానాధిపతి లగ్నములో ఉంటె - సోదరుల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఫైనాన్సియాల్ స్టేటస్ బాగుంటుంది
· 12వ స్థానాధిపతి లగ్నములో ఉంటె - ధన నష్టం ఉంటుంది

గమనిక : 1వ స్థానం మరియు 1వ స్థానాధిపతి ఆ స్థానం యొక్క అధిపతి తో మంచి సిగిని ఫి కేసన్స్ ఉండాలి అలాగే ఆ గ్రహాలు బలంగా ఉండాలి అప్పుడే ఈ ఫలితాలు 100% మ్యాచ్ అవుతాయి.

2వ స్థానం - ప్రధానమైన విషయాలు....

· 2వ స్థానాధిపతి సూర్య గ్రహంతో కలిసి ఉండి, ఈ గ్రహాలు బలంగా ఉంటె తం(డి ఆస్థి విషయములో మంచి లాభాలు ఉంటాయి
· 2వ స్థానాధిపతి 4వ స్థానముతో కలిసి ఉండి, ఈ గ్రహాలు బలంగా ఉంటె తల్లి ఆస్థి విషయములో మంచి లాభాలు ఉంటాయి
· 2వ స్థానం సబ్ లార్డ్ తో - 7వ స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె జీవిత భాగస్వామి ధనం లభిస్తుంది
· 2వ స్థానం సబ్ లార్డ్ తో - 3వ స్థానాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె సోదరుల వలన లాభాలు ఉంటాయి
· 2వ స్థానాధిపతి 11వ స్థానములో లేదా కేంద్ర, కోణ స్థానాలలో స్థితి అయితే అదృష్టవంతుడు
· 2వ స్థానాధిపతి లేదా నక్షత్రాధిపతితో తో శని గ్రహానికి సిగినీఫీ కేసన్స్ ఉంటె చేడు అలవాట్లు ఉంటాయి
· 2వ స్థానాధిపతి లేదా సబ్ లార్డ్ తో - గురు, బుధ మరియు శుక్ర గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె విశాల నేత్రములు ఉంటాయి
· 2వ స్థానాధిపతి లేదా సబ్ లార్డ్ తో - చంద్ర గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె అందమైన కళ్ళు ఉంటాయి
· 2వ స్థానములో చంద్ర మరియు కుజ గ్రహాలు కలిసి ఉంటె కుటుంబ సమస్యలు ఉంటాయి.
· 2వ స్థానములో చంద్ర మరియు బుధ గ్రహాలు కలిసి ఉంటె చాలా మంచి వాడు, అందరికి ఇష్టమైన వాడు అలాగే అదృష్టాలు కూడా ఉంటాయి.

3వ స్థానం - ప్రధానమైన విషయాలు......

· 3వ స్థానాధిపతి కేంద్ర, కోణ స్థానములో స్థితి అయితే - ధైర్యాశాలి అవుతారు.
· 3వ స్థానాధిపతితో చంద్ర, గురు, బుధ మరియు శుక్ర గ్రహాలతో సిగిని ఫి కేసన్స్ ఉంటె - సోదరుల మధ్యా అన్యోన్యత ఉంటుంది.
· 3వ స్థానములో శని గ్రహం ఉంటె - సామాజిక సేవ ద్వారా మంచి గుర్తింపు వస్తుంది అలాగే అందరిచేత గౌరవం పొందుతారు వాహనాలను కలిగి ఉంటారు
· 3వ స్థానములో సూర్య, కుజ గ్రహాలు ఉంటె - మంచి ఆరోగ్యం ఉంటుంది. పెద్దలంటే భక్తి ఉంటుంది
· 3వ స్థానంలో బుధ గ్రహం ఉంటె - తెలివైన వాడు, కానీ సోమరితనం ఉంటుంది
· 3వ స్థానాధిపతితో పురుష గ్రహాలతో సిగినీఫీకేసన్స్ ఉంటె - సోదరుల ద్వారా లాభాలు ఉంటాయి. అలాగే స్త్రీ గ్రహాలతో సిగినీఫీకేసన్స్ ఉంటె - సోదరి ద్వారా లాభాలు మంచి అన్యోన్యత ఉంటుంది
· 3వ స్థానాధిపతి మరియు లగ్నాధిపతి - ఒకరికొకరికి సిగ్నిఫీకేసన్స్ ఉంటె సోదరుల మధ్య మంచి స్నేహ బండలు ఉంటాయి. లేకపోతే వీరొదులు అవుతారు
· 3వ స్థానములో సూర్య, బుధ గ్రహాలు ఉంటె - ధన సంపాదన బాగుంటుంది. అలాగే ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది.
· 3వ స్థానం సబ్ లార్డ్ తో - 4,9,11 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె పోటీ పరిక్షలలో మంచి ఫలితాలు ఉంటాయి
· 3వ స్థానాధిపతి లేదా సబ్ లార్డ్ - శని నక్షత్రములో లేదా కుజ నక్షత్రములో స్థితి అయితే - తప్పుడు విషయాలను నిజమని నమ్మిస్తాడు

4వ స్థానం - ప్రధానమైన విషయాలు......
· 4వ స్థానాధిపతి మరియు లగ్నాధిపతి - ఒకరికొకరికి మంచి సిగినీఫీ కేసన్స్ ఉంటె లేదా శుభ గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉన్న తల్లితో స్నేహంగా ఉంటారు.
· 4వ స్థానములో కుజ, శని మరియు కుజ గ్రహాలు ఉన్న - అశుభ గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉన్న - అబ్బాయి / అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. మగవారు తల్లి సంబంధమున్న వారితో కూడా సంగమిస్తారు
· 4వ స్థానములో 7వ స్థానాధిపతి మరియు శుక్ర గ్రహం కలిసి ఉండి, కుజ, శని, రాహు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - అబ్బాయి / అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు.
· 4వ స్థానాధిపతి కేంద్ర, కోణ స్థానాలలో ఉండి, గురు గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె తల్లికి పూర్ణాయుస్సు ఉంటుంది
· 4వ స్థానాధిపతి మరియు 7వ స్థానాధిపతితో గురు గ్రహముతో సిగినీఫీకేసన్స్ ఉంటె జీవితమంతా ఆనందముగా ఉంటారు
· చంద్ర మరియు శుక్ర గ్రహాలు 4వ స్థానములో ఉంటె - కోపం ఎక్కువ, సంతానము విషయములో సమస్యలు ఉంటాయి. అలాగే అక్రమ సంబంధాలు కూడా ఉంటాయి.
· శని మరియు శుక్ర గ్రహాలు 4వ స్థానములో ఉంటె - తాగుబోతు, బాధలు అనుభవిస్తూనే ఉంటారు
· గురు మరియు శుక్ర గ్రహాలు 4వ స్థానములో ఉంటె - ధన సంపాదన బాగుంటుంది. స్థిరాస్తులను కూడబెట్టుకుంటారు, అలాగే తీర్థ యాత్రలు చేస్తారు

5వ స్థానం - ప్రధానమైన విషయాలు........
· 5వ స్థానాధిపతి 5వ స్థానములో స్థితి అయి బలంగా ఉంటె - మంచి గుణం ఉంటుంది. సహాయం చేసే మిత్రులు ఉంటారు. ఒకవేళ కుజ, శని, రాహు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె సంతానం వలన బాధలు ఉంటాయి
· 5వ స్థానాధిపతి మరియు లగ్నాధిపతి ఒకరి నక్షత్రములో ఒకరు స్థితి ఐతే - సంతానం విషయములో మంచి ఫలితాలు ఉంటాయి.
· 5వ స్థానాధిపతి మరియు లగ్నాధిపతి ఒకరి నక్షత్రములో ఒకరు స్థితి అయి - 5వ స్థానాధిపతి నక్షత్రాలలో స్థితి అయితే - సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే వీరు తల్లి తండ్రులను చూసుకుంటారు  (ఇది KP రూల్ - ఇలా ఉంటే 5వ స్థానములో ఈ గ్రహాలు బలంగా ఉన్నాయని అర్థం చేసుకోగలరు )
· 5వ స్థానములో చంద్ర, కుజ గ్రహాలు కలిసి ఉంటె - ఉన్నత విద్య ఉంటుంది. దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలకు ధనం ఖర్చు చేస్తారు. మంచి పేరు కూడా వస్తుంది
· 5వ స్థానంలో కుజ, శుక్ర గ్రహాలుకలిసి ఉంటె - దైవ భక్తి ఉండదు. పక్కవారు అభివృద్ధిలోకి వస్తే ఓర్చుకోలేని మనస్తత్వం ఉంటుంది. అలాగే ఇతరులతో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు
· 5వ స్థానంలో శని , శుక్ర గ్రహాలుకలిసి ఉంటె - అబ్బాయి/అమ్మాయి ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటారు.
· 5వ స్థానాధిపతి 10వ స్థానములో స్థితి అయితే - జాతకుడికి/జాతకురాలికి మంచి రాజా యోగం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి

6వ స్థానం - ప్రధానమైన విషయాలు.......
· 6వ స్థానంలో గురు గ్రహం స్థితి అయి, అలాగే 6వ స్థానాధిపతి 5వ స్థానములో స్థితి అయితే - అమ్మాయికి చెడు అలవాట్లు మరియు ఇతరులతో సంబంధాలు ఉంటాయి.
· 6వ స్థానముతో శని, కుజ గ్రహాలకు సిగినీఫీ కేసన్స్ ఉంటె - పురుష అవయమునకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అలాగే 8వ స్థానముతో కూడా సిగినీఫీ కేసన్స్ ఉంటె - తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
· 6వ స్థానములో బుధ, గురు గ్రహాలు స్థితి అయితే - ధన సంపాదన బాగుంటుంది కానీ మద్యానికి బానిస అవుతారు. అలాగే కొద్దిగా పిచ్చి తనం కూడా ఉంటుంది
· 6వ స్థానాధిపతి కంటే లగ్నాధిపతి బలంగా ఉంటె శత్రువులు మిత్రులు అవుతారు
· 6వ స్థానాధిపతి కంటే లగ్నాధిపతి బలహీనంగా ఉంటే - గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
· 6వ స్థానములో చంద్ర, శని గ్రహాలు స్థితి అయితే - చెడు అలవాట్లు ఉంటాయి. అలాగే అబ్బాయి / అమ్మాయి వివాహం ఆలస్యం అవుతుంది
· 6వ స్థానములో సూర్య, బుధ గ్రహాలు స్థితి అయితే - ధన సంపాదన చాలా బాగుంటుంది. మంచి అధికారి స్థాయి ఉద్యోగం ఉంటుంది. ఆనందకరమైన జీవితం ఉంటుంది.

7వ స్థానం - ప్రధానమైన విషయాలు......
· 7వ స్థానాధిపతి 2వ స్థానము లేదా 12 వ స్థానములో స్థితి అయితే - ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటారు.
· 7వ స్థానాధిపతి 5వ స్థానములో స్థితి అయి 7వ స్థానానికి లగ్నాధిపతితో సిగినీఫీ కేసన్స్ ఉంటె - జీవిత భాగస్వామికి ప్రేమించే గుణం ఉంటుంది.
· KP రూల్ - 7వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి నక్షత్రాలలో స్థితి అయితే - అందమైన భార్య / భర్త అందగాడు లభిస్తారు.
· 7వ స్థానాధిపతి మరియు శుక్ర గ్రహానికి - కుజ, శని, రాహు, మరియు కేతు గ్రహాలతో సిగినీఫీకేసన్స్ ఉంటె - రెండవ వివాహం జరుగుతుంది
· KP రూల్  - 7వ స్థానాధిపతి మరియు 8వ స్థానాధిపతి నక్షత్రాలలో చంద్ర, కుజ గ్రహాలు స్థితి అయితే - బహు భార్య/ బహు భర్త యోగం ఉంటుంది.
· 7వ స్థానాధిపతితో 6,8 స్థానాధిపతులు కలిసి కుజ, శని, సూర్య, రాహుగ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - మూడవ వివాహం ఉంటుంది

8వ స్థానం - ప్రధానమైన విషయాలు......
· 8వ స్థానాధిపతి కేంద్ర లేదా కోణ స్థానాలలో స్థితి అయి - గురు, బుధ, చంద్ర మరియు శుక్ర గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె పూర్ణాయుస్సు ఉంటుంది.
· KP Rule - 8వ స్థానం సబ్ లార్డ్ - 1,3,5,8,9,10 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉండి, అలాగే బాధక స్థానాలతో కూడా సిగినీఫీ కేసన్స్ ఉంటే - పూర్ణాయుస్సు ఉంటుంది.
· KP Rule - 8వ స్థానం సబ్ లార్డ్ - 1,6,8,12 స్థానాలతో సిగినీఫీకేసన్స్ ఉంటె - ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుంది. ఒకవేళ కుజ, శని గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె తీవ్రత ఎక్కువగా ఉంటుంది
· 8వ స్థానాధిపతి లగ్నములో స్థితి అయి అలాగే లగ్నాధిపతి 8వ స్థానములో స్థితి అయితే - ఆయుస్సు తక్కువగా ఉంటుంది.
· 8వ స్థానంలో కుజ, బుధ గ్రహాలు స్థితి అయితే - నష్టాలు, భాదలు ఉంటాయి. చిన్న వయస్సులోనే వయస్సు ఎక్కువగా కనిపించేవారు ఉంటారు. ఒకవేళ శని గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ముసలితనం తొందరగా వస్తుంది.
· 8వ స్థానాధిపతి లగ్నములో బలహీనంగా ఉంటె - అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. ఒకవేళ 8వ స్థానాధిపతి వక్రములో ఉంటె తీవ్రత ఎక్కువగా ఉంటుంది
· 8వ స్థానములో సూర్య, కుజ గ్రహాలు స్థితి అయితే - మంటల వలన ప్రమాదాలు ఉంటాయి. అలాగే అధిక వేడితో భాధ పడుతుంటారు. ఒకవేళ 8వ స్థానం - మేష, సింహా మరియు ధనుస్సు రాశులు అయితే - తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

9వ స్థానం - ప్రధానమైన విషయాలు......
· 9వ స్థానాధిపతి మరియు 5వ స్థానాధిపతి కలిసి 9వ స్థానములో స్థితి అయితే - సంతానం వలన లాభాలు ఉంటాయి. గురు గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఇంకా మంచిది.
· KP రూల్ : 9వ స్థానము సబ్ లార్డ్ 11వ స్థానములో స్థితి అయి - కుజ, శని మరియు రాహు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - తండ్రి తొందరగా మరణిస్తారు. ఒకవేళ 11వ స్థానములో కుజ, శని మరియు రాహు గ్రహాలు స్థితి అయితే - అనారోగ్యముతో మరణిస్తారు

· 9వ స్థానములో 8వ స్థానాధిపతి స్థితి అయి శని గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - శని మహదశ లేదా భుక్తిలో తండ్రికి మరణం రావచ్చు
· 9వ స్థానాధిపతి 2వ స్థానములో స్థితి అయి 2వ స్థానాధిపతితో డైరెక్టుగా సిగినీఫీ కేసన్స్ ఉంటె - జాతకుడికి ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉంటుంది, అలాగే మంచి ధన సంపాదన ఉంటుంది. అందరి చేత ప్రేమించపడుతారు
· 9వ స్థానములో గురు మరియు శుక్ర గ్రహాలు స్థితి అయితే - జీవితమంతా ఆనందంగా ఉంటారు. అందరిని ప్రేమించే గుణం ఉంటుంది
· 9వ స్థానాధిపతి మరియు 10వ స్థానాధిపతి చర రాశులలో స్థితి అయితే - విదేశీ యానాం ఉంటుంది

10వ స్థానం - ప్రధానమైన విషయాలు.......
· 10వ స్థానములో లగ్నాధిపతి స్థితి అయి, బుధ లేదా చంద్ర గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - వ్యాపారం చేస్తారు.
· 10వ స్థానాధిపతి 10వ స్థానములో స్థితి అయితే - దైర్యం, భక్తి, మరియు వృత్తి ఉద్యొగ్య, వ్యాపారాలలో మంచి ప్రతిభ ఉంటుంది. అలాగే గురు, బుధ, శుక్ర గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఇంకా మంచిది
· 10వ స్థానం సబ్ లార్డ్ తో - సూర్య, చంద్ర, కేతు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - తీర్థ యాత్రలు చేస్తారు.
· 10వ స్థానములో బుధ, గురు గ్రహాలు స్థితి అయితే - స్థిరాస్థులు సంపాందించుకుంటారు. అలాగే శని, కుజ గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఇంకా మంచిది. అలాగే 4వ స్థానంతో లేదా సబ్ లార్డ్ ఏ గ్రహమైతే ఆ గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడిపోతారు
· 10వ స్థానంలో కుజ గ్రహం స్థితి అయి - సూర్య గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి
· 10వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి యొక్క నక్షత్రాలలో స్థితి అయితే - వృత్తి ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. అదృష్టాలు కూడా ఉంటాయి

11వ స్థానం - ప్రధానమైన విషయాలు.......
· 11వ స్థానంలో బుధ గ్రహం స్థితి అయితే - మంచి ఉన్నత విద్య ఉంటుంది. అలాగే గురు గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె ఇంకా మంచిది.
· 11వ స్థానాధిపతి రాశి చక్రములో బలహీనంగా ఉండి - కుజ, శని మరియు రాహు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - చెవిటి వారు అవుతారు
· 11వ స్థానములో శని లేదా కుజ గ్రహాలు స్థితి అయి - బలంగా ఉండి - ఒకరికొకరికి సిగినీఫీ కేసన్స్ ఉంటె - భూ సంబంధ వ్యాపారాలు మరియు వ్యవసాయం లో మంచి ఉంటాయి.
· 11వ స్థానములో బుధ, గురు గ్రహాలు స్థితి అయితే- అందరికి ఇష్టమైనవాడు, అలాగే ధన సంపాదన బాగుంటుంది.
· 11వ స్థానములో సూర్య గ్రహానికి సహజంగా మంచి ఫలితాలను ఇచ్చే స్థానం- కావున 11వ స్థానములో సూర్య గ్రహం స్థితి అయితే - గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే సంగీతములో కూడా మంచి ప్రతిభ ఉంటుంది.
· 11వ స్థానములో రాహు గ్రహం స్థితి అయి బలంగా ఉంటె - మంచి రాజా యోగం ఉంటుంది
· 11వ స్థానంలో 4వ స్థానాధిపతి స్థితి అయి - చంద్ర గ్రహం బలంగా ఉంటె - తల్లి తరుపు నుండి ధన లాభాలు ఉంటాయి.  అలాగే గురు గ్రహం బలంగా ఉంటె తీర్థ యాత్రలు చేస్తారు.  అలాగే శని, కుజ గ్రహలు బలంగా ఉంటె స్థిరాస్థులు సంపాదించుకుంటారు

12వ స్థానం - ప్రధానమైన విషయాలు.......
· 12వ స్థానంలో బుధ గ్రహం స్థితి ఐన లేదా 12వ స్థానంతో బుధ గ్రహానికి సిగినీఫీ కేసన్స్ ఉన్న - జ్యోతిష్యం మీద ఆసక్తి ఉంటుంది. బుధ గ్రహానికి గురు, శని గ్రహలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - జ్యోతిష్యం నేర్చుకోవాలి అనే ఇష్టం బలంగా ఉంటుంది. అలాగే ఈ గ్రహాలకు 8, 9 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె జ్యోతిష్యములో మాస్టర్స్ అవుతారు.
· 12వ స్థానాధిపతి 12వ స్థానములో స్థితి అయితే - ధన నష్టం ఉంటుంది. అలాగే క్రమముగా స్థిరాస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ గురు, శుక్ర మరియు బుధ గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె మంచి ఫలితాలు ఉంటాయి.
· 12వ స్థానాధిపతి గురు లేదా బుధ గ్రహము అయి -  9, 11 స్థానాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది.
· 12వ స్థానాధిపతి లేదా నక్షత్రాధిపతి లేదా సబ్ లార్డ్ తో - శని, కుజ, రాహు గ్రహాలతో సిగినీఫీ కేసన్స్ ఉంటె - అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది.
· KP రూల్:  12వ స్థానం సబ్ లార్డ్ తో - 10వ స్థానముతో లేదా అధిపతి తో లేదా నక్షత్రధిపతితో - సిగినీఫీ కేసన్స్ ఉంటె అనవసరపు ఖర్చు ఉంటుంది
· 12వ స్థానములో కుజ, శని గ్రహాలు స్థితి అయితే - దుర్మార్గుడు / దుర్మార్గురాలు, అలాగే ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు.
· 12వ స్థానములో సూర్య, శని గ్రహాలు స్థితి అయితే - చేడు స్నేహాలు ఉంటాయి. అలాగే రాహు గ్రహముతో సిగినీఫీ కేసన్స్ ఉంటె తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
నోట్ : పైన వివరించిన రూల్స్ - ఆ స్థానాధిపతులకు 2, 5, 9, 11 స్థానాలతో లేదా నక్షత్రాధిపతులతో సిగినీఫీకే షన్స్ ఉంటె పైన వివరించిన ఫలితాలు 100% మ్యాచ్ అవుతాయి.

Tuesday, February 4, 2025

అష్టైశ్వర్యాలు కోసం కదంబ పుష్పాలు

అష్టైశ్వర్యాలు కోసం కదంబ పుష్పాలు


🙏🌺కదంబ పుష్పములు ఇవి సాక్షాత్తు శ్రీ లక్ష్మి దేవి రూపాలు' ఆమె నివసించే ది ఈ వనంలోనేకదూ! అందుకే  ఆమెను కదంబ వనవాసిని అంటారు.

🙏🌺కదంబ వృక్షాన్ని కృష్ణవృక్షం అని కూడా అంటారు. ఇది ఆకు రాల్చదు. ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను ఇస్తుంది. అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. ఉత్తరభారతంలో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతంలో లక్ష్మీ వృక్షమనీ అంటారు. 

🙏🌺ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో లక్ష్మిఅమ్మవారిని ‘కదంబవనవాసిని’ అంటారు. కదంబ వృక్షానికి *‘ఓం లక్ష్మీదేవ్యై నమః’* అనే మంత్రంతో  పూజ చేసినట్లైతే సకల సంపదలు లభించటమే కాక రోగనివారణ జరుగుతుంది.

 🙏🌺గ్రహదోషాలు తొలగించుకోవడానికి ప్రతిరోజూ లక్ష్మి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించాలి.ఇలా చెసినచో ఇంటిలో ధనరాబడికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

🙏🌺హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం.. అంతేకాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఈ వృక్షం.

🙏🌺శ్రీమహాలక్ష్మి కి కదంబ పుష్పాలతో ప్రతిరోజూ పూజచేసిన సకల సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రాప్తించి సుఖంగా జీవిస్తారు.

Sunday, February 2, 2025

యంత్రములు - ఫలితాలు...........!!

యంత్రములు - ఫలితాలు...........!!

యంత్రము అనగా ముందుకు వెళ్లేవి, ముందుకు నడిపించునవి అని అర్ధం. అంటే ఎవరైతే ఒక దైవ యంత్రాన్ని ఆరాధిస్తూ ఉన్నారో వారికి భగవదానుగ్రహం కలిగించును. అమ్మవారి లలితా సహస్రనామాలకు మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహాసనా లని అమ్మవారి నామాలకి చెప్పబడుచున్నది అంటే అన్ని యంత్రములకు ప్రతినిధి అమ్మవారే.

ఇక భగవంతుని ప్రాణ శక్తి యంత్రరూపంగా ఉంటుంది. ఏ దేవాలయం నిర్మాణం జరిగినా ధ్వజస్ధంబం నిలబెట్టినా, దేవతా విగ్రహం ప్రతిష్టకంటే ముందు యంత్ర ప్రతిష్ట చేస్తారు. కారణం యంత్రానికి ఉండే అమోగమైన శక్తి ఆ దేవతామూర్తిలో ప్రవేశించి అమోగమైన చైతాన్యాన్ని కల్గిస్తున్నది.

 భారతదేశమున ఆదిశంకరాచార్యుల వారు అనేక దైవక్షేత్రాలలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన చేయబట్టి లోకం అంతా శాంతి సుభిక్షాలతో పాడిపంటలతో వర్ధిల్లిచున్నది అటువంటి శక్తి ఒక యంత్రానికి ఉన్నది.
అయితే అట్టి యంత్రాలు ఏమేం రకాలు ఉన్నాయో వాటి ప్రయోజనములు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

యంత్రములు ప్రయోజనములు......
గణీశయంత్రము.... సర్వకార్యసిద్ధి
కుబేర యంత్రము....... ధనప్రాప్తి, ఆరోగ్యము
శ్రీ లక్ష్మీ గణేశ యంత్రము...... ధనప్రాప్తి
లక్ష్మీ యంత్రము......... సౌభాగ్యము
వ్యాపారాకర్షణ యంత్రము....... సకలవ్యాపారవృద్ధి
స్ధిర లక్ష్మీ యంత్రము....... ధనము స్ధిరమగును
సౌభాగ్య లక్ష్మీ యంత్రము........ సౌభాగ్యప్రాప్తి
మహసౌర యంత్రము....... ఆరోగ్యసిద్ధి
నవగ్రహ యంత్రములు....... నవగ్రహశాంతి
సర్వకార్య సిద్ధి యంత్రము....... కార్యసిద్ధి
మన్యు యంత్రము........ శతృపలాయనము.
మృత్యుంజయ యంత్రము...... అపమృత్యు భయనివారణ
ధన్వంతీరా యంత్రము....... ఆరోగ్యసిద్ధి
మహకార్తికేయ యంత్రము..... శతృజయం
మహ సుదర్మన యంత్రము..... ఆరోగ్యము, భయనివారణ
నరఘోష నివారణ యంత్రము...... దృష్టిదోష, నరఘోష నివారణ
సరస్వతీ యంత్రము........ విద్యా ఉన్నతి
సంతాన గోపాల యంత్రము....... సంతానప్రాప్తి
గౌరీ యంత్రము..... వివాహప్రాప్తి
జనాకర్షణ యంత్రము....... సర్వజనవశ్యము
ధనాకర్షణ యంత్రము...... ధనప్రాప్తి
విద్యాభివృద్ధికర యంత్రము........ సర్వవిద్యాభివృద్ధి
మత్స్య యంత్రము...... గృహదోషశాంతి
వాస్తుదోషహర యంత్రము....... వాస్తుదోష నివారణ
కూర్మ యంత్రము...... వాస్తుదోష నివారణ
అష్ట ధిక్పాలక యంత్రము..... దృష్టి దోషాది శాంతి
నాగ యంత్రము ,.........నాగదోష నివారణకు
మంగళ యంత్రము......... కుజదోష నివారణ
లక్ష్మీ ప్రాప్తి యంత్రము..... ధనాభివృది.
వైభవ లక్ష్మీ యంత్రము....... సర్వశుభకార్యసిద్ధి
కాత్యాయనీ యంత్రము....... వివాహప్రాప్తి
గాయత్రి యంత్రము...... సద్బుద్ధిప్రసిద్ధి
విశ్వకర్మ యంత్రము.......సర్వకార్య సిద్ధి
దుర్గాయంత్రము....... జగన్మాత అనుగ్రహం ఉపాసనాసిద్ధి
రామ రక్షా యంత్రము....... సర్వదా రక్షణ
సీతా యంత్రము ......సౌభాగ్యము
శతృ విజయ యంత్రము...... కార్యజయం
దత్తాత్రేయ యంత్రము..... దుష్టగ్రహబాధా నివారణ
సాయిరక్షా యంత్రము...... బాబా అనుగ్రహం
సర్వకార్య సిద్ధి యంత్రము....... కార్య సిద్ధి
స్వస్తిక్ యంత్రము....... శుభప్రాప్తి
విజయ యంత్రము....... సర్వత్రావిజయం
శారదా యంత్రము...... విద్యాసక్తి
గ్రామ దేవతా యంత్రం .....కుటుంబవృద్ధి
కూర్మ యంత్రం ......స్థలంలో దోష నివృత్తి
సంతాన సుబ్రహ్మణ్య యంత్రం ...సంతానం 
వీరబ్రహ్మ యంత్రం .....గురు అనుగ్రహం
ఈశ్వరాంబా యంత్రం .....ఉపాసనాసిద్ధి
లక్ష్మీ కుబేర యంత్రం.... వ్యాపార అభివృద్ధి 
ధన్వంతరి యంత్రం.... ఆరోగ్యం కొరకు 
రాజశ్యామల యంత్రం....... ఉపాసనసిద్ధి
దుర్గా యంత్రం..... కష్టాలు తొలగుటకు 
ఆంజనేయ యంత్రం....... ధైర్య సాహసాల కొరకు 
దత్త నరఘోష యంత్రం..... పరిశ్రమ వ్యాపారం అభివృద్ధికి 
స్వర్ణాకర్షణ భైరవ యంత్రం..... సకల వ్యాపార అభివృద్ధికి 
శీతల యంత్రం........ పశువులు,,సంతాన వృద్ధికి 
శ్రీ చక్ర యంత్రం...... ఐశ్వర్యాభివృద్ధికి 
సంప్రదించ గలరు 

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS