Monday, August 18, 2025

మణిద్వీప వర్ణన చదివినా విన్నా అష్టైశ్వర్యాలు కలుగుతాయి.......!!

మణిద్వీప వర్ణన చదివినా విన్నా అష్టైశ్వర్యాలు కలుగుతాయి.......!!
మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలూ దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా

చదివినా లేక గానం చేసినా వచ్చేఫలితాలను వర్ణించడానికి వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదు.

ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయముచేయగల ముప్పదిరెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్థ విశ్వమూ ఉండుటవలన ముప్పదిరెండురకాల పూలతో,. పసుపు..కుంకుమలతో..నవరత్నాలతో..
రాగి కంచు వెండి బంగారము మెదలగు లోహాలతో యదాశక్తి అమ్మకు పూజచేసుకుంటూ..

నైవేధ్యాలుగా 32 రకాలు చేసి, సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు.
32 రకాల నైవేధ్యాలకు శక్తిలేనివారు యదాశక్తి నైవేధ్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చు. అమ్మకు భక్తి ప్రధానము.

 మొగలి పూవు,బంతి పూవూ పూజకు పనికిరాదు .
 మందారాలలో గులాబీలలో చామంతులలో చాలా రకాలు ఉన్నా వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించి ఈక్రింద ఇవ్వడము జరిగింది. ఇవ్వికాక ఇంకేమైనా ఉన్నా, వీట్లో ఏమైనా అమ్మ పూజకు పనికిరావన్నా తెలియజేయండి 

1. మల్లెపువ్వులు 2. గులాబి 3. సన్నజాజి 4. విరజాజి 5.సెంటుమల్లి 6. డిసెంబరంపువ్వులు 7. చామంతులు
8. లిల్లీ 9. ముద్దగన్నేరుపువ్వులు 10. నందివర్ధనం
11. పారిజాతపూలు 12. చంద్రకాంతంపూలు 13. సువర్నగన్నేరుపూలు 14. కలువ పూలు 15. పాటలీపుష్పాలు 16. ముద్దనందివర్ధనం 
17. గన్నేరుపూలు 18. కదంబపూలు
19. మందారాలు 20. తామరలు 21. కనకాంబ్రాలు
22. దేవగన్నేరు పూలు 23. అశోక పుష్పాలు 
24. నిత్యమల్లెపువ్వు25. కుంకుమపువ్వు 
26. పొన్నపువ్వు 27. మంకెనపువ్వు
28. రాధామనోహరాలు 29. కాడమల్లె 30. నాగమల్లె
31. విష్ణుక్రాంతం 32. రామబాణాలు లేక నూరు వరహాలు33. దేవకాంచన పూలు 34. చంపక ( సంపంగి) 35. పున్నాగ పుష్పాలు.

మణిద్వీప వర్ణన మహత్యమేమిటి?

శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.
మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

మహాసంపదలిచ్చు - #మణిద్వీప_వర్ణన

మహాశక్తి మణిద్వీప నివాసిని
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములొ మంత్రరూపిణి
మన మనస్సులలొ కొలువైయింది||1||

సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు
మణి ద్వీపానికి మహానిధులు ||2||

లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణి ద్వీపానికి మహానిధులు ||3||

పారిజాత వన సౌగంధాలు
సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాధుల గాన స్వరాలు
మణి ద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||4||

పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవునగలవు
మధుర మధురమగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు ||5||

అరువదినాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారు శక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు ||6||

అష్టసిద్ధులు నవ నవ నిధులు
అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ
మణిద్వీపానికి మహానిదులు ||7||

కోటి సూర్యులు ప్రపంచ కాంతులు
కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిదులు
||భువనేశ్వరీ|| ||8||

కంచుగోడల ప్రాకారాలు
రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు
మణిద్వీపానికి మహానిధులు ||9||

పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు ||10||

ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు ||11||

సప్తకోటి ఘన మంత్రవిద్యలు
సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||12||

మిలమిలలాడే ముత్యపురాసులు
తళ తళ లాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు ||13||

కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు ||14||

భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచ భూతములు పంచ శక్తులు
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు ||15||

కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిల మహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||16||

మంత్రిణి దండిని శక్తి సేవలు
కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||17||

సువర్ణ రజిత సుందరగిరులు
అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు ||18||

సప్త సముద్రములనంత నిధులు
యక్ష కిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు ||19||

మానవ మాధవ దేవ గణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలాయకారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||20||

కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మ శక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||21||

దివ్య ఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||22||

శ్రీ విఘ్నేస్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు ||23||

పంచ భూతములు యజమాన్యాలు
వ్రాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||24||

చింతామణులు నవరాత్రులు
నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు ||25||

దఃఖము తెలియని దేవీ సేవలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు
మణిద్వీపానికి మహానిధులు ||26||

పదునాల్గు లోకాలన్నిటిపైన
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానం ||27||

చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములొ
||భువనేశ్వరీ|| ||28||

మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములొ ||29||

పరదేవతను నిత్యము కొలిచి
మనసర్పించి అర్పించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ||2 సార్లు|| ||30||

నూతన గృహములు కట్టినవారు
మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్ట సంపదల తులతూగేరు ||2 సార్లు|| ||31||

శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి
మణిద్వీప వర్ణన ఛదివినచోట
టిష్ట వేసుకొని కూర్చొనునంటా
కోటి శుభాలను సమకూర్చుకొనుటకై

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||2 సార్లు|| ||32||

ఫలశృతి:

పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టంగాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతిమనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారమునాడు పూజావిధాన ప్రకారము పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన, వైరాగ్య, సిద్ధులతో ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో తులతూగి, చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.

శ్రీమాత నివాసం చింతామణి గృహం విజయదశమి పర్వదిన శుభవేళ ఆ జగజ్జనని, శివాత్మక మణిద్వీప నివాసినీ అయిన ఆ తల్లిని స్మరించుకోవటం ఎంతో శుభప్రదం. ఆ అమ్మ మణిద్వీపంలో ఎలా అలరారుతోంది అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పే కథ
దేవీభాగవతంలో వర్ణితమై ఉంది. నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తోంది.

పరదేవత అయిన ఆ శ్రీమాత ప్రపంచాన్నంతటనీ పరిరక్షిస్తుంది. ఆమె నిత్యం నివసించే గృహమే చింతామణి గృహం. అది మణిద్వీపంలో ఉంటుంది.
సర్వలోకోత్తమోత్తమైన ఆ మణిద్వీపాన్ని స్మరిస్తే చాలు సర్వపాపాలూ నశిస్తాయని దేవీభాగవతం పన్నెండో స్కంధం వివరిస్తోంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తూ జగత్తునంతటినీ పాలించే ఈ భువనేశ్వరీ మాత నివసించే చింతామణి గృహం వేయిస్తంభాల మండపాలతో విరాజిల్లుతుంటుంది. ఇలాంటి మండపాలు నాలుగుంటాయి. శృంగార మండపం, ముక్తిమండపం, జ్ఞానమండపం, ఏకాంత మండపం అని
వాటికి పేర్లు. కోటి సూర్యప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తుంటాయి.
వాటిచుట్టూ కాశ్మీరం, మల్లికా, కుందవనాలు అలరారుతుంటాయి. ఆ వనాలలో కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తుంటాయి. అక్కడే
సుధారసపూర్ణంగా ఉండే ఒక పెద్దసరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు, సోపానాలన్నీ అనేకానేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ
సరోవరం మధ్యలో ఓ మహాపద్మవనం, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ ఉంటాయి. చింతామణి గృహంలో పదిమెట్లతో ఉన్న ఓ వేదిక ఉంటుంది. ఆ వేదికకు ఉన్న పదిమెట్లూ పది శక్తిస్వరూపాలు. దానికి ఉండే నాలుగు కోళ్లపై ఉండే
ఫలకమే సదాశివుడు. ఆ ఫలకం మీద మాత భువనేశ్వరుడి వామాంకంలో కూర్చొని ఉంటుంది. 
ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డాణం, వైఢూర్యాలు తాపడం చేసిన అంగదాలు అలరారుతుంటాయి. శ్రీచక్రరూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం
కళకళలాడుతుంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండ్లలా ఉండే పెదవులు, కస్తూరి కుంకమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన
చూడామణి, ఉదయభాస్కర బింబంలాంటి ముక్కుపుడక ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు, మైపూతతో శ్రీమాత అలరారుతుంటుంది. ఆ మాతకు పక్కభాగంలో శంఖ, పద్మ నిధులు ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్లు తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుతుంటాయి. జగజ్జనని భువనేశ్వరుడి పక్కన ఉన్నది కాబట్టే ఆయనకంతటి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత నివసించే చింతామణి గృహం వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గృహానికి ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మ శక్తిప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవీ ఉపాసకులంతా చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ
ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా ఆ మాత కన్పిస్తుంటుంది.
ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మీ అనే దేవాంగనలు ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, అఘోర, మంగళ, దోగ్ద్రి అనే తొమ్మిది పీఠాశక్తులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ ఉండటం కన్పిస్తుంది. కేవలం దేవి ఉపాసకులకేకాక నిరంతరార్చన తత్పరులకు ఇక్కడే స్థానం దొరుకుతుంది. ఈ ప్రదేశంలో మరో గొప్ప
తనమేమిటంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి, చెరకురసాల జీవనదులు ప్రవహిస్తుంటాయి. కోర్కెలను తీర్చే మహత్తర వృక్షాలు
ఇక్కడ ఎన్నెన్నో. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలుండవు. అంతా నిత్యయౌవనంతో ఆనందంతో ప్రకాశిస్తుంటారు. వారంతా
భువనేశ్వరీ మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా ఇక్కడికి వచ్చి అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపమూ
అందులోని చింతామణి గృహమూ ఒక్కోసారి ఒక్కో విధంగా పవిత్రకాంతులను వెదజల్లుతూ ఉంటాయి. ఐశ్వర్యానికీ, యోగానికీ అన్నిటికి అది పరమావధి.
జగత్తునంతటినీ తానై యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం దేవీభాగవతంలో ఇలా కన్పిస్తుంది. తన భక్తులకు బాధ కలిగిందని తెలిసినప్పుడల్లా తానే స్వయంగా ముందుకువచ్చి దుష్ట శిక్షణ చేస్తుండే ఆ
పరాంబిక ఎక్కడుంటుంది అని ఎవరికైనా కలిగే సందేహమే. ఆ సందేహానికి సమాధానమిస్తూ మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో ఉండే ఆ శ్రీమాత గురించి ఈ కథా సందర్భం ఇలా వివరించి చెప్పింది. మణిద్వీప వర్ణన, చింతామణి గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తకోటి నమ్మకం.

భైరవకోన(ప్రకాశంజిల్లా) ఆలయ విశిష్టత.*

శ్రీ త్రిముఖ దుర్గాంబ మహాదేవి ఆలయం, ఆమె ముందు భాగంలో ఉన్న బర్గేశ్వర లింగం 
9 వ శతాబ్దంలో నిర్మించబడిన శక్తివంతమైన ఆలయం.*

.

భైరవకోన(ప్రకాశంజిల్లా) ఆలయ విశిష్టత.*

​భైరవకోన అనేది భైరవుని పేరుతో ముడిపడి ఉన్న ఒక పవిత్ర ప్రదేశం. ఈ పేరు ఆలయానికి ఉన్న భైరవ శక్తులను సూచిస్తుంది. ఇక్కడ ఉన్న శ్రీ త్రిముఖ దుర్గాంబ మహాదేవి ఆలయం మరియు శ్రీ బర్గేశ్వర స్వామి ఆలయం ఈ ప్రదేశానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఇచ్చాయి. ఇక్కడ చెప్పినట్టుగా, ఈ రెండు ఆలయాల కలయిక శివశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది, ఇవి దంపతులుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి.

​త్రిముఖ దుర్గాంబ మహాదేవి ప్రాముఖ్యత.......
​త్రిముఖ దుర్గాంబ మహాదేవి యొక్క మూడు ముఖాలు త్రిగుణాలకు ప్రతీకలుగా నిలుస్తాయి.

​జ్ఞానం & శాంతి: 
ఒక ముఖం జ్ఞానం మరియు శాంతిని సూచిస్తుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శనం చేస్తుంది.

​శక్తి & రక్షణ: 
రెండో ముఖం శౌర్యం, శక్తి మరియు రక్షణకు చిహ్నం. ఇది భక్తులను భయాల నుండి మరియు శత్రువుల నుండి కాపాడుతుంది.

​ఉగ్రం & నిర్మూలనం: 
మూడో ముఖం దుష్ట శక్తులు మరియు ప్రతికూలతలను నాశనం చేయడానికి ఉద్దేశించబడింది.

​ఈ మూడు రూపాల కలయిక వల్ల భక్తులు జ్ఞానం, ధైర్యం, మరియు రక్షణ మూడు వరాలనూ ఏకకాలంలో పొందగలరు.

​బర్గేశ్వర లింగం......
​ఆలయం ముందు భాగంలో ఉన్న బర్గేశ్వర లింగం ఈ స్థలం యొక్క మరొక ముఖ్యమైన ఆకర్షణ. ఇక్కడ చెప్పినట్టుగా, బర్గేశ్వరుడు అంటే 'బలశాలి, రక్షకుడు'. ఈ లింగానికి అభిషేకం, అర్చనలు చేయడం ద్వారా భక్తులు ఈ క్రింది ప్రయోజనాలను పొందగలరు:

​కుటుంబ సుఖం & సంతానం: 
శివశక్తి స్వరూపం కాబట్టి, ఇది కుటుంబంలో శాంతిని, సంతోషాన్ని మరియు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది.ఆదిత్యయోగీ.

​ఆరోగ్యం & శత్రు నాశనం: 
బర్గేశ్వరుని ఆరాధన అనారోగ్యం మరియు శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది.

​తాంత్రిక మరియు చారిత్రక ప్రాధాన్యత......
​తాంత్రిక శక్తి: 
ఆలయ నిర్మాణం మరియు పూజా విధానాలు వాస్తు మరియు తాంత్రిక శాస్త్రాలను అనుసరిస్తాయని ఇక్కడ పేర్కొన్నారు. గర్భగృహం చుట్టూ ఉన్న త్రిభుజాకార ముద్రలు శ్రీచక్ర తంత్రాన్ని సూచిస్తాయి. అమావాస్య, పౌర్ణమి, మరియు నవరాత్రుల వంటి ప్రత్యేక సమయాల్లో ఈ ఆలయంలో తాంత్రిక శక్తులు చాలా బలంగా ఉంటాయి.

​చారిత్రక నేపథ్యం: ఈ ఆలయం 9వ శతాబ్దంలో నిర్మించబడింది, ఇది ఆ కాలంలోని చాళుక్య, రాష్ట్రముఖ, కదంబ రాజవంశాల శిల్పకళా ప్రభావాలను ప్రతిబింబిస్తుంది.
​ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికంగా మరియు చారిత్రికంగా చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక శక్తి పీఠం..*
.

#శ్రీ త్రిముఖ దుర్గాంబ మహాదేవి -- తాంత్రిక స్వరూపం.*

​త్రిముఖ దుర్గాంబ మహాదేవి ఆలయం ఒక శక్తివంతమైన తాంత్రిక పీఠం. ఈ దేవి మూడు ముఖాల రూపంలో దుర్గ, కాళి, మరియు లక్ష్మీ శక్తులను ఒకేచోట కలిగి ఉంటుంది. అందువల్ల, ఈ దేవత ఆరాధన భక్తి, జ్ఞానం, సంపద, రక్షణ, మరియు శత్రు నాశనం వంటి అనేక ప్రయోజనాలను ఒకేసారి ప్రసాదిస్తుంది.

​ప్రత్యేక సమయాలు మరియు ప్రయోజనాలు.
​ఇక్కడ ఈ పరిహారాలు అత్యంత శక్తివంతంగా పనిచేసే సమయాలను స్పష్టంగా పేర్కొన్నారు.

​అమావాస్య రాత్రి: 
ఈ సమయంలో పూజ చేయడం వల్ల శత్రు నివారణ, క్షుద్రభూత నివారణ, మరియు పాప పరిహారాలు లభిస్తాయి. అమావాస్య అనేది శక్తిని ఆహ్వానించడానికి, ప్రతికూలతలను తొలగించడానికి అనువైన సమయం.

​పౌర్ణమి రాత్రి: 
ఈ సమయంలో చేసే పూజ సంపద, ఐశ్వర్యం, మరియు ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. పౌర్ణమి అనేది చంద్రుడి పూర్తి శక్తిని ప్రసారం చేసే సమయం, ఇది సంపద మరియు శ్రేయస్సును పెంచుతుంది.ఆదిత్యయోగీ.

​నవరాత్రులు: 
ఈ తొమ్మిది రోజులు దేవి యొక్క సంపూర్ణ శక్తిని ఆవాహన చేయడానికి మరియు సర్వసంపద సిద్ధులను పొందడానికి అత్యంత ముఖ్యమైన సమయం.

​తాంత్రిక పరిహార విధి..
​ఇక్కడ ఈ పూజ యొక్క పూర్తి విధానాన్ని దశలవారీగా వివరించారు.

ఈ విధానం యొక్క ముఖ్య భాగాలు:

​బీజాక్షర మంత్రాలు: 
ఇక్కడ వివరించిన 
ఓం దుం దుర్గాయై నమః, 
ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, 
ఓం ఐం హ్రీం శ్రిం దుం దుర్గాయై నమః వంటి బీజాక్షరాలు చాలా శక్తివంతమైనవి. ఈ మంత్రాలు దేవి యొక్క వివిధ రూపాలను, శక్తులను ఆవాహన చేస్తాయి.

​న్యాసం: 
మంత్ర జపానికి ముందు న్యాసం చేయడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలలో శక్తిని ఆవాహన చేసి, ఆత్మశుద్ధి సాధిస్తారు.

​ముద్రలు: 
త్రిశూల, చక్ర, మరియు శక్తి ముద్రలు దేవి శక్తులను ఆకర్షించడానికి, ప్రసారం చేయడానికి మరియు రక్షణ కవచం ఏర్పాటు చేయడానికి ఉపయోగపడతాయి.

​పూజా విధానం: 
ఇక్కడ చెప్పినట్టుగా, ఎర్రని వస్త్రాలు, కుంకుమ, ఎర్ర పువ్వులు, వామపథి దీపారాధన (ఎడమవైపు దీపం) వంటివి తాంత్రిక పూజలో ముఖ్యమైనవి. అమావాస్య నాడు నల్ల నువ్వులు, పౌర్ణమి నాడు పాలు, మరియు నవరాత్రులలో నవరత్న పుష్పార్చనలు దేవికి ప్రీతికరమైనవి.

​హోమం: 
ఇక్కడ వివరించిన విధంగా, హోమం చేయడం ఈ పరిహారంలో ఒక ముఖ్యమైన భాగం. నువ్వులు, బెల్లం, కర్పూరం వంటి వాటితో మంత్ర సహిత హోమం చేస్తే ఫలితాలు వేగంగా వస్తాయి.

​నియమ నిబంధనలు మరియు జ్యోతిష్య ప్రభావాలు.......

​ఈ పరిహారాన్ని చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఇక్కడ చెప్పినట్టుగా, ఉపవాసం, సాత్విక ఆహారం, మరియు మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండటం అవసరం. ఈ నియమాలు సాధకుడికి మానసిక, శారీరక శుద్ధిని ఇస్తాయి.

​జ్యోతిష్య ప్రయోజనాలు: 
ఈ పూజల వల్ల చంద్ర దోషం, రాహు-కేతు గ్రహపాతం, మరియు శని దోషం వంటివి కూడా తొలగిపోతాయి. దుర్గాంబ మహాదేవి యొక్క శక్తి ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలను శాంతింపజేస్తుంది.​ శ్రీ త్రిముఖ దుర్గాంబ మహాదేవి యొక్క తాంత్రిక శక్తిని మరియు ఆ శక్తిని పొందేందుకు అవసరమైన పూర్తి మార్గదర్శకాన్ని వివరిస్తుంది. ఈ పరిహారాన్ని నిష్టతో పాటిస్తే, భక్తులు ఆధ్యాత్మిక, భౌతిక మరియు మానసిక ప్రయోజనాలను పొందవచ్చు..*
.

#ఆత్మ బ‌లం...!  భ్రమరం మహా వృక్షాలను చెక్కలను మొద్దులను అవలీలగా తొలిచి రంధ్రాలు చేసి తాను జీవిస్తూ తన పిల్లలను కూడా అందులోనే పెంచి పోషిస్తుంది.*

అదే భ్రమరం మకరందం మీద ఆశతో తామరపువ్వుల మీద వాలినపుడు  తామరపూల రెక్కలు ముడుచుకొని భ్రమరాన్ని భంధించి వేస్తాయి.

ఎంతో శక్తి కలిగి మహా వృక్షాలకు కూడా రంధ్రాలు చేసే ఆ భ్రమరం అయ్యో నన్నేదో బంధించింది అనే భావన  దానికి కలుగుతుంది
ఈ భావనే దానికి భయాన్ని కలిగిస్తుంది ఆ తామరపూవుల రెక్కలలోనే ఇరుక్కొని చివరకు చనిపోతుంది.ఆదిత్యయోగీ.

అయితే ఇక్కడ మనం గమనిచాల్సివ విషయం ఒకటుంది అదేమిటంటే మహా వృక్షాలను కూడా తొలచగలిగే ఆ భ్రమరానికి ఆ తామరపూల రెక్కలను తొలచలేదా ఆ పూరేకులకు రంధ్రాలు చేయలేదా కనీసం తన రెక్కలను గట్టిగా ఆడించినా రాలిపోయే ఆ పూరేకుల మధ్య ఇరుక్కొని తన జీవితాన్ని ఎందుకు చాలించింది.

అది తన సామర్థ్యాన్ని మరచిపోయి తనకంటే బలమైన శక్తేదో తనని బంధించిందనే భావన దానికి కలగడం ఆ భావనను అది నమ్మడమే దాని బలహీనతకు దారితీసింది అది ఆ బలహీనతను పూర్తిగా నమ్మింది అంతే తన మరణాన్ని తానే కొనితెచ్చుకొంది.

మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా ఇలాంటివే మనం ఎదుర్కొనే చాలా సమస్యలు బలమైనవికావు కానీ మన శక్తిని మనం మరచిపోవడంవల్ల అవి బలపడి మనలను శక్తిహీనులను చేసి పూర్తిగా అబధ్రతా భావనలోనికి నెట్టివేస్తాయి.

అలాగే మాయ అనేది మన ఆత్మశక్తి కంటే బలమైనదేమీ కాదు దాని బలం కేవలం తామర పూరేకులంతే కానీ నీ ఆత్మబలం మహా వృక్షాలకు రంధ్రాలు చేసేంత బలమైనది.

ఈ విషయాన్ని సదా మననం చేసుకొంటూంటే ఎంత జఠిలమైన సమస్యలైనా మన బలమైన ఆత్మవిశ్వాసం ముందు తలవంచుతాయి.

కావున అహం అనేది ఆత్మస్వరూపం అయితే ఆ ఆత్మను నియత్రించగలిగే మన ఆత్మబలమే దైవ స్వరూపం.

కాబట్టి ఎంత పెద్ద సమస్యనైనా మన ఆత్మబలంతో సమర్థవంతంగా ఎదుర్కొని జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడం మన చేతులలోనే ఉంది..*

మనసు కలిగి వుండడం మామూలే జీవులకు. అయితే అది అలవాటు మనసు మాత్రమే!. కాని, ఆలోచన కలిగిన మానవ మనసు తెలివిని, మేధస్సును వృద్ధి చేసుకుని భౌతిక ఆధ్యాత్మిక రంగాలలో ఎంతో లోతులకు, ఎత్తులకు పోయి, వాటి రహస్యాలను వెలుగులోకి తెస్తూ, వివరిస్తూ, వినియోగంలోకి తేవడం జరుగుతోంది. అంతటి శక్తివంతమైన మనసును కేవలం, అలవాట్లకే సరిపెట్టుకోవడమంటె..... తద్వారా, మనోశక్తిని వృధా చేయడమే! భౌతికంలో మనసు మేధస్సుగా పనిచేస్తోంది.... అధ్యాత్మికంలో అదే ధ్యానసాధన మార్గంలో... ఆత్మగ, దివ్యాత్మగా మార్పు చెందుతుంది.. *
.

Saturday, August 16, 2025

దత్తాత్రేయుని తాంత్రిక పరిహారాలు........!!

దత్తాత్రేయుని తాంత్రిక పరిహారాలు........!!


​గురువారం రోజు దత్తాత్రేయునికి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే పూజలు, మంత్ర జపాలు మరియు పరిహారాలు త్వరగా ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. ఈ పరిహారాలు ముఖ్యంగా మానసిక, ఆర్థిక, మరియు శారీరక సమస్యలను అధిగమించడానికి, అలాగే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవడానికి సహాయపడతాయి.

​1. దత్త బంధన మంత్రం.....

​ఈ మంత్రం ప్రధానంగా ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

​పరిహార విధానం:
​సమయం: గురువారం ఉదయం స్నానం చేసి, శుభ్రమైన పసుపు రంగు వస్త్రాలు ధరించాలి.

​జపం: దత్తాత్రేయుని పటం లేదా విగ్రహం ముందు కూర్చుని, రుద్రాక్ష మాలతో కనీసం 108 సార్లు 'ఓం హ్రీం క్లీం శ్రీం గురుదేవ దత్తాత్రేయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

​క్రమం: ఈ పరిహారాన్ని నిరంతరంగా 11 గురువారాలు పాటు పాటించడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

​నియమాలు:
​ఈ సాధన చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా, చెడు ఆలోచనలు లేకుండా ఉండాలి. ​శారీరక, మానసిక పరిశుభ్రత అత్యంత ముఖ్యం.

​ఫలితాలు:
​ఇది మిమ్మల్ని శత్రువుల నుండి, చెడు దృష్టి నుండి మరియు అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి కాపాడుతుంది. ​జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి, మార్గాన్ని సుగమం చేస్తుంది.

​2. దత్త స్తంభన మంత్రం........

​ఈ మంత్రం వ్యాపారంలో, వృత్తిలో ఎదురయ్యే సమస్యలను తొలగించి, శత్రువుల ప్రయత్నాలను నిలువరించడానికి ఉద్దేశించబడింది.

​పరిహార విధానం:
​సమయం: గురువారం రోజున.
​స్థలం: ఒక రావిచెట్టు కింద.
​విధానం: రావిచెట్టు కింద దీపం వెలిగించి, ఆ చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయాలి.

​జపం: ప్రదక్షిణలు చేసేటప్పుడు 'ఓం శ్రీం హ్రీం క్లీం గం గురుదేవ దత్తాత్రేయ స్తంభయ స్తంభయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

​నియమాలు:
​ఈ పరిహారాన్ని గోప్యంగా ఉంచాలి; ఇతరులకు దీని గురించి చెప్పకూడదు. ​ప్రదక్షిణలు చేసేటప్పుడు మంత్రంపైనే పూర్తిగా ఏకాగ్రత వహించాలి.

​ఫలితాలు:
​వ్యాపారం లేదా వృత్తిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.
​ఆర్థిక సమస్యలు దూరమై, సంపద పెరుగుతుంది. ​శత్రువులు మీపై చేసే దుష్ప్రచారాలు మరియు ప్రణాళికలు విఫలమవుతాయి.

​3. దత్త ఆకర్షణ మంత్రం.......

​ఈ మంత్రం సమాజంలో గౌరవాన్ని, కీర్తిని పెంచుకోవడానికి, మరియు ఇతరులను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

​పరిహార విధానం:
​సమయం: గురువారం సూర్యాస్తమయం తర్వాత.

​సాధనం: గంధంతో దత్తాత్రేయుని యంత్రాన్ని ఒక భోజపత్రంపై గీయాలి.
​జపం: ఆ యంత్రం ముందు కూర్చుని 'ఓం క్లీం శ్రీం ఐం గురుదేవ దత్తాత్రేయ ఆకర్షయ ఆకర్షయ నమః' అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి.

​నిల్వ: జపం పూర్తయిన తర్వాత ఆ భోజపత్రాన్ని మీ పర్సులో లేదా బీరువాలో భద్రంగా పెట్టుకోవాలి.

​నియమాలు:
​పరిహారం చేసే ముందు యంత్రాన్ని, భోజపత్రాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ​ఈ పరిహారాన్ని ఇతరులకు హాని తలపెట్టే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.

​ఫలితాలు:
​సమాజంలో గౌరవం, ప్రతిష్ట, మరియు కీర్తి లభిస్తాయి. ​మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి, ఇతరుల సహకారం లభిస్తుంది.

​సాధారణ నియమ నిబంధనలు......
​పరిశుభ్రత: ఈ పరిహారాలు చేసేటప్పుడు శారీరకంగా, మానసికంగా అత్యంత పరిశుభ్రంగా ఉండాలి.

​విశ్వాసం: దత్తాత్రేయునిపై అచంచలమైన విశ్వాసం, భక్తితో ఈ పరిహారాలను ఆచరించాలి.

​ఆహారం: గురువారం రోజు సాత్విక ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

​దానం: వీలైనంత వరకు గురువారం నాడు పేదలకు లేదా గురువులకు పసుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదం.

​ఈ పరిహారాలు సరైన ఉద్దేశంతో, పూర్తి విశ్వాసంతో పాటించినప్పుడు మాత్రమే ఫలితాలనిస్తాయి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, ఒక అనుభవజ్ఞుడైన ఆధ్యాత్మిక గురువును లేదా జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.

Thursday, August 14, 2025

తాంత్రిక పరిహారములు -- జీవిత సమస్యలకు పరిష్కారాలు.........!!

తాంత్రిక పరిహారములు -- జీవిత సమస్యలకు పరిష్కారాలు.........!!

​జాతకంలో గ్రహాల ప్రతికూల ప్రభావాల వల్ల మానవ జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. పురాతన శాస్త్రాలైన తంత్రం, జ్యోతిష్యం ఈ సమస్యలను అధిగమించడానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను సూచిస్తాయి. హోమాలు, మంత్ర జపాలు వంటి తాంత్రిక ప్రక్రియలు గ్రహ దోషాలను తొలగించి, శుభ ఫలితాలను ఇస్తాయి.

​1. సంతాన సంబంధిత సమస్యలకు పరిహారాలు......
​సంతాన కారక గ్రహాలు (ముఖ్యంగా గురువు, చంద్రుడు) బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ స్థానాల్లో ఉన్నప్పుడు సంతానం లేకపోవడం, గర్భస్రావాలు, మరియు పిల్లలు మాట వినకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

​సమస్యలు:
​వివాహం తర్వాత సంతానం లేకపోవడం.
​గర్భస్రావాలు పదేపదే జరగడం.
​పిల్లలు ప్రేమ వ్యవహారాలలో చిక్కుకోవడం వల్ల తల్లిదండ్రులు మానసికంగా, సామాజికంగా ఇబ్బందులు పడటం.

​పరిహారాలు:
​సంతానేష్టి హోమం: ఇది సంతానం కలగడానికి ఉద్దేశించిన ఒక శక్తివంతమైన హోమం. ఈ హోమం ద్వారా ప్రత్యేకమైన శక్తులు ఉత్పత్తి అయి, సంతాన యోగాన్ని పెంచుతాయి.

​నవనాగ మండల తంత్రం: 
ఈ తాంత్రిక పరిహారం ద్వారా నాగ దోషాలు, కాలసర్ప దోషాలు వంటివి తొలగిపోయి సంతాన యోగం బలపడుతుంది.

​2. విద్యా సమస్యలకు పరిహారాలు.......

​జాతకంలో బుధ, గురు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు విద్యలో ఆటంకాలు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

​సమస్యలు:
​ఏ విద్య సరిగా అబ్బకపోవడం.
​పై చదువులకు ఆటంకాలు.
​పోటీ పరీక్షలలో విజయం సాధించలేకపోవడం.
​జ్ఞాపకశక్తి తగ్గడం, చదువుపై ఆసక్తి లేకపోవడం.

​పరిహారాలు:
​ఈ సమస్యలకు పరిష్కారంగా, జాతకంలో విద్యకు సంబంధించిన గ్రహాలను బలోపేతం చేసే మంత్ర జపాలు, హోమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి విజయం సాధిస్తారు.

​3. ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు పరిహారాలు........

​జీవితంలో ఏర్పడే అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, మరియు ఉద్యోగ సమస్యలు జాతకంలో ప్రతికూల గ్రహాల వల్ల తలెత్తుతాయి.

​సమస్యలు:
​ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం లభించకపోవడం లేదా నిలబడకపోవడం.
​విదేశాలకు వెళ్లడంలో ఆటంకాలు.
​6వ స్థానాధిపతి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఊహించని అనారోగ్యాలు, దీర్ఘకాలిక వ్యాధులు.

​పరిహారాలు:
​ఉద్యోగ హోమం: ఉద్యోగ సమస్యల పరిష్కారానికి, విదేశీయానానికి సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి ఈ హోమం సహాయపడుతుంది.

​తంత్ర కృత్య హోమం: జాతకంలో 6వ స్థానాధిపతి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ఉపద్రవాలను తొలగించడానికి ఈ హోమం అత్యంత శక్తివంతమైనది. ​వివిధ కోరికల కోసం హోమాలలో ఉపయోగించే సమిధలు మరియు ద్రవ్యాలు, ​మీరు ఉదహరించినట్లుగా, వివిధ కోరికలను తీర్చుకోవడానికి హోమంలో ఉపయోగించే సమిధలు (కట్టెలు), ద్రవ్యాలు వేర్వేరుగా ఉంటాయి. దీనికి సంబంధించిన శ్లోకం మరియు దాని వివరణ కింద ఇవ్వబడింది.

​జౌదుంబరీభి రిధ్మాభిః పశుకామస్య శస్యతే | దధ్నా చైవాన్నకామస్య పయసా శాన్తి మిచ్ఛతః ||
అపామార్గ సమిద్భిశ్చ కామయన్‌ కనకం బహు | కన్యాకామో ఘృతాక్తాని యుగ్మశో గ్రధితాని చ ||
జాతి పుష్పాణి జుహుయాద్గ్రామార్ధీ తిలతండులమ్‌ | వశీకర్మణి శాఖోటవాశా7పామార్గ మేవచ ||

​వివరణ:
​పశుసంపద కోసం: జువ్వి (ఔదుంబర) కట్టెలతో హోమం చేయాలి.
​ఆహారం (అన్న సమృద్ధి) కోసం: పెరుగుతో హోమం చేయాలి.
​శాంతి కోసం: పాలతో హోమం చేయాలి.
​బంగారం (ధన సమృద్ధి) కోసం: ఉత్తరేణి సమిధలతో హోమం చేయాలి.
​కన్య ప్రాప్తి కోసం: నేతిలో తడిపిన రెండేసి జాజి పూలతో హోమం చేయాలి.
​గ్రామం లేదా భూమి ప్రాప్తి కోసం: నువ్వులు, బియ్యంతో హోమం చేయాలి.
​వశీకరణ కోసం: బరివెంక, బాడిద, మరియు ఉత్తరేణి సమిధలను ఉపయోగించాలి.

​ముఖ్య గమనిక: ఈ హోమాలు, పరిహారాలు కేవలం గురువుల ఉపదేశం ప్రకారం, సరైన నియమ నిష్టలతో చేస్తేనే శీఘ్ర ఫలితాలను ఇస్తాయి. స్వయంగా చేయకూడదు. ఏదైనా తాంత్రిక పరిహారం చేసే ముందు ఒక అనుభవజ్ఞుడైన గురువు లేదా జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం తప్పనిసరి.

Wednesday, August 13, 2025

కాశీలోని_ద్వాదశ_12సూర్య_దేవాలయీలు

కాశీలోని_ద్వాదశ_12సూర్య_దేవాలయీలు


దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే 
శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి. 

1) కేశవాదిత్యుడు: ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని (కేశవుడు) గురువుగా స్వీకరించి, తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. శ్రీ ఆది కేశవ స్వామి ఆలయంలో (రాజ్ ఘాట్ ఫోర్ట్ దగ్గర ---> రాజ్ ఘాట్ వేరు... రాజా ఘాట్ వేరు. గమనించ గలరు..) కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది. విష్ణుమూర్తి కాశీకి వచ్చి, మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శనం చేయాలి.

2) మయుఖాదిత్యుడు: సూర్య భగవానుడు ధూత్ పాప, ధర్మ నదుల సంగమ స్థానం వద్ద  వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు, విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజురోజుకీ సూర్య కిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోయారు. గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుడిని చల్లబరిచారు. లోకాలకు ఉపశమనం కలిగించారు. నేటికీ ఈ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. ఇదే కిరణా నదీ ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్ లో కలుస్తుందట. 

సూర్యుడు ప్రతిష్టించిన పరమేశ్వర లింగం గాభస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళ గౌరి గా పంచ గంగా ఘాట్ లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యునిగా మంగళ గౌరీ ఆలయంలో వెలిసాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ తొలగి పోతాయని విశ్వసిస్తారు.

3) గంగాదిత్యుడు: లలితా ఘాట్ వద్ద గల నేపాలీ మందిరం క్రింద భాగాన ఉన్న గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధననష్టం ఉండదని అపమృత్యు భయం ఉండదని చెప్తారు.

4) అరుణాదిత్యుడు: గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు ఊరువులు లేకుండా జన్మించిన వినత పుత్రుడైన అనూరుడు. సంతుష్టుడైన రవి తన రధానికి సారధిగా నియమించుకున్నాడు. త్రిలోచన ఘాట్ లో, శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని  విగ్రహం క్రింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్య్రం దాపురించదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు. 

5) ఖగోళాదిత్యుడు: కద్రువ వద్ద దాస్యం తొలగిన తరువాత, వినత గరుత్మంతునితో కలిసి కాశీ చేరుకొని, తన తప్పులకు పరిష్కారం చేసుకోడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదించాడు. మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొంటారని  చెప్తారు. 

6) లోలార్కాదిత్యుడు: తులసీ ఘాట్ వద్ద, అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువుతీరి ఉంటారు లోలార్కాదిత్యుడు. నదీ సంగమ జలం అంతర్వాహినిగా కుండం లోనికి చేరుకుంటుంది. కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయని చెప్తారు.

7) సాంబాదిత్యుడు: నారదుని కారణంగా తండ్రి శాపానికి గురి అయ్యి కుష్ఠురోగం బారిన పడతాడు శ్రీకృష్ణ జాంబవతుల తనయుడైన సాంబుడు. తర్వాత కృష్ణుడి సలహా మేరకు కాశీ చేరి, విశ్వేశ్వరునితో పాటు, సూర్యనారాయణ స్వామిని కూడా నియమంగా ఆరాధిస్తాడు. ప్రభాకరుని కృపతో కుష్టు రోగం తొలగిపోతుంది. సూర్య కుండం (సూరజ్ కుండ్) వద్ద ఉన్న ఈ ఆదిత్యుని ప్రార్ధించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారట. 

8) ద్రౌపది ఆదిత్యుడు: శ్రీ కృష్ణుని సలహా మేరకు ద్రౌపది గంగా తీరాన సూర్య భగవానుని ధ్యానించింది. అభిమానంతో సూర్యుడు ఆమెకు అక్షయ పాత్ర అనుగ్రహించాడు. ఈ ద్రౌపది ఆదిత్యుని కొలిచిన వారి ఇంట ఐశ్వర్యానికి అంతు ఉండదని గ్రంధాలు తెలియజేస్తున్నాయి. అన్నపూర్ణాదేవి ఆలయం మరియు విశ్వేశ్వర స్వామి ఆలయాల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ ఒక పక్కగా ఈ స్వామి కనపడతారు.

9) ఉత్తరార్క ఆదిత్యుడు: జాతక రీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకొన్నది సులక్షణ. నియమంగా గంగా తీరాన సుర్యారాధన చేస్తుండేది. ఆమెతో పాటు ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే ఉండేది. కొంత కాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సులక్షణ, శివ పార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకొన్నది. బాలిక నిస్వార్ధ బుద్దికి సంతసించిన సర్వేశ్వరుడు శాశ్వత కైలాసం ప్రసాదించాడు. మేక మరు జన్మలో కాశీ రాజుకు పుత్రికగా జన్మించినది. స్థానికంగా 'బకరీ కుండ్' అని పిలిచే కోనేరులో స్నానమాచరించి, ఉత్తరార్క ఆదిత్యుని ఆరాధించిన వారికి ఇహ పర సుఖాలు లభిస్తాయట. వారణాశి సిటీ రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్ లో ఉంటుందీ మందిరం.

10) విమలాదిత్యుడు: అంతు తెలియని చర్మ వ్యాధితో బాధ పడుతున్న విమలుడు అనే బ్రాహ్మణుడు కాశీ వచ్చి అచంచల భక్తి శ్రద్దలతో దినకరుని ప్రార్ధించసాగాడు. స్వామి అనుగ్రహంతో అతని వ్యాధి సంపూర్ణంగా నిర్మూలించబడినది. విమలుడుకి ఆరోగ్యం ప్రసాదించిన స్వామిని విమలాదిత్యుడు అని పిలుస్తారు. ఖారీకువా గల్లీ (జంగంబారి)లో ఉండే విమలాదిత్యుని సేవించిన వారిని అనారోగ్య బాధలు దరి చేరవని చెప్తారు. 

11) వృద్దాదిత్యుడు: హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు. జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్ధించాడు. స్వామి కృపతో పునః యవ్వనాన్ని పొందాడు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తిరిగితే (కనుక్కుంటూ వెళ్ళాలి) అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ చిన్న గదిలాంటి మందిరంలో ఉన్న వృద్ద ఆదిత్యుని పూజించిన వారికి వృద్దాప్య బాధలు ఉండవని చెప్తారు. 

12) యమాదిత్యుడు: సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు, తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేసాడు. దర్శన భాగ్యం పొందాడు. యముడు ప్రతిష్టించిన శ్రీ యమేశ్వర స్వామిని, యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకొంటే, శాశ్వత స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని కాశీ ఖండం తెలుపుతోంది. సింధియా ఘాట్ లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు.

Tuesday, August 12, 2025

అష్ట సోమేశ్వర ఆలయాలు:

అష్ట సోమేశ్వర ఆలయాలు: 

 1) తూర్పు-- కోలంక: మండలం:- కాజులూరు:  స్వామివారు:- సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- ఉమాదేవి:   ప్రతిష్టించినది:- సూర్యుడు:   విష్ణాలయం:- కేశవ స్వామి, వెంకటేశ్వర స్వామి:   గ్రామ దేవతలు:- ఓరిళ్ళమ్మ, కొల పిల్లమ్మ... 2)  ఆగ్నేయం-- దంగేరు:   మండలం:- కె.గంగవరం:   స్వామి వారు:- ఉమా సోమేశ్వరస్వామి:   అమ్మవారు:- పార్వతీదేవి:   ప్రతిష్టించినది:- కశ్యపుడు:   విష్ణాలయం:- వేణుగోపాల స్వామి:   గ్రామ దేవతలు:- కట్లమ్మ, దారలమ్మ:    3) దక్షిణం-- కోటిపల్లి:   మండలం:- కె. గంగవరం:  స్వామివారు:- ఛాయా సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- రాజరాజేశ్వరి:   ప్రతిష్టించినది:-  అత్రిమహాముని:   విష్ణాలయం:- సిద్ది జనార్ధన స్వామి:   గ్రామ దేవత:-  ముత్యాలమ్మ:  4) నైరుతి-- కోరుమిల్లి:  మండలం:-  కపిలేశ్వరపురం:  స్వామివారు:- సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- రాజరాజేశ్వరి దేవి:   ప్రతిష్టించినది:- భరద్వాజుడు: విష్ణాలయం:-  జనార్ధన స్వామి:  గ్రామ దేవతలు:- దోర్లమ్మ:   5)  పడమర-- వెంటూరు:   మండలం:- రాయవరం:   స్వామివారు:- ఉమా సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- పార్వతీదేవి:   ప్రతిష్టించినది:- విశ్వామిత్రుడు:   విష్ణాలయం:- కేశవ స్వామి:   గ్రామ దేవతలు:-  మారెమ్మ:   6) వాయువ్యం-- సోమేశ్వరం:   మండలం:- రాయవరం:   స్వామివారు:-  సోమేశ్వర స్వామి:   అమ్మవారు:-  బాలా త్రిపుర సుందరి:   ప్రతిష్టించినది:-  గౌతముడు:   విష్ణాలయం:-  వేణుగోపాలస్వామి:   గ్రామ దేవతలు:-  బూరులమ్మ , బంతి బాపనమ్మ:   7)  ఉత్తరం-- వెల్ల:   మండలం:- రామచంద్రపురం:   స్వామివారు:- సోమేశ్వర స్వామి: అమ్మవారు:- బాలా త్రిపుర సుందరి:   ప్రతిష్టించినది:- వశిష్ఠుడు:   విష్ణాలయం:- వేణుగోపాలస్వామి:  గ్రామ దేవతలు:- పోలేరమ్మ:   8)  ఈశాన్యం-- పెనుమళ్ళ:  మండలం:- కాజులూరు:   స్వామివారు:- రాజ సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- పార్వతి దేవి:   ప్రతిష్టించినది:- జమదగ్ని:   విష్ణాలయం:- రామ మందిరం:  గ్రామ దేవతలు:-  పణుగుదాలమ్మ:      
 స్వామివారు:   1). సోమేశ్వర స్వామి-- 1.కోలంక- తూర్పు:  2.కోరుమిల్లి- నైరుతి:   3. సోమేశ్వరం- వాయువ్యం:  4. వెల్ల-ఉత్తరం:   2).  ఉమా సోమేశ్వర స్వామి--  1. దంగేరు- ఆగ్నేయం:  2. వెంటూరు- పడమర:  3). చాయ సోమేశ్వర స్వామి-- 1.కోటిపల్లి- దక్షిణం:  4). రాజ సోమేశ్వర స్వామి-- 1. పెనుమళ్ళ- ఈశాన్యం:   
అమ్మవారు:    1).రాజరాజేశ్వరీ దేవి-- 1. దక్షిణం-కోటిపల్లి:  2. నైరుతి- కోరుమిల్లి:   2). బాలాత్రిపురసుందరి-- 1.వాయువ్యం- సోమేశ్వరం: 2. ఉత్తరం- వెల్ల:  3). పార్వతి దేవి-- 1. ఆగ్నేయం- దంగేరు:     2. పడమర-వెంటూరు:  3. ఈశాన్యం- పెనుమళ్ళ:  4) ఉమాదేవి--  తూర్పు- కోలంక:
 విష్ణాలయం:   1). వేణుగోపాలస్వామి--1. వాయువ్యం- సోమేశ్వరం:  2. ఉత్తరం-వెల్ల:  3. ఆగ్నేయం- దంగేరు: 2). జనార్ధనస్వామి-- 1. దక్షిణం- కోటిపల్లి:  2. నైరుతి- కోరుమిల్లి:  3). కేశవ స్వామి-- 1. తూర్పు- కోలంక:  2. పడమర- వెంటూరు:  4). రామ మందిరం-- 1. ఈశాన్యం- పెనుమళ్ళ:
 మండలం: 1) కె. గంగవరం-- 1. ఆగ్నేయం- దంగేరు:   2. దక్షిణం- కోటిపల్లి:   2) రాయవరం-- 1. పడమర- వెంటూరు:  2. వాయువ్యం -సోమేశ్వరం:   3) కాజులూరు-- 1. తూర్పు -కోలంక:   2 ఈశాన్యం- పెనుమళ్ళ:  4)  కపిలేశ్వరపురం-- 1. నైరుతి- కోరుమిల్లి:   5) రామచంద్రాపురం--1. ఉత్తరం -వెల్ల:  
 1). కోలంక-- ఆత్రేయ నది దగ్గరలో... 2). దంగేరు-- కణ్వ నది దగ్గరలో... 3) కోటిపల్లి --గౌతమి నది దగ్గరలో... 5) సోమేశ్వరం-- తుల్యభాగా నది దగ్గరలో... 6) వెల్ల----------7)పెనుమళ్ళ-- ఆత్రేయ సాగరసంగమం... 8 వెంటూరు-- తుల్య సాగర సంగమం...

Sunday, August 10, 2025

శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా?

శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా?


*శంఖం పూరిచకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది*. 

పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. 

మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే. 

*అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు,దానికే పాంచజన్యం అని పేరు*. 

*దాని తరువాత వచ్చిన లక్ష్మి దేవిని కూడా స్వామి స్వీకరించాడు. ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు.* 

*దేముడు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.*
 
*ఈ శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం.*

దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజావిదానంలో వాడరు. 

ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీరంగు గీత ఉంటుంది. ఇది కుడి వైపు తెరుచుకుని ఉంటుంది.

 *ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే కంటికి సంబందించిన రోగాలు తగ్గుతాయి.*
 
*ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు.*

ఇది పేరుకి తగ్గట్టు ఎడమవైపుకి తెరుచుకుని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే. 

*ఇది ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకి  కూడా రావట.*

వైదికశాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. 

*దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది.*

 *1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్లీ నిర్ధారించారు.*

 *ఈ శంఖధ్వనికి రెండువేల ఆరువందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పి పోతాయట.*

అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబందిత వ్యాధులు దగ్గరకి రావట. 

ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రి పూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మసంబందిత వ్యాదులు దూరమవుతాయట. 

*ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ  తొలగిపోతాయి.* 

*శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట*. 

ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం.

శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి. 

*దీనిని  షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార,ధనాభివృద్ది కలుగుతుంది* . 

*శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు.*

 *ఏ ఇంట్లో శంఖాన్ని దేముడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందిట.*

 *ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాదించడం, పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతో మంచిది.*

                    *_🌻శుభమస్తు🌻_*

Thursday, August 7, 2025

త్రిపుర భైరవి అమ్మవారి ఆధ్యాత్మిక గంభీరత..........!!

త్రిపుర భైరవి అమ్మవారి ఆధ్యాత్మిక గంభీరత..........!!

త్రిపుర భైరవి అమ్మవారు దశమహావిద్యలలో ఒకరు. ఆమెను కాలభైరవుని శక్తి స్వరూపంగా భావిస్తారు. ఆమె శక్తి వినాశనానికి, రక్షణకు మరియు ఆధ్యాత్మిక శుద్ధికి ప్రతీక. ముఖ్యంగా, ఆమె మూలాధార చక్రాన్ని శుద్ధి చేసి, కుండలినీ శక్తిని ప్రేరేపించగల శక్తి కలిగి ఉంది.

పంచ కపాల ఆసనం అనేది వామాచార పద్ధతిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆసనం. ఇది మనిషి యొక్క ఐదు అహంకారాలకు ప్రతీకలు: శరీరం, మనస్సు, ప్రాణం, బుద్ధి మరియు చిత్తం. ఈ ఐదు అహంకారాలపై భైరవి అధికారాన్ని ప్రదర్శిస్తూ, భక్తుడిని సుదీర్ఘమైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది.

అఘోర, వామాచార పద్ధతులు.........

అఘోర మరియు వామాచార పద్ధతులు భయానకంగా కనిపించినప్పటికీ, అవి లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ పద్ధతులు అహంకారానికి వ్యతిరేకంగా, మాయ పట్ల నిరాసక్తతగా ఉండేలా చేస్తాయి. అఘోర మర్మం ఏమిటంటే, భయాన్ని అంగీకరించి దానిని త్రికరణంగా రూపాంతరం చేయడం.

నాగ శక్తి మరియు కుండలినీ...........

నాగాలు కుండలినీ శక్తికి ప్రతీకలు. నాగ శక్తి ఉండే స్థలాలు చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి, ముఖ్యంగా తాంత్రిక మరియు యోగిక పద్ధతుల్లో. త్రిపుర భైరవి అమ్మవారి పీఠం వద్ద నాగ శక్తి ఉండటం, కుండలినీ ప్రేరణకు గొప్ప సూచిక.

త్రిపుర భైరవి సాధన మరియు మంత్రాలు..........

అమ్మవారిని పిలవడం మరియు ఆమె అనుభూతిని పొందడం అనేది భక్తుని సాధన ఫలితంగా కలుగుతుంది. ఇది తాంత్రిక లేదా యోగిక మార్గాల్లో ఉన్నత స్థితికి సంకేతం. ఆత్మజ్ఞానం వైపు అడుగు వేయడానికి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి.

త్రిపుర భైరవి సాధనకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన మంత్రాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 * త్రిపుర భైరవి బీజ మంత్రం:
    ఓం ఐం భైరవ్యై నమః।
ఈ మంత్రం త్రిపుర భైరవి యొక్క మూల మంత్రం (బీజ మంత్రం)గా పరిగణించబడుతుంది. దీనిని రోజువారీ జపానికి ఉపయోగించవచ్చు.
  
 * త్రిపుర భైరవి మంత్రం:
   ఓం హ్రీం భైరవ్యై క్లీం స్వాహా।
ఈ మంత్రం అమ్మవారి శక్తిని, గ్రహణశక్తిని మరియు మార్పు శక్తిని ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా అహంకారాన్ని నిర్మూలించడానికి ఇది సహాయపడుతుంది.
  
 * త్రిపుర భైరవి మూల మంత్రం:
   ఓం శ్రీం హ్రీం క్లీం ఐం భైరవ్యై నమః।
ఈ మంత్రం సంపూర్ణ శక్తి త్రయిని కలిగి ఉంటుంది. దీనిని ప్రత్యేక పూజలలో లేదా సాధన సమయంలో ఉపయోగిస్తారు.
   
 * త్రిపుర భైరవి ధ్యాన శ్లోకం:

 కపాలమాలినీ రక్తవర్ణా త్రినేత్రీ చతుర్భుజా।
 దృగ్ధంశుపుష్పవదనా రక్తవస్త్రపరీవృతా॥
 రక్తమాల్యధరా దేవీ రక్తగంధానులేపనా।
సదా రక్తాభిరక్తాంగీ భైరవీ భయనాశినీ॥

ఈ ధ్యాన శ్లోకం త్రిపుర భైరవిని ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆమె శక్తి స్వరూపాన్ని మనస్సులో స్పష్టంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది.

త్రిపుర భైరవి పూజా విధానం........

ఈ పూజ ప్రత్యేకంగా శక్తి సాధన, అంతర్ముఖత మరియు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉద్దేశించబడింది. దీన్ని శుద్ధత, శ్రద్ధ మరియు మౌనమైన స్థితితో చేయాలి. మీరు ఇంట్లో అనుసరించడానికి వీలుగా ఉండే దక్షిణాచార పద్ధతి ఇక్కడ వివరించబడింది. వామాచార పద్ధతి మరింత అంతర్ముఖమైనది మరియు గురువు మార్గదర్శనంలో మాత్రమే చేయాలి.

త్రిపుర భైరవి పూజకు సంబంధించిన దినచర్య పద్ధతి:

 * స్థల శుద్ధి: పూజ స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి. గంగజలం లేదా తులసి గింజలతో గోమయ నీరు చల్లి శుద్ధి చేయాలి.

 * స్వశుద్ధి: స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పసుపు, కుంకుమ, తిలకం ధరించి సాత్విక స్థితిలో ఉండాలి.

 * ఆసనం: మెత్తని దిండు లేదా కంబళం వంటి సాధనాసనంపై కూర్చొని పశ్చిమ దిశకు ముఖం చేసి ఉండాలి.

 * దీపం వెలిగించడం: నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఎరుపు రంగు దీపాన్ని వాడితే మంచిది.

 * గణేశ పూజ: పూజకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి మొదట గణపతిని ప్రార్థించాలి.

 * ధ్యానం: త్రిపుర భైరవి రూపాన్ని ధ్యాన శ్లోకంతో ధ్యానించాలి.

 * మంత్ర జపం: "ఓం ఐం భైరవ్యై నమః" అనే బీజ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. రుద్రాక్ష లేదా సొరకాయ గింజల జపమాలను వాడవచ్చు.

 * నైవేద్యం: పంచామృతం, పండ్లు లేదా సాత్విక పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.

 * అర్చన: పుష్పాలతో "ఓం ఐం భైరవ్యై నమః" అని 108 సార్లు అర్చన చేయాలి.

 * ప్రార్థన: భక్తితో అమ్మవారిని ప్రార్థించి, మీ లోపాలను తొలగించి కుండలినీ శక్తిని మేల్కొలపమని కోరాలి.

 * ఆర్తి: దీపారాధన చేసి, భైరవి అష్టకం లేదా శక్తి అష్టకం పఠించాలి.

 * క్షమాపణ: పూజలో ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించమని అమ్మవారిని ప్రార్థించాలి.

మంత్ర జప పద్ధతి..........

మంత్ర జపం అనేది కేవలం పదాలను పలకడం మాత్రమే కాదు, శక్తిని ఆహ్వానించే ఒక ప్రక్రియ. ఇది శ్రద్ధతో మరియు సరైన నియమాలతో చేయాలి.

ముఖ్యమైన నియమాలు:

 * పరిశుద్ధత: స్నానం చేసి, శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. మనసులో ఎలాంటి కోపం, భయం, అలసత్వం లేకుండా ప్రశాంతంగా ఉండాలి.

 * స్థితి మరియు దిశ: తూర్పు లేదా పశ్చిమ దిశకు ముఖంగా కూర్చుని, నేల మీద నేరుగా కూర్చోకుండా కంబళం లేదా యోగాసనం ఉపయోగించాలి.

 * దీపం మరియు పుష్పాలు: ఎరుపు రంగు దీపపు కప్పులో నూనె దీపం వెలిగించి, మందారం వంటి పుష్పాలతో అమ్మవారిని పూజించాలి.

 * ధ్యానం: మంత్ర జపాన్ని ప్రారంభించడానికి ముందు, ఒక నిమిషం పాటు అమ్మవారి రూపాన్ని ధ్యానం చేయాలి.

 * మంత్ర జపం: కుడి చేతితో రుద్రాక్ష లేదా స్పటిక జపమాల ఉపయోగించి, ప్రతి రోజు 108 సార్లు జపం చేయాలి. జపం చేసేటప్పుడు అమ్మవారి రూపాన్ని మనసులో ఉంచుకోవాలి.

 * ఆవాహన: జపం పూర్తయ్యాక అమ్మవారికి ధన్యవాదాలు చెప్పి, జప ఫలాన్ని లోకక్షేమం కోసం అర్పించాలి.

జప పద్ధతిలో సూచనలు:

 * సమయం: ఉదయం బ్రహ్మ ముహూర్తం (4-6 గంటలు) లేదా రాత్రి 10 గంటల తర్వాత శాంతమైన సమయం మంచిది.

 * స్థలం: ప్రతిరోజూ ఒకే ప్రదేశంలో జపం చేయడం వలన స్థిరమైన శక్తి ఏర్పడుతుంది.

 * నియమిత జపం: కనీసం 21 రోజుల పాటు నిరంతరాయంగా జపం చేయడం మంచిది.

 * ధ్యాన స్థితి: జపం చేసేటప్పుడు పదాల కంటే భావానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

జాగ్రత్తలు:

 * ఒకసారి జపం మొదలుపెడితే, మధ్యలో ఆపకూడదు.

 * మీరు చేస్తున్న జపం గురించి ఇతరులకు చెప్పకుండా ఉండాలి. మీ శక్తి పరివర్తన అంతర్గతంగా జరగాలి.

 * మంత్ర జపం స్పష్టంగా, అర్థవంతంగా ఉండాలి.
మీరు ప్రారంభ స్థాయిలో ఉంటే, "ఓం ఐం భైరవ్యై నమః" అనే బీజ మంత్రంతో ప్రారంభించి, క్రమంగా మీ సాధనను పెంచుకోవచ్చు. గురు పరంపరను అనుసరించడం ఉత్తమం అయినప్పటికీ, ఈ పద్ధతిని పాటించడం ద్వారా త్రిపుర భైరవి మాత అనుగ్రహం పొందవచ్చు.

Wednesday, August 6, 2025

మన గుడివాడ షఠ్ శైవ క్షేత్రాలు - టూరిజం

మన గుడివాడ షఠ్ శైవ క్షేత్రాలు - టూరిజం


1) పెద్ద శివలయం - భీమేశ్వర స్వామి (బంటుమిల్లి రోడ్)

2) చిన్న శివాలయం - గౌరీ శంకర స్వామి (గౌరీ శంకర పురం)

3) బేతవోలు శివాలయం - ఆనందేశ్వర స్వామి (బేతవోలు)

4) పెద్ద ఎరుకపాడు శివాలయం రామ లింగేశ్వర స్వామి (పెద్ద ఏరుకపాడు)

5) వాసవీ చౌక్ శివాలయం- నగరేశ్వర స్వామి (వాసవీ చౌక్, బస్టాండ్ రోడ్)

6) బైపాస్ రోడ్ శివాలయం నాగ లింగేశ్వర స్వామి (బైపాస్ రోడ్)

Saturday, August 2, 2025

మంత్ర_జప_ప్రారంభ విధానం గురించి స్వామి వారు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వివరించారు...

మంత్ర_జప_ప్రారంభ విధానం గురించి స్వామి వారు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వివరించారు...



◆ #జప_సంకల్పం :
ముందుగా ఉద్ధరిణ, పంచపాత్ర తీసుకుని...

1. ఓం కేశవాయ స్వాహా 2. ఓం నారాయణాయ స్వాహా 3. ఓం మాధవాయ స్వాహా..
అని మూడు సార్లు ఆచమనం చేసి, ఆ తరువాత ప్రాణాయామం చేసి.....

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే _ _ _ దేశే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన _ _ _ సంవత్సరే _ _ _ ఋతౌ _ _ _ మాసే _ _ _ పక్షే _ _ _ తిథౌ _ _ _ వాసరే _ _ _ నక్షత్రే _ _ _ శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం _ _ _ గోత్రోద్భవస్య _ _ _ అహం శ్రీ _ _ _ పరదేవతా ప్రీత్యర్ధం పురశ్చరణ/ప్రయోజిత పూర్వక. శ్రీ _ _ _ మంత్ర జపం కరిష్యే...

అని సంకల్పం చెప్పుకుని ఉంగరం వేలితో పంచపాత్రలో నీటిని తాకవలెను. తరువాత మనసారా _ _ _ స్వామి/మాతకి నమస్కారం చేసుకుని జపానికి ఏ విఘ్నాలు కలుగకుండా ముందుగా...

◆ #శ్రీగణపతి_ప్రార్థన :
∬ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా  
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ∬

అని గణపతికి ముందుగా నమస్కారం చేయండి.

★★★ #గమనిక : పురశ్చరణ కోసం చేసే సంకల్పంలో తమ కోరికలు చెప్పుకోకూడదు, కేవలం దేవతా ప్రీతికొరకే సంకల్పించాలి.

◆ #గురు_వందనం :
∬ గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః  ∬

అని మీకు మంత్రదీక్ష ఇచ్చిన గురువుకి ముందుగా నమస్కరించండి....

☛【మంత్ర జపానికి ముందుగా ఇష్ట దేవతా పరిపూర్ణ అనుగ్రహం కోసం కవచ, స్తోత్రాలని పఠించండి.】

◆ #మంత్ర_దేవతాన్యాసము :
【న్యాస పద్ధతి ఏమంత్రమునకు ఆ మంత్రమునకు తెలిసికొని చేయవలెను.】

◆ #కరన్యాసం :
1. _ _ అంగుష్ఠాయ నమః
2. _ _ తర్జనీభ్యాం నమః 
3. _ _ మధ్యమాభ్యాం నమః
4. _ _ అనామికాభ్యాం నమః
5. _ _ కనిష్ఠికాభ్యాం నమః
6. _ _ కరతల కరపృష్టాభ్యాం నమః

◆ #అంగన్యాసము :
1. _ _ హృదయాయ నమః
2. _ _ శిరసే స్వాహా
3. _ _ శిఖాయై వషట్
4. _ _ కవచాయ హుం
5. _ _ నేత్రత్రయాయ వౌషట్
6. _ _ అస్త్రయ ఫట్

భూర్భువస్సువరోమితి దిగ్బంధః...

◆ #ధ్యాన_శ్లోకం :
【ఏ మంత్రమునకు ఆ మంత్ర దేవత ధ్యాన శ్లోకం
తెలిసికొని చేయవలెను.】

◆ #లమిత్యాది_పంచపూజలు :
పంచపాత్రలో నీటిని ఉద్ధరిణతో తీసుకుని శ్రీ _ _ పరదేవతాయై పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, అంటూ అరివేణం (పళ్ళెం)లో పోయాలి.

#లం పృథివీ తత్వాత్మికాయై శ్రీ _ _ పరదేవతాయై గంధం ధారయామి.
#హం ఆకాశతత్వాత్మికాయై శ్రీ _ _ పరదేవతాయై పుప్బైః పూజయామి.
#యం వాయుతత్వాత్మికాయై శ్రీ _ _ పరదేవతాయై ధూపం అఘ్రాపయామి.
#రం తేజస్తత్వాత్మికాయై శ్రీ _ _ పరదేవతాయై దీపం దర్శనయామి.
#వం అమృతతత్వాత్మికాయై శ్రీ _ _ పరదేవతాయై అమృత నైవేద్యం సమర్పయామి.

అని చెపుతూ ఉద్ధరణితో నీటిని ఐదు సార్లు అరివేణం (పళ్ళెం)లో వేయాలి.

◆ #జపమాల_మంత్రం :
మంత్ర జపాన్ని ప్రారంభించటానికి ముందు సాధకుడు జపమాలను చేతితో తీసుకుని కళ్ళకు అద్దుకుని మనసులో.......

∬ ఓం మాం మాలే మహామాయే సర్వమంత్ర స్వరూపిణి..
చతుర్వర్గ స్వయిన్యస్త సస్మాన్మే సిద్ధిదా భవ ∬

అని మనసులో తలచుకుని భక్తి పూర్వకంగా నమస్కరించి జపం చేయటం ప్రారంభించాలి.

◆ #గురు_మంత్రం :
మీకు దీక్షనిచ్చిన గురువు ద్వారా #గురుమంత్రోపదేశాన్ని పొంది ఆ మంత్రాన్ని మీ మూల మంత్రానికి ముందుగా ఒక మాలని, అలాగే జపం పూర్తయిన తరువాత ఒక మాలని జపం చేయాలి....... తద్వారా గురువు అనుగ్రహం లభించి దేవతా మంత్రసిద్ధి మీకు త్వరగా కలుగుతుంది.

➤ #మూల_మంత్రం :
【గురువు ఉపదేశించిన దేవతా మంత్రం.】

మూల మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో మౌనంగా మనస్సులో జపం చేయండి.

◆ #జపాంత_విధి : [దిగ్విమోచనం]
#సువర్_భువర్_భూరితి_దిగ్విమోకః.....

అని దిగ్విమోచనం చేసి, మరల దేవత ధ్యాన శ్లోకం చదివి, ఈ క్రింది విధంగా చెపుతూ జపసమర్పణ చేయాలి.

◆ #జప_సమర్పణ :
పై తెలిపిన విధంగా ప్రతిరోజూ నియమిత సంఖ్యలో జపం చేయటం పూర్తయిన తరువాత, తిరిగి మూడు సార్లు ఆచమనం చేసి కొన్ని నీళ్ళు చేతిలో తీసుకుని...

అనేన మయాకృతేన శ్రీ _ _ _ పరదేవతా మంత్ర జపేన శ్రీ _ _ _ పరదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. శ్రీ _ _ _ పరదేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్యర్ధం ఏతత్ జపఫలం శ్రీ _ _ _ పరదేవతా చరణారవిందార్పణమస్తు... తత్సత్ బ్రహ్మార్పణమస్తు....

అనీ ఆ నీటిని అరివేణం (ఒక పళ్ళెం)లో విడవాలి. అలా విడిచిన నీటిని మూడు సార్లు తీర్ధంగా తీసుకోవాలి.
【మీరు జపం చేసే అన్ని రోజులూ ఇదే విధంగా చేయాలి.】...🙏

➽ #జప_ప్రాశస్త్యం :
పైన తెలిపిన నియమాలను ఆచరిస్తూ అచంచల భక్తి విశ్వాసాలతో జపాన్ని చేస్తే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి.

∬ జపేన దేవతా నిత్యం స్తూయమానా ప్రసీదతి
ప్రసన్నా విపులాన్ఫోగాన్ దద్యాన్ముక్తించ శాశ్వతీం
యక్ష రక్షః పిశాచాశ్చ గ్రహాస్సర్వాశ్చ భీషణా:
జాపినం నోపసర్పంతి భయభీతా స్సమంతతః
యావంతః కర్మయజ్ఞానుస్స్యుః ప్రతిష్టాశ్చ తపాంసి చ
సర్వే తే జపయజ్ఞస్య కలాం నార్హంతి షోడశీం
మాహాత్యం వాచకస్మైత జ్ఞపయజ్ఞస్య కీర్తనం ∬

భావం:: జపం చేయటం ద్వారా స్తుతించబడ్డ #దేవతలు నిత్యం సాధకుడికి ప్రసన్నమై వుంటారు.......... వారికి #శాశ్వత_భోగ_మోక్షాల్ని ప్రసాదిస్తారు. యక్ష, రక్షః పిశాచాలు, దుష్టగ్రహాలు, జపంచేసే వాడిని చూసి భయపడతాయి.

తపస్సులు, కర్మయజ్ఞాలు, జపయజ్ఞంలో పదహారో భాగానికి కూడా సరిరావు...... ఈ చెప్పిన #జప_మహాత్మ్యం వాచికంగా చేసే జపానికే, దీనికి శతాధికంగా ఉపాంశు జపానికి, సహస్రాధికంగా మానసిక జపానికి మాహాత్మ్యం అధికమని శాస్త్రం చెబుతుంది...
🌹🙏🌹

http://www.siddheswaripeetham.org/
_

Thursday, July 31, 2025

శ్రీ విద్య -- తంత్రంలో ఒక ఉన్నతమైన మార్గం..........!!

శ్రీ విద్య -- తంత్రంలో ఒక ఉన్నతమైన మార్గం..........!!

శ్రీ విద్య అనేది కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు, ఇది తంత్ర శాస్త్రంలో అత్యంత ఉన్నతమైన, విస్తృతమైన మరియు సంక్లిష్టమైన ఆధ్యాత్మిక మార్గం. శక్తి ఆరాధనలో ఇది ఒక ప్రధాన సంప్రదాయంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ విద్య కేవలం ఆచారాలు, మంత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా, మంత్రం, యంత్రం, తంత్రం, యోగం, భక్తి మరియు జ్ఞానం అన్నీ సమ్మిళితమై ఉన్న ఒక సమగ్రమైన ఆధ్యాత్మిక పథం.

శ్రీ విద్య యొక్క ముఖ్య లక్షణాలు:

 * శ్రీచక్రం: శ్రీ విద్యకు కేంద్ర బిందువు శ్రీచక్రం. ఇది పవిత్రమైన జ్యామితీయ యంత్రం, విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయలను సూచిస్తుంది. ఇది త్రిపుర సుందరి దేవత యొక్క నివాసంగా భావిస్తారు. శ్రీచక్రంపై పూజ చేయడం శ్రీ విద్యలో అత్యంత ప్రధానమైన భాగం.

 * త్రిపుర సుందరి ఆరాధన: శ్రీ విద్య ప్రధానంగా త్రిపుర సుందరి దేవిని (లలితా మహా త్రిపుర సుందరి) ఆరాధిస్తుంది. ఈ దేవి సౌందర్యం, జ్ఞానం మరియు శక్తికి ప్రతీక.

 * మంత్రాలు: శ్రీ విద్యలో అనేక శక్తివంతమైన మంత్రాలు ఉంటాయి, ముఖ్యంగా పంచదశి మరియు షోడశి మంత్రాలు. వీటిని గురువు నుండి దీక్ష పొంది, నిష్టగా జపించడం ద్వారా సాధకుడు ఉన్నత చైతన్యాన్ని పొందుతాడు.

 * గురు పరంపర: శ్రీ విద్యలో గురు పరంపరకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సరైన గురువు ద్వారా దీక్ష పొంది, ఆయన మార్గదర్శకత్వంలోనే సాధన చేయాలి. గురువు లేకుండా శ్రీ విద్య సాధన చేయడం అసంభవం మరియు ప్రమాదకరం.

 * సాధనా పద్ధతులు: శ్రీ విద్యలో వివిధ రకాల సాధన పద్ధతులు ఉంటాయి:

   * బాహ్య పూజలు: శ్రీచక్ర పూజ, నవగ్రహ పూజలు వంటివి.

   * అంతర్గత పూజలు: కుండలినీ యోగం, ధ్యానం వంటి అంతర్గత సాధనలు.

   * వివిధ ఆచారాలు: తంత్ర శాస్త్ర నియమాలకు లోబడి చేసే ప్రత్యేక ఆచారాలు.

శ్రీ విద్య అనేది కేవలం ఆచారాలు మరియు మంత్రాలకే పరిమితం కాకుండా, సాధకుడిని ఆత్మజ్ఞానం మరియు దైవత్వంతో ఐక్యం చేసే సమగ్రమైన మార్గాన్ని అందిస్తుంది. ఇది మానవునిలోని సుప్తశక్తులను జాగృతం చేసి, అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ఒక ఉన్నతమైన తాంత్రిక మార్గం.

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS