Friday, March 29, 2019

వాస్తు ప్రకారం దిక్కుల ప్రాధాన్యత

వాస్తు ప్రకారం దిక్కుల ప్రాధాన్యత.....
మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి. వాటిని 'అష్ట దిక్కులు' అంటాము. వాటిని పాలించే వారిని 'దిక్పాలకులు' అంటారు.              
దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములను 'దిక్కులు' అంటారు.
విదిక్కులు: ఈ నాలుగింటితో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అను నాలుగు విదిక్కులు కూడా కలవు. అన్నింటిని కలిపి అష్టదిక్కులు అంటాము.
1) తూర్పు: తూర్పు దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము 'అమరావతి.' ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతాన కారకుడు. అధికారం కలుగజేయువాడు. సూర్య గ్రహం ప్రాదాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అదికారుల బాధలు ఉంటాయి.
2) ఆగ్నేయ మూల: ఆగ్నేయ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టేలు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణము తేజోవతి. ధరించే ఆయుధము శక్తి. ఈయన కోపం,అహంకారం ప్రసాదించే వాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాదాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబందించిన దిక్కు. వంట స్త్రీలకు సంభందించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి.
3) దక్షిణము: దక్షిణ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత యమధర్మరాజు. ఈయనకు దండపాణి అని మరో నామధేయమున్నది. యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము (దున్నపోతు). నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధము దండము. దండమును ఆయుధముగా కలవాడు కాబట్టి ఈయనను 'దండపాణి' అని కూడా అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆదిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచు వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.
4) నైరుతి మూల: నైరుతి దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయుధము కుంతము. వంశ నాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాదాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసికమైన చికాకులు అధికం
5) పడమర: పడమర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వరుణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వాహనము మకరము (మొసలి). ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించే ఆయుధము పాశము. సర్వ శుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాదాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి.
6) వాయువ్య మూల: వాయువ్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వాయువు. అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధవతి. ధరించే ఆయుధము ధ్వజము. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయువ్య దిక్కు చంద్రుడు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడుకులు ఉంటాయి.
7) ఉత్తరము: ఉత్తర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము. విద్య, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తరదిక్కు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబంద విషయాలలో ఇబ్బందులు వస్తాయి.
ఈశాన్య మూల: ఈశాన్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము(ఎద్దు). నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయుధం త్రిశూలం. గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు, భక్తి జ్ఞానములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆదిపత్యం ఉంటుంది.ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఎర్పడతాయి.
ఈ విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాలురు ఉండి మానవు లను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు.దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా, దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు.
దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహా విష్ణువు. అష్ట దిక్కులకు వారిని నియమించి, విధి విధానాలను, నియ మాలను, ధర్మాలను ఆజ్ఞాపించు వాడు, నడి పించు వాడు, అధి(పతి)కారి శ్రీ మహా విష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు.
: దిక్కులు - గ్రహములు - దిక్పాలకులు
నవగ్రహములు దశ దిక్కులకు అధిపతులై ఉన్నారు.
1. తూర్పుకు - సూర్యుడు
2. ఆగ్నేయమునకు - శుక్రుడు
3. దక్షిణమునకు - కుజుడు
4. నైరుతి - రాహువు
5. పశ్చిమము - శని
6. వాయువ్యము - చంద్రుడు
7. ఉత్తరము - బుధుడు
8.ఈశాన్యము - గురువు, కేతువు
9. గగనము - చంద్రుడు
10. భూమి - కుజుడు
ఇలా దశ దిక్కులకు గ్రహములు అధిపతులై ఉన్నారు.

వృక్ష దేవతలు

వృక్ష దేవతలు
హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.
నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.
తులసి
తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని,దానితోఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవి త్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది
యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం
మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్నవిషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్లనే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.
రావి
దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది
మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:
ఈ వృక్షం మూలం వద్ద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.
వేప
వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్లనే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప‌ చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
మారేడు
మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.
ఆ శ్లోకం
అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్‌
మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ మూడు పత్రాల దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. జైనులకు కూడా ఇది పవిత్ర వృక్షం. వారి గురువుల్లో ఒకరైన 23వ తీర
్థంకరుడు భగవాన్‌ పరస్‌నాథ్‌జీ మారేడు వృక్షం కిందే నిర్వాణం (జ్ఞానోదయం పొందారని) భావిస్తారు. మారేడులో ఔషధ గుణాలు అధికం. కడుపులో మంటకు కారణమయ్యే ఎసిడిటీ వంటి సమస్యలకు, కొన్ని ఉదర సంబంధ వ్యాధులకు మారేడు చూర్ణం, మారేడు ఆకుల కషాయం పనికొస్తుంది.
జమ్మి
జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి. సంస్కృతంలో దీనిని శమీ వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం కూడా పుణ్యప్రదమని చెబుతారు. జమ్మి చెట్టు గొప్పతనాన్ని వివరించే ఒక శ్లోకం కూడా ఉంది. అది
శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శిని
శమి శత్రువులను నశింపజేస్తుందని, పాండవుల ఆయుధాలను మోసినదని, రామునికి ప్రియమైనదని దీని అర్థం. ఈ వృక్షం పైనే అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలు దాచారు. అలాగే రాముడు లంకపై యుద్ధానికి వెళుతున్నపుడు ఈ వృక్ష అధిష్ఠాన దేవతే ఆయనకు విజయం సిద్ధిస్తుందని చెప్పినట్లు ఒక కథ అలాగే అగ్ని దేవుడు ఒక పర్యాయం భృగు మహర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టులోదాగి ఉన్నాడని కథ. ఈ చెట్టు బెరడనును కుష్ఠు రోగం, గాయాలు, శరీరంపై వచ్చే వ్రణాలు వంటి వాటి చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడు పొడి గొంతు నొప్పి, ఆస్త్మా మరెన్నో రోగాల చికిత్సలో ఉపయోగపడుతుంది. గింజలు, రెమ్మలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తుంది.
ఉసిరి
ఉసిరిని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తా రు. అందరికీ తెలిసిన వన భోజనాలు ఉసిరి చెట్టు వనంలో లేదా ఉసిరి చెట్టు ఉన్న వనంలో చేయాలంటారు. కార్తీక మాసంలో ఈ చెట్టు ను శ్రీమహా విష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఉసిరి కాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం లో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం.
మేడి
మేడి చెట్టుకింద దత్తాత్రేయుల వారు కూర్చుని ఉంటారు. త్రిమూర్త్యాత్మకుడు ఎప్పుడూ ఏ చెట్టు నీడనుంటాడో అది పవిత్రమైనది కాక మరేమవుతుంది. అది దేవతా వృక్షమే. ఎండిన మేడి పళ్లను ఆరోగ్యం కోసం కూడా వాడతారు.
మర్రి
మర్రి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును చాలా సంస్కృతుల్లో జీవానికి, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. అందువల్లనే సంతానం లేనివారు మర్రి చెట్టును పూజించే ఆచారం ఉంది. అలాగే దీనిని ఏ సమయంలోనూ నరికి వేయరాదన్నది పురాణాలలో పేర్కొన్నారు. సర్వ లోకాలకూ గురువుగా భావించే జ్ఞాన స్వరూపుడైన మేధా దక్షిణామూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు. పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని ఇండియన్‌ బొటాని కల్‌ గార్డెన్‌లో ఉన్న మర్రి చెట్టు ప్రపంచంలోనే అతి పెద్దది.
అశోక
ఈ చెట్టును కామ దేవునికి ప్రతీకగా భావిస్తారు. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తారు. బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెబుతారు. అందువల్ల వీటిని బౌద్ధారామాల్లో ఎక్కువగా నాటుతుంటారు. అశోక వృక్షం కూడా పవిత్ర వృక్షం ఒకటి. పుష్పాల నుంచి తీసే ఎసెన్స లో ఈ పుష్పాలకు ప్రత్యేక స్థానం ఉంది.ఇది దట్టమైనాకులతో నిటారుగానిలబడే చిన్నది. ఇది పువాసన కల ఎరుపు రంగు పుష్పాలతో ఉంటుంది. ఏప్రిల్‌, మే నెల్లో ఈ చెట్టు పుష్పిస్తుంది. హిమాలయాల తూర్పు, మధ్య ప్రదేశ్‌ లోను, ముంబై పశ్చిమ తీర ప్రంతంలోనూ ఇది కనిపిస్తుం ది.అశోక అంటే సంస్కృతంలో శోకంలేనిది లేదా శోకాన్ని దూరం చేసేది అనేఅర్థాలు చెప్పుకోవచ్చు. దీనికి ప్రాంతీయ భాషల్లో పలు పేర్లు ఉన్నాయి.
మామిడి
మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. ఈ మామిడిపండు పండుగా ప్రేమకు, సంతానసాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభ కార్యమైనా మామిడి ఆకు తోరణాలు కట్టకుండా ప్రారంభం కాదు. ఈ ఆకులకు ఎక్కువ మంది చేరిన చోట ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని కూడా చెబుతారు.
కొబ్బరి
కొబ్బరి చెట్టును కల్ప వృక్షంగా వ్యవహరిస్తారు. అన్ని దైవసంబందమైన కార్యాలనూ కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు. పూర్ణ కుంభంలో పై నుంచేది కొబ్బరికాయనే. ఇక కొబ్బరికాయను శివ స్వరూపంగా దానిపై ఉన్నమూడు నల్ల మచ్చలను ఆయన త్రినేత్రాలుగా పేర్కొంటుంటారు. కొబ్బరికాయ నీరు మనుషులు తాకని స్వచ్చమైన జలమని నమ్ముతారు. అటువంటిది మరే పండు విషయంలోనూ లేదు, దేవతలకు కొబ్బరి నీటితో అభిషేకం చేయడం కూడా చేస్తుంటారు.
అరటి
అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవునికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభ కార్యాసమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల భోజనాలకు వీటిని ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లోకదలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజచేస్తారు.

చందనం
చందనం చెక్క ఆరగదీయడం వల్ల వచ్చే చందనం నిత్య పూజలో ఒక భాగం కనుక దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులో దానిని ఇచ్చే చందన వృక్షాన్ని దేవతా వృక్షంగా భావిస్తారు.

వెదురు
దేవునికి చెందిదేదైనా పవిత్రమైనదనే భావంతో కృష్ణుని వేణువు తయారైన వెదురును కూడా దేవతా వృక్షంగా భావిస్తుంటారు. హిందీలో బన్సూరి అంటే వేణువు. కృష్ణుడు చేతిలో వేణువు కలిగి ఉంటాడు కనుక ఆయనను బన్సీలాల్‌ అని కూడా పిలుస్తుంటారు.

వారణాసి కాశీి వైభవం

*వారణాసి కాశీి వైభవం*
కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:
# కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.
# విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.
# ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.
# స్వయంగా శివుడు నివాసముండె నగరం.

# ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.
# కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.
# పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.
# కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....
# ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశీ లోనికి అనుమతించడు.
# కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.
# కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....
# డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...
# కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.
# కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.
# కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.
# అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.
# మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.
# గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది
# ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.
@ శివుని కాశీలోని కొన్ని వింతలు...
# కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.
# కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.
# కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.
# అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు.
# అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?
# అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు
# అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.
# కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .
# కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.
# కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.
# విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.
# ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.
# ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.
కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..
ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :
1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో  తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది.

11) హనుమాన్  ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది 
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్: 
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్: 
నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్  ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్
ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో                     అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.
పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.
కానీ  మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా  చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.
విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.
నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.
అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.
ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు
*కాశీ స్మరణం మోక్షకారకం*!


భార్య మంగళ సూత్రo లో పిన్నీసులున్నాయా..

:
భార్య మంగళ సూత్రo లో పిన్నీసులున్నాయా..
మీ ఇంటికి... ఇల్లాలికి శుభం జ‌ర‌గాలంటే... కొన్ని నిమాలను పాటించాలి. భర్త అనురాగం పెరగటానికి... సంతాన భాగ్యానికి... సిరిసంపదలు పొందటానికి... వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించి చూడండి.
- మంగళ సూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి ఉంచుతుంటారు. మంగళ సూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువుపట్టు. మంగళ సూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది. ఇనుప వస్తువులు [పిన్నీసులు, ఇనుముతో చేసినవి] దివ్య శక్తులను ఆకర్షించుకొను గుణం ఉన్నాయి. అవి మంగళ సూత్రంలో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి. భర్తకు అనారోగ్యం, భార్యాభర్తల పట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. ఈ అలవాటు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి.
- స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది.
- ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచ‌డం అంత క్షేమం కాదని, డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలా మంది నమ్మకం.

Tuesday, March 5, 2019

జపము - జపమాల ప్రాశస్త్యం

జపము - జపమాల ప్రాశస్త్యం
జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః |
జన్మపాప వినాశత్వాత్ జప ఇత్య భి ధీయతే ||
'జ'కారం జన్మ లేకుండా చేస్తుంది. 'ప'కారం పాపాలను నశింపచేస్తుంది. జన్మరాహిత్యాన్ని పాపపరిహారాన్ని చేహడంవల్ల 'జప'మనబడుతోది.
జపం మూడు విధాలు. వాచికం, ఉపాంశువు, మానసికం.
మంత్రం సమీపంలోని వారికి వనబడునట్లు ఉచ్చరిస్తే వాచిక జపం.
పెదవుల కదిల్కద్వారా దగ్గరుండే వారికి మాత్రమే వినబడేటట్లుగా జపిస్తే ఉపాంశు జపం.
ధ్యానంలో పరవశిస్తూ జపించడం మానసిక జపం.
వాచిక జపం కంటే ఉపాంశు వెయ్యి రెట్లు అధికం, దీనికి వెయ్యి రెట్లు అధిక ఫలం మానసిక జపం వలన కలుగుతుంది. కాబట్టి మానసిక జపమే శ్రేష్టం.
"న దోషో మనసే జాపే సర్వ దేశే ఫై సర్వధా!" అంటే మానసిక జపానికి ఏ దోషం అంటదు అటువంటి వ్యక్తికీ ఎటువంటి హానీ కలుగదు అంటోది తత్వశాస్త్రం.
యక్షో రక్షః పిశాచాశ్చ గ్రహం సర్వేచ భీషణాః |
జాపినం నొప సర్వంతి భయ భీతా స్సమంతతః ||
జపేన పాపం శమయే దశేషం యత్తత్క్రుతం జన్మపరం పరాసు |
జపేన భోగానె జయతేచ మృత్యుం జపేన సిద్ధి లభతేచ ముక్తిం ||
యక్షరాక్షస పిశాచాది భయంకర గ్రహాలు జపం చేసేవారిని చూసినంత మాత్రానే భయపడి దూరంగా పరిగెత్తుతాయని, జన్మాంతర సంచిత పాపం నశిస్తుందని, సుఖ-శాంతులు మరియు ముక్తి లభిస్తాయని లింగపురాణం అంటోంది.
అంతటి మహత్యం కలది కాబట్టే శ్రీ కృష్ణభగవానుడు యజ్ఞానం జప యజ్ఞోస్మి అంటూ గీతలో జపాన్ని యజ్ఞంతో పోల్చి చెప్పాడు.
వివిధ స్థానాల్లో మంత్రజప ఫలం :
ఇంట్లో చేసే జపం జప సంఖ్యతో సమాన ఫలితాన్నిస్తుంది.
గోశాలలో అయితే జపసంఖ్య కన్నా నూరు రెట్లు ఎక్కువ.
నదీతీరంలో అయితే జపసంఖ్య కన్నా లక్షరెట్లు ఎక్కువ.
సాగర తీరాలు, దేవ జలాశయాలు, పర్వత శిఖరాలు, పవిత్ర ఆశ్రమాలు, శివ సాన్నిధ్యం, సూర్యబింబంలో నారాయణుని దర్శిస్తూ, అగ్నిసన్నిధిలో, దీపం వద్ద, గురుసన్నిధిలో జపం చేయడం వీశేష ఫలప్రదామని లింగ పురాణం చెబుతోంది. అలాగే తులసీవనం, అశ్వద్ధ వృక్షము, ఉసిరి, మారేడు వృక్షములలో చేసే జపం విశేష సిద్ధి ప్రదామని పురాణాలు చెబుతున్నాయి.
జపపూసలు మరియు సంఖ్య
జప సాధనకు జపమాల, దానిలో 108 పూసలుంటాయి. సూర్యులు ద్వాదశాదిత్యులని 12 విష్ణు స్వరూపులు. సూర్యునికి ద్వాదశ రాశులుంతాయి. ఆ సూర్యుడే బ్రహ్మ స్వరూపము. బ్రహ్మ సంఖ్య 9. 12 సంఖ్యలు గల సూర్యునితో బ్రహ్మను గుణిస్తే 108 సంఖ్య అవుతుంది. 108 యోగము 1+8=9 అవుతుంది. నవ సంఖ్య బ్రహ్మకు ప్రతీకము. అందువలననే బ్రహ్మవేత్తలైన సన్యాసులు నామములకు మునుపు బ్రహ్మకు ప్రతినిధిగా 108 అని వ్రాస్తున్నారు.
జపమాలను బొటన వ్రేలితో కలిపి ఎట్టి ప్రస్థితులలోనూ చిటికెన వేలుతో తిప్పరాదు. అది పూర్తిగా నిషిద్ధము. తర్జనివ్రేలు, శత్రువినాశకరమని, అంగుష్టము మోక్షదాయకమని, మధమాంగుఌ ధనదాయకమని, అనామిక శాంతిప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అతి తప్పనిసరిగా బొటనవ్రేలును ఉపయోగించాలి.
జపమాల జారటం, తెగటం అనేవి జరగకుండా తగు జాగ్రత్త వహించాలి.
తూర్పు ముఖ జపం వశీకరణ కారకం.
దక్షిణ ముఖ జపం అభిచారిక (గారడి) కారకం.
పడమర ముఖ జపం సంపద కారకం.
ఉత్తర ముఖ జపం పౌష్టిక కార్యాలు, శాంతి, మోక్ష కారకం.
మానసిక జపానికి ఎక్కువ నియమాలు లేవు. 'మానసిక జపో నియమోనాస్తి' అని శాస్త్రం చెబుతోంది.
అశుచిర్యా శుచిర్వాః గచ్ఛం స్తిష్ఠన్ స్వజన్నపి |
మంత్రైక శరణోవిద్వాన్ మన శైవం సదాభ్యసేత్ ||
నదోషో మనసే జాపే సర్వదేశేపి సర్వదా |
జపనిష్టో ద్విజశ్రేష్ఠో జప యజ్ఞఫలం లభ్యత్ ||
పవిత్రునిపై కాని అపవిత్రునిపై కాని, నడచుచూ కాని, నిలబడి కాని, పరుండి కాని మనసులో మంత్రాన్ని జపించవచ్చును. మానవ జపము సర్వకాల, సర్వదేశ, సర్వావస్థల్లో చేయవచ్చు. అట్టివారు సర్వ యజ్ఞ ఫలితాన్ని పొందుతారు.
క్రుష్ణాజిన ఆసనం జ్ఞాన సాధకం.
చిత్రాసనం సర్వార్ధ సాధకం.
కుశాసనం మంత్రసిద్ధి.
వ్యాఘ్రాసనం పురుషార్ధ సాధకం.
జింక చర్మంపై జపం భగందర రోగం నయం.
ఒకరు ఉపయోగించిన ఆసనం వేరొకరు ఉపయోగించరాదు.
నేలపై కూర్చొని చేసే జపం దుఃఖ కారకం.
పీటపై దౌర్భాగ్యం.
వెదురుచాప దరిద్రం.
గడ్డిపై ధన, కీర్తి హాని
చిగురుటాకులు లేక పెద్ద ఆకులూ చిత్తాన్ని చలింపచేస్తాయి.
ఆసనం అంటే -- 'ఆ'సనం అంతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. ఆ'స'నం సర్వరోగాలను బాగుపరిచేది ఆస'న' నవ నిధులను ప్రసాదించేది అని అర్థం. జప, తపస్సు, దేవతారాధన మరియు సంధ్యావందనమునకు ఆసనం ప్రధానం.


శ్రీకృష్ణ మంత్రసాధన

శ్రీకృష్ణ మంత్రసాధన సప్తాహం
కృష్ణాష్టమి మొదలు అమావాస్య వరకు 7 రోజులు మంత్రసాధనకు ఎంతో ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. 

ఈ మంత్రసాధనకు ముందు ఒక్కసారి శ్రీకృష్ణుడు చేసిన ముఖ్యమైన లీలలు (మహిమలు) కొన్ని పరిశీలన చూద్దాం.
పసిబాలుడుగా ఉన్నప్పుడే  పూతన, శకటాసురుడు, తృనావర్తుడు మొదలైన వారిని, కొంచెం పెద్ద అయ్యాకా కంసుడు మొదలైనవారిని, కాళీయ మర్దనం , గోవర్ధన పర్వతం ఎత్తడం, గురుపుత్రుడిని తీసుకురావడం, తరువాత పౌండ్రకవాసుదేవుడు, శిశుపాలుడు, కాలయవనుడు మొదలైన వారిని సంహరించడం , తరువాత  ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో,  పాండవులు అరణ్యవాసంలో అనేకసార్లు, తరువాత కురుక్షేత్ర యద్ధంలో యద్ధం పూర్తి అయ్యాక అభిమన్య కుమారుడు అయిన పరీక్షిత్తుని ప్రాణాన్ని కాపాడడం, యద్ధం పూర్తి అయ్యాక ధ్రుతరాష్ట్ర కౌగలి నుంచి భీముని కాపాడడం వరకు  ఆయన లీలలు అనేకం.
వీటిలో కొన్నిటిని తీసుకుని వాటిని మంత్రశాస్త్ర పరంగా అనుసంధానం చేసి మంత్రసాధన చేసి మనకు ఉన్న ఇబ్బందులు తొలిగించుకోవచ్చు.  మనం ముందే అనుకున్నట్టు శ్రీకృష్ణుడు జగద్గురువు.  గురువు అనగా అంధకారం తొలిగించేవాడు.  భౌతిక జీవితంలో మన మనసుకు కమ్మిన మాయవల్ల సమస్యాపరిష్కార శక్తి కోల్పోయినప్పుడు  గురురూపంలో ఆ మాయను తొలిగిస్తాడు.(అర్జునునికి భగవద్గీత చెప్పి కరవ్య బోధ చేసినట్టు).

అయితే కృష్ణ మంత్రం ఎలా సాధన చెయ్యాలో కొంచెం వివరంగా చూద్దాం.
ఏదైనా మంత్రం జపం చేస్తున్నప్పుడు  ముందుగా ధ్యాన శ్లోకం చెబుతాం.  ఆ ధ్యాన శ్లోకంలో దేవత యొక్క రూపం
దేవతాతత్త్వం, ఆ దేవత ఆయుధ విన్యాసం ఉంటాయి.
మానవుడు పూర్వజన్మ కర్మలవల్ల ఈ జన్మల్లో కర్మలు అనుభవిస్తారు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.  వీటివల్ల మానవులకు  చిన్నతనంలో  ఆరోగ్యం, చదువు, తరువాత వివాహం, సంతానం, ఇల్లు, వాహనం, వృద్ధులైన తల్లితండ్రులు,  తరువాత జాతకుని అతని భార్య కు ఆరోగ్యం ఇలా సమస్యలు ఉంటాయి.

శ్రీకృష్ణ మంత్రం అనుష్టానం ఎలా చెయ్యాలో చూద్దాం.
1. జాతకంలో కాల సర్పదోషం వల్ల ఇబ్బందులు ఉన్నప్పుడు  కాళీయుని మర్ధించే కృష్ణ రూపంలో ధ్యానం చెయ్యాలి.

2. తీవ్రమైన ఆపదలు వచ్చినప్పుడు గోవర్ధనగిరి ఎత్తిపెట్టిన కృష్ణ రూపంలో ధ్యానం చెయ్యాలి.
3. శత్రువువల్ల బాధలు పడుతున్నప్పుడు చక్రహస్తుడైన కృష్ణరూపంలో ధ్యానం చెయ్యాలి.
4. పరువు మర్యాదలకు భంగం వచ్చినప్పుడు ద్రౌపది రక్షకుడి రూపంలో ధ్యానం చెయ్యాలి.
5. సమస్యాపరిష్కార శక్తి లోపించినప్పుడు శంఖ నాదం చేసున్న కృష్ణుడిని లేదా భగవద్గీత భోదించే కృష్ణ రూపంలో ధ్యానం చెయ్యాలి.
6. అనారోగ్యం లేదా అపమృత్యు బాధలు కలిగినప్పుడు పరీక్షిత్ ను రక్షించిన కృష్ణుని ధ్యానం చెయ్యాలి.
7. గరుడ వాహనుడైన కృష్ణుని ధ్యానం చెయ్యడం మూలంగా ఆరోగ్యం బాగుంటుంది.
8. కుటుంబంలో అశాంతి కలిగినప్పుడు, భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు రాధా సహితుడైన కృష్ణుని ఉపాసన చెయ్యాలి.
9. సంతానం కోసం సంతానగోపాలుడిని ఉపాసన చెయ్యాలి.
10. సకల కార్య సిధ్ధి కోసం శంఖ- చక్రాలు ధరించిన కృష్ణుని పూజించాలి.
ఇలా అనేక రూపాల్లో మంత్రాలతో శ్రీకృష్ణుడిని పూజ చేసి మన కోర్కెలు తీర్చుకోవచ్చు.

పంచభూత లింగములు

భారతదేశ ప్రసిద్ద ఆలయాలు - పంచభూత లింగములు
పంచభూత లింగములు : పృధ్వీ లింగము, జల లింగము, తేజొ లింగము ,ఆకాశ లింగము, వాయు లింగము వీటిని పంచభుత లింగములు అంటారు .
1. పృధ్వీ లింగము : ఏకాంబరనాధ లింగము (పృధ్వీ లింగము) -  అరుల్మిగు కంచి ఏకాంబరనాథర్ తిరుకొయిల్
తమిళనాడులో (కంచి) లో ఏకాంబరనాధ లింగము (పృధ్వీ లింగము) పంచ లింగాలలో ఒకటి. ఈ కాంచీపురంను కంజీవరం అని కూడా అంటారు . కాంచీపురంలో విష్ణు కంచి , శివ కంచి అని రెండు భాగాలుగా ఉంది . అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు .
ఏకాంబరేశ్వర దేవాలయం (తమిళం: ஏகாம்பரநாதர் கோயில்) లేదా ఏకాంబరేశ్వర దేవాలయం తమిళనాడు నందలి కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాలలో ఒకటి [1]. ఈ దేవాలయ గోపురం ఎత్తు 59 మీటర్లు ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి [2]
కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకామ్ర .ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం ,ఆకాశం అని నానార్థాలు. ఏకామ్రేశ్వరస్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు.ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు.
ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి.
ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు.
ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. తిరునిలథింగల్ తుండం అనే మహా విష్ణువు సన్నిధి ఉన్నది. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం క్రింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్ని ని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువు ను ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తలమీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ. తరువాత శివుడు పార్వతి మీదకు గంగ ను ప్రవహింప జేయగా, పార్వతి గంగను ప్రార్థించి, వారిద్దరు శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగనస్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము.. ఇక్కడ ఉన్న విష్ణువు ను వామనమూర్తిగా పూజిస్తారు.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులు ఈ క్షేత్రాన్ని దర్శించి పూర్వికల్యాణి రాగం లో ఏకామ్రనాథం భజేహం మఱియు భైరవి రాగం లో చింతయమా కంద మూల కందం అను కృతులను రచియించిరి.
2. జల లింగము : జంబుకేశ్వరస్వామి, జంబుకేశ్వరము, తిరుచునాపల్లి, తమిళనాడు
తమిళనాడులోని జంబుకేశ్వరమున జలలింగము ఉంది. ఈ జలలింగము జంబుకేశ్వరస్వామిగా పిలవబడును. జంబుకేశ్వరం తిరుచునాపల్లికి చాలా దగ్గరలో ఉంది. జంబుకేశ్వరము పురాతన కాలము నాటి శివ క్షేత్రము. ఈ గుడిలో నిరంతరం ఊరే నీటి వూట ఉంది . ఇక్కడున్న నేరేడు చెట్టుని జంబువృక్షమని అంటారు. జంబుకేశ్వరంనుండి శ్రీరంగం సుమారు 01కి. మీ దూరం . కావేరి నది శ్రీరంగం , తిరుచునాపల్లి నగరం చుట్టూ ప్రవహిస్తుంది .
పంచభూత క్షేత్రాలలొ రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరం తమిళనాడు రాహ్స్ట్రములొని తిరుచ్చి 11 కి.మి దురములొ ఉన్నది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్ మరియు తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు.
స్థలపురాణం
ఇక్కడ స్థల పురాణం మీద రెండు ప్రాచుర్యములొ ఉన్న కథలు ఉన్నాయి.

మొదటి ఇతిహాసం
మొదటి కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తూ వుండగా ఒకసారి శంభుడికి శివున్ని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు తన అభీష్టం అయిన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకొన్నాడు. భోళా శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపములొ వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించెదవు అని చెప్పి అంతర్థానం అవుతాడు. శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడి గా ఇక్కడి భక్తుల నమ్ముతారు.

మరో ఇతిహాసం ప్రకారం
ఇక్కడ స్వామి వారిని ఏనుగు, సాలిపురుగు పోటి పడి పూజిస్తుండేవి. ఆ శ్రీకాళహస్తి స్థలపురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది.

జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉన్నది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళం లో పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరి నది లో స్నానం ఆచరించడం జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్ఠం అని ఇక్కడి స్థానికుల నమ్మకం.
ఆలయం విశేషాలు
ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో ఉన్నది. దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు ప్రాకారాలు కలిగి ఉన్నది. ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉన్నది. ఆలయప్రాకారములొ జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉపఆలయాలు, అనేక మండపాలు ఉన్నాయి.

గర్భ గుడి
జంబుకేశ్వరుడిగా పేరుపొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది కాని నీటిలో లేదు. లింగం పానపట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడి లో గవాక్షానికి "నవద్వార గవాక్షం" అని పేరు. గర్భాలయం లో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా పిలుస్తారు.

అఖిలాండేశ్వరి ఆలయం
జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు.అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు, నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తం తో వరద ముద్ర తో ఉన్నారు. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్ర రూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్ర రూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగ మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని , అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం.

ఆలయ చరిత్ర- నిర్వహణ బాధ్యతలు
చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీ రంగం లొ ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతన మైనదని తెలుస్తోంది. క్రీ.శ. 11 వ శతాబ్ధములొ చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ తరువాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తోంది. ఆలయం స్వామి దీపధుపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసి నట్లు తెలుస్తోంది. నాయనార్ల లొ ప్రసిద్ధులైన సుందరర్ సంబంధర్ మొదలైనవారు స్వామిని సేవించి తరించారు. కొంత కాలం క్రితం వరకు ఈ ఆలయనిర్వహణ బాధ్యతలు కంచి కామకోటి మఠం వారు నిర్వహించారు.

3. తేజో లింగము : అరుణాచలేశ్వర స్వామి -  ఉమాదేవి , అరుణాచలం ( తిరువణ్ణామలై) ,తమిళనాడు .
తమిళనాడులో (అరుణాచలం) తేజోలింగము ఉంది . ఈ స్వామి "అరుణాచలేశ్వర స్వామి"అని పిలుస్తారు. పార్వతీ దేవి ఇక్కడేతపస్సు చేసి, శివునికి అర్థ భాగమైనదని ప్రతీతి. ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి. మీదూరంలో ఉంది. విల్లు పురం నుంచి కాట్పాడికివెళ్లే మార్గంలో ఉంది . విల్లు పురం నుంచి 68కి. మీ .
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉన్నది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు.
అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.
ఈ అరుణాచలం పమేశ్వరుని జ్యోతిర్లింగ  స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడ వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది.
గిరిప్రదక్షిణం
గిరి ప్రదక్షణం చేసేటప్పుడు తిస్కోవాల్సిన జాగ్రత్తలు

గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
బరువు ఎక్కువగా ఉన్నవాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
గిరిప్రదక్షణం 14 కి.మి దూరం ఉంటుంది.
ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది 
గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు.
మీరు చిల్లర తిసుకువెళ్ళడం మరిచిపొవద్దు.
గిరిప్రదక్షణం లో "నేర్(ఎదురుగా) శివాలయం" అని ఉంది దానికర్ధం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని. పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .

రమణాశ్రమం
రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మీల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ స్థానికులకంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చెసే ప్రార్దన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు . రమణాశ్రమం(Ramana ashramam) లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నెమళ్ళు కూడ స్వేచ్ఛగా తిరుగుతూంటాయి. రమణాశ్రమం లో ఇంకా లక్ష్మి (ఆవు) సమాధి , కాకి సమాధి , శునకం యొక్క సమాధిని కూడ చూడవచ్చు . ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంధాలాయంలో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. మీరు ఆశ్రమంలో ఉండాలంటె మీరు ముందుగానే వసతి కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

శేషాద్రి స్వామి ఆశ్రమం
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడ అక్కడే ఉంది. ఇక్కడ కూడ ఉండటానికి రూం లు ఉన్నవి. మీరు ముందుగానే రూం లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

చెన్నై నుండి దూరం
చెన్నై నుంచి 185 కి.మి. దూరం లో కలదు. చెన్నై నుంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం కలదు. చెన్నై లొని కోయంబేడు(సి.యమ్.బి.టి.) బస్సు స్టాండ్ నుంచి అరుణాచలం చేరుటకు 4-5 గంటల సమయం పడుతుంది.

4. ఆకాశ లింగము : నటరాజ స్వామి - శివకామ సుందరి దేవి , చిదంబరం , తమిళనాడు
తమిళనాడులో మద్రాసుకు సుమారు 240కి. మీ దూరంలో ఆకాశలింగము ఉంది. శివుడు ప్రళయ రుద్రతాండవం చేస్తున్న విగ్రహం అతి పెద్దది (నటరాజ స్వామి). ఈ చిదంబర క్షేత్రంలో మహావిష్ణువుఆలయం మరియు శివాలయం (నటరాజ స్వామి) ఒకే చోట కనపడతారు . విల్లుపురం నుంచి తంజావూరు వెళ్లే మార్గంలో ఉంది .విల్లుపురం నుంచి చిదంబరం దూరం 83కి. మీ మాత్రమే.
చిదంబరం దేవాలయం తమిళం: சிதம்பரம் கோயில் పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ ‌కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో, మరియు పాండిచ్చేరి కి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉన్నది. తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన మరియు పూర్వ-మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ , చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి[1].
హిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని యొక్క ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాల కి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ,తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ , కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ మరియు కాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.
ఆలయం
ఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డున వ్యాపించి ఉన్నది 40 acre (1,60,000 m2). శైవుల మరియు వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడుకి, గోవిందరాజ పెరుమాళ్ళుకి అంకితమైన ప్రాచీన మరియు చారిత్రాత్మక దేవాలయం ఇది. ఏ విధంగా కోవెల (గుడి) అంటే వైష్ణవులకు, శ్రీరంగం లేదా తిరువరంగం స్మరణకి వస్తుందో అదే విధంగా శైవులకి చిదంబర ఆలయమే స్మరణకి వస్తుంది.

పద వివరణ
చిదంబరం అను పదం, "చైతన్యం" అని అర్ధం వచ్చిన చిత్ , మరియు "ఆకాశం" (ఆకాయం నుంచి పుట్టిన) అని అర్ధం వచ్చిన అంబరం ; సూచించిన చిదాకశం , చైతన్యం ఆరోపించబడినట్టి ఆకాశం, దీనినే అన్ని వేదాలు మరియు శాసనాల ప్రకారం, మానవుడు చేరుకోవలసిన అంతిమ లక్ష్యంగా చెప్పబడినది.

మరొక సిద్ధాంతం ఏమనగా, ఇది చిత్ + అంబళం నుంచి పుట్టినది. అంబళం అనగా కళలను ప్రదర్శించుట కొరకు ఒక "వేదిక". చిదాకశం అనేది పరమేశ్వరుని యొక్క చిద్విలాసం లేదా ఆనందం మరియు నటరాజుని చిద్విలాసం లేదా ఆనంద నటన యొక్క చిహ్నాత్మక వర్ణన. చిదంబరాన్ని దర్శిస్తే విముక్తి లభిస్తుందని శైవులు నమ్ముతారు.
ఇంకా మరొక సిద్ధాంతం ప్రకారం, "ఆట లేక దైవ నృత్యం" అని అర్ధం వచ్చే చితు మరియు "వేదిక" అని అర్ధం వచ్చే అంబళం నుంచి వచ్చిన చిత్రాంబళం నుంచి ఈ పదం పుట్టినది.
ప్రత్యేక లక్షణాలు
సర్వాలంకృతభూషితుడైన నటరాజుని చిత్రం, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. పరమ శివుడు, భరతనాట్య నృత్యం యొక్క దైవంగా వర్ణించినది మరియు శివుడికి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా మనుష్య రూపాన్ని ఆరోపించిన మూర్తితో శివుడిని నెలకొల్పిన అతికొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. పరమ శివుడు నిలుపునట్టి ఈ విశ్వం యొక్క కదలికలు, నటరాజు యొక్క జగత్సంబంధమైన నృత్యాన్ని పోలి ఉంటుంది. ఆలయంలో ఐదు ఆవరణలు ఉన్నాయి.

అరగాలూరు ఉదయ ఇరరతెవన్ పొంపరప్పినన్ (అలియాస్ వనకోవరైయన్) క్రీ.శ.1213 లో చిదంబరం లోని శివుని ఆలయాన్ని పునర్నిర్మించాడు. అదే బాణ సామ్రాజ్య ప్రముఖుడు తిరువన్నమలై ఆలయాన్ని కూడా నిర్మించాడు.
ఈ ఆలయాన్ని సనాతనంగా నడిపిస్తున్న దిక్షితార్ అని పిలువబడే, అంతర్వివాహీకులైన శైవ బ్రాహ్మణులు, అధికారిక పురోహితులు కూడా.
దీక్షితార్లకి మరియు తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య జరిగిన దీర్ఘకాలిక యుద్ధానికి ఇది చరమాంకం. ప్రభుత్వం దీక్షితార్లు కానివారిని తేవరం స్తోత్రాలను దేవుని యొక్క 'గర్భగుడి'లో (సంస్కృతం: గర్భగ్రిహ) గానం చేయుటకు అనుమతించినప్పుడు, దీక్షితులు, వారికి మాత్రమే నటరాజుని గర్భగుడిలో పూజించే హక్కు కలదని తెలియజెప్పి అభ్యంతరం చెప్పుటతో మొదలైనది.
చిదంబరం యొక్క పురాణం మరియు దాని ప్రాముఖ్యత
పురాణం
చిదంబర కథ పరమశివుడు తిల్లైవన సంచారంతో మొదలౌతుంది, (వనం అనగా అర్ధం అడవి మరియు తిల్లై వృక్షాలు - వృక్షశాస్త్ర నామం ఎక్సోకేరియా అగాల్లోచ , ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు- ఇది ప్రస్తుతం చిదంబరం దగ్గరలోని పిఛావరం నీటిచలమల్లో పెరుగుతోంది. ఆలయ చెక్కడాలు తిల్లై వృక్షాలు క్రీశ 2వ శతాబ్దంలోనివిగా వర్ణిస్తాయి).

అజ్ఞానం యొక్క దమనం
తిల్లై వనాలలో కొంతమంది మునులు లేదా 'ఋషులు' నివసించేవారు, వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మారు మరియు భగవంతుడిని కొన్ని క్రతువులు మరియు 'మంత్రాల'తో నియంత్రించవచ్చని భావించారు. దేవుడు, 'పిచ్చతనాదర్' రూపంలో, ఒక సాధారణ యాచకుడివలే, ఎంతో అందమైన మరియు ప్రకాశవంతమైన అడవిలో సంచరిస్తాడు. అతనిని మోహిని అవతారంలోనున్న అతని సహవాసియైన విష్ణువు అనుసరిస్తాడు. ఋషులు మరియు వారి భార్యలు, ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు మరియు అందమైన ఆతని సహవాసిని చూసి ముగ్ధులౌతారు.

ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి, ఋషులు ఆగ్రహిస్తారు మరియు మంత్రాలతో కూడిన క్రతువులను ఆచరించి అసంఖ్యాకమైన 'సర్పాల'ను (సంస్కృతం: నాగ) ఆమంత్రిస్తారు. యాచకుడైన ఆ భగవంతుడు సర్పాలను ఎత్తి వాటిని మెడకు మరియు నడుముకి దట్టంగా చుట్టుకొని ఆభరణములవలె ధరిస్తాడు. మరింత ఆగ్రహించిన ఋషులు, ఒక భయానకమైన పులిని ఆమంత్రించగా, దాన్ని కూడా శివుడు చీల్చి, ఆ పులి చర్మాన్ని నడుము చుట్టూ శాలువా వలె ధరిస్తాడు.
పూర్తిగా విసుగు చెందిన ఋషులు, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకొని, ఒక శక్తివంతమైన రాక్షసుడు ముయాలకన్ - అను, అజ్ఞానానికి మరియు గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుడిని ఆమంత్రిస్తారు. పరమ శివుడు ఒక చిరునవ్వుతో, రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి, కదలకుండా చేసి ఆనంద తాండవం (ఆద్యంతరహితమైన చిద్విలాస నృత్యం) చేస్తాడు మరియు ఆతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. భగవంతుడు వాస్తవమని మరియు అతను మంత్రాలకు మరియు ఆగమ సంబంధమైన క్రతువులకు అతీతుడని గ్రహించి, ఋషులు లొంగిపోతారు.
ఆనంద తాండవ భంగిమ
పరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా, అనేకులు (ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి చెందిన దీన్ని కొనియాడి) గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది.

అతని పాదం క్రింద ఉన్నది అజ్ఞానం అను భావాన్ని నటరాజుని పాదం క్రింద ఉంచిన రాక్షసుడుతో సూచిస్తుంది.
చేతిలోని నిప్పు (నాశనం చేయు శక్తి) అనగా దుష్టశక్తులను నాశనం చేయునది.
ఎత్తిన చేయి అతను సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది.
వెనుక ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తుంది.
చేతిలోని ఢమరుకం జీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది.
ఇట్టి ప్రధాన సంగతులను నటరాజ మూర్తి మరియు దివ్యమైన నృత్య భంగిమ వర్ణిస్తాయి. ఇక్కడి నుంచి 32కిమీ దూరంలోని మేలకదంబూర్ ఆలయంలో తాండవ భంగిమ యొక్క అరుదైన రకం అగుపడుతుంది.ఈ కోవెలలో, నటరాజు దున్నపోతు మీద నర్తిస్తున్నట్టు మరియు గుండ్రంగా తిరుగుచూ చేయు నృత్యభాగం ఈ పుణ్య స్థానంలో ఉంచబడిన ఒక పాలా కళగా గుర్తించడమైనది.

ఆనంద తాండవం
ఆదిశేషువు అనే సర్పం, తల్పం వలె మారి విష్ణువుగా సాక్షాత్కరించిన భగవంతుని సేవిస్తుండగా, ఆనంద తాండవం గురించి విని దానిని చూసి తరించవలెనని ఉత్సాహపడతాడు. అంతట భగవంతుడు ఆదిశేషువుని దీవించి, అతనికి యోగ స్వరూపుడైన 'పతంజలి' రూపాన్ని ప్రసాదించి తిల్లై అడవులకి వెడలి పొమ్మని, అతను అచిరకాలంలోనే నృత్యంలో విన్యాసాలు చేయగలడని చెబుతాడు.

కృత యుగంలో పతంజలి హిమాలయాల్లో తపస్సు చేసి మరొక ముని వ్యాఘ్రపథార్ / పులికాల్ముని ని కలుస్తాడు (వ్యాఘ్ర / పులి అనగా అర్ధం "పులి" మరియు పథ / కాల్ అనగా అర్ధం "పాదం" – అతను దేవుని పూజకు తెచ్చు పూల మీద తుమ్మెదలు వ్రాలుటకు ముందే అనగా వేకువ జాములో చెట్లను ఎక్కి కోయుటకు వీలుగా అతనికి అట్టి పాదాలు మరియు పులి యొక్క కంటిచూపు మాదిరి చూపు వచ్చెనని తెలియజేయు కథ ద్వారా ఆ పేరు అతనికి వచ్చినది). పతంజలి యోగి మరియు అతని యొక్క ఉత్తమ శిష్యుడైన ఉపమన్యు యోగి యొక్క కథలు విష్ణు పురాణం అదే విధంగా శివ పురాణంలో కూడా వర్ణించబడ్డాయి. వారు తిల్లై వనంలోకి వెళ్లి ప్రార్ధించిన శివలింగ రూపంలోని పరమశివుడు, ప్రస్తుతం పూజిస్తున్న తిరుమూలాటనేస్వరర్ లోని దేవుడు ఒక్కడే (తిరు - శ్రీ, మూలటనం - స్వయంభువుడైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు). పరమ శివుడు, నటరాజుగా అతని యొక్క చిద్విలాస నృత్యాన్ని (ఆనంద తాండవం) ఈ ఇద్దరు మునులకు పూసం నక్షత్రం ఉన్న రోజున, తమిళ మాసం తాయ్ (జనవరి – ఫెబ్రవరి)లో ప్రదర్శించాడని పురాణాలు చెబుతాయి.
ప్రాముఖ్యత
చిదంబరాన్ని వివిధ రచనలలో, తిల్లై (గతంలో తిల్లైవనంలో ఇప్పుడున్న దేవాలయం నెలకొన్నది), పెరుంపత్రపులియుర్ లేదా వ్యాఘ్రపురం (వ్యాఘ్రపథార్ ముని జ్ఞాపకార్ధం) అని కూడా సూచించడమైనది.

ఆలయం, విశ్వం యొక్క హృదయ కమలంలో నెలకొల్పారని భావించడమైనది": విరాట్ హృదయ పద్మ స్థలం . దైవం యొక్క చిద్విలాస నృత్యం, ఆనంద తాండవం ప్రదర్శించిన స్థలం - "తిరుమూలాటనేస్వర్ ఆలయా"నికి సరిగ్గా దక్షిణంలో ఉన్నది, ప్రస్తుతం ఆ స్థలం పొన్నాంబలం / పోర్సాబై (పొన్ అనగా అర్ధం బంగారం, అంబళం /సబై అనగా అర్ధం వేదిక)లో పరమశివుడు నర్తిస్తున్న రూపం ఉన్నది. అందువలన భగవంతుడిని సభనాయకార్ అనగా వేదిక పై వెలసిన దైవం అని కూడా అంటారు.
చిదంబర ఆలయం యొక్క బంగారపు పై కప్పు కలిగిన గర్భ గుడిలో దైవం మూడు రూపాలలో సాక్షాత్కరిస్తాడు:
"స్వరూపం" - సకల తిరుమేని అని పిలిచేటి ఈశ్వరుని మనిషిగా ఆపాదించిన రూపమైన నటరాజస్వామి.
"అర్ధ-స్వరూపం" - చంద్రమౌళేశ్వరుని యొక్క స్పటిక లింగరూపంలోని, అర్ధ- ఈశ్వర మానుష్య శరీరమైన, సకల నిష్కళ తిరుమేని .
"నిరాకార స్వరూపం" - చిదంబర రహస్యం లోని అంతరాళం మాదిరి, గర్భగుడిలోని శూన్య స్థలం, నిష్కళ తిరుమేని .

పంచ భూతాల స్థలాలు
పంచభూతాల యొక్క స్థలాలలో ఒకటైన చిదంబరంలో, ఆకాశం లేదా ఆగయం గా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు ("పంచ" అనగా అర్ధం ఐదు, భూత అనగా అర్ధం మూలకం: భూమి, నీరు, నిప్పు, గాలి, మరియు అంతరాళం మరియు "స్థల" అనగా ప్రదేశం).

మిగతావి ఏవనగా:
కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం, ఇక్కడ భూమిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.
తిరుచిరాపల్లి, తిరువనైకావల్ లోని జంబుకేశ్వర ఆలయంలో, నీరు గా సాక్షాత్కరించిన స్వామిని ఆరాధిస్తారు.
తిరువన్నామలైలోని అన్నమలైయర్ ఆలయంలో, అగ్ని గా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.
శ్రీకాళహస్తిలోని కాళహస్తి ఆలయంలో, గాలి/వాయువు గా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.
చిదంబరం అనేది కూడా పరమ శివుడు నర్తించిన ఐదు ప్రదేశాలలో ఒకటి మరియు అన్ని ప్రదేశాలలో వేదికలు/ సభై లు ఉన్నాయి. పోర్ సభై కలిగి ఉన్న చిదంబరం కాక, మిగతావి ఏవనగా, తిరువాలన్గాడులోని రతిన సభై (రతినం అనగా – రత్నం/ఎరుపు), కోర్తళ్ళంలోని చిత్ర సభై (చిత్ర – ఛాయా చిత్రం), మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని రజత సభై లేదా వెల్లి అంబళం (రజత / వెల్లి – వెండి) మరియు తిరునెల్వేలి నెల్లైఅప్పార్ ఆలయంలోని తామిర సభై (తామిరం – రాగి).

5. వాయు లింగము :శ్రీకాళహస్తీశ్వరుడు - జ్ఙానప్రసూనాంబికా దేవి, శ్రీ కాళహస్తి , చిత్తూరు జిల్లా ,ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతికి సుమారు 65కి.మీ దూరంలో శ్రీ కాళహస్తి యందు వాయులింగము ఉంది. ఈ స్వామిని సాలెపురుగు, కాళము, హస్తిలు అకుంఠిత భక్తితో పోటాపోటీగా ఆర్చించి చివరకి మోక్షము పొందాయి .
క్షేత్ర పురాణము
సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు.బొద్దు పాఠ్యంయ
ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.
కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.
ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకములయిన చిత్రములు వున్నాయి. " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము కలదు. దేవాలయమునకు సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు , సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.
ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం వ్రాశాడు. అందులొ శ్రీ కాళహస్తి స్థలపురాణం స్పృశిస్తూ
ఏవేదంబు పఠించెలూత భుజంగంబే శాస్త్రముల్ చదివె తా
నేవిద్యాభ్యాసమొనర్చె కరి చెంచే మంత్రమూహించె బో
ధావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీపాద సం
సేవా శక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!

చరిత్ర
దక్షిణ గోపురం
క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రమును గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్థావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు.

ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్థంభాలు కలిగిన మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం మే 26, 2010 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది.[2] ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణలతో కూడిన ఒక కమిటీని నియమించింది.[3]
క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు. [4]
దేవాలయ చరిత్ర, ప్రత్యేకతలు
ఈ దేవాలయము యొక్క పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది.

శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ది చెందినది.
ఇది స్వర్ణముఖి నది తీరములో ఉన్న క్షేత్రము. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖముగా ప్రవహించడం జరుగుతున్నది.
ఈ దేవాలయములోని లింగము పంచభూత లింగములలో ఒకటైన వాయులింగము
ఆలయ విశేషాలు

స్వామివారి రథం. మహాశివరాత్రి మరుసటి రోజు, రథోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది.
.శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణం
ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాల ను 1997లో స్థాపించారు.

నాలుగు దిక్కుల దేవుళ్ళు
గుడి గర్భాలయంలోని శ్రీకాళహస్తీశ్వర, జ్ఞాన ప్రసూనాంబ విగ్రహాలు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.

గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, మరియు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

ఇతర శివలింగాలు, పరివార దేవతలు
ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్టింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగము; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్టించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.

ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.
మంటపములు
ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.

రాహు కేతు క్షేత్రము
ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

దక్షిణామూర్తి
దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

సేవలు
శ్రీకాళహస్తి రాజగోపురం
ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము

తీర్ధాలు
ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

ఇతర విశేషాలు
ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007 నాటికి) దేవస్థానానికి ఆదాయం షుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.

పండుగలు
పట్టణం ప్రవేశం రోడ్
పండుగల విషయానికొస్తే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన మూడు రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటి కన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు,సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ కౌశలంతో రంజింప జేస్తారు.

ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ కళాకారుల్లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ, ప్రముఖ నటి మరియు భరత నాట్య కళాకారిణి శోభన, నేపథ్య గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, మొదలైనవారు ముఖ్యులు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని మరియు అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ.
ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు కూడా ఐదు రోజులపాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపదీ అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాటపర్వం చదివిన రోజున పట్టణంలో ఖచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవరోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.
ఇంకా ప్రతీ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణం లోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్టిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్టిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం.
పాతాళ గణపతి ఆలయము
ఈ ఆలయమునకు ప్రవేశద్వారము వైపున పాతాళ గణపతి ఆలయము కలదు. ఇందులోనికి ప్రవేశము ఒకసారికి ఒకరికి మాత్రమే కలదు. మెట్లద్వారాలోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి కలదు. దాదపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం కలదు. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ది.

సంకలనం: రేమిడిచర్ల డేరామ్ 

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS