Saturday, January 29, 2022

చతుర్ధామాలు (మఠాలు) వివరాలు

చతుర్ధామాలు (మఠాలు) వివరాలు:

🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳

మఠము-పీఠము :- 
~~~~~~~~~~~
సన్యాసులు,బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరుడు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు.

ద్వారకా మఠము :-
****************
ఈ మఠము శంకరులచే,దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించబడింది.దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. ఇది కీటవాళ సాంప్రదాయ మఠము.భూతదయతో నిత్యము కీటకములు మొదలైన వాటిని హింసించకుండా అహింసా వ్రతాన్ని ఆచరించడాన్ని కీటవాళ సాంప్రదాయమంటారు. ఈ మఠ సన్యాసులకు చివర 'తీర్ధ' అనిగాని 'ఆశ్రమ' అని గాని ఉంటుంది.ఈమఠానికి క్షేత్రం ద్వారక (గుజరాత్లో ఉంది); పీఠ దేవత సిద్ధేశ్వరుడు; పీఠ శక్తి భద్రకాళి; మఠము యొక్క మొదటి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యులలో ఒకడైన పద్మపాదాచార్యుడు; గోమతీ నది ఈపీఠ తీర్థము.ఇక్కడ ఉండే బ్రహ్మచారులను స్వరూపులని వ్యవహరిస్తారు.సన్యాసంతీసుకోబోయేముందు బ్రహ్మచారిగాచేరి శిక్షణపొంది సన్యాసం స్వీకరిస్తారు. స్వరూపులనే ఈ మఠ సన్యాసులు సామవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది.తత్త్వమసి అనేది ఈమఠంయొక్క మహావాక్యం.ఈ వాక్యం జీవ, బ్రహ్మల ఐక్యతను ప్రతిపాదిస్తుంది.బ్రహ్మచారులు అవిగత గోత్రానికి చెందినవారుగా పరిగణింప బడతారు.సింధు,సౌరాష్ట్ర,మహారాష్ట్రములు వాటి మధ్యనున్న పశ్చిమభారత ప్రాంతం ఈ మఠం పరిధిలోకి వస్తాయి.ఈ ప్రాంతంలో హిందూమతధర్మాన్ని సుస్థిరం చేయవలసిన బాధ్యత ఈ ద్వారకామఠానిది.

గోవర్ధన మఠము :-
****************
దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు.ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో ఉంది.ఈ మఠం భోగవార సంప్రదాయానికి చెందినది. ఇక్కడి సన్యాసులు 'వన','అరణ్య'అను యోగపట్టములు ధరిస్తారు.మఠక్షేత్రం పురుషోత్తమం (పూరీ);పీఠ దేవత పురుషోత్తముడు (జగన్నాథుడు; పీఠశక్తి వృషలాదేవి (సుభద్ర);మఠము యొక్క మొదటి ఆచార్యుడు హస్తామలకాచార్యుడు; మహోదధి ఈ మఠ తీర్థము.ఈమఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు.భోగమంటే విషయములు. ఎవరు జీవులను విషయ లంపటముల నుండి దూరంగా ఉంచేందుకు వారిస్తారో వారిది భోగవాళ సాంప్రదాయం.ప్రజల భోగలాలసత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది.'ప్రజ్ఞానం బ్రహ్మ' అనేది ఈ మఠం యొక్క మహావాక్యము.ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. ఇక్కడి బ్రహ్మచారులు కాశ్యపగోత్రీకులుగా పరిగణింపబడతారు. అంగ,వంగ,కళింగములు ఈ మఠ పరిధిలోని ప్రాంతాలు.ఈ ప్రాంత హిందూధర్మ పరిరక్షణ ఈ పీఠం బాధ్యత.

శృంగేరీ మఠము :-
****************
ఇది దక్షిణామ్నాయమఠమని, శారదాపీఠమనీ పిలువబడుతుంది.కర్ణాటక రాష్ట్రములోని శృంగేరి (శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది.ఈ పీఠ దేవత వరాహుడు; పీఠ శక్తి శ్రీ శారదాదేవి; పీఠ క్షేత్రం రామేశ్వరం; పీఠ తీర్థం తుంగ నది.ఇక్కడి బ్రహ్మచారులను చైతన్యులని పిలుస్తారు. ఈ మఠము యొక్క మొదటి అధిపతి సురేశ్వరాచార్యుడు.ఈ మఠ సన్యాసులు పదియోగపట్టములలో దేనినైనా స్వీకరించవచ్చు. వీరు భూరివాళ సంప్రదాయానికి చెందిన వారు.భూరి అంటే బంగారము అని అర్థము.ఏ సాంప్రదాయం మానవులను కాంచనశక్తి (ధన వ్యామోహం,ధర్మబద్ధమైన ధనాపేక్షకాక) నుండి వారిస్తుందో అది భూరివాళ సాంప్రదాయం.ఇక్కడ యజుర్వేదం ప్రత్యేకంగా పఠించబడుతుంది.అహం బ్రహ్మాస్మి అనేది ఈ మఠము అనుసరించే మహావాక్యం. వీరిది భూర్భువ గోత్రం. ఆంధ్ర, కర్ణాట, ద్రవిడ, కేరళ ప్రాంతములు ఈ మఠ పరిధిలోకి వస్తాయి.

జ్యోతిర్మఠము :-
*************
దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం; పీఠ దేవత నారాయణుడు; పీఠ శక్తి పూర్ణగిరి; పీఠ తీర్థం అలకనంద (గంగానది). వీరిది నందవాళ సాంప్రదాయం. ఈ మఠ సన్యాసులు "గిరి","పర్వత","సాగర" యోగపట్టములను ధరిస్తారు. ఇక్కడ అథర్వణ వేదము ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. అయమాత్మా బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యము. ఈ మఠానికి తోటకాచార్యుడు మొదటి అధిపతి. భారతదేశపు ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది.

శంకర మఠము{కంచికామకోటి పీఠము} :-
**************** ****************
సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా, శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.

ఈ మఠము శంకర మఠముగా కన్న కంచి మఠముగానే ప్రసిద్ధము.దీనిని సర్వజ్ఞ పీఠము అని కూడా అంటారు. ఇది దక్షిణదేశము లోని కాంచీపురము లో ఉన్నది. ఇక్కడి ఆచార్యుల యోగ పట్టనామము 'ఇంద్రసరస్వతి'. ఈ నామము శ్రీ చంద్ర శేఖర ఇంద్ర సరస్వతి,శ్రీ జయేంద్ర సరస్వతి,శ్రీవిజయేంద్ర సరస్వతి ఈ విధముగా వాడబడుతున్నది. కంచిపీఠములో దేవత చంద్రమౌళీశ్వరస్వామి, శక్తి కామాక్షీదేవి. ఈ పీఠప్రథమ ఆచార్యుడు సాక్షాత్తు ఆది శంకరుడే అంటారు.తన తర్వాత పీఠాధిపతి గా సర్వజ్ఞాత్ముడనే బాల సన్యాసిని ఏర్పరచి, శృంగేరీ పీఠాధి పతి అయిన సురేశ్వరాచార్యుడి సంరక్షణ లో ఉంచాడని కంచి పీఠం చరిత్ర చెబుతోంది .ఐదవ శతాబ్దము నుండి కంచి పీఠము విజయ పథములో నడుప బడుతున్నది. 🙏

మాఘమాసంలో శ్యామల నవరాత్రులు

మాఘమాసంలో శ్యామల నవరాత్రులు




మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను “శ్యామలా నవరాత్రులు” గా శ్రీవిద్యా సాంప్రదాయంలో  వ్యవహరించబడతాయి. 

చైత్ర మాసంలో వసంత నవరాత్రి 
ఆషాడ మాసంలో వారాహి నవరాత్రి
అశ్వయుజ మాసంలో శారదా నవరాత్రి 
మాఘ మాసంలో శ్యామల నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి

చైత్ర, అశ్వయిజ నవరాత్రులు అందరకీ తెలుసు. మిగిలిన రెండు గుప్త నవరాత్రులు. ఇవి కేవలము సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు. ఉత్తర భారతంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా  జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు. వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో  తొమ్మిదిరోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో అంటే నవదుర్గలుగా  అలంకరించి పూజలు చేస్తారు. 

దక్షిణ భారత దేశంలో ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారు. ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి. ఈ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు,  విద్య, ఐశ్వర్యం లబిస్తాయి. అంతేకాక బార్య భర్తల మద్య అన్యోన్యం, పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని  శాస్త్రం చెబుతుంది.

భండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీలలితాదేవి గా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో ఙ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన  శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది.  ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీ దేవి అని కూడా అంటారు.  ఈ తల్లిని దశ మహా విద్యల్లో  మాతంగి అని పిలుస్తారు. 

ఈ అమ్మరికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది? 
 
హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు  నీల సరస్వతి,  గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి  శ్యామల, సర్వసిద్ది మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామల, రాజ మాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి.

పూజా విధానం

ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి/శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలయినవరు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము.. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. వీలయితే చిలక పచ్చరంగు వస్త్రాలను గానీ, ఎర్రని వస్త్రాలను గానీ ధరించాలి. ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోండి.  ప్రసాదంగా పాయసాన్ని నివేదన చేయండి. 

తప్పకుండా శ్యామల షోడశ నామా స్తోత్రం పఠిచండి.

శ్యామల షోడశ నామా స్తోత్రం

హయగ్రీవ ఉవాచ |
తాం తుష్టువుః షోడశభిర్నామభిర్నాకవాసినః |
తాని షోడశనామాని శృణు కుంభసముద్భవ || ౧
 
సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రనాయికా |
మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియా || ౨

వీణావతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా |
నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ || ౩

సదామదా చ నామాని షోడశైతాని కుంభజ |
ఏతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్ |
తస్య త్రైలోక్యమఖిలం హస్తే తిష్ఠత్యసంశయమ్ || ౪

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే శ్రీశ్యామలా షోడశనామ స్తోత్రమ్ |

షోడశ నామా స్తోత్రం చదవలేని వాళ్ళు షోడశ నామాలు అయిన ఈ క్రింది 16 నామాలు తో పూజ చేసుకోండి. అవి 

1. సంగీత యోగిని 
2. శ్యామా
3. శ్యామలా
4. మంత్ర నాయిక
5. మంత్రిని
6. సచివేశి
7. ప్రధానేశీ
8. శుక ప్రియ
9. వీణా వతి
10. వైణికి
11. ముద్రిని
12. ప్రియక ప్రియా
13. నీప ప్రియ
14. కదంబెశి
15. కాదంబ వనవాసిని
16. సదామలా

ఈ  నవరాత్రులు మాములువి కావు, చాలా విశేషమైనవి. అందరూ శ్యామలా దేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహము పొందండి.

కాళికా దేవి

కాళికా దేవి


🌷శాంత స్వరూపిణి కాళి🌷

కాళీదేవి ప్రేమ స్వరూపిణి. కరుణ, దయ కలిగిన దేవత. అయితే చాలా మంది దృష్టిలో ఆమె క్రోధ స్వరూపిణిగా ఉంటుంది. రాక్షస సంహారం కోసం అవతరించినదేవత కాబట్టి ఆ సమయంలో తీవ్రంగానే ఉంటుందిగానీ.. మిగిలిన సమయాల్లో తన పిల్లల పట్ల ప్రేమ స్వరూపిణిగా ఉంటుంది. వాస్తవానికి దేవతలు నామానికి, రూపానికి, గుణానికి అతీతంగా నిర్గుణ పరబ్రహ్మ స్థితిలో ఉంటారు.

కానీ, తమ భక్తుల కోసం రకరకాల రూపాలను దాలుస్తూ ఉంటారు. అలాంటి ఒక సుగుణ స్వరూపం, శక్తి స్వరూపం, ఆనంద స్వరూపమే కాళి. దేవతలు సత్త్వ, రజస్‌, తమో గుణాలతో ప్రకాశిస్తూ ఉంటారు. అవతారాన్ని బట్టి రూపంలో మార్పు వస్తుంది. ఉదాహరణకు శైవంలో శివస్వరూపాన్ని చూస్తే సత్వ గుణ ప్రధానంగా ధవళ వర్ణంలో శివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. రజోగుణం ప్రధానంగా లలితాదేవి భర్తగా సకల కామ్యములను సిద్ధింపచేసే కామేశ్వరునిగా.. తమోగుణం ప్రధానంగా సంహార స్వరూపునిగా రుద్రునిగా.. ప్రకాశిస్తూ ఉంటాడు. ఏ గుణం అధికంగా ఉంటే ఆ రూపాన్ని ధరిస్తాడు. కాళీ దేవి విషయంలో కూడా ఈ విధంగానే ఉంటుంది. సత్త్వగుణంతో చంద్రస్వరూపిణిగా.. చంద్రకాళిగా వరాలిస్తుంది.

రజోగుణ ప్రధానంగా ఐశ్వర్య కాళి, భద్రకాళి రూపాలుంటాయి. తమోగుణ ప్రధానంగా ఉగ్రకాళి రూపం ఉంటుంది. కాళిదేవిని యుద్ధ స్వరూపిణిగా, తీవ్ర స్వరూపిణిగా భావించే చిత్రపటాలు గీసింది రాజా రవివర్మ. ఆయన గీసిన చిత్రాలలో అమ్మవారి రూపం భీకరంగా ఉంటుంది. నాలుక బయటకు చాచి ఉంటుంది. చాలా మంది అది క్రోధ స్వరూపంగా భావిస్తారు. కానీ అది దేవతను గుర్తుపట్టే ఒక చిహ్నం మాత్రమే.

రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించడానికి కాళీమాత తన నాలుకను చాస్తుంది. అంటే రాక్షస సంహారం వేళ మాత్రమే ఆమె నాలుకను చాచింది తప్ప అంతకు పూర్వం లేదు. తన భక్తులతో మాట్లాడేటప్పుడు ఆ నాలుక బయటకు ఉండదు కదా! ఆమె తన నాలుక సాయంతో ఆ రాక్షస సంహారం చేసి, భక్తులను రక్షించింది కాబట్టి ఆ నాలుకను చూసినప్పుడు అమ్మ తమను ఎలా రక్షించిందో అన్న విషయం గుర్తు చేసుకోవాలి.

చాలా మంది ఇంద్రియ నిగ్రహం కోసం- నాలుకను చాచి ఉన్న కాళీ రూపాన్ని పూజిస్తారు. తెనాలి రామకృష్ణుడికి, కాళిదాసుకు- వారి నాలుకలపై బీజాక్షరాలను లిఖించి అనంతమైన వాక్‌శక్తిని, వాచ్‌చాతుర్యాన్ని అనుగ్రహించినట్లే తమకు కూడా అనుగ్రహిస్తుందని చాలా మంది ఈ రూపాన్ని పూజించడానికి ఇష్టపడతారు. కాళీ దేవి రకరకాల రూపాలలో తన భక్తులను అనుగ్రహిస్తుంది. ఆమె శారద స్వరూపిణిగా విద్యను, సంతాన కాళిగా సంతానాన్ని, భద్రకాళిగా అధికారాన్ని, ఐశ్వర్య కాళిగా ఐశ్వర్యాన్ని, చంద్రకాళిగా మనశ్శాంతిని అనుగ్రహించగలదు. మహాకాళిగా దుష్టసంహారాన్ని చేస్తుంది.

🌷యోగ మాయ నర్తనకేళి.. భద్రకాళి🌷

కాళికాదేవి అవతారాలలో ‘భద్రకాళి’ అవతారం, ఆ రూపం చాలా ప్రసిద్ధమైనవి. భద్ర శబ్దానికి మంచి, శుభం అనే అర్థాలున్నాయి. సంస్కృతంలో ‘భ’ అంటే మాయ. ద్ర అంటే అధికమైనది. అన్నిటి కన్నా అధికమైన మహామాయ కాళి అని దీని అర్థం. మన తెలుగురాష్ట్రాల్లో ప్రాచీన కాలం నుంచి కాళీ ఆరాధన ఉంది.

వరంగల్‌లో భద్రకాళి ఆలయం ప్రసిద్ధమైనది. మురమళ్ల వంటి ప్రాంతాల్లో కూడా ఈ ఆరాధన ఉంది. ఈ మహామాయేనే యోగమాయగా.. కాళికగా పూజిస్తారు. ఒకసారి యోగ మాయ ప్రభావంతో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి జారుకోగా.. ఆ సమయంలో లోకమంతా అరాచకం ప్రబలిపోయింది. అప్పుడు బ్రహ్మ కాలస్వరూపిణి అయిన ఆ యోగమాయను ప్రార్థించగా.. ఆ తల్లి కాళికా అవతారములో వచ్చి తన మాయను విష్ణువు మీద నుంచి ఉపసంహరిస్తుంది. దీనితో విష్ణువు యోగనిద్ర నుంచి లేచి మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులను సంహరించి లోకాన్ని రక్షిస్తాడు. సాధారణంగా విశ్వరూపం అంటే శ్రీకృష్ణుడే గుర్తుకు వస్తాడు.

కానీ యోగ వాశిష్టంలో కాళికాదేవికి సంబంధించిన విశ్వరూప వర్ణన కనిపిస్తుంది. ‘ప్రళయకాలంలో అంధకారమైన ఆకాశంలో, ఛాయా రూపాన్ని ధరించి. అగ్నిజ్వాలల మధ్య.. అతి దీర్ఘమైన రూపాన్ని ధరించి ప్రకాశిస్తోంది. ఆమె రూపం అనంతమైన విశ్వమంతటా వ్యాపించి ఉంది. అనంతమైన ఆ దేవి శిరస్సును చూడాలంటే ఆకాశంలోకి.. పాదాలను చూడాలంటే పాతాళంలోకి ప్రయాణం చేయాలి. ఇక తాండవ సమయంలో ఒక్క క్షణం ఒంటికాలి మీద ఆడుతున్నదా అనిపిస్తుంది. మరుక్షణంలో వందల కాళ్లతో నర్తిస్తున్నదా? అనిపిస్తుంది. ఇంకొక క్షణం అసలు పాదాలు లేవా అన్నంత వాయువేగంతో నర్తిస్తోంది. పోని ఆమె ముఖాన్ని దర్శించుకుందామా అంటే కొంత సేపు ఒకే ముఖంతో.. మరి కొంత సేపు వేల, లక్ష ముఖాలతో.. అసంఖ్యాకమైన చేతులతో కనిపిస్తోంది.

ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసముల తీవ్రతకు మేరు పర్వతాలు ఎగిరిపోయేటట్లుగా ఉన్నాయి. మలయ, సహ్య, మందర మొదలైన పర్వతాలు ఆమె కంఠంలో వ్రేలాడుతున్న మాలలాగ కనిపిస్తున్నాయి. రజత వర్ణంలో హిమాలయం, సువర్ణ వర్ణంలోని సుమేరు పర్వతం ఆమె చెవులకు ఆభరణములుగా వెలుగొందుతున్నాయి. మూడు లోకాలు ఆమెకు ఆభరణాలుగా కనిపిస్తున్నాయి. అఖిల బ్రహ్మండాలు ఆమె నడుముకు కట్టిన మేఘాల వడ్డాణంలా భాసిల్లుతున్నాయి. సమస్త లోకములు, బుతువులు, రాత్రిపగలు- ఆమె శరీర అవయవములు అయ్యాయి..’’ - అనే కాళి వర్ణన చదువుతుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.

🌷శివ కాళీ రహస్యం🌷

కొన్ని కాళీదేవి చిత్రాలలో శివుడు ఆమె పాదాల దగ్గర కనిపిస్తాడు. సాధారణంగా భార్యల కాళ్ల దగ్గర కూర్చున్న దేవుళ్లు తక్కువ. రాధాకృష్ణ సంప్రదాయంలో రాధాదేవి పాదాల దగ్గర కృష్ణుడు కూర్చుని పాదసేవ చేసే రూపాలు మనకు దర్శనమిస్తాయి. శాక్తేయ సంప్రదాయంలో కాళీదేవి చిత్రాలలో శివుని రూపం ఆమె పాదాల కింద ఉన్నట్టు కనిపిస్తుంది. దీని వెనకున్న కథను మన పురాణాలు చెబుతాయి. అదేంటంటే.. ఒకసారి యుద్ధరంగంలో రాక్షస సంహారం తర్వాత ఆ జగన్మాత క్రోధకాళిగా మారి నాట్యం చేయటం మొదలుపెట్టింది. ఆ రూపాన్ని చూసి అందరూ భయభ్రాంతులయ్యారు.

ఆమె భర్త శివుని వద్దకు వెళ్లి అందరూ ఆ క్రోధ స్వరూపాన్ని ఉపసంహరింపజేయాల్సిందిగా ప్రార్థించారు. యుద్ధరంగంలోకి వచ్చిన శివుడు అమ్మవారి నాట్యం చూశాడు. ఆ దృశ్యమే భీకరంగా ఉంది. ఒక వైపు రాక్షసుల శరీరాలు.. మరోవైపు ఏరులై పారుతున్న రక్తం. వాటి మధ్య కాళీదేవి నృత్యం. ఆమె నృత్యాన్ని ఆపేదెలాగా అని ఆలోచించిన శివుడు. రాక్షసుల మృత దేహాల మధ్య పడుకున్నాడు. ఆ తల్లి యుద్ధరంగం అంతటా నాట్యం చేస్తూ శివుని దగ్గరకు వచ్చింది. ఆమె పాదం శివుని హృదయానికి తగిలింది. అప్పుడు ఆమె శివుని గుర్తించి.. తన క్రోధ స్వరూపాన్ని ఉపసంహరించుకుంది. ఇంకొక కథ ప్రకారం.. మహాప్రళయం వేళ అమ్మవారు ప్రళయతాండవం చేస్తోంది.

ఆ తాండవానికి లోకాలన్నీ భయభ్రాంతులవుతున్నాయి. దేవతల ప్రార్థనల మేరకు శివుడు కాళీదేవి దగ్గరకు వెళ్లి- ‘‘దేవి! నీవు అత్యంత శక్తిస్వరూపిణినివి. నీ ప్రళయ తాండవం వల్ల సమస్తలోకాలు దద్దరిల్లిపోతున్నాయి. అందరూ నీ శక్తిని తట్టుకోలేకపోతున్నారు. నీ శక్తిని నేను మాత్రమే భరించగలను. అందుకు నీ పాదం నా హృదయం మీద మోపు’’ అని కోరాడు. అప్పుడు కాళీదేవి తన పాదాన్ని శివుని గుండెపై మోపి శివారూఢ అయింది. దీనికి సంబంధించిన మరో కథ కూడా మన పురాణాల్లో ఉంది. ఒక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో- ‘‘స్వామి.. నేను ఎన్నో రూపాలు ధరించాను. సప్త మాతృకా స్వరూపాలతోను, నవదుర్గ రూపాలతోను, దశమహావిద్యల రూపాలతోను ప్రకాశిస్తూ ఉంటాను. నేను ధరించిన రూపాలలో ఏది మీకు ఎక్కువ ఇష్టం అని అడిగింది. దానిని పరమేశ్వరుడు- ‘‘నీవు ధరించిన రూపాలన్నింటిలోను కాళీ స్వరూపం అంటే చాలా ఇష్టం.’’ అన్నాడు. అప్పుడు పార్వతీదేవి- ‘‘స్వామి అందరూ నా సుకుమారమైన లలితా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కానీ మీకు కాళీ రూపం ఇష్టమంటే ఆశ్చర్యంగా ఉంది..’’ అంది.

అప్పుడు పరమేశ్వరుడు- ‘‘నీవు చెప్పింది నిజమే. లలితా స్వరూపం అతి సుందరమైనది. కామేశ్వరుడిగా నేను నీ పక్కనే ఉన్నా. ఇలా ప్రతి రూపంలోను నీ వెంట ఉన్నా. అయితే కాలమునకు అధిదేవతగా కాళిగా ఉన్నప్పుడు నిడారంబరంగా, నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశించావు. జ్ఞాన స్వరూపిణిగా వన్నెకెక్కావు. అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నా..’’ అని చెప్పాడు.

🌷షోడశ కళల కాళి🌷

లలితాదేవి నామావళిలో పద్మనాభ సహోదరి అని ఉంది. ఆమె విష్ణుమూర్తి సహోదరిగా ఎప్పుడు అవతరించింది అంటే కాళీగాథలలో ఆ విశేషం కనిపిస్తుంది. సృష్టి ప్రారంభవేళ అండాల నుండి సమస్త సృష్టి మొదలు అయింది. ఒక అండం నుండి బ్రహ్మ, లక్ష్మీదేవి; మరొక అండం నుండి శివుడు, సరస్వతీదేవి; ఇంకొక అండం నుండి నారాయణుడు, నారాయణి (కాళి) ఉదయించారు. ఒకే అండం నుండి ఉద్భవించినవారు ఒకే తల్లి పిల్లలు. అందుకే ఒకే వర్ణంతో ప్రకాశిస్తారు. అందుకే నారాయణుడు, అతని సహోదరి అయిన నారాయణి నల్లగా ఉంటారు. అలాగే కాళీదేవి పద్మనాభ సహోదరిగా ఈ భూమి మీద అవతరించింది. బృందావనంలో యశోదానందులకు కాళీదేవి ఆడపిల్లగా పుట్టింది, మగపిల్లవాడు కూడా పుట్టాడట. వసుదేవుడు తీసుకువచ్చిన మగశిశువు యశోదకు పుట్టిన మగశిశువు ఒకేలాగ ఉన్నారుట. యశోద ప్రక్కన పడుకున్న మగశిశువులో వసుదేవుడు తెచ్చిన పిల్లవాడు కలిసిపోయాడట (గోలోక కృష్ణుడు ప్రేమస్వరూపుడు. నారాయణ కృష్ణుడు రాక్షససంహారి. ఇద్దరూ ఒకే శరీరంలో 12 ఏళ్లపాటు ఉన్నారని బృందావన సంప్రదాయ పురాణాలు చెబుతున్నాయి.) నందుని కుమార్తెగా పుట్టిన యోగమాయ కాళీదేవిని నందా, నందిని అని అంటారు. ఆమెనే పద్మనాభ సహోదరిగా చెబుతారు. అంతే కాక దేవీభాగవతంలో కాళీదేవి అవతరణ విశేషాలను చెపుతూ ఆమెను యోగమాయగా, మహామాయగా చెప్పారు.

లలితానామాలలో ఆమెను మహామాయ అని అన్నారు. అంతేకాక యుద్ధరంగంలో కాళీదేవి చండముండాసురులను సంహరించింది. చండముండాసుర నిషూదిని, మహాకాళి అని లలితానామాలలో కనిపిస్తాయి. ఇంకా ఎన్నో నామాలలో కాలస్వరూపిణిగా లలితాదేవిని వివరించారు. ఇలా లలితా సహస్రనామాలలో కాళీదేవికి చెందినఎన్నో విశేషాలు, నామాలు కనిపిస్తున్నాయి. కనుక ఎందరో భక్తులు లలితాదేవి, కాళీదేవి యిద్దరూ ఒక్కరే అని విశ్వసించి ఆరాధిస్తున్నారు. ఇద్దరూ/అంతకన్నా ఎక్కువ దేవతల మంత్రాలను ఒకే మంత్రంగా సాధన చేసే విధానాన్ని మంత్రశాస్త్రంలో మంత్ర సంపుటీకరణ అంటారు. లలితాదేవి, కాళీదేవి మంత్రాలను సంపుటీకరించి కొందరు శాక్తేయులు సాధన చేస్తున్నారు. షోడశ కళలతో ప్రకాశించే చంద్రస్వరూపిణిగా లలితాదేవిని, చంద్రకాళి, చంద్రస్వరూపిణిగా కాళీదేవిని ఆరాధిస్తారు. ఇద్దరూ చంద్రస్వరూపమే కాబట్టి ఈ మంత్రాలను సంపుటీకరించి లలితా (చంద్ర)కాళిగా మనశ్శాంతి కోసం (విశేషించి పౌర్ణమి వేళ) అర్చిస్తున్నారు. లలితాకాళి మంత్రం సాధన చేసి ఎటువంటి కష్టాన్ని అయినా పోగొట్టుకోవచ్చు. అందుకే ఎందరో కాళీభక్తులు లలితాకాళిగా ఆమెను ఉపాసించి సత్ఫలితాలను పొందుతున్నారు.

🌷కృష్ణకాళి🌷

కృష్ణావతారంలో, కృష్ణుని జీవితంలో కాళీ దేవి పాత్ర అడుగడుగునా కనిపిస్తుంది. బృందావన సంప్రదాయంలో కృష్ణుడు, కాళీ దేవి ఒక్కరే అనే భావన కనిపిస్తుంటుంది. కృష్ణకాళిగా, కృష్ణ స్వరూప కాళిగా అమ్మవారి ఆరాధన కనిపిస్తుంది. కృష్ణ కాళి దేవాలయం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన అద్భుతమైన సంఘటనలను తెలియజేసే విశేషాలు మనకు కాళికా పురాణం, బృందావన స్థల పురాణ కథలలో కనిపిస్తాయి.

ఆ కథల్లో ఒకదాని ప్రకారం.. యశోద సోదరుడు శతగోపుడు. ఆయన భార్య రాధ (బృందావనేశ్వరి, గోలోక నాయిక అయిన రాధాదేవి వేరు. కృష్ణుని మేనమామ భార్య పేరు కూడా రాధ. అందుకే చాలా మంది రాధ అంటే కృష్ణుని మేనత్త అనుకుంటారు. కానీ ఆమె వేరు. ఆ స్వామి ప్రాణాధిక అయిన రాధాదేవి వేరు). ఆమె చిన్నప్పుడు కృష్ణుని ఎత్తుకొని పెంచింది. చిన్నికృష్ణుని సౌందర్యాన్ని ఆరాధించింది.
ఆయన అనుగ్రహం పొందింది. అందుకే కృష్ణుడు ఆమె కోసం యువకుడిగా మారి విహరిస్తూ ఉండేవాడు.

అది చూసి కొందరు శతగోపునికి ఆ విషయం చెప్పారు. ఒకసారి రాధతో కృష్ణుడు ఉన్నప్పుడు కొంతమంది శతగోపుని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లి చూస్తే.. రాధాదేవి కాళీ దేవి విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా కనపడింది. దీంతో వారంతా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిన తర్వాత కాళీదేవి విగ్రహం కృష్ణునిగా మారిపోయింది. శతగోపుని రాకను గుర్తించిన కృష్ణుడు రాధను రక్షించడం కోసం అలా కాళిగా మారాడు. ఈ కథ బృందావన గాథలలో చాలా ప్రసిద్ధమైనది. అలాగే.. నరకాసురుని జీవితంలో కూడా కాళీదేవి ప్రధాన పాత్రగా కనిపిస్తున్నది.

నరకుని ఆరాధ్య దైవం కామాఖ్య కాళి. ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది ఎన్నో అద్భుతమైన శక్తులు సాధించాడతడు. కానీ.. అతడు అధర్మబద్ధమైన సాధనలు చేయడం వల్ల కాళీ దేవి అతడి వద్ద నుంచి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ తల్లి నరకునికి కనిపించలేదు. నరకుని మరణ సమయంలో మాత్రం.. కృష్ణుడిలో కాళి కనిపించింది. అధర్మాన్ని నశింపజేయడానికి అలా కృష్ణ కాళిగా వచ్చి నరకుని సంహరించిందన్నమాట. కృష్ణ కాళిగా అమ్మవారిని భక్తితో, ప్రేమ భావనతో పూజిస్తే ఆమె కృష్ణ స్వరూపిణిగా, ప్రేమ స్వరూపిణిగా, కృష్ణునిగా అనుగ్రహిస్తుంది. బృందావనంలో ప్రవేశించిన ఎందరో సిద్ధులు కృష్ణుడే కాళి అని తెలుసుకుని కృష్ణ కాళిగా పూజించి అనుగ్రహం పొందారు.

🌷కవిత్వం, విద్య, జ్ఞానం..కాళీ ప్రసాదం🌷

కాళీదేవి విద్యకు, కవిత్వానికి, జ్ఞానానికి అధిదేవత. శారదా స్వరూపిణిగా కాళీ మాత ఎందరికో కవిత్వాన్ని, పాండిత్యాన్ని అనుగ్రహించింది. ఆమెను గురించి తపస్సు చేసిన ఎందరినో మహాకవులుగా తీర్చిదిద్దింది. చదువురాని కాళిదాసు.. కాళీదేవి ఆలయానికి వెళ్లి తన మూఢభక్తితో, అమాయకత్వంతో ఆ తల్లిని మెప్పించాడు. అమ్మ అతని నాలుక మీద తన చేతితో బీజాక్షరాలను రాసిన మరుక్షణం నుండి అతని వాక్కుకు అనంతమైన శక్తి వచ్చింది. అమాయక యువకుడు కాస్తా ‘‘మహాకవి కాళిదాసు’’ అయ్యాడు. రఘువంశం, కుమార సంభవం వంటి అద్భుతమైన కావ్యాలను సృష్టించాడు.

అమ్మవారి గురించి ఎన్నో స్తోత్ర రచనలు చేశాడు. తాను రచించిన ‘కాళీ కర్పూరాంబ స్తోత్రం’లోని మొదటి శ్లోకంలో ‘‘జపతి జడ చేతా అపి కవిః’ అని పేర్కొన్నాడు కాళిదాసు. అంటే.. ఎవరైతే కాళీ మంత్ర జపం చేస్తారో, వారు జడులైనా సరే అమ్మవారి అనుగ్రహంతో కవి అవుతారు అని అర్థం. మన తెలుగు సాహిత్యంలో తెనాలి రామకృష్ణుడి ప్రతిభా కాళీ మాత వరప్రసాదమే. ఒకప్పుడు కాళీదేవిని గురించి తీవ్రమైన తపస్సు చేసిన రామకృష్ణుడు.. ఆమె అగ్రహానికి గురై, ఆనక ఆ తల్లి అనుగ్రహం పొంది వికటకవి అయ్యాడు. కాళీ దేవి ఆరాధనకు పెట్టిందిపేరైన బెంగాలులో రామప్రసాద్‌ అనే యువకుడు గురుముఖతా కాళీ మంత్రం ఉపదేశం పొంది.. తీవ్రమైన సాధన చేసి అమ్మ అనుగ్రహం పొందాడు. ఆయనతో పాట పాడించుకొని వినటానికి సాక్షాత్తు కాశీ అన్నపూర్ణా దేవి వచ్చిందని ఆయన జీవిత చరిత్రలో కనిపిస్తున్నది. బెంగాలులో అమ్మ పాటలు అంటే రామప్రసాద్‌ రచించిన పాటలే. రామకృష్ణ పరమహంస యావజ్జీవితం ఈ పాటలే పాడుకునేవారు. ఉజ్జయినిలో భర్తృహరికి కూడా అమ్మవారి అనుగ్రహం వల్లనే కవితా ధార, సిద్ధ శక్తులు లభించాయని స్థలపురాణం. ఇలా మరెందరికో ఆ తల్లి విద్యను అనుగ్రహించింది. కాళీదేవి ముఖంలో కనిపించే నాలుక వాక్శుద్ధికి, వాక్చాతుర్యానికి చిహ్నం. అందుకే విద్య కోసం, జ్ఞానం కోసం స్పటిక మాలతో ఆమె మంత్రాన్ని జపిస్తూ ఆమెను ‘‘విద్యాకాళి’’గా ఆరాధిస్తే జడుడు సైతం మహాకవి కాగలుగుతాడు.

🌷ఐశ్వర్య కాళి🌷

కాళీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. ఐశ్వర్యం అంటే కేవలం సిరిసంపదలు మాత్రమే కాదు. ఐశ్వర్యం అంటే అధికారం (రాజ్యాధికారం), వైభవం కూడా. ‘‘ఐశ్వర్య కాళి’’గా అమ్మవారిని ఆరాధిస్తే ఆమె వీటన్నింటినీ అనుగ్రహిస్తుంది. అలా అమ్మవారిని అర్చించి, ఆమె కోసం తపస్సు చేసి విక్రమార్కుడు, భట్టి, నరకాసురుడు, తెనాలి రామకృష్ణ మొదలైనవారు ఐశ్వర్యాన్ని పొందారు. ఉజ్జయినీ మహా కాళి శక్తిస్వరూపిణి. ఆమె ఐశ్వర్యకాళిగా భట్టి విక్రమార్కులను అనుగ్రహించింది. విక్రమార్కుని జీవితకథలో అమ్మవారి అనుగ్రహానికి సంబంధించిన ఘట్టం కనిపిస్తున్నది. అదేంటంటే.. విక్రమార్కుని దగ్గరకు ఒక మంత్రగాడు వచ్చి ఉజ్జయిని కాళిని పూజించడానికి ఆయన సాయం కావాలని కోరతాడు. అందుకోసం శ్మశానం నుండి బేతాళుడు ఆవహించి ఉన్న శవాన్ని తీసుకురావాలని చెబుతాడు.

మహావీరుడైన విక్రమార్కుడు బేతాళుడు ఆవహించిన శవాన్ని తీసుకొని వస్తూ ఉండగా, బేతాళుడు అనేక కథలు చెప్పి ప్రశ్నలు అడగడం విక్రమార్కుడు జవాబులు చెప్పడం, మళ్లీ బేతాళుడు శ్మశానానికి వెళ్లిపోవటం తెలిసిన కథే. చివరికి బేతాళుడు చెప్పిన ఒక కథకు విక్రమార్కుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. అతడి బుద్ధిబలానికి మెచ్చిన బేతాళుడు.. ‘విక్రమార్కా ఆ మాంత్రికుడు నిన్ను బలి యివ్వడం కోసమే ఇదంతా చేస్తున్నాడు’ అని చెబుతాడు. అప్పుడు విక్రమార్కుడు.. ఉజ్జయిని మహాకాళిని ప్రార్థించి, ఆమె అనుగ్రహంతో, మాంత్రికుని తన ఖడ్గంతో సంహరించగా కాళీదేవి ఐశ్వర్యరూపిణిగా ప్రత్యక్షం అయి ‘‘నాయనా! దుష్టసంహారం చేశావు. ధర్మాన్ని రక్షించావు. ఏం కావాలో కోరుకో’’ అని అన్నది. 1000 సంవత్సరాలు రాజ్యపాలన, అష్టైశ్వర్యాలు కావాలని విక్రమార్కుడు వరం అడిగాడు. ఆ తరువాత భట్టి కూడా 2000 సంవత్సరాల ఆయుర్దాయం, అష్టైశ్వర్యాలను వరంగా పొందాడు. అమ్మవారిని ఎర్రతామరలతో విశేషించి ఎర్రకలువలతో (కాళీ సాధనలో కలువ పూలకు ప్రాధాన్యం) పూజిస్తే ఆమె ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. తామరగింజల మాలతో కాళీ మంత్ర జపం చేసి సిరిసంపదలను పొందవచ్చును.

🌷కల్యాణ కాళి.. సంతాన కాళి🌷

పెళ్లి కానివారు కాళీమాతను ఆరాధిస్తే.. శీఘ్రంగా వివాహం అయ్యేటట్టుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. వివాహ సిద్ధి కలిగించే మంత్రదేవతగా, కల్యాణ కాళిగా ఆమెను ఆరాధించవచ్చు. శివుని వివిధ రూపాలలో, శివుని శక్తిగా, భార్యగా కాళీదేవి కనిపిస్తున్నది. ఉజ్జయినిలో మహాకాళుని శక్తిగా, వీరభద్రుని శక్తిగా, కాశీలో కపాల విమోచన తీర్థంలో భైరవుని భార్యగా కాళీదేవి పూజలు అందుకుంటున్నది. ఏటా భాద్రపద పౌర్ణమినాడు కపాలవిమోచన తీర్థంలో కాళీ భైరవుల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ కల్యాణాన్ని వీక్షించచి అమ్మవారి అనుగ్రహం, వివాహ సిద్ధి పొందుతున్నారు. మురమళ్లలో భద్రకాళీ వీరేశ్వరుల కళ్యాణం జరిపిస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుంది అని నమ్మిక. సౌభాగ్య కాళిగా, కాలభైరవుని భార్యగా అమ్మను అర్చించే పడతులకు సుమంగళి యోగాన్ని, వారి వారి భర్తలకు దీర్ఘాయువును అనుగ్రహిస్తుంది.

పసుపు కుంకుమలతో, ఎర్రటి, పచ్చటి పూలతో పూజిస్తే సౌభాగ్య కాళి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అలాగే.. సంతాన కాళిగా ఆ తల్లి సంతానాన్ని అనుగ్రహిస్తుంది. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. ఒకసారి కాళీ దేవి యుద్ధరంగంలో రాక్షస సంహారం చేసి క్రోధ స్వరూపిణిగా ఉన్నప్పుడు.. ఆ తల్లిని శాంతింపజేయాల్సిందిగా దేవతలు శివుడిని వేడుకున్నారు. అప్పుడు శివుడు బాలుడిగా మారి అక్కడికి వెళ్లి రోదించనారంభించాడు. పసివాడి ఏడుపు విన్న అమ్మలో ఆగ్రహాన్ని విడిచి.. ‘అయ్యో! బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు అతని ఆకలి తీర్చాలి’ అనుకుని, గబగబా బిడ్డ దగ్గరకు వచ్చి, ఎత్తుకుని తన స్తనపానాన్ని అనుగ్రహించింది. ఆ బాల శివుని పేరు క్షేత్రపాలుడు, ఆయన పూజించిన మాతృకాళిని ‘క్షేత్రపాల సమర్చిత’ అని లలితామంత్ర సిద్ధులు భాస్కర రాయలు వర్ణించారు. చేతిలో బిడ్డని ఎత్తుకుని స్తనపానాన్ని అనుగ్రహిస్తున్న మాతృ స్వరూపిణిగా, సంతాన కాళిగా మాతృకాళిగా అమ్మవారిని అర్చిస్తే ఆమె సంతానం కలిగేటట్లు చేస్తుంది.

🌷బాల కాళి మంగళా కాళి🌷

కాళీ దేవి అనంత రూపాలలో ‘బాల కాళి’ రూపం ప్రసిద్ధమైనంది. బాలకృష్ణుని, బాల గణపతిని, బాలాదేవిని చిన్నపిల్లలుగా ఎలా ఉపాసిస్తామో, అలాగే కాళీదేవిని చిన్నారి కాళిగా పూజిస్తారు. తెలుగు యోగి, కాళీ మంత్ర సిద్ధుడు త్రైలింగ స్వామి అమ్మవారిని 12 సంవత్సరాల చిన్నారి బాలికగా ‘మంగళ కాళి’గా అర్చించారు. ఆయన దీర్ఘకాలం తపస్సుకు మెచ్చిన అమ్మవారు బాలకాళిగా (మంగళా కాళి)గా పట్టుపరికిణీ ధరించి సుకుమారంగా నెమ్మదిగా అడుగులు వేస్తూ త్రైలింగ స్వామి కన్నుల ముందు నిలిచింది. త్రైలింగ స్వామికి ఎన్నో సిద్ధశక్తులను ప్రసాదించింది.

దీర్ఘాయువును అనుగ్రహించింది. కాశీలో త్రైలింగ స్వామి ఆశ్రమం ఉన్నది. అక్కడ అమ్మవారు ‘మంగళా కాళి’గా, 12 సంవత్సరాల బాల స్వరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ఉమాచరణ్‌ అనే భక్తుడు త్రైలింగ స్వామి దగ్గర కాళీ మంత్ర ఉపదేశం పొంది, తీవ్ర సాధన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. కానీ, ఆయనకు ఆ తల్లి సాక్షాత్కారం మాత్రం కలుగలేదు. దీంతో ఆయన త్రైలింగ స్వామి దగ్గరకు వెళ్లి.. ‘అమ్మవారి కృప నాకు తెలుస్తోందిగానీ, సాక్షాత్కారం మాత్రం కలగట్లేదు’ తన ఆవేదనను వివరించగా.. త్రైలింగ స్వామి ఆ రోజు చీకటి పడి తరువాత అతడిని తన కాళీ మందిరంలోకి తీసుకువెళ్లారు. అందమైన మంగళా కాళిగా ప్రకాశిస్తున్న అమ్మ విగ్రహాన్ని ఉద్దేశించి ‘మంగళా’ అంటూ ఆహ్వానించారు. అప్పుడా విగ్రహం ఒక సుందరమైన బాలికగా మారి నడిచి వచ్చింది.

ఆనంద ఆశ్చర్యాలతో పరవశించిన ఉమాచరణ్‌ స్వామి అనుమతితో ఆమె పాదాలను తాకి నమస్కరించాడు. ఆ తరువాత ఆ సుందర బాలిక నెమ్మదిగా నడిచి వెళ్లి మళ్లీ మంగళా కాళిగా శిలాకృతిని ధరించింది. బెంగాల్‌కు చెందిన కాళీ మంత్ర సిద్ధుడైన రామప్రసాద్‌ జీవితంలో కూడా బాల కాళిగా అమ్మవారు దర్శనం ఇచ్చి, ఆయన ఇంట చిన్నపిల్లగా నడయాడేది. బాల కాళిగా అమ్మవారిని పూజిస్తే చిన్న పిల్లలలో ఉండే బాలారిష్టాలను, అనారోగ్యాలను తొలగిస్తుంది. విశేషించి మంగళా కాళిగా కొలిస్తే మంగళ స్వరూపిణి అయి సకల శుభాలను కలిగేటట్లు అమ్మ అనుగ్రహిస్తుంది.

♦️🐍నాగ దోషాలు పోవాలంటే..🐍♦️

కాళీదేవి అనంత స్వరూపాలలో ‘నాగకాళి’ రూపం కూడా ఒకటి. నాగశక్తి స్వరూపిణిగా, నాగులు సైతం పూజించే దేవతగా ‘నాగకాళి’గా ఆ మాత అనుగ్రహిస్తున్నది. కామాఖ్యలో కామాఖ్యకాళిగా అమ్మవారిని పూజిస్తారు. అక్కడ నాగమాత అయిన మానసాదేవి కూడా ఉన్నది.

నాగమాత అయిన మానసాదేవి కాళిని అర్చించినట్లుగా అక్కడి కథలు చెపుతున్నాయి. ఆమెను అనుగ్రహించడానికి అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. నాగకిరీటాన్ని ధరించి, అనంతమైన నాగులు పడగలు పడుతూ ఉండగా, ఆమె శరీరం మీద అనేక నాగులు ఆభరణాలుగా ప్రకాశిస్తూ ఉండగా.. నాగ మహా శక్తిస్వరూపిణిగా ఆమె దర్శనం యిచ్చిందిట.

ఆ తల్లి అనుగ్రహం వలన మానసాదేవి అనేక శక్తులను పొందడంతోపాటు, నాగమాత అయ్యే అర్హతను పొందింది. పాతాళంలో ఉన్న నాగులు మొదలైనవారు పాతాళకాళిగా అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహం పొందారు. నాగదోషాలు ఉన్నటువంటి వారికి చర్మవ్యాధులు, ఎముకల వ్యాధులు, కర్ణ వ్యాధులు మొదలైన అనారోగ్యాలు, వివాహం కాకపోవటం లేదా వివాహం అయినా భార్యాభర్తల సఖ్యత లేకపోవటం విశేషించి సంతానం లేకపోవటం మొదలైన ఇబ్బందులు ఉంటాయి అని నాగతంత్రం చెపుతున్నది.

నాగ దోషాలు ఉన్నవారు నాగకాళిగా అమ్మవారిని కొలిస్తే వాటిని తొలగిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే నాగదోషమైనా, పాములను చంపడం వలన వచ్చిన నాగదోషమైనా, పూర్వ జన్మలో చేసిన నాగహాని వలన కలిగిన నాగదోషమైనా.. నాగకాళీ మాత ఆరాధనతో పోతాయి. ఎటువంటి కాలసర్ప దోషమైనా, రాహుగ్రహ కేతు గ్రహ దోషాలున్నా ‘‘నాగకాళి’’ అమ్మను ఆరాధిస్తే ఆమె తొలగిస్తుంది. ఎన్నోచోట్ల, విశేషించి తమిళనాట ‘నాగకాళి’ అమ్మ దేవాలయాలు కనిపిస్తున్నాయి. ఆమెను అర్చించి శీఘ్రంగా దోష నివారణ, సంకల్ప సిద్ధి పొందవచ్చు.

🌷ప్రత్యంగిరా కాళి.. అధర్వణ భద్రకాళి🌷

కాళీదేవి ధరించిన రూపాలలో ‘ప్రత్యంగిరా భద్రకాళి’ రూపం ప్రసిద్ధమైనది. సింహముఖంతో ప్రకాశించే కాళీ స్వరూపమే ‘ప్రత్యంగిరా కాళి’. సహజంగా కాళీదేవి స్త్రీ శక్తి స్వరూపిణిగా మానవ ముఖంతో, నాలుకను బయటకు చాచి ఉంటుంది. అలాగే.. ఆ తల్లి స్త్రీ శరీరంతో, ఇతర జంతువుల ముఖములతో అనేక రూపాలను ధరించినట్లుగా కాళీపటలంలో, కాళీ తంత్ర గ్రంథాలలో కనిపిస్తున్నది. పులిముఖంతో వ్యాఘ్రముఖిగా, ఏనుగు ముఖంతో గజముఖిగా, పిల్లిముఖంతో బిడాలముఖిగా, వరాహాముఖంతో వరాహాముఖిగా, గుర్రపుముఖంతో అశ్వముఖిగా సింహముఖంతో సింహముఖిగా మొదలైన అనేక రూపాలను ధరించింది. విశేషించి సింహముఖం కలిగిన కాళీదేవిని ప్రత్యంగిరా కాళిగా వర్ణించారు.

ప్రత్యంగిరా తంత్రంలో ఆమెను అధర్వణ భద్రకాళి అని అన్నారు. ప్రత్యంగిరాదేవిని ఆరాధించడం అత్యంత ప్రాచీన కాలం నుండి వస్తున్నది. ఆ తల్లి ఆరాధనతో ఎటువంటి బాధలు, కష్టాలు అయినా తొలగిపోతాయి. శత్రుబాధను నివారించడం మాత్రమే కాక ఎంతటి వంశానుగత శాపాలను అయినా సరే పోగొడుతుంది. ప్రత్యంగిరా భద్రకాళి ఆరాధన దక్షిణ దేశంలో.. ప్రత్యేకించి తమిళనాడులో ప్రసిద్ధి. ఈ దేవతకు మంగళవారం రాహుకాలంలో విశేష పూజలు, అభిషేకాలు చేసే ఆచారం కనిపిస్తున్నది. అమావాస్య వేళ పూజిస్తే మరింత శీఘ్రంగా అనుగ్రహిస్తుందని ప్రజల విశ్వాసం.

🌷కామాఖ్య కాళి🌷

నీలాచల పర్వతం మీద కామాఖ్యా దేవి అవతరించి ఉన్నది. సతీదేవి శరీరంలోని వివిధ భాగాలు పడిన చోట్లు మహాశక్తి క్షేత్రాలుగా అలరారుతున్నాయి. అలా నీలాచల పర్వతం మీద సతీదేవి యోని పీఠం ఉన్నది. లలితాదేవి చేత పునరుజ్జీవితుడైన మన్మథుడు అమ్మవారి పట్ల కృతజ్ఞతతో ఆ పీఠంలో అమ్మవారిని ప్రతిష్ఠించాడు. భారతదేశంలో కాళీదేవికి సంబంధించిన క్షేత్రాలలో కామాఖ్య అతి ముఖ్యమైనది.

కాళికా పురాణంలో కామాఖ్య కాళి తంత్రంలో అమ్మవారి శక్తిని గురించి, ఆమె మహిమల గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు కనిపిస్తున్నాయి. ఆ తల్లిని ఆరాధించి ఎందరో వ్యక్తులు సిద్ధులయ్యారు. నీలాచల పర్వతం మీద ఇప్పటికీ ఎందరో కాళీ మంత్ర సిద్ధులు సంచరిస్తుంటారు. నరకాసురుడు ఈ కామాఖ్యాదేవిని ఆరాధించి ఎన్నో సిద్ధశక్తులను సాధించాడు.

అయితే ధర్మబద్ధం కాని వామాచార సాధనలను చేయడం వల్ల ఆ తల్లి ఆగ్రహానికి గురయ్యాడు. మహర్షి వశిష్ఠుని ప్రార్థనతో.. అధర్మ పరుడైన నరకుని రాజ్యం నుండి కామాఖ్య కాళి మాయమయ్యింది. ఆ తర్వాత సుమారు 300 సంవత్సరాల పాటు అమ్మవారు కైలాసంలో ఉన్నదని యోగినీ తంత్రంలో ఉంది. నరకాసురుని మరణవేళ ఆమెను కృష్ణుని ప్రక్కన చూసిన నరకుడు.. తాను ఉపాసించిన దేవతేతన తప్పులకు తనను శిక్షిస్తోందని తెలుసుకున్నాడు.

ఆ తరువాత కృష్ణుడు మళ్లీ నీలాచలం మీద కామాఖ్యాదేవినిపునఃప్రతిష్ఠించి ఆ దేవతను పూజించాడు. సంవత్సరంలో ఒకసారి ఆమె రజస్వల అవుతుందని చెబుతారు. ఆ మూడు రోజులూ గుడిని మూసేసి.. ఆ రోజులలో స్రవించే రక్తాన్ని వస్త్రాలకు అద్ది భక్తులకు ఇస్తారు. కామాఖ్య కాళిని దర్శించినా, ఆమెను పూజించినా శీఘ్రంగా కాళీదేవి అనుగ్రహం పొందవచ్చు.

🌷కాలస్వరూపిణి.. దక్షిణ కాళి🌷

అనంతమైన కాలం స్త్రీ రూపాన్ని ధరిస్తే కాళీరూపంగా భాసిల్లుతుంది. ఏ వ్యక్తి అయినా ఎన్ని శక్తులున్నా కాలం అధీనంలో ఉండాల్సిందే. కాలం తీరాక కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అయితే కాల స్వరూపం అయిన కాళిని ఎవరు అర్చిస్తారో, ఆ తల్లి అనుగ్రహాన్ని, మంత్ర సిద్ధిని ఎవరు పొందుతారో వారు అకాల మృత్యుగండాన్ని తప్పించుకోగలుగుతారు. మృత్యుంజయ స్వరూపిణిగా ఆమెను ఆరాధించే రూపం ‘దక్షిణ కాళి’ రూపం. బెంగాల్‌కు చెందిన కృష్ణానంద ఆగమ వాగీశ అనే ప్రముఖ పండితుడు వైదిక, తంత్ర శాస్త్రాలలో అపార జ్ఞానం కలిగిన వ్యక్తి. 16వ శతాబ్దానికి చెందిన ఆయన తంత్రసార మొదలైన అద్భుత గ్రంథాలను రచించారు.

కాళీదేవి ఆయనకు కలలో దక్షిణ కాళిగా దర్శనమిచ్చి ఆ రూపానికి ప్రజల్లో ప్రాచుర్యం కల్పించాలని చెప్పింది. ఆ రూపంలో ఉన్న అమ్మవారి ఆరాధనను కృష్ణాననంద దశదిశలా వ్యాపింపజేశారు. కాళీదేవి అనుగ్రహం వల్ల విక్రమార్కుడు, భట్టి.. కాళీ మంత్ర సిద్ధి పొందిన తెలుగు యోగి త్రైలింగ స్వామి.. దీర్ఘకాలంపాటు జీవించారు. కాళీమాత ఆజ్ఞతో రామకృష్ణ పరమహంస.. త్రైలింగ స్వామిని దర్శించుకున్నారు. అలాగే అమ్మవారి అనుగ్రహంతో సుదీర్ఘకాలం జీవించిన మరో కాళీ మంత్ర సిద్ధుడు కీనారాం అఘోరీ. కాశీలో అమ్మవారి సంకల్పంతో హరిశ్చంద్రఘాట్‌కు దగ్గరలో కాళీదేవి ఆలయాన్ని నిర్మించాడు. అమ్మవారు ప్రసాదించిన శక్తులతో ఎందరికో సాయం చేశాడు. మొగల్‌ పాదుషా షాజహాన్‌.. కీనారాం అఘోరీ భక్తుడు. ఇలా ఎందరో కాళీ భక్తులు.. దక్షిణ కాళిగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.

🌷 *శ్రీ మాత్రే నమః* 🙏🌷

గురుదేవులు పుస్తకాలు సేకరణ అద్భుతమైన విషయం.

https://youtu.be/XHAvgzbGrfM. సుమారు గా 100

https://youtu.be/XHAvgzbGrfMరోజులు పైగా రోజుకు 6 గంటలు కూర్చొని ప్రతి పుస్తకం చూస్తూ వాటిని ఒక పద్ధతి లో విడి విడిగా సర్దుకుని మళ్ళీ వాటిని జాగ్రత్తగా అట్ట పెట్టెల లో ఉంచుతూ సర్దడం జరిగింది. ఈ సేవ చేస్తున్న అంతసేపు గురుదేవులు శ్రీ మోహనారావు గారు మన ప్రక్కన కూర్చుని అన్ని చేయిస్తున్నారు అని భావన కలిగేది. గురుదేవులు పుస్తకాలు సేకరణ అద్భుతమైన విషయం. అనిర్వచనీయమైన అనుభూతి పొందేము. మా అబ్బాయి సాయి మోహన్ స్నేహితులు ప్రతి రోజు వచ్చి కూర్చొని నాకు తోడ్పాటు గా చెప్పిన పని చేసేవారు. ఈ పని చేసిన తర్వాత మా అబ్బాయి సాయి మోహన్ స్నేహితులు అందరికి మంచి జరిగింది అని చెప్పినారు. వారిలో చాలా మార్పులు వచ్చి మంచిగా ఉన్నారు. భగవంతుడు పుస్తకాలు సర్దడం వల్ల మాకు భగవంతుడు సేవ చేసుకునేందుకు భాగ్యం కలిగింది అని చెప్పారు. అంతా శ్రీ సాయి బాబా దయ. నా ఒక్కడి వల్ల ఐయితే ఈ పని కాదు. సమయానికి వాళ్ళు రావడం ఒక యజ్ఞం లాగా పూర్తి చేసినాము. చివరిగా అట్ట పెట్టలు పైన పేర్లు రాయడం కు సహకారాన్ని అందించినవారు చెరుకూరి శివ కుమార్ మరియు చంద్రశేఖర్ గార్లు. ఈ పని చేస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చేవి. వాటిని దాటుకుని భగవత్ సంకల్పంతో 10 వేలకు పైగా పుస్తకాలు సర్దుబాటు చేయడం జరిగింది.... మీ ఆదిపూడి....https://youtu.be/XHAvgzbGrfM

30 రకాల శివలింగాలు - ఫలితాలు

30 రకాల శివలింగాలు  -  ఫలితాలు  ::-

*************************************

సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం.

 రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...

01. 🕉 గంధలింగం :-

రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

 02. 🕉 పుష్పలింగం :-

 నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

03. 🕉 నవనీతలింగం :-

 వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.      

04. 🕉 రజోమయలింగం :-

 పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.

05. 🕉 ధాన్యలింగం :-

 యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

06. 🕉 తిలిపిస్టోత్థలింగం :-

 నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

07. 🕉 లవణలింగం :-

 హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

08. 🕉 కర్పూరాజ లింగం :-

 ముక్తిప్రదమైనది.

09. 🕉 భస్మమయలింగం :-

 భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.
                  

10. 🕉 శర్కరామయలింగం :-

 సుఖప్రదం

11. 🕉 సద్భోత్థలింగం :-

ప్రీతిని కలిగిస్తుంది.

12. 🕉 పాలరాతి లింగం :-

 ఆరోగ్యదాయకం

13. 🕉 వంశాకురమయ లింగం :-

వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

14. 🕉 కేశాస్థిలింగం :-

 వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.

        
15. 🕉 పిష్టమయలింగం :-

 ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16. 🕉 దధిదుగ్థలింగం :-

 కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది

17.🕉 ఫలోత్థలింగం :-

 ఫలప్రదమైనది

18. 🕉 రాత్రిఫలజాతలింగం :-

 ముక్తిప్రదం.

19. 🕉 గోమయలింగం :-

 కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.

20.🕉 దూర్వాకాండజలింగం :-

 గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

21.🕉 వైడూర్యలింగం :-

 శత్రునాశనం, దృష్టిదోషహరం

22.🕉 ముక్తాలింగం :-

 ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.

23. 🕉 సువర్ణనిర్మితలింగం :-

 బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.

24.🕉 రజతలింగం :-

 సంపదలను కలిగిస్తుంది.

25.🕉 ఇత్తడి - కంచులింగం :-

 ముక్తిని ప్రసాదిస్తుంది.

26. 🕉 ఇనుము - సీసపులింగం :-

శత్రునాశనం చేస్తుంది.    

27.🕉 అష్టథాతులింగం :-

 చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.

28. 🕉 తుష్ణోత్థలింగం :-

 మారణక్రియకు పూజిస్తారు.

29. 🕉 స్పటిక లింగం :-

 సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

30. 🕉 సీతాఖండలింగం :-

 పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.🌹

.........

Sunday, January 16, 2022

గ్రహ స్థితులు, అనారోగ్య విషయాలు

 గ్రహ స్థితులు, అనారోగ్య విషయాలు


మహాశ్వాసం ( Dysproea ) - శుక్రుడు . 

ఉన్మాదం ( Insanity ) - శుక్ర,రాహు,చంద్ర,శని 

ధనుర్వాతం ( Titanus ) - రవి,శని కలయిక కాక రవి,కుజ,శని కలయిక .

పక్షవాతం ( Paralysis ) - శని. 

అవతంత్రకం ( Hysteria ) - కుజ,శని.

మూగతనం ( Apasia ) - బుద,కేతువు . 

వాత రక్తం ( Gout ) - శని,శుక్రులు . 

ఆమవాతం ( Rhumatism ) - శని . 

నొప్పి - ( Colic ) - శని, కుజ,రాహువు.

పరిణామ శూల ( Gastral Gokennosis ) - శని, కుజ, రాహువులు .

హుద్రోగములు - ( Heart ) శుక్రుడు . 

మూత్రక్రుచ్చం ( Dysuria ) - కుజ, బుధులు . 

జలోదరం ( Ascties ) - కేతువు ,బుదుడు .

మూత్రజ వృద్ది ( Hydrocele ) - బుదుడు.

మశూచి (  pox ) - బుద,కేతు,కుజులు .

చెవుడు ( Deafness ) - శని. 

తలనొప్పి ( Headache ) - కుజ,రాహువులు 

 గర్భస్రావం ( Abortion ) - రవి,గురులు .

టై ఫా యి డు దీనిని సన్నిపాత జ్వరం అంటారు.ఇది గురు – బుధ గ్రహాల సంభందం వలన వస్తుంది.

డయబె టిక్ అనగా మధు మేహం ఇది గురు – బుద గ్రహాల వలన వస్తుంది.

జాండిస్ అనగా కామెర్లు అంటారు. ఇది గురు – శుక్ర గ్రహాల వలన వస్తుంది.

రాచ పుండు ఇది రవి గ్రహం వలన వస్తుంది.

మలేరియా ఇది శని గ్రహం వలన వస్తుంది.

అతిసారం ఈ వ్యాధి కుజుడు, బుదుడు,శని, కేతువు మొదలయిన గ్రహాల సంభందం వలన వస్తుంది.

మొలల వ్యాధి కుజ – రాహు గ్రహాల సంభందం వలన వస్తుంది.

అజీర్ణ వ్యాధి ఇది శని గ్రహం వలన వస్తుంది.

క్షయ వ్యాధి శుక్ర గ్రహ ప్రభావం వలన వస్తుంది.

ఉబ్బసం శని, బుదుడు, కేతువు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

ఉన్మాదం రవి , కుజుడు, శని కలయిక వలన వస్తుంది.

ధనుర్వాతం ఇది రవి, కుజుడు, శని కలయిక వలన వస్తుంది.

పక్షవాతం ఇది శని ప్రభావం వలన వస్తుంది.

కుంటి తనం శని గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.అన్ని రకాల వాతాలకు శని గ్రహ ప్రభావమే కారణం.   

  మూగతనం ఇది బుద, కేతు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

గౌట్ దీనిని వాత రక్త వ్యాధి అంటారు.ఇది రవి, శుక్ర గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

శూల నొప్పి ఇవి శని, కుజ, రాహు గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.

గుండె రోగాలు ఇవి శుక్ర గ్రహ ప్రభావం వలన కలుగుతాయి.

హెర్నియా దీనిని బుడ్డ గిలక అంటారు.ఇది బుద గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.

భయంకర చర్మ వ్యాధులు ఇవి కేతువు , శుక్ర , చంద్ర గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.

దంత రోగాలు ఇవి గురు, శని గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.

చెవుడు ఇది శని గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.

తలనొప్పి ఇది కుజుడు, రాహువు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

ఉబ్బు రోగాలు ఇవి కేతువు గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.

కాన్సర్ ఈ భయంకర వ్యాధి రవి, కుజ,గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

స్త్రీ తెల్ల బట్ట ఇది కుజుడు , శుక్రుడు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.

స్త్రీల ఎర్రబట్ట ఇది రవి, కుజుడు గ్రహల వలన వస్తుంది.

గోడ్డ్రాలితనం ఇది కుజ ,శని,బుద,శుక్ర గ్రహాల కలయిక వలన వస్తుంది.

ముఖ్యంగా:-

1. నేత్ర రోగములకు రవి,శుక్ర,రాహువులు కారకులు. 

2. రక్త సంబంధమైన రోగములకు రవి కారకుడు. 

3. నరములకు సంబంధించిన అనారోగ్యములకు శని  కారకుడు. 

4. దంతరోగములకు కుజ,శనులు కారకులు. 

 5. కర్ణవ్యాధులు(చెవినొప్పి) మొదలగు వాటికి కుజ, శనులు కారకులు. 

6. శిరోవ్యాధులు అనగా తలనొప్పి మొదలగు వాటికి శని,కుజులు కారకులు. 

7. స్త్రీల తెల్లబట్టలకు కుజ,శని,రాహువులు కారకులు. 

8. పురుషుల వీర్య నష్టమునకును  కుజ,శని,రాహువులు కారకులు. 

9. గర్భస్రావమునకు కుజ,శుక్రులు,  రవి,గురులును కారకులు. 

10. పక్షవాతమునకు శనియు కారకులు. 

11. ఉన్మాదము,పిచ్చి మొదలగు రోగములకు శని,రాహు,శుక్ర,చంద్రులను  కారకులు.

12.పచ్చకామెర్లకు గురు,శుక్రులును కారకులు. 

13. ధనుర్వాతమునకు రవి,శనులు గాని,  రవి,శని,కుజులు గాని కలసిఉండగా  వారి దశల యందు కలుగును. 

14. సర్వాంగ పక్షవాతమునకు శనియు కారకులగుచున్నారు.

15. కుష్టు, బొల్లి మొదలగు వాటికి కేతువు,చంద్రుడు,శుక్రుడు, శని,కుజులును కారకులు. 

16. రాచకురుపులకు రవియు కారకులు. 

17. వ్రణములకు కుజుడును కారకులు. 

18. అజీర్ణమునకు శనియు కారకులు. 

19. కలరాకి కుజుడును కారకులు. 

20. సకలవాతరోగములకు శనియు కారకులు. 

21.బుడ్డగిలకలకు బుధుడును కారకులు. 

22. వంధ్యాత్వమునకు  శని,బుధ,కుజ,శుక్రులు కారకులు. 

23. స్త్రీల పురిటికి సంబంధించిన రోగములకు....పంచమస్థానములో వున్న గ్రహములను బట్టియు, పంచమస్థానమును బట్టియు 

తెలుసుకొనవలయును

అశుభ వ్యాధి సూచక యోగములు

1. జన్మలగ్నమునకు  అష్టమస్థానమందు ఏ గ్రహము గాని లేనపుడు,  ఆ అష్టమ స్థానమును ఏ గ్రహము చూచుచుండునో,  అట్టి గ్రహము యొక్క ధాతు ప్రకోపముచే మృతి సంభవించును. 

రవి....పిత్త ప్రకృతి, 

చంద్ర...కఫవాత ప్రకృతి, 

కుజుడు....పైత్య ప్రకృతి, 

బుధుడు....త్రి దోషములను గలవాడు.

గురుడు....కఫ ప్రకృతి. 

శుక్రుడు....కఫవాత ప్రకృతి, 

శని....వాత ప్రకృతి గలవారలు.

1. అష్టమస్థానమందు  రవి యున్నపుడు ఊష్ణగుణోద్రేకము వలన మృతి సంభవించును. 

2. అష్టమస్థానమందు చంద్రుడు ఉన్నపుడు  జలదోషముచే మృతి కలుగును.

3. అష్టమమందు కుజుడుఉన్నపుడు ఆయుధ ప్రహారముచే మృతి కలుగును. 

4. అష్టమమందు గురుడున్న ఆమవ్యాధిచే గాని, లేక 

తెలియబడని  రోగముచే గాని మృతి యగును.

5. అష్టమమందు బుధుడున్న జ్వర  భేధముచే మృతి కలుగును. 

6. అష్టమమందు శుక్రుడున్న విదాహముచే మృతి కలుగును. 

7. అష్టమమందు శనియున్న అజీర్ణ నిమిత్తక క్షుద్ధోషముచే మృతి యగును. 

ఈ అష్టమ స్థానము చరరాశి యయినపుడు పరదేశమందు మరణము సంభవించును. 

ఈ అష్టమ స్థానము స్థిరరాశి యయినపుడు  స్వదేశమందు  లేక  స్వగృహమందు మృతుడగును.

ఈ అష్టమ స్థానము ద్విస్వభావ రాశి యయినపుడు 

మార్గమధ్యమందు మృతి కలుగును.

గురు గ్రహ స్థితిలో

కాలేయము అనునది మానవ దేహమును ఆరోగ్యమునకు దోహదపడు ప్రముఖమయిన అవయవము.ఈకాలేయము నందు వివిధ రకాల అనారోగ్యములతో ఎన్నో వ్యాధులు సంభవించును,

ఇది ఉదరము నందు కుడి భాగము నందు ఉంటుంది.మనకు ఈ అవయవము జ్యోతిశ్శాస్త్రములో జాతకుని జన్మ లగ్నము నుండి 5 వ భావము కలి పురుషునికి కూడ 5 వ భావము అనగా సింహము నందు భావ కారక ఆధిపత్యము పొంది ఉన్నది.

 ఈ కాలేయము అతి దగ్గర సంభంధమును ఉదరమునకు కుడు భాగమున వేనక వైపు ఉన్న క్లోమ గ్రంధితో సంభంధము కలిగి ఉంటుంది. ఈ కాలేయము క్లోమ గ్రంధి నుండి స్రవించబడు క్లోమ రసముతో  జీర్ణాశయములో మనము సేవించిన ఆహార జీర్ణ ప్రక్రియ జరుపును ఇట్టి జీర్ణ ప్రక్రియ కాలెయములో నుండు పైత్య రసము ఆహారమును చిన్న చిన్న కణములుగా విభజించి క్లోమ రసముతో జీర్ణ ప్రక్రియకు   తోడ్పడును ఇట్టి కాలెయ ప్రక్రియ సక్రమ నిర్వాహణ జరగలేనిచో ఆయుర్వేదము నందు తెలిపిన పిత్తము వలన మానవ దేహమునకు చాలా వ్యాధులు సంభవించును.

ఇట్టి కాలేయమునకు కారక గ్రహము బృహస్పతి మరియు క్లోమ గ్రంధికి కూడాను అలాగే పైత్య రసమునకు బుధుడు కారక గ్రహము, జాతకుని జన్మ లగ్నము నుండి 5 వ భావము మరియు భావాత్ భావమును అనుసరించి తొమ్మిదొవ భావము భావకారకత్వ ఆధిపత్యము పొందినవి కాల పురుషుని నుండి 5 వ భావము అలాగే తొమ్మిదో భావము  అనగా సింహ-ధనుర్లగ్నాలను పరిగణలోకి తీసుకోవలెను,బుధ గ్రహాన్ని కూడా వ్యాధి కారకముగా ఫలిత సాధనలో తీసుకోవలెను.బృహస్పతి మరియు బుధుల స్థితుల వలన ఏర్పడిన వ్యాధి కొద్ది కాలములో ఉపశమనము కలుగును కాని ఐదు,తొమ్మిది భావములలో అశుభ గ్రహ స్థితి లేదా వీక్షణ కలిగి ఉన్నా వచ్చు వ్యాధులు ధీర్ఘకాలము అవస్థలపాలు చెయ్యును.వ్యాధుల నిర్దారణ-గ్రహ స్థితులు..

  1) బృహస్పతి కాలెయమునకు కారకుడు ఈ బృహస్పతి తో కలిసి లగ్నము నందు కాని పంచమ నవమ భావాలలో గాని అశుభ గ్రహ స్థితి లేదా వీక్షణ గాని ఉన్నను లేక నవాంశలో వీటి కలయిక ఉన్నను వ్యాధుల భారిన పడును.

2)ఐదవ భావాధిపతి 6,8,12 లలో అశుభ గ్రహముతో కూడి యున్న లేదా వీక్షణ లు కలిగి యున్న వ్యాధులు సంభవించును

3) నవాంశ యందు పంచమ,నవములలో గురు శనులున్న సంభందిత వ్యాధులు సంభవించును.

4)కుజ-శని -రాహు లేక కేతువు లతో పంచమ భావాధిపతి లేదా నవమ భావాధిపతితో కూడియున్న కాలెయ వ్యాధులేర్పడును

5) అయిదవ లేదా తొమ్మిదవ భావాధి పతుల సంభంధము నవాంశ యందు కలిగియున్న వ్యాధులు సంభవించును.

6) బుధ--కుజులు షష్ఠాధి పతితో పంచమమున లేదా పంచమాధి పతిని వీక్షించిన పైత్య రసము గట్టి పడి రాళ్ళు ఏర్పడే అవకాశము కలదు

7)ఆహారము సమయానికి తీసుకోక పోవడము వలన పైత్యరసము వేడెక్కి ప్రేవులకు రంధ్రములేర్పరిచి అల్సర్ వ్యాధిని కలిగించును ఇది బుధ-రవి-గురు కాంబినేషన్లో సంభవించును.

8)చంద్ర-బుధ/శుక్ర-బుధు ల వలన పచ్చ కామెర్లు,తెల్ల కామెర్లు ఏర్పడే అవకాశము కలదు.లేద వీటిపై అశుభ గ్రహ వీక్షణ కలిగిన ఈ వ్యాధులు సంభవించును.

క్యాన్సర్

మానవ శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మిత మవుతుంది.సాధారణంగా కణజాలు పెరిగి విభజన చెందుతాయి. ఈ విభజన కణాల అభివృద్ధి శరీరమును ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది. శరీరానికి అవసరం కాకపోయినా కొత్త కణాలు ఏర్పడతాయి. పాప కణాలు  క్షీణించ వలసిన సమయంలో క్షీణించవు.

ఈ విధంగా ఏర్పడిన కణాల సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడతాయి దీనిని క్యాన్సర్ గడ్డ అంటారు. మరణ కంతి అని రాచ కురుపు అని కూడా అంటారు. కొన్ని గడ్డలు అపాయకరమైనవి కావు.వీటిని క్యాన్సర్ గడ్డలు అని అనరు. శస్త్ర చికిత్స ద్వారా వీటిని తొలగించవచ్చు.

అపాయకరమైన కంతులు,

ఈ కంతుల లోని కణాలు అసాధారణంగా వుంటాయి. ఇంకా అవి నియంత్రణ లేకుండా విభజన చెందుతూ పోతాయి. ఇవి తమ చుట్టూ ఉన్న కణజాలంలోనికి చొచ్చుకొనిపోయి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సర్ కణాలు కంతుల నుండి విడిపోయి దూరంగా రక్తస్రావం లోకి లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి. క్యాన్సర్ వ్యాధి ఆకస్మికంగా వచ్చే వ్యాధి ఇది ప్రాణాంతకమైనది, మరణానికి దారి తీస్తుంది.

జ్యోతిష కారణాలు చాలా ఉన్నప్పటికీ క్లుప్తంగా

రాహు లగ్నంలో గాని చంద్రునితో గాని ఆరవ ఇంటిలో గాని పీఏసీ పొందితే క్యాన్సర్ వచ్చుటకు అవకాశం ఉంటుంది.

ఆరవ భావాధిపతి లగ్నంలో గాని,ఎనిమిదవ భావం లో గాని 12 లో గానీ ఉండి రాహు కేతు కక్ష్యలో ఉంటే క్యాన్సర్ రావచ్చు.

రాహు కేతువులు 6, 8,

12 భావాలతో సంబంధం కలిగి ఉంటే క్యాన్సర్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. చంద్రుడు కారకాంశ రాశికి 4వ భావంలో రాహు ,కేతు,శని వలన వేద పొందితే రొమ్ము క్యాన్సర్ కు కారణం అవుతుంది. కుజుడు ఎర్ర రక్తకణాలను హెమోగ్లోబిన్ మరియు బోన్మేరోని సూచిస్తాడు. కుజుడు రాహు కేతువు శని వలన వేద పొందితే బ్లడ్ క్యాన్సర్ కు కారణం అవుతుంది.బుధుడు పాప గ్రహాల వలన వేద పొందితే చర్మపు క్యాన్సర్ వస్తుంది. బుధుడు రాహు కేతు కక్ష్యలో ఉంటే స్కిన్ క్యాన్సర్ కు చాలా అవకాశాలు ఉన్నాయి. రవి రాహు కేతువు శని వలన వేద పొందితే కూడా క్యాన్సర్ వస్తుంది. రాహు శని కలిసి  ఆరోభావంలో ఉన్నా క్యాన్సర్ వ్యాధి వస్తుంది.

చంద్రుడు ఏ రాశిలో నైనా మూడు పాపగ్రహాలతో వేద పొందితే, శని కేతువు గురువు కలిసి ఏ రాశిలైన ఉన్నా,

గురు, కేతువు, శుక్రుడు కలిసి ఏ రాశిలో ఉన్నా, చంద్రుడు కేతు,శని,కుజుడు కలిసి ఉండటం వలన, చంద్ర రాహు శనుల యుతి వల్ల , ఆరోభావము స్థిరరాశి అయి అందులో కుజుడున్నా, ఆరో ద్విస్వభావ రాసి అయి అందులో శని స్థితి వలన, గురువు శనుల మధ్య పాప సంబంధం ఉన్నా, రాహు మానసిక రుగ్మతకు పిచ్చికి కుష్టు రోగానికి మరియు  కాన్సర్ వ్యాధి వివిధ శరీర భాగాలకు వచ్చుటకు కారకుడు చివరిగా సాధారణంగా జాతక చక్రంలో 1 6 8 స్థానాధిపతులు రాహు, కుజ,శనులు తో సంబంధం కలిగి ఉంటే క్యాన్సర్ వ్యాధి వస్తుంది.

రాశులు, గ్రహాల ద్వారా వచ్చే రుగ్మతలు...

మానవుని జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం. ఆ రుగ్మతలకు కూడా రాశులు , వాటి అధిపతులైన గ్రహాలు కారణం అవుతాయి. రాసి తత్వాలు, గ్రహకార కత్వాల ద్వారా రోగ నిర్ధారణకు ఉపకరించేదే వైద్య జ్యోతిషం. ఏ శరీర భాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలుపుతాయి. ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుస్తుంది. ఏ గ్రహానికి సంబందించిన అవయవానికి వ్యాది సోకిందో ఆ గ్రహానికి సంబందించిన వైద్య విధానం ద్వారా మందు వాడితే తొందరగా వ్యాది నయమవుతుంది.

జాతకంలో లగ్నాదిపతి,లగ్నభావం షష్టాధిపతి,షష్ఠ బావంతో సంబందం ఉన్న యెడల జాతకునికి రోగాలు  పీడిస్తాయని, ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్నా వ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది.

రోగ నివారణ కేవలం మందులు వాడటం వలన సాద్యమనుకుంటే పొరపాటే. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన, వాతావరణం, నీరు మార్చటం వలన, రత్నధారణ వలన, జప దాన హోమాదుల వలన, ఔషదాల వలన, మంత్రోచ్ఛారణ వలన, కాస్మిక్ కిరణాల ద్వారా, కలర్ ధెరపీ ద్వారా, అయస్కాంత వైద్య చికిత్స విధానాల ద్వారా రోగాన్ని నివారించుకోవచ్చును, ముఖ్యంగా ఆదిత్య హృదయం, విష్ణు సహస్త పారాయణం, దుర్గాసప్తశ్లోకి, సుందరకాండ పారాయణం ప్రతి రోజు చేసే వారికి రోగాలు దరిచేరవు.

రాశులు - వాటికి వర్తించే శరీర భాగాలు

రాశులు - మేషం - శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు, వృషభం - గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు. మిధునం - భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం . కర్కాటకం- రొమ్ము, జీర్ణాశయం. సింహం - గుండె , వెన్నెముక.

కన్య - ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు ,తుల - కటి భాగం, నాభి, మూత్ర పిండాలు. వృశ్చికం - జననేంద్రియాలు, మూత్రకోశం . ధనుస్సు - తొడలు, పిరుదులు, రక్త నాళాలు. మకరం - మోకాళ్ళు, కీళ్ళు., కుంభం - పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం. మీనం - పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.

ఈ రాశులలో మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి, మిధున, తుల, కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక, మీన రాశులు జల తత్వానికి చెందినవి. కావున ఈ తత్వానికి సంబందించిన రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణం అవుతాయి .

గ్రహాలు ఆ కలుగ చేసే రుగ్మతలు

గ్రహాలు - రుగ్మతలు 

సూర్యుడు - హృదయ , నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత, పురుషులకు కుడి కన్ను, మహిళలకు ఎడమకన్ను.

చంద్రుడు - ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు.

బుధుడు - జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ, చేతులు, నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు, మూర్చ వంటి మానసిక వ్యాధులు.

శుక్రుడు - జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ వ్యాధులు.

కుజుడు - నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు, ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.

గురువు - కాలేయం, మధుమేహం,రక్త నాళాలు, కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.

శని - దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు.

మన శరీర భాగాలలో ఏ భాగం ఏ వ్యాధికి గురవుతుందో లగ్న, సూర్య, చంద్ర రాశులను, వాటి అధిపతులను బట్టి నిర్దారించు కోవచ్చు. లగ్న రాశి నుంచి గాని, సూర్య రాశి నుంచి గాని, చంద్ర రాశి నుంచి గాని 6 ,8 ,12 స్థానాలు అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు, ఆ రాశి అధిపతులు ,ఆ రాశిలో వున్నా గ్రహాలూ, కారకత్వాలను తెలుసు కుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది.

ఓం..శనైశ్చ రాయనమః.

జన్మ రాశుల వారికి సంభవించు వ్యాధులు .

మేషము.

తలనొప్పి, వాపులు వచ్చే వ్యాధులు , 

మెదడుకు సంబంధించిన రోగములు,మెదడువాపువ్యాధి,

సృహతప్పుట, నిద్రపట్టని వ్యాధి , మెదడులో రక్తనాళాలు పగులుట అనగా సెరిబ్రల్ హేమరేజ్ , బ్రెయిన్ ట్యూమర్, కోమా , మెదడులో జబ్బు కారణంగా వచ్చు జ్వరం వంటి సమస్యలు సంభవిస్తాయి.

మేషరాశి కోపమును , తొందరపాటును , పట్టుదల , దుడుకు చర్యలను సూచిస్తుంది. 

వీరికి మాంసాహారం ఎక్కువుగా పడదు. 

వీరు కోపమును ఉద్రేకమును కంట్రోల్ చేసుకోవడం అవసరం.

వృషభం.

గొంతువ్యాధులు ముఖ్యముగా టాన్సిల్స్ వాపు 

వాటి వలన కలుగు ఇన్ఫెక్షన్ , గొంతువాపు , గొంతునొప్పి, మెడనొప్పి, మెడలోని నరాలు బిగదీసుకు పోవడం , గొంతు బొంగురు పోవడం , నాలుక పూత, 

నాలుకపై కురుపులు , దంతాల నొప్పి, 

దంతాలు పుచ్చడం,కంటి వ్యాధులు,ముఖము పొంగుట , 

మృగశిర 1 వ పాదం ముఖం పై గాయాలు , 

ముఖం పై రాళ్ళ దెబ్బలు , లాలాజలం ఉత్పత్తి అయ్యే గ్రంథుల కు జబ్బు, కళ్లు ఎర్రబడుట, కళ్ల కలక, 

కంటి వాపు , కంట్లో శుక్లాలు , స్వరపేటికకు వచ్చే జబ్బు , మూత్రపిండాల జబ్బు, మూత్రాశయపు జబ్బులు , మూత్రం వలన అంటు జబ్బులు వంటి సమస్యలు కలుగును.

మిధునము.

ముఖ్యముగా ఊపిరితిత్తులకు సంబంధించిన 

అన్ని రోగములు ,శ్వాసనాళాలవాపు,శ్వాసనాళాల నొప్పి, బ్రాంకైటిస్ , క్షయవ్యాధి , చెవి వ్యాధులు , ముఖ్యముగా కుడి చెవికి వచ్చు వ్యాధులు , చెవుడు, చెవినొప్పి, 

చెవిలో కురుపులు , చీముకారుట మొదలయిన సమస్యలు , లంగ్ క్యాన్సర్ , శ్వాసనాళములో కఫం గట్టిపడటం మొదలయిన సమస్యలు , జననేంద్రియ , సుఖవ్యాధులు , పాద సంబంధ సమస్యలు , రెక్టమ్ వంటి విసర్జకావయావాల  సమస్యలు సంభంవించును.

కర్కాటకం.

ఛాతినొప్పి, ఛాతిలో బరువుగా ఉండటం , ఆస్తమా , క్షయవ్యాది , జలోదరం , గ్యాస్ జబ్బు, మానసిక వ్యాధులు , అజీర్ణం 

పునర్వసు 4 వ పాదం పచ్చకామెర్లు , క్యాన్సర్ వ్యాధి , మతిచాంచల్యం , 

పుష్యమి నక్షత్రం గాల్ బ్లాడర్ లో రాళ్లు తగినంత పైత్యరసం ఉరకపోవడం వలన అజీర్ణం , పులుపు వలన ఇబ్బందులు , ఊపిరితిత్తుల జబ్బు, ఊపిరితిత్తులలో రాళ్లు , కండపెరుగుట , శ్వాసక్రియ సక్రమంగా లేకపోవటం ఆయాసం , జలుబులు, ముక్కులో కండలు పెరుగుట, ముక్కులో నొప్పి, శ్వాసకోశ వ్యాధులు , తాగుడు దాని మూలంగా కలుగు వ్యాధులు సంభవిస్తాయి.

సింహము.

ముఖ్యంగా గుండెజబ్బులు , 

మఖానక్షత్రం రక్తపోటు , గుండెదడ , గుండెలో కండరాల వాపు , గుండె వాల్వుల జబ్బు మరియు గుండె వాల్వులు చెడిపోవుట , జ్వరములు తలతిరగడం , కొలెస్ట్రాల్ అధికం అయ్యి రక్తనాళాలు మూసుకుపోవడం 

ముఖ్యంగా పుబ్బ నక్షత్రం వారికి ఇది చూపిస్తుంది. గుండెకి సంబంధించిన అన్నిరకాల వ్యాధులు , 

గుండె మార్పిడి , కాళ్లు పొంగడం , మోకాళ్ల వాపు , మోకాళ్ల నొప్పులు , మోకాలి చిప్ప వాపు మరియు నొప్పి , మూర్చ జబ్బు. వంటి సమస్యలు వస్తాయి.

కన్య.

కడుపుకి సంబంధించిన సమస్త రోగములు , లివర్ , గాల్ బ్లాడర్ వ్యాధులు , డిసెంట్రీ , కడుపునొప్పి, అల్సర్లు , 

చిత్త 1 , 2 పాదములు పైత్యం, అల్సర్ , వాంతులు , 

పైత్య వికారం, తల తిరగడం వంటి వాటిని చూపిస్తాయి. కడుపులోని రక్తనాళాలకు జబ్బు, 

ఈ రాశి నుండి కుంభం 6 వది కావడం వలన పిక్కలు , చీలమండల వాపులు , నొప్పులు వీటిపైన దెబ్బలు తగలడం ముఖ్యంగా రాతి వలన దెబ్బలు , ప్రమాదాలు జరిగి తలకు దెబ్బలు తగలడం , ముఖం పగలడం , అజీర్ణవ్యాది,ఎక్కువ ఆహారం తినటం వలన కలిగే వ్యాధులు , 

కన్యారాశి జీర్ణం అయిన ఆహారం లో నుండి శక్తికి గ్రహించడం కలిసిపోవడం మరియు శక్తిని శరీరానికి ఉపయోగించేలా క్రియలు చేస్తుంది . 

కాబట్టి ఈ క్రియలకు అడ్డు కలిగించే వ్యాధులు , 

తాగుడు ( హస్తా నక్షత్రం ) దానివలన మత్తు కలిగి ప్రమాదాలకు గురి అవడం జరుగును.

తుల.

మూత్రపిండాల జబ్బు, మూత్రపిండం మార్పిడి , మూత్రనాళాలలో రాళ్లు , మూత్రనాళాల వాపు , 

వెనక భాగం వీపు దిగువ భాగంలో తట్టుకోలేని విపరీతమైన నొప్పి , మూత్ర విసర్జనకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు , మూత్రంలో గ్లూకోజ్ , 

యూరినరీ ఇన్ఫెక్షన్ , మూత్రపిండాల ఇన్ఫెక్షన్ వలన నొప్పి, అపెండిసైటిస్ , పాదాల వాపు , పాదాల వ్రేళ్ల వాపు , నొప్పులు , పాదాల ఇన్ఫెక్షన్ సమస్యలు కలుగును.

వృశ్చికం.

బాహ్యజననేంద్రియాలకు సంబందించిన వ్యాధులు , మూత్రకృచ్చం , బ్లాడర్ వాపు , హైడ్రోసిల్ , బ్లాడర్ లో రాళ్లు , రతిక్రియ ద్వారా సంభవించు వ్యాధులు , గుదము , రెక్టమ్ వీటికి సంబంధించిన సమస్యలు , మూలవ్యాది, భగంధరం , గుదములో పుండ్లు , 

గర్భాశయ క్యాన్సర్ , అండాశయం యొక్క వ్యాధి , హెర్నియా , పొత్తి కడుపులో నొప్పి, తెల్లబట్ట , పసుపు బట్ట మొదలగు స్త్రీ జననేంద్రియ వ్యాధులు , గనేరియా , సిఫిలిస్ , ప్రొస్టేట్ గ్రంథి వాపు , గర్భాశయంకు శస్త్ర చికిత్స చేసి తీసివేయుట , విసర్జన సక్రమంగా జరగకపోవటం , అనురాధ నక్షత్రం వలన మలబద్దకం , గ్యాస్ సమస్య , నపుంసకత్వం , నరాల బలహీనత, తలలో కురుపులు , నిద్రలో నడుచుట, మత్తులోకి పోవటం , దీర్ఘనిద్ర , జననేంద్రియముల వద్ద చర్మవ్యాధి , ఫెలోపియన్ నాళాల వాపు , నిస్సంతానం వంటి సమస్యలు కలుగును.

ధనస్సు.

కీళ్లవాతం, ధనుర్వాతం, సయాటిక, పిక్కలు , తొడలు నొప్పి, వాటి ఎముకలు విరుగుట , పిరుదులపైన కురుపులు , నడుమునొప్పి, తొడలలో వచ్చు తొడపాము అనే జబ్బు , గౌట్ జబ్బు కలుగును. 

పూర్వాషాడలో చంద్ర , గురు , శుక్రులలో ఎవరైనా ఒక్కరు ఉన్నను మధుమేహం కలుగచేస్తారు . 

ఉత్తరాషాడ 1వ పాదం వలన పిరుదులపైన 

శగ కురుపులు.

మూలా నక్షత్రం వలన ఎక్సరేకి కూడా చిక్కని అంతుదొరకని నడుమునొప్పితో ఇబ్బంది పడతారు.  కీళ్లవాతాలు సంభంవించును.

మకరం.

మోకాళ్ళ నొప్పులు , వాపులు , ఎముకలు విరుగుట, చర్మవ్యాదులు ఎగ్జిమా , కీళ్లవాతం , జలుబులు , 

శ్వాశకోశ వ్యాధులు , శ్వాశ పీల్చలేకపోవడం ఆయాసం , గుండెవ్యాధులు సంభంవించును.

కుంభం.

గుండె వ్యాధులు , చెవి వ్యాధులు , ముఖ్యంగా ఎడమచెవి సమస్యలు , కాళ్లవాపు , చీలమండల వాపు , రక్తపోటు , బోదకాలు , చర్మవ్యాదులు , మలబద్దకం , అజీర్ణవ్యాధులు , రక్తప్రసరణ సరిగ్గా లేకపోవటం , చిగుళ్లవాపు , నొప్పి , శ్వాసనాళంలో అన్య వస్తువు లేక కండరం పెరగటం , శ్వాసక్రియకు అడ్డుతగలడం వంటి సమస్యలు కలుగును.

మీనము.

తాగుడుకు బానిస అవ్వడం , గ్యాస్ట్రిక్ సమస్యలు , పాదముల వాపు , నొప్పులు , మడమల పగుళ్లు , మడమశూలలు , అరికాలిలో కురుపులు , 

పాదాలకు ఎక్కువ చెమట పట్టడం , పాదాలలో ఆనెలు కలుగును. 

పూర్వాభాద్ర 4 వ పాదం వలన లివర్ సమస్యలు , ఉత్తరాబాద్ర కారణమున పచ్చకామెర్లు , వాతం , 

లివర్లో రాళ్లు , లివర్ పెరగటం , 

రేవతి వలన నరాల జబ్బులు , పాదాల వాపు కలుగును. ముఖ్యంగా పాదాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ కలుగును.

ఇప్పటి వరకు మీకు నేను ఆయా రాశుల వారికి కలుగు వ్యాధుల గురించి తెలియచేశాను 

మన వ్యక్తిగత జాతకం అనుసరించి ఆయా గ్రహస్థితుల స్థానాన్నిబట్టి మనుష్యులకు రోగాలు వచ్చును.

గమనిక:-వ్యక్తి జాతక పరిశీలన తెలుసుకొని,నివారణ ప్రక్రియలు చేయవచ్చు

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS